నాలుగు సంవత్సరాల తర్వాత నేరుగా ప్యాసింజర్ విమానాలను మళ్ళీ ప్రారంభించాలని చైనా.. భారత్‌ను కోరింది. సరిహద్దు వివాదంలో కొనసాగుతున్న ఉద్రిక్తల కారణంగా ఇండియా.. చైనా రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణలో సుమారు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి భారత్ - చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.
చైనా - ఇండియా మధ్య నేరుగా విమానాల రాకపోకలు లేకపోవడంతో.. హాంకాంగ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు వెళ్లి చైనాకు వెళ్తున్నారు. 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేదించింది.
సుమారు నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ విమానయాన సర్వీసులను ప్రారంభించాలని చైనా.. భారత పౌర విమానయాన అధికారులను కోరింది. కానీ భారతీయ అధికారులు దీనిపైన స్పందించలేదు. విమానాయ సర్వీసులను ప్రారంభించడం ద్వారా రెండు దేశాలు ప్రయోజనాన్ని పొందుతాయని చైనా అధికారు చెబుతున్నారు. సరిహద్దులో శాంతి ఉంటే తప్పా చైనాతో ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగవని భారత్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది.
Comments
Please login to add a commentAdd a comment