Unstoppable With NBK
-
రామ్ చరణ్ గొప్ప మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి..
హీరో రామ్ చరణ్ (Ram Charan) గొప్ప మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి నేనున్నానంటూ అభయహస్తమిచ్చాడు. చరణ్ అభిమానిగా ఎన్నోసార్లు రక్తదానం చేసిన ఓ వ్యక్తి భార్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్- ఉపాసన దంపతులు అతడికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో అతడి భార్యను చేర్పించారు. 17 రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించేవారు.అభిమాని భార్యకు వైద్యసాయంఇది చూసిన అభిమాని హాస్పిటల్ బిల్లు ఎంతవుతుందోనని కంగారుపడ్డాడు. కానీ చరణ్ దంపతులు రూపాయి ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేయిస్తున్నారని తెలిసి ఎంతగానో సంతోషించాడు. ఈ విషయాన్ని సదరు అభిమాని అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో వెల్లడించాడు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతో పాటు చికిత్స అనంతరం అంబులెన్స్ ఏర్పాటు చేసి మరీ తన భార్యను ఇంటికి క్షేమంగా పంపించాడని చెప్పుకొచ్చాడు. అలాగే షోలో చరణ్.. అభిమానికి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించాడు. ఇది చూసిన నెటిజన్లు చరణ్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోంది.చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు -
సిక్స్‌ప్యాక్ లేదని నన్ను రిజెక్ట్ చేశారు: నవీన్ పొలిశెట్టి
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4లో హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఎప్పటిలాగే నవీన్ పొలిశెట్టి నవ్వులు పంచాడు.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ.. సర్, మీరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే.. మీరు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. నేను మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్ అంటూ నవ్వులు పూయించాడు.క్లాసికల్ స్టైల్లో కుర్చీ మడతపెట్టిశ్రీలీల వీణ పట్టుకుని కూర్చోగా.. కుర్చీ మడతపెట్టి పాటను క్లాసికల్ స్టైల్లో ట్రై చేయమంటూ రాగమందుకున్నాడు నవీన్. అతడి గానం విన్న శ్రీలీల.. తన వీణ భరించలేకపోతోందంటూ నవ్వేసింది. ఆడిషన్స్ గురించి చెప్పమని బాలయ్య అడగ్గా.. నవీన్ ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. సిక్స్ ప్యాక్ లేదని..ఓ చిప్స్ కంపెనీ ఆడిషన్లో.. నాకు సిక్స్ ప్యాక్ లేదని రిజెక్ట్ చేశారు. అసలు చిప్స్ తిన్నవాడికి సిక్స్‌ప్యాక్ ఎలా వస్తుదని లాజిక్ పాయింట్ అడిగాడు. చివర్లో ముగ్గురూ కిస్సిక్ పాటకు స్టెప్పులేశారు. ఈ ఫన్‌ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ 6న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో రిలీజ్ కానుంది. -
బాబు గారి పొగడ్తలు.. అన్‌స్టాపబుల్!
ఆంధప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయం ఎలా సాగిపోతోందో తెలుసా? హిందూపురం ఎమ్మెల్యే, బాబుగారి బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ ఇంటర్వ్యూ మాదిరిగా సాగుతోందని అనవచ్చు. ఎందుకంటారా? ఆ ఇంటర్వ్యూలో మాదిరిగానే బాబుగారిని పచ్చమీడియా ఓ పొగిడేస్తోంది కాబట్టి.. భారీగా బిల్డప్ ఇచ్చి నిలబెడుతోంది కాబట్టి!! అన్‌స్టాపబుల్ అంటే నిరాఘాటంగా అని తెలుగు అర్థం. మామూలుగానైతే ఓ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ అంటే అందులో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజా సమస్యలు వంటివి చర్చకు వస్తూంటాయి. అధికారం చేపట్టి నాలుగు నెలలైన నేపథ్యంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడతారని ఆశిస్తాం. కానీ.. అలాంటివేవీ ఇందులో కనిపించవు. సానుకూల దృక్పథంతో మాట్లాడుకోవడం వరకూ ఓకే కానీ.. అచ్చంగా భజన కోసమన్నట్టుగా ముఖాముఖి నిర్వహిస్తేనే సమస్య. బాలకృష్ణ సినీ నటుడు కనుక, ఆయనకు ఏదో గ్లామర్ ఉంటుంది కనుక దానిని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు పెడుతున్నారని అర్థం చేసుకోవడం కష్టం కాదు. చంద్రబాబు ప్రజలను మాయ చేయడానికి ఈ గ్లామర్‌తోపాటు తన అధికారాన్ని కూడా వాడుకుంటున్నారు. ఏతావాతా ఎల్లో మీడియాలో వచ్చిన స్టోరీ అంతటిని చదివితే ఏమని అనిపిస్తుందంటే చంద్రబాబు, బాలకృష్ణలు, అన్ స్టాపబుల్‌గా అబద్దాలు చెప్పుకున్నారూ అని! తనకు, తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడంలో చంద్రబాబు దిట్ట. తనపై వచ్చిన స్కిల్ స్కామ్ తదితర కేసులను నీరు కార్చడానికి ఈ ప్రోగ్రాం వేదికగా చంద్రబాబు ఒక ప్రాతిపదికను సిద్దం చేసుకుంటున్నారని అనిపించింది. ఇప్పటికే తనపై వచ్చిన అవినీతి కేసులను నీరుకార్చడానికి సన్నాహాలు ఆరంభించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఏనాడు కక్ష రాజకీయాలకు పాల్పడలేదని ఆయన చెప్పారట. తనకు రాజకీయంగా పోటీ వస్తారని భావించి కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్ పై అక్రమ కేసులు పెట్టడం కక్ష రాజకీయం కాదన్నమాట. జగన్ టైమ్‌లో పలు స్కీములకు, ప్రాజెక్టులకు ఆయా ప్రముఖుల పేర్లు పెడితే వాటిని తాను అధికారంలోకి రాగానే తొలగించడం కక్ష రాజకీయం కాదట. ఉదాహరణకు గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు దివంగత నేతలు గౌతంరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట్రామి రెడ్డిల పేర్లు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం వాటిని తొలగించి వేసింది. తనను అరెస్టు చేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. అంతవరకు ఒప్పుకోవచ్చు. తప్పు చేసినా, చేయకపోయినా, అరెస్టు కావాలని ఎవరూ కోరుకోరు కదా! కానీ అదే సందర్భంలో తాను చట్ట ధిక్కరణ చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఏపీ సీఐడీ ఆధారాలతో ప్రభుత్వ డబ్బు రూ.300 కోట్లు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ అయిందని కేసు పెట్టింది కదా? దానిని ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు నిర్దారించారు కదా? ఈ కేసులో పలువురిని అరెస్టు కూడా చేశారు కదా? టీడీపీ ఖాతాలోకి సుమారు రూ.అరవై కోట్లు వచ్చిందని సీఐడీ వివరాలు ఇచ్చింది కదా? అలా జరగలేదని టీడీపీ ఎందుకు చెప్పలేకపోయింది? అసలు ఆ కేసు విచారణకు పిలుస్తారని భావించి, తన పీఏ శ్రీనివాస్‌ను అకస్మాత్తుగా అమెరికా పంపించడం అవాస్తవమా? నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు హెలికాఫ్టర్‌లో విజయవాడకు తీసుకు వెళతామని చెబితే ఒప్పుకోకుండా బస్‌లో ప్రయాణించింది దేని కోసం?. రాజమండ్రి జైలులో ఈయన ఏసీ కావాలని అడిగితే ప్రభుత్వం సమకూర్చలేదా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే,వాటినే తాను వాడుకుంటూ అప్పుడేదో అనుమానస్పద ఘటనలు జరిగాయని చెప్పడం ఇన్నేళ్ల సీనియర్ నేతకు తగునా?... ఇక బావమరిది బాలకృష్ణ ఇచ్చిన ఎలివేషన్ చూడండి. చంద్రబాబు అరెస్టుతో భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు అదిరిపోయారట. కన్నీళ్లు పెట్టుకున్నారట. ‘‘ఆయన అసలు గీత దాటని మనిషి. ప్రజలే ఆయన కోసం గీత దాటారు’’ అని మాట్లాడారు ఆయన. మీడియా చేతిలో ఉంటే ఎలా బాజా బజాయించుకోవచ్చో ఈ ఇంటర్వ్యూ తెలియ చేస్తుంది. జైలులో మొదటి రాత్రి అనుభవాలు ఏమిటని బాలకృష్ణ అడగడం, చంద్రబాబేమో దానికి వైనవైనాల వర్ణనలతో సమాధానం ఇవ్వడం భలేగా ఉంది. ఏ వ్యక్తిని అయినా పోలీసులు అరెస్టు చేస్తే, ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో, దానినే అప్పుడు కూడా అనుసరించారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చి, తనను రాత్రి తిప్పారని, విచారించారని చెబుతున్న తీరు ఇప్పటికీ దాని ద్వారా సానుభూతి పొందాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి కాదు. తన సోదరి భువనేశ్వరి, తదితర కుటుంబ సభ్యులు అప్పట్లో చేసిన ఆందోళనలను కూడా బాలకృష్ణ ప్రస్తావించుకున్నారు. మరో హైలైట్ ఏమిటంటే ఆకాశంలో సూర్యచంద్రులు, ఆంధ్రాలో బాబు, కళ్యాణ్ బాబు అని అంటున్నారట.నిజమా? మరి ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వారిని అలగా జనం అని బాలకృష్ణ ఎందుకు గతంలో సంబోధించారో? పవన్ కళ్యాణ్ ,చంద్రబాబులు కలిసి పోటీ చేయాలని అనుకోవడం చారిత్రక సన్నివేశంగా చూపించడానికి బాలకృష్ణ యత్నించారు. విజయవాడలో వరదలలో చంద్రబాబు చాలా కష్టపడ్డారని ప్రొజెక్షన్ ఇవ్వడానికి బాలకృష్ణ తంటాలు పడ్డారు. చంద్రబాబు కలెక్టరేట్లో బస్‌లో బస చేయడం, పడవ ఎక్కడం అన్ని ఎవరూ చేయలేని పనులు అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. మరి అసలు వరదలు రావల్సిన అవసరం ఏమిటి? పది రోజులపాటు లక్షల మంది ఎందుకు నానా పాట్లు పడ్డారు? చంద్రబాబు కృష్ణ నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో నివసిస్తున్నారా?లేదా? ఆ ఇంటిలోకి వరద నీరు చేరడంతోనే ఆయన బస మార్చింది అవాస్తవమా? అసలు వరదలే రాని ప్రాంతంలో వరదలు వచ్చినందుకు వారు బాధపడినట్లు లేదు. పది రోజుల్లో సాధారణ పరిస్థితి తెచ్చామని జబ్బలు చరుచుకున్నారు.మరో కీలక అంశం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసి నెయ్యి వాడారన్న ఆరోపణ గురించి బాలకృష్ణ ప్రశ్నించినా ,చంద్రబాబు జవాబు దాటవేశారనే అనుకోవాలి. సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పి వదలివేశారు. మరి అంతకుముందు జగన్ పై అన్యాయమైన ఆరోపణలు ఎందుకు చేసినట్లు? అది కక్ష రాజకీయం కాదా? యథా ప్రకారం అమరావతి కల గురించి కూడా ప్రశ్నించారు. ఆయన ఎప్పటి మాదిరి సైబరాబాద్ తనదేనని, హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానని చెప్పుకున్నారు. ఇంతకీ అసలు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాల గురించి ఒక్క మాట అడిగితే ఒట్టు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు, బాలకృష్ణలు కలిసి ఆడిన మరో అన్ స్టాపబుల్ డ్రామాగా దీనిని అభివర్ణించుకోవచ్చేమో!. - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్
తెలుగు రాష్ట్రాల్లో దసరా మేనియా వచ్చేసింది. స్కూళ్లకు సెలవులిచ్చేశారు. తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్స్ సాగుతున్నాయి. అలానే ఈ వారం థియేటర్లలోకి లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి భారీ బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. వీటి మధ్య మంచి పోటీ ఉండబోతుంది. వీటిలో ఏదో హిట్ కాబోతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక) మరోవైపు థియేటర్లకి వెళ్లి సినిమా చూసే మూడ్ లేని ప్రేక్షకులు ఓటీటీలో ఏమొస్తున్నాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఈ వారం ఏకంగా 40 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో మామా మశ్చీంద్ర సినిమా, మ్యాన్షన్ 24, కృష్ణారామా అనే వెబ్ సిరీసులు తెలుగు ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటితో మరిన్ని స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఏవి ఎందులో రిలీజ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్-వెబ్ సిరీస్‌లు (అక్టోబరు 16-22) నెట్‌ఫ్లిక్స్ రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 16 ఐ వోకప్ ఏ వ్యాంపైర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 17 ద డెవిల్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17 కాలా పానీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 18 సింగపెన్నే (తమిళ చిత్రం) - అక్టోబరు 18 బాడీస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19 కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19 క్రిప్టో బాయ్ (డచ్ సినిమా) - అక్టోబరు 19 నియాన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19 క్రియేచర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబరు 20 డూనా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 20 ఎలైట్ సీజన్ 7 (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 20 కండాసమ్స్: ద బేబీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20 ఓల్డ్ డాడ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20 సర్వైవింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20 పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20 జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ (ఫ్రెంచ్ సినిమా) - అక్టోబరు 20 క్యాస్ట్ అవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 21 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వన్స్ అపాన్ ఏ స్టూడియో (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16 మ్యాన్షన్ 24 (తెలుగు సిరీస్) - అక్టోబరు 17 అమెజాన్ ప్రైమ్ పర్మినెంట్ రూమ్మేట్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - అక్టోబరు 18 ద వ్యాండరింగ్ ఎర్త్ II (మాండరిన్ సినిమా) - అక్టోబరు 18 మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) - అక్టోబరు 20 సయెన్: డిసర్ట్ రోడ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20 ద అదర్ జోయ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20 ట్రాన్స్ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20 అప్లోడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20 ఆహా అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ (తెలుగు టాక్ షో) - అక్టోబరు 17 రెడ్ శాండల్‌వుడ్ (తమిళ సినిమా) - అక్టోబరు 20 సోనీ లివ్ హామీ 2 (బెంగాలీ సినిమా) - అక్టోబరు 20 జియో సినిమా డేమీ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 16 బిగ్‌బాస్ 17 (హిందీ రియాలిటీ షో) - అక్టోబరు 16 బుక్ మై షో మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17 షార్ట్ కమింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17 టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 18 ద నన్ II (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 19 మై లవ్ పప్పీ (కొరియన్ సినిమా) - అక్టోబరు 20 ఈ-విన్ కృష్ణా రామా (తెలుగు సినిమా) - అక్టోబరు 22 లయన్స్ గేట్ ప్లే మ్యాగీ మూరే (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20 ఆపిల్ ప్లస్ టీవీ ద పిజియన్ టన్నెల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20 (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
అన్‌స్టాపబుల్‌గా ఏమైనా చేసుకోండి, కానీ.. ఈ కామెంట్లు అవసరమా బాలయ్యా?
తెలుగుదేశం హిందుపూర్ శాసనసభ్యుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, జనసేన అధినేత, మరో ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్అ న్‌స్టాపబుల్ అంటూ ఏమైనా మాట్లాడుకోనివ్వండి. ఆపకుండా నవ్వుకోనివ్వండి. ఎవరికి అభ్యంతరం లేదు. కాని మధ్యలో ప్రజలను ఉద్దేశించి , లేదా సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టింగులు చేసేవారి గురించి వాడిన భాష అభ్యంతరకరంగా ఉంది. ప్రత్యేకించి బాలకృష్ణ ఊరకుక్కల భాష వాడడం దారుణం. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు గురించి ఎవరైనా మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అట. అసలు ఊరకుక్కలు ఏమి చేస్తాయో ఆయనకు తెలుసా! వావి వరసలతో నిమిత్తం లేకుండా లైంగిక కార్యకలాపాలకు పాల్పడతాయని, రోడ్లపై ఇష్టారీతిలో సంచరిస్తాయని ఊరకుక్కలు అంటారు. ఏ రంగంలో ఎవరు ఇలా వ్యవహరిస్తారో ఇలాంటి చెత్త పనులు ఎక్కువగా చేస్తారో చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మనకు సభ్యత అడ్డువస్తుంది. కాని అలాంటి వాటితో నిమిత్తం లేని వారు ఏమైనా మాట్లాడగలరు. గతంలో ఇదే బాలకృష్ణ ఏమన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి. లేక... చేయాలి అని అన్నారు. ఆక్షేపణీయపు భాష వాడడం ఇష్టం లేక డాట్ లు పెట్టాల్సి వచ్చింది. ఆడపిల్లల తండ్రి ఎవరైనా ఇలా మాట్లాడతారా? అంతేకాదు .. సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగులు, అర్ధనగ్న నృత్యాలు, అబ్జెక్షనబుల్ సన్నివేశాలు ఎన్ని కనిపిస్తుంటాయో, వాటిపై అప్పుడప్పుడు మహిళా సంఘాలు ఎందుకు ఆందోళనలు చేస్తుంటాయో.. ఇవేవి ప్రజలకు తెలియవా? కేవలం మూడు పెళ్లిళ్లు అని ప్రస్తావిస్తేనే ఊరకుక్కలతో సమానం అయితే పైన చెప్పినవాటిని ఏ మాత్రం సిగ్గుపడకుండా చేసేవారిని ఏమనవలసి వస్తుంది. తన ఇంటిలోనే ఇద్దరిపై కాల్పులు జరిపినవారిని ఏమనాలి? సినిమాలతో పాటు రాజకీయాలలో ఉన్నవారు ఎంత బాధ్యతగా మాట్లాడాలి. సమాజంలో ఎంతో కొంత ప్రభావం చూపే వ్యక్తులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారి అభిమానులు కూడా ఇలాగే తయారవ్వరా? సడన్ గా బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ పై రాజకీయ అవసరాల రీత్యా అభిమానం ఏర్పడవచ్చు. అంతకుముందు జనసేనవారిని ఉద్దేశించి అలగాజనం అని, మరొకటి అని అన్నా, పవన్ కళ్యాణ్ పెద్దగా ఫీల్ కాకపోతే అది ఆయన ఇష్టం. కాని ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడితే ఊరకుక్కలతో సమానం అంటే మాత్రం కచ్చితంగా చాలామంది బాదపడతారు. దానిపై అదే స్థాయిలో స్పందిస్తుంటారు. అందువల్లే సోషల్ మీడియాలో బాలకృష్ణపై విమర్శలు వెల్లువెత్తున్నాయట. పవన్ కు బాలకృష్ణ సర్టిఫికెట్ ఇచ్చేస్తే జనం ఒప్పేసుకోవాలా! ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చూసినా చిత్రంగానే ఉంటాయి. అసలు ఇలాంటి ప్రశ్నలను అవాయిడ్ చేయవచ్చు. అయినా వారిద్దరూ కావాలని మాట్లాడుకున్నారు. తద్వారా అదేదో మూడు పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు.. అది చాలా చిన్న విషయం అన్నట్లుగా వీరి సంభాషణ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు చెబుతుంటారు. వాటిలో నిజం ఉందో లేదో ఎవరికి అర్ధం కాదు. ఈసారి ఏకంగా ఆయన బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానని, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నా అని ఆయన చెప్పారు. కాని, మూడు సార్లు పెళ్లి జరిగింది తనకేనా అనిపిస్తుందట. ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకోలేదని, ముగ్గురితో ఒకేసారి ఉండ లేదని ఆయన అంటూ పెళ్లిళ్లకు కారణాలు చెప్పారు. కాని ఇక్కడ కూడా ఆయన నిజం చెప్పలేకపోయారు. ఆయన యోగి అవుతాననుకున్నది నిజమా? కాదా అన్నది మనకు అనవసరం. ఒక పెళ్లి చేసుకుని మరో మహిళతో సహజీవనం చేశారన్నది ఆయనపై కొందరు చేసే అబియోగం. అది వాస్తవమా? కాదా? అన్నదానిపై ఆయన క్లారిటీ ఇస్తే ఆయనలోని నిజాయితీ ప్రజలకు కాకపోయినా, అభిమానులకు అయినా అర్దం అయ్యేది. విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవడం తప్పుకాదు. ఆయన అన్నది అంతవరకు వాస్తవమే. కాని అలా చేయలేదన్నది ఆయన ప్రత్యర్ధులు చేసే ఆరోపణ. ఇక పవన్ కళ్యాణ్ కొందరు విశిష్ట వ్యక్తుల పేర్లు ప్రస్తావిస్తూ, అంబేద్కర్, పూలె, తరిమెల నాగిరెడ్డి, రామ్ మనోహర్ లోహియా వంటివారు రచించిన పుస్తకాలు చదివానని అంటారు. ఏదైనా సందేహం తీర్చుకోవాలంటే ఆ పుస్తకాలపై ఆధారపడతారట. అసలు వారు రాసిననాటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు సంబంధం ఉందా? 2009లో ప్రజారాజ్యం, 2014 లో జనసేనను స్థాపించి టిడిపి, బిజెపిలకు మద్దతు ఇవ్వడం, 2019లో బిఎస్పి, వామపక్షాలతో కలిసి పోటీచేయడం, తదుపరి బిజెపివారిని బతిమలాడుకుని పొత్తు పెట్టుకోవడం. వీటన్నిటిలో ఆ ప్రముఖుల పుస్తకాలతో ఏమి సంబంధం. పాపం.. ఆ మహనీయులు జీవించి ఉంటే ఎంత క్షోభ పడేవారో! ఏదో ఒకటి చెప్పి తానేదో గొప్ప చదువరిని అని ప్రొజెక్టు చేసుకోవడం తప్ప మరొకటి కాదు. సిపిఐ సీనియర్ నేత చంద్రశేఖర్ టీవీలలో ఒక వ్యాఖ్య చేసేవారు. పవన్ కళ్యాణ్ ఎనభైవేల పుస్తకాలు చదవలేదని, వాటి అట్టలను మాత్రమే చూసి ఉంటారని పేర్కొన్నారు. మరి ఎవరు కరెక్టో వారే చెప్పాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం. తనకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురువు వంటివారని, ఆయనతో ఆయా అంశాలతో చర్చిస్తానని అన్నారు. ఏమి చర్చిస్తారో తెలియదు కాని, పవన్ కళ్యాణ్ ఆయన రాసిచ్చే డైలాగులనే సభలలో వాడుతుంటారని అంతా చెబుతుంటారు. కొంతలో కొంత ఇదైనా నిజం చెప్పినందుకు సంతోషించాలి. ఇలాంటి అన్ స్టాపబుల్ కార్యక్రమాలతో ఒటిటికి ఏమైనా లాభం కొంత ఉండవచ్చేమో కాని, రాజకీయంగా ప్రయోజనం అంతంతమాత్రమే అని చెప్పాలి. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
‘అన్‌స్టాపబుల్ 2’ లో ‘వీరసింహారెడ్డి’ టీం సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో రెండో సీజన్ దూసుకెళ్తోంది. ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో టాలీవుడ్ సెలబ్రిటీలను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇటీవలే ఈ షోకి ప్రభాస్, గోపీచంద్ గెస్ట్లుగా వచ్చి అలరించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ టాక్ షోలో వీరసింహారెడ్డి టీం సందడి చేయబోతుంది. ఈ విషయాన్ని ఆహా టీమ్ ట్వీటర్ ద్వారా తెలియజేస్తూ.. ‘వీరసింహారెడ్డి టీమ్ అన్‌స్టాపబుల్‌లో అడుగుపెడితే.. వీరలెవెల్ మాస్ పండుగ లోడింగ్.. ఫిక్స్ అయిపోండి, సంక్రాంతి పండగ రీసౌండ్ రావాల్సిందే!’ అని రాసుకొచ్చింది. అంతేకాదు బాలకృష్ణ, వరలక్ష్మి, గోపీచంద్ మలినేని, హనీ రోజ్‌తో పాటు మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ చిత్రాలను కూడా షేర్ చేశారు. ఇవి బాలయ్య హోస్ట్ చేసిన ఎపిసోడ్‌కు హాజరైన చిత్రాలే కావడం విశేషం. ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ కానుకగా జనవరి 13 స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న షో కామెడీ ఎక్స్చేంజ్ 6వ ఎపిసోడ్ కూడా జనవరి 13న రిలీజ్‌కానుంది. Veera simha Reddy team unstoppable lo adugu pedthe.....Veera level mass pandaga loading🔥🔥. Fix ayipondi, Sankranti pandaga resound raavalsindhe! #VeeraShimaReddy #UnstoppableWithNBKS2 #NBKOnAHA #NandamuriBalakrishna pic.twitter.com/Hzf68Twmp2 — ahavideoin (@ahavideoIN) January 10, 2023 -
అన్‌స్టాపబుల్: తెర వెనుక ప్రభాస్ అల్లరి చూశారా? కొత్త వీడియో అవుట్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేకు ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం విశేష స్పందన వస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఆహా టీం. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు మొత్తం ప్రభాస్ వీడియోలతో నిండిపోయాయి. ప్రభాస్ దెబ్బకు ఏకంగా ఈ యాప్ క్రాష్ అయ్యింది. చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు క్షణాలకే ఈ ఎపిసోడ్ లక్షల వ్యూయర్ షిప్‌తో రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించిన ఆహా టీం.. తాజాగా ఓ ఆసక్తిర వీడియోను షేర్ చేసి ‘డార్లింగ్’ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది. స్టేజ్‌పై బాలయ్యతో ప్రభాస్ చేసిన సందడిని చూపించిన ఆహా.. తాజాగా స్క్రీన్ వెనక చేసిన ఈ ‘బాహుబలి’ అల్లరిని చూపించింది. బిహైండ్ ది సీన్ పేరుతో తాజాగా ఆహా ఓ కొత్త వీడియో విడుదల చేసింది. చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతోన్న విజయ్ కుమారుడు! సెట్లో బాలకృష్ణ, ప్రభాస్‌తో మాట్లాడుతూ.. ‘మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలకృష్ణ’ అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘అయ్యో నాకు తెలుసు సార్’ అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. అలాగే ఆహా టీం తనకి ఇంకో కుటుంబం అంటూ ప్రభాస్‌కి చెప్పుకొచ్చాడు బాలయ్య. ఇలా షో షూటింగ్లో ఫ్యాన్స్‌తో ప్రభాస్ ముచ్చటించిన సీన్స్, బాలయ్య, ఆహా టీంతో చేసిన అల్లరి వంటి పలు ఆసక్తర సన్నివేశాలతో ఈ వీడియోను మలిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. -
బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లతో వరుస ఎపిసోడ్స్ షూట్ చేసుకున్న ఆహా టీం.. వాటిని స్ట్రీమ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలో షూటింగ్ జరుగుతుండగానే వీటికి సంబంధించని వీడియోలు, ఫొటోలు నెట్టింట దర్శనం ఇస్తున్నాయి. అధికారిక ప్రకటనకు ముందే లీకు వీరులు ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోనలు ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. చదవండి: రొమంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు ఈ క్రమంలో అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ టాక్ షోకు సంబంధించిన అనధికార స్ట్రీమింగ్, ప్రసారాలను వెంటనే తొలగించాలని టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లను ఆదేశించింది. కాగా అనధికారికంగా ఈ షోను ప్రసారం చేయడం వల్ల షోపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. స్టార్ హీరో ప్రభాస్‌తో బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూ న్యూయర్ కానుకగా గురువారం(డిసెంబర్ 29న) ప్రసారం అయ్యింది. చదవండి: రాజమౌళి ఫుట్‌బాల్ ఆడేస్తాడని రానాకి ముందే చెప్పా: ప్రభాస్ ఈ నేపథ్యంలో సదరు ఎపిసోడ్‌తో పాటు, మిగిలిన ఎపిసోడ్లు అనధికారికంగా ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని గురువారం లాయర్ ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా ‘డైనమిక్ ఇంజక్షన్’ ఇవ్వకపోతే ఫిర్యాదుదారుకి భారీ నష్టం వస్తుందని కోర్టు పేర్కొంది. అందుకే తదుపరి విచారణ వరకూ మధ్యంతర ఇంజెక్షన్ మంజూరు చేస్తున్నట్లు హైకోరక్టు పేర్కొంది. -
హైలైట్‌గా నిలిచిన ప్రభాస్-చరణ్ ఫోన్‌కాల్.. డార్లింగ్ పెళ్లిపై హింట్
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్‌తో మరింత సూపర్ హిట్‌గా నిలిచింది షో. దేశవ్యాప్తంగా ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ ఎపిసోడ్‌లోని పార్ట్-1 ఇప్పటికే స్ట్రీమింగ్ అయ్యింది. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచిన ఈ ఎపిసోడ్లో రామ్‌చరణ్‌కు ప్రభాస్ కాల్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇదే క్రమంలో ప్రభాస్‌ని ఆటపట్టించిన రామ్ చరణ్ త్వరలోనే డార్లింగ్ మీ అందరికి గుడ్‌న్యూస్ చెబుతాడంటూ హింట్ ఇచ్చాడు. దీంతో అంతలోనే అందుకున్న బాలకృష్ణ.. ఆ అమ్మాయి చౌదరినా లేక శెట్టినా, లేక సనన్ హా? అంటూ ఇరికించే ప్రయత్నం చేయగా అది తాను చెప్పలేనని మీకే ఊహించుకోండంటూ క్లూ వదిలాడు. దీంతో ‘రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్’ నువ్వు నా ఫ్రెండువా ? శత్రువా ?అంటూ ప్రభాస్ ఫన్నీగా బదులిచ్చాడు. ఇక ఎప్పుడూ బయట కలిసి కనిపించని.. ప్రభాస్, చరణ్ మధ్య ఉన్న ఇంతలా బండింగ్ ఉందా? ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటున్నారంటూ వారి మధ్య ఉన్న బాండింగ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. Charan and prabhas phone call#RamCharan#Prabhas pic.twitter.com/RsOzTX1VqV — Ra_1 (@MahiCharan31) December 29, 2022 Mari intha close a #RamCharan and #Prabhas 😳 pic.twitter.com/OyBVV5HNew — Teja (@tejarebel10) December 29, 2022 -
కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షోకి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కానీ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ అన్నట్లుంది. డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటే కటౌట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసిన వెంటనే ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆహాలోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాష్ అయింది. సమస్యను పరిష్కరించిన ఆహా టెక్కికల్ టీమ్ ఇప్పటికే ఎపిసోడ్‌ను లోడ్ చేసేసింది. ఇక ఎప్పటిలాగే షోను ఆద్యంతం రక్తికట్టించే బాలయ్య ప్రభాస్‌ను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. హీరోయిన్ కృతిసనన్‌తో డేటింగ్‌పై ప్రభాస్‌ను డైరెక్ట్‌గా అడిగేశాడు బాలయ్య. దీనికి ప్రభాస్.. మేడమ్ ఆల్రెడీ చెప్పేసిందిగా. అలాంటిదేమీ లేదు. ఇది కేవలం పుకారు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో మేడమ్ ఏంటి? అంత రొమాన్స్ ఏంటి? నేను కూడా నా భార్య(వసుంధర)ను మేడమ్ అనే పిలుస్తానంటూ ప్రభాస్‌ను రోస్ట్ చేశాడు. Kriti Sanon topic 😂😍#PrabhasOnAHApic.twitter.com/EFoly9GjJv — Prabhas Youth Icon✪ᴬᵈᶦᵖᵘʳᵘˢʰ🏹 (@REBELST99790410) December 29, 2022 Funny convo about #Prabhas - #KritiSanon rumours 🤣👌... pic.twitter.com/tl7Vhhpi7i — Nikhil Prabhas ™ (@rebelismm) December 29, 2022 -
ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా యాప్ క్రాష్..
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 2కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హాజరైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ గురువారం రాత్రి 9 గంటలకి ఆహాలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఆహా యాప్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో సైట్ క్రాష్ అయ్యింది. దీంతో ఓవర్ లోడ్ కారణంగా ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఇక ఈ విషయంపై ఆహా సంస్థ వెంటనే స్పందించింది. ఈ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తాం అని ఆహా ట్విటర్ లో పేర్కొంది. "డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ప్రేమతో మా యాప్ క్రాష్ అయింది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి చింతిస్తున్నాము. మేము సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాము. త్వరలో మళ్లీ ప్రారంభం అవుతుంది" అని ఆహా ట్విట్ చేసింది. Your love is boundless darlingsss! Our app is offline but our love isn't. Give us just a little time while we fix it. We will be up and running in a jiffy!#PrabhasOnAHA#UnstoppableWithPrabhas#NandamuriBalakrishna — ahavideoin (@ahavideoIN) December 29, 2022 చదవండి: Rambha: ఆ హీరో చేసిన పనికి చాలా బాధపడ్డా: రంభ -
డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బాహుబలి పార్ట్-1 ఒకరోజు ముందుగానే..!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్ ఫేమస్ సెలబ్రీటీలతో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు నటులు హాజరైన ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతుండటం మరో విశేషం. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్‌తో పాల్గొన్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. పూర్తి ఎపిసోడ్ ఈనెల 30న ప్రసారం కానున్నట్లు ప్రకటించిన ఆహా.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఎపిసోడ్‌ను ఒకరోజు ముందుగానే ఈనెల 29న ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే రిలీజైన ప్రోమో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు.ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం చేయనున్నట్లు ఆహా ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌ను బాహుబలి పార్ట్-1 తో పోలుస్తూ ఆహా చేసిన ట్వీట్ వైరలవుతోంది. Darling fans....mee korika meraku...mana Bahubali Episode Part 1 eeroje release chesthunnam. Let the new year celebrations begin early!🎉🥳 Streaming today @ 9pm#PrabhasOnAHA #WeNeedPrabhasAhaEpisodeAt9PM #NBKOnAHA @YoursGopichand pic.twitter.com/D9A99QxMkW — ahavideoin (@ahavideoIN) December 29, 2022 -
ప్రభాస్‌తో బాలయ్య ముచ్చట్లు.. ప్రోమో మామూలుగా లేదుగా..!
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫేమస్ సెలబ్రీటీలు హాజరవుతున్న ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి ఈనెల 30న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనుండగా తాజాగా మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ప్రోమోలో ప్రభాస్‌ను బాలకృష్ణ సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమో చూస్తే ఆద్యంతం నవ్వుల పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో సెటైర్లు, సీక్రెట్స్, సరదాలు, సలహాలు, డ్యాన్సులు, సంచలనాలు, అన్ని ఉండనున్నట్లు ఆహా ట్వీట్లో వెల్లడించింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈనెల 30న మొదటి పార్ట్ ప్రసారం కానుండగా.. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. Satirelu, Secretlu, Saradalu, Salahalu, Songulu, Dancelu, Sanchalanalu, annni unnay...😍🤯😋❤️ Anduke Bali Bali Ra Bali Sahore Bahubali in 2 Parts. Part 1 premieres December 30.#PrabhasOnAHA #UnstoppableWithNBKS2#Prabhas𓃵 #NandamuriBalakrishna pic.twitter.com/Bqmguxmq4G — ahavideoin (@ahavideoIN) December 28, 2022 -
సీతతో రిలేషన్‌పై ప్రభాస్‌ను ప్రశ్నించిన బాలయ్య
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటసింహ నందమూరి బాలకృష్ణ కలిస్తే ఎలా ఉంటుంది. ఆ జోష్ వేరే లెవల్ కదా! బాలయ్య హోస్ట్ చేస్తోన్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్‌లో ప్రభాస్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. ఇందులో డార్లింగ్ సైలెంట్‌గా కాకుండా జోకులేస్తూ నవ్విస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటు నందమూరి బాలకృష్ణ అటు ప్రభాస్, గోపీచంద్‌ల ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ విందు భోజనంలాంటి ఎపిసోడ్‌ను సిద్ధం చేసింది ఆహా. అయితే ఆ ఎపిసోడ్‌ను ఎడిట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడుతోందట. ఎందుకంటే ఇందులో ప్రతి క్షణం ఎంతో విలువైనదే. దాన్ని ప్రతీ ఒక్కరూ ఆస్వాదించాల్సిందేనంటోంది. దీంతో ఆహా ఈ బాహుబలి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకుంది. బాహుబలి - 1 ది బిగినింగ్ ఎపిసోడ్‌ను డిసెంబర్ 30న, బాహుబలి కన్‌క్లూజన్ ఎపిసోడ్‌ను జనవరి 6న ప్రసారం చేయనుంది. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే చరిత్రలో ఓ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా అందించటం ఇదే మొదటిసారి. తొలి ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ మధ్య జరిగే సంభాషణ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. రెండో ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కెరీర్ ఇండస్ట్రీలో ఎలా ప్రారంభమైంది. వారి స్నేహం ఎలా ప్రారంభమైంది. ఇన్నేళ్లలో ఎలా బలపడింది అనే విషయాలుంటాయి. ‘‘మాకు అభిమానుల నుంచి లెక్కలేనన్ని మెసేజెస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్‌ను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాలని కోరారు. దీంతో ప్రభాస్, నందమూరి బాలకృష్ణ, ఆహా టీమ్ అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ను అందించాలని నిర్ణయించుకున్నాం. న్యూ ఇయర్‌ను నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ కాంబినేషన్‌తో ఆహాలో రాబోతున్న ఈ టాక్ షో ఎపిసోడ్ కంటే గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఏముంటుంది. ఎవరూ ఊహించలేని కొత్త విషయాలు, అంతకు మించిన ఫన్ డిసెంబర్ 30, జనవరి 6న ఆహా ద్వారా స్క్రీన్స్‌ను ఢీ కొట్టనుంది’’ అని ఆహా టీమ్ తెలియజేసింది. ఇకపోతే తొలి ఎపిసోడ్లో బాలకృష్ణ.. ప్రభాస్‌ను సీతతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించారు. దానికి ఆయన ఏమని బదులిచ్చారో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే! Content entha bagundante edit cheyadaniki evvaru oppukoledu, ade exclusive experience meeku andinchenduku "direct from the sets to play","Bahubali Episode in 2 parts." Mahishmathi Oopiri pilchuko, he is on the way🗡️🛡️ Have a blast this New year week.❤️🕺#PrabhasOnAha #Prabhas pic.twitter.com/2jynoaYOt5 — ahavideoin (@ahavideoIN) December 28, 2022 చదవండి: మీ ఇంటికొచ్చి తరిమి తరిమి కొడతా: సోహైల్ వార్నింగ్ చెప్పులు కూడా వదిలేసి పారిపోయిన హీరోయిన్ -
