హీరో రామ్ చరణ్ (Ram Charan) గొప్ప మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చాడు. చరణ్ అభిమానిగా ఎన్నోసార్లు రక్తదానం చేసిన ఓ వ్యక్తి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్- ఉపాసన దంపతులు అతడికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో అతడి భార్యను చేర్పించారు. 17 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించేవారు.
అభిమాని భార్యకు వైద్యసాయం
ఇది చూసిన అభిమాని హాస్పిటల్ బిల్లు ఎంతవుతుందోనని కంగారుపడ్డాడు. కానీ చరణ్ దంపతులు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్‌మెంట్ చేయిస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. ఈ విషయాన్ని సదరు అభిమాని అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో వెల్లడించాడు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు చికిత్స అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేసి మరీ తన భార్యను ఇంటికి క్షేమంగా పంపించాడని చెప్పుకొచ్చాడు. అలాగే షోలో చరణ్.. అభిమానికి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించాడు. ఇది చూసిన నెటిజన్లు చరణ్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోంది.
చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment