chaina
-
ఇదే జరిగితే దంగల్ రికార్డ్ క్రాస్.. 'పుష్ప' గాడి అసలైన టార్గెట్ ఇదే
'పుష్ప 2' చిత్రం వరుస రికార్డ్స్‌తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. రూ. 1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో పుష్ప ఉన్నాడు. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి. అయితే, తాజాగా పుష్ప2 ( Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ దంగల్.. కేవలం మరో రూ. 200 కోట్ల మార్క్ అందుకుంటే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియన్ టాప్ వన్ సినిమాగా పుష్ప2 చేరిపోతుంది. అయితే, ఈ మార్క్‌ను అల్లు అర్జున్ (Allu Arjun) చాలా సులువుగా అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇండియాలో కలెక్షన్ల పరంగా టాప్ వన్ సినిమాగా పుష్ప-2 రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో బాహుబలి-2 ఉండగా రీసెంట్గా పుష్ప దాటేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతీయ సినిమాల లిస్ట్‌లో బాలీవుడ్ హిట్ మూవీ దంగల్ టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ కూడా ఆ చిత్రంపైనే పడింది. దంగల్ సినిమా టాప్ వన్‌లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెట్ (China Cinema Market ) అని చెప్పవచ్చు. ఈ మూవీ అక్కడ ఏకంగా రూ. 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో టాప్ వన్‌లోకి దంగల్ చేరిపోయింది. దశాబ్ద కాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. అక్కడ పుష్పగాడు నచ్చితే సులువుగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. దీంతో పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్ రూ. 3వేల కోట్లకు చేరవచ్చు అని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా వాళ్లకు పుష్ప నచ్చుతాడు అని చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.పుష్ప-2 టార్గెట్ చైనాపుష్ప2 చిత్రం చైనాలో కూడా విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. చైనా బాక్సాఫీస్‌లో పుష్ప2 ఎంట్రీ ఇస్తే తప్పనిసరిగా దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేస్తుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో పుష్ప2 చిత్రానికి భారీ అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా, జపాన్‌లో ఎర్రచందనాన్ని (Redwood) అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. వారి కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజలు నిత్యం చందనంతో తయారు అయిన వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఎర్రచందనంతో వాళ్లకు ఎక్కువ కనెక్షన్ ఉంది. ఈ అంశాలు పుష్ప2 విజయంలో కీలకంగా మారుతాయి. ఎర్రచందనం సరఫరా విషయంలో ఇంత డ్రామా ఉంటుందా అని వాళ్లు ఆశ్చర్యపడటం గ్యారెంటీ అని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో అక్కడ విడుదలైన భారతీయ సినిమాలు భారీగానే కలెక్షన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి చిత్రం మహారాజ పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి వారు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నీ సానుకూలతలు పుష్ప2 చిత్రానికి ఉన్నాయి. పుష్ప-2 చైనాలో విడుదలైతే దంగల్ రికార్డ్ బద్దలు కావడం చాలా సులువు అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.చైనాలో వరకట్నంగా ఎర్రచందనంఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు.మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. -
చైనాలో 'మహారాజ' విడుదల.. ఇదే జరిగితే రూ. 500 కోట్లు..!
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్మెంట్కు చైనా సినీ అభిమానులు కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్లో సినిమా రన్ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మంచి ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఒక ఇండియన్ సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో అభిమానులు హర్షిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఈ రికార్డ్ దక్కలేదు. -
భారత్ శుభారంభం.. చైనాపై ఘన విజయం
హులున్‌బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. ఆతిథ్య చైనా జట్టుతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (14వ ని.లో), ఉత్తమ్ సింగ్ (27వ ని.లో), అభిõÙక్ (32వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మలేసియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ 2–2తో... జపాన్, దక్షిణ కొరియా మధ్య మ్యాచ్ 5–5తో ‘డ్రా’గా ముగిశాయి. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో భారత్ తలపడుతుంది. తొలి విజయంతో భారత్ మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈనెల 17 వరకు మొత్తం ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
తయారీ కేంద్రంగా భారత్!.. చెప్పడం సాహసమే
వారానికి 72 గంటల పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటే.. తయారీ రంగంలో ఇండియా చైనాని దాటాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాలని 'ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మిట్ 2024'లో పేర్కొన్నారు.ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే ఉన్నాయి. అవన్నీ భారత్ జీడీపీకి ఆరు రెట్లు. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి అని నారాయణ మూర్తి అన్నారు.ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా.. తయారీ రంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని నారాయణ మూర్తి అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారం లోపాలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి, అప్పుడే తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు. -
పారిస్ ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన చైనా.. షూటింగ్లో గోల్డ్ మెడల్
పారిస్ ఒలింపిక్స్ పతకాల వేటలో చైనా బోణీ కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం ఈవెంట్లో చైనా బంగారు పతకం సాధించింది. చైనాకు చెందిన షూటర్లు హువాంగ్ యుటింగ్, షెంగ్ లియావో.. గోల్డ్ మెడల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫైనల్లో రౌండ్లో యుటింగ్, షెంగ్ లియావో జోడీ.. 16-12 స్కోరుతో దక్షిణ కొరియా జంట కెయుమ్ జిహ్యోన్, పార్క్ హజున్‌లను ఓడించించి పతకాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో రెండో స్ధానంలో నిలిచిన కెయుమ్ జిహ్యోన్, పార్క్ హజున్, సిల్వర్ మెడల్.. మూడో స్ధానంతో సరిపెట్టుకున్న కజకస్తాన్కు చెందిన అలెగ్జాండ్రా లీ, ఇస్తామ్ సత్పయేవ్లకు కాంస్య పతకం దక్కాయి. మరోవైపు డైవింగ్‌లో కూడా చైనా స్వర్ణ పతకం సాధించింది. -
చైనాలో వరద బీభత్సం: 53 మంది మృతి
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. -
చైనా కోరికను తిరస్కరించిన భారత్
నాలుగు సంవత్సరాల తర్వాత నేరుగా ప్యాసింజర్ విమానాలను మళ్ళీ ప్రారంభించాలని చైనా.. భారత్‌ను కోరింది. సరిహద్దు వివాదంలో కొనసాగుతున్న ఉద్రిక్తల కారణంగా ఇండియా.. చైనా రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. జూన్ 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణలో సుమారు భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి భారత్ - చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి.చైనా - ఇండియా మధ్య నేరుగా విమానాల రాకపోకలు లేకపోవడంతో.. హాంకాంగ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు వెళ్లి చైనాకు వెళ్తున్నారు. 2020లో హిమాలయ సరిహద్దులో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేదించింది.సుమారు నాలుగు సంవత్సరాల తరువాత మళ్ళీ విమానయాన సర్వీసులను ప్రారంభించాలని చైనా.. భారత పౌర విమానయాన అధికారులను కోరింది. కానీ భారతీయ అధికారులు దీనిపైన స్పందించలేదు. విమానాయ సర్వీసులను ప్రారంభించడం ద్వారా రెండు దేశాలు ప్రయోజనాన్ని పొందుతాయని చైనా అధికారు చెబుతున్నారు. సరిహద్దులో శాంతి ఉంటే తప్పా చైనాతో ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగవని భారత్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. భారతదేశంలో ఏవియేషన్ రంగంలో బలమైన వృద్ధి చెందుతోంది. పది సంవత్సరాల ముందు 5వ స్థానంలో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్ మార్కెట్.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా అవతరించింది. -
దక్షిణ చైనా సముద్రంలో కలకలం
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దక్షిణచైనా సముద్రంపై తమకు హక్కు ఉందని ఫిలిప్పీన్స్, మలేసి యా, వియత్నాం, బ్రూనై, తైవాన్లు అంతర్జాతీయ స్థాయిలో వాదిస్తున్న విషయం విదితమే. రెండు ఓడల ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా వెల్లడికాలేదు.అసలేం జరిగింది?నన్షా ద్వీపాల సమీపంలోని రెనాయ్ జివో పగడపు దిబ్బ దగ్గర తమ గస్తీ నౌక ఉందని తెల్సికూడా ఉద్దేశపూర్వకంగా అదే దిశలో దూసుకొచ్చి ఫిలిప్పీన్స్‌కు చెందిన సరకు రవాణా నౌక ఢీకొట్టిందని చైనా కోస్ట్ గార్డ్(సీసీజీ) ఆరోపించింది. చైనా కొత్త చట్టం ప్రకారం అనధికారికంగా ప్రయాణించిన ఆ నౌకపై మేం నియంత్రణ సాధించామని సీసీజీ ప్రకటించింది. చైనా చర్యను ఫిలిప్పీన్స్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘చైనా విధానాలు వాస్తవ పరిస్థితిని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సమీపంలోని సెకండ్ థామస్ షావల్ స్థావరంలోని మా బలగాలకు సరకులు, నిర్మాణ సామగ్రిని తీసుకెళ్తున్న మా నౌకకు అడ్డంగా చైనా వారి నౌకను నిలిపింది’’ అని ఫిలిప్పీన్స్ సాయుధ విభాగ అధికార ప్రతినిధి ఎరేస్ ట్రినిడాడ్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం గతంలో ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి(ఈఈజెడ్) పరిధిలో ఉండేది. 2012 ఏడాదిలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసా గుతోంది. దక్షిణ చైనా సముద్రజలాల గుండా ప్రయాణించే పొరుగుదేశాల సరకు రవాణా నౌకలపై తరచూ జల ఫిరంగులను ప్రయోగిస్తూ చైనా నావికాదళాలు తెగ ఇబ్బంది పెట్టడం తెల్సిందే. విదేశీ నౌకల సిబ్బందిని ఎలాంటి ముందస్తు విచారణ లేకుండా 60 రోజులపాటు నిర్బంధించేలా చేసిన చట్టం అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. -
Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
సిమ్లా: చైనా భారత భూబాగాన్ని ఆక్రమించి ఇళ్లు, రోడ్డు నిర్మిస్తోందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నా రు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రొహ్రులో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘56 అంగుళాల ఛాతి ఎటుపోయింద’ని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నా రు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులను లాగేసుకుంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాస్తుందని, కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. -
National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
ప్రపంచవ్యాప్తంగా టీ ప్రేమికులకు కొరత లేదు. ఇందులో గ్రీన్‌టీ, బ్లాక్ టీ ఇలా రకరకాల టీలు చాయ్ ప్రియులను ఉల్లాస పరుస్తుంటాయి. మరి బుబుల్ టీ అని ఒక ‘టీ’ ఉంది. దీని గురించిఎపుడైనా విన్నారా? ఈ రోజు(ఏప్రిల్ 30) నేషనల్ బబుల్టీ డే అట. అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు. దీని వలన లాభాలేంటో ఒకసారి చూద్దామా..?బబుల్ టీ.. ఈ పేరే కొత్తగా ఉంది కదా. బబుల్ టీని బోబా లేదా పెర్ల్ మిల్క్ టీ అని కూడా పిలుస్తారు. ఇది ఆసియాలో ముఖ్యంగా తైవాన్‌లో బాగా పాపులర్. అధిక ప్రోటీన్‌తో నిండి ఉంటుంది కనుక చైనా ధనవంతుల్లో దీనికి డిమాండ్ ఎక్కువ.బబుల్ టీని పాలు, పండ్లు, పండ్ల రసాలతో టీ కలిపి, చివర్లో టేపియోకా ముత్యాలను కలిపి సేవిస్తారు. దీన్ని శీతాకాలంలో వేడిగా, వర్షాకాలంలో చల్లగా సేవిస్తారు.అయితే, బబుల్ టీలో చక్కెర, కొవ్వులు ,సాధారణ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల క్రమం తప్పకుండా మరియు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. మధుమేహం ,గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకని మితంగా తీసుకోవడమే ఉత్తమం.బబుల్ టీలో ఉపయోగించే టపియోకా ముత్యాలు కాసావా రూట్ నుండి తయారవుతాయిపైగా వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి అంతర్గతంగా అనారోగ్యకరమైనవి కానప్పటికీ, అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఈటీలో చేరతాయి.కేలరీల గని ఈ బబుల్ టీ. కార్బోహైడ్రేట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే దీన్ని రోజువారీ పానీయంగా కాకుండా అప్పుడప్పుడు తీసుకునే స్పెషల్ ట్రీట్‌గా మాత్రమే భావించాలి. సాధ్యమైనప్పుడు తక్కువ చక్కెర లేదా చక్కెరలేని స్వీట్నెర్లను, అలాగే క్యాలరీ ,కార్బోహైడ్రేట్లను తగ్గించేందుకు టపియోకా ముత్యాలకు బదులుగా ఫ్రూట్ జెల్లీలు లేదా అలోవెరా వంటి టాపింగ్స్‌ను వాడుకోవచ్చు. -
చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్‌లెస్ ట్రైన్ వీడియో వైరల్
ఇప్పటి వరకు ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించిన చైనా.. మరో కొత్త ఆవిష్కరణను తీసుకువచ్చింది. ఇందులో పట్టాలు లేని లేదా ట్రాక్‌లెస్ ట్రైన్స్ నగరం నడిబొడ్డున తిరగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ వాడుతున్నాయి. పట్టాలు లేకుండా ట్రైన్ ఎలా వెళ్లగలుగుతుంది, దాని పూర్వాపరాలు ఏంటనే వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం. రోడ్డుపై పరుగులు పెట్టే ఈ ట్రైన్ గంటకు 60 మైల్స్ వేగంతో ప్రయాణిస్తుంది, ఒక్క సారికి 100మందిని తీసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ ట్రైన్ నగరంలో ప్రయాణించడం వల్ల సిటీ బస్సు మాదిరిగా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుండం వల్ల జీరో ఉద్గారాలను విడుదల చేస్తుంది. అంటే ఇది పూర్తిగా కాలుష్య రహితమైన ట్రైన్ అని తెలుస్తోంది. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ ట్రాక్‌లెస్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ ట్రైన్.. వేగంగా ప్రయాణించడమే కాకుండా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాఫిక్ సిగ్నెల్ పడితే ఆగుతుంది కూడా. ఇది ఆటోమాటిక్ టెక్నాలజీని కలిగి ఉండటం వల్ల రూట్ బాగా ఫాలో అవుతుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ టెక్నాలజీ ద్వారా ఆపరేట్ అవ్వడానికి ప్రత్యేకమైన సెన్సార్ సిస్టం కలిగి ఉంటుంది. Trackless train in China ...pic.twitter.com/MsMrW4Wi26 — Figen (@TheFigen_) December 29, 2023 -
గోల్డ్‌మెడల్ టార్గెట్‌గా.. చైనాకు బయలు దేరిన టీమిండియా
ఆసియా క్రీడలు-2023లో పాల్గోనేందుకు రుతురాజ్ గైక్వాడ్ సారధ్యంలోని భారత జట్టు గురువారం చైనాకు బయలు దేరి వెళ్లింది. ముంబై నుంచి నేరుగా ఏసియన్ గేమ్స్ జరగుతున్న హంగ్జూకు టీమిండియా పయనమైంది. కాగా క్రీడలకు భారత త్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన బీసీసీఐ.. వీవీయస్ లక్ష్మణ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పింది. అదే విధంగా ఈ జట్టులో యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ సంచలనాలకు చోటు దక్కింది. ఇక ఇప్పటికే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్లో భారత జట్టు గోల్డ్‌మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత పురుషల జట్టు కూడా పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ క్రీడల్లో భారత్ ప్రయాణం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనుంది. నేరుగా క్వార్టర్స్ ఆడుతున్న జట్లలో.. ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. భారత జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ముకేశ్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభుసిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్‌సింగ్. The Ruturaj Gaikwad-led #TeamIndia depart for the #AsianGames 👌👌#IndiaAtAG22 | @Ruutu1331 | @VVSLaxman281 pic.twitter.com/7yYkCLw5zM — BCCI (@BCCI) September 28, 2023 చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. రికీ పాంటింగ్ రికార్డు బద్దలు -
Asian Games 2023, Fencing: క్వార్టర్ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్ విభాగం క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది. క్వార్టర్స్ మొదటి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్‌లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి యాకీ షావో అద్బుతమైన కమ్‌బ్యాక్ బ్యాక్ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్‌లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్‌లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది. రెండో పీరియడ్‌లో చైనీస్ ఫెన్సర్ 6 టచ్‌లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్‌లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా భవానీ దేవి చరిత్ర సృష్టించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ -
Asian Games 2023: పతకాల వేట ఆరంభం.. తొలి రోజు భారత షెడ్యూల్ ఇదే
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఆసియాక్రీడలు-2023కు తేరలేచింది. శనివారం జరిగిన వేడుకలతో ఈ ఆసియా క్రీడల పోటీలు అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే ఆదివారం నుంచి పతకాల వేట ప్రారంభం కానుంది. ఇ ఈ మెగా ఈవెంట్లో భారత్ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం. మెడల్ ఈవెంట్స్ షూటింగ్: మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగం: రమిత, మెహులీ, ఆశి చౌక్సీ (ఉదయం గం. 6 నుంచి 9:15 వరకు). రోయింగ్: పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్ (అర్జున్ లాల్, అరవింద్ సింగ్; ఉదయం గం. 7:10కు); పురుషుల డబుల్ స్కల్స్ ఫైనల్ (సత్నామ్ సింగ్, పరి్మందర్ సింగ్; ఉదయం గం. 8 నుంచి). మహిళల ఫోర్ ఫైనల్ (అశ్వతి, మృణ్మయి, ప్రియా దేవి, రుక్మిణి; ఉదయం. గం. 8:20 నుంచి). పురుషుల పెయిర్ ఫైనల్: బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ (ఉదయం గం. 8:40 నుంచి). పురుషుల ఎయిట్ ఫైనల్ (ఉదయం గం. 9:00కు). మహిళల బాక్సింగ్ (54 కేజీలు తొలి రౌండ్): ప్రీతి వర్సెస్ సిలీనా (జోర్డాన్; ఉదయం గం. 11:30 నుంచి). 51 కేజీలు: నిఖత్ వర్సెస్ ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్ సెమీఫైనల్: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఉ. గం. 6:30 నుంచి). ఫుట్‌బాల్ (లీగ్ దశ): పురుషుల విభాగం: భారత్ వర్సెస్ మయన్మార్ (సాయంత్రం గం. 5 నుంచి); మహిళల విభాగం: భారత్ వర్సెస్ థాయ్‌లాండ్ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి). హాకీ (లీగ్ దశ): పురుషుల విభాగం: భారత్ గీ ఉజ్బెకిస్తాన్ (ఉదయం గం. 8:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (ప్రిక్వార్టర్ ఫైనల్స్): మహిళల విభాగం: భారత్ గీ థాయ్‌లాండ్ (ఉదయం గం. 7:30 నుంచి). పురుషుల విభాగం: భారత్ వర్సెస్ కజకిస్తాన్ (ఉ.గం. 9:30 నుంచి). వాలీబాల్ (క్వార్టర్ ఫైనల్): భారత్ వర్సెస్ జపాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి). -
ఉవ్వెత్తున ఎగసిన ‘ఆసియా’ ఉత్సవం.. పతకాల వేటకు రంగం సిద్దం
ఆర్టిఫీషయల్ ఇంటలిజెన్స్... డిజిటల్ టార్చ్ రిలే టెక్నాలజీ... స్టేడియంలోనే ఉవ్వెత్తున ఎగసి ప్రేక్షకుల మీదికే దూసుకొచి్చనట్లు కనిపించిన అలలు... టపాకాయలు లేకుండానే అందరి చుట్టూ బాణాసంచా పేలినట్లుగా అనుభూతి... ఒక్కటేమిటి, ఇలా ప్రతీది అత్యుత్తమ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో కూడిన ప్రదర్శన... అనూహ్య రీతిలో, గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అంతా అచ్చెరువొందేలా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం జరిగింది... సాంకేతికతను గొప్పగా వాడుకోవడంలో తమ ఘనత ఏమిటో ప్రపంచానికి చైనా మళ్లీ చూపించింది... ఆటలో అగ్రస్థానానికి గురి పెట్టిన ఆ దేశం అసలు సమరానికి ముందే అందరితే ఔరా అనిపించే ఉత్సవాన్ని ప్రదర్శించింది. హాంగ్జౌ: క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన 19వ ఆసియా క్రీడలకు విజిల్ మోగింది. శనివారం జరిగిన వేడుకలతో అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ కార్యక్రమానికి హాజరై పోటీల ప్రారంభపు ప్రకటన చేశారు. 45 దేశాల నుంచి దాదాపు 12 వేలకు పైగా అథ్లెట్లు ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. 80 వేల సామర్థ్యం గల ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా ఆరంభోత్సవం జరగ్గా... అదరగొట్టిన మెరుపు ప్రదర్శనలతో స్టేడియం దద్దరిల్లింది. ఆసియా క్రీడల ఆరంత్సవ వేడుకలకు ‘టైడ్స్ సర్జింగ్ ఇన్ ఏషియా’ అనే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. పోటీల వేదిక అయిన హాంగ్జౌ నగరం గుండా కియాన్టాంగ్ నది ప్రవహిస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన అలలు వచ్చే నదిగా కియాన్టాంగ్కు గుర్తింపు ఉంది. అందుకే ఆసియాలో ఉధృత అలలు అనే తరహా థీమ్‌ను క్రీడలకు కలిపారు. 13 వేర్వేరు అంశాలు ప్రదర్శించగా అన్నింటా ఏదో ఒక చోట నీటి నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది. ►ఆసియా క్రీడల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల క్రీడల గురించి ప్రత్యేక బ్యాంగ్‌ను ప్రదర్శించారు. ►ప్రాచీన చైనా నుంచి మొదలు ఆధునిక చైనా వరకు ఆ దేశ పురోగతి, ప్రస్థానం... ఇలా అన్ని అంశాలను కలుపుతూ చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. సంస్కృతి సాంప్రదాయాల గురించి చెబుతూనే కొత్త తరం సాంకేతికలో ఆ దేశం ముందంజ వేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. పోటీల ప్రారంభోత్సవ రోజైన సెపె్టంబర్ 23కు చైనా సౌర వ్యవస్థలో ప్రత్యేక చోటు ఉంది. ఈ సీజన్ ఆ దేశంలో పంట సేకరణ (మన సంక్రాంతిలాంటిది) అతిథులను ఆహ్హనించే సమయం కూడా. అందుకే ఈ కార్యక్రమానికి ‘ఆటమ్ గ్లో’ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ►1990, 2010లలో కూడా ఆసియా క్రీడలు నిర్వహించిన చైనా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ... ఈసారి క్రీడలు జరుగుతున్న హాంగ్జౌ సమీపంలోనే మూడు హెరిటేజ్ నగరాల విశేషాలు చెబుతూ ‘మెమరీస్ ఆఫ్ జియాంగ్నాన్’ పేరుతో క్రీడల మూడు మస్కట్లు చెన్‌చెన్, కాంగ్కాంగ్, లియాన్ లియాన్ సందడి చేశాయి. ► ప్రారంభోత్సవ వేడుకల మార్చ్‌పాస్ట్‌లో అన్నింటికంటే ముందుగా అఫ్గానిస్తాన్, చివరగా ఆతిథ్య చైనా వచ్చాయి. అఫ్గానిస్తాన్ నుంచి రెండు జట్లు బరిలో ఉన్నాయి. ఒకటి మహిళలు లేకుండా ఆ దేశం పంపిన అధికారిక జట్టు కాగా... మరొకటి విదేశాల్లో తలదాచుకొని శిక్షణ తీసుకుంటూ బరిలోకి దిగిన బృందం. ఇందులో 17 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. మార్చ్‌పాస్ట్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘అవర్ ఏషియా’ పాటను వినిపించారు. ► భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ మన దేశపు జాతీయ పతాకంతో టీమ్ మార్చ్‌పాస్ట్‌కు నాయకత్వం వహించారు. ► చైనాకు చెందిన ముగ్గురు స్టార్లు ప్లేయర్లు, ఒలింపిక్ పతక విజేతలు యి షివెన్, ఫ్యాన్ జెండాంగ్, వాంగ్ జ్యోతిని వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వీరంతా ఒకవైపు నిలబడగా... డిజిటల్ పద్ధతిలోనే టార్చ్‌ను వెలిగించారు. టార్చ్‌తో అథ్లెట్ పరుగెడుతూ వెళుతున్న లేజర్ షో ప్రేక్షకులకు కొత్త తరహా అను భూతిని పంచింది. చివర్లో బాణాసంచాను కూడా ఇదే తరహాలో పేల్చి క్రీడల ఆరం¿ోత్సవానికి ఘనమైన ముగింపునిచ్చారు. చదవండి: నేడు ఆసీస్‌తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్ -
ఆసియా క్రీడలకు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు-2023కు 15 మంది సభ్యులతో కూడిన శ్రీలంక-ఏ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ సహన్ అరాచ్చిగే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సహన్ అరాచ్చిగే శ్రీలంక సీనియర్ జట్టు తరపున ఇప్పటివరకు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. అయితే దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉండడంతో జట్టు పగ్గాలు అతడికి సెలక్టర్లు అప్పగించారు. అంతేకాకుండా ఆసియాకప్-2023 ఫైనల్ శ్రీలంక జట్టులో కూడా అరాచ్చిగే బ్యాకప్‌గా ఉన్నాడు. అదే విధంగా ఆసియా క్రీడల్లో పాల్గోనే శ్రీలంక జట్టులో నువానీడు ఫెర్నాండో,అషెన్ బండార వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023కు సమయం ఆసన్నం కావడంతో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపాలని శ్రీలంక సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో 10 వికెట్ల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ టోర్నీలో పాల్గోనే తమ మహిళల జట్టును కూడా శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. ఈ జట్టుకు ఆతపట్టు నాయకత్వం వహించనుంది. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8వరకు జరగనుంది. శ్రీలంక జట్టు: లసిత్ క్రూస్పుల్లే, షెవోన్ డేనియల్, అషెన్ బండార, సహన్ అరాచ్చిగే (కెప్టెన్), అహన్ విక్రమసింఘే, లహిరు ఉదార (వికెట్ కీపర్), రవిందు ఫెర్నాండో, రాణిత లియానారాచ్చి, నువానీడు ఫెర్నాండో, సచిత జయతిలకే, విజయకాంత్ వియస్కాంత్, నిమేష్ నూతుస్ర విముక్తి, నిమేష్ నూతుస్ర విముక్తి, చదవండి: Asia Cup 2023: పాక్ క్రికెట్లో ముసలం.. బాబర్‌తో విభేదాలు! వైస్ కెప్టెన్‌పై వేటు The Sri Lanka Cricket Selection Committee selected the following men’s (Sri Lanka ‘A’) and women’s squad to take part in the Asian Games 2023 to be held in Hangzhou, China, from September 23 to October 8.#AsianGames pic.twitter.com/fOV9reZmwV — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 18, 2023 -
చైనా కంపెనీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా చిప్‌ల తయారీ!
అమెరికా ఆంక్షల నేపథ్యంలో చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ హువాయి టెక్నాలజీస్ ( Huawei Technologies ) చైనా అంతటా రహస్యంగా సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న సెమీకండక్టర్ అసోసియేషన్ హెచ్చరించినట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ తాజాగా నివేదించింది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం ఏడాది క్రితమే చిప్‌ల ఉత్పత్తి చేపట్టిందని, ఇందు కోసం ఆ దేశ ప్రభుత్వం నుంచి 30 బిలియన్ డాలర్ల నిధులను సైతం పొందిందని సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెబుతోంది. దేశంలో ఇప్పటికే రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసిన హువాయి మరో మూడు ప్లాంట్లను నిర్మిస్తోందని అనుమానం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన సమస్యల కారణంగా 2019లో యూఎస్ వాణిజ్య విభాగం తమ ఎగుమతి నియంత్రణ జాబితాలో హువాయి కంపెనీని చేర్చింది. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ చెప్పినట్లుగా ఇతర కంపెనీల పేర్లతో హువాయి తయారీ కేంద్రాలను నిర్మిస్తుంటే యూఎస్ ఆంక్షలను అధిగమించి అమెరికన్ చిప్ తయారీ పరికరాలను పరోక్షంగా కొనుగోలు చేస్తుండవచ్చని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. యూఎస్‌లో హువాయి కంపెనీని ట్రేడ్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. దీంతో ఆ కంపెనీకి ఇక్కడి కంపెనీలు విడిభాగాలు, సాంకేతికతను అందించేందుకు వీలు లేదు. సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయకుండా హువాయి కంపెనీ కట్టడి చేసేందుకు యూఎస్ అధికారులు నియంత్రణలను కఠినతరం చేస్తున్నారు. ఇదీ చదవండి: సంపదకు సరికొత్త నిర్వచనం.. వారెన్ బఫెట్! ఆస్తుల్లో కొత్త మైలురాయి.. -
తీవ్ర సంక్షోభంలో చైనా ఆర్థిక వ్యవస్థ
-
చైనా మళ్లీ ఏసేసిందిగా.. ఏకంగా మారుతి జిమ్నీకే ఎసరు
చైనా ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పటికే కొన్ని వాహనాలను కాపీ కొట్టి తయారు చేసినట్లు గతంలో చదువుకున్నాం. అలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇందులో మారుతి జిమ్నీ ఆధారంగా డూప్లికేట్ జిమ్నీ తయారు చేశారు. ఇది చూడటానికి జిమ్నీ మాదిరిగా కనిపించినప్పటికీ జిమ్నీ కాదని చూడగానే తెలిసిపోతోంది. SIAC యాజమాన్యంలోని 'బౌజన్' కంపెనీ 'బౌజన్ ఏప్' (Baojun Yep) ఎలక్ట్రిక్ ఎస్యువి ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న జిమ్నీ 3-డోర్స్ మోడల్ని పోలి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 2023 ఏప్రిల్‌లో జరగనున్న షాంగై ఆటో షోలో ప్రదర్శనకు వస్తుంది. ఇదే ఏడాది 'మే' నెల నాటికి అధికారికంగా విడుదలవుతుంది. భారతదేశంలో విక్రయిస్తున్న మారుతి జిమ్నీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది, బౌజన్ ఏప్ ఎలక్ట్రిక్ వెర్షన్ డిజైన్ పరంగా కొత్తగా ఉంటుంది. అయినప్పటికీ ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 303 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా అందుబాటులోకి రాలేదు. గ్లోబల్ మార్కెట్లో ఎంతోమంది మనసు దోచిన జిమ్నీ డూప్లికేట్ అవతారంలో పుట్టుకొస్తుంది, మరి ఇది ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి..! చైనీస్ తయారీదారులు ఇప్పటికే బజాజ్ పల్సర్, కెటిఎమ్ డ్యూక్, యమహా ఆర్3, కవాసకి నింజా వంటి మోడల్స్ కాపీ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో విరివిగా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. -
బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద డ్రాగన్ దేశం చైనా రెచ్చిపోతోంది. డ్రాగన్ సైన్యం భారత భూభాగంలోకి క్రమంగా చొచ్చుకొస్తూ సరిహద్దును సైతం మార్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన డీజీపీల సమావేశంలో చైనా వ్యవహారంపై అధికారులు సమర్పించిన ఓ నివేదికలో పలు సంచలన అంశాలు బహిర్గతమయ్యాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో భారత్–చైనా సైనికుల నడుమ మరిన్ని ఘర్షణలు జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని వెలువరించింది. భారత్–చైనాల మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలు, నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ‘‘2013–14 తర్వాత రెండు మూడేళ్లకోసారి ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతల తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరిహద్దులో ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక బలగాలను పెంచుకుంటున్నాయి. చైనా చర్యల వల్ల తూర్పు లద్దాఖ్‌లో భారత్ ఇప్పటికే పలు కీలక గస్తీ పాయింట్లను కోల్పోయింది. చైనా దూకుడును అడ్డుకోవాలంటే సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలి. సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించాలి’’ అని సూచించారు. -
జనాభాలో చైనాను దాటేశాం
న్యూఢిల్లీ: మరో మూడు నెలల తర్వాత జరుగుతుందనుకున్నది కొన్నాళ్ల క్రితమే జరిగిపోయిందా? జనాభాలో మనం చైనాను దాటేశామా? ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా అవతరించామా!! అవుననే అంటోంది వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూపీఆర్) నివేదిక. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించడం తెలిసిందే. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందా? ఆర్బీఐ మాజీ గవర్నర్ వ్యాఖ్యలు
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి
బీజింగ్: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది. ► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది. ► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు. ► దేశ జనాభాలో సీనియర్ సిటిజన్లు 62 శాతం. ► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం. ► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందనడం తొందరపాటే..
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
వైరల్ వీడియో: రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై దూసుకెళ్లిన లగ్జరీ కారు