విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమా 'మహారాజ' ఇప్పుడు చైనాలో విడుదల కానుంది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ ప్రాజెక్ట్‌గా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్లు పైగానే రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు చైనాలో రిలీజ్‌కు రెడీ అయింది.
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మహారాజ చిత్రం.. ఇప్పుడు చైనాలో ఏకంగా 40వేల స్క్రీన్స్‌లలో విడుదల కానుంది. నవంబర్ 29న యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాయి. ఈ మూవీలోని సెంట్మెంట్కు చైనా సినీ అభిమానులు కనెక్ట్ అయితే భారీగా కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. కనీసం అక్కడ రెండు వారాలపాటు థియేటర్‌లో సినిమా రన్ అయితే సుమారు రూ. 500 కోట్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. మంచి ట్విస్ట్‌లతో ఈ చిత్రాన్ని దర్శకుడు నిథిలిన్ సామినాథన్ అద్భుతంగా ప్రేక్షకులకు చూపించాడు. ఒక ఇండియన్ సినిమా చైనాలో ఇంత పెద్ద ఎత్తున విడుదల కానున్నడంతో అభిమానులు హర్షిస్తున్నారు. ఓ ఇండియన్ మూవీ చైనాలో ఇంత భారీగా రిలీజ్ కావడం ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకూ ఈ రికార్డ్ దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment