తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చిన విడుదల 1 ఘన విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. జనవరి 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు ఆడియోలోనూ అందుబాటులో ఉండనుంది. విడుదల పార్ట్ 1 కూడా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే!
సినిమా కథ
ప్రజాదళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి) అరెస్టుతో విడుదల 1 కథ ముగుస్తుంది. జైల్లో ఉన్న పెరుమాళ్ విచారణతో విడుదల పార్ట్ 2 ప్రారంభమవుతుంది. పెరుమాళ్ అరెస్టు విషయం బయటకు తెలియడంతో అతడిని మరో క్యాంపుకు తరలించి అక్కడే ఎన్‌కౌంటర్ చేయాలని పథకం రచిస్తారు. కొమరన్ (సూరి)తో కలిసి మరికొంతమంది పోలీసులు పెరుమాళ్‌ను అడవి మార్గం గుండా క్యాంపుకు తీసుకెళ్తారు.
ఈ ప్రయాణంలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ కథ చెప్తాడు. ప్రజాదళంలోకి ఎలా వచ్చాడు? అతడి ఆశయం ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనక ఉన్న నిజమేంటి? పోలీసుల కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment