
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. హోళీ పండుగ రోజు ఆనవాయితీగా మధ్యలో తాడు కట్టి ఇరువైపులా నిలబడి కొట్టుకునే సంప్రదాయంతో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అనుమతి నిరాకరించారు. గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోళీ రోజూ కొట్టుకుంటే గ్రామానికి కీడు జరగదని ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కొట్టుకుంటే కక్షలు పెరిగి.. గొడవలు జరుగుతాయంటున్న పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తుంటారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే హోలీ.. ఆ గ్రామంలో పిడిగుద్దులకు వేదిక అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment