విజయ్ సేతుపతి, సూరి లీడ్ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్ 1’ చిత్రం 2023లో రిలీజ్ కాగా తమిళ్, తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు.
విడుదలై 2 బాక్సాఫీస్ వద్ద ఊహించనంతగా మెప్పించలేదు. దీంతో పెద్దగా కలెక్షన్స్ కూడా సాధించలేకపోయింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారట. 2025 జనవరి 17వ తేదీన ‘విడుదల 2’ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చే ప్లాన్‌లో జీ5 ఉన్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్ రెండూ ఒకే రోజు అందుబాటులోకి రానున్నట్లు టాక్. అయితే, ఈ విషయంలో 'జీ5' ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు రూ. 50 కోట్ల మార్క్‌ను అందుకుంది.
కథేంటంటే..
ప్రజాదళం నాయకుడు పెరుమాళ్(విజయ్ సేతుపతి) అరెస్ట్‌తో 'విడుదల -1' ముగుస్తుంది. కస్టడీలో ఉన్న పెరుమాళ్ విచారణతో పార్ట్ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ అరెస్ట్ విషయం బయటకు తెలియడంతో అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు.
మార్గమధ్యలో పెరుమాళ్ తన ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ చెబుతాడు. స్కూల్ టీచర్‌గా ఉన్న పెరుమాళ్ దళంలోకి ఎలా చేరాడు? జమిందారి వ్యవస్థ చేసే అరచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్) పరిచయం పెరుమాళ్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? తను పని చేసే ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్)తో ప్రేమాయణం ఎలా సాగింది? ప్రజాదళం ఆశయం ఏంటి? ప్రజల కోసం పెరుమాళ్ చేసిన పోరాటం ఏంటి? ప్రజాదళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు చేసిన కుట్ర ఏంటి? పార్ట్ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్ తప్పించుకున్నాడా లేదా? సూరి తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment