border
-
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. హోళీ పండుగ రోజు ఆనవాయితీగా మధ్యలో తాడు కట్టి ఇరువైపులా నిలబడి కొట్టుకునే సంప్రదాయంతో కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈసారి అనుమతి నిరాకరించారు. గ్రామస్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఐదుగురు కంటే ఎక్కువగా గుమిగూడవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హోళీ రోజూ కొట్టుకుంటే గ్రామానికి కీడు జరగదని ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇవ్వాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కొట్టుకుంటే కక్షలు పెరిగి.. గొడవలు జరుగుతాయంటున్న పోలీసులు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర తీరంలో ఉన్న హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది.దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాటను నిర్వహిస్తుంటారు. వసంత రుతువు రాకకు గుర్తుగా సంబురంగా నిర్వహించే హోలీ.. ఆ గ్రామంలో పిడిగుద్దులకు వేదిక అవుతుంది. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. -
ఆ నలుగురి జాడెక్కడ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని ఛమోలా జిల్లా మనా గ్రామంలో హిమపాతం కారణంగా మంచు చరియల్లో కూరుకుపోయిన వారిలో మొత్తంగా ఇప్పటిదాకా 50 మంది కార్మికులను బయటకు తీసుకురాగలిగారు. అయితే వీరిలో నలుగురి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినా ఫలితంలేకుండా పోయింది. ఆ నలుగురు శనివారం చనిపోయారని జిల్లా విపత్తు నిర్వహణాధికారి ఎన్కే జోషి చెప్పారు. మంచుచరియల్లో కూరుకుపోయిన మిగతా నలుగురి కోసం అన్వేషణ తీవ్రతరం చేశారు. తొలుత ఐదుగురు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.ఐదుగురిలో సునీల్ అనే కార్మికుడు ప్రాణాలతో బయటపడి సొంతూరుకు వెళ్లినట్లు తాజాగా తేలింది. దీంతో నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే రహదారిలో మంచుచరియలు పడటంతో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) కార్మికులు ఆ మంచును తొలగిస్తుండగా శుక్రవారం ఉదయం ఇతర 55 మంది సిబ్బంది విశ్రాంతి తీసుకుంటున్న కంటైనర్లు, షెడ్‌పై మంచుచరియలు పడటంతో దుర్ఘటన జరిగిన విషయం తెల్సిందే. వీరిలో 33 మందిని శుక్రవారం రాత్రి, 17 మందిని శనివారం మంచు నుంచి బయటకు లాగారు. మంచులో 57 మంది కూరుకుపోయారని శుక్రవారం వార్త లొచ్చాయి. శనివారం మాత్రం 55 మంది మాత్రమే చిక్కుకున్నారని అధికారులు చెప్పారు.6 హెలికాప్టర్ల వినియోగంశుక్రవారం రాత్రంతా భారీగా మంచు కురియడంతో అన్వేషణకు విరామమిచ్చి శనివారం ఉదయాన్నే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్, బీఆర్ఓ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వాయుసేన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను మొదలెట్టాయి. వీరికి జిల్లా యంత్రాంగం, వైద్య విభాగం తగు సాయం అందిస్తున్నాయి. ‘‘భారతీయ సైన్యానికి చెందిన మూడు, వాయు సేనకు చెందిన రెండు, మరో పౌర హెలికాప్టర్‌ను మొత్తంగా ఆరు హెలికాప్టర్లను గాలింపు కోసం వినియోగిస్తున్నాం. బయటకులాగిన వారిలో 24 మందికి గాయాలయ్యాయి. వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించాం’’ అని ఆర్మీ అధికారి చెప్పారు. -
అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ ఆపరేషన్.. 30మంది ఉగ్రవాదులు హతం
పెషావర్: పాకిస్తాన్ సైన్యం పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ సైనిక చర్య జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం మేరకు భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టి, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. దీనికి సంబంధించిన వివరాలను పాక్ సైన్యం మీడియాకు తెలిపింది.ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన నేపధ్యంలో దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన నేపధ్యంలో పాకిస్తాన్ సాయుధ దళాలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రశంసించారు.దీనికి ముందు పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వారు జరిపిన కాల్పుల్లో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2024 డిసెంబర్ కంటే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: రిస్క్‌లో కుంభమేళా మోనాలిసా? -
కరిగిపోయిన అమెరికా కల
చండీగఢ్/హోషియార్పూర్(పంజాబ్): ప్రమాదకరరీతిలో సముద్రంలో పడవ ప్రయాణం, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడక, మెక్సికో సరిహద్దులోని చీకటి గదుల్లో బస.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు ఎలాగైనా చేరుకునేందుకు భారతీయ అక్రమ వలసదారుల పడిన కష్టాలెన్నో. రహస్యంగా సరిహద్దు దాటించే ఏజెంట్లకు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి అమెరికాకు ఎలాగోలా చేరుకుంటే తిరిగి పోలీసులకు దొరికిపోయి సంకెళ్లతో స్వదేశానికి వచ్చిన కొందరు అక్రమ వలసదారులు తమ కన్నీటి కష్టాలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. తమ అమెరికా కల ఎలా చెదిరిపోయిందో వివరించారు. తీవ్రమైన నేరస్తుల్లా చేతులకు, కాళ్లకు బేడీలు వేసి సైనిక విమానంలో అమెరికా భారత్‌కు పంపింది. ఒకే ఒక టాయిలెట్ ఉన్న సైనిక విమానంలో వందమందికి పైగా అక్రమ వలసదారులను కుక్కి ఏకంగా 24 గంటల పాటు ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తయితే అసలు తాము వచ్చేది స్వదేశానికి అన్న విషయం అమృత్సర్ విమానాశ్రయంలో అడుగుపెట్టేదాకా వారికి తెలియకపోవడం మరో విషాదం. అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న సైనిక విమానంలో 105 మంది వలసదారులన్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. వీరిలో ఒకొక్కరిదీ ఒక్కో గాథ. అందరిదే ఒకటే వ్యథ. చీకటి గదిలో ఉంచారు ‘‘నన్ను డంకీ మార్గం గుండా తీసుకెళ్లారు. మేం వెళ్తుండగా మార్గమధ్యంలో రూ.35 వేల విలువైన దుస్తులు చోరీ అయ్యాయి. మమ్మల్ని మొదట ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారు. 15 గంటల పాటు పడవ ప్రయాణం. తర్వాత దాదాపు 45 కిలో మీటర్లు నడిచాం. దాదాపు 18 కొండలు దాటాం. అంతెత్తు నుంచి జారిపడ్డామంటే బతికే అవకాశమే లేదు. మార్గమధ్యంలో కొన్ని మృతదేహాలను కూడా చూశాం. అమెరికాలోకి ప్రవేశించడానికి సరిహద్దు దాటకముందే మెక్సికోలో నన్ను అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు చీకటి గదిలో ఉంచారు. వేలాది మంది పంజాబీలు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పిల్లలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. మేం వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంకెవరూ ఇలా తప్పుడు మార్గాల్లో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించకండి’’ అని పంజాబ్‌లోని జలంధర్ జిల్లా దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ సలహా ఇచ్చారు. కపుర్తలాలోని తర్ఫ్ బెహ్బల్ బహదూర్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్‌ను అతని కుటుంబం ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అమెరికాకు పంపింది. ఫతేగఢ్ సాహిబ్‌లో జస్వీందర్ సింగ్‌ను విదేశాలకు పంపేందుకు అతని కుటుంబం రూ.50 లక్షలు అప్పు చేసింది. పంజాబ్‌లో ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే జలంధర్, హోషియార్పూర్, కపుర్తలా, నవాన్షహర్ జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కథలే ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఇక్కడి నుంచి ఏటా పెద్ద సంఖ్యలో స్థానికులు డాలర్లవేటలో పడి విదేశాలకు అక్రమ మార్గాల్లో వలసలు వెళ్తున్నారు. ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తూ అమెరికా వెళ్తున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంకెళ్లతో ప్రయాణం ‘‘చట్టబద్ధంగానే అమెరికా పంపిస్తానని చెప్పి ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. అందుకు రూ.30 లక్షలు తీసుకున్నాడు. గతేడాది జూలైలో విమానంలో బ్రెజిల్‌కు వెళ్లాను. అక్కడి నుంచి అమెరికాకు కూడా విమానంలోనే పంపిస్తామని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆరు నెలలపాటు బ్రెజిల్లో ఉన్న తరువాత.. అక్రమంగా సరిహద్దు దాటించి పంపేందుకు ప్రయత్నించారు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ 11 రోజుల పాటు కస్టడీలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. భారత్‌కు పంపించేస్తున్నట్లు నాకు తెలియదు. ఏదో క్యాంప్‌కు తీసుకెళ్తున్నా రని అనుకున్నాం. అమృత్సర్ విమానాశ్రయం వచ్చాక సంకెళ్లను తీసేశారు. బహిష్కరణతో కుంగిపోయా. అమెరికా వెళ్లడానికి అప్పు చేశా ను. కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వా లని కలలు కన్నా. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి’’ అని గురుదాస్ పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన జస్పాల్ వాపోయారు.సముద్రంలో, అడవిలో ప్రాణాలు పోయాయి ‘‘గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లా. తొలుత యూరప్‌కు, ఆ తర్వాత మెక్సికోకు తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్ హామీ ఇచ్చాడు. రూ.42 లక్షలు చెల్లించాను. కానీ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆ తర్వాత మెక్సికో దేశాల గుండా తీసుకెళ్లారు. పర్వత మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లాం. మెక్సికో సరిహద్దు వైపు లోతైన సముద్రంలోకి ఒక చిన్న పడవలో పంపారు. నాలుగు గంటల సముద్ర ప్రయాణం. మా పడవ బోల్తా పడింది. మాతో వచ్చిన వలసదారుల్లో ఒకరు నీటిలో పడి జలసమాధి అయ్యారు. మరొకరు పనామా అడవి గుండా వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డా. దారిలో కొన్నిసార్లే అన్నం దొరికేది. మంచి భవిష్యత్తుపై ఆశతో అధిక వడ్డీకి అప్పు చేసి ఏజెంట్‌కు చెల్లించాం. కానీ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశారు. అమెరికా బహిష్కరించడంతో చివరకు భారీ అప్పుతో సొంతూరకు వచ్చిపడ్డాం’’ అని హోషియార్ పూర్ జిల్లాలోని తహ్లీ గ్రామవాసి హర్విందర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
‘చొరబాట్ల’కు మూడు రూట్లు.. వివిధ రేట్లు.. ఏజెంట్ల మాయాజాలం ఇదే
బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, మైనారిటీలపై హింసాయుత ఘటనలు చోటుచేసుకున్న దరిమిలా పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏజెంట్ల సాయం తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి అక్రమ చొరబాటుదారులపై భారత్ కఠిన చర్యలు చేపడుతోంది.బంగ్లాదేశీయుల చొరబాట్లపై పోలీసులు దృష్టిమహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల(Bangladeshi)పై పోలీసులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ఘట్కోపర్ పోలీసులు అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. తాజాగా ముంబై క్రైమ్ బ్రాంచ్ మరో ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసింది. వారిని విచారిస్తున్న సమయంలో ముంబై పోలీసులు ఒక రేట్ కార్డును కనుగొన్నారు. బంగ్లాదేశీయులు చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ఎంత మొత్తం వెచ్చించారనే వివరాలు ఈ కార్డులో ఉన్నాయి. బంగ్లాదేశీయులను భారత్‌లోకి మూడు రూట్లలో అక్రమంగా తరలిస్తున్నారని, ఒక్కో రూటుకు ఒక్కో రేటు ఉందని పోలీసులు గుర్తించారు.15 ఏళ్లుగా అక్రమ నివాసంముంబైలో మైనారిటీలు అధికంగా ఉన్న గోవండి, శివాజీ నగర్, మన్ఖుర్డ్ డియోనార్, చునాభట్టి, ఘట్కోపర్లలో ఉంటున్న 36 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారుల(Bangladeshi infiltrators)ను పోలీసులు అరెస్ట్ చేశారని డీసీపీ నవనాథ్ ధావలే తెలిపారు. ఈ చొరబాటుదారులలో చాలా మంది 15 ఏళ్లుగా ముంబైలో నివసిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఇతర పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నకిలీ పత్రాలలో ఆధార్కార్డుఅయితే ఆ డాక్యుమెంట్లన్నీ నకిలీవేనని పోలీసులు గుర్తించారు. ఏజెంట్లు ఐదువేల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేసి, వారికి నకిలీ పత్రాలు రూపొందించి, వాటి ఆధారంగా ఆధార్ కార్డు తయారు చేయిస్తున్నారని తేలింది. కాగా వీరంతా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారా లేక వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబైలోని చర్ని రోడ్ స్టేషన్ సమీపంలో ఒక బంగ్లాదేశీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను 1994 నుండి ముంబైలో అక్రమంగా నివసిస్తున్నాడు. ఇతనిని అరెస్టు చేసి విచారిస్తున్న సందర్భంలో అతను భారతదేశంలో చొరబడేందుకు ఎంత డబ్బు ఖర్చు చేశాడో తెలియజేసే రేటు కార్డు బయటపడింది.మూడు రూట్లు.. వివిధ రేట్లుమాల్దా, 24 పరగణాలు, ముర్షిదాబాద్, దినేష్పూర్, చప్లీ నవాబాద్గంజ్ తదితర ప్రాంతాల నుంచి పలువులు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడుతున్నారని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు(Mumbai Crime Branch sources) తెలిపాయి. కొండ ప్రాంతాల మీదుగా బంగ్లాదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి వారు ఏజెంట్లకు 7 వేల నుంచి 8 వేలు చెల్లించవలసి ఉంటుంది. ఈ మార్గాల్లో ప్రమాదం తక్కువగా ఉంటుందనే ఉద్దేశం ఏజెంట్లలో ఉంది. బంగ్లాదేశీయులు నీటి మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించాలంటే, ఇందుకోసం రెండు నుంచి నాలుగు వేల రూపాయలు చెల్లించాలి. ఇది అత్యంత కష్టమైన మార్గం కావడంతో దీనికి ఏజెంట్లు రేటు తక్కువ విధించారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఎటువంటి రిస్క్ లేకుండా భారత్‌లోకి చొరబడాలంటే ఏజెంట్లకు 12 వేల నుంచి 15 వేలు ఏజెంట్లకు చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు రేట్ కార్డు ఆధారంగా తెలుసుకున్నారు.బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడ తగిన ధృవపత్రాలు పొందేందుకు ఏజెంట్లకు తగిన మొత్తం చెల్లించాలి. ఆధార్ కార్డు కోసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును పొందిన తర్వాత చొరబాటుదారులు భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లి ఉండవచ్చు. ఇలాంటి వారికి ఉద్యోగం కల్పించేందుకు కూడా ఏజెంట్ల ముఠా సహకరిస్తుందని పోలీసులు తమ విచారణలో కనుగొన్నారు. ఇది కూడా చదవండి: కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం -
మకోడి–సిర్పూర్ రైల్వే ట్రాక్‌పై పెద్దపులి
కాజీపేట రూరల్/ సిర్పూర్ (టి)/ములుగు/వెంకటాపురం(కె): రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా పెద్దపులి కనిపించడంతో రైల్వే గ్యాంగ్మన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గజగజ వణికిపోయారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు రైల్వే స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధి తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో సిర్పూర్ కాగజ్‌నగర్–మకోడి రైల్వే స్టేషన్ల మధ్య అన్నూర్ గ్రామంలో మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై నుంచి వెళ్తున్న పులిని గ్యాంగ్మన్లు చూశారు. ట్రాక్ దాటుతున్న వీడియో తీశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా సెక్షన్లలో గల దట్టమైన అటవీ ప్రాంతాల సమీపంలో గల రైల్వే స్టేషన్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పులి తెలంగాణ సరిహద్దులో నుంచి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి కావలి కారిడార్ దట్టమైన ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. కాగా, సిర్పూర్ (టి) మండలం హుడికిలి గ్రామానికి చెందిన దంద్రే రావూజీ ఇంటి వద్ద కట్టేసి ఉన్న గేదె దూడపై మంగళవారం వేకువజామున పెద్దపులి దాడి చేసి చంపింది. గ్రామంలోకి పెద్దపులి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించి పాదముద్రలు గుర్తించారు. బోధాపురం అటవీ ప్రాంతంలో బెంగాల్ పులి ఆనవాళ్లు ఏడాదికాలంగా ప్రశాంతంగా ఉన్న ములుగు ఏజెన్సీ జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలవరం మొదలైంది. రాయల్ బెంగాల్ టైగర్‌గా భావిస్తున్న ఈ పెద్దపులి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ అటవీ ప్రాంతాలను దాటి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బోధాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారి చంద్రమౌళి నిర్ధారించారు. ఈ పులి బోధాపురం గ్రామ సమీపంలోని గోదావరి నదిని దాటి మంగపేట మండలం మల్లూరు వైల్డ్ లైన్ జోన్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బోధాపురంతో పాటు ఆలుబాక గ్రామాల శివారుల్లోని గోదావరి లంకల్లో సాగు చేసిన పుచ్చతోట వద్ద సోమవారం రాత్రి సంచరించిందని, పెద్దగా గాండ్రించినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. తోటల వద్ద కాపలాకు వెళ్లిన రైతులు మంగళవారం ఉదయం పరిశీలించగా పులి పాదముద్రలు కనిపించాయి. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారించారు. పులులకు ఇది మేటింగ్ సమయం కావడం వల్ల గత ఏడాది ఇదే సమయంలో ఆడపులి ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానుంచి ఏటూరునాగారం వైల్డ్ లైన్లో (ఎస్1) సంచరించింది. -
రైతుల ఆందోళన.. ఉద్రిక్తత.. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం సరిహద్దుల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించింది. రైతుల పాదయాత్రతో చిల్లా సరిహద్దులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. #WATCH | Noida, Uttar Pradesh: Traffic congestion seen at Chilla Border as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/A5G9JuT1KM— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 2, 2024భారతీయ కిసాన్ పరిషత్ (బికేపీ)నేత సుఖ్బీర్ ఖలీఫా మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం న్యాయమైన పరిహారం, మెరుగైన ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర చేపట్టారన్నారు. తూర్పు ఢిల్లీ పోలీసుల అధికారి అపూర్వ గుప్తా మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళనపై తమకు ముందస్గు సమాచారం అందిందని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదన్నారు. శాంతిభద్రతల పరిస్థితికి విఘాతం తలెత్తకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూస్తున్నామన్నారు.#WATCH | Uttar Pradesh: Security heightened in Noida as farmers from Uttar Pradesh are on a march towards Delhi starting today. pic.twitter.com/X67KeeUDba— ANI (@ANI) December 2, 2024డిసెంబరు 6వ తేదీ నుంచి తమ సభ్యులు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తారని, కేరళ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాల రైతు సంఘాలు కూడా అదే రోజు ఆయా అసెంబ్లీల వైపు పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ మార్చ్ తెలిపారు.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ
వాషింగ్టన్:కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2023-24లో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో 23 శాతం మంది భారతీయులే కావడం గమనార్హం.అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా,కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూఎస్సీబీపీ) లెక్కల ప్రకారం 2022లో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు 1లక్షా9వేల535 మంది యత్నించగా ఇందులో 16 శాతం మంది భారతీయులే.2023-24లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా 47వేలకు చేరింది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. -
అనుక్షణం భయం..భయం!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి) ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. అలాంటిది ఇరుదేశాల సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్ని దేశాల మధ్య సరిహద్దుల్లా కాకుండా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. సియోల్ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు సరిహద్దు డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్)ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. సందర్శన సమయంలోనే అక్కడ బాంబుల మోత మోగింది. ప్రతిక్షణం ఇరు దేశాల సైనికులు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారని, అది సర్వసాధారణమని అక్కడి సైనికాధికారులు పేర్కొంటున్నారు. రెండు దేశాలను వేరు పరిచేదే డీఎంజెడ్..ఇరు దేశాలను సమానంగా ఈ డీఎంజెడ్ వేరుపరుస్తుంది. 4 కిలోమీటర్ల వెడల్పు, 258 కిలోమీటర్ల పొడవుతో ఈ సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది. ఇరువైపులా భారీస్థాయిలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. ఈ డీఎంజెడ్కు రెండువైపులా ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ స్థాయిలో సైనికులను మోహరించారు. డీఎంజెడ్‌లో మాత్రం సైనికులెవరూ ఉండరు. ఎలాంటి సైనిక కార్యకలాపాలు మాత్రం జరగవు. 1953లో ఇక్కడ సైనిక తటస్థ ప్రాంతం (డీఎంజెడ్) ఏర్పాటు చేశారు.ప్రచ్ఛన్నయుద్ధం జరిగిన సమయంలోనే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దుగా ఉండేది. అయితే 1953లో ఇరుదేశాల మధ్య అమెరికా, చైనా కలిసి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నించాయి. రెండుదేశాలు ఇప్పటికీ అంగీకరించలేదు. కానీ డీఎంజెడ్ ప్రాంతంలో మాత్రం ఎలాంటి సైనిక చర్య ఉండదు. ఇదే ప్రదేశంలో 1635 మీటర్ల పొడవు, 1.95 మీటర్ల ఎత్తు, 2.1 మీటర్ల వెడల్పుతో ఓ టన్నెల్ కూడా ఉంది. ఈ సొరంగాన్ని ఉత్తర కొరియా సైనికులు సియోల్పై దాడి చేసేందుకు తవ్వారని చెబుతారు. ఇది పూర్తి కాకముందే ఐక్యరాజ్య సమితి పోలీసు అధికారులు గుర్తించి ఉత్తర కొరియాను హెచ్చరించారట. అయితే తొలుత అసలు ఈ సొరంగాన్ని తవ్వలేదని ఉత్తర కొరియా బుకాయించినా.. చివరకు అది గనుల తవ్వకాల్లో భాగంగా తవ్వామని మాట మార్చిందని అక్కడి పర్యాటకుల సందేశంలో రాసి ఉంది. డీఎంజెడ్తో పాటు ఈ సొరంగాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. హిల్ పాయింట్ వ్యూ నుంచి ఉత్తర కొరియాతోపాటు దక్షిణకొరియా గ్రామాలను వీక్షించొచ్చు. కాకపోతే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న ఫొటో కూడా తీసుకోవడానికి అనుమతివ్వరు. -
భారత్,చైనా సరిహద్దు వివాదంలో కీలక ముందడుగు
న్యూఢిల్లీ:భారత్-చైనా మధ్య కొన్నేళ్లుగా సాగుతున్న వివాద పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. వాస్తవాధీనరేఖ(ఎల్‌ఓఏసీ) వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలూ ఓ ఒప్పందానికి వచ్చాయని,ఎల్‌ఓఏసీ వద్ద గస్తీని మళ్లీ ప్రారంభించడానికి అంగీకరించాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.అక్టోబర్ 22,23 రెండు రోజుల పాటు రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వెళ్లనున్న తరుణంలో భారత్, చైనా దౌత్యవ్యవహరాల్లో కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. సరిహద్దులో ఎల్‌ఓఏసీ వెంబడి పెట్రోలింగ్ పునఃప్రాంభంపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.అనేక వారాలుగా జరుపుతున్న చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరిందని చెప్పారు. బలగాల ఉపసంహరణ 2020లో ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పాక్‌లో హిందూ గుడికి మోక్షం..64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం -
ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలు: హిమాచల్ మంత్రి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న ఇండియా-చైనా సరిహద్దుల్లో డ్రోన్ కదలికలను గుర్తించినట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి జగత్ సింగ్ నేగి తెలిపారు. సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా.. డ్రోన్లను నిఘా, గూఢచర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బోర్డర్లో డ్రోన్ల కదలికల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కిన్నౌర్ జిల్లాలోని షిప్కి లా , రిషి డోగ్రీ గ్రామాల్లో డ్రోన్ కార్యకలాపాలను గుర్తించాం. సరిహద్దు ప్రాంతానికి సమీపంలో తరచుగా డ్రోన్లు ఎగురుతున్నట్లు గత వారంలో కూడా గుర్తించాం. షిప్కిలా, రిషిడోగ్రి గ్రామాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వరకు రహదారి నిర్మాణం పురోగతిలో ఉంది. ..పొరుగుదేశం చైనా ఈ డ్రోన్ల ద్వారా నిఘా, గూఢచర్యానికి పాల్పడే అవకాశాన్ని తోసిపుచ్చలేం. డ్రోన్లను పోలీసులు, ఆర్మీ సిబ్బంది సైతం చూశారు. చైనా డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడటం చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని అన్నారు.ఇక.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్, లాహౌల్, స్పితి గిరిజన జిల్లాలు చైనాతో 240 కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. -
తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు
కోల్‌కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు దాదాపు 24 గంటల తరువాత తెరుచుకుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం కోసం ట్రక్కుల తరలింపును ఉద్దేశిస్తూ సరిహద్దును తిరిగి తెరిచారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు జార్ఖండ్‌లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ దరిమిలా పశ్చిమ బెంగాల్- జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేయాలంటూ మమత అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం సాయంత్రం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దును మూసివేశారు.జార్ఖండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దు తెరుచుకుందని, ఎన్‌హెచ్ -2, ఎన్‌హెచ్-5 వేలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరాయని తెలిపారు. అయితే అయితే సరిహద్దు వద్ద 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవైన క్యూలో ట్రక్కులు ఉన్నాయని, ఇవి ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుందన్నారు.జార్ఖండ్‌ను సురక్షితంగా ఉంచేందుకు డీవీసీ తన డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడం వల్లే తమ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. కాగా న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుపీ) సూచనల మేరకు నీటిని విడుదల చేశామని, అయితే ఇప్పుడు దానిని నిలిపివేసినట్లు డీవీసీ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు -
బంగ్లాదేశ్ నుంచి తల్లీకూతుర్ల చొరబాటు.. బీఎస్ఎఫ్ కాల్పులు.. బాలిక మృతి
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తరువాత అక్కడి హిందువులతో సహా ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి మైనారిటీలు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌కు చెందిన 13 ఏళ్ల హిందూ బాలికతో పాటు ఆమె తల్లి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ బాలిక మృతిచెందింది.ఢాకా ట్రిబ్యూన్ తెలిపిన వివరాల ప్రకారం సంఘటన జరిగిన 45 గంటల తర్వాత బీఎస్ఎఫ్ ఆ బాలిక మృతదేహాన్ని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కి అప్పగించింది. ఆమెను 13 ఏళ్ల స్వర్ణ దాస్‌గా గుర్తించారు. కాగా చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని బాలిక కుటుంబానికి అప్పగించామని కులౌరా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ బినయ్ భూషణ్ రాయ్ తెలిపారు.త్రిపురలో ఉంటున్న తమ సోదరుడిని కలిసేందుకు స్వర్ణ, ఆమె తల్లి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరికి స్థానిక బ్రోకర్లు సహకారం అందించారు. వారు భారత సరిహద్దుకు చేరుకున్నప్పుడు వారిని వారిస్తూ బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్వర్ణ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె తల్లి ప్రమదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ విషాద ఘటనపై సరిహద్దు ప్రాంతంలోని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
భారత్‌లోకి చొరబాటు.. త్రిపురలో ఐదుగురి బంగ్లాదేశీయులు అరెస్ట్
అగర్తల: బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురిని త్రిపురా పోలీసులు అరెస్ట్ చేశారు.సరిహద్దు గుండా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీయులను ఆదివారం త్రిపురా పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సయుక్తంగా చేపట్టిన అపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ అగర్తల ఆఫీసర్ ఇన్ఛార్జ్, ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ పేర్కొన్నారు.‘అగర్తల శివార్లలోని సరిహద్దు లంకామురా పట్టణంలోకి కొంతమంది బంగ్లాదేశ్ జాతీయులు అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆపరేషన్ ప్రారంభించాం. వేగంగా రంగంలోకి దిగిన పోలీసులు, బీఎస్ఎఫ్ బలగాలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులమని అంగీకరించారు’ అని పరితోష్ దాస్ అన్నారు. అరెస్ట్ అయిన ఐదుగురు బంగ్లాదేశ్‌లోని రాజ్షాహి డివిజన్లోని చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసినవారిని విచారణ కోసం అగర్తలాలో కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లా పౌరులు భారత్‌లోకి చొరబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సరిహద్దులో బలగాలు భద్రత పెంచాయి. -
భారత సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి అరెస్ట్
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని భారతదేశ సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. సిల్హెట్ వద్ద దేశం విడిచి పారిపోవడానికి మాజీ జడ్జి షంషుద్దీన్ చౌధురి మాణిక్ ప్రయచారని అక్కడి మీడియా తెలిపింది. సిల్హెట్‌లోని కనైఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.కాగా అవామీ లీగ్ నాయకుడు ఫిరోజ్‌ను అతని నివాసంలో అరెస్టు చేశారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారు సైనిక స్థావరాల్లో ఆశ్రయం పొందుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. న్యాయశాఖ మాజీ మంత్రి అనిసుల్ హుక్, మాజీ ప్రధాని సలహాదారు సల్మాన్ ఎఫ్ రహ్మా ఢాకా నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో సైనికులు వారిని అరెస్టు చేశారు. జర్నలిస్టు దంపతులు ఫర్జానా రూపా, ఆమె భర్త షకీల్ అహ్మద్‌లను కూడా అరెస్టు చేశారు.ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను చట్టబద్దంగా తమ దేశానికి అప్పగించాలంటూ గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేస్తోంది. హసీనాపై హత్య అభియోగాలు సహా పలు కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో విచారణ జరిపేందుకు ఆమెను తమకు అప్పగించాలని తాజాగా బీఎన్పీ సెక్రెటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగీర్ డిమాండ్ చేశారు. -
Nepal: చారిత్రక ఆధారాలతో సరిహద్దు సమస్యకు పరిష్కారం: పీఎం ఓలి
నేపాల్ నూతన ప్రధానిగా ఎన్నికైన కేపీ శర్మ ఓలి భారత్‌తో సరిహద్దు సమస్య పరిష్కారానికి కట్టుబడివుంటామని ప్రకటించారు. తాజాగా జరిగిన నేపాల్ ప్రతినిధుల సభలో ఎంపీ దీపక్ బహదూర్ సింగ్ అడిగిన ప్రశ్నకు నేపాల్ పీఎం ఓలి సమాధానమిస్తూ చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.‘చుచ్చే నక్సా’ (మ్యాప్)లో చేర్చిన దార్చులాలోని లిపులెక్, కాలాపానీ, లింపియాధుర భూమిని నేపాల్ ఎప్పుడు ఉపయోగించుకుంటుందని ఎంపీ సింగ్ ప్రశ్నించారు. దీనికి ఓలి స్పందిస్తూ ‘సుగౌలీ ఒప్పందం, వివిధ పటాలు, చారిత్రక వాస్తవాలు, ఆధారాల ఆధారంగా, నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, దౌత్యం ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. 1816 నాటి 'సుగౌలీ ఒప్పందం' ప్రకారం లిపులెక్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలతో పాటు కాళీ నదికి తూర్పున ఉన్న భూమి అంతా నేపాల్‌కు చెందుతుంది.ప్రధాని కేపీ శర్మ ఓలి 275 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 188 ఓట్లను సాధించి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీనికి ముందు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-ఎంయూఎల్) నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండకు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్ట్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంది. దీని తర్వాత పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో పుష్పకమల్ దహల్ ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. -
శంభు సరిహద్దును తెరవండి.. హర్యానాకు హైకోర్టు ఆదేశాలు
చండీగఢ్: శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు బుధవారం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్-హర్యానాలను కలిపే ఈ శంభు సరిహద్దు వద్ద ఫిబ్రవరి 13న రైతులు భారీగా నిరసనలను ప్రారంభించడంతో హర్యానా ప్రభుత్వం దీనిని మూసివేసింది. గత అయిదు నెలలుగా ఈ సహరిహద్దు మూసే ఉంది. అదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని రైతు సంఘాలను హైకోర్టు కోరింది.శంభు సరిహద్దు వెంబడి పబ్లిక్ ప్రజల రాకపోకలు, వాహనాలను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జూలై 6న పంజాబ్- హర్యానా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయ్యింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు వారం రోజుల్లో శంభు సరిహద్దును తెరవాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది రాజధాని న్యూఢిల్లీని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లను కలుపుతున్నందున మూసివేయడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.జూలై 3న నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఒప్పించాలని హర్యానా రవాణా మంత్రి అసీమ్ గోయెల్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. అసీమ్ గోయెల్ మాట్లాడుతూ.., “రైతులు అంబాలా జిల్లా సరిహద్దులో ఉన్న శంభు గ్రామం దగ్గర అయిదున్నర నెలల క్రితం ఆందోళనను ప్రారంభించిన తర్వాత జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల ఆందోళన ప్రారంభమైనప్పటి నుంచి ఈ సరిహద్దు మూసివేశారు. ఇది సాధారణ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా అంబాలాలోని వ్యాపారవేత్తలు తమ వ్యాపారం నిర్వహించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి శంభు సరిహద్దు గుండా రహదారిని తెరవడానికి వారిని శాంతింపజేయాలి. ఇది సమీపంలో నివసించే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది, అలాగే ఇది వ్యాపారవేత్తలు తమ పనిని నిర్వహించడానికి సులభతరం చేస్తుంది” అని పేర్కొన్నారుఅయితే రైతులు రహదారిని దిగ్బంధించలేదని, ఫిబ్రవరిలో బారికేడ్లు వేసి తమ ఢిల్లీ చలో మార్చ్‌ను ప్రభుత్వమే ఆపిందని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. తమ డిమాండ్లను ఆమోదించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రైతులు ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13 నుంచి తమ పాదయాత్రను భద్రతా దళాలు అడ్డుకోవడంతో రైతులు పంజాబ్, హర్యానా మధ్య శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసనలు చేస్తున్నారని చెప్పారు. -
అమెరికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల నేతలు, ప్రచార బృందాల విమర్శల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం రాత్రి ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో క్యాంపస్ వద్ద ట్రంప్ మాట్లాడారు. ‘నాలుగు ఏళ్ల క్రితం ఆమెరికా ఒక గొప్పదేశంగా ఉండేది. అంతే స్థాయిలో మరికొన్ని రోజుల్లో అమెరికా గొప్ప దేశం నిల్చోబెడతా. యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. దీంతో కొంత కాలం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో వలసలు పెరిగాయి. బహిష్కరణ విధానాలతో వలసలపై కఠిన చర్యలు తీసుకుంటాను. మోసగాడైన జో బైడెన్.. సోదరభావంతో ఉండే ఫిలడెల్ఫియా సిటీని మొత్తం నేరాలు, రక్తపాతంతో నాశానం చేశారు. ఇక్కడ అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇదంతా ‘బైడెన్ వలస నేరం’. .. మన దేశ చరిత్రలో సురకక్షితమైన సరిహద్దులు కలిగి ఉండేవాళ్లం. కానీ ఇప్పడు మనం ప్రపంచ చరిత్రలోనే రక్షణ లేని సరిహద్దులను కలిగి ఉన్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను. బైడెన్ ఆర్థిక విధానాలను మార్చివేస్తాను. రక్షణ వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తా. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా అమెరికాకు సైతం ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా’అని ట్రంప్ అన్నారు.ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరుగనున్నాయి. జాతీయవాదిగా, వలసలను త్రీంగా వ్యతిరేకించే నేతగా పేరున్న ట్రంప్ ఇటీవల అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్ గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
చైనా కోరికను తిరస్కరించిన భారత్
నాలుగు సంవత్సరాల తర్వాత నేరుగా ప్యాసింజర్ విమానాలను మళ్ళీ ప్రారంభించాలని చైనా.. భారత్‌ను కోరింది. సరిహద్దు వివాదంలో కొనసాగుతున్న ఉద్రిక్తల కారణంగా ఇండియా.. చైనా రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణలో సుమారు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి భారత్ - చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.చైనా - ఇండియా మధ్య నేరుగా విమానాల రాకపోకలు లేకపోవడంతో.. హాంకాంగ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు వెళ్లి చైనాకు వెళ్తున్నారు. 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేదించింది.సుమారు నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ విమానయాన సర్వీసులను ప్రారంభించాలని చైనా.. భారత పౌర విమానయాన అధికారులను కోరింది. కానీ భారతీయ అధికారులు దీనిపైన స్పందించలేదు. విమానాయ సర్వీసులను ప్రారంభించడం ద్వారా రెండు దేశాలు ప్రయోజనాన్ని పొందుతాయని చైనా అధికారు చెబుతున్నారు. సరిహద్దులో శాంతి ఉంటే తప్పా చైనాతో ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగవని భారత్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది. -
సముద్ర జలాల్లో శాంతి స్థాపనే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సురక్షిత నౌకాయానం, రూల్–బేస్డ్ వరల్డ్ ఆర్డర్, యాంటీ పైరసీ, హిందూ మహా సముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిధిలో శాంతి– స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో సారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన విశాఖలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇండియన్ నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు చెందిన స్నేహపూర్వక దేశాలు సురక్షితంగా ఉంటూ పరస్పర ప్రగతి పథంలో కలిసి ముందుకు సాగేలా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధిలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందనీ.. అంతర్జాతీయ వేదికగా భారత నౌకాదళ ఖ్యాతి పెరుగుతోందని ప్రశంసించారు. ఆర్థిక, సైనిక శక్తి ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశం ప్రమాదంలో పడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన భారత నౌకాదళం భరోసానిస్తోందన్నారు. పాక్ పౌరుల్ని రక్షించి మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది ఈ ఏడాది మార్చిలో అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీ పౌరులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి విడిపించినప్పుడు నేవీ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ తీరు ప్రశంసనీయమన్నారు. జాతీయత, శత్రుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఇండియన్ నేవీ సిబ్బంది వ్యవహరిస్తూ.. మానవత్వ విలువల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశ వాణిజ్య ప్రయోజనాలు ఐవోఆర్తో ముడిపడి ఉన్నాయనీ, వి్రస్తృత జాతీయ లక్ష్యాలను సాధించేందుకు నౌకాదళం సముద్ర సరిహద్దులను సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందన్నారు. షిప్‌యార్డ్‌లు విస్తరిస్తున్నాయనీ, విమాన వాహక నౌకలు బలోపేతమవుతున్నాయన్నారు. ఇండియన్ నేవీ కొత్త శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఘన స్వాగతం తొలుత విశాఖలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి చేరుకున్న రక్షణ మంత్రికి ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. 50 మందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌తో సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి చేరుకున్న ఆయన ఐఎన్ఎస్ జలాశ్వలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ నౌకలు, జలాంతర్గాములు, నేవల్ కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు, తూర్పు సముద్ర తీరంలో భారత నౌకాదళం కార్యాచరణ సంసిద్ధతని రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షించారు. ‘డే ఎట్ సీ’ ముగింపులో భాగంగా స¯Œరైజ్ ఫ్లీట్ సిబ్బందితో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోజనం చేశారు. గౌరవ వీడ్కోలు అనంతరం.. ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు. -
Border 2: ఇరవయ్యేడేళ్ల తర్వాత...
ఇరవయ్యేడేళ్ల తర్వాత హిందీ హిట్ ఫిల్మ్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు సన్నీ డియోల్. ఆయన హీరోగా జేపీ దత్తా దర్శకత్వంలో 1997లో వచ్చిన చిత్రం ‘బోర్డర్’. 1997 జూన్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. కాగా ‘బోర్డర్’ చిత్రం విడుదలై గురువారం (జూన్ 13) నాటికి సరిగ్గా 27 సంవత్సరాలు. ఈ సందర్భంగా ‘బోర్డర్ 2’ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కానీ ‘బోర్డర్’కు దర్శకత్వం వహించిన జేపీ దత్తాకు బదులుగా దర్శకుడు అనురాగ్ సింగ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఒక సైనికుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 27 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ వార్ ఫిల్మ్’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు సన్నీ డియోల్. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘బోర్డర్’ చిత్రం 1971లో జరిగిన ఇండియా–΄ాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఉంటుంది. ఈ చిత్రం సీక్వెల్ కథపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఇండో-టిబెట్ సరిహద్దులో చైనా పౌరుడు అరెస్ట్
హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కలకలం చెలరేగింది. ఇక్కడి ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో స్థానిక పోలీసులు ఒక చైనా పౌరుడిని అరెస్టు చేశారు. ఆ చైనా పౌరుడితో ఒక భారతీయ మహిళ కూడా ఉండటంతో ఆమెను కూడా కిన్నౌర్ పోలీసులు అరెస్టు చేశారు.మీడియాకు అందిన సమాచారం ఈ ఘటన కిన్నౌర్ జిల్లా సుమ్డో పోలీసు చెక్ పోస్ట్ దగ్గర చోటుచేసుకుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ లేకుండా ఆ చైనా పౌరుడు పోలీసులకు తారసపడ్డాడు. అతనితో పాటు ఉన్న మహిళ అతని భార్య అని, ఆమె మహారాష్ట్రకు చెందినదని పోలీసులు తెలిపారు. ఆ యువకుడిని 35 ఏళ్ల గుయో యుడాంగ్గా గుర్తించారు. అతను మహారాష్ట్రకు చెందిన ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి దగ్గరా వీసాతో సహా వారి వివాహ పత్రాలు ఉన్నాయి.అయితే కిన్నౌర్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడానికి వారికి అంతర్జాతీయ ఇన్నర్ లైన్ అనుమతి లేదు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉల్లంఘనపై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కిన్నౌర్ పోలీస్ డీఎస్పీ నవీన్ జల్తా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అందుకే దీనిపై పెద్దగా ఏమీ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు. -
దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు!
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం, అటవీ శాఖ మధ్య సరిహద్దు చిచ్చు రేగింది. గతేడాది దేవస్థానం వారు ఎక్కడ ఏ పనులు చేపట్టినా అటవీ శాఖ వారు తమ పరిధి అని గొడవ పడుతుండటంతో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టడానికి ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. అప్పుడు విజయవాడలో జరిగిన సమావేశంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ, దేవదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, ఆ శాఖ కమిషనర్ సత్యనారాయణ, అటవీ శాఖ సీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తదితరులు సరిహద్దులను నిర్ణయిస్తూ ప్లాన్ రూపొందించారు. అందులో అధికారులందరూ సంతకాలు చేశారు. శ్రీశైలానికి సంబంధించి 4,900 ఎకరాలు స్థలం ఉందని, అందులో 900 ఎకరాల డ్యామ్ నిర్మాణ సమయంలో మునిగిపోయి ఉందని గుర్తించారు. దీనితో పాటు ఎవరి హద్దులో వారు ఉండాలని, గొడవలకు పోవొద్దని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే అటవీ శాఖలో ఉన్న అధికారులు మరో ప్రాంతానికి బదిలీ కావడంతో కొత్తగా శ్రీశైలానికి బదిలీపై వచ్చిన ఎఫ్డీ, డీఎఫ్‌వో స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉన్నత అధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపణలున్నాయి. దీంతో కొత్తగా వచ్చిన ఎఫ్డీ, డీఎఫ్‌వోలు దేవస్థానానికి 100 ఎకరాలు మాత్రమే ఉందన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దీంతో దేవస్థానం–అటవీ శాఖ మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా దేవస్థానం పరిధిలో 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న టోల్గేట్ అటవీ శాఖ పరిధిలో ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు మధ్యలో గుంతలు తవ్వడం ప్రారంభించారు. అలాగే దేవస్థానం నిర్వహిస్తున్న డార్మెటరీ కూడా అటవీ శాఖ కిందికే వస్తుందని, అక్కడా తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఈవో పెద్దిరాజు, రెవెన్యూ ఏఈవో మల్లికార్జునరెడ్డి, పర్యవేక్షకులు శివప్రసాద్, దేవస్థానం సీఎస్‌వో అయ్యన్న, సంబంధిత సిబ్బందిని పంపించి ఎఫ్ఆర్వో నరసింహులు చేస్తున్న పనిని తాత్కాలికంగా నిలుపుదల చేయించారు. శనివారం మధ్యాహ్నం తిరిగి టోల్గేట్ దాటాక పిల్లర్ల నిర్మాణానికి అటవీ శాఖ వారు గుంతలు తవ్వుతున్నారు.. అని తెలుసుకుని రెవెన్యూ అధికారులు, సీఎస్‌వో సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులకు ఇబ్బంది కలిగించేలా దేవస్థానం ఆస్తులను ధ్వంసం చేస్తూ గుంతలు తవ్వడంపై అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ నరసింహులును ప్రర్మింస్తూ, స్థానిక సీఐకి సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. ప్రస్తుతం క్షేత్ర పరిధిలో నిర్మించిన డార్మెటరీ, దేవస్థానం టోల్గేట్ అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, అందుకే ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకు టోల్గేట్, నందీశ్వర డార్మెటరీల వద్ద సరిహద్దు నిర్మాణాల కోసం గుంతలను తవ్వి పిల్లర్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఎఫ్ఆర్వో నరసింహులు అన్నారు. డీఎఫ్‌వో సూచనల మేరకు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని, అనంతరం దేవస్థానంపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తామని చెప్పారు.15 రోజుల్లో నిర్ణయించుకోండి..సరిహద్దుల సమస్య ప్రభుత్వంలోని దేవదాయ–అటవీ శాఖకు సంబంధించి రెండు ప్రభుత్వ విభాగాలకు సంబంధించింది కాబట్టి 15 రోజుల్లోగా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఐ ప్రసాదరావు.. దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఏఈవోలకు సూచించారు.దేవస్థానం వారికి నోటీసులు జారీ చేశామని ఎఫ్ఆర్వో చెబుతుండగా, తమకు నోటీసులు అందలేదని దేవస్థానం అధికారులు సీఐకు తెలిపారు. ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉన్నందున అటు దేవస్థానం, ఇటు అటవీ శాఖ సంయమనం పాటించి ఒక నిర్ణయానికి రావాల్సిందిగా ఇరువర్గాలకు సూచించారు. లేకుంటే దేవస్థానం, అటవీ శాఖ నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
భారత జవాను ప్రాణాలను బలిగొన్న వడదెబ్బ
దేశంలో ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక విషాదం చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)నకు చెందిన ఒక జవాను వీరమరణం పొందారు. ఆ సైనికుని అజయ్‌కుమార్‌గా గుర్తించారు. వడదెబ్బ కారణంగా ఆ జవాను కన్నుమూశారని సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 55 డిగ్రీలకు పైగా ఉన్నాయి. ఈ ఎండ వేడిమికి బీఎస్ఎఫ్ జవానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బీఎస్ఎఫ్ జవాను అజయ్ కుమార్ ఆదివారం (మే 26) భాను సరిహద్దు పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎండ వేడిమికి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స నిమిత్తం అజయ్‌ను రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సోమవారం (మే 27) ఉదయం ఆసుపత్రిలో కన్నుమూశారు. రామ్‌గఢ్ ఆస్పత్రి లో వీరమరణం పొందిన జవానుకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా 173వ కార్ప్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు కూడా ఈ సైనికునికి పూలమాల వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సైనికుని మృతదేహాన్ని రామ్‌గఢ్ నుండి జోధ్‌పూర్‌కు రోడ్డు మార్గంలో తీసుకువెళ్లనున్నారు. అనంతరం మృతదేహాన్ని జోధ్‌పూర్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురికి విమానంలో తరలించనున్నారు. షేర్‌గఢ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ నేపధ్యంలో బీహార్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దును 72 గంటల పాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధుబని, ఖుటోనా, జయనగర్ నుంచి నేపాల్ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. 7వ తేదీన బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఖుటోనా, లద్నియా, పరిసర రాష్ట్రాలు, జిల్లాలు, దేశ సరిహద్దులతో సహా మధుబని లోఖా, లాల్మునియన్, జైనగర్, ఝంఝర్పూర్లలో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇదేవిధంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా చోట్ల భారీగా భద్రతా బలగాలను మోహరించారు. వృద్ధ ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీహార్‌లోని ఈ ప్రాంతంలో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మధుబని లోక్‌సభ స్థానానికి మే 20న ఎన్నికలు జరగనుండగా, అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. -
దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. -
ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దుల మూసివేత.. కారణమిదే!
ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న జరగనున్నాయి. తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా, ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దులను నేటి(మంగళవారం) సాయంత్రం 5 గంటల నుండి 72 గంటల పాటు మూసివేయనున్నారు. అలాగే సరిహద్దు భద్రత కోసం ఎస్ఎస్బీ సిబ్బందిని నియమించారు. ఏప్రిల్ 16 సాయంత్రం 5 గంటల నుండి ఏప్రిల్ 19 సాయంత్రం 5 గంటల వరకు భారత్- నేపాల్ సరిహద్దులను మూసివేయనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఓటింగ్ ప్రకియ ముగిసిన తర్వాత భారత్-నేపాల్ సరిహద్దులు తెరవనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేపాల్ నుంచి భారత్ వచ్చేందుకు లేదా నేపాల్ వెళ్లడానికి ఆర్మీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నేపాల్.. ఉత్తరాఖండ్‌తో పలు సరిహద్దులను పంచుకుంటుంది. ఈ సరిహద్దులన్నింటిలో ఆర్మీ సిబ్బందిని మోహరించారు. -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
గాలిపటాలతో డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న రైతులు!
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న కిసాన్ ఆందోళన్ 2.0కు బుధవారం రెండవ రోజు. ప్రస్తుతం హర్యానాలోని అంబాలాలోగల శంభు సరిహద్దు దగ్గర రైతులు కాపుగాశారు. గత 36 గంటలుగా రైతులు ఇక్కడి నుంచే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసులు నిరంతరం రైతులపై టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తున్నారు. రైతులు తమ ఆందోళనల్లో భాగంగా ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పోలీసుల డ్రోన్లకు ఆటంకం కలిగించేందుకు గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించారు. ఇందుకోసం రైతులు లెక్కలేనన్ని గాలిపటాలను తీసుకువచ్చి, ఎగురవేయడం ప్రారంభించారు. దీంతో ఆ డ్రోన్లు గాలిపటాల దారాలకు చిక్కుకుని కింద పడిపోతున్నాయి. కాగా శంభు సరిహద్దులో పంజాబ్ నుంచి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు నిరంతరం నిఘా సారిస్తున్నారు. ఆందోళనలకు కొనసాగిస్తున్న రైతులు డ్రోన్లపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ రాళ్లు డ్రోన్లను తాకలేకపోతున్నాయి. మరోవైపు హర్యానాలోని జింద్‌లోని చక్కెర మిల్లును తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక్కడ ఒక వైద్యుడు, ఫార్మాసిస్టును నియమించారు. అలాగే గాయపడిన రైతులకు ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ చక్కెర కర్మాగారం జింద్-పాటియాలా-ఢిల్లీ రహదారిలోని ఝంజ్ గ్రామానికి సమీపంలో ఉంది. -
Farmers Protest: రెండో రోజూ అదే పరిస్థితి!
రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా సమసిపోలేదు. కనీస మద్దతు ధరకు సంబంధించిన కొత్త చట్టానికి సమ్మతించని రైతులు ఢిల్లీకి పాదయాత్రగా తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నాడు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ఢిల్లీకి పాదయాత్రగా వచ్చేందుకు రైతులు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఈరోజు (బుధవారం) తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వారంతా ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభు సరిహద్దులో వేచిచూస్తున్నారు. దీంతో శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది#WATCH | RAF personnel, Police personnel and Riot Control Vehicle deployed at Singhu Border in Delhi in view of farmers' protest. pic.twitter.com/ewUgw0KoSw— ANI (@ANI) February 14, 2024 రైతుల ఆందోళనల నేపధ్యంలో హర్యానాలోని ఎనిమిది జిల్లాల్లో ఫిబ్రవరి 15 వరకు ఇంటర్నెట్ నిలిపివేశారు. మంగళవారం హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకుంది. ఫతేఘర్ సాహెబ్ నుంచి శంభు సరిహద్దు వరకూ గుమిగూడిన రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. సింగూ బోర్డర్, టిక్రీ బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్లో గట్టి పోలీసు నిఘా కొనసాగుతోంది. -
1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్.. కారణం ఇదేనా..
దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్ఎన్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. -
ఐదుగురు ప్రియురాళ్లు... సరిహద్దులు దాటి, చిక్కుల్లో పడి..
ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవంటారు. ప్రేమను పొందేందుకు కొందరు ఎంతకైనా వెనుకాడరు. ఇదేకోవలో ఐదుగురు మహిళలు ప్రేమ కోసం తమ దేశ సరిహద్దులు దాటి, విదేశాల్లోకి ప్రవేశించి, చిక్కుల్లో పడ్డారు. వీటికి సంబంధించిన ఉందంతాలు 2023లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సీమా హైదర్ సీమా హైదర్ పేరు దేశంలో చర్చనీయాంశమైంది, పాకిస్తాన్‌కు చెందిన ఈ 27 ఏళ్ల మహిళ ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడుతూ 21 ఏళ్ల భారతీయ కుర్రాడు సచిన్ మీనా ప్రేమలో పడింది. నలుగురు పిల్లల తల్లి అయిన సీమా తన ప్రేమను నెరవేర్చుకునేందుకు పాకిస్తాన్ నుంచి సరిహద్దులు దాటి భారత్‌కు చేరుకుంది. సీమా.. భారత్ వచ్చేందుకు పాకిస్తాన్‌లోని తన ఇంటిని అమ్మేసింది. భారత్ వచ్చిన సీమాపై గూఢచర్యం ఆరోపణలు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. ఇప్పటికి పూర్తి వివరాలు వెల్లడికాలేదు. అంజు రాజస్థాన్‌కు చెందిన అంజు తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌కు వెళ్లింది. ఆమె అక్కడ తన తన పాకిస్తానీ ప్రేమికుడిని పెళ్లాడిందనే ప్రచారం జరిగింది. అయితే ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత అంజు భారత్‌కు తిరిగి వచ్చింది. అంజును మొదట ఐబీ, తర్వాత పంజాబ్ పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆమె గ్వాలియర్‌లోని తన తండ్రి ఇంటిలో ఉంటోంది. అయితే ఆమె భారత్‌లో ఎంతకాలం ఉంటుంది? పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తుందా? అనేది ఇంకా వెల్లడికాలేదు. జవేరియా ఖానుమ్ జావేరియా పాకిస్తాన్‌లోని కరాచీ నివాసి. త్వరలో ఆమె కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతోంది. వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఖానుమ్ భారతదేశానికి వచ్చి 45 రోజులు ఉంది. ఆమెకు డప్పులతో ఘన స్వాగతం పలికారు. అట్టారీ సరిహద్దు నుంచి ఆమె భారత్‌లోకి ప్రవేశించింది. బార్బరా పొలాక్ జార్ఖండ్‌లోని తన ప్రియుడిని కలవడానికి పోలాండ్‌కు చెందిన బార్బరా పొలాక్ భారతదేశానికి వచ్చింది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. విడాకులు తీసుకున్న ఆమె తన సోషల్ మీడియా స్నేహితుడు షాదాబ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఆమె షాబాద్‌ను పెళ్లి చేసుకోవడానికి వీలుగా 2027 వరకు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో ఇండియాకు వచ్చింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. కృష్ణా మండల్ కృష్ణా మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ తన ప్రియుడు అభిక్ మండల్‌ను కలిసేందుకు బంగ్లాదేశ్ మీదుగా ఈదుకుంటూ భారత్ వచ్చింది. కృష్ణా.. అభిక్ మండల్ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆమెకు పాస్‌పోర్ట్ లేదు. కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వారు పెళ్లి చేసుకున్నారు. అయితే కృష్ణాను భారత ఏజెన్సీ అరెస్టు చేసి, బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించింది. ఇది కూడా చదవండి: 2023లో జేకేలో ఎన్కౌంటర్లు ఎన్ని? ఎందరు మరణించారు? -
ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు!
అమెరికాలో అక్రమ సరిహద్దు క్రాసింగ్‌కు సంబంధించిన సంక్షోభం మధ్య బిలియనీర్ ఎలాన్ మస్క్ టెక్సాస్-మెక్సికో సరిహద్దులను పరిశీలించారు. ‘ఈగిల్ పాస్ సరిహద్దు దగ్గర ఏమి జరుగుతున్నదో చూడటానికి వెళ్లాను’ అని ఎలాన్ మస్క్ తెలిపారు. అక్కడి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఎలాన్ మస్క్ ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. బ్లాక్ కౌబాయ్ టోపీ ధరించిన మస్క్ అక్కడి అధికారులతో మాట్లాడారు. సరిహద్దులను పరిశీలించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో మస్క్ ఇటువంటి అక్రమ సరిహద్దు క్రాసింగ్లకు సంబంధించిన సమస్యలపై తన అభిప్రాయాలను తరచూ షేర్ చేస్తుంటారు. దీనికి ముందు టెక్సాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎస్ ప్రతినిధి టోనీ గొంజాలెస్తో మస్క్ మాట్లాడారు. అక్రమ వలసలు పెరిగిపోయాయని మస్క్ అనగా, కష్టపడి పనిచేసేవారు, నిజాయితీపరులు అమెరికాకు రావడానికి చట్టబద్ధంగా అనుమతి ఉందని టోనీ గొంజాలెస్ తెలిపారు. సరిహద్దు సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నదని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వెనిజులా మహిళ ఒకరు చిన్న పిల్లను తీసుకుని, అత్యంత జాగ్రత్తగా ముళ్లకంచెను దాటుకుని మెక్సికో సరిహద్దులను దాటి, అమెరికాలోకి ప్రవేశించడం కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? Video shows a Venezuelan woman trying to pass with a small girl under the barbed fence on the border between Mexico and El Paso, Texas 🚨🚨🚨 pic.twitter.com/oYhShfp00h — Wall Street Silver (@WallStreetSilv) September 29, 2023 -
ఆ సమస్యలను సాధారణీకరించే నిర్వహణకు చైనా పిలుపు!
చైనా అంతర్జాతీయ సరిహద్దులో విభేదాలను సాధారణీకరించే నిర్వహణకు పిలుపుచ్చింది. గాల్వన్ ఘటన నేపథ్యంలో ఇరుదేశాల రక్షణమంత్రుల మొదటి సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన బలమైన సందేశం తదనంతరం చైనా జనరల్ లీ షాంగ్ఫూ ఇలా వ్యాఖ్యానించారు. ఈ మేరకు చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో.. ఇరుపక్షాలు దీర్ఘకాలికి దృక్పథాన్ని తీసుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలలో సరిహద్దు సమస్యను తగిన స్థానంలో ఉంచాలి. సరిహద్దు పరిస్థితిని సాధారణీకరించే నిర్వహణకు ప్రోత్సహించాలి అని పేర్కొంది. ఐతే ఇది భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. సరిహద్దు పరిస్థితి రెండు దేశాల మధ్య బంధాల విస్తరణతో ముడిపడి ఉందని భారత్ స్పష్టం చేసింది. కానీ చైనా భారత్‌తో విభేదాల కంటే సాధారణ ప్రయోజనాలనే పంచకుంటుందని తెలిపింది. ఇరు పక్షాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర అభివృద్ధిని, సమగ్ర దీర్ఘకాలికి వ్యూహాత్మక కోణం నుంచి చూడాలని చైనా నొక్కి చెబుతోంది. తద్వారా ప్రపంచానికి వివేకం, బలాన్ని సంయుక్తంగా అందించాలని చైనా పేర్కొంది. ఇదిలా ఉండగా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా ఇరు పక్షుల మంత్రుల సమావేశం తర్వాత భారత్ తన ప్రకటనలో భారత్ చైనా మధ్య సంబంధాల అభివృద్ధి శాంతి ప్రాబల్యంపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పషం చేశారు. సరహద్దు సమస్యలు ద్వైపాక్షిక ఒప్పందాలకు, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒప్పందాల ఉల్లంఘన ద్వైపాక్షిక సంబంధాల మొత్తం ప్రాతిపదికన క్షీణింపచేస్తుందని హెచ్చరించారు. సరిహద్దులను విడదీయడంతో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. చైనా మాత్రం సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని ఇరు పక్షాల సైనికు దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాయని చెబుతోంది. అందువల్ల పరస్పర విశ్వాసాన్ని పెంపొందించేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామని అందుకు సహకరించండి అని చైన పేర్కొనడం గమనార్హం. (చదవండి: నా కూతురు కారణంగానే అతను ప్రధాని అయ్యారు! సుధామూర్తి) -
హృదయవిదారకం.. భారతీయ కుటుంబం దుర్మరణం!
న్యూయార్క్/ఒట్టావా: కెనడా-అమెరికా సరిహద్దులో విషాదం చోటుచేసుకుంది. అక్రమంగా సరిహద్దు దాటే క్రమంలో ఆరుగురు శరణార్థులు దుర్మరణం పాలయ్యారు. వీళ్లలో ఐదుగురు భారత్‌కు చెందినవాళ్లూ, అదీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తిని కెనడా పౌరసత్వం ఉన్న రోమేనియన్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. ఇరు దేశాల మధ్య అక్వెసాస్నేలోని మోహవ్క్ సరిహద్దు-క్యూబెక్(న్యూయార్క్ స్టేట్) ప్రాంతంలో సెయింట్ లారెన్స్ నదిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు అంతా భారతీయులేనా? అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. గురువారం నదీ తీర ప్రాంతంలో ప్రమాదానికి గురైన ఓ బోటును అధికారులు గుర్తించారు. ఆపై ఏరియల్ సర్వే ద్వారా మృతదేహాలు ఒక్కొక్కటిగా వెలికితీశారు. మరో చిన్నారికి చెందిన పాస్‌పోర్ట్ లభ్యం కాగా ఆమె కూడా చనిపోయి ఉంటుందని అంచనాకి వచ్చిన పోలీసులు.. మృతదేహం కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఇది హృదయవిదారకమైన ఘటన. మృతుల్లో పసికందులు కూడా ఉండడం ఘోరం అని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఇక జనవరి నుంచి ఇప్పటిదాకా అక్రమంగా ఇరు దేశాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు 48 వెలుగు చూసినట్లు అక్వెసాస్నే అధికారులు చెబుతున్నారు. వీళ్లలో భారత్‌కు, రొమేనియాకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. మోహవ్క్ సరిహద్దు ప్రాంతంలో ఉండే అక్వెసాస్నే.. క్యూబెక్, ఒంటారియో, న్యూయార్క్ స్టేట్లతో సరిహద్దు పంచుకుంటోంది. అందుకే వీటి గుండా ఇరు దేశాలకు శరణార్థుల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటోంది. పైగా ఈ అక్రమ రవాణాకు పోలీసులే సహకరిస్తుండడం గమనార్హం. సరిహద్దుల్లో దిగాక.. వాళ్లకు గోప్యంగా వాహనాల్లో ఆయా ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇదీ చదవండి: నాసా ‘మూన్ టు మార్స్’ చీఫ్‌గా మనోడు! -
అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు కీలక మార్గాన్ని తెరిచిన తాలిబన్లు
పెషావర్: అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లోని కీలకమైన తోర్ఖామ్ మార్గాన్ని తాలిబన్ పాలకులు గురువారం తెరిచారు. వైద్యం, ఇతర అత్యవసరాల నిమిత్తం సరిహద్దులు దాటి వచ్చే వారికి పాకిస్తాన్ యంత్రాంగం అవసరమైన తోడ్పాటు ఇవ్వడం లేదంటూ తాలిబన్లు ఆదివారం తోర్ఖామ్ మార్గాన్ని మూసివేశారు. పాకిస్తాన్– మధ్య ఆసియా దేశాలకు ముఖ్యమైన సరఫరా మార్గం ఇదే. ఇది మూసుకుపోవడంతో పాకిస్తాన్ హుటాహుటిన ఉన్నత స్థాయి బృందాన్ని కాబూల్‌కు పంపించింది. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో తాలిబన్లు శాంతించారు. అధికారుల సూచనలతో సరిహద్దులు తెరుచుకున్నాయి. దీంతో, అఫ్గాన్ ప్రజల కోసం ఆహార పదార్థాలు, తదితర అత్యవసరాలతో సరిహద్దుల్లో నిలిచిపోయిన వందలాది ట్రక్కులు ఖైబర్ పాస్ గుండా ముందుకుసాగాయి. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
Viral Video: ‘మయన్మార్‌లో తింటే.. భారత్‌లో పడుకుంటారు’
నాగాలాండ్ మంత్రి టెన్జెన్ ఇమ్నా ఓ ఆసక్తికర వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ఇది భారత్, మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఓ ప్రత్యేకమైన గ్రామం గురించి తెలియజేస్తుంది. నాగాలాండ్‌లోని మోన్జిల్లాలో ఉన్న అతిపెద్ద గ్రామాల్లో లాంగ్వా ఒకటి. నాగాలాండ్ రాజధాని కొహిమాకు 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం భారత్, మయన్మార్ దేశాల సరిహద్దులుగా కలిగి ఉండటమే దీని ప్రత్యేకత లాంగ్వా గ్రామానికి ఓ వైపు మయన్మార్ దట్టమైన అడువులు ఉండగా.. మరోవైపు భారత్‌లోని వ్యవసాయ భూమి సరిహద్దుగా కలిగి ఉంది. 1970లో భారతదేశం, మయన్మార్ మధ్య సరిహద్దులు సృష్టించడానికి చాలా కాలం ముందే లాంగ్వా గ్రామం ఏర్పడింది. అధికారులు సరిహద్దు రేఖను గీస్తున్నప్పుడు, వారు తమ కమ్యూనిటీ విభజించేందుకు అంగీకరించలేదు. దీంతో గ్రామం గుండా సరిహద్దు గీశారు. అందుకే ఒక సరిహద్దు పిల్లర్‌పై బర్మీస్ బాషలో రాసి ఉంటే మరో పిల్లర్‌పై హిందీలో రాసి ఉంటుంది. లాంగ్వాలో కొన్యాక్ నాగా తెగకు చెందిన వారే అధికంగా నివసిస్తుంటారు. నాగాలాండ్‌లో గుర్తింపు పొందిన 16 గిరిజనుల్లో కొన్యాక్ తెగ అతి పెద్దది. కొన్యాక్ తెగకు ఆంగ్ అనే వ్యక్తి అధిపతిగా పిలవబడుతుంటాడు. లాంగ్వా గ్రామం భారత్, మయన్మార్ దేశాలను సరిహద్దులుగా కలిగి ఉన్నప్పటికీ ఓకే వ్యక్తి దీనిని పాలిస్తున్నాడు. అతని పాలన 75 గ్రామాలకు విస్తరించింది. ఇందులో కొన్ని మయన్మార్‌కు, మరికొన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వానికి తన ప్రజలకు ఆంగ్ వారధిగా వ్యవహరిస్తుంటారు. అంతేగాక మయన్మార్, భారత్ సరిహద్దు రేఖ ఇతని ఇంటి గుండా వెళుతుంది. ఇతని ఇళ్లు ఇండియా, మయన్మార్‌ను వేరు చేస్తుంది. ఇంట్లోని సగభాగం భారత్‌లో ఉంటే మిగిలిన సగం మయన్మార్‌కు చెందుతుంది. అంటే ఆంగ్ తమ కిచెన్ నుంచి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడమంటే ఏకంగా దేశ సరిహద్దు దాటడమే అన్నట్లు. అంతేగాక ఈ సరిహద్దు లాంగ్వా ప్రజలను విభజించడానికి బదులు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ గ్రామం గుండా మొత్తం నాలుగు నదులు ప్రవహిస్తుండగా అందులో రెండు భారత్ భూభాగంలో ఉండగా.. మరో రెండు నదులు మయన్మార్ భూభాగం పరిధిలోకి వస్తాయి. దీనిని నాగాలాండ్ మంత్రి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో ఆ కుటుంబం ఇండియాలో నిద్రపోతే(బెడ్రూం).. మయన్మార్‌లో తింటారు(కిచెన్) అంటూ నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. OMG | यह मेरा इंडिया To cross the border, this person just needs to go to his bedroom. बिलकुल ही "Sleeping in India and Eating in Myanmar" वाला दृश्य😃 @incredibleindia @HISTORY @anandmahindra pic.twitter.com/4OnohxKUWO — Temjen Imna Along (@AlongImna) January 11, 2023 -
కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదురుతున్న సరిహద్దు వివాదం
-
ఎడిటర్ కామెంట్: అనగనగా ఒక చైనా కథ..!
-
మహారాష్ట్ర - కర్ణాటక సరిహద్దుల్లో హైటెన్షన్
-
తల నరికేసే ఊరిలో.. రెండు దేశాల బార్డర్!
దేశాల మధ్య సరిహద్దులు అంటే.. కంచెలు, హద్దు రాళ్లు గుర్తుకువస్తుంటాయి. కొన్నిచోట్ల గ్రామాలు, పట్టణాలకు దగ్గరగా సరిహద్దులు ఉంటుంటాయి. గ్రామాల మధ్యలోంచి కూడా దేశాల సరిహద్దులు వెళ్లే ప్రాంతాలూ కొన్ని ఉన్నాయి. అలా భారత్, మయన్మార్ దేశాల మధ్య ఉన్న గ్రామమే.. లోంగ్వా. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. రెండు దేశాల బార్డర్! భారత్, మయన్మార్ దేశాల మధ్య నాగాలాండ్ రాష్ట్రంలో లోంగ్వా గ్రామం ఉంది. కొన్యాక్ గిరిజనులు నివసించే ఈ గ్రామం ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఈ గ్రామ పెద్ద ఇంటి మీదుగానే అంతర్జాతీయ సరిహద్దు వెళ్తుంది. ‘మేం భారత్‌లో తింటాం. మయన్మార్‌లో నిద్రపోతాం’ అని గ్రామ పెద్ద సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. ఈ గ్రామ పెద్దను ‘ఆంఘ్’ లేదా ‘చీఫ్టేన్’ అని పిలుచుకుంటారు. కొన్యాక్ తెగకు చెందినవారు 5 వేల మందికిపైగా ఉంటారని అంచనా. వారందరికీ ‘ఆంఘ్’ రాజు. ఆయనకు 60 మంది భార్యలు అని.. చుట్టూ ఇటు భారత్, అటు మయన్మార్‌లో ఉన్న 60 గ్రామాలను పాలిస్తుంటారని చెబుతారు. ఈ పరపతి కారణంగానే.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే ముందే లోంగ్వా గ్రామానికి 4జీ మొబైల్ నెట్వర్క్ వచి్చందని అంటుంటారు. తల నరికేసే యోధులు! రెండు దేశాల్లోనూ పౌరసత్వం కొన్యాక్ తెగలో ఓ ఆచారం ఉంది. ఈ తెగ యువకులు ప్రత్యర్థి తెగలవారితో తలపడి తల తెగనరికి తీసుకువస్తే యుద్ధవీరుడిగా గుర్తింపు ఇస్తారు. తలపై ఇత్తడి కిరీటాన్ని, మెడలో ఇత్తడి బిళ్లలతో కూడి దండను ధరిస్తారు. ఎంత మంది తలలు నరికితే అన్ని ఇత్తడి బిళ్లలు వేసుకుంటారు. ప్రభుత్వం 1960లో ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది. అయినా ఇప్పటికీ తమ మెడలో ‘హెడ్ హంటర్స్’కు గుర్తుగా దండలను ధరిస్తారు. ఇక వారి తెగ సాంప్రదాయాన్ని, తమ హోదాను బట్టి ముఖంపై వివిధ ఆకారాల్లో పచ్చబొట్లు వేసుకుంటారు. తర్వాతి కాలంలో ఈ తెగకు చెందినవారు చాలా మంది క్రిస్టియనిటీ స్వీకరించారు. అయినా తమ ఆచారాలను కొనసాగిస్తుంటారు. భారత్, మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న లోంగ్వా గ్రామస్తులకు అధికారికంగానే ఇరు దేశాల పౌరసత్వం ఉంది. మన దేశంలో ఇలాంటి పౌరసత్వం ఉన్న ఏకైక గిరిజన తెగ వీరిదేనని చెబుతారు. గ్రామస్తులు చాలా మంది రెండు దేశాల ఎన్నికల్లోనూ ఓటేస్తారు. కొందరు మయన్మార్ ఆరీ్మలోనూ పనిచేస్తున్నారు. లోంగ్వా గ్రామం, పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలకు నెలవు. భారత్ వైపు రెండు, మయన్మార్ వైపు మరో రెండు చిన్న నదులు, షిలోయ్ అనే ఓ సరస్సు ఉన్నాయి. దీనికితోడు కొన్యాక్ తెగవారి ప్రత్యేకతలు, ఆచారాలను చూడటానికి ఇటీవలికాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు లోంగ్వాకు వెళుతున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ (చదవండి: జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పు పై ఉత్కంఠ) -
సరిహద్దుల కాపలాలో సైన్యం సత్తా
భారత్‌పై మోపిన యుద్ధాలు, ఘర్షణలు... అవి భౌగోళిక, రాజకీయ పరిణామాలను మార్చిన వైనం గురించి పరామర్శించుకోవడానికి భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం చక్కటి సందర్భం. ఈ ఘర్షణలన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేది ఏమిటంటే, భారత సాయుధ బలగాలు నిర్వహించిన అసాధారణ పాత్ర. భారత సరిహద్దులను కాపాడటంలో, పొరుగుదేశాల సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకు ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభాగాన్ని కూడా కోల్పోలేదు. చొరబాట్ల నిరోధానికి సైనిక బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన భూభాగాలు మాత్రమే మనం కోల్పోయింది! ► నాటి జమ్మూ కశ్మీర్ మహారాజు పాకిస్తాన్లో కశ్మీర్ విలీనం కావడాన్ని ఇష్టపడకపోవడం చూసిన తర్వాత, పాకిస్తాన్ రాజకీయ కులీన వర్గం 1947 అక్టోబర్‌లో కశ్మీర్ దురాక్రమణను ప్రారంభించిందనే ప్రబలమైన ఆవగాహన ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా ఒక కొత్త కథనం ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. ఇక్బాల్ మల్హోత్రా రాసిన ‘డార్క్ సీక్రెట్స్: పాలిటిక్స్, ఇంట్రిగ్యూ అండ్ ప్రాక్సీ వార్స్ ఇన్ కశ్మీర్’ (2022) పుస్తకం చక్కటి పరిశోధనాత్మక వివరాలను వెల్లడిస్తోంది. కశ్మీర్‌పై రెండు భాగాల్లో దాడులు ప్రారంభించాలంటూ పాకిస్తాన్ సైన్యాన్ని బ్రిటిష్ పాలనా వ్యవస్థ ప్రోత్సహించిందంటూ ఈ పుస్తకం సంచలన వివరాలు బయటపెడుతోంది. ఆ రెండు భాగాలు ఏమి టంటే, కశ్మీర్ లోయను స్వాధీనపర్చుకోవడానికి ఆపరేషన్ గుల్మార్గ్ మొదలుపెట్టడం; గిల్గిత్–బాల్టిస్తాన్ స్వాధీనం కోసం ఆపరేషన్ దత్తా ఖేల్‌ను ప్రారంభించడం. ► దీంతో 1947 అక్టోబర్ నుంచి 1948 వేసవి కాలం వరకు కశ్మీర్‌ను కాపాడుకుందాం అనే దీర్ఘకాలిక పథక రచనలో భారత వాయుసేన, భారతీయ సైన్యం మునిగిపోయాయి. మన బలగాలు అపారమైన సంకల్పంతో ఈ పథకాన్ని పూర్తి చేశాయి. కానీ బ్రిటిష్ నాయకత్వం అంతటితో వదలిపెట్టలేదు. గిల్గిట్‌పై పాకిస్తాన్ పతాకం ఎగిరేలా వారు పావులు కదిపారు. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించడానికి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూను లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పించారు. కశ్మీర్ సమస్యకు ప్లెబిసైట్ (ప్రజాభిప్రాయ సేకరణ)ను ఉత్తమ పరిష్కా రంగా నెహ్రూ ఆమోదించేలా చేశారు. ఇది కాల్పుల విరమణకు దారితీసింది. ఈ ‘కాల్పుల విరమణ రేఖ’ జమ్మూ కశ్మీర్లో భారత్– పాక్ వాస్తవిక సరిహద్దుగా మారింది. ► అయితే, చైనాతో అపరిష్కృతంగా ఉన్న హిమాలయాల సరిహ ద్దులు స్వాతంత్య్రం తర్వాత భారత్ ముందుకు రెండో కీలకమైన ఘర్షణను తెచ్చిపెట్టాయి. 1962లో చైనా, భారత్ మధ్య ఘర్షణ అనేక కారణాల ఫలితం అని చెప్పాలి. టిబెట్ పోరాటానికి సహాయం అందించే లక్ష్యంతో భారత్‌లో అమెరికా అడుగుజాడలు పెరగడం కూడా ఒక కారణం. 1954లో భారత్ ప్రచురించిన మ్యాపులు అక్సాయ్ చిన్ను లద్దాఖ్‌లో భాగంగా చూపాయి. అంటే అది భార త్లో భాగమేనని చెప్పాయి. ► అలాగే మ్యాప్ ఉన్నా లేకపోయినా మెక్ మెహన్ రేఖ మాత్రమే చైనాతో భారత ఈశాన్య సరిహద్దుగా ఉంటుం దని నెహ్రూ దృఢ వైఖరిని ప్రకటిస్తూ వచ్చారు. ఇది చైనా నాయ కత్వాన్ని రగిలించింది. అందుకే నెహ్రూకు గుణపాఠం చెప్పాలని మావో నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు రష్యా ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, చైనాను పోత్సహిం చిన విషయం మరుగున పడిపోయింది. 1950లలో కొరియన్ యుద్ధంలో తొలిసారి చైనాకు రష్యా మద్దతుగా నిలిచింది. తర్వాత అమెరికా శిబిరంలో భారత్ ఉన్నట్లు కనిపించింది కాబట్టి, భారత్‌పై చైనా దాడిని కూడా రష్యా బలపర్చింది. 1962 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 19 వరకు క్యూబా క్షిపణి సంక్షోభంలో ప్రపంచం కూరుకు పోయిన రోజు ల్లోనే సోవియట్ నాయకుడు నికితా కృశ్చేవ్ భారత్‌పై దాడి చేయవచ్చని పంపిన సిగ్నల్‌ను నాటి చైనా నాయకత్వం అందుకుంది. ► చైనా దాడి రెండు భ్రమలను పటాపంచలు చేసింది. ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా నెహ్రూ పాత్ర, ఆసియాలో భారత్ వైఖరికి సంబం ధించిన భ్రమలు చెల్లాచెదురైపోయాయి. అదే సమయంలో న్యూఢిల్లీలో భారతీయ సైనిక కమాండర్లు విషాదకరంగా పౌర నాయకత్వ ఆజ్ఞలకు లోబడిపోయారు. ప్రత్యేకించి నెహ్రూ, కృష్ణ మీనన్, బీఎన్ మలిక్ చైనా దాడి సంకేతాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువల్లే 1962 అక్టోబర్‌లో చైనా వాస్తవంగా దాడి ప్రారంభించినప్పుడు సరైన శిక్షణ, తగిన ఆయుధ సంపత్తి లేని భారతీయ దళాలు అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో చైనా దురాక్ర మణతో పోరాడాల్సి వచ్చింది. ఇరు సైన్యాల మధ్య భారీ అసమా నతలు ఉన్నప్పటికీ, లదాఖ్, ‘నెఫా’ (ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్)... రెండు ప్రాంతాల్లోనూ భారతీయ దళాలు గణనీయ పోరాట పటిమను ప్రదర్శించాయి. ► మన బలగాల పోరాట చేవను ఈ వ్యాస రచయిత రాసిన ‘కంటెస్టెడ్ ల్యాండ్స్: ఇండియా, చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్’ (2021) పుస్తకం పొందుపర్చింది. 1962 సైనిక ఘర్షణను జాతీయ ఓటమిగా పిలుస్తున్నారు కానీ, వాస్తవానికి భారతీయ సైన్యంలో, వాయుసేనలో చాలా భాగాన్ని ఈ యుద్ధంలో ఉపయో గించలేదని గమనించాలి. ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే చైనాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందనే భయం దీనికి కారణం కావచ్చు. భారత్ బలగాలను అధిక సంఖ్యలో ఉపయోగించి ఉంటే కథ మరొకలా ఉండేది. ► 1962లో భారత్ పరాజయం, అమెరికా కేంద్ర యుద్ధ పథకం కారణంగా పాకిస్తాన్లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పటికే అమె రికా ఆయుధాలు పాకిస్తాన్ పొంది ఉంది. చైనా దాడితో భారత్ సైన్యపు నైతిక బలం క్షీణించిందనీ, 1947 మాదిరిగా రెండు భాగాల్లో తలపెట్టినట్లుగా కాకుండా, సుశిక్షితమైన అర్ధ గెరిల్లా దాడిని మొదలె డితే ఈసారి కశ్మీర్‌ను తాను ఆక్రమించవచ్చనీ పాక్ భావించిందంటే ఆశ్చర్యం లేదు. భారత వాయుసేన, భారత సైన్య సంయుక్త ప్రతి స్పందనతో పాక్ కుట్రలు మరోసారి భగ్నమయ్యాయి. మన బలగాల ప్రతి దాడి సమర్థత ఏ స్థాయిలో సాగిందంటే, దురాక్రమణ సైన్యాన్ని తరుముకుంటూ పోయిన భారత్ బలగాలు లాహోర్, సియాల్ కోట్ గేట్ల వద్దకు పోయి నిలిచాయి. దీంతో లాహోర్‌ను కాపాడుకునేందుకు పాక్ జనరల్ అయూబ్ ఖాన్ తన బలగాలతో లొంగిపోయారు. ► మరోవైపున కాల్పుల విరమణ పిలుపు కోసం వేచి చూస్తూ భారత బలగాలు ఈ రెండు నగరాల ప్రవేశ ద్వారాల వద్ద తిష్ట వేశాయి. అయితే 1965 నాటి ఆ యుద్ధంలో తమదే విజయం అని పాక్ ప్రక టించుకుందనుకోండి. ఎందుకంటే విజయం మనదే అని ప్రకటించు కోవడానికి భారత రాజకీయ నాయకత్వం కాస్త సిగ్గుపడింది మరి! అయితే 1971 నాటి ఇండో–పాక్ యుద్ధం పూర్తిగా విభిన్నమైంది. మొదటిసారి భారత త్రివిధ బలగాలు పాల్గొన్నాయి. పైగా అది కశ్మీర్ కోసం జరిగిన యుద్ధం కాదు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. అయితే ఈ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందం జమ్మూ కశ్మీర్ భవిష్యత్తుకు సంబంధించినదే. ► సిమ్లా ఒడంబడికలో ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, కాల్పుల విరమణ రేఖను నియంత్రణా రేఖ (ఎల్ఓసీ)గా మార్చుకోవడమే. అంటే ఇది రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక సరిహద్దుగా ఉంటుందన్నమాట. కార్గిల్‌లో మరోసారి భంగపాటుకు గురై నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ అమెరికాకు పరుగెత్తినప్పుడు, అమెరికా సైతం ‘ఎల్ఓసీ’నే గౌరవించమని పాకిస్తాన్‌ను కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1999లో జనరల్ ముషారఫ్ దురాక్రమణ బలగాలు ఎల్ఓసీని దాటి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ప్రధాన ఉద్దేశం, దాని మాన్యతను సవాలు చేయడమే. ► అయితే భారత్ బలమైన సైనిక ప్రతిస్పందన కారణంగా నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ సైతం అదే ఎల్ఓసీని గుర్తించడం వల్ల పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు కలిగింది. భారత సరిహద్దులను కాపాడటంలోని సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకే ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. అయితే ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభా గాన్ని కూడా కోల్పోలేదు. మనం కోల్పోయినదల్లా... 1947, 1962 సంవత్సరాల్లో చొరబాట్ల నిరోధానికి భారత బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన మన భూభాగాలను మాత్రమే. మరూఫ్ రజా, వ్యాసకర్త మాజీ సైనికాధికారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గెలుపునకు చేరువలో ఉక్రెయిన్! రష్యా సరిహద్దుకు చేరుకున్న బలగాలు
Mr President, We Made It: ఉక్రెయిన్ పై రష్యా గత రెండు నెలలకు పైగా దాడులు కొనసాగిస్తునే ఉంది. ఈ నేపథ్యంలో యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నిరవధిక పోరును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పరిస్థితి గురించి ఒక నివేదిక విడుదల చేసింది. భూ, గగన, జల మార్గాలలో దాడులు సాగించిన రష్యా బలగాలు ఈ యుద్ధంలో భారీ నష్టాన్నే చవిచూశాయని పేర్కొంది. ప్రస్తుతం యుద్ధంలో రష్యా కాస్త వెనకబడిందని తెలిపింది. రష్యా బలగాల పోరాట సామర్థ్యం తగ్గిందని, చాలామంది సైనికులు పట్టుబడుతున్నారని వెల్లడించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం రానున్న రోజల్లో రష్యా దళాలు వేగవంతంగా దాడులు చేసే అవకాశం లేదని అంచనా వేసింది. అంతేగాదు ఖార్కివ్ ప్రాంతంలో కీవ్ దళాలు ఉక్రెయిన్-రష్యా సరిహద్దుకు చేరుకున్నట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహదారు వాడిమ్ డెనిసెంకో తెలిపారు. ఆస్ట్రియా ఉక్రెయిన్ మాజీ రాయబారి ఒలెగ్జాండర్ షెర్బా "మిస్టర్ పుతిన్ మేము సాధించాం". "శత్రు రాజ్య సరిహద్దుకు చేరుకున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్, రష్యా సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ సైనికులను చూపించే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతేగాదు బెర్లిన్‌లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో జర్మనీకి చెందిన అన్నలెనా బేర్బాక్ ఉక్రెయిన్‌కి తమ మాతృభూమి రక్షణ కోసం తమవంతు మద్దతుగా సైనిక సహాయం అందిస్తామని చెప్పారు. మరోవైపు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెనియన్లు తమ ధైర్య సాహసాలతో తమ మాతృభూమిని రక్షించుకోవడమే కాకుండా ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారని ధీమాగా చెప్పారు. Latest Defence Intelligence update on the situation in Ukraine - 15 May 2022 Find out more about the UK government's response: https://t.co/VBPIqyrgA5 🇺🇦 #StandWithUkraine 🇺🇦 pic.twitter.com/n6dBVZHAos — Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) May 15, 2022 “Mr. President, we reached Ukraine’s state border with the enemy state. Mr. President, we made it!” Glory to #Ukraine! Glory to Heroes!#StandWithUkraine️ #UkraineWillWin #RussiaUkraineWar pic.twitter.com/kdD6kD1w3x — olexander scherba🇺🇦 (@olex_scherba) May 15, 2022 (చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం) -
పేరుకే స్పోర్ట్స్ క్లబ్.. లోపల పేకాట హబ్
సాక్షి, మంచిర్యాల: పత్తాలాట రాష్ట్రంలో పత్తాలేకుండా పోయినా సరిహద్దుల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేకాట, మట్కా వంటి జూదాలను ప్రభుత్వం నిషేధించడంతో సరిహద్దుల్లో పేకాట స్థావరాలు వెలిశాయి. మన రాష్ట్రంలో రహస్యంగా ఎక్కడైనా ఆడితే పోలీసు, టాస్క్‌ఫోర్స్‌కు చిక్కే ప్రమాదముందని భయపడిన జూదరులు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దుల్లో ‘చేతివాటం’ప్రదర్శిస్తున్నారు. చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో స్పోర్ట్స్ క్లబ్‌ల పేరుతో పేకాట దందా సాగుతోంది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా అంకీసా, దుబ్బపల్లి, నందిగాంలో, నిర్మల్ జిల్లా సరిహద్దు నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణం, బాసర సమీప గ్రామం నవీపేటలో పేకాట జోరుగా నడుస్తోంది. రోజూ వందలాది మంది జూదరులు రూ.లక్షలు పెట్టి పేకాట ఆడుతున్నారు. జూదరుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీప్రముఖులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. క్లబ్లో సకల సౌకర్యాలు పత్తాలాట నిర్వాహకులు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆడిఆడి అలసిపోతే అక్కడే పడుకోవచ్చు. టాయిలెట్లు, బాత్రూముల వసతి కూడా ఉంది. తాగునీరు, టీ, స్నాక్స్, జ్యూస్‌లు, చికెన్, మటన్‌తో కోరిన భోజనం అందిస్తుంటారు. కొందరైతే రోజుల తరబడి అక్కడే బస చేస్తున్న సందర్భాలున్నాయి. జూదరుల జేబులు ఖాళీ అయితే నమ్మకస్తులకు ఒంటి మీది బంగారం, వాహనం కుదవ పెట్టుకుని అప్పులు కూడా ఇస్తుంటారు. ఆటలో నగదుతోపాటు గూగుల్ పే, ఫోన్ పే తోనూ చెల్లిస్తున్నారు. జూదరులకు రానుపోను వాహన ఖర్చులు, ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఇస్తున్నారు. సిరోంచకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా, ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి జూదరులు వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన జూదరులు సరిహద్దు ఉన్న ధర్మాబాద్ వైపు వెళ్తున్నారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోనూ ఓ క్లబ్ వెలిసినప్పటికీ మావోయిస్టుల ప్రభావంతో దానిని మూసివేశారు. మహారాష్ట్రలో మైండ్ గేమ్‌గా.. దేశంలో ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867’ప్రకారం నేరుగా డబ్బులతో ఆటలు ఆడటం నిషేధం. చాలా రాష్ట్రాలు పేకాటను పూర్తిగా నిషేధించాయి. మహారాష్ట్ర, గోవా లో షరతులతో కూడిన మైండ్‌గేమ్‌గా పిలిచే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ, డబ్బులు పెట్టి ఆడటం నిషేధం. మహారాష్ట్రలో ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్‌ల సభ్యులకు పేకాట అనుమతి ఉన్నా డబ్బులు పెట్టి ఆడరాదు. దీనిని ఆసరా చేసుకుని మహారాష్ట్రలో చట్టబద్ధమైన ఆట అని ప్రచారం చేస్తూ తెలంగాణ పేకాట రాయుళ్లకు వల వేస్తున్నారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్ట ణం, శివారు నవీపేటలో గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాలకు చెం దిన వాళ్లే క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రాపూర్ జిల్లా రాజురా, పోడ్సా క్లబ్‌లను అక్కడి అధికారులు మూసివేశారు. రోజుకు రూ. లక్షల్లో ఆర్జన పేకాట నిర్వాహకులకు రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. క్లబ్లో కనీసం రూ.5 వేలు నుంచి రూ.20 వేలతో పేకాట ఆడే టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్‌కు తొమ్మిది మంది చొప్పున ఉంటారు. ఇందులో ఒకరి డబ్బులు నిర్వాహకులు తీసుకుంటారు. ఐదువేల టేబుల్‌కు రూ.ఐదు వేలు, రూ.20 వేల టేబుల్‌కు రూ.20 వేలు తీసుకుంటారు. ఆటలో గెలిచినవారికి మిగతా డబ్బులు ఇస్తారు. ఒక్కో క్లబ్లో కనీసం ఆరు నుంచి పది టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్‌కు ఓ డీలర్ ఉంటాడు. అతడు పేక ముక్కలు పంచడం, లెక్కలు వేయడం, డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. రోజూ మధ్యాహ్నం మొదలై తెల్లవారు జామున 4 గంటల వరకు పత్తాలాట సాగుతోంది. గతంలో నిమిషాల్లో రూ.లక్షలు ఆవిరి చేసే కట్ పత్తా లాంటి ఆటలు ఆడగా, ప్రస్తుతం రమ్మీ మాత్రమే నడుస్తున్నాయి. ఈ దందాకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు దండిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మావోయిస్టుల అదుపులో ఆదివాసీలు
చర్ల: తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలకు చెందిన సుమారు 100 మంది ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులు గడిచినా వారిని వదలకపోవడంతో ఆదివాసీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పోలీసు క్యాంపులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనల్లో అన్ని గ్రామాల ఆదివాసీలు, గిరిజనులు పాల్గొనాలని మావోయిస్టులు గతంలో పిలుపునిచ్చారు. అయితే, వారు స్పందించకపోవడంతోనే మావోయిస్టులు ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది. కాగా, మావోయిస్టులు పలువురిని బంధించిన విషయాన్ని తమకు చెప్పలేదనే కారణంతో శనివారం ఉదయం కుర్నపల్లికి వెళ్లిన సీఐ అశోక్, ఎస్సై రాజువర్మ పలువురు యువకులను చర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే సాయంత్రం వారిని విడుదల చేసి నట్లు విలేకరులకు సమాచారం ఇచ్చారు. జవాన్‌ను హతమార్చిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. గంగుళూరు పోలీ స్ స్టేషన్‌కు చెందిన జవాన్ అందో పోయం ను (49) శుక్రవారం కిడ్నాప్ చేసి తీసుకెళ్లా రు. శనివారం అతడిని హతమార్చి మృతదేహాన్ని గంగుళూరు రహదారిపై పడేశారు. -
కెనడా-అమెరికా సరిహద్దులో నలుగురు భారతీయుల మృతి
న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన నలుగురు వ్కక్తులు కెనడా-అమెరికా సరిహద్దు ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ దేశాల సరిహద్దు అధికారులు గుర్తించారు. వెంటనే భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో పసిపాప కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన జైశంకర్ ఆయాదేశాల్లో ఉన్నటువంటి భారత రాయబారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిని గుర్తించాలని.. అదే విధంగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. Shocked by the report that 4 Indian nationals, including an infant, have lost their lives at the Canada-US border. Have asked our Ambassadors in the US and Canada to urgently respond to the situation: EAM Dr S Jaishankar (File photo) pic.twitter.com/b5jddAqg4v — ANI (@ANI) January 21, 2022 చదవండి: ఇక నుంచి కరోనాను నిమిషాల్లో గుర్తించవచ్చు.. ఎలాగంటారా.. -
అడవిలో అలజడి..
-
చత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్
-
ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!
వాషింగ్టన్: సాధారణంగా వివాహాలంటే మండపంలోనో, గుడిలోనో లేదా ఇంటి దగ్గర చేసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ జంట మాత్రం తమ పెళ్లిని రెండు దేశాల సరిహద్దుల మధ్య చేసుకుంది. ఎందుకలా అనుకుంటున్నారా! దానికి ఓ కారణం ఉందిలెండి. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికాలో నివసిస్తున్న కరెన్ మహోనీ, బ్రియాన్ రేకు వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండగా, కెనడాలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. ఇటీవల కరోనా కారణంగా ఆయా దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడా మధ్య ఉన్న ఆంక్షల కారణంగా వధువు కుటుంబ సభ్యులు ఈ పెళ్లి కోసం న్యూయార్క్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ జంట ఈ వేడుక తమ కుటుంబ సభ్యుల మధ్యే జరగాలని నిర్ణయించుకున్నారు. అందుకు వేదికను ఏకంగా సరిహద్దు వద్దకు మార్చారు. అదృష్టవశాత్తు సరిహద్దు భద్రతా సిబ్బందిలో ఒకరు వాళ్లకు తెలియడంతో ఈ పని సులువుగా మారింది. దీంతో న్యూయార్క్‌లోని బర్కి, కెనడాలోని క్యూబెక్ మధ్య ఉన్న జమీసన్ లైన్ బోర్డర్ క్రాసింగ్‌లో వారి పెళ్లి వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ తతంగమంతా కెనడా సరిహద్దులో ఉన్న కరేన్ తల్లిదండ్రులు, నానమ్మ వీక్షించారు. ఈ రకంగా వివాహం చేసుకోవడంపై వధువు కరేనా... పెళ్లి అనేది ఎవరికైనా జీవితంలో ముఖ్యమైన రోజు. అలాంటి ప్రత్యేకమైన రోజుని నా తల్లిదండ్రులు, నానమ్మ సమక్షంలో జరగాలని నేను కోరుకున్నాను. మా కుటుంబ పెద్ద నానమ్మ ఒక్కరే. నా జీవితంలో సంతోషకరమైన రోజును చూడడంతో పాటు ఆ రోజు ఆమె నా దగ్గర ఉండాలనుకున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటజన్లు వీరి ఐడియాను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Viral Video: సింగిల్‌గా ఉంటే సింహమైనా సైలెంట్‌గా ఉండాలి.. లేదంటే -
మయన్మార్ నుంచి భారత్‌కు 15వేల మంది: ఐరాస
ఐక్యరాజ్యసమితి: మయన్మార్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి వచ్చారు. ప్రజల నిరసనలపై మయన్మార్ సైన్యం ఉక్కుపాదం మోపింది. విచ్చలవిడిగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 1,120 మంది చనిపోయినట్లు అంచనా. ఘర్షణలు, హింసాకాండ నేపథ్యంలో మయన్మార్ నుంచి 15,000 మందికిపైగా పౌరులు సరిహద్దు దాటి, భారత్‌లోకి ప్రవేశించారని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. చదవండి: అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు? ఈ మేరకు ఆయన ‘మయన్మార్‌లో రోహింగ్యా ముస్లింలు, ఇతర మైనార్టీల మానవ హక్కుల పరిస్థితి’పేరిట ఒక నివేదికను ఐరాస సర్వ సభ్య సమావేశంలో సమర్పించారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఫిబ్రవరి 1 కంటే ముందే సంక్షోభ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా 3.36 లక్షల మంది సొంత ప్రాంతాలను వదలిపెట్టారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 తర్వాత 2.20 లక్షల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారని వివరించారు. మరో 15వేల మందికిపైగా జనం సరిహద్దు దాటి, పొరుగు దేశమైన భారత్‌కు చేరుకున్నారని తెలిపారు. చదవండి: నేడు గాంధీ జయంతి: మహాత్ముడికి సోనియా, మోదీ నివాళులు -
చమన్ బోర్డర్‌ను మూసేసిన పాక్
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌తో ఉన్న కీలక సరిహద్దు చమన్ క్రాసింగ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు గురువారం పాకిస్తాన్ ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక పాలన భయంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సరిహద్దులు దాటి వచ్చే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారని జియో న్యూస్ తెలిపింది. పాక్ బాట పట్టిన వేలాదిమంది అఫ్గాన్లు ఇప్పటికే చమన్ వద్ద పడిగాపులు కాస్తుండగా, వీరందరినీ తాము అనుమతించే పరిస్థితుల్లో లేమని పాక్ అధికారులు అంటున్నారు. సరిహద్దుల్లో ఆంక్షలు సడలిస్తే 10 లక్షల మందైనా అఫ్గాన్లు వచ్చే అవకాశం ఉందని పాక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో 90% వరకు ఫెన్సింగ్ ఉంది. 12 చోట్ల ఏర్పాటు చేసిన చెక్పాయింట్ల ద్వారా సరైన ప్రయాణ పత్రాలున్న వారినే ప్రస్తుతం పాక్‌లోకి అనుమతిస్తున్నారు. -
‘డ్రై ఫ్రూట్స్’పై తాలిబన్ ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి డ్రై ప్రూట్స్ సహా అనేక వస్తువులను భారత్‌తో పాటు అనేక దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో దేశంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఆఫ్గానిస్తాన్ సరిహద్దులను తాలిబన్లు మూసివే యడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపో యాయి. ఈ ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా భారత్‌లోని డ్రైప్రూట్స్ వ్యాపారంపై పడింది. కళ తప్పిన ఢిల్లీలోని కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్ ఏటా భారత్‌లో అమ్ముడవుతున్న డ్రై ప్రూట్స్‌లో 80% అఫ్గాన్ నుంచే దిగుమతి అవుతుంటాయి. ఇందులో ఎండుద్రాక్ష, బాదం, అంజీర్, వాల్నట్స్, పిస్తా, కాజు వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు అఫ్గానిస్తాన్ నుంచి మన దేశానికి సరుకు రాకపోవడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల వ్యవధిలోనే దేశంలోని అతిపెద్ద డ్రై ప్రూట్స్ హోల్‌సేల్ మార్కెట్ అయిన ఢిల్లీ చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో 30% నుంచి 40% వరకు ధరల్లో పెరుగుదల నమోదైందని వ్యాపారులు తెలిపారు. ఒక్కొక్క డ్రైఫ్రూట్ ధర కిలోకు రూ.100 నుంచి రూ.400 వరకు పెరిగాయి. 10 రోజుల్లో ఎంత మార్పు?: ఒకవైపు దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడం, మరోవైపు డ్రైఫ్రూట్స్ వినియోగంతో సాధారణ ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆరోగ్య నిఫుణులు తెలపడం కారణంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో వాటి వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు అఫ్గాన్ పరిణామాల నేపథ్యంలో ధరల పెరుగుదల తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని డ్రైఫ్రూట్స్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు చాందినీ చౌక్ కరీబాబ్లీ డ్రైఫ్రూట్స్ మార్కెట్లో అడుగుపెట్టడానికి స్థలం ఉండని పరిస్థితి నుంచి నేడు చాలా తక్కువ మంది షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ హోల్‌సేల్ మార్కెట్ నుంచే డ్రైఫ్రూట్స్ సరఫరా అవుతుంటాయి. 10 రోజుల క్రితం వరకు కిలో రూ.700 చొప్పున అమ్ముడైన క్వాలిటీ బాదం ఇప్పుడు రూ.1000–1200కి అమ్ముడవుతోంది. అఫ్గానిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అంజీర్ ధర గతంలో కిలోకు రూ.800–1000 వరకు ఉండగా, తాజా పరిణామాలతో ఒక్కసారిగా రూ.1100–1200 వరకు చేరింది. ప్రస్తుతానికి సరిపడ నిల్వలు బాదం, ఎండు ద్రాక్ష, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆశ్చర్యపోతున్నారని డ్రై ఫ్రూట్ రిటైల్ వ్యాపారి బల్వీర్ సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతానికి తమ వద్ద నిల్వలు సరిపడా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న పరిమిత స్టాక్ ధరను నెమ్మదిగా పెంచి విక్రయిస్తున్నారని, రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వారు చెబుతున్నారని సింగ్ తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి చేరిన తర్వాత ధరల్లో స్థిరత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారుల ముందు జాగ్రత్త రానున్న రోజుల్లో దిగుమతులు జరగకపోవడం కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకును నిల్వ చేయడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో డ్రై ఫ్రూట్స్ ధరలు తాము ఏ రేటుకు పొందుతామనే భయం వ్యాపారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తక్కువ ధరలో ఎందుకు విక్రయించాలని కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వం పరిష్కారం కనుక్కోవాలి రాబోయే కొద్ది రోజుల్లో అఫ్గానిస్తాన్ నుండి కొత్త సరుకు వస్తుందని డ్రైప్రూట్స్ వ్యాపారి గౌరవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. గతంలోనే తమకు రావాల్సిన స్టాక్‌కు సంబంధించిన అక్కడి వ్యాపారులకు ముందుగానే చెల్లించామని, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని గౌరవ్ తెలిపారు. అంతేగాక అఫ్గానిస్తాన్‌లోని వ్యాపారులతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, ఈ వ్యాపారంలో తమ కోట్లాది రూపాయలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుగొనాలని, లేకపోతే డ్రైఫ్రూట్స్ వ్యాపారులు తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దేశంలో 80 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్తాన్ నుంచి వచ్చినవే ఉంటాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రస్తుత పరిణామాల ప్రభావం డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని ప్రభావితం చేసిందని, దీని కారణంగా ధరలు పెరగడం సహజమని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కసరత్తు చేస్తోందని, త్వరలోనే పరిష్కారాన్ని కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దుబాయ్ నుంచి డ్రైఫ్రూట్స్ ఉత్పత్తుల దిగుమతులకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు. -
శాటిలైట్ ఇమేజింగ్‌తో సరిహద్దుల నిర్ణయం
న్యూఢిల్లీ/గువాహటి/ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల హద్దులను శాటిలైట్ ఇమేజింగ్ సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ, నెశాక్)కి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ అధికారులు పేర్కొన్నారు. నెశాక్ నుంచి అందే శాటిలైట్ మ్యాపింగ్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరుగుతుందనీ, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని వారు చెప్పారు. అస్సాం, మిజోరం సరిహద్దుల్లో జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణల్లో ఇటీవల ఐదుగురు అస్సాంకు చెందిన పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది వరకు గాయపడటంతో ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీలు మరోసారి తెరపైకి వచ్చాయి. నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్(ఎన్ఈసీ), కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ సంయుక్త ఆధ్వర్యంలో షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నెశాక్ ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో వరద హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెశాక్ సాంకేతిక సాయాన్ని అందజేస్తోంది. కాగా, 1875లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వు ఫారెస్టులో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని మిజోరం వాదిస్తుండగా, అదేం కాదు, 1993లో నిర్ణయించిన ప్రస్తుత సరిహద్దునే గుర్తిస్తామని అస్సాం చెబుతోంది. ఇద్దరు సీఎంలతో మాట్లాడిన అమిత్ షా అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, జొరంతంగాలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యకు అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు అనంతరం జొరంతంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇలా ఉండగా, జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణలకు సంబంధించి అస్సాం సీఎం హిమంతపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకునే అవకాశముందని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో వెల్లడించారు. ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. అరెస్టుకయినా సిద్ధం: సీఎం హిమంత సరిహద్దు ఘర్షణలపై నోటీసులు అందితే మిజోరం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని అస్సాం సీఎం హిమంత చెప్పారు. అరెస్టయినా అవుతాను గానీ, తనతోపాటు కేసులు నమోదైన రాష్ట్ర అధికారులను మాత్రం విచారణకు పంపేది లేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు కోర్టు నుంచి బెయిల్ కూడా కోరనన్నారు. చర్చలే సమస్యకు పరిష్కారమని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంత స్ఫూర్తిని సజీవంగా ఉంచటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. -
రాష్ట్ర సరిహద్దులపై పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్/వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సీపీఐ (మావోయిస్టు) పార్టీ ఈనెల 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నిర్వహించనున్న అమరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యా రు. ఈ ప్రాంతాల్లో సాధారణ తనిఖీలతోపాటు సరిహద్దులు, అడవుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కాగా గోదావరి, ప్రాణహితలు ఉధృతంగా ప్రవహిస్తున్నందున మావోయిస్టులు నదులను దాటే ప్రయత్నం చేయకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మావో’పోస్టర్ల కలకలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే మావోయిస్టు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. ‘గ్రామ గ్రామాన వారోత్సవాలు నిర్వహించి, అమర వీరుల ఆశయాలను కొనసాగించాలి. శత్రు సాయుధ బలగాలు చేస్తున్న సమాధాన్ ప్రహార్ దాడిని ఓడిద్దాం. ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి’అని చర్ల – శబరి ఏరియా కమిటీ పేరున పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జిల్లా ఎస్పీ సునీల్ శర్మ కథనం ప్రకారం.. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతగుఫ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు కూం బింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు తారసపడిన మావోయిస్టులు బలగాలపైకి కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పుల కు దిగారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందగా, పలువురు తప్పించుకొని పారిపోయారు. -
మహారాష్ట్ర సరిహద్దుల్లో అలర్ట్
యశవంతపుర: కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలను పెంచారు. పూణె నుంచి హుబ్లీకి బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే ప్రయాణికుల వద్ద కరోనా ఆర్టీ పీసీఆర్ నెగిటివ్ ధ్రువపత్రం, టీకా వేసుకున్నారా లేదా అని పోలీసులు, వైద్య సిబ్బంది తనిఖీలు చేపట్టారు. బెళగావి అదనపు ఎస్పీ అమరనాథరెడ్డి పర్యవేక్షించారు. పత్రాలు లేని ప్రయాణికులను వాపస్ పంపుతున్నారు. కరోనా డెల్టా రకం, మూడో దాడి భయాల నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. ఒక బస్సులో ఎవరికీ పత్రాలు లేకపోవడంతో బస్సును వెనక్కి పంపించారు. మూడో వేవ్‌పై భయం వద్దు రాష్ట్రంలో నెలలో 60 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు డిప్యూటీ సీఎం సీఎన్ అశ్వత్థ నారాయణ తెలిపారు. కరోనా మూడో వేవ్‌పై ఆందోళనగా ఉన్నమాట నిజమే. అయితే ఎవరూ భయపడవలసిన పని లేదన్నారు. -
జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్ సాహిబ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్ కనిపించగా, కలుచక్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్‌వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై ఆదివారం డ్రోన్ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. -
వెరైటీగా వంతెన మీద వివాహం.. కారణం ఇదేనా
కొచ్చి: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్డౌన్ విధించడంతోపాటు అనేక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు పెళ్లిళ్లపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. కేవలం కొంతమంది బంధువుల సమక్షంలోనే వివాహలు జరుపుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. అయితే, కొన్ని జంటలు మాత్రం నిబంధనల కారణంగా వెరైటిగా వివాహలు జరుపుకొని వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇదే తరహాలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలను వేరుచేసే చిన్నార్ నదికి అడ్డంగా ఉన్న వంతెనపై అనేక మంది వివాహలు జరుపుకుంటున్నారు. ‘ భలే ఉంది మీ ఐడియా.. కొవిడ్ టెస్టు డబ్బులు మిగిల్చారు’ ఇప్పటికే ఆ వంతెన మీద చాల వివాహలు జరిగాయి. ఈ క్రమంలో కేరళలోని మరయూర్ ఇడుక్కి స్థానికుడు ఉన్నికృష్ణన్, తమిళనాడులోని బట్లగుండుకు చెందిన వధువు తంగమాయిల్ను ఇదే చిన్నార్ వంతెన మీద వాళ్లు వివాహం చేసుకున్నారు. కాగా.. వివాహనికి హాజరైన వారందరికి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. అదే విధంగా, తమిళనాడులోని వధువు కుటుంబం వైపు వారు ఈ పరీక్షల కోసం ఒక్కొరు రూ. 2,600 చెల్లించాల్సి ఉంటుంది. దీన్నిబట్టి పదిమంది టెస్ట్ చేయించుకోవటానికి రూ.26,000 అవుతుంది. కాబట్టి, వీటినుంచి తప్పించుకోవాటానికి ఈ వంతెన మీద వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. కనీసం వివాహం జరిపించడానికి పురోహితుడు కూడా లేడు. అయితే మొత్తానికి వధువు, వరుడు వంతెనపై నిలబడి ఎలాంటి ఆటకం లేకుండా ఒక్కటయ్యారు. వంతెనకు ఇరువైపులా నిలబడి బంధువులను నూతన దంపుతులను ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ వెరైటీ పెళ్లి సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, దీన్ని చూసిన నెటిజన్లు ‘ భలే ఉంది మీ ఐడియా.. కోవిడ్ టెస్టు డబ్బులు మిగిల్చారు.. పురోహితుడుంటే బాగుండు అంటూ’ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే, తమిళనాడు, మధురైకి చెందిన ఒక జంట .. బెంగళురు నుంచి మధురై వెళ్లె ప్రత్యేక విమానం బుక్ చేసుకోని మరీ తమ బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Kerala: An inter-state couple tied knot at Chinnar bridge connecting Kerala & Tamil Nadu in Idukki y'day. "Bride is from Kerala & groom from Tamil Nadu. Since all family members could not travel for wedding, it was decided to conduct at border," says AK Mani, former Devikulam MLA pic.twitter.com/z6CxEUHkBc — ANI (@ANI) June 8, 2020 చదవండి: ‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు -
ఈపాస్ ఉన్నవారికి మాత్రమే ఏపీలోకి ఎంట్రీ
సాక్షి, అమరావతి : ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఈపాస్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అంబులెన్స్‌లు, వైద్య చికిత్సలకు అనుమతినిస్తున్నారు. అత్యవసర ఎంట్రీకి పోలీస్ సిటిజన్ సర్వీసెస్ యాప్‌కి అప్లై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
చైనాకు చెక్..ఇంజినీర్ వైశాలి
‘తొలి మహిళ’ అనే మాట బాగా పాతబడిపోయిన భావనగా అనిపించవచ్చు. ‘అది ఇది ఏమని అన్ని రంగముల’ మహిళలు తమ ప్రతిభా ప్రావీణ్యాలను నిరూపించుకుంటూ రావడం ఇప్పుడు కొత్తేమీ కాకపోవచ్చు. అంతమాత్రాన తొలి మహిళ కావడం ఘనత కాకుండా పోదు. తాజాగా వైశాలి హివాసే అనే మహిళ ఇండో–చైనా సరిహద్దులో భారత సైన్యం నిర్మించబోతున్న వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టుకు కమాండింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు! ఒక మహిళ ఇలాంటి విధులను చేపట్టనుండడం భారత ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆర్మీ విభాగమైన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజొనీరుగా పని చేస్తున్న వైశాలికి ఇండియన్ ఆర్మీ ఈ ‘కఠినతరమైన’ పనిని అప్పగించడానికి కారణం గతంలో వైశాలి కార్గిల్ సెక్టార్లో ఇంజినీరుగా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడమే. ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో).. భారత సైన్యానికి ఎంత కీలకమైనదో, బీఆర్వోలో పని చేసే ఇంజినీర్ల బాధ్యతలు అంత ముఖ్యమైనవి. మహారాష్ట్రలోని వార్థా ప్రాంతానికి చెందిన వైశాలి ఎం.టెక్ చదివి ఇటువైపు వచ్చారు. సరిహద్దుల్లో శత్రుదేశాలను వెనక్కు తరిమేందుకు, మిత్రదేశాలకు అవసరమైన సాధన సంపత్తిని అందచేసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు శత్రు దుర్భేద్యంగా దారులను నిర్మించడం బీఆర్వో ప్రధాన విధి. ఇప్పుడు వైశాలీ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉండబోతున్నది శత్రుదేశం చొరబాట్లను నియంత్రించే దారిని నిర్మించే ప్రాజెక్టుకే! గత ఏడాది లడఖ్ సెక్టార్లో భారత్–చైనా ఘర్షణల మధ్య కూడా బీఆర్వో సిబ్బంది శత్రువును కట్టడి చేసే పైకి కనిపించని మార్గాలను, సొరంగాలను నిర్మిస్తూనే ఉన్నారు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్లో వైశాలి నేతృత్వంలోని ఇంజినీర్లు, నిర్మాణ కార్మికులు అక్కడి గండశిలల్ని పెకిలించి, భూభాగాలను తొలిచి.. భారత సైన్యం మాటువేసి శత్రువును తరిమికొట్టడానికి వీలుగా పోరాట మార్గాలను నిర్మించబోతున్నారు. అంత ఎత్తులో పని చేసేవారికి ఆక్సిజన్ సరిగా అందదు. తవ్వకాల్లో దుమ్మూధూళీ పైకి లేస్తుంది. డ్రిల్లింగ్ ధ్వనులు నిర్విరామంగా చెవుల్లో హోరెత్తుతుంటాయి. సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. మధ్యలో కన్స్ట్రక్షన్ ప్లాన్‌ని మార్చవలసి రావచ్చు. వీటన్నిటినీ వైశాలే దగ్గరుండి పరిష్కరించాలి. ఇప్పటికే అక్కడికి రెండు ‘ఎయిర్–మెయిన్‌టైన్డ్ డిటాచ్మెంట్స్’ (అత్యవసర సేవల బృందాలు) చేరుకున్నాయి. ఇక వైశాలి వెళ్లి పనిని మొదలు పెట్టించడమే. శత్రువు ఆట కట్టించేందుకు ‘షార్ట్‌కట్’ మార్గాలను కనిపెట్టి, ‘పోరు దారులను’ నిర్మించడమే. ∙∙ బీఆర్వో ప్రస్తుతం లడఖ్, జమ్ము–కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో వ్యూహాత్మక దారుల్ని నిర్మిస్తోంది. చైనా సరిహద్దు వెంబడి ఉన్న 66 ప్రాంతాలలో ఇలాంటి దారుల్ని 2022 డిసెంబరు నాటికి నిర్మించాలన్న ధ్యేయంతో పని చేస్తోంది. కమాండింగ్ ఆఫీసర్ గా వైశాలి ఇప్పుడు ఎలాగూ కొండల్ని పిండి చేయిస్తారు కనుక తర్వాతి బాధ్యతల్లో కొన్నింటినైనా ఆమెకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ‘తొలి మహిళ’ అనే మాట పాతబడి పోయినట్లనిపిస్తోందా?! -
పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా?
ప్రపంచంలో సమస్యాత్మక సరిహద్దులలో భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఒకటి. ఈ ప్రాంతంలో సైన్యం కాకుండా వేరేవారు కనపడితే ఇబ్బందుల్లో పడినట్లే. అయితే ప్రజలే కాదు జంతువులు, పక్షులు కూడా అనుమానాస్పదంగా కనపడినా అదుపులోకి తీసుకుంటారని ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సరిహద్దు నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ బోర్డర్ వద్ద కానిస్టేబుల్ నీరజ్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఓ పావురం అతని భుజంపై వచ్చి వాలింది. ఈ ఘటన ఏప్రిల్ 17న జరిగింది. ఆ పావురం కాళ్లకు ఏదో కట్టి ఉన్నట్లు గమనించిన కానిస్టేబుల్ అనుమానం వచ్చి వెంటనే పావురాన్ని పట్టుకుని, పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్‌కు సమాచారం ఇచ్చాడు. అనంతరం అధికారులు పావురాన్ని స్కాన్ చేశాడు. ఒక తెల్ల కాగితం కనిపించగా, దానిపై ఒక సంఖ్య కూడా ఉంది. ఇదేదో కోడ్ భాష లాంటిదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పావురాన్ని ఉగ్రవాదులు గూఢచర్యానికి ఉపయోగిస్తున్నారనే అనుమానంతో పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ( చదవండి: రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం ) -
కర్ర పట్టుకుని పరిగెత్తించి కొట్టిన కలెక్టర్.. కారణం తెలిస్తే షాక్!
సాక్షి, పర్లాకిమిడి: రోజురోజుకు గజపతి జిల్లా కేంద్రం పర్లాకిమిడిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్థానిక మహేంద్రతనయ వంతెన వద్ద ఆంధ్రా–ఒడిశా సరిహద్దును మూసివేశారు. స్వయంగా కలెక్టర్ అనుపమ కుమార్ సాహా, సబ్‌కలెక్టర్ సంగ్రాం కేసరి పండాలు శనివారం చేత కర్రలు పట్టుకుని కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని, పాతపట్నం (ఆంధ్రప్రదేశ్) నుంచి జిల్లాలోకి వచ్చేవారిని తరిమికొట్టారు. విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సరిహద్దులో పాతపట్నం డిపోవద్ద నిలిపివేయడంతో అనేకమంది ఒడిశాకు రావాలనుకున్న వారు కాలినడకన వచ్చి ఒడిశా అధికారులకు తమ కాగితాలను చూపించి పర్లాకిమిడి పట్టణానికి రావాల్సి వచ్చింది. మహిళలు లగేజీ మోయలేక, ఆటోలు లేక ఇబ్బందులు పడ్డారు. నాకాపాయింట్ల వద్ద విడిచిపెట్టకపోవడంతో ఉపాధి కూలీలు స్వస్థలాలకు రాలేక అవస్థలు పడ్డారు. జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధించారు. జిల్లాకు వచ్చే ఆంధ్రా సరిహద్దుల నాకాపాయింట్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వద్దు బాబోయ్! తెలంగాణకు ‘మహా’ తలనొప్పి
సాక్షి, కామారెడ్డి/బోధన్: మహారాష్ట్రలో పంజా విసురుతోన్న కోవిడ్ మహమ్మారి ఉమ్మడి జిల్లాలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆంక్షలు లేకుండా సాగుతోన్న రాకపోకలతో వైరస్ మన దగ్గరా వ్యాప్తి చెందుతోంది. సరిహద్దుల్లో తనిఖీలు అంతంత మాత్రమే కావడం, వచ్చి పోయే వారు నిబంధనలు పాటించక పోవడంతో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా నిత్యం వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా లో 21 వేలు నమోదవగా, కామారెడ్డి జిల్లాలో 15, 485 పాజిటివ్ కేసులు దాటాయి. ఇప్పటికైనా సరిహద్దుల్లో రాకపోకలు నియంత్రించక పోతే వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. తనిఖీలు అంతంత మాత్రమే.. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కలకలం రేపుతోంది. అక్కడ నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా, పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. పొరుగునే ఉన్న దెగ్లూర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రావు సాహెబ్ (63) కరోనాతో శుక్రవారం రాత్రి మరణించారు. సరిహద్దుల్లో ఉన్న నాందేడ్ జిల్లాలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ ప్రభావం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలపై చూపుతోంది. నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్, బిలోలీ, ధర్మాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఈ రెండు జిల్లాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతర్రాష్ట్ర రహదారిపై మొదట్లో కొద్ది రోజులు హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో వాహనాలు ఆగకుండానే వెళ్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే వారి ద్వారా ఉమ్మడి జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందుతోంది. మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ తనిఖీ కేంద్రం వద్ద వైద్య సిబ్బంది మహారాష్ట్ర నుంచి బస్సుల్లో వచ్చే ప్రయానికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే ర్యాపిడ్ టెస్ట్‌లు చేస్తున్నారు. అయితే, ఆటోలు, జీపులు, లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు మాత్రం ఆపకుండా వెళ్లి పోతున్నారు. దీంతో మద్నూర్ మండలంలోని గ్రామాలతో పాటు పిట్లం, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మద్నూర్ మండలంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 282కు చేరింది. బోధన్ డివిజన్లోని సాలూర వద్ద ఆపే వారే లేరు. వివిధ అవసరాల నిమిత్తం అక్కడి ప్రజలు బోధన్, నిజామాబాద్ పట్టణాలకు వస్తుండగా, ఎంత మంది వైరస్‌ను మోసుకొస్తున్నారో తెలియడం లేదు. ఇదే డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద ధర్మాబాద్ ప్రాంతం నుంచి నిత్యం వందలాది మంది ప్రజలు వచ్చిపోతుంటారు. అక్కడా పట్టించుకునే వారు లేరు. దీంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయింది. ( చదవండి: కర్ఫ్యూల కలవరం: ఊరికాని ఊరిలో ఉండలేం.. ) -
సందేశే ఆతే హై: సెల్యూట్ చేయాల్సిందే!
నిజమైన హీరోలు అనగానే సైనికులే మనకు గుర్తుకువస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడే యోధులు వారు. బాధ్యతలు నెరవేర్చే క్రమంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఎంతో ఇష్టంగా దేశ సేవ చేస్తారు. కర్తవ్య నిర్వహణలో తలమునకలై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భరతమాతను కాపాడుతూ ఉంటారు. అయితే సాధారణ మనుషులకు ఉన్నట్లుగానే.. వాళ్లకు కూడా భావోద్వేగాలు ఉండటం సహజమే. కాస్త విరామం దొరికితే చాలు ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు చూసుకుంటూ కాస్త సేద తీరుతారు. ఆప్తుల సమాచారం, ప్రియమైన వారి సందేశాలు చదువుకుంటూ తన్మయత్వంలో మునిగిపోతారు. తమ రాక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగా ఎదురుచూస్తున్నారోనన్న విషయాన్ని తలచుకుంటూ ఉద్వేగానికి లోనవుతారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన బార్డర్ సినిమాలోని ‘సందేశే ఆతే హై’ పాటలో ఇలాంటి భావోద్వేగాలను చక్కగా చూపించారు. (చదవండి: సరిలేరు మీకెవ్వరు.. జవాన్లపై ప్రశంసలు) ఇక శుక్రవారం ఆర్మీ డే సందర్భంగా.. ఓ యువకుడు దేశ సరిహద్దుల్లో గిటార్ వాయిస్తూ ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. ఓ యువతి కూడా అతడితో గొంతు కలిపి పాటను మరింత మధురంగా మార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సైతం దీనిని రీట్వీట్ చేయడం విశేషం. ఇక.. ‘‘ఇలాంటి సందేశాలు వస్తాయి.. ఇంటికి ఎప్పుడు వస్తారు అంటూ వాళ్లు మనల్ని అడుగుతూ ఉంటారు’’ వంటి పంక్తులతో సాగే ఆ పాట చాలా మంది ప్లేలిస్టులో ఆల్‌టైం ఫేవరెట్‌గా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. मेरा भारत। ❤️ pic.twitter.com/jQWiGVestr — Bhaiyyaji (@bhaiyyajispeaks) January 15, 2021 -
శత్రువుల మధ్య చిగురించిన స్నేహం!
అల్ఉలా: సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. ఆయనకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. యూఎస్‌కు నమ్మకమైన మిత్రులుగా ఉన్న ఈ రెండు దేశాలకు మధ్య చాలా సంవత్సరాలుగా పొసగడం లేదు. ఈ వివాదానికి తెరదించుతూ రెండు దేశాలు తమ సరిహద్దులు తెరుస్తున్నట్లు ప్రకటించాయి. గల్ఫ్ అరబ్ నేతల వార్షిక సమావేశం అల్ఉలాలో జరగనుంది. ఇరాన్‌తో సంబంధాలు, ఇస్లామిస్టు గ్రూపులకు ఖతార్ సాయాన్ని నిరసిస్తూ నాలుగు అరబ్ దేశాలు (ఈజిప్టు, యూఏఈ, సౌదీ, బహ్రైన్) 2017 నుంచి ఖతార్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. వీటిని గాడిన పెట్టేందుకు షేక్ తమిమ్ యత్నించనున్నారు. అమెరికా, కువైట్‌లు ఖతార్‌కు ఇతర అరబ్ దేశాలకు మధ్య సత్సంబంధాల కోసం మధ్యవర్తిత్వం నెరిపాయి. రాజీకి ఖతార్ ఎలాంటి ప్రతిపాదనలు ఒప్పుకున్నది ఇంకా తెలియరాలేదు. గల్ఫ్ ఐక్యత తిరిగి సాధించేందుకు తాము కృషి చేస్తామని ఖతార్ మంత్రి అన్వర్ గారాఘ్ష్ చెప్పారు. తాజా సమావేశాల్లో సౌదీతో ఖతార్ రాజు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చని ఓ అంచనా. ఖతార్‌తో సత్సంబంధాలు సాధించడం ద్వారా బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వంతో బంధం బలోపేతం చేసుకోవాలని సౌదీ యోచిస్తోంది. యెమెన్‌తో యుద్ధం, ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం నేపథ్యంలో సౌదీకి యూఎస్ సాయం ఎంతో అవసరం ఉంది. అయితే ఇప్పటికీ టర్కీ, ఇరాన్‌తో ఖతార్‌కు మంచి సంబంధాలుండడం, టర్కీ మరియు ఖతార్‌లు ముస్లిం బ్రదర్‌హుడ్‌కు మద్దతు ఇవ్వడం వంటివి అరబ్ దేశాలను ఆందోళనపరుస్తూనే ఉన్నాయి. అరబ్‌దేశాల బహిష్కరణతో ఖతార్ ఎకానమీ బాగా దెబ్బతిన్నది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై ఖతార్ అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
చైనాకు మరోసారి గట్టి హెచ్చరికలు పంపిన భారత్
-
సయోధ్యతోనే సరిహద్దులు భద్రం
భారత్ చైనా సరిహద్దులలోని తూర్పు లదాఖ్, గల్వాన్ నదీలోయలలో జరిగిన ఘర్షణతో ప్రాణనష్టం జరిగి, దేశమంతా ఒక ఉద్వేగం అలుముకుంది. చైనా వ్యతిరేక ప్రచారం పెచ్చుమీరి, యుద్ధం విరుచుకుపడుతుందన్న భావావేశాలు, ప్రతీకారేచ్ఛలు వచ్చాయి. ఇరుదేశాల మిలటరీ అధికారులు, దౌత్యవేత్తలు చర్చించి, తాత్కాలికంగానైనా ఉద్రిక్తతలు సడలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పొరుగునున్న దేశాలతో మైత్రి, సయోధ్యతోనే మన సరిహద్దులు భద్రంగా ఉంటాయి. భారత్ చైనా మైత్రిని కోరే రెండు దేశాల మధ్య చిర శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి. బ్రిటిష్ పాలకులు తమ వలసపాలనా కాలంలో, ఏకపక్షంగా సరిహద్దు గీతలు గీసి సృష్టిం చిపోయిన వివాదం ఇది. ఇంతవరకు భారతదేశానికి, చైనాకు మధ్య ఇరువురూ కలిసి అంగీకరించిన ‘సరిహద్దుల నిర్ణయం’ జరగలేదు. ఎవరి ప్రాంతం ఎవరి అధీనంలో ఉంది అని ఉజ్జాయింపుగా చెప్పే వాస్త్తవాధీనరేఖ పట్ల కూడా రెండు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేదు. కనుక వాస్తవాధీన రేఖ ఏదో తెలియందే, నిర్ణయించుకోందే ఎవరు దురాక్రమిస్తున్నదీ ఎలా చెప్పగలం? ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఎదుటి పక్షం వారి వాదనల సమంజసత్వాన్ని అంగీకరించగల రాజకీయ విజ్ఞత ఉండాలి. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను తీర్చడానికి వాస్తవ ప్రాతిపదికగా, చైనాపట్ల సయోధ్యగల ఇరుగుపొరుగు వారిగా జీవించే అవకాశాలను అన్వేషించాలి. అన్ని అక్రమ మార్గాలతో, కుట్రలతో ఆనాడు బ్రిటిష్ వారు సాధించి, అందించిన అన్ని ‘భూభాగాలు మావే’ అనే వైఖరి భారత పాలకులు అనుసరించడం భావ్యం కాదు. ‘భూభాగాలు చర్చనీ యాంశం కాదు’ అన్న నాటి నెహ్రూ వైఖరిని ఇప్పటికైనా వదిలి దీనిపైనే చర్చించాలి. ఏకపక్షంగా సరిహద్దులు నిర్ణయించుకోవడం, మనవని చెప్పుకునే ప్రాంతాలను విస్తరించుకోవటం, వాటిని వివాదంలో ఉన్నాయని ఒప్పుకుంటూ కూడా సైన్యాలతో, గస్తీ దళాలతో నింపి సైనిక శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి ‘ముందుకు దూసుకుపోయే’ నెహ్రూ విధానం వల్లనే 1962లో యుద్ధం జరిగింది. ఇప్పటికయినా ఆ విధానం వీడి సర్దుబాటు ధోరణితో, పరస్పర ప్రయోజనకరంగా మొత్తం సరిహద్దును నిర్ధారించుకోవాలి. దీనికి ప్రాతిపదికగా చైనా గతం నుంచీ అనేక ప్రతిపాదనలు చేసింది. తూర్పు హద్దుల్లో అరుణాచల్ ప్రాంతంపై ఇండియాకున్న పాలనాధికారాన్ని తాము గుర్తిస్తామనీ, అలాగే పశ్చిమ భాగాన ఆక్సాయ్ చిన్ ప్రాంతంపై చైనాకున్న వాస్తవ పాలనాధికారాన్ని భారత్ గుర్తించాలనీ చైనా ప్రతిపాదించింది. ఇందిర, రాజీవ్ గాంధీ, వాజ్‌పేయి కాలంలో సహకారాన్ని పెంచుకునే ఒప్పం దాలు వ్యాపార వాణిజ్య బంధాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు కూడా చైనాతో కలిసి చర్చించి శాశ్వత పరి ష్కారం చేసుకోవాలి. ఈలోగా దేశంలో చైనా వ్యతి రేక భావనలు పెంచిపోషిస్తే అది సమస్య పరిష్కారానికి అడ్డంకిగా మారుతుంది. ‘చైనా పెట్టు బడులు, ఎగుమతులపై ఆంక్షలు, నిషేధాలు అంతి మంగా భారత ఆర్థిక వ్యవస్థకే నష్టదాయకంగా పరిణమిస్తాయి’ అనే ఆర్థికవేత్తల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రపంచీకరణ స్థితిలో ఏ దేశమైనా పరస్పర ఆశ్రితంగానూ, పరస్పరప్రయోజనకరంగానూ ఉండే తన జాతీయ విధానాలు అవలంభించాలి. ప్రాంతీయ సహకారం, ప్రపంచశాంతి లక్ష్యం గల విదేశాంగ విధానంతో చైనా సహా మన పొరుగు రాజ్యాలన్నిటితో పంచశీల సూత్రాల వెలుగులో వ్యవహరించాలి. ‘విస్తరణ వాదం కాదు వికాసపథం’ అన్న ప్రధాని మోదీ పలుకులకు ఆచరణలో అర్థం కల్పించి తదనుగుణంగా వ్యవహరించాలి. కరోనా కల్లోలంతో అస్తవ్యస్తంగా తయారైన ఆర్థిక వ్యవస్థను ప్రజోపయోగకరంగా తీర్చిదిద్దవలసిన సమయంలో అరకొరగా ఉన్న నిధులను యుద్ధ తయారీకి, క్షిపణి వ్యవస్థల బలోపేతానికి తరలించడం భారత ప్రజానీకంపై పెనుభారమే. కనుక వివాదాలు పరిష్కరించుకుని, వైషమ్యాలు లేని ఇరుగుపొరుగుల మైత్రిని సాధించాలి. సామాన్య ప్రజల భాగ్యోదయానికి కృషి చేయడమే దేశభక్తి. అలాంటి దేశభక్తిపరుల వల్లనే సరిహద్దులు భద్రంగా ఉంటాయి. డా.ఎస్. జతిన్‌కుమార్ వ్యాసకర్త భారత చైనా మిత్ర మండలి జాతీయ కార్యవర్గ సభ్యులు మొబైల్ : 98498 06281 -
ఆస్ట్రేలియాకు వలసలపై కోవిడ్ ఎఫెక్ట్
మెల్బోర్న్: కోవిడ్–19 మహమ్మారి ఈ ఏడాది ఆస్ట్రేలియా వలస వెళ్లాలనుకున్న వేలాది మంది.. ముఖ్యంగా భారతీయుల ఆశలపై నీళ్లు చల్లింది. ఆస్ట్రేలియాకు 2018–19 సంవత్సరంలో 2.32 లక్షల మంది వలస వెళ్లగా కోవిడ్ ఆంక్షల కారణంగా 2020–21 సంవత్సరంలో ఆ సంఖ్య కాస్తా 31 వేలకు పడిపోయిందని ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం, సరిహద్దుల మూసివేత వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వలసలపై కోవిడ్–19 తీవ్ర ప్రభావం చూపిందని ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం 7 లక్షల మంది భారతీయులున్నారు. నిపుణులైన భారతీయులే ఆస్ట్రేలియా ప్రధాన ఉద్యోగ వనరు. అంతేకాదు, 90 వేల మంది భారతీయులు ఆస్ట్రేలియాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. విదేశీ ప్రయాణాలపై నిషేధం తొలగించే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తెలిపింది. -
పెళ్లిళ్లకు వేదికగా సరిహద్దు చెక్‌పోస్ట్
చెన్నై : తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యంలోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్ బుధవారం పండగ శోభను సంతరించుకుంది. సాధారణంగా ఆ చెక్‌పోస్ట్ ద్వారా నిత్యం ఇరు రాష్ట్రాల మధ్య సరకు రవాణా జరుగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ చెక్‌పోస్ట్ మూడు పెళ్లిళ్లకు వేదికగా మారింది. ఇలా మూడు పెళ్లిళ్లు ఒకే రోజు కొంత విరామంతో జరగడం విశేషం. వేదక్కని-ముత్తప్పరాజ్ కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు, తమిళనాడుకు చెందిన ముగ్గురు అబ్బాయిలతో పెళ్లిళ్లు నిశ్చయమయ్యాయి. అయితే అదే సమయంలో కరోనా లాక్డౌన్ విధించడంతో వారు తొలుత వివాహలను వాయిదా వేసుకున్నారు. అయితే కరోనా ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడంతో పెద్దలు తమ పిల్లలు ఎలాగైనా జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తెలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు.. వారి వారి తల్లిదండ్రులు ఇరు రాష్ట్రాల సరిహద్దులో పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇలా ముగ్గురు వధూవరులు.. అధికారులు అనుమతితో, పెద్దల ఆశీర్వాదంతో బోర్డర్ చెక్‌పోస్ట్ వద్ద ఏకమయ్యారు. ఇందుకు వారి కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కస్తూరి-నిర్మల్‌రాజ్ దాదాపు రెండు గంటల వ్యవధిలోనే ఈ మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుకన్య-మణికందన్, వేదక్కని-ముత్తప్పరాజ్, కస్తూరి-నిర్మల్‌రాజ్ జంటలు వివాహ బంధంతో ఏకమయ్యాయి. అయితే కరోనా నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని వారు ముందుగానే శానిటైజ్ చేసుకుని అక్కడికి తీసుకువచ్చారు. పెళ్లి తర్వాత నూతన వధువులు.. తమిళనాడులోకి తమ తమ అత్తవారి ఇళ్లకు చేరిన తర్వాత వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇదే చెక్‌పోస్ట్ వద్ద జూన్ 7వ తేదీన కూడా ఓ పెళ్లి జరిగింది. -
చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జి
డెహ్రాడూన్: ప్రొక్లెయినర్‌ను తీసుకుని ఓ భారీ వాహనం వంతెనపైనుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. వాహనంతోపాటు అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ 40 అడుగుల లోతులో పడిపోయారు. గాయాలపాలైన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలోని మున్సియారి ప్రాంతంలో సోమవారం జరిగింది. రివులేట్ నదిపై 2009లో ఈ వంతెన నిర్మించారు. ఇది భారత్-చైనా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. (చదవండి: పతంజలి కరోనా మందుకు బ్రేక్!) వంతెన సామర్థ్యం 18 టన్నులు ఉండగా.. ప్రొక్లెయినర్, లారీతో కలిపి మొత్తం బరువు 26 టన్నులకు చేరిందని పోలీసులు తెలిపారు. వంతెన బలహీనంగా ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నప్పటికీ లారీని అలానే పోనిచ్చారని వెల్లడించారు. వాహన డ్రైవరుపై కేసు నమోదా చేశామని అన్నారు. ఇక డ్రైవర్ పరిస్థితి నిలడకగా ఉండగా, క్లీనర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసత్రి వర్గాలు తెలిపాయి. వంతెన కూలిపోవడంతో దాదాపు 15 ఊళ్లకు రాకపోకలు బంద్ అయ్యాయి. కొత్త వంతెన నిర్మించాలంటే రెండు వారాలు పడుతుందని జిల్లా అధికారులు తెలిపారు. (చదవండి: మార్గమధ్యలో కరోనా.. అంతా పరుగో పరుగు!) -
లభించని ఈ–పాస్.. సరిహద్దులోనే వివాహం
చెన్నై, టీ.నగర్: ఈ–పాస్ లభించకపోవడంతో కేరళ సరిహద్దులో మంగళవారం శంకరన్ కోవిల్‌కు చెందిన ఇంజినీర్‌కు వివాహం జరిగింది. కరోనా వైరస్ కారణంగా తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల మధ్య రవాణ సౌకర్యాలు నిలిపివేశారు. అత్యవసర పనులకు మాత్రమే ప్రభుత్వం ఈ–పాస్‌లు అందిస్తోంది. ఇది వరకే శంకరన్ కోవిల్, వెంకటాచలపురం ఉత్తర వీధికి చెందిన అరవింద్ (29)కు కేరళ రాష్ట్రం పత్తనందిట్ట జిల్లాకు చెందిన ప్రశాంతి (23)తో వివాహం నిశ్చయమైంది. వివాహం రోజు సమీపించగా వారికి ఈ–పాస్ లభించలేదు. ఈ క్రమంలో కేరళలో ఉన్న వధువు, శంకరన్ కోవిల్లో ఉన్న వరుడు కేరళ సరిహద్దు అయిన అరియంగావు చెక్‌పోస్టు సమీపంలోకి బంధువులతో సహా మంగళవారం చేరుకున్నారు. వీరంతా ముఖాలకు మాస్కులు ధరించారు. అక్కడున్న నారాయణగురు మంత్రం అనే ప్రాంతంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహ కార్యకమానికి తక్కువ సంఖ్యలో కుటుంబీకులు, బంధువులు హాజరై వధూవరులకు ఆశీస్సులందించారు. ఆ తరువాత అధికారుల సాయంతో వధూవరులు ఇరువురు శంకరన్ కోవిల్ బయలుదేరారు. -
సరిహద్దుల్లో తీవ్ర అలజడి
న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం మంగళవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సరిహద్దులో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ చెలరేగింది. గాల్వాన్‌లోయ ప్రాంతంలో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగింది. సరిహద్దు వివాదంలో ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. మరికొంతమంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చైనా సైనికులకూ కొందరికి గాయాలయ్యాయి. సరిహద్దులో చైనా చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా లదాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య గతకొంత కాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, భారత్-చైనా సరిహద్దులో కాల్పులు జరగలేదని, ఇరు సేనల మధ్య ఘర్షణ జరిగిందని భారత్ పేర్కొంది. (‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’) ప్రభుత్వ నివేదికల ప్రకారం.. ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా.. భారత జవాన్లపై డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా అలజడి నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. చైనా దాడులను తిప్పికొట్టే విధంగా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. (లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ) -
ప్రతిష్టంభన వీడేనా..!
-
డ్రాగన్‌పై మండిపడ్డ అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ పట్ల చైనా దుందుడుకు వైఖరిని అమెరికా దుయ్యబట్టింది. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌కు వ్యతిరేకంగా చైనా దూకుడు ఆందోళనకరమని అమెరికా సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్ ఎలియట్ ఏంగెల్ అన్నారు. నిబంధనలకు అనుగుణంగా దౌత్యపరంగా సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్యలను చైనా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా వైఖరి సహేతుకం కాదని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా పొరుగు దేశాలను అణిచివేసే వైఖరిని చైనా ప్రదర్శిస్తోందని ఏంగెల్ వ్యాఖ్యానించారు. దేశాలన్నీ ఒకే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. బలవంతుడిదే రాజ్యం అనే ప్రపంచంలో మనం లేమని చైనా గుర్తెరగాలన్నారు. చదవండి : అమెరికాను కమ్మేసిన ఆందోళనలు -
సరిహద్దు మూసివేత..భారీగా ట్రాఫిక్ జామ్
ఛండీగర్ : దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు పెరుగుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒకటి. అంతేకాకుండా డిల్లీ సరిహద్దులకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ కరోనా విజృంభిస్తుంది. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి గురువారం రాష్ర్ట హోం మంత్రి అనిల్ విజ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ నమోదైంది. ప్రజలు ఒక్కసారిగా గుమిగూడటంతో వాహనాల రద్దీ పెరిగింది. హర్యానాలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఢిల్లీకి లింక్ ఉన్నవేనని అనిల్ విజ్ పేర్కొన్నారు. అందువల్లే దేశ రాజధానితో సరిహద్దు ప్రాంతాన్ని మూసివేస్తున్నామని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు . (బయటికొచ్చినా దొంగ పనులు మానలేదు ) హర్యానాలోని గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపట్ , జ్జార్ జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఫరీదాబాద్ జిల్లాలో గరిష్టంగా ఏడుగురు కోవిడ్ బారినపడి చనిపోయారని, గుర్గావ్, సోనిపట్‌లో ఒక్కో మరణం సంబవించినట్లు రాష్ర్ట ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇప్పటివ రకు గురుగ్రామ్‌లో గత 24 గంట్లోనే 68 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇక దేశ వ్యాప్తంగా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతూ ప్రపంచంలోనే కరోనా ప్రభావిత దేశాల్లో 9వ స్థానానికి ఎగబాకింది. ఒక్కరోజులోనే 7,466 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,65,799 కి చేరుకున్నట్లు పేర్కొంది. (కరోనా: మరణాల్లో చైనాను దాటిన భారత్ ) -
అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. సరిహద్దులో పెళ్లి
సాక్షి, అన్నానగర్: తేని జిల్లాకి చెందిన ప్రశాంత్ (25)కు.. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకి చెందిన గాయత్రి (19)కి ఈ నెల 24న పెద్దలు వివాహం నిశ్చయించారు. కేరళలో పెళ్లి చేయాలని ఇరుకుటుంబాలు ముందుగానే అనుకున్నారు. లాక్డౌన్ కారణంగా వరుడి కుటుంబానికి ఈ పాస్ లభించలేదు. దీంతో ఇరు కుటాంబాలు రాష్ట్ర సరిహద్దుకు చేరుకుని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేశారు. అధికారులు అనుమతించని కారణంగా ఎవరి రాష్ట్రానికి వారు వెళ్లిపోయారు. చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? -
ఏపీ సరిహద్దుల్లో నిఘా పెంచిన పోలీసులు
-
సరిహద్దులో చెక్ పెడదాం
సాక్షి, నారాయణపేట: సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు, మద్యం తరలింపునకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో అడ్డుకట్ట వేయాలని పేట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ కలెక్టర్ కూర్మారావు అన్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సరిహద్దు అయిన పేట శివారులోని జలాల్పూర్ స్టేజీ సమీపంలో చెక్‌పోస్టును పేట ఎస్పీ చేతన, యాద్గీర్ ఎస్పీ సోనియావనే రిషికేశ్ భగవాన్‌లతో కలిసి పరిశీలించారు. అనంతరం జలాల్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇరు రాష్ట్రాల అధికారుల తో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో కలెక్టర్లు మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. తెలంగాణ నుంచి వెళ్లి, వచ్చే వాహనాలను ఈ ప్రాంత పోలీసులు పరిశీలించి వాటిని రిజిష్ట్రర్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే కర్ణాటక నుంచి వచ్చి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు రికార్డు చేయాలన్నా రు. ఏదైనా అనుమానాలు వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల్లో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ 11 న ఎన్నికలు ముగిసినా 23 వరకు చెక్‌పోస్టును కొనసాగించాలని ఆదేశించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరు రాష్ట్రాల పోలీ సులు అధికారులు, సిబ్బంది సహకరించుకోవాలని కోరారు. సమావేశంలో పేట సీఐ సంపత్‌కుమార్, ఎక్సైజ్ సీఐ నాగేందర్, ఎంపీడీఓ వెంకటయ్య, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఏపీ సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టివేత
సాక్షి, చెన్నై: హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూండి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులో రెండు సూట్ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నీరజ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. -
మేరా బాలీవుడ్ మహాన్
నీవొక సైనికురాలివి... నేనొక సైనికుడిని ప్రత్యక్షంగా దేశాన్ని ప్రేమించి గళమెత్తి యుద్ధం చేసే సైనికులం మనం చేతిలో గన్ను లేకపోవచ్చు.. ఖడ్గం ఉండకపోవచ్చు కానీ మన చప్పట్లతో వీర జవాన్ల గుండెల్లో ధైర్యం నింపే సైనికులం మనం కుర్చీ అంచున కూర్చుని దేశభక్తిని ధ్వనించే గుండె మనది. సినిమా థియేటర్లో వినిపించే హోరు మనది స్వాతంత్య్రం వచ్చింది. ‘క్విట్ ఇండియా’, ‘వందేమాతరం’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘జైహింద్’, ‘స్వరాజ్ మేరా జన్మ్ సి«ద్ అధికార్ హై’ వంటి నినాదాలతో నాయకులు ప్రజలను ఉర్రూతలూగించి, లెక్కలేనన్ని త్యాగాలతో స్ఫూర్తి నింపి భారతమాత దాస్యశృంఖలాలను పెళ్ళగించి అవతల పారేయగలిగారు. దేశం ఉత్సాహంగా అడుగు ముందుకేసింది. ‘ఆరామ్ హరామ్ హై’ అంటూ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విరామమెరగక దేశ నిర్మాణంలో పడ్డారు. మరోవైపు అప్పటికే యవ్వనంలోకి అడుగుపెట్టిన హిందీ సినిమా ఆ స్ఫూర్తిని, ఆ తర్వాత అవసరమైన మార్గదర్శనాన్ని, ఆనాటి త్యాగాలను వీలువెంబడి వెండితెర మీద ప్రత్యక్షం చేస్తూ తాను నింప గల ఉత్సాహం తనూ నింపింది. ఎన్నో చిత్రాలు వచ్చాయి. కొన్ని మేలిమి ముత్యాలుగా నిలిచాయి. మదర్ ఇండియా... నయా దౌర్ భారతదేశం అంటే రైతు. భారతదేశం అంటే పంటచేను. భారతదేశం అంటే పల్లెసీమ. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశ గ్రామీణ చిత్రం ఎలా ఉందో చూపుతూ, భారతీయ రైతు స్త్రీ విముక్తే అసలైన దాస్య విముక్తి అని ప్రతిపాదిస్తూ ‘మదర్ ఇండియా’ (1957) సినిమా వచ్చింది. నర్గిస్ నట జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ సినిమా సంఘ వ్యతిరేకం అయితే ఈ దేశం కోసం సొంత బిడ్డను కూడా బలి ఇవ్వడానికి భారత మాతృమూర్తి వెనుకాడదని చెప్పి తేజస్సుతో నిండిన సందేశాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘నయా దౌర్’ (1957) దేశంలో జరుగుతున్న యాంత్రికీకరణ, పారిశ్రామికీకరణ చర్చించింది. దేశీయ మూలాలను పదిలంగా ఉంచుతూ మార్పును స్వాగతించాలని సూచించింది. దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమాలో ఓపి నయ్యర్ చేసిన ‘సాథీ హాత్ బఢానా’... అనే పాట కలిసి మెలిసి ముందుకు అడుగువేసేందుకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప బృందగీతం. హకీకత్.. బోర్డర్... లక్ష్య యుద్ధక్షేత్రం ఎలా ఉంటుందో తెలియకపోతే అసలైన దేశభక్తి ఎలా ఉంటుందో అర్థం కాదు. దేశం కోసం లేశమాత్రంగా ప్రాణం త్యాగం చేయడం ఎలా ఉంటుందో అర్థం కాదు. అందుకే బాలీవుడ్ మన దేశం ఎదుర్కొన్న యుద్ధాలను తన కథలుగా చేసుకుంది. 1962 వార్‌ను కథాంశంగా ‘హకీకత్’ (1964) తీసింది. ఇందులోని ‘కర్ చలే హమ్ ఫిదా’... పాట ఇవాళ్టికీ పర్వ దినాలలో మొగుతూ నరనరాల ఉద్వేగం నింపుతూనే ఉంటుంది. ఆ తర్వాత 1971 భారత–పాకిస్తాన్ల యుద్ధ నేపథ్యంగా ‘బోర్డర్’ (1997) వచ్చింది. సన్నిడియోల్, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాలో ‘సందేశే ఆతేహై’.. పాట కుటుంబాలకు దూరంగా ఉండే సైనికుల వేదనను అశ్రువుల్లో చుట్టి వినిపిస్తుంది. ఇక దేశం చూపిన అతి గొప్ప సాహసం ‘కార్గిల్’ యుద్ధం. మన సైనికుల వీరత్వాన్ని చూపే ఈ యుద్ధం నేపథ్యంలో ‘లక్ష్య’ (2004) సినిమా వచ్చింది. ఫర్హాన్ అఖ్తర్ ఇందులో హీరో. భగత్‌సింగ్... సుభాష్... మంగళ్‌పాండే దేశం దేశనాయకులను ఎలా మర్చిపోదో బాలీవుడ్ కూడా మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన ఆ అమరవీరులను బాలీవుడ్ తన శక్తిమేరకు చూపించే సగటు ప్రేక్షకుడికి వారిని మరింత చేరువ చేసింది. భగత్ సింగ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) అజయ్ దేవగణ్‌కు గొప్ప పేరు తెచ్చి పెట్టింది. సుభాస్ చంద్రబోస్ సమగ్ర జీవితాన్ని శ్యామ్ బెనగళ్ ‘బోస్: ది ఫర్గాటెన్ హీరో’ (2005)గా తీశాడు. ఇక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ హీరో అయిన మంగళ్‌పాండే జీవితాన్ని అదే పేరుతో 2005లో కేతన్ మెహతా ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించాడు. సర్దార్ పటేల్ జీవితాన్ని పరేశ్ రావెల్ అభినయిస్తే దేశీయ భాషల్లో అంబేద్కర్ జీవితం వచ్చింది. హిందూస్తానీ... వెడ్నెస్ డే ఇక దేశంలోని అంతర్గత సమస్యలైన అవినీతి ఉగ్రవాదం వంటి సమస్యలను కూడా బాలీవుడ్ చర్చించింది. శంకర్ తీసిన ‘హిందూస్తానీ’ (1996), నసీరుద్దీన్ షా నటించిన ‘వెడ్నెస్ డే’ (2008) చాలా ప్రతిభావంతంగా ఆ సమస్యలను చర్చించి ప్రేక్షకులను ఆలోచింప చేశాయి బాలీవుడ్ ఇంతటితో ఆగలేదు. సర్జికల్ స్ట్రయిక్స్‌ను కూడా కథాంశంగా తీసుకుని ‘ఉడి’ (2019) వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. రాబోయే రోజులలో మరెన్నో బయోపిక్‌లో గత కాలపు దేశ ఘనతలు వెండితెరను అలంకరించనున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ మనం మేరా భారత్ మహాన్ అనుకోవాలి. ఇండియా జిందాబాద్ అని గట్టిగా నినాదం ఇవ్వగలగాలి. ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం. ఉప్కార్... పూరబ్ ఔర్ పశ్చిమ్ ఆ తర్వాత నటుడు మనోజ్ కుమార్ వచ్చి రెండు మూడు ముఖ్యమైన సినిమాలు తీశాడు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇటు కిసాన్, అటు జవాన్ ఇద్దరూ శక్తిమంతంగా ఉండాలనే లాల్‌బహదూర్ శాస్త్రి నినాదాన్ని ఊతంగా తీసుకొని ‘ఉప్కార్’ (1967) సినిమా తీశాడు. ‘ఏ దేశ్ కీ ధర్తీ’... పాట ఈ మట్టిలో మణులూ మాణిక్యాలు పండించడానికి స్వేదజలాన్ని చిందించే రైతుకు చేసిన శాల్యూట్ అని చెప్పవచ్చు. అదే సమయంలో మనోజ్ కుమార్ ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమా కూడా తీశాడు. స్వాతంత్య్రం వచ్చిందనే అత్యుత్సాహంలో ఇబ్బడి ముబ్బడిగా పాశ్చాత్య ప్రభావానికి లోనై మన సంస్కృతిని దెబ్బ తీయడానికి యువత ప్రభావితం కావద్దని చెబుతూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు గొప్పగా నచ్చింది. చక్ దే ఇండియా.. భాగ్ మిల్కా భాగ్... దంగల్ మరో వైపు క్రీడల ద్వారా దేశభక్తిని నింపే ప్రయత్నం కూడా బాలీవుడ్లో జరిగింది. మహిళా హాకీ జట్టులో స్ఫూర్తి నింపే ‘చక్ దే ఇండియా’ (2007) సినిమా ఘన విజయం సాధించింది. షారుక్ ఖాన్ నటించడంతో ఈ సినిమా యువతను క్రికెట్ నుంచి ఆ ఆటవైపు చూసేలా చేసింది. ‘ఫ్లయింగ్ సిక్’గా పేరుగాంచిన మిల్కాసింగ్ జీవితం ‘భాగ్ మిల్కా భాగ్’ (2013)గా రావడం ఒక ముఖ్య సన్నివేశం. ఫర్హాన్ అక్తర్ ఈతరం ప్రేక్షకులకు తెలియని మిల్కాసింగ్‌ను గొప్పగా తెర మీద చూపించగలిగాడు. ఇక ఏ దేశంలో అయితే స్త్రీలను వంటింటి పరిమితం చేస్తారనే పేరు ఉందో ఏ దేశంలో అయితే స్త్రీలను అణిచి ఉంచుతారనే ప్రచారం ఉందో ఆ దేశంలో నుంచి బాక్సింగ్ చేసే అమ్మాయిని ‘మేరీ కోమ్’ (2014)లో, కుస్తీ ఆడే ఆడపిల్లను ‘దంగల్’ (2016)లో చూపి దేశ మహిళల ఘనతకు ఒక నివాళి అర్పించగలింది. దంగల్ -
ఖమ్మం చత్తీస్‌గఢ్ సరిహద్దులో హృదయవిదారకర ఘటన
-
సరిహద్దుల్లో సైనికులతో కలిసి..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. తొలుత బుధవారం ఉదయం కేదార్నాథ్ చేరుకోనున్న ప్రధాని కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి ఆలయ పునర్నిర్మాణ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం దేశ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుని సైనికులతో ముచ్చటిస్తూ వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. కాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రధానికి దీపావళి శుభాకాంక్షలు తెలపడంపై స్పందిస్తూ ప్రతి ఏటా దీపావళి రోజు తాను సరిహద్దులను సందర్శించి సైనికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతానని, ఈరోజు సైతం దివాళీ నాడు తమ వీర సైనికులతో సమయం వెచ్చిస్తానని, వీటికి సంబంధించిన ఫోటోలను రేపు సాయంత్రం షేర్ చేస్తానని మోదీ ట్వీట్ చేశారు. 2014లో ప్రధానిగా తొలి దీపావళిని ఆయన సియాచిన్‌లో సైనిక జవాన్లతో జరుపుకున్నారు. ఇక తదుపరి ఏడాది 1965 ఇండో-పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంజాబ్ బోర్డర్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక 2016లో ఇండో-టిబెటన్ బోర్డర్లో సరిహద్దు అవుట్‌పోస్ట్‌లో దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌లోని గురెజ్‌లో సైనికులతో మాటామంతీ నిర్వహిస్తూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. -
దేశంలోనే తొలి ‘సొరంగ’ రైల్వే స్టేషన్ !
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్పూర్–మనాలి–లేహ్ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాగ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించనున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్’ మాత్రం ఇదేకానుంది. ‘బిలాస్పూర్–మనాలి–లేహ్ మార్గంలో జరిపిన తొలి సర్వే ప్రకారం..కీలాగ్ స్టేషన్‌ను సొరంగంలో నిర్మిస్తాం’ అని ఉత్తర రైల్వే చీఫ్ ఇంజినీర్ డీఆర్ గుప్తా తెలిపారు. 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్ స్టేషన్ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. 465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా. ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఆ గట్టా.. ఈ గట్టా..!
సాక్షి, అమరావతి: ఆంధ్రా–కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. నాది ఆ గట్టు అంటే.. కాదు నాది ఈ గట్టు అంటూ రెండు రాష్ట్రాలు దశాబ్దాలుగా వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాలు అటవీ సరిహద్దు (గట్టు)ను తేల్చు కోలేకపోతున్నాయి. దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఎస్జీఐ) ఇరు రాష్ట్రాలతో చర్చలు సాగించినా సరిహద్దు సమస్య తేలలేదు సరికదా దీని నిర్ధారణకు దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో కూడా అంతుపట్టడం లేదు. దీనిని తేల్చడం కోసం హైదరాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్‌లో పలుమార్లు ఇరు రాష్ట్రాల అటవీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. 1916 అటవీ సరిహద్దును ప్రామాణికంగా తీసుకుని సర్వే చేయాలని ఆంధప్రదేశ్.. తమ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ)ని ప్రామాణికంగా తీసుకోవాలని కర్ణాటక పట్టుబడుతూ వచ్చాయి. వీటిని ఆధారంగా (బేస్‌లైన్)గా తీసుకుంటే సరిహద్దు నిర్ధారణ అసాధ్యమని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం (జూలై 23న) రెండు రాష్ట్రాల ప్రతినిధులతో డెహ్రాడూన్‌లో జరిగిన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఈ వివాదానికి ఎలాగైనా ముగింపు పలకాలని ఎస్జీఐ భావిస్తోంది. వివాదం ఎప్పటిది? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బళ్లారి ప్రాంతం ఉండేది. ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు 1953లో బళ్లారి ప్రాంతం కర్ణాటకలో (అప్పుడు మైసూర్)లో కలిసింది. దీంతో బళ్లారి రిజర్వు ఫారెస్టును ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల మధ్య విభ జించాల్సి వచ్చింది. 1896 నాటి బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ప్రామాణికంగా తీసుకుని కర్ణాటక–ఆంధప్రదేశ్ మధ్య అభయారణ్యంలో సరిహద్దును ఖరారు చేసుకుందామని అప్పట్లో మౌఖికంగా అంగీకరిం చారు. ఇలాగైతే శాస్త్రీయంగా ఉంటుందని ఎస్జీఐ నిర్ణయానికి వచ్చి అభిప్రాయాలు తెలియజేయాలని ఇరు రాష్ట్రాలకు ఎస్జీఐ లేఖలు రాసింది. మొన్నటి వరకూ జీసీపీని ప్రామాణికంగా తీసుకోవాలని వాదిస్తూ వచ్చిన కర్ణాటక.. 1896 నాటి బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ప్రామాణికంగా తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదంటూ ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంది. మైనింగ్ సంస్థల వివాదంతో.. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి, డిహరేహల్ గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో మైనింగ్ లీజులు తీసుకున్న సంస్థలు కర్ణాటక రాష్ట్రంలోని అటవీ భూమిలో కూడా తవ్వకాలు సాగించాయనే అంశం వివాదాస్పదంగా మారింది. దీంతో ఇది సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. రెండు రాష్ట్రాల సహకారంతో సర్వేచేసి 12 వారాల్లోగా సరిహద్దును ఖరారు చేయాలని ఎస్‌జీఐని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన ఉమ్మ డి సర్వేలో ఏపీ పరిధిలోని 600 ఎకరాల వరకూ కర్ణాటక ఆక్రమించిందని తేలింది. దీనిని కర్ణాటక అంగీకరించలేదు. సరిహద్దు నిర్ధారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మరో నెలలో ముగుస్తుండడంతో ఎలాగైనా ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఎస్జీఐ నిర్ణయించింది. 2 రాష్ట్రాలను ఒప్పించేందుకు ఈనెల 23న డెహ్రాడూన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై రాష్ట్ర అటవీ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘1916 అటవీ సరిహద్దును ప్రామాణికంగా తీసుకోవాలని గతంలో డిమాండు చేస్తూ వచ్చాం. 1896 బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ఆధారంగా తీసుకోవాలన్న జీఎస్ఐ అభిప్రాయానికి సమ్మతి తెలపాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అభిప్రాయాన్ని సోమవారం జరిగే సమావేశంలో తెలియజేయనున్నాం’ అని తెలిపారు. -
కశ్మీర్ సమస్యకు పరిష్కారం మహిళలయితే!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు మరో ఇద్దరు అమాయకులు మరణించారు. ఇది కశ్మీర్‌కు కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్తపాతమే. కశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోవడం. కశ్మీర్ ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోవడం సాధారణ విషయమే. ఈ సంక్షోభంలో పాత్రదారులు నలుగురు లేదా నాలుగు శక్తులు. ఒకటి భారత రాజకీయ నాయకత్వం, రెండూ భారత సైన్యం, మూడు పాక్– దేశీయ టెర్రరిస్టులు. నాలుగు కశ్మీర్ ప్రజలు. భారత రాజకీయ నాయకత్వం దేశీయ, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడానికి లేదా టెర్రరిస్టులకు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా నిలువరించేందుకు తెర ముందు నుంచి కాకుండా తెర వెనక నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తోంది. ఇక భారత సైన్యం స్థానిక టెర్రరిస్టులను ఎప్పటికప్పుడు అణచివేయడంతోపాటు అప్పుడప్పుడు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేస్తోంది. ఎంత మంది టెర్రరిస్టులు హతమైనా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇటు సైన్యం, అటు టెర్రరిస్టుల మధ్య నలిగి పోతున్నది అక్కడి ప్రజలే. ఎన్ని కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నా అవి కనుమూసి తెరిచే లోగా కాలగర్భంలో కలిసిపోవచ్చు. కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని బట్టి కశ్మీర్లో కొద్ది ఎక్కువ కాలం, కొద్ది తక్కువ కాలం ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ రక్తపాతం మామూలే. ఈ సైకిల్ ఇలా తిరగాల్సిందేనా! కశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోయినా శాశ్వత శాంతికి సంధినొసిగే ఆస్కారాలే లేవా? కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అనే నినాదాన్ని భారత్ వదులుకోనంతకాలం కశ్మీర్‌కు శాశ్వత పరిష్కారం లేదన్న విషయం విజ్ఞులెవరికైనా తెల్సిందే. వాస్తవానికి ఒకప్పటి కశ్మీర్ రాజ్యంలో 40 శాతం భూభాగం భారత్ ఆధీనంలో, మరో 40 శాతం భూభాగం పాకిస్థాన్ ఆధీనంలో ఉండగా, మిగతా 20 శాతం భూభాగం చైనా ఆధీనంలో ఉంది. మన ఆధీనంలో ఉన్న భూభాగాన్ని మనం కశ్మీర్ అని, పాక్ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని మనం వ్యవహరిస్తున్నాం. అలాగే మనది అంటున్న కశ్మీర్‌ను పాకిస్తాన్ వారు ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అని వ్యవహరిస్తున్నారు. చైనా ఆధీనంలో ఉన్న 20 శాతం కశ్మీర్ భూభాగాన్ని ‘అక్సాయ్ చిన్’ అని చైనా వ్యవహరిస్తోంది. చైనా తెలివిగా కశ్మీర్ విషయంలో తన జోలికి రాకుండా పాకిస్థాన్‌కు మద్దతుగా పావులు కదుపుతూ వస్తోంది. మరోపక్క అదే పాకిస్థాన్‌తో కలిసి అద్భుతమైన ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని అంతగా పట్టించుకోని మనం ఎప్పుడూ పాకిస్థాన్‌తోనే గొడవ పడతాం. అది మరో మతానికి సంబంధించిన దేశం కావడమే కావొచ్చు. కశ్మీర్ దక్కడం వల్ల అటు పాకిస్థాన్‌కుగానీ, చైనాకుగానీ ఒరిగేదేమీ లేదు. మనకొచ్చే ప్రయోజనాన్ని పక్కన పెడితే కశ్మీర్ పేరిట మనం దేశ సంపదనే తగలేస్తున్నామని ఆర్థిక వేత్తలే తేల్చి చెప్పారు. కశ్మీర్ పేరిట భారత్ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తంలో సగంలో సగం మొత్తాన్ని పాకిస్థాన్‌కు భరణంగా ఇస్తే వాళ్లే మనకు కశ్మీరును పల్లెంలో పెట్టి ఇచ్చే వారన్న వ్యాఖ్యానాలు కొత్త కాదు. ఇప్పుడు ఆ దేశ పరిస్థితే మారిపోయింది. బలహీనమైన రాజకీయ నాయకత్వమే కావచ్చు. అక్కడ టెర్రరిస్టు ముఠాలు విచ్చల విడిగా పెరిగి పోయాయి. పాకిస్థాన్ చెబితే వినే దశలో అసలే లేవు. అందుకని ఆ ముఠాలను ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్ లక్ష్యం కోసం పాకిస్థాన్ పంపిస్తోంది. ఇక చైనా ఆర్థిక కారిడార్ పేరుతో అగ్నేయ పాకిస్థాన్ అంతట విస్తరించింది. బలుచిస్థాన్లో చిన్న తిరుగుబాటును భారత్ ప్రోత్సహించినా వెంటనే అణచివేసే పరిస్థితికి చైనా చేరుకుంది. భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకొని దాడి చేయగల సామర్థ్యాన్నీ సాధించింది. కశ్మీర్ కారణంగా ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న భారత్ ఆర్థిక వ్యవస్థలో చైనాకు అందనంత దూరంలోనే ఆగిపోతోంది. ఇక్కడే కొత్తగా ఆలోచించాలి! మరి కశ్మీర్‌కు పరిష్కారం ఏమిటీ? ఇక్కడే కొత్తగా ఆలోచించాలి. ‘భిన్న ఫలితాలను ఆశిస్తూ చేసిందే చేస్తూ చేసిందే చేస్తూ పోయేవాడు పిచ్చివాడే’ అవుతాడు అని ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ఎప్పుడో చెప్పారు. ఇంటా బయట చర్చలు, ఒప్పందాలు ఇప్పటి వరకు పెద్దగా ఫలితాలివ్వలేదు. శత్రువు, శత్రువు మధ్య ఉండే ఉమ్మడి విషయాన్ని కనుగొనాలి. సైన్యం, మిలిటెంట్ల పోరులో ఎవరు మరణించిన బాధ పడుతున్నది ఎక్కువగా మహిళలే. కశ్మీర్ మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ జాఫర్ హతమైనప్పుడు కడుపుకోతకు గురైనది ఆయన తల్లే. ఓ ఆదర్శమూర్తిగా స్థానికంగా ఆమెకు ఎంతో పేరుంది. ఆమెకున్న పేరు కారణంగానే ఆయన అంత్యక్రియల్లో కొన్ని లక్షల మంది కశ్మీర్ ప్రజలు పాల్గొన్నారు. జూన్ 15వ తేదీన భారత సైనికుడు ఔరంగా జేబ్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఆయన తల్లి కూడా అంతే బాధ పడింది. ఆ తల్లికి కూడా స్థానికంగా మంచి పేరుంది. ఇక్కడ ఇద్దరు తల్లులు అనుభవించిన బాధ ఒకలాంటిదే. ఇలాంటి తల్లులను కలుపుకుపోయి శాంతి చర్చలు జరిపితే. మగవాళ్లు జరిపే శాంతి చర్చలు 30 శాతం ఫలించే అవకాశం ఉంటే మహిళలు జరిపే శాంతి చర్చలు 65 శాతం ఉంటాయని పలు అంతర్జాతీయ శాంతి ఒప్పందాలే తెలియజేస్తున్నాయి. పైగా మహిళలు కుదుర్చుకునే శాంతి ఒప్పందాలు 15 ఏళ్లకు పైగా నిలబడే అవకాశాలు 34 శాతం ఉన్నాయట. అపార రక్తపాతంతో వచ్చే విజయాలు మహిళలకు సాధారణంగా రుచించవని, వారు అన్ని అంశాలను పిల్లల భవిష్యత్తు కోణం నుంచే చూస్తారుకనుక వారి మధ్య చర్చలు ఎక్కువగా ఫలిస్తాయని సామాజిక విశ్లేషకులు ఇదివరకే తేల్చారు. కశ్మీర్‌లోని ఇరువర్గాల బాధిత మహిళలను, మహిళా సంఘాలను, సామాజిక మహిళా కార్యకర్తలను శాంతి చర్చల ప్రక్రియలోకి తీసుకరావడం వల్ల ఆశించిన ఫలితం రావచ్చు! -
అపర కాళిలా మారిన ఆడపులి
సరిహద్దుల గొడవలు దేశాలకు, మనుషులకే కాదు.. మృగాలకూ ఉంటాయి. ఇక్కడ వచ్చిన గొడవ కూడా అలాంటిదే. సాధారణంగా పులులు, సింహాల్లో మగవి ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. ఇక్కడ ఓ మగ పులి కూడా అలాగే ప్రయత్నించింది. ఓ ఆడపులి అధీనంలోని ప్రాంతంలోకి ప్రవేశించింది.. అయితే, ఆ ఆడపులి అబల కాదు.. అపర కాళి.. చూశారుగా.. కుంగ్‌ఫూ పాండాలాగ అంతెత్తున ఎలా లేచిందో.. ఫైటింగ్ పోజు ఎలా పెట్టిందో.. కొంతసేపు రెండూ అరివీర భయంకరంగా కొట్టేసుకున్నాయి. చేసేది లేక ఆ మగ పులి వెనక్కి తగ్గింది. ఈ చిత్రాలను కేమ్‌చంద్ జోషి అనే ఫొటోగ్రాఫర్ రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్కులో తీశారు. ఇలాంటి ఫొటోలు తీసే చాన్స్.. జీవితంలో ఒక్కసారే లభిస్తుందని.. తనకా అవకాశం దక్కడం ఆనందంగా ఉందని జోషి చెప్పారు. -
జాగింగ్ చేస్తూ సరిహద్దులు దాటేసింది!
వాషింగ్టన్: బీచ్‌లో జాగింగ్ చేస్తూ ఓ యువతి అనుకోకుండా దేశ సరిహద్దులనే దాటేసింది.ఫ్రాన్సుకు చెందిన సిండెల్లా రోమన్(19) ఈ ఏడాది మేలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం వైట్‌రాక్ ప్రాంతంలో ఉంటున్న తన తల్లిని కలుసుకునేందుకు వచ్చింది. సముద్ర తీరంలో జాగింగ్ చేస్తూ.. కెనడా సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించింది. ఆమె వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో గస్తీ దళాలు అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో అక్రమ వలసదారుల కోసం ఏర్పాటుచేసిన డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. చివరకు ఆమె తన తల్లి క్రిస్టిన్ ఫెర్న్‌కు ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆమె వెంటనే పాస్‌పోర్టు, ఇతర పత్రాలను తీసుకొచ్చి అధికారులకు చూపించినా.. వాటిపై కెనడా అధికారుల ధ్రువీకరణ లేదని మెలికపెట్టారు. రెండు వారాల పాటు సిండెల్లాను అక్కడే ఉంచారు. అవసరమైన పత్రాలను అందజేశాక జూన్ 6వ తేదీన ఆమెను వదిలిపెట్టారని కెనడా మీడియా తెలిపింది. -
జాగింగ్ చేస్తూ.. అనుకోకుండా ‘హద్దులు’ దాటింది!
అందమైన సముద్రతీరం.. అక్కడక్కడ బీచ్‌లు.. సీఫుడ్ రెస్టారెంట్లు.. ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం.. జాగింగ్ చేయాలనుకునేవారికి ఇంతకన్నా భూతలస్వర్గం ఇంకొటి ఉండదేమో.. హాయిగా జాగింగ్ చేస్తూ ముందుకు సాగిన 19 ఏళ్ల సెడెల్లా రోమన్ కూడా ఇలాగే భావించి ఉంటుంది. కెనడా బ్రిటిష్ కొలంబియాలోని వైట్‌రాక్ తీరం మీదుగా ఆమె జాగింగ్ చేసుకుంటూ దక్షిణ దిశగా సాగిపోయింది. అందమైన సెమియామూ తీరం అందాలను చూస్తూ.. నెమ్మదిగా పరిగెత్తుతూ వెళ్లిన ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటి అమెరికాలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో తన వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో సెడెల్లా చిక్కుల్లో పడింది. అసలే కెనడా సరిహద్దుల నుంచి వచ్చే అక్రమ వలసదారులపై ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మామూలుగా అయితే.. హెచ్చరికలతో వదిలిపెట్టే అధికారులు.. గత నెల 21న అనుకోకుండా సరిహద్దులు దాటిన సెడెల్లాను కస్టడీలోకి తీసుకున్నారు. 22న ఆమెను అరెస్టు చేసి.. వాషింగ్టన్ టకోమాలోని నార్త్‌వెస్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దీంతో డిటెన్షన్ సెంటర్లో జూన్ 5 వరకు రెండువారాలపాటు ఆమె మగ్గాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లో నివాసముండే సెడాల్లా రొమన్.. బ్రిటిష్ కొలంబియాలోని నార్త్ డెల్టాలో ఉండే తన తల్లిని చూడటానికి వచ్చింది. వైట్‌రాక్ తీరం వద్ద అందాలను వీక్షిస్తూ ఆమె అనుకోకుండా సరిహద్దులు దాటింది. ఇక్కడ నుంచి అమెరికా-కెనడా మధ్య సరిహద్దు మార్క్ మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అప్పుడప్పుడు పర్యాటకులు ఇక్కడ సరిహద్దులు దాటి అందాలు వీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారిని ఇమ్మిగ్రేషన్ అధికారులు మందలించి వదిలేస్తూ ఉంటారు. కానీ సెడెల్లా రుమన్ మాత్రం అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించిందని, ఆమె అక్రమ వలసదారు అంటూ అమెరికా అధికారులు నానా హంగామా చేసి.. ఆమెను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెను విడుదల చేసిన అధికారులు తమ చర్యను సమర్థించుకునే కారణాలు చెప్తున్నారు. సెడెల్లా రొమన్ (ఫేస్బుక్ ఫొటోలు) -
బోర్డర్
-
ఆగడం లేదు
సూళ్లూరుపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చనే ప్రకటనతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఇదే సరిహద్దు పోలీసు స్టేషన్లకు వరంగా మారింది. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని తడ, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలాల్లో పలు ప్రాంతాలను డంపింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని రాత్రి వేళల్లో తమిళనాడుకు ఇసుక తరలిస్తున్నారు. పగలంతా ట్రాక్టర్ల ద్వారా మిక్సర్ ప్లాంట్ల పేరుతో ఇసుకను తీసుకెళుతున్నారు. రాత్రి వేళల్లో జేసీబీలతో లారీల్లో లోడింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. కఠినతరం చేయడంతో.. తమిళనాడులో ఎక్కడా ఇసుక తవ్వకూడదనే నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రా నుంచి వెళ్లే ఇసుక మీదే ఆధారపడి అక్కడ భవన నిర్మాణాలు చేస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల నుంచి శ్రీసిటీ, రామాపురం, బత్తులవల్లం పేరుతో పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసుకుని అక్కడినుంచి లారీల్లో ఇసుకను చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు తదితర ప్రాంతాలకు బాహాటంగా రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ యజమానికి ఒక్కో టీడీపీ నాయకుడు అండదండలు ఉండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 15 ట్రాక్టర్లు జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి, నెల్లూరు పెన్నా నది నుంచి అధికలోడుతో ఇసుకను చిత్తూరు జిల్లా బత్తులవల్ల వద్ద ఉన్న మిక్సర్ప్లాంట్కు తోలుతున్నారు. అక్కడ డంప్ చేసి రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారనే సమాచారంతో వరదయ్యపాళెం పోలీసులకు మంగళవారం ఆకస్మికంగా దాడులు చేసి సుమారు 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 ట్రాక్టర్ల వరకు నెల్లూరు జిల్లాకు చెందినవే కావడం విశేషం. పట్టుబడిన ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకుని యజమానులను పిలిపించుకుని విచారిస్తున్నారు. ఆంధ్రా ఇసుకకు డిమాండ్ జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నది ఇసుక మంచి డిమాండ్ ఉంది. పెన్నా, స్వర్ణముఖి ఇసుక టన్ను రూ.450 నుంచి రూ.500కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో ట్రాక్టర్‌కు 6 నుంచి 8 టన్నుల వరకు లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి లాంటి నగరాల్లో ఒక్క లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. వరదయ్యపాళెం మండలాల సరి«హద్దులోని సంతవేలూరు రోడ్డు సమీపంలో మంగళంపాడు చెరువుకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం, బత్తులవల్లం, శ్రీసిటీ తదితర ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాల నుంచి లారీలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. -
సరిహద్దులో నిఘా పటిష్టం
తాండూరు: జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు సరిహద్దు వద్ద నిఘా పెంచారు. ఇరు రాష్ట్రాల మద్య ఉన్న సరిహద్దుల వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గత 28వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. దీంతో తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాలు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు కావడంతో ఇరు ప్రాంతాల సరిహద్దు మధ్య పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 17న నోటిఫికేషన్, నామినేషన్ చివరి తేదీ 24, ఉప సంహరణ గడువు 27, పోలింగ్ తేదీ మే 12, ఓట్ల లెక్కింపు మే 15న నిర్ణయించారు. మే 16వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. కరెన్సీ, మద్యంపై ప్రత్యేక నిఘా.. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా సరిహద్దు జిల్లా నుంచి కరెన్సీ, మద్యం తరలించకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈసీ ఆదేశాల మేరకు సరిహద్దు నిఘా పెంచారు. గత ఎన్నికల్లో జిల్లా నుంచి మద్యం రవాణా జోరుగా సాగింది. ఈ సారి మద్యం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు సరిహద్దులో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలు కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ప్రతి మార్గంలోను నిఘా పటిష్టం చేశారు. -
కాల్పుల్లో ఉగ్రవాది మృతి
శ్రీనగర్ : భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఈ సంఘటన ఆదివారం జమ్మూ కశ్మీర్ రాష్ర్టం షోపియాన్ జిల్లాలోని పాహ్నూలో జరిగింది. కాపలా నిర్వహిస్తోన్న మొబైల్ చెక్ పోస్టు వాహనంపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరపటంతో ప్రతిగా భద్రతాబలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించినట్లు రక్షణా శాఖ అధికార ప్రతినిథి కల్నల్ రాజేష్ కలియా ధృవీకరించారు. ఉగ్రవాదుల వేట కొనసాగుతోందని వెల్లడించారు. -
ఎల్వోసీ సమీపంలో పాక్ హెలికాప్టర్ చక్కర్లు
న్యూఢిల్లీ: సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచూ ఉల్లంఘిస్తోన్న పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్ ఒకటి బుధవారం ఉదయం 9.45 గంటలకు నియంత్రణ రేఖ(ఎల్వోసీ)కు 300 మీటర్ల సమీపంలోకి చొచ్చుకొచ్చింది. అనంతరం కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటన పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్లో జరిగినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎల్వోసీకి సమీపంలోకి వచ్చిన పాక్ హెలికాప్టర్‌పై భారత బలగాలు ఎలాంటి కాల్పులు జరపలేదనీ, పాక్ వైపు నుంచి కూడా ఎలాంటి దాడి జరగలేదని వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను భారత ఆర్మీ బలగాలు స్పష్టంగా చూడగలిగాయన్నారు. ఎల్వోసీకి కి.మీలోపు హెలికాప్టర్లు, 10 కి.మీ.లోపు ఎలాంటి విమానాలు ఎగరరాదని ఇరుపక్షాలు గతంలో అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు. -
పాకిస్తాన్ కాల్పులు...నలుగురు జవాన్ల మృతి
-
భారత్, బంగ్లా మధ్య ‘కంచె’ హిట్టా, ఫట్టా?
సాక్షి, న్యూఢిల్లీ : అవాంఛనీయ వలసలను నిరోధించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎత్తైన గోడలను నిర్మించాలని నిర్ణయించారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు భారత్ సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ట్రంప్ జాతి పేరిట మెక్సికోలను అడ్డుకోవాలనుకుంటే ఇక్కడ భారత్‌లో మతం పేరిట వలసలను అడ్డుకోవాలనుకుంటోంది. మెక్సికోలు రేపిస్టులు, నేరస్థులు, మాదక ద్రవ్యాల వ్యాపారులని ట్రంప్ ఆరోపిస్తుండగా, ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లింలను చొరబాటుదారులని, భూ ఆక్రమణదారులని, ఆవుల స్మగ్లర్లని, వారి నుంచి టెర్రరిస్టుల ముప్పు కూడా పొంచి ఉందని భారత్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న హిందువులను మాత్రం శరణార్థుల క్యాటగిరీ కింద చూస్తోంది. అమెరికాకు, మెక్సికోకు మధ్య ఎనిమిది అడుగుల ఎత్తైన గోడ ఉండాలని, అక్కడక్కడ కరెంట్ షాక్ కొట్టే వ్యవస్థ ఉండాలని ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కూడా ఇలాగే ఉండాలని మన భారత దేశం ఇదివరకే నిర్ణయించింది. భారత్‌కు, బంగ్లాదేశ్ మధ్య 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇది కొండలు, గుట్టలతోపాటు దట్టమైన అడవులు, సుడులు తిరిగే నదీ నదాలతోని కూడి ఉంది. ఇందులో 70 శాతం సరిహద్దు ప్రాంతం భారత్‌కు చెందిందా లేదా బంగ్లాదేశ్‌కు చెందిందా? లేదా అక్కడే స్థిరపడిన స్థానికులదా? అన్నది స్పష్టంగా తేల్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మొదటి విడత కింద 854 కిలోమీటర్ల వరకు సరిహద్దు గోడ లేదా కంచె నిర్మించాల్సిందిగా 1989లో భారత ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడత కింద 2,502 కిలోమీటర్లు కంచె నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, ఇప్పటికే 1930 కిలోమీటర్లు పూర్తయిందని కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కంచె నిర్మాణం వల్ల ఇప్పటికే అనేక గ్రామాల ప్రజలు కంచెకు ఇటు ఉండగా, వారి భూములు కంచెకు అవతల ఉండిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పొలం పనులకు వెళ్లాలంటే కంచె గేటులో నుంచి సైనికుల అనుమతి తీసుకొని వెళ్లాలి. అనుమతి తీసుకొని రావాలి. ఆలస్యమైతే గేటు మూత పడుతుంది. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలి. గేటుకు అటూ, ఇటూ ఉండే బంధువుల పరిస్థితి మరీ దారణంగా ఉంది. సైనికుల చేతులు తడిమితేగానీ వారు ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదు. ఇక 48 కిలోమీటర్ల మేర పారుతున్న బ్రహ్మపుత్ర నదిని కలుపుకొని పలు ఉప నదుల వెంట 1,100 కిలోమీటర్ల సరిహద్దు కంచెను నిర్మించాల్సి ఉంది. దిగువ అస్సాంలోని ధూరి జిల్లాలో 300 కిలోమీటర్ల మేర సుందర్ బాన్ అడువులు ఉన్నాయి. ఈ అడవుల్లో భౌతిక కట్టడం నిర్మించడం అసాధ్యం. ఇన్ఫ్రా కిరణాల పిల్లర్లు, స్మార్ట్ సెన్సర్లను ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గమని నిపుణులు ఇదివరకే తేల్చారు. దాని వల్ల కూడా పూర్తి ప్రయోజనం నెరవేరదని చెప్పారు. ఒక లేజర్ కిలోమీటరుకు 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రయోగాత్మకంగా నాలుగు కిలోమీటర్లు నిర్మించారు. మిగిలిన 296 కిలోమీటర్ల పొడవున ఈ జనవరిలోగా పూర్తి చేయాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు ఏ మేరకు పనులు జరిగాయో ప్రభుత్వం చెప్పడం లేదు. ఇక నదులు, కొండలు ఉన్న 1100 కిలోమీటర్లలో సరిహద్దు కంచెను నిర్మించడం పూర్తిగా అసాధ్యం. ఆ ప్రాంతంలో నదుల సరిహద్దులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ‘ఇది ఇరుదేశాల మధ్య సరిహద్దు’ అన్నది తేల్చడం కష్టం. ఆ ప్రాంతాల్లో జనావాసా ప్రాంతాలు కూడా నదులు సరిహద్దులు మారినప్పుడల్లా తమ నివాస ప్రాంతాలను ఇటువైపు నుంచి అటు, అటువైపు నుంచి ఇటు మార్చుకుంటారట. అక్కడి ప్రజలకు ఏది భారత్ సరిహద్దో, ఏది బంగ్లా సరిహద్దో తెలియదట. ఇలాంటి ప్రజావాస ప్రాంతాలను ‘అంతర్జాతీయ పరివేష్టిత జనావాస ప్రాంతాలు లేదా బంగ్లాదేశ్ చుట్టూరా ఉన్న భారత ప్యాకెట్స్’ అని పిలుస్తారని డచ్ చరిత్రకారుడు విల్లెమ్ వ్యాన్ షెండెల్ తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని జనావాస ప్రాంతాల మధ్య ఒకే రకమైన సంస్కృతి ఉంటుందని, పైగా సరిహద్దుకు ఇవతలి గ్రామం ఉత్పత్తులను అవతలి గ్రామం, అవతలి గ్రామం ఉత్పత్తులను ఇవతలి గ్రామం కొనుగోలు చేస్తోందని, ఈ గ్రామాల మధ్య కంచె నిర్మిస్తే ఆ గ్రామాల ప్రజలు ఏమవుతారని షెండెల్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2017–18 ఆర్థిక బడ్జెట్లో బంగ్లా సరిహద్దులో ఫ్లడ్ లైట్ల కోసం 1327 కోట్లు, మౌలిక సౌకర్యాల కోసం 2,600 కోట్లు, 383 అదనపు ఔట్ పోస్టుల కోసం 15,569 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇంత సొమ్మును ఖర్చు పెట్టిన ఆశించిన ఫలితం ఉండదని షెండెల్ అంటున్నారు. బంగ్లా, భారత్ దేశాల మధ్య భౌతిక సరిహద్దులుకాదని, సామాజిక సరిహద్దులు బలంగా ఉన్పప్పుడే ఆశించిన ఫలితాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. -
పాకిస్తాన్ సైన్యంపై భారత ఆర్మీ ప్రతీకారం
-
కుప్పకూలిన గంగోత్రి బ్రిడ్జి
ఉత్తర కాశీ : భారత్-చైనాల మధ్య మధ్య ఉన్న ఏకైక వారధి గురువారం కుప్పకూలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకేసారి రెండు వాహనాలు దీనిపైకి రావటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. ఉత్తరకాశీ-చైనా సరిహద్దును కలుపుతూ ఈ వారధి ఉంది. ఈ వంతెన పైనుంచి ఒకసారి ఒక ట్రక్కు వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు. అయితే ఘటన సమయంలో రెండు వాహనాలు రావటంతో.. అధిక బరువు తట్టుకోలేక బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఉత్తరకాశీ జిల్లా న్యాయమూర్తి అశిష్ చౌహాన్ తెలిపారు. బ్రిడ్జి కూలిపోయి సంబంధాలు తెగిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని సిద్ధం చేయనున్నట్టు అధికారులు తెలిపారు. వంతెన కూలడంతో గంగోత్రి, మనేరి, హార్సిల్ సహా సుమారు 12 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కూలీలు, విద్యార్థలు మరో మార్గం లేక అవస్థలు పడ్డారు. ఉత్తరాఖండ్‌ను ముంచెత్తిన వరదల తర్వాత 2013 గంగోత్రి జాతీయ రహదారిపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ బ్రిడ్జిని నిర్మించింది. -
పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ‘బెర్లిన్’ గోడ
క్వెట్టా : బెర్లిన్ వాల్ తరహాలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో గోడ కట్టేందుకు పాకిస్తాన్ సమాయత్తమవుతోంది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు గ్రామాల్లో అత్యధికంగా ఫష్తూన్ తెగకు చెందిన గిరిజనులు నివాసముంటున్నారు. ఆఫ్ఘన్, పాకిస్తాన్ దేశాలుగా విడిపోయి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పటివరకూ వీరిని పట్టించుకున్న దాఖలాలు లేదు. ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో గోడ నిర్మించి.. తమ దేశం పరిధిలోని ప్రజలను లోపలకు ఆహ్వానించాలనుకుంటోంది. పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య 2,500 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతముంది. ఈ సరిహద్దు నుంచి ఉగ్రవాదులు దేశంలోపలకు చోరబడి విధ్వంసాలను సృష్టిస్తున్నారు.. వీరిని అడ్డుకునేందుకు బెర్లిన్ వాల్ తరహాలోనే గోడను నిర్మిస్తున్నట్లు పాక్ ప్రకటించింది. భారత్ నుంచి ఆఫ్ఘన్ విడిపోయిన తరువాత అంటే బ్రిటీష్ కాలంలో 1893లో ఏర్పాటు చేసిన డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ ఈ గోడను నిర్మిస్తోంది. పాకిస్తాన్ నిర్మించతలపెట్టిన గోడపై ఆఫ్ఘనిస్తాన్ అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. విభజిత గ్రామాలుగా పిలుస్తున్న వీటిలో ఫస్తూన్ తెగలోని పలువురికి పాస్‌పోర్టులు ఉన్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని చమన్ జిల్లాలోని 7 గ్రామాల ప్రజలు తరచూ సరిహద్దులు దాటుతూ ఉంటారు. వీరు పాకిస్తాన్ సార్వభౌమాధికారిన్ని అంగీకరించరని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బలూచిస్తాన్ ప్రజలను పూర్తిగా పాకిస్తాన్ ప్రజలుగానే గుర్తిస్తామని చమన్ జిల్లా సరిహద్దు ఫ్రాంటియర్ కార్ప్స్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ కల్నల్ మహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు కూడా గోడను నిర్మించడం వల్ల.. ఇటు వైపు ఉన్నది పాకిస్తాన్.. అటు వైపు ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ అని తేలిగ్గా గుర్తించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. సరిహద్దుల్లో గోడ నిర్మించాలని 1989నుంచి ప్రయత్నాలు జరుగుతున్నా.. అది ఇప్పటికి సాకారమయిందని ఆయన చెప్పారు. -
ఇండియా-చైనా యుద్ధం వస్తే ఎవరికి నష్టం!
భారత్-చైనా సరిహద్దులోని సిక్కిం సెక్టర్లోని డోక్లామ్వివాదం ఫలితంగా రెండు ఆసియా దేశాల మధ్య యుద్ధమే వస్తే చైనాకే ఎక్కువ నష్టమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రపంచ జనాభాలో 35 శాతం(260 కోట్లు) నివసించే ఈ రెండు భారీ దేశాలూ ఓ చిన్నపాటి సరిహద్దు గొడవతో అసలు పోరుకు దిగుతాయా? అన్నదే ప్రస్తుత ప్రశ్న. ఈశాన్య సరిహద్దులో భారత, చైనా సేనలు కేవలం 150 మీటర్ల ఎడంలో నిలబడి ఉన్నాయి. ఒకవేళ యుద్ధమే మొదలైతే పోరు ఒక్క సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, అరుణాచల్నుంచి జమ్మూకశ్మీర్వరకూ దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని నిపుణుల అంచనా. 1962లో మాదిరిగా పూర్తిస్థాయి యుద్ధమే జరిగితే చైనాకు ఎదురయ్యే అననుకూల పరిస్థితులు ఎక్కువ. చైనాకు 80 శాతానికి పైగా ముడి చమురు రవాణా జరిగే మలాకా జలసంధి(మలేసియా, ఇండొనేషియా మధ్య) అండమాన్దీవులకు సమీపంలో ఉన్న కారణంగా ఈ రవాణాపై యుద్ధం ప్రభావం పడుతుంది. అండమాన్నికోబార్దీవుల్లో భారత్‌కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది. పోరు సమయంలో చైనాకు ముడి చమురు నౌకల ప్రయాణం సాఫీగా సాగదు. ఇండియన్నేవీ చురుకుగా రంగంలోకి దిగితే, చైనా ఓడలు అండమాన్సముద్రం పక్క నుంచి పోవడం కష్టమే. భారత నేవీకున్న అతి పెద్ద స్థావరాల్లో ఇదొకటి. ఈ కారణంగానే 1999 కార్గిల్యుద్ధసమయంలో పాకిస్థాన్‌కు సాయం చేయడానికి చైనా ముందుకు రాలేదు. పొరుగు దేశాలన్నిటితోనూ చైనాకు తగవులే! చైనా చెప్పినట్టు డోక్లామ్వివాదం యుద్ధంగా మారితే, అది సిక్కిం సెక్టర్కే పరిమితం కాదనీ, భారత ఉత్తర సరిహద్దు యావత్తూ యుద్ధరంగమౌతుందని చైనా ఇటీవల హెచ్చరించింది. ఇదే నిజమైతే, చైనాపాకిస్థాన్ఆర్థిక కారిడార్ప్రాజెక్టులో భాగంగా పాక్ఆక్రమిత కశ్మీర్లో చైనా భారీగా పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక, పారిశ్రామిక మౌలిక సౌకర్యాలు భారత సేనల దాడులకు లక్ష్యంగా మారతాయి. అప్పుడు చైనా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే చైనా సర్కారు ఇక్కడ 4,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే, బర్మా రేవు చిట్టగాంగ్, మయన్నార్లోని కోకోస్కీలింగ్పోర్టులో చైనా ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ. ఇంకా ఇటీవల శ్రీలంకలోని హంబంతోతట్ రేవు, పాక్‌లోని గ్వాదర్పోర్టులో చైనా కొన్ని సౌకర్యాలు పొందడానికి ఒప్పందాలు కూడా చేసుకుంది. ఆఫ్రికా ‘కొమ్ము’ దేశం జిబూటీలో చైనా సైనిక స్థావరం శరవేగంతో పూర్తిచేస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఆరంభమయ్యాక ఈ ప్రాంతాలన్నీ భారత నౌకాదళ దాడుల పరిధిలోకి వస్తాయి. చైనాకు తన సరిహద్దుల్లోని 14 దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి. ఇప్పటివరకూ అదుపులో ఉన్న ఈ వివాదాలు ఒకసారి భారత్, చైనాల మధ్య పోరు మొదలైతే మళ్లీ వేడెక్కుతాయని అంచనా. ఇటీవల దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు కారణంగా అమెరికా, జపాన్సైతం ప్రత్యర్థులుగా మారాయి. భారత్‌తో యుద్ధంలో చైనా నేవీ నిమగ్నమైతే, దక్షిణ చైనా సముద్రంలో దాని పరిస్థితి బలహీనమౌతుందని రక్షణ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన తెలుగువారి ఔషధాల కంపెనీ గ్లాండ్ఫార్మాలోని 86 శాతం మూలధనవాటాను కొనుగోలు చేయడానికి చైనా ఫార్మా దిగ్గజం ఫోసన్ఫార్మా చేసిన ప్రతిపాదనకు ఈ డోక్లామ్గొడవ కారణంగా తాజాగా కేంద్ర సర్కారు అనుమతివ్వలేదని వార్తలొస్తున్నాయి. ఇండియాకూ ఇబ్బందులే! ఆసియాలో చైనా, జపాన్తర్వాత మూడో పెద్ద ఆర్థికశక్తిగా అవతరించిన భారత్‌కు కూడా చైనాతో తలపడితే కష్టాలు తప్పవు. చైనా అధీనంలోని టిబెట్ఎత్తయిన పీఠభూమి కావడంతో అక్కడ నుంచి పోరాటం జరిపే చైనా సైనిక దళాలకు ఇండియాపై దాడులు సులువని అంచనా. అతి శీతల వాతావరణమున్న సరిహద్దుల్లో భారత సాధారణ సైనిక దళాలు చాకచక్యంగా పోరుసాగించలేవనీ, అస్సాం రైఫిల్స్, ఇండోటిబెటన్బోర్డర్సెక్యూరిటీ ఫోర్స్వంటి ప్రత్యేక దళాలపై ఎక్కువ ఆధారపడాల్పి ఉంటుందని రక్షణరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అదీగాక చైనాను ఆనుకుని ఉన్న ఈశాన్య ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణాలు ఇంకా పూర్తికాకపోవడం కూడా ఇండియాకు యుద్ధకాలంలో ఇబ్బంది కలిగించే అంశమే. -
బోర్డర్ నటుల సందడి..
-
సరిహద్దు వద్ద రాకపోకలు బంద్
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా పూంచ్‌లో నియంత్రణ రేఖ వద్ద రాకపోకలను అధికారులు సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. పూంచ్–రావల్కోట్ బస్సు సర్వీసును నిలిపేశారు. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో నియంత్రణ రేఖ వద్ద ఉండే రెండంతస్తుల వ్యాపార నిర్వహణ కేంద్రం కూడా ధ్వంసమైంది. భారత్ నుంచి ఎటువంటి రెచ్చగొట్టే చర్యలూ లేకుండానే పాక్ కాల్పులు జరుపుతోందనీ, భారత దళాలు పాక్ కాల్పులకు గట్టిగా బదులిస్తున్నాయనీ, మన సైనికులంతా క్షేమంగానే ఉన్నారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని నమ్మాలనీ, పాక్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పాక్ దళాలు ఆదివారం కృష్ణగతి సెక్టార్‌లోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం ఉదయం పూంచ్‌లో 6.40 గంటలకే మళ్లీ కాల్పులు మొదలు పెట్టారు. 24 గంటలైనా గడవక ముందే రెండోసారి పాక్ కాల్పులు జరిపింది. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయనీ, పాక్ దళాలు ఆగి ఆగి కాల్పులు జరుపుతున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. -
భారత్ ఆ గోడను నిర్మించడం లేదట
జమ్మూ వద్ద గల భారత్-పాకిస్తాన్ బోర్డర్లో గోడను నిర్మించే ఆలోచనను భారత్ విరమించుకున్నట్లు తెలిసింది. చొరబాటుదారులను అడ్డుకునేందుకు స్మార్ట్ ఫెన్సింగ్ నిర్మించే యోచనలో ఉన్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. ఫెన్సింగ్‌కు అత్యాధునిక టెక్నాలజీతో సెన్సార్లను అమర్చనున్నట్లు తెలిపారు. 2015లో భారత్ వాల్ నిర్మించబోతోందనే చర్యలపై పాకిస్తాన్ యూఎన్ కౌన్సిల్‌ను ఆశ్రయించింది. మిలటరీ ఆపరేషన్స్‌కు ఇబ్బంది కలగొచ్చనే భారత ఆర్మీ కూడా అభ్యంతరం తెలిపింది. 2013లో హీరానగర్/సాంబా సెక్టార్లలో జంట దాడుల తర్వాత 179 కిలోమీటర్ల మేర గోడను నిర్మించాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా యోచించింది. అయితే, ప్రస్తుతం గోడ నిర్మాణానికి రెండు సమస్యలు అడ్డు వస్తున్నాయని సదరు అధికారి చెప్పారు. ఇంటిలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం, అక్కడి ప్రజలు ప్రదేశాన్ని ఖాళీ చేయడానికి ఇష్టపడకపోవడం ప్రధాన ఇబ్బందులుగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఒకవేళ గోడను నిర్మించదలుచుకుంటే కేవలం 25శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై హోంశాఖను ప్రశ్నించగా విస్తృతమైన ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టంను తయారుచేసేందుకు 24 గంటలు కసరత్తులు జరగుతున్నాయని పేర్కొంది. -
సరిహద్దుల్లో అప్రమత్తం
• 16 చోట్ల ప్రత్యేక చెక్ పోస్టులు గిరిజన గ్రామాల్లో ఆరా • ముమ్మరంగా తనిఖీలు అయ్యప్ప భక్తులకు తంటాలు కేరళ నుంచి తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశాలు ఉండడంతో సరిహద్దుల్లో అప్రమత్తంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం వ్యవహరించే పనిలో పడింది. పదహారు చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ, అనుమానితులు ఎవరైనా సంచరిస్తుంటే సమాచారం ఇవ్వాలని సూచించే పనిలో పడ్డారుు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకుని ఒకప్పుడు మావోరుుస్టులు తమ కార్యకలాపాల్ని సాగించిన విషయం తెలిసిందే. కొడెకైనాల్లో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో రాష్ట్రంలో మావోరుుస్టులు అన్న పేరుకు ఆస్కారం లేకుండా పోరుుంది. ఈ పరిస్థితుల్లో ఇటీవల కాలంగా చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మావోరుుస్టుల్ని ఉక్కుపాదంతో అణచి వేస్తుండడంతో, అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్లు మళ్లీ పశ్చిమ పర్వత శ్రేణుల్ని కేంద్రంగా చేసుకునే పనిలో పడ్డట్టుగా సంకేతాలు వెలువడుతూ వచ్చారుు. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆపరేషన్‌కు చర్యలు చేపట్టడంతో పశ్చిమ పర్వత శ్రేణుల్లో మళ్లీ కూంబింగ్ సాగుతూ వస్తున్నది. ఈ తనిఖీల్లో అజ్ఞాతంలో ఉన్న మావోరుుస్టు నాయకుడు రూబేష్, సైనాలతో పాటు ఐదుగురు పట్టుబడడం, తదుపరి అజ్ఞాత మావోరుుస్టులు ఒక్కొక్కరుగా పట్టుబడుతుండడంతో సరిహద్దుల్లో అప్రమత్తం వేట ముమ్మరం అరుుంది. పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న కోయంబత్తూరు, నీలగిరి, ఈరోడ్, తేని, తిరునల్వేలి జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో , సరిహద్దు చెక్ పోస్టుల్లో అప్రమత్తంగా వ్యవహరించే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో గురువారం కేరళలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోరుుస్టులు మరణించారు. మరో పది మంది వరకు పశ్చిమ పర్వత శ్రేణుల్లోకి దూసుకెళ్లిన సమాచారంతో సరిహద్దుల్లో మరింత అలర్ట్ చేస్తూ రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. కేరళలో తప్పించుకున్న మావోరుుస్టులు రాష్ట్రంలోకి చొరబడే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. పశ్చిమ పర్వత శ్రేణులపై అధికార వర్గాలు నిఘా పెంచారు. క్యూబ్రాంచ్, ప్రత్యేక బలగాలు శనివారం ఉదయం నుంచి జల్లెడ పట్టే రీతిలో గాలింపు తీవ్రతరం చేశారు. గిరిజన గ్రామాల ప్రజల వద్ద అనుమానితుల కోసం ఆరా తీస్తున్నారు.ఎవరైనా సంచరిస్తుంటే, తమకు సమాచారం ఇవ్వాలని సూచించి, అందుకు తగ్గ ఫోన్ నంబర్లను వారికి ఇస్తున్నారు. ఇక, అటవీ గ్రామాల్లో అనేక చోట్ల ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి, అటు వైపుగా వచ్చే వాహనాలను, అందులోని ఉన్న వాళ్లను తనిఖీల అనంతరం అనుమతించే పనిలో పడ్డారు. నీలగిరి జిల్లాల్లో అరుుతే, కోరంకుత్తు, హ్యారింగ్ టన్, వెల్లింగ్టన్, అప్పర్, లోయర్ భవానీ, కీన్న కొలవై, ఇలియ సిగై, ముత్తులి కేరళ సరిహాద్దుచెక్ పోస్టుల్లో భద్రతను మరింతగా కట్టు దిట్టం చేశారు. అలాగే, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల పరిధిలో అటవీ గ్రామాలను అనుసంధానించే విధంగా అనైకట్టు, మంగలై, పాలమలై, ముర్చి తదితర పదహారు ప్రాంతాల్లో కొత్తగా శనివారం చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సెంగోటై్ట చెక్ పోస్టులనూ భద్రతను మరింతగా పెంచారు. ఆయా గ్రామాల మీదుగా వెళ్లే చిన్నచిన్న రోడ్లలోనూ ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బంది ద్వారా వాహనాల తనిఖీలు సాగిస్తున్నారు. ఇక, డిఐజీ దీపక్ , ఎస్పీ రమ్యభారతి, ఏడీఎస్పీ మోహన్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఆయా చెక్ పోస్టుల్ని పరిశీలించారు. వాహనాల తనిఖీ ముమ్మరం చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కేరళ నుంచి వచ్చే, ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి వాహనం తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో ఈ తనిఖీలతో వారికి ఇబ్బందులు తప్పలేదు. కేరళ సరిహద్దుల్లో ఆ రాష్ట్ర పోలీసులు భద్రతా పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అక్కడ కూడా భక్తులకు తనిఖీల కష్టాలు తప్పడం లేదు. -
మేమున్నాం...
‘దేశం కోసం మీరున్నారు. మీ కోసం మేమున్నాము’ అని నటుడు నానా పటేకర్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో తమ విధులలో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) జవాన్లతో అన్నారు. బిఎస్ఎఫ్ ఆహ్వానం మీద జమ్ములోని కతువా ప్రాంతంలోని జవాన్లతో రోజంతా గడిపిన నానా పటేకర్ ‘నేను హీరోనే కాని నిజమైన హీరోలు మీరే’ అని వారిలో ఉత్సాహం నింపారు. ఇటీవల పాక్ దుశ్చర్యలకు బలైన సైనికుల కుటుంబాలను ఆయన కలిశారు. జమ్ములోని స్కూల్ విద్యార్థులను కలవడం చాలా సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు. జవాన్లను ఉత్సాహపరచడానికి తారాలోకపు అతిథులను ఆహ్వానించడం ఒక సంప్రదాయం. అందులో భాగంగానే విలక్షణ నటుడు నానా ఇలా సరిహద్దు దళాలను కలిశారు. -
సరిహద్దుల్లో జవాన్ల దీపావళి వేడుకలు
-
2018 కల్లా మొత్తం సరిహద్దును మూసేస్తాం
-
2018కల్లా కంచె పూర్తి
సరిహద్దు భద్రతపై రాజ్‌నాథ్ సమీక్ష * ఉగ్రవాదానికి ‘బ్రాండ్ పాకిస్తాన్’ ప్రతీక: జైట్లీ * పాక్‌ను టైస్టు దేశంగా ప్రకటించలేం: అమెరికా జైసల్మేర్/న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలిటెంట్ల చొరబాట్లను పూర్తిగా కట్టడి చేసేందుకు సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం జరుగుతోందని.. 2018 డిసెంబర్ కల్లా మొత్తం సరిహద్దును మూసేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన శుక్రవారం రాజస్తాన్ జైసల్మేర్‌లో సరిహద్దు భద్రతపై సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో సాంకేతిక పరిష్కారాలతో కూడిన భద్రత గ్రిడ్ ఏర్పాటుచేసేందుకు సరిహద్దు రాష్ట్రాలతో చర్చిస్తున్నామన్నారు. భేటీలో రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతర్జాతీయ ఉగ్రవాదానికి ‘బ్రాండ్ పాకిస్తాన్’ ప్రతీకగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అమెరికాలో అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాక్‌లోనే బయటపడుతున్నాయన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల స్వర్గధామాలను తుడిచిపెడతామని అమెరికా స్పష్టం చేసింది. పాక్‌ను ఉగ్రదేశంగా ప్రకటించబోమని.. అయితే ఈ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించటంలో తమ సాయం ఉంటుందని పేర్కొంది. కశ్మీర్ భారత్‌లో భాగం కాదు: పాక్ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న మోదీ సర్కారు ప్రకటనను తిరస్కరిస్తూ.. పాక్ పార్లమెంటు శుక్రవారం తీర్మానం చేసింది. లోయలో భారత ప్రభుత్వ నిరంకుశ విధానం వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించింది. అయితే.. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్‌తో చర్చలకు సిద్ధమేనంది. సింధూజలాల వినియోగంలోనూ భారత్ ఏకపక్షంగా వ్యవహరించజాలదని.. దీనిపై అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేస్తామని తెలిపింది. మరోవైపు, అఫ్గనిస్తాన్‌లో శాంతి నెలకొనేందుకు కశ్మీర్ అంశం కూడా కీలకమని పాక్, అఫ్గాన్లను వేర్వేరుగా చూడలేమని కశ్మీర్ వ్యవహారాలపై షరీఫ్ రాయబారి హుసేన్ అమెరికాకు తెలిపారు. కశ్మీర్లో శాంతి నెలకొనేంతవరకు పాక్, అఫ్గాన్‌లో శాంతి నెలకొనటం కష్టమన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై దుమారం న్యూఢిల్లీ: ఆర్మీ చేసిన సర్జికల్ దాడులతో కేంద్రం రాజకీయ లబ్ది పొందుతోందంటూ.. ‘రక్తం (ఆర్మీ)తో చేస్తున్న వ్యాపారం’(ఖూన్ కీ దలాలీ) అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ అమిత్ షా మండిపడ్డారు. ‘దలాలీ కాంగ్రెస్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలి యదు. బోఫోర్స్ నుంచి బొగ్గు స్కాం వరకు వ్యాపారం చేసుకున్నదెవరో రాహుల్ మరిచి పోయారా?’ అని ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. తన వ్యాఖ్యలు ఆర్మీకి వ్యతిరేకం కాదని.. ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న బీజేపీపైనేనని రాహుల్ తెలిపారు. -
సరిహద్దులో ఉద్రిక్తత
ఎల్వోసీ వద్ద పాక్ మానవ రహిత విమానాలు * కాల్పులతో కవ్విస్తున్న దాయాది * ఎలాంటి చర్యకైనా సిద్ధమే: బీఎస్ఎఫ్ డీజీ * గుజరాత్ తీరంలో పాక్ బోటు స్వాధీనం 9 మంది అరెస్టు న్యూఢిల్లీ/శ్రీనగర్: భారత ఆర్మీ సర్జికల్ దాడుల తర్వాత సరిహద్దుల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ జవాన్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుంటే.. అటు పాక్ వైమానిక దళం విమానాలతో సరిహద్దులో కార్యక్రమాలను గమనిస్తోంది. ‘సర్జికల్ దాడుల తర్వాత యూఏవీ (మానవరహిత వైమానిక వాహనాలు)లతో పాక్ పరిస్థితిని గమనిస్తోంది. తరచూ యూఏవీలు ఎల్వోసీకి దగ్గరగా వచ్చి వెళ్తుండటం చూస్తుంటే.. భారత బలగాలను అంచనా వేసేందుకే వచ్చాయనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నాం’ అని బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ కేకే శర్మ చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన భారత-బంగ్లాదేశ్ భద్రతా బలగాల ద్వైపాక్షిక చర్చల ముగింపులో శర్మ మాట్లాడారు. పాక్ సరిహద్దుల్లో భద్రతతోపాటు బంగ్లా సరిహద్దుల్లోనూ (ఉగ్రవాదులు చొరబడొచ్చన్న అనుమానంతో).. అప్రమత్తంగానే ఉన్నామన్నారు. ఎల్వోసీలో భూములున్న రైతులను అటువైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నామని.. సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించటం లేదన్నారు. బారాముల్లాలో ఉగ్రవాద ఘటనతో చొరబాట్లపై నిఘా తీవ్రం చేశామన్నారు. కాల్పులకు తెగబడిన పాక్.. సరిహద్దుల్లో 48 గంటల్లో పాక్ 8 సార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. భారత పోస్టులతోపాటు గ్రామస్తులపైనా షెల్లింగ్స్‌తో దాడులు చేసింది. అఖ్నూర్, నౌషేరా, రాజౌరీ సెక్టార్లతోపాటు పంజాబ్, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల సరిహద్దుల్లోనూ ఈ కాల్పులు జరిగాయి. వీటిని భారత బలగాలు తిప్పికొట్టాయి. సోమవారం రాత్రి సౌజియన్, షాపూర్-కెర్నీలలో పాక్ జరిపిన కాల్పుల్లో పలు దుకాణాలు ధ్వంసం కాగా.. ఐదుగురు పౌరులు గాయపడ్డారు. కాగా, ఆదివారం గుజరాత్ తీరంలో భారత సముద్రజలాల్లోకి వచ్చిన ఓ బోటులోని 9 మంది పాకిస్తానీలను భారత తీర గస్తీ దళం అదుపులోకి తీసుకుంది. మంగళవారం పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో రావి నదిలో ఓ పాకిస్తాన్ ఖాళీ బోటును భద్రతా దళం గుర్తించింది. రావినదిలో నీటి ప్రవాహం పెరగటంతో.. పాక్‌వైపునుంచి పడవ కొట్టుకొచ్చినట్లు భావిస్తున్నారు. త్రివిధ దళాలు సిద్ధమే.. పాక్‌పై మెరుపుదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిద్ధంగా ఉన్నాయని.. దూకుడుగా వెళ్లాలని కేంద్రం ఆదేశించిన మరుక్షణం మెరుపుదాడి మొదలవుతుందన్నారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో పౌరులకన్నా.. జవాన్లకే ఎక్కువ గాయాలయ్యాయని సీఆర్పీఎఫ్ డీజీ దుర్గాప్రసాద్ తెలిపారు. ‘సర్జికల్’పై రాజకీయ దుమారం న్యూఢిల్లీ: పాక్ ఉగ్ర కేంద్రాలపై భారత ఆర్మీ జరిపి సర్జికల్ దాడులపై రాజకీయ దుమారం లేచింది. ఇవి అసత్యమని, రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వీటిని చిత్రీకరించిందని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అనగా, దాడులపై ఆధారాలను కేంద్రం బయటపెట్టాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. కేజ్రీవాల్ భారత ఆర్మీపై నమ్మకంతో మాట్లాడాలన్నారు. దాడులపై అభ్యంతరం ఉన్నవారు పాక్ పౌరసత్వం తీసుకోవాలని మరో మంత్రి ఉమాభారతి హెచ్చరించారు. సంజయ్ వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. భారత గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
మొబైల్ గ్యాంబ్లింగ్ గుట్టురట్టు
– 16 మంది అరెస్టు –రూ.7.5 లక్షలు స్వాధీనం –నాలుగు కార్లు, 17 సెల్ఫోన్లు స్వాధీనం –ఆర్గనైజర్లు తిరుపతి వాసులు సత్యవేడు: తమిళనాడు– ఆంధ్రా సరిహద్దులోని దాసుకుప్పం పంచాయతీ చెరువు సమీపంలో మంగతాయి (లోపల, బయట) ఆడుతున్న 16 మందిని అరెస్టు చేసి రూ.7.5 లక్షలు, 17 సెల్ఫోన్లు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ నరశింహులు తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ దాసుకుప్పం సమీపంలోని చెరువు కట్ట సమీపంలో మొబైల్ గ్యాంబ్లింగ్ సభ్యులు మంగతాయి ఆడుతున్నట్లు బుధవారం మధ్యాహ్నం సమాచారం అందిందన్నారు. వెంటనే సర్కిల్ పరిధిలోని నలుగురు ఎస్ఐలతో కలిసి దాడి చేశామన్నారు. దాడిలో వైఎస్సార్ కడప జిల్లా రాయచోటికి చెందిన డి.రామిరెడ్డి(42), పి.శ్రీనివాసులు(46), వేరబల్లికి చెందిన వై.ధర్మారెడ్డి(29), సి.బాలకష్ణమరాజు(27), సాంపపల్లికి చెందిన ఎం.సురేంద్రరాజు(43), ఏఐవీ.ప్రసాద్(32), షేక్ హుసేన్(42), పి.ఈశ్వరయ్య(46), బి.ఈశ్వరయ్య(29), తిరుపతికి చెందిన సి.రామచంద్రారెడ్డి(60), కే.జయచంద్ర(21), కేపీ సునీల్(40), ఏ.విజయభాస్కర్‌రెడ్డి(60), ఎస్.జయచంద్ర(27), చిత్తూరు ఆర్సీపురానికి చెందిన కె.బాలప్రసాద్(37), వెదురుకుప్పానికి చెందిన ఈ.సుబ్రమణ్యం(29)ను అరెస్టు చేశామని పేర్కొన్నారు. గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్న తిరుపతి వాసులు తప్పించుకున్నారని తెలిపారు. తిరుపతి కేంద్రంగా మొబైల్ గ్యాంబ్లింగ్ జరుగుతోందని సీఐ తెలిపారు. దాడిలో ఎస్ఐలు మల్లేష్‌యాదవ్, షెక్షావలి, ఎన్‌పి. మునస్వామి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిందితులను గురువారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. 22ఎస్‌టివిడి07– -
భారత సరిహద్దుల్లో భద్రత పెంపు
న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దులనుంచి ఎవ్వరూ భారత్ లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించింది. అంతర్జాతీయ సరిహద్దులనుంచి భారత్ లోకి ప్రవేశించే మార్గాల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు దేశాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్తోం, మేఘాలయ ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి, ఆయామార్గాలనుంచి ఎవ్వరూ దేశంలోకి చొరబడకుండా చూడాలని అధికారులకు, భద్రతా బలగాలకు సూచించింది. ఢాకా దాడుల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ బంగ్లాదేశ్ దౌత్య అధికారులతోనూ, సెక్యూరిటీ ఏజెన్సీలతోనూ చర్చిస్తున్నారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అయితే అక్కడి భారతీయులంతా క్షేమంగానే ఉన్నట్లు ఢాకాలోని భారత హై కమిషన్ వెల్లడించింది. ఢాకాలోని గుల్షన్ ప్రాంతం హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్ పై శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో హోటల్లోని సిబ్బందితోపాటు, అక్కడున్న కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బందీలుగా ఉన్నవారిని రక్షించేందుకు సైనికులు 11 గంటలపాటు శ్రమించారు. భద్రతా దళాలు, ఉగ్రమూకలకు మధ్య జరిగిన పోరులో ఆరుగురు ఉగ్రవాదులు మరణించగా.. ఘటనలో మొత్తం 20 దాకా చనిపోయినట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. సెన్సేషన్లు సృష్టించడం టెర్రరిజం అంతానికి సహకరించదని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో మీడియా ఇతోధికంగా సహకరించాలని ప్రభుత్వం మీడియాకు సూచించింది. బంగ్లాదేశ్ ను స్నేహపూర్వక దేశంగా ఇప్పటికే గుర్తించామని, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది సైతం టెర్రరిజాన్ని అణచివేసేందుకు గట్టి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలిపింది. -
సాధ్యమైనంత తొందరగా సీలింగ్: సోనోవాల్
గుహవతి: అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇండో- బంగ్లా బార్డర్ కు యుద్ధ ప్రాతిపదికన సీలింగ్ వేయాలని బార్డర్ సెక్యూరిటీ పోర్స్(బీఎస్ఎఫ్) కు సూచించారు. బీఎస్ఎఫ్ అత్యన్నత స్థాయి అధికారులతో సమావేశమైన సోనోవాల్ అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు త్వరితగతిన కంచె నిర్మించాలని వారికి సూచించారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకో్వాలని పేర్కొన్నారు. లేజర్ వాల్ నిర్మాణం గురించి ఆలోచించాలని, నదీజలాలు, బార్డర్ వెంబడి భద్రతకు సీలింగ్ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. బార్డర్ వెంబడి సీలింగ్ అనేది ఎన్నికల్లో తాము హామీ ఇచ్చామని కూడా సోనోవాల్ పేర్కొన్నారు. అస్సాం బంగ్లాదేశ్ తో 42 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. -
మందకృష్ణ పర్యటనకు ఏపీ పోలీసుల చెక్
ఏపీలో తిరగరాదంటూ సరిహద్దు దాటించి వదిలేసిన వైనం ఇబ్రహీంపట్నం, విజయవాడ (గాంధీనగర్), జగ్గయ్యపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఏపీలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సరిహద్దులోని గరికపాడు చెక్‌పోస్టు దాటిన అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. విజయవాడలో ప్రెస్‌మీట్ నిర్వహించి, కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కంభంపాటి స్వామి (రోడ్డు ప్రమాదంలో మరణించారు) కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మందకృష్ణ ఇబ్రహీంపట్నం చేరుకుని స్థానిక పలగాని హోటల్లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ప్రాంతంలో తిరగడానికి వీల్లేదంటూ మందకృష్ణను, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోట దానియేలును బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లి గరికపాడు చెక్‌పోస్టు దాటాక వదిలిపెట్టారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు దొండపాటి సుధాకర్ మాదిగను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఆ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ వారి పనేనా!
లేహ్: ఇండియా, చైనా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం లేహ్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలకు ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. వాస్తవాదీన రేఖ ప్రాంతంలోని డుర్బక్ గ్రామ సర్పంచ్‌కు ఇటీవల వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను విచారించిన అధికారులు.. అది వెబ్ ఆధారిత కాల్‌గా నిర్థారించారు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు పరిచయం చేసుకొని, ఆర్మీకి సంబంధించిన వివరాలను అడిగాడు. అయితే ఆ సమయంలో ఆర్మీ క్యాంపులోనే ఉన్న సర్పంచ్ ఈ విషయాన్ని సమీపంలోని ఆర్మీ అధికారికి వివరించాడు. దీనిపై విచారణ జరపగా ఆ నంబర్‌కు సంబంధించిన వివరాలేవీ లభించలేదు. దీంతో అది పాకిస్తాన్ లేదా చైనా దేశాలకు చెందిన గూఢచారుల పనిగా అధికారులు భావిస్తున్నారు. బార్డర్ గ్రామాల్లోని కొందరు అమాయక ప్రజలు ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న సందర్భంలో ఆర్మీకి సంబంధించిన వివరాలను వెల్లడించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఆర్మీ మోహరింపుకు సంబంధించిన వివరాలతో పాటు, అక్కడ గల రవాణా సౌకర్యాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్‌పై ఇప్పుడు అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అలాగే సమీప గ్రామాల్లోని ప్రజలకు ఈ వ్యవహారం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. -
పొరపాటుగా భారత్ లోకి వచ్చిన పాక్ చిన్నారి
ఛండీగఢ్ః ఐదేళ్ల చిన్నారి పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఇండియాలో ప్రవేశించింది. చెవిటి,మూగ సమస్యలతో బాధపడుతున్న ఆ పాకిస్తాన్ బాలిక పంజాబ్ అబోహార్ సెక్టార్ ప్రాంతం లోని సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారులు గుర్తించారు. భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం పదిన్నర గంటల ప్రాతంలో ఆ పాక్ చిన్నారి అంతర్జాతీయ సరిహద్దులు దాటింది. దీంతో సరిహద్దు స్థావరంలో పనిచేసే అభోర్ సెక్టార్ బీఎస్ఎఫ్ దళానికి చెందిన నతాసింగ్ వాలా బాలికను గమనించారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన ఆ బాలిక సరిహద్దు భద్రతా వలయంలోకి చేరినట్లు బీఎస్ఎఫ్ డీఐజీ ఆర్ ఎస్ ఖటారియా తెలిపారు. అయితే అనుకోకుండా భారత్ లోకి ప్రవేశించిన ఆ ఐదేళ్ల చిన్నారిని ప్రశ్నించడంతో చెవిటి, మూగ అని తెలిసిందని, దీంతో ఆమెకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడించలేక పోయిందని చివరికి పేరు కూడ తెలియలేదని అధికారులు వెల్లడించారు. ఆమె సరిహద్దు దాటి వచ్చిందన్న హెచ్చరికలతో చిన్నారిని పట్టుకున్న దళాలు.. అనంతరం పాకిస్తాన్ రేంజర్స్ ను సంప్రదించి మానవతా దృక్పథంతో ఆ బాలికను ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు వివరించారు. -
పాక్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పులు
ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో మళ్ళీ ఆమెరికా సైనికులు కాల్పులు ప్రారంభించారు. సరిహద్దు వెంట జరిపిన కాల్పుల్లో ఆఫ్ఘాన్ సరిహద్దులోని కుర్రమ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. కాల్పులు... పాకిస్తాన్ వైపు నుంచి జరిగాయా, ఆఫ్ఘన్ వైపు నుంచా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ దాడి ఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికా జరిపిన కాల్పులు ఒకవేళ పాకిస్తాన్ వైపునుంచి జరిగినట్లు అయితే ఈ సంవత్సరంలో ఇది రెండోసారిగా చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో అమెరికా డ్రోన్ దాడులు సంఖ్య భారీగా తగ్గినట్లే చెప్పచ్చు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ భూభాగంలో ఆమెరికా నిబంధనలు అతిక్రమించి డ్రోన్ దాడులు జరుపుతోందంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. -
ఆంద్ర-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్
-
మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైన్యం
న్యూఢిల్లీ: భారత్, పాక్ సరిహద్దుల్లో దీపావళి పండుగ వాతావరణం కనిపించింది. గత కొంతకాలంగా కాల్పుల మోతతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాలు దీపావళితో పండుగశోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ సైన్యాలు మిఠాయిలు పంచుకున్నారు. పంజాబ్ అమృతసర్‌లోని అట్టారి సరిహద్దు వద్ద భారత్ కమాండెంట్ బిపుల్ బిర్ గుసేన్, పాక్ కమాండర్ బిలాల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఇరుదేశాల సిబ్బంది మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం సైనిక సిబ్బంది ఆలింగనం చేసుకుని స్నేహబంధాన్ని చాటుకున్నారు. -
40 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
కోల్‌కతా: బంగ్లాదేశ్ నుండి భారత్‌కు తరలిస్తున్న 10 కిలోల కొకైన్‌ను సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర పరగణాల జిల్లాలో భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఓ ట్రక్కులో పౌడర్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ అధికారులు దానిని స్వాధీనం చేసుకొని, టెస్టింగ్ కోసం నార్కోటిక్ లాబొరేటరీకి పంపించారు. నార్కోటిక్ ఫలితాలలో ఆ పౌడర్ నిషిద్ద కోకైన్గా తేలిందనీ, దాని విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
బార్డర్లో 'భజరంగీ భాయ్‌జాన్'
బాలీవుడ్లో ఇటీవల సంచలనం సృష్టించిన భజరంగీ భాయ్‌జాన్ సినిమా గుర్తుంది కదా.. ఆ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ భారత్‌లో చిక్కుకుపోయిన ఓ పాకిస్తానీ మూగ బాలికను తిరిగి తన తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. అలాంటి సన్నివేశమే ఇండియా-పాక్ బార్డర్లో జరిగింది. కాకపోతే ఇక్కడ మాత్రం పాక్ నుండి భారత్‌లోకి వచ్చిన ఓ బాలుడిని భారత జవాన్లు పాక్‌కు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే... జమ్మూ జిల్లాలోని ఆర్ ఎస్ పురా సెక్టార్లో అంతర్జతీయ సరిహద్దు రేఖ వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన ఓ బాలున్నిగుర్తించారు. బాలున్ని విచారించిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు అతని వివరాలు తెలుసుకోగా.. తన పేరు రివాన్గా తెలిపిన బాలుడు తన తండ్రి పేరు అమిన్ అలీ అనీ.. సరిహద్దు ప్రాంత పాక్ గ్రామానికి చెందిన వాడిగా చెప్పుకున్నాడు. ఇతర వివరాలు సేకరించిన బీఎస్ఎఫ్ అధికారులు రివాన్ ఎలాంటి నేరపూరిత ఉద్దేశంతో సరిహద్దు దాటలేదని నిర్ధారించుకున్నారు. అనంతరం పాకిస్తాన్ రేంజర్లకు సమాచారం అందించిన బీఎస్ఎఫ్ అధికారులు బుధవారం సాయంత్రం బాలున్ని పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు. రివాన్ విచారణలో సరిహద్దు ప్రాంతంలో డ్యాన్స్ ట్రూప్‌లో మెంబర్‌గా పనిచేసేవాడనీ.. మెరుగైన జీవనోపాధికోసం భారత్‌కు వచ్చినట్లు తెలిపాడు. -
ఉగ్రవాదుల కాల్పుల్లో బొబ్బిలి జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాన్ మృతి చెందాడు. విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన బొత్త సత్యం(36) సరిహద్దు భద్రతా దళంలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అర్థరాత్రి ఉగ్రవాదుల దాడిలో మరణించాడని.. కుటుంబ సభ్యులకు సోమవారం మధ్యాహ్నం సమాచారం అందింది. బొత్త సత్యంకు బొబ్బిలికి చెందిన శ్రీవాణితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం మృతదేహం మూడు రోజుల తర్వాత స్వగ్రామానికి వస్తుందని అధికారులు తెలిపారు. -
సరిహద్దులో శాంతి!
మోర్టార్ షెల్స్ ప్రయోగంపై నిషేధానికి భారత్, పాక్ అంగీకారం న్యూఢిల్లీ: సరిహద్దులో తిరిగి శాంతి స్థాపన దిశగా భారత్, పాకిస్తాన్‌లు కీలక చర్యలు చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి మోర్టార్ దాడులపై పూర్తి నిషేధం విధించాలని నిర్ణయించాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలు, సీమాంతర చొరబాట్లు తదితర సున్నిత అంశాలను ఉమ్మడిగా పరిష్కరించుకునేందుకు వాటిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. శనివారం ఢిల్లీలో ముగిసిన మూడు రోజుల చర్చల్లో బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ దేవేంద్ర కుమార్ పాఠక్, పాక్ రేంజర్స్ డెరైక్టర్ జనరల్(పంజాబ్) మేజర్ జనరల్ ఉమర్ ఫరూఖ్ బుర్కీ ఈ మేరకు 20 సూత్రాల ఉమ్మడి చర్చల రికార్డుపై సంతకాలు చేశారు. కాగా, చిట్టచివర పరిస్థితుల్లో మాత్రమే భారీ ఆయుధాలను వినియోగించాలని కూడా ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. సరిహద్దులో కొన్ని నెలలుగా మోర్టార్ షెల్స్ ప్రయోగం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరగడం తెలిసిందే. కాగా, మోదీ భారత ప్రధాని అయ్యాక సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనలు పెరిగిపోయాయని పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. -
'హద్దు'లేని పాకిస్థాన్ కాల్పులు
-
గొంతెత్తితే ఖబడ్దార్
ఈ చిత్రం చూస్తే సరిహద్దులో అప్రమత్తమైన సైనిక వాతావరణం తలపిస్తోంది కదూ..కానీ కాదు.. పూడిమడక వద్ద ఆల్ట్రా సూపర్ థర్మల్ విద్యుత్తు కేంద్రం ఏర్పాటుపై బుధవారం ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమానికి పోలీసుల బందోబస్తు ఇది . ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన గళం ఎత్తనీయకుండా ప్రభుత్వం తీసుకున్న అతి అప్రమత్తత ఇది. భారీగా పోలీసు బలాన్ని ప్రయోగించింది. 600 మంది పోలీసులతో మార్చిఫాస్ట్ నిర్వహించి మత్స్యకారులను భయాందోళనలకు గురిచేశారు. -
కొనసాగుతున్న పాక్ బరితెగింపు
శ్రీనగర్ :సరిహద్దుల్లో పాకిస్తాన్ బరితెగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని వందల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ బలగాలు మరోసారి అదే పనికి తెగబడింది. ఆధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు. జమ్మూ, రాజౌరీ, పూంఛ్, కేజీ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పాక్ సైన్యం పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడింది. మొదట భారీ మోర్టార్లతో కాల్పులు జరిపిన దాయాది సైనికులు........ ఆ తర్వాత తుపాకులతో కాల్పులు కొనసాగించారు. గత రాత్రి పదిన్నర వరకు కాల్పులు కొనసాగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ సైన్యానికి భారత సైన్యం దీటుగా జవాబిచ్చింది. మరోవైపు సరిహద్దుల్లో 150 మంది టెర్రరిస్టులు నక్కి ఉన్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేలా చేసేందుకే పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయని సమాచారం. -
విశాఖలో సరిహద్దు భద్రతా దళం
ఏర్పాటుకు కేంద్రం అంగీకారం సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు కార్యకలాపాలను నివారించేందుకు వీలుగా విశాఖపట్నంలో సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రస్తుతం బలిమెలలో ఉన్న సరిహద్దు భద్రతాదళం మావోయిస్టుల కార్యకలాపాలపై హెలికాప్టర్ల ద్వారా నిఘా ఉంచడంతోపాటు నివారణకు చర్యలు చేపడుతోంది.తాజాగా మావోయిస్టులు ఉత్తరాంధ్రవైపు దృష్టి సారించారు. విశాఖ దిశగా కార్యకలాపాలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను కలసి విశాఖపట్నం వైపు కూడా సరిహద్దు భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని, మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని కోరగా గోయల్ అంగీకరించారు. -
కాల్పుల విరమణపై మళ్లీ తూటా
-
మళ్లీ తెగబడిన పాకిస్తాన్
-
మళ్లీ తెగబడిన పాకిస్తాన్
సరిహద్దుల్లోని 13 ఔట్ పోస్టులపై భారీగా కాల్పులు జమ్మూ: కొంతకాలంగా తరచూ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్.. మళ్లీ తెగబడింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్ పరిధిలో సరిహద్దు వెంబడి 13 సైనిక ఔట్ పోస్టులపై పాకిస్తాన్ బలగాలు విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాయి. గత ఎనిమిది రోజుల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. అయితే పాకిస్తాన్ బలగాలకు భారత సేనలు దీటుగా బదులిచ్చాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు పాకిస్తాన్ రేంజర్లు మృతిచెందినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్ దళాలు బుధవారమే విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను మరణించిన విషయం తెలిసిందే. దీనిపై భారత దళాలు దీటుగా స్పందించి, ఎదురుకాల్పులు జరపడంతో... పాకిస్తాన్‌కు చెందిన నలుగురు రేంజర్లు కూడా మరణించారు. ఇది జరిగిన కొద్ది గంటలలోపే పాక్ దళాలు మళ్లీ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి. బుధవారం రాత్రంతా సాంబా సెక్టార్‌లోని 13 సైనిక ఔట్‌పోస్టులపై పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపినట్లు బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ వెల్లడించారు. దీనికి ప్రతిగా బీఎస్ఎఫ్ దళాలు కూడా కాల్పులు జరిపాయని... గురువారం ఉదయం 6 గంటల వరకు కాల్పులు కొనసాగాయని ఆయన చెప్పారు. ఈ విషయంలో గట్టిగా ప్రతిస్పందిస్తామన్నారు. అయితే ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌లోకి చొరబడడానికి అంతర్జాతీయ సరిహద్దు వద్ద యాభై, అరవై మంది ఉగ్రవాదులు పొంచి ఉన్నారని రాకేశ్‌శర్మ చెప్పారు. సరిహద్దుల వెంట భారత భూభాగంలో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. -
భారత స్థావరాలపై పాక్ దాడులు
జమ్మూ: భారత స్థావరాలపై మరోసారి పాకిస్థాన్ దాడులు తెగబడింది. గత రాత్రి పాక్ బలగాలు 12 భారత స్థావరాలపై దాడులకు పాల్పడి ఉద్రిక్త పరిస్థితులకు తెరలేపింది. జమ్మూ కశ్మీర్ లోని సాంబా జిల్లాలోని మోర్తార్ షెల్లింగ్ లో పాకిస్థాన్ బలగాలు కాల్పులకు పాల్పడటంతో ఒక భారత జవాన్ తో సహా ఐదుగురు మృతి చెందారు.ఈ ఘటనలో నలుగురు పాక్ జవాన్లు అసువులు బాసారు. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ భూభాగంలోకి ప్రవేశించిన పాక్ బలగాలు దాడులకు దిగడంతో స్థానిక పౌరుడొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజుల్లో పాకిస్థాన్ మూడోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు. -
నలుగురు పాక్ రేంజర్లు హతం
జమ్మూ/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో బుధవారం మళ్లీ కాల్పుల మోత మోగింది. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో గస్తీ విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాను ఒకరు చనిపోయారు. బీఎస్ఎఫ్ జరిపి న ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్ రేంజర్ల దళానికి చెందిన నలుగురు హతమయ్యారు. కాల్పుల్లో మరణించిన తమ సహచరుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాక్ రేంజర్లు కాల్పులు ఆపాలంటూ తెల్లజెండాలను చూపాల్సి వచ్చింది. పాక్ కాల్పులకు దీటుగా రెట్టింపు బలగాలతో ప్రతిఘటించాలంటూ భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు బీఎస్ఎఫ్ బలగాలు పాక్ రేంజర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గస్తీ విధుల్లో ఉన్న సైన్యంపై అంతకుముందు పాక్ ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు తెగబడటంతో ఒక బీఎస్ఎఫ్ జవాను మరణించగా, మరో జవాను గాయపడ్డారు. మరణించిన జవానును శ్రీరాం గౌరియా గా గుర్తించారు. గత 24 గంటల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది రెండవసారి. బుధవారం సాయంత్రం సరిహద్దులో రీగల్ పోస్ట్ ఆవలివైపున పాక్ కాల్పులకు దీటుగా తాము ప్రతిఘటించామని, కాల్పుల్లో నలుగురు పాక్ రేంజర్లు మరణించారని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ రాకేశ్ శర్మ తెలిపారు. తమ సహచరుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు వీలుగా కాల్పులు ఆపివేయాలంటూ తెల్లజెండాలు చూపుతూ వారు చేసిన వినతి గౌరవిస్తూ బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు ఆపివేశాయని ఆయన చెప్పారు. తాజా పరిస్థితిని పారామిలిటరీ బలగాల డెరైక్టర్ జనరల్ తనకు వివరించగానే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ప్రతిస్పందించారని, పాక్ కాల్పులకు దీటుగా గట్టి సమాధానమివ్వాలని ఆదేశించారన్నారు. భద్రతా దళాలు రెట్టింపు బలగంతో పాక్ సైన్యాన్ని ప్రతిఘటించాలని అంతకు ముందు రక్షణ మంత్రి పారికర్ పిలుపునిచ్చారు. -
సరిహద్దు వద్ద కాల్పుల్లో నలుగురు పాక్ సైనికులు హతం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ 24 గంటల్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైనికులు జమ్మూకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో భారత బలగాలపై కాల్పులు జరిపారు. పాక్ దాడిని భారత్ దీటుగా తిప్పికొట్టింది. భారత్ బలగాలు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన నలుగురు సైనికులు మరణించారు. అంతకుముందు పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు మరణించారు. పాక్ దాడిని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. పాక్ దాడులను సహించబోమని, దీటుగా బదులిస్తామని అన్నారు. -
బోర్డర్ దాటిన నాలుగేళ్ల బాలుడు
అహ్మదాబాద్: పాకిస్థాన్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు దారితప్పి భారత్ సరిహద్దుల్లోపలికి వచ్చాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ బాలుడు బీఎస్ఎఫ్ సిబ్బందికి కంటపడ్డాడు. భద్రత సిబ్బంది ఆ బాలుణ్ని చేరదీసి భోజనం, దుస్తులు సమకూర్చారు. ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఇచ్చారు. భారత అధికారులు బాలుడు దారితప్పిన విషయాన్ని పాక్ సైన్యానికి తెలియజేశారు. పాక్ సైన్యం బాలుడు కుటుంబ సభ్యుల వివరాలు కనుగొని వారికి విషయాన్ని తెలియజేశారు. భారత సైన్యం ఆ బాలుడ్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. భారత అధికారులు చూపిన మానవతా దృక్పథానికి పాక్ బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సరిహద్దు వెలుగురేఖ
రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఓ రేఖ ఉంటుంది. ప్రత్యేకించి వేరుపడాలనే తీవ్రమైన కాంక్షతో వేరుపడిన దేశాల మధ్య సరిహద్దు రేఖ ఇంకా బలంగా రూపుదిద్దుకుంటుంది. అయితే ఇండియా- పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు మాత్రం ఇంకా తీక్షణంగా విద్యుత్తు వెలుగులతో కాంతులీనుతోంది. అంతరిక్షం నుంచి తీసిన ఛాయాచిత్రాల్లో నారింజరంగులో వెలుగు రేఖ కనిపించింది. ఇదేంటబ్బా! అని పరిశీలిస్తే భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖకు ఈవల (భారత్‌వైపు) ఏర్పాటు చేసిన ఫ్లడ్‌లైట్ల వరుస. ఇది ఎంతదూరం ఉందో తెలుసా? పంజాబ్, రాజస్థాన్, జమ్ము ఇంటర్నేషనల్ బోర్డర్, గుజరాత్‌లతో కలిపి మొత్తం పద్ధెనిమిది వందల అరవై కిలోమీటర్ల దూరం విస్తరించింది. సరిహద్దును సూచిస్తూ కంచె, దానికి పహారా కాస్తూ సైనికులు ఉండగా కొత్తగా ఈ ఫ్లడ్‌లైట్ల బారులు ఎందుకంటే... మనుషులు- వస్తువుల అక్రమరవాణా, ఆయుధాల సరఫరాను నిరోధించడం కోసం. ఒక్కమాటలో చెప్పాలంటే దేశం వెలుపలి నుంచి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించి, దేశంలో ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం. అందుకోసం మొత్తం రెండువేల కిలోమీటర్ల దూరం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలనేది భారత్ ప్రభుత్వ ఆలోచన. ఈ ఛాయాచిత్రాన్ని 28వ అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్ ఎక్స్‌పెడిషన్‌లో (ఈ ఏడాది అక్టోబర్ 28) ప్రదర్శితమైంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ ‘నాసా’ అధికారిక వెబ్సైట్ నాసా.జిఓవిలో వెల్లడించింది. -
సరి‘హద్దు’ దాటుతోంది..
* రోజుకు రూ.కోట్లల్లో సాగుతున్న ఇసుక దందా * అనుమతి లేని ఇసుక ఫిల్టర్లతో వాగులు లూటీ * ఓ కాంగ్రెస్ నేత కనుసన్నల్లోనే.. * సరిహద్దు సాకుతో పట్టించుకోని అధికారులు దేవరకొండ/ చింతపల్లి: రోజూ కోట్లల్లో వ్యాపారం, లక్షల్లో లంచాలతో సాగుతున్న ఇసుకవ్యాపారమిది. సరిహద్దు పేరిట సాగే ఓ మాఫియా.. రాజకీయ నాయకుల పలుకుబడి, పోలీసుల నిర్లిప్తత, అధికారుల మామూళ్లు..వెరసి వాగులను, చెరువులను పిండేసి సారాన్ని లాగించేస్తోంది. మహబూబ్‌నగర్- నల్లగొండ సరిహద్దు ప్రాంతమైన కుర్మేడు, ఘడియగౌరారం, కిష్టరాయినిపల్లి, నందిగడ్డ ాగుల్లో యథేచ్ఛగా ఈ ఇసుక దందా సాగుతోంది. మాఫియా, స్మగ్లింగ్, కిడ్నాప్‌లు... ఇదంతా ఒకప్పటి ట్రెండ్. కానీ ఎటువంటి అడ్డూఅదుపు, కేసులు లేకుండా కోట్లలో సంపాదించుకోవడానికి ఇప్పుడు ఈజీగా మారిన దందా ఇసుక. ఎక్కడ వాగులు, చెరువులు ఉంటే అదే ఈ ఇసుకాసురులకు డెన్. ఈ దందాలో ఎవరు అడ్డొచ్చినా ముందుగా మనీతో కొడితే సరే దెబ్బకు సెట్ అయిపోతారు. అది పోలీసులైనా, అధికారులైనా, గ్రామస్తులైనా. ఎవరికి వారు ఇసుకే కదా అని లంచాలకు అలవాటు పడ్డారు. కానీ ఇసుక మాఫియా రోజూ వ్యాపారులకు కోట్ల రూపాయలను తెచ్చిపెడుతుందన్న మాట మాత్రం వాస్తవం. సరిహద్దు దందా.. చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు గ్రామం నల్లగొండ-మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతం. ఈ కుర్మేడు వాగు కుర్మేడు, రాయినిపల్లి, ఘడియగౌరారం, కిష్టరాయినిపల్లి, నందిగడ్డ గ్రామాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ వాగు రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉండడం ఈ ఇసుక వ్యాపారం ఇంతగా సాగడానికి కారణమైంది. నిత్యం ఈ వాగులోనుంచి సుమారు 30 నుంచి 40 లారీల చొప్పున నెలకు సుమారు వెయ్యి వరకు లారీల ఇసుక హైదరాబాద్‌కు తరలిపోతుంది. ఇప్పటికే ఈ వాగుల పరిధిలో ఇసుక రేణువులు తరిగిపోయాయి. అయినా ఇసుకాసురులు మాత్రం ఇక్కడ ఉన్నంత సులభంగా మరే ప్రాంతంలో ఇసుకను ఎగుమతి చేయలేమని భావించి వాగుల్లో నుంచి ఇసుకను ఫిల్టర్ చేసి మరీ సారం పిండేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నాలుగు ఇసుక ఫిల్టర్లు ప్రభుత్వ అనుమతి లేకుండా వాగుల్లోనే ఏర్పాటు చేశారు. ఈ దందా వెనుక కొందరు బడా నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన ఓ మాజీ నేత సమీప బంధువు ఒకరు ఈ ఇసుక మాఫియానంతా లీడ్ చేస్తున్నట్లు సమాచారం. అక్రమంగా వాగులోనే ఇసుక ఫిల్టర్లు ఏర్పాటు చేసి మరీ లారీలలో ఇసుకను తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలా ? సరిహద్దులో ఈ వ్యాపారం నిత్యం రూ.కోట్లల్లో జరుగుతోంది. కుర్మేడు ప్రాంతంలో అనుమతి లేని నాలుగు ఇసుక ఫిల్టర్లను ఏర్పాటు చేసి రాత్రివేళ అక్రమంగా తరలిస్తున్నారు. ఫిల్టర్ చేసిన ఇసుకను మొదట ట్రాక్టర్లలో సమీపంలోని గోప్య ప్రదేశాలకు తరలించి నిల్వ ఉంచుతున్నారు. అక్కడ జేసీబీల ద్వారా లారీలకు నిమిషాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. సుమారు రోజుకు 30-40 లారీలను కేవలం ఈ ప్రాంతం నుంచే తరలిస్తారు. ఒక్కో లారీని హైదరాబాద్‌లో రూ.70 నుంచి రూ.80వేల వరకు విక్రయిస్తుండగా ప్రతినెలా సుమారు 10 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలు, ఎస్కార్ట్‌లతో నడిచే ఈ వ్యాపారం మామూళ్లపైనే సాగుతోంది. ఈ వ్యాపారంలో అందరూ పాత్రధారులే. ముందుగా ఇసుకను తరలించేందుకు ఆయా సమీప ప్రాంతంలో ప్రశ్నించే నేతలను డబ్బుతో కొంటారు. ఆ తర్వాత ఇటు రెవెన్యూ, అటు పోలీస్ అధికారులకు నెల నెలా మామూళ్లు ఇస్తారు. అడపాదడపా అడ్డుకోవడానికి చూసే వారిని లారీలకు ముందు నడిచే ఎస్కార్ట్ వాహనంలో ఉన్న మనిషి అప్పటికప్పుడు వెయ్యి నోట్లతో అక్కడికక్కడే కొంటాడు. ఇలా ఈ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. సరిహద్దే... సాకు ఈ వ్యాపారం ఇంతగా సాగడానికి అసలైన కారణం సరిహద్దే. మహబూబ్‌నగర్ - నల్లగొండ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో జరిగే ఈ వ్యాపారంపై ఎవరు ఫిర్యాదులు చేసినా అది తమ పరిధి కాదని తప్పించుకుంటారు. ఇటు మహబూబ్‌నగర్‌లో ఫిర్యాదులందితే నల్లగొండ పేరు, నల్లగొండలో ఫిర్యాదులందితే మహబూబ్‌నగర్ పేరు సాకు చెప్పి మిన్నకుంటారు. కానీ ఈ రెండు జిల్లాల అధికారులకు ఈ వ్యాపారంలో ఆమ్యామ్యాలు ముడుతున్న మాట వాస్తవం. 2009 సంవత్సరంలో ఈ పరిస్థితిని అదిగమించడానికి అప్పటి ఎస్పీలు ఇద్దరు ఒకేసారి కింది స్థాయి అధికారులకు చెప్పకుండా దాడి చేసి జేసీబీలు, ట్రాక్టర్లు, ఇసుక ఫిల్టర్లు సీజ్ చేశారు. కొంత కాలం ఈ వ్యాపారానికి చెక్ పడినా మళ్లీ ఈ వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. -
సరిహద్దుల్లో ఉద్రిక్తత
కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్యాం నీటి మట్టం పెంపును అడ్డుకునేందుకు కేరళ అల్లరి మూకలు యత్నించడం వివాదానికి దారి తీసింది. రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులపైనా, తమిళ గ్రామాల్లోని ప్రజలపైనా దాడులకు ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు రావడం మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సాక్షి, చెన్నై: ముల్లై పెరియార్ డ్యాం నీటిమట్టం 142అడుగులకు చేరువలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ డ్యాం నీటి మట్టం పెంచకుండా అడ్డుకునేందుకు కేరళ సర్కారు కుట్రలు చేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నీటి మట్టం పెంచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. డ్యాం గేట్లు బలహీనంగా ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో చోటకు తరలి వెళ్లాలని, నీటి మట్టాన్ని తగ్గించాలని గళం విప్పుతూ వచ్చిన కేరళ సర్కారు, తాజాగా అక్కడి అల్లరి మూకల్ని ఉసిగొల్పుతోంది. దాడులు: నీటి మట్టం పెంపుపనుల్ని పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులపై అక్కడి అల్లరి మూకలు దాడికి యత్నించినట్టుగా సోమవారం సమాచారం పాకింది. అలాగే, కేరళలోని తమిళ గ్రామాల మీద అల్లరి మూకలు తమ ప్రతాపం చూపించే పనిలో పడ్డట్టుగా వచ్చిన సమాచారం తేని సరిహద్దుల్లో కలకలం రేపింది. నీటి మట్టాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కారు అక్కడి ప్రజలను రెచ్చ గొడుతుండడంతో వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టు అవుతోంది. డ్యాం పరిసరాల్లో భద్రతా విధుల్లో ఉన్న కేరళ పోలీసులు తమిళ అధికారులకు, తమిళ ప్రజలకు సహకరించడం లేదన్న సంకేతాలతో ఆ డ్యాం నీటి ఆధారిత జిల్లాల్లో ఆగ్రహజ్వాల రాజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తక్షణం తమిళ పోలీసు బలగాల్ని ముల్లై పెరియార్ డ్యాం పరిసరాల్లో భద్రతా విధుల్లోకి దించాలని, లేని పక్షంలో డ్యాంకు ప్రమాదం కలిగించే విధంగా కేరళ వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టు అన్నదాతులు గగ్గోలు పెడుతున్నారు. తమిళుల మీద, అధికారుల మీద దాడులు జరిగినా, డ్యాం నీటి మట్టం పెంపును అడ్డుకునే విధంగా వ్యవహరించినా, తీవ్ర పరిణామాల్ని చవి చూడాల్సి ఉంటుందని కేరళకు అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని గ్రామాల్లో ఉద్రికత్త నెలకొనడంతో నీటి మట్టం పెంపు మరోమారు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య దాడులకు దారి తీసేనా అన్న ఉత్కంఠ బయలు దేరింది. -
సరిహద్దుల్లో పాక్ కాల్పులు
న్యూఢిల్లీ: భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం మళ్లీ కాల్పులకు దిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్ ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లలోని 15 భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు బీఎస్ఎఫ్ ప్రతినిధి చెప్పారు. శనివారం రాత్రంతా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఇటీవల పాక్ వరుసగా కాల్పులకు దిగుతున్న సంగతి తెలిసిందే. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాక్ దాడులను భారత్ సైన్యం దీటుగా ఎదుర్కొంటోంది. -
ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా
ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం:చైనా బీజింగ్: కాశ్మీర్‌లోని లఢక్ సెక్టార్‌లోని వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ) వద్ద ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొని ఉందని చైనా స్పష్టం చేసింది. చైనా సైనికులు చొరబాట్లకు పాల్పడుతూ, భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నారన్నవార్తలతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా తాజా పరిస్థితిపై వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఎల్ఏసీ వద్ద శాంతియుత వాతావరణం ఉందని తెలిపింది. అసలు ఎల్ఏసీ నిర్ధారణపై భారత్, చైనాల మధ్య విభిన్నమైన వాదనలున్నాయని, సరిహద్దు సమస్యలుంటే ఉభయపక్షాలు చర్చలతో పరిష్కరించుకోవచ్చని చైనా సైన్యం సోమవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే,.. లఢక్ సెక్టార్లో తాజా ప్రతిష్టంభనపై చర్చ జరిగిందా? లేదా? అన్నది మాత్రం చైనా సైన్యం వివరించలేదు. లఢక్ వద్ద చుమర్ ప్రాంతంలో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి, భారత సైన్యానికి మధ్య గత వారంగా కొనసాగుతున్న ప్రతిష్టంభనపై పీటీఐ అడిగిన ప్రశ్నలకు స్పందనగా చైనా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ వ్యాఖ్య చేశారు. సరిహద్దులో ఇటీవలి పరిణామాలపై మీడియాలో వెలువడిన వార్తలను తాము గమనించామన్నారు. -
రెండు జిల్లాల సరిహద్దున తండ్లాట !
ఖమ్మం.. వరంగల్ నడుమ లచ్యాతండా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని గూడెం పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మౌలిక వసతులు లేక అల్లాడుతున్న గిరిజనులు ఖమ్మం జిల్లాలో కలపాలని కోరుతున్న స్థానికులు అదో చిన్న తండా. రెండు జిల్లాల సరిహద్దులో ఉంది. సగం ఇళ్లు ఖమ్మం జిల్లా కామెపల్లి మండల పరిధిలో, మిగతా సగం ఇళ్లు డోర్నకల్ మండల పరిధిలో ఉండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కనీస వసతులు కొరవడి గిరిజనం తండ్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. డోర్నకల్- లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న లచ్యా తండా పరిస్థితి ఇది. డోర్నకల్ : లచ్యాతండా.. మొత్తం 400మంది జనాభాతో ఖమ్మం.. వరంగల్ జిల్లాల సరిహద్దున ఉన్న ఈ చిన్న తండా రెండుగా చీలిపోయింది. తండా మధ్యనుంచి వెళ్తున్న రహదారికి ఒకవైపున ఉన్న ఇళ్లన్నీ డోర్నకల్ మండల పరిధిలోకి, మరోవైపున ఉన్న ఇళ్లన్నీ ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పొన్నెకల్లు గ్రామ పరిధిలోకి వస్తాయి. మొత్తం 80కుటుంబాలు ఉన్న ఈ తండాలో 240మంది ఓటర్లున్నారు. డోర్నకల్-లింగాల ప్రధాన రహదారిలో రోడ్డుకు పావు కిలోమీటరు దూరంలో ఉన్న లచ్యాతండాలోని సగం ఇళ్లు డోర్నకల్ నాలుగో వార్డు పరిధిలో, అలాగే మూడవ మండల ప్రాదేశిక స్థానం పరిధిలో ఉన్నాయి. డోర్నకల్ మండలకేంద్రం నుంచి ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఖమ్మం జిల్లాలోని కామెపల్లి మండలకేంద్రం నుంచి 20కిలోమీటర్ల దూరంలో ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా.. నిర్లక్ష్యమే.. లచ్యాతండా ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. రెండు జిల్లాల సరిహద్దులో ఉండడంతో ఏ జిల్లా అధికారులూ, ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. తండాలో తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రోడ్డుకు ఇరుపక్కల ఉన్న వాళ్లు గొడవలు పడితే ఇటుపక్క ఉన్నవారు డోర్నకల్‌లో, అటుపక్కన వారు కామెపల్లి మండలం తోడేళ్లగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తండాలోని ఇరుపక్కల ఉన్న చేతిపంపులు పనిచేయడం ఏనాడో మానివేశాయి. తండాలోని ఏకైక వీధిలో కొద్ది దూరం మాత్రం సిమెంటు రోడ్డు నిర్మించి వదిలేశారు. దీంతో వర్షాకాలంలో తండావాసులు అనుభవిస్తున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. చిన్నపాటి వర్షానికే వీధంతా బురదమయమై మోకాలు లోతు వరకు భూమిలోకి కూరుకుపోతుందని తండావాసులు చెబుతున్నారు. తండాలో పాఠశాల లేకపోవడంతో కొంతమంది విద్యార్థులు పొన్నెకల్లు, మరికొంతమంది డోర్నకల్‌లోని పాఠశాలలకు వెళ్తున్నారు. ఇరు జిల్లాల ప్రజాప్రతినిధులు తండాను గాలికొదిలేయడంతో కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు. కామెపల్లి మండలం ఏజెన్సీ ప్రాతం కింద ఉన్నందున తండా మొత్తాన్ని కామెపల్లి మండలం కిందకు మార్చి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రం డోర్నకల్ వైపు ఉన్న లచ్యాతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎండాకాలంలో వ్యవసాయ బావుల్లోని నీరే ఆధారం. తండాలో వసతుల కల్పన కు అప్పుడప్పుడు అరకొరగా నిధులు కేటాయిస్తున్నా పెద్దగా ఉపయోగపడడం లేదు. - తేజావత్ బాలు, లచ్యాతండా, డోర్నకల్ మండలం తాతల కాలం నుంచీ ఇంతే.. మా తాతల కాలం నుంచీ తండా ఇలాగే ఉంది. మా తాత బోల్యా, తండ్రి పంతులు, నేను, నా కొడుకు రవి ఇక్కడే పుట్టాం. సమస్యలతో సర్దుకుపోతున్నాం. రెండు జిల్లాల వాళ్లు మా తండా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. - భూక్యా రాములు లచ్యాతండా, కామెపల్లి మండలం ఖమ్మంలో కలిపితేనే మేలు ప్రస్తుతం మేమున్న వైపు తండా ఏజెన్సీ మండలమైన కామెపల్లి పరిధిలో ఉంది. కాబట్టి తండా మొత్తాన్ని కామెపల్లి మండలంలో కలిపితే కొంతమేలు జరిగే అవకాశం ఉంది. నేను డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదు. తండాను కామెపల్లిలో కలిపితే కొందరికైనా మేలు జరుగుతుంది. - భూక్యా నరేష్ లచ్యాతండా, కామెపల్లి మండలం కరెంటు సక్రమంగా ఉండదు తండాలో ఎప్పుడూ కరెంటు సక్రమంగా ఉండదు. వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది. మారుమూలన ఉన్నందునే మా తండాను ఎవరూ పట్టించుకోవడం లేదు. - భూక్యా పద్మ లచ్యాతండా, కామెపల్లి మండలం -
హత్య కేసులో ఇద్దరి అరెస్టు
పొలం సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం దాడి చికిత్స పొందుతూ ఒకరి మృతి బందరు వెస్ట్ జోన్ పరిధిలో ఈనెల 15న ఘటన డీఎస్పీ వెల్లడి కోనేరుసెంటర్(మచిలీపట్నం) : బందరు వెస్ట్‌జోన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై నమోదైన కేసు లో ఇద్దరు నిందితులను రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు ఈ వివరాలు తెలియజేశారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. శారదనగర్‌కు చెందిన తాడంకి ఆనందరావు బందరు వెస్ట్‌జోన్ పరిధిలోని కొంత అసైన్డ్ భూమిని సాగు చేస్తున్నాడు. దీనిని ఆనుకుని కాలేఖాన్‌పేటకు చెందిన తాడంకి కుమారికి కొంత పొలం ఉంది. వీటి సరిహద్దు విషయమై ఇద్దరూ తరచూ ఘర్షణ పడుతున్నారు. ఆనందరావు గట్లు పేరుతో తన పొలాన్ని ఆక్రమించుకుంటున్నాడని కుమారి ఇటీవల ప్రజావాణిలో జిల్లా అధికారులకు అర్జీ సమర్పిం చింది. తన పొలంలో సర్వే జరిపి హద్దులు నిర్ణయించాలని కోరింది. దీనిపై అధికారులు స్పందించి, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి, సర్వేయర్‌తో హద్దులు కొలిపించాలని ఆదేశించారు. తరువాత కూడా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలీ సులు వారిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి హద్దులు కొలిచే వరకు ఎవరు వారి వారి పొలాల్లోకి వెళ్లకూడదని స్పష్టంచేశారు. వారివద్ద ఈ విషయమై రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఆనందరావు తన పొలంలో నాట్లు వేసే పనులు మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న కుమారి.. పొలంలో సర్వే జరగకుండా ఎలా సాగుచేస్తా డో అడిగి రమ్మని తన మేనల్లుళ్లయిన తాడంకి బోసు, ప్రకాశరావులను పంపింది. వారిద్దరూ పొలానికి వెళ్లి సర్వేయర్ హద్దులు కొలిచే వరకు పనులు నిలిపివేయాలంటూ అడ్డగించారు. దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ ముదరడంతో ఆనందరావు, అతని సోదరుడు వందనరావు పక్కనే ఉన్న కావిడిబద్దతో బోసు తలపై బలంగా కొట్టారు. ప్రకాశరావుపై కూడా ఆనందరావు, అతని అనుచరులు దాడిచేశారు. ఈ ఘటనలో బోసు తలకు బలమైన గాయమైంది. ప్రకాశరావు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న బంధువులు బోసును హుటాహుటిన బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సలహా మేరకు కుటుం బసభ్యులు బోసును విజయవాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ సకాలంలో వైద్యం అందకపోవటంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బోసు అదేరోజు మృతి చెందాడు. ప్రకాశరావు బంద రు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుల కుటుం బీకుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనందరావు, వందనరావులను శనివారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దాడిలో పాల్గొన్న మరికొం దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ ఎస్.వి.వి.ఎస్.మూర్తి, ఎస్సైలు ఈశ్వర్‌కుమార్, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
మళ్లీ చైనా చొరబాటు మళ్లీ చైనా చొరబాటు
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చైనా సైనిక దళాల చొరబాటు సమస్య మరింత తీవ్రంగా పరిణ మించింది. లడక్ ప్రాంతంలో చుమర్ సెక్టార్ గత రెండు రోజుల్లోనే రెండవ సారి చైనా సైన్యం చొరబాటుకు పాల్పడింది. గురువారం చొరబాటు జరిపి వెనక్కు మళ్లిన ప్రాంతంలోనే మరో చోట చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి చెందిన దాదాపు 50మంది సైనికులు తొమ్మిది వాహనాల్లో వచ్చి, చుమర్ ప్రాంతంలో భారత్ పరిధిలోని ఒక చిన్న కొండపైకి చేరుకున్నారని, అంతకు ముందు అక్కడే మకాంవేసిన 35మంది సైనికులకు అదనంగా వారూ చేరారని అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దువద్ద భారతసైనికులకు వంద మీటర్ల దూరంలోనే వారి ముందే వాహనాలు దిగివెళ్లారని అధికార వర్గాలు తెలిపాయి. కొండపై ఉన్న చైనా సైనికుల కోసం చైనా హెలికాప్టర్లు ఆహారం పొట్లాలు జారవిడుస్తున్నాయని, అయితే, ెహ లికాప్టర్లు మాత్రం ఇప్పటివరకూ గ గనతల ంలో ఉల్లంఘనకు పాల్పడలేదని అధికారవర్గాలు తెలిపాయి. -
చొరబాటు గొడవ తేల్చాల్సిందే: మోడీ
పదేపదే భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్న చైనా సైనికుల విషయం ఏంటో, ఆ గొడవ ఏంటో తేల్చాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు తేల్చిచెప్పారు. భారతదేశంలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడితో ఆయన సుమారు 45 నిమిషాల పాటు మాట్లాడారు. అందులో ప్రధానంగా చొరబాట్ల విషయాన్నే ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది. లడఖ్ వద్ద వాస్తవాధీనరేఖను చైనా సైన్యం తరచు ఉల్లంఘిస్తోందని మోడీ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను కూడా కట్టుబడి ఉన్నట్లు జిన్ పింగ్ మోడీకి హామీ ఇచ్చారు. సరిహద్దుల వద్ద జరుగుతున్న వ్యవహారంపై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని, ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సిందేనని గట్టిగా చెప్పానని మోడీ అన్నారు. వాస్తవాధీన రేఖ విషయంలో స్పష్టత వ్యవహారం గతంలో నిలిచిపోయిందని, దాన్ని పునరుద్ధరించాలని కూడా జిన్ పింగ్‌కు తెలిపానన్నారు. అప్పుడే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. చైనా-భారత్ సరిహద్దు వ్యవహారం ఇరు దేశాలకు ఇబ్బందిగానే ఉందని, సరిహద్దు స్పష్టంగా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందని జిన్ పింగ్ చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోడానికి చైనా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. -
పౌర అణుఒప్పందంపైన చర్చలు జరిపాం: మోడి
-
ఎల్వోసీ వద్ద హోరాహోరీ
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం, ఇద్దరు జవాన్లూ బలి రెండు వేర్వేరు సైనిక ఆపరేషన్లలో ఎదురుకాల్పులు సరిహద్దుల్లో కొనసాగుతున్న పాక్ కాల్పులు 25 భారత ఔట్ పోస్టులు, 19 గ్రామాలపై బుల్లెట్ల వర్షం శ్రీనగర్: సరిహద్దుల్లో ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతుండగానే.. ఆదివారం నలుగురు మిలిటెంట్లను భారత సైన్యం కాల్చి చంపింది. జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మరణించాడు. ఇక్కడి కలరూస్ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్క డికి చేరుకోగానే కాల్పులు మొదలయ్యాయి. కొద్ది గంటలపాటు ఇవి కొనసాగాయి. అనంతరం నలుగురు ఉగ్రవాదుల మృతదేహాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన జవాను నీరజ్ కుమార్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇదే జిల్లాలోని కేరన్ సెక్టార్‌లోనూ గత రాత్రి సైనిక దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో రాహుల్ కుమార్ అనే సైనికుడు చనిపోయాడు. అంతర్జాతీయ సరిహద్దుల్లోని జమ్మూ సెక్టార్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి 19 గ్రామాల పరిధిలోని 25 సైనిక ఔట్ పోస్టులను, ఆవాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. శనివారం రాత్రి నుంచి నిరంతరం బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. మోర్టార్ బాంబులతో విరుచుకుపడుతోంది. బీఎస్ఎఫ్ బలగాలు కూడా ధీటుగా సమాధానమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద స్థావరం గుట్టురట్టు కిష్టవర్ జిల్లాలో ఓ మిలిటెంట్ స్థావరాన్ని సైన్యం గుర్తించింది. అక్కడి నుంచి భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఓ రష్యన్ కార్బైన్ రైఫిల్ ఏకేఎస్-74యూ, ఏకే 56, మూడు రివాల్వర్లతో పాటు 73 గ్రెనేడ్లు, 3 వేలకుపైగా రౌండ్ల మందుగుండుతో పాటు పెద్దఎత్తున ఆయుధాలు లభించినట్లు సైనికాధికారులు తెలిపారు. మరోవైపు తరచుగా కాల్పులకు తెగబడుతున్న పాకిస్థాన్‌కు భారత సైన్యం తగిన విధంగా జవాబిస్తోందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్‌లో అన్నారు. చర్చలు భారత ప్రభుత్వంతో జరుపుతారా? లేక కాశ్మీర్ వేర్పాటువాదులతోనా? అనేది పాకిస్థానే తేల్చుకోవాలన్నారు. వేర్పాటువాదులతో చర్చలు జరిపి పాక్ తన అసలు నైజం బయటపెట్టడంతో.. చర్చలను రద్దు చేసుకోవడం ద్వారా తమవైపు నుంచి కూడా కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. బెర్హంపూర్‌లోని గ్రీన్ మిలటరీ స్టేషన్‌ను ఏర్పాటును ఆయన సమీక్షించారు. కాగా, పాక్ కాల్పుల ఉల్లంఘనతో కొందరు ప్రాణాలు కోల్పోవడంపై హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
అక్రమార్గాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సరిహద్దులో ఉన్న చెక్‌పోస్టులలో పని చేయడానికి జిల్లా, డివిజన్‌స్థాయి ఉన్నతాధికారుల కనుసన్నలలో మెలుగుతూ మాట తప్పకుండా మామూళ్లు ఇచ్చేవారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. అర్హత, అనుభవం, సిన్సియారిటీ ఉన్నా, లంచం పెట్టలేక అవకాశాలు కోల్పోతున్నామని కొందరు రవాణా, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్లకు నిలయాలు సాలూర, సలాబత్పూర్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు అ క్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. రవాణా, వాణిజ్య పన్నుల శాఖలు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకుని యథేచ్ఛగా సాగిస్తున్న దందా ఏసీబీ అధికారులు పలుమార్లు దాడులు చేసినపుడు వెలుగు చూసినా, పరిస్థితి మాత్రం మారడం లేదు. మహారాష్ట్రకు సరిహద్దున బోధన్ మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సాలూర వద్ద ఉమ్మడి తనిఖీ కేంద్రం, (ఐసీపీ) అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. ఇక్కడ రవాణా, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖల అధికారులు వసూళ్ల దందాను సాగిస్తున్నారని తెలుస్తోంది. దందా అంతా రాత్రిపూట జరుగుతోంది. ముందస్తు సమాచారం అందగానే ప్రైవేట్ వ్యక్తులు రంగంలో దిగి, అందినకాడికి దండుకుని వా హనాలను చెక్‌పోస్టులు దాటిస్తున్నారు. ఇక్కడి అధికారులు అక్రమ వసూళ్లకు సు లభమైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నా రు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో, ఇక్క డి నుంచి మహారాష్ట్రకు సరుకుల లోడ్‌తో వెళ్లే వాహనాల రోడ్డు ట్యాక్స్, వే బిల్లులు, నిబంధనల మేరకు బరువులను తనిఖీ చేస్తా రు. 10 టన్నులు, 16 టన్నులు, 20 టన్నుల లోడ్ వాహనాలను నిబంధనల మేరకు అనుమతి ఇస్తారు. ఈ చెక్‌పోస్టులో సరుకులలోడ్ ను తూకం వేసేందుకు కొన్నేళ్ల క్రితం వే బ్రిడ్జిను ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటుంది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే వేబ్రిడ్జి పనిచేయకుండా సాంకేతిక కారణాలు చూపుతున్నారని ఆరోపణలున్నాయి. వే బ్రిడ్జి పని చేయకపోవడంతో వాహనాదారుల వద్ద అం దినకాడికి దండుకుంటున్నారు. రోజుకు లక్షల రూపాయలలోనే అక్రమ వసూళ్లు కొనసాగుతాయని సమాచారం. రోజుకు 300 నుంచి 400 వరకు లారీలు, ఇతర వా హనాల రాకపోకలుంటాయి. ప్రతి ఏడాది జనవరి నుంచి జూన్ నెల ఆఖరు వరకు మ హారాష్ట్ర ఇసుక క్వారీలనుంచి లారీలు, టిప్పర్లు రోజుకు సుమారు 300 వరకు ఇసుక లోడ్‌తో మన ప్రాంతానికి వస్తాయి. సరుకులు, ఇసుక ఓవర్ లోడ్‌తో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సలాబత్పూర్ బీసీపీలో సలాబత్పూర్ చెక్పోస్టులోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. ఇక్కడ ముగ్గురు ఏసీటీఓలు పని చేస్తారు. ఒక్కొక్కరికి రెండు రోజులు డ్యూటీ ఉంటుంది. రోజూ ఈ చెక్ పోస్టు గుండా 550 నుంచి 650 వందల లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఆన్లైన్ పద్ధతిలో లేదా, బోధన్‌లోని వాణిజ్య పన్నుల శాఖలో ట్యాక్సు చెల్లించాలనే నిబంధన అమలులోకి వచ్చినప్పటి నుం చి, ఈ చెక్‌పోస్టుకు ఎలాంటి టార్గెట్ విధించలేదు. వే బిల్లులు, అన్ని రకాల పత్రాలు కలిగి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు ఇక్కడ ట్రాన్సిట్ పాసు (టీపీ) రిసిప్ట్ తీసుకొని స్టాంప్ వేసుకొని వెళ్తాయి. వారు సరుకులు ఏ జిల్లాకు వెళ్తున్నాయో అక్కడే టాక్స్ చెల్లిస్తారు. ప్రభుత్వ సెలవులు ఉన్నప్పుడు మాత్రమే ఈ చెక్‌పోస్టులో ట్యాక్సులు చెల్లిస్తారు. వేబిల్లులు లేని వాహనాల డ్రైవర్ల నుంచి ప్రతి లారీకి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. కేవలం మార్బుల్ రాయి ఉన్న వాహనాలు జీరో సరుకును తరలిస్తారు. మార్బుల్ లారీకి రూ. రెండు వేల నుంచి రూ. నాలుగు వేల వరకు అధికారులకు ముట్టజెబుతారు. ప్రతి నెల ఈ చెక్‌పోస్టు నుండి రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. దళారుల ప్రమేయంతో చెక్‌పోస్టు ఆవరణలోని ఎస్టీడీ బూత్‌లలో ఉండే దళారులు లారీ ట్రాన్స్పోర్ట్వాళ్లతో సంబంధాలు కలిగి ఉంటారు. లారీలను పాస్ చేయించగా వచ్చిన డబ్బును అధికారి, దళారి పంచుకుంటారు. ఇక్కడ ఎనిమిది ఎస్టీడీ బూత్‌లు ఉన్నాయి. ఇక్కడి దళారులు నెలకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు సంపాదిస్తారని అంచనా. ఈ చెక్‌పోస్టులో ఒక ఎంవీఐ, ఏడుగురు ఏఎంవీఐలు పని చేస్తారు. ఒక్కోక్కరికి వారంలో రెండు రోజులు డ్యూటీ ఉంటుంది. ఇక్కడ దళారులు రోడ్లపై అటు ఇటు తిరుగుతుంటారు. ఒక్కో అధికారికి ఒక్కో దళారి సెపరేట్‌గా ఉంటాడు. చెక్‌పోస్టులో ఏ అధికారి ఉంటాడో అతనికి సంబంధించిన దళారి మాత్రమే ఉంటాడు. అందరు దళారులు అక్కడే ఉండరు. -
సై అంటే సై
దుమ్ముగూడెం, న్యూస్‌లైన్ : మావోయిస్టులు కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు దళాలను అప్రమత్తం చేసి దాడులు ముమ్మరం చేయడానికి అగ్రనేతలు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుసుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోని దండకారణ్యంలోకి చేరుకుంటున్నట్లు తెలిసింది. ఇటీవల పోలీసులు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేయడం, మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, దీనికి తోడు భద్రాచలం డివిజన్లోని కొరియర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం తదితర వరుస పరిణామాలు చోటుచేసుకోవడాన్ని అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు లు, ఇన్ఫార్మర్లను టార్గెట్ చేసుకుని యాక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశాయి. సవాల్.. ప్రతిసవాల్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో జరిగే వారపు సంతలకు చర్ల, దుమ్ముగూడెం మండలాల నుంచి వ్యాపారులు అధికంగా వెళ్తుంటారు. రాత్రి, పగలు అంటే తేడా లేకుండా ఏసమయంలోనైనా దండకారణ్యంలోకి వెళ్లినప్పుడు మావోయిస్టుల నుంచి వారికి ఎలాంటి ఆటంకాలు ఎదురైన దాఖలాలు లేవు. మావోయిస్టులకు యధావిధిగా నిత్యావసర వస్తువులతో పాటు కావాల్సిన సరకులు ఎప్పటికప్పుడు సమకూరేవి. అయితే.. రెండేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాలు అధికం కావడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి భద్రాచలం డివవిజన్లోని వందలాది మంది మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. సంత వ్యాపారులను సైతం కట్టుదిట్టం చేసి మావోయిస్టులకు ఎలాంటి సరకులు అందకుండా చర్యలు చేపట్టారు. దీనికి తోడు ప్రతి ఆదివారం స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టించమనడంతో పాటు దండకారణ్య సమాచారాన్ని కూపీలాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మావోయిస్టుల అడ్డాకు మార్గమైన దుమ్ముగూడెం మండలం పెదనల్లబల్లి-పైడిగూడెం రోడ్డును పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఇది జీర్ణించుకోలేని మావోయిస్టులు దాడులు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్ బలగాలు అధికంగా ఉండడంతో విరమించుకున్నట్లు తెలిసింది. అయితే... మండల పరిధిలోని పెదార్లగూడెం ఎయిర్టెల్ సెల్ టవర్‌ను దహనం చేసి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో గత నెల 26న దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న ఎడ్లపాడు గ్రామంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందుకున్న పోలీసులు ఏకంగా అక్కడ ఉన్న 10 మందిని మట్టుబెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులు ఒక ఇంటికి వెళ్లబోయి మరో ఇంటికి వెళ్లడంతో కొద్ది క్షణాల్లోనే మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దాడిలో తమ దళం అంతరించుకుపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన మావోయిస్టులు మరోసారి వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. పోలీసులు దండకారణ్యంలోకి అడుగు పెట్టకుండా చర్యలు తీసుకునేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. -
సీమాంధ్ర-తెలంగాణ మధ్య ఎనిమిది అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు
హైదరాబాద్: తెలంగాణ - సీమాంధ్రల మధ్య 8 ప్రాంతాల్లో సరిహద్దులను నిర్ధారిస్తూ చెక్‌పోస్టుల ఏర్పాటుకు రవాణా శాఖ సిద్ధమైంది. వీటిని అంతర్రాష్ట్ర సరిహద్దులుగా పేర్కొంటూ వాహనాల తనిఖీ కోసం మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఈ చెక్‌పోస్టుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో గుర్తించిన ప్రాంతాల్లో ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా జిల్లాలకు చెందిన సిబ్బందిని వీటిల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ - ఇతర రాష్ట్రాల మధ్య వాహనాల తనిఖీ ఎలా కొనసాగుతోందో ఇక నుంచి (విభజన అమల్లోకి వచ్చాక) తెలంగాణ - సీమాంధ్ర మధ్య కొత్తగా ఏర్పాటు చేయనున్న చెక్‌పోస్టుల వద్ద కూడా అలాగే కొనసాగనుంది. మోటార్ వెహికల్ ట్యాక్స్ చెల్లింపు, పర్మిట్ల గడువు, వాహనాల ఫిట్నెస్, వాహనాల లెసైన్స్.. తదితరాలను ఈ చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేస్తారు. తదనుగుణంగా వారు చర్యలు తీసుకుంటారు. అయితే .. ఈ పన్నులకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇప్పటికే పర్మిట్లు తీసుకున్న వాహనాలకు ఆ గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి పద్ధతిని కొనసాగిస్తారు? పన్నుల చెల్లింపు ఎప్పటినుంచి మొదలవుతుంది? ఇతరత్రా ఫీజుల విధానం ఎలా ఉంటుంది? తదితరాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దులు, చెక్‌పోస్టులు ఇవీ.. రహదారి, ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 1. హైదరాబాద్ - కర్నూలు హైవే కర్నూలు సమీపంలో.. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ 2. కల్వకుర్తి - శ్రీశైలం కర్నూలు జిల్లా సున్నిపెంట మహబూబ్‌నగర్ జిల్లా ఈగలపెంట 3. దేవరకొండ - మాచర్ల గుంటూరు జిల్లా మాచర్ల నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ 4. మిర్యాలగూడ - ఒంగోలు గుంటూరు జిల్లా దాచేపల్లి నల్లగొండ జిల్లా విష్ణుపురం 5. విజయవాడ - హైదరాబాద్ కృష్ణా జిల్లా గరికపాడు నల్లగొండ జిల్లా కోదాడ 6. ఖమ్మం - తిరువూరు కృష్ణా జిల్లా తిరువూరు ఖమ్మం జిల్లా కల్లూరు 7. ఖమ్మం - రాజమండ్రి ప.గో. జిల్లా జీలుగుమిల్లి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట 8. కొత్తగూడెం - జగదల్పూర్ హైవే తూ.గో.జిల్లా మారేడుమిల్లి ఖమ్మం జిల్లా పాల్వంచ -
సరిహద్దుదాటొద్దు
సాక్షి, చెన్నై: జాలర్లకు కడలిలో సరిహద్దుల్ని సూచించే దిక్సూచి అందుబాటులోకి రానున్నది. కేంద్ర నౌకాయూన మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నేవిగేషన్ టెలక్స్ నౌటెక్స్ సాంకేతిక కేంద్రాల ఏర్పాటు పనులు వేగవంతమయ్యాయి. రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా ముట్టం, కడలూరు జిల్లా పరింగి పేటల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ టెక్నాలజీ జాలర్లకు మార్గదర్శిగా నిలవబోతున్నది. రాష్ట్రంలో పదమూడు సముద్ర తీర జిల్లాలు ఉన్నాయి. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం నుంచి కన్యాకుమారి జిల్లా నీరోడి వరకు 1078 కి.మీ దూరం సముద్రం విస్తరించి ఉన్నది. ఈ తీరంలో 50 లక్షల కుటుంబాలు చేపల వేట వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. 15 వేల అతి పెద్ద పడవలు, 25 వేల ఫైబర్ పడవలు, మరెన్నో వేల మర పడవల ద్వారా జాలర్లు చేపల వేట కోసం కడలిలోకి నిత్యం వెళ్తూ వస్తున్నారు. కొన్ని పడవల్లో మాత్రం జీపీఎస్, రాడార్ సౌకర్యాలు ఉన్నాయి. మిగిలిన పడవల్లో ఈ సౌకర్యాలు శూన్యం. దీంతో చేపల వేటకు వెళ్లే జాలర్లు దేశ సరిహద్దుల్ని తరచూ దాటి వెళ్లిపోతున్నారు. దీంతో పొరుగున ఉన్న శ్రీలంక నావికాదళం వీరిని జైళ్లలోకి నెట్టేస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర నౌకాయన శాఖ మంత్రి జికే వాసన్ పరిష్కార మార్గాల్ని అన్వేషించారు. అధికారుల బృందంతో పరిశీలనలు, పరిశోధనలు జరిపి సరికొత్తగా నేవిగేషన్ టెలక్స్ నౌటెక్స్ విధానాన్ని పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. దిక్సూచీగా నౌటెక్స్ : జాలర్లు సరిహద్దులు దాటుతున్నా, ప్రకృతి వైపరీత్యాలు ఎదురవుతున్నా, ముందుగా జాలర్లకు సమాచారాన్ని చేర వేసే దిక్సూచిగా ఈ కొత్త విధానం ఆవిష్కరించనున్నారు. ముంబై, విశాఖ పట్నం ప్రధాన కేంద్రాలుగా ఈ నౌటెక్స్ సమాచార కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఏడు చోట్ల అనుబంధ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రాష్ట్రానికి చోటు దక్కింది. కన్యాకుమారి జిల్లా ముట్టం, కడలూరు జిల్లా పరింగి పేటల్లో ఈ కేంద్రాలు కొలువు దీరబోతున్నాయి. ఈ కేంద్రాల నుంచి సముద్రంలో 250 వాటికన్ మైళ్ల దూరం వరకు సమాచారం చేర వేయడానికి వీలుంది. అదే విధంగా జాలర్లకు మెసేజ్ రిసీవర్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఆ కేంద్రాల నుంచి తమిళంలో, ఆంగ్లంలోనూ ప్రతి 20 నిమిషాలకు ఓ మారు సమాచారం వస్తుంది. సముద్రంలో అలల తాకిడి, ప్రకృతి వైపరీత్యాల సమాచారంతో పాటుగా సరిహద్దు వివరాల్ని తెలియజేస్తారు. సరిహద్దుల్ని దాటిన పక్షంలో రిసీవర్ ఫోన్లకు హెచ్చరికల సమాచారం వెళ్తుంది. దీంతో జాలర్లు అప్రమత్తం అయ్యేందుకు వీలుంది. ఒక వేళ ఆ హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా సరిహద్దులు దాటే జాలర్లకు ఆయా కేంద్రాల ద్వారా జరిమానాలు విధించేందుకు సైతం కసరత్తులు చేస్తున్నారు. పనులు వేగవంతం: ముట్టం, పరింగి పేట లైట్ హౌస్‌ల పరిధుల్లో ఈ కేంద్రాల పనులు వేగవంతం చేశారు. తొలుత చెన్నై లైట్ హౌస్ పరిధిలోనూ ఈ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించినా, ఆ హౌస్‌ను సందర్శకులకు అంకితం చేయడంతో ప్రయత్నాన్ని విరమించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జాలర్లకు మార్గదర్శిగా రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రాల పనులు చడీ చప్పుడు కాకుండా నౌకాయన శాఖ చేపట్టడం గమనార్హం. అటు ఆంధ్రా, ఇటు కేరళ సరిహద్దుల్ని, శ్రీలంక సరిహద్దుల వివరాలను పొందుపరిచే విధంగా ఈ సాంకేతిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయా కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్, సాంకేతిక టెక్నాలజీ పరికరాల్ని సిద్ధం చేసి పనులు వేగవంతం చేసి ఉన్నారు. భద్రత ముఖ్యం: రాష్ట్ర జాలర్ల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ రెండు కేంద్రాల ఏర్పాటుకు వాసన్ చర్యలు తీసుకున్నట్టు ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రధానంగా శ్రీలంక దళాలు, జాలర్ల నుంచి రాష్ట్ర జాలర్లకు ఎలాంటి ప్రమాదం ఎదురు కాకూడదన్న ఉద్దేశంతో ఇక్కడి 15 వేల పడవలకు మొబైల్ ఫోన్ మెసేజ్ రిసీవర్లను ఇవ్వడానికి నిర్ణయించినట్టు వివరించారు. ఆయా ప్రాంతాల వారీగా వీటిని విభజించి ఇవ్వడం ద్వారా సముద్రంలో ఇతర జాలర్లతో సమాచారం బదాలాయింపులు చేసుకునేందుకు వీలుందన్నారు. కొత్త సంవత్సరంలోపు ఈ పనులు ముగించనున్నామన్నారు. జనవరి చివరి వారంలో లేదా, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ టెక్నాలజీ జాలర్లకు అందుబాటులోకి రాబోతున్నదని ఆ అధికారి పేర్కొన్నారు. ముట్టం, పరింగి పేట కేంద్రాల ద్వారా అటు ఆంధ్ర, ఇటు కేరళ సరిహద్దులు సూచించడంతో పాటు ప్రధానంగా శ్రీలంక సరిహద్దుల దారి దాపుల్లోకి తమిళ జాలర్లు వెళ్లకుండా ఉండే విధంగా ఈ టెక్నాలజీ సమాచార దిక్సూచీగా ఆవిష్కరించబోతోందన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ అనుమతితో నడుస్తున్న పడవలకు రిసీవర్లు అందించేందుకు కసరత్తులు చేస్తున్నామన్నారు. కేవలం జాలర్లకే కాకుండా, భారత సరిహద్దులోకి వచ్చే నౌకల వివరాలు, వాటి కదలికల్ని పసిగట్టేందుకు ఈ టెక్నాలజీ ఎంతో దోహదం చేస్తుందన్నారు.