కంగనాకు పద్మశ్రీ.. సీనియర్లం మాకు లేదా?
నందమూరి బాలకృష్ణ సారథ్యంలో అన్‌స్టాపబుల్ రెండో సీజన్ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇటీవల ఈ షోలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేశారు. అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా ఆరో ఎపిసోడ్‌కు విచ్చేశారు. వీరిని ఇరుకున పెట్టే ప్రశ్నలడుగుతూ వాటికి సమాధానాలు రాబట్టాడు. ఈ క్రమంలో పద్మ అవార్డుల ప్రస్తావన రాగా.. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు జయసుధ, జయప్రద. 'కంగనా రనౌత్ అద్భుత నటి. పట్టుమని పది సినిమాలు చేసిందో లేదో అప్పుడే ఆమెకు పద్మ శ్రీ ఇచ్చారు. కానీ మా విషయంలో అలా జరగలేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అంతెందుకు, గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళా డైరెక్టర్ విజయ నిర్మలను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఇలాంటి సందర్భాల్లోనే కేంద్రం దక్షిణాది చిత్రపరిశ్రమ పట్ల వివక్ష చూపిస్తుందనిపిస్తుంది' అని జయసుధ చెప్పుకొచ్చింది. జయప్రద మాట్లాడుతూ.. అవార్డులు అడిగి తీసుకోవడం మాకిష్టం లేదు. మా ప్రతిభను, సీనియారిటీని గుర్తించి గౌరవించాలనుకున్నాం అని పేర్కొంది. చదవండి: థియేటర్లు అమ్మేశారు, ఆస్తులు పోయాయి.. కమెడియన్ కూతురు బతిమాలినా రాలేదు, నటిపై ఫైర్ -
హీరోయిన్ అవ్వాలంటే అవి తప్పవు.. అన్‌స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ రెండో సీజన్ టాలీవుడ్ సెలబ్రిటీలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తాజాగా ఈ సీజన్లో మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా పాల్గొననుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. వీరితో కలిసి బాలయ్య సందడి చేయగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 23న ఫుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి వేశారు. రాశి ఖన్నాని పొగుడుతూ అలరించాడు. రాశి ఖన్నా తాను నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని పాటతో అలరించింది. ఈ ప్రోమోలో జయప్రద, జయసుధపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ప్రస్తుతం నేను, శృతి ఆంధ్రప్రదేశ్‌లో హాట్ పెయిర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. -
టాలీవుడ్ హీరోపై మనసు పడిన రాశీఖన్నా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, తాజాగా లేటెస్ట్ ప్రోమోను వదిలారు. అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్‌తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు. ఇక హీరోయిన్ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఏండేయ్ ఏమైనా మాట్లాడండి.. ఓ పాట పాడండి.. అదిరిపోయిన ప్రభాస్ ప్రోమో
రెబల్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్-2 సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ షోలో ఆయనతో పాటు మరో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రోమోలో ఇద్దరి మధ్య సాగిన సంభాషణ తెగ నవ్వులు తెప్పిస్తోంది. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు రెబల్ స్టార్ నవ్వుతూ సమాధానాలిచ్చారు. వర్షం సినిమాలో విలన్ పాత్రలో నటించిన గోపీచంద్, హీరో ప్రభాస్ సంభాషణ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేయనుంది. కాగా.. ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈనెల 30న ఆహాలో ప్రసారం కానుంది. ప్రోమో విషయానికొస్తే.. 'బాలకృష్ణ మంత్రంతో ఈ ప్రోమో ప్రారంభం అయింది. ఆ తర్వాత బాలకృష్ణ నన్ను కూడా డార్లింగ్ పిలవాలి అనడంతో సరే డార్లింగ్ సార్ అంటూ నవ్వులు పూయించారు. ఆ తర్వాత రామ్ చరణ్‌కు ఫోన్ చేసిన సంభాషణ తెగ ఆకట్టుకుంటోంది. నీ లైఫ్‌లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటీ? అని బాలయ్య ప్రశ్నించారు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్‌తో కలిసి రెబల్ స్టార్ ప్రభాస్‌ను బాలయ్య ఆట పట్టించారు. చివరగా ప్రభాస్ ఫేమస్ డైలాగ్..' ఏండేయ్ ఏమైనా మాట్లాడండి.. ఓ పాట పాడండి.' చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ హాజరు కావడంతో ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. -
‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్
బాలయ్య హోస్ట్‌గా ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్స్టాపబుల్ సందడి చేయబోతున్నాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. మ్యాచో స్టార్ గోపించంద్‌తో కలిసి ప్రభాస్ అన్‌స్టాపబుల్ షోకు హజరైన ఫొటోను ఆహా సంస్థ సోమవారం విడుదల చేసింది. షూటింగ్‌కు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. చదవండి: మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ హీరో? వీటికి ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం చూసిన ప్రభాస్ ఫొటోలు, వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్స్ తప్పా ఏలాంటి కార్యక్రమాలైన హజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపడు. అలాంటి ప్రభాస్ బాలయ్య షోకు హజరవడంతో అభిమానులు, షో ఫాలోవర్స్‌లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ ఎపిసోడ్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ వీకెండ్ ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో గ్లింప్స్‌ను వదిలింది ఆహా. చదవండి: అవన్ని పుకార్లే.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఇందులో ప్రభాస్ ఫుల్ జోష్‌లో కనిపించాడు. ఈ వీడియోలో ‘ఏమ్.. ఏం చెప్తున్నావ్ డార్లింగ్’ అంటూ ప్రభాస్ గట్టిగా అరుస్తు నవ్వులు పూయించాడు. ఆ తర్వాత బాలయ్య దగ్గరికి రమ్మంటే.. డార్లింగ్ వద్దు సర్ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్‌కి ప్రభాస్ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతంఈ ప్రోమో గ్లింప్స్ ఇంటర్నెట్లో దుమ్మురేపుతుంది. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సందర్బంగా ప్రోమోను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు ఆహా పేర్కొంది. -
బాలయ్య షోలో ప్రభాస్ ధరించిన ఈ షర్ట్ ధరెంతో తెలుసా?
బాలయ్య హోస్ట్‌గా ఎన్బీకే విత్ అన్‌స్టాపబుల్ షో సీజన్-2 సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్టుగా హాజరవడం ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లకు తప్పా బయట ఎక్కడా అంతగా కనిపించరు. అలాంటిది బాలయ్య షోకు ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ షోకు ప్రభాస్ తన స్నేహితుడు, హీరో గోపీచంద్‌తో కలిసి హాజరయ్యారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్ మరో హైలైట్‌గా నిలిచింది. ఎక్కువగా బ్లాక్ షర్ట్‌లో కనిపించే ప్రభాస్ ఎన్బీకే షోలో మాత్రం కలర్ఫుల్గా కనిపించారు. దీంతో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ఏ బ్రాండ్? దాని ధరెంత అంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రభాస్ వేసుకున్న షర్ట్ `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' కంపెనీకి చెందినదట. దీని ధర సుమారు 115 పౌండ్స్ ఉంటుందట. అంటే అక్షరాలా ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.11,618/. ఏది ఏమైనా ప్రభాస్ ఈ షర్ట్‌లో మరింత యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారని, ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సెట్లో ప్రభాస్ సందడి, వీడియో, ఫొటోలు లీక్
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుత్ను ఈ షో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అత్యధిక వ్యూవర్షిప్ను రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం సెకండ్ సీజన్‌ను జరపుకుంటున్న ఈ షోలో ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగిన 5వ ఎపిసోడ్లో అగ్ర నిర్మాతలు సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి అతిథులుగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈ ఎపిసోడ్ రెండు రోజుల్లో 2 మిలియన్స్ స్ట్రీమింగ్ పర్ మినిట్తో దూసుకుపోయి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే ఆరవ ఎపిసోడ్‌కు పాన్ ఇండియా స్టార్, టాలీవుడ్ ‘బాహుబలి’ ప్రభాస్ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆదివారం ఆహా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి అన్‌స్టాపబుల్ విత్ ప్రభాస్, బాలయ్య విత్ ప్రభాస్ అంటూ ట్విటర్లో హ్యాష్ ట్యాగ్స్ దర్శనం ఇస్తున్నాయి. అంతేకాదు ఈ విషయం తెలిసినప్పుటి ఈ ఎపిసోడ్ కోసం అటూ ప్రభాస్, ఇటూ నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO — Prabhas™ (@Prabhas_Team) December 11, 2022 ఇప్పటికే ‘డార్లింగ్’ అన్‌స్టాపబుల్ సెట్లో అడుగుపెట్టిన తెలుస్తోంది. ఈ టాక్ షోలో బాలయ్యతో ప్రభాస్ సందడి చేసిన వీడయో ఒకటి బయటకు వచ్చింది. చూస్తుంటే ఇది ప్రభాస్ ఎంట్రీ వీడియోల కనిపిస్తోంది. ఇందులో ప్రభాస్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. కొత్త హెయిర్ కట్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌తో కూడిన చెక్ షర్ట్‌లో ప్రభాస్ పక్కా జెంటిల్ మ్యాన్‌లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ షోలో బాలయ్య ప్రభాస్‌ను ఎలాంటి చిలిపి ప్రశ్నలు వేయబోతున్నారు, ప్రభాస్ పెళ్లి గురించి ఎలా ఆరా తీయబోతున్నారనేది ఆసక్తిని సంతరించుకుంది. Darling 💛😍😘#NBKWithPrabhas#UnstoppableWithPrabhas#UnstoppableWithNBKS2 pic.twitter.com/Rdl8quPNSO — Prabhas™ (@Prabhas_Team) December 11, 2022 View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) చదవండి: అనుపమ పరమేశ్వరన్‌పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు -
Unstoppable 2: బాలయ్య టాక్ షోలో ప్రభాస్.. స్పెషల్ వీడియో అదిరింది!
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ రెండో సీజన్ దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోలో సినీ ప్రముఖలతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొటుంటున్నారు. ఇప్పటికీ రవితేజ లాంటి సినియర్ హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కూడా బాలయ్య షోలో పాల్గొని సందడి చేశారు. ఐదో ఎపిసోడ్లో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి అతిథులుగా పాల్గొని పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక ఆరో ఎపిసోడ్ ఏకంగా బాహుబలినే రంగంలోకి దించేశాడు బాలయ్య. ఈ విషయం గత కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జరిగినప్పటికీ.. ప్రభాస్ వస్తాడో రాడో అని కొంత మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆహా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. పాన్ ఇండియా స్టార్ విత్ గాడ్ ఆఫ్ మాస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం మేకర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ రాబోతుందంటూ అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే షోలో ప్రభాస్ తన ప్రాణ స్నేహితుడు హీరో గోపిచంద్ తో కలిసి పాల్గొనబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. -
సంచలనం సృష్టించిన బాలయ్య టాక్ షో, 5వ ఎపిసోడ్‌కు రికార్డ్ వ్యూస్
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. బాలయ్య తనదైన శైలి, చమత్కారం, పంచ్‌లతో ఈ షోను విజయవంతం చేస్తున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పలు రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెకండ్ సీజన్ కూడా రికార్డ్ సృష్టించింది. లేటెస్ట్గా జరిగిన 5వ ఎపిసోడ్ రెండు రోజుల్లోనే 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ రాబట్టి సంచలనం రేపింది. దివంగత మాజీ సీఎం, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా 5వ ఎపిసోడ్ టాలీవుడ్ స్టార్ నిర్మాతలైన దగ్గుబాటి సురేశ్ బాబు, అల్లు అరవింద్‌తో పాటు అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాళ్లు 90 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో వచ్చిన సినిమాల గురించి చర్చించారు. అల్లు అరవింద్, సురేష్ బాబును నేపోటిజం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. ఇంకా మూవీస్ గురించి డిస్కస్ చేశారు. హీరోయిన్ల నాభిపై పూలు, పళ్లు ఎందుకు వస్తారో రాఘవేంద్ర రావును అడిగారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ సరదాగా సాగింది. దాంతో ఈ షోకు ప్రేక్షకుల నుంచి కూడా విశేష ఆదరణ అభించింది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ 5వ ఎపిసోడ్‌కు రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చినట్లు తాజాగా ఆహా అధికారికంగా ప్రకటించింది. Matallo marintha fire 🔥. Kaburlalo marintha fun. Maruvaleni kathalu, inka enneno. An episode that you can't miss😉 Watch #UnstoppableWithNBKS2 Episode 5 Streaming Now@SBDaggubati #alluarvind#kodandaramireddy @Ragavendraraoba #MansionHouse @tnldoublehorse @realmeIndia pic.twitter.com/f6JDjDfrtZ — ahavideoin (@ahavideoIN) December 5, 2022 -
అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు: అల్లు అరవింద్
అలా చేయడం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు అధిక సంఖ్యలో వస్తున్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన థియేటర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. ఇదే షోలో ఆయనతోపాటు మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్, దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి పాల్గొన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'థియేటర్లు పడిపోతున్న సమయంలో ఆయా థియేటర్ల యజమానులు వాటిని పైకి రావాలనుకుంటారు. వాటిని మామూలు స్థితికి తీసుకురావడం, సినిమాలు కొనుక్కోవడం వారికి పెద్ద సవాలుగా మారింది. దాన్ని భరించలేక ‘థియేటర్లను మీరే రన్ చేయండి.. మాకు సంవత్సరానికి ఇంత ఇవ్వండి’ అని థియేటర్ల ఓనర్లు నిర్మాతలను కోరారు. అలా మేం వాటిని తీసుకొని కొన్ని కోట్ల రూకపాయలతో మంచిగా తీర్చిదిద్దాం. అన్ని వసతులు ల్పించాం. అలా థియేటర్లను ఆధునికీకరించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. మీలాంటి పెద్ద హీరోలకు అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం.' అని తెలిపారు. దీనిపై సురేశ్ స్పందిస్తూ.. దీని వల్ల కొందరికి థియేటర్లు దొరక్కపోవడంతో పలు సందర్భాల్లో విమర్శించారన్నారు. అందరూ కలిసి సినిమాను బతికించారని అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్లో ఓ చిత్రం నిర్మించాలనుందనే తన కోరికను బయటపెట్టారు. -
నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్ షోకు లేటెస్ట్ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్ ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్ గెస్ట్లుగా టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్, సురేశ్ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు. సురేశ్ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్ ట్విటర్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Coming from both legendary producers of the industry at the same time ❤️ #Mahanati #Samantha 😍🤩 its all your dedication and hardwork angel 🙇 @Samanthaprabhu2 You earned it 💪 and you deserve it 🫶 #SamanthaRuthPrabhu pic.twitter.com/J6otq5o9pf — Samantha Fans (@SamanthaPrabuFC) December 3, 2022 -
చిరంజీవితో బాలకృష్ణ మల్టీస్టారర్.. గూస్ బంప్స్ గ్యారంటీ!
దశాబ్దాల నుండి..మాస్‌ను మంత్రముగ్డులను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి,నటసింహం నందమూరి బాలకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే,ఉహిస్తేనే, గూస్ బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు ఈ కల సాకారం కాబోతుందా.? ఆ తరంలో ఎన్టీఆర్, ఏన్నార్, కృష్ణ లాంటి స్టార్లు ఒకే స్క్రీన్ లో కనిపించి..అభిమానులను ఖుషీ చేశారు. ఇప్పుడు ఈ తరం హీరోలు నందమూరి నటసింహం, కొణెదెల హీరో కలిసి నటించబోతున్నారా ?ఈ బిగ్ ప్రాజెక్టుకు..అల్లు అరవింద్ స్కేచ్ వేస్తున్నాడా ?ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా ,ఇప్పుడు ఎందుకు ఈ చర్చ వచ్చింది అంటారా ? ఎన్టీఆర్ ,ఏన్నార్ ఓ తరం నటులు.ఫిల్మ్ ఇండిస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు.దశాబ్దాల పాటు నువ్వా నేనా అంటూ పోటీ పడ్డారు.అలాంటి స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.తర్వాత వచ్చిన కృష్ణ,కృష్ణం రాజు,శోభన్ భాబు లాంటి హీరోలు కూడా ఒకే స్క్రీన్ మీద కనిపించి అలరించిన వారే.ఇలాంటి సాలిడ్ మల్టీ స్టారర్లు చేసి వెండితెరను కళకళలాడేలా చేసారు ఆ తరం తర్వాత..చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ తెలుగు వెండితెరకు నాలుగు స్థాంబాలుగా నిలిచారు.అయితే ఈ స్టార్లు..ఒకే స్క్రీన్ల మీద కనిపించింది మాత్రం లేదు.ఫ్యాన్స్ మధ్య పోటీ,వీళ్లను తెర మీద చూపించే కథ రాకపోవటం అలాగే..స్టార్ల మధ్య ఇగో ఫ్యాక్టర్లు లాంటివి కూడా..వీళ్లు కలిసి నటించకపోవటానికి కారణంగా నిలిచాయి.ఏమైతేనేం .వెండితెర మీద ఈ స్టార్ల మల్టీ స్టారర్ సినిమాలు చూసే భాగ్యం అభిమానులకు లేకుండా పోయింది.అయితే..ఇప్పుడు మాస్ గా బాప్ ..మెగాస్టర్ చిరంజీవి,నందమూరి నటసింహంల మల్టీ స్టారర్ తెర మీదికి వచ్చింది.ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు వేదికగా ఆహా ప్లాట్ ఫామ్ నిలిచింది నందమూరి నటసింహం ఆహా ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్న మ్యాటర్ తెలిసిందే.మొదటి సీజన్ హిట్ కొట్టింది.ఈ సెకండ్ సీజన్ కూడా బాగా అలరిస్తుంది. 90 సంవత్సరాల తెలుగు సినిమా సెలబ్రిషన్స్ సందర్బంగా..నిర్మాతలు..అల్లు అరవింద్,దగ్గుబాటి సురేష్ బాబు,దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును కలిపి బాలయ్య ఇంటర్వూ చేశాడు. ఇంటర్వూలో భాగంగా..అల్లు అరవింద్ తో ..మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ అని బాలయ్య అడగగా,మీతో చిరంజీవి గారుతో కలిపి కాంబినేషన్ తీద్దామని వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు అల్లు అరవింద్. వెంటనే బాలకృష్ణ స్క్రిప్ట్ ఎలా ఉండాలో కూడా చెప్పేశాడు. మా మల్టీస్టారర్ లో చిరంజీవికి పాటలు ఉండాలి. నాకు ఫైట్స్ ఉండాలి. ఇంట్రో సాంగ్ చిరంజీవిది, క్లైమాక్స్ ఫైట్ నాది అని బాలయ్య చెప్పుకొచ్చాడు. మరి అల్లు అరవింద్ ఆ మాటలు సీరియస్ గా అన్నాడా ? మరి ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కాని..చిరు,బాలయ్య కలిసి మల్టీ స్టారర్ చేయటం అనే అలోచనే ..ఓ సెలబ్రిషన్‌ల ఉంది.మరి వీరిద్దరు కలిసి నటించి..వెండితెర సెలబ్రేషన్స్ చేయాలని అశిద్దాం. -
UNSTOPPABLE లో ప్రభాస్.. ప్రభాస్ తో బాలయ్య రచ్చ..
-
సిద్ధార్థ్, అదితి రావు మధ్య ఏముందో?.. శర్వానంద్ కామెంట్స్ వైరల్
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్. ప్రస్తుతం రెండో సీజన్ కొనసాగుతోంది. ఇటీవల ఈ షోలో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్‌లు పాల్గొని సందడి చేశారు. ఈ షోలో హీరో శర్వానంద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన వార్తలపై శర్వానంద్ స్పందించారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు శర్వానంద్ నవ్వుతూ సమాధానలిచ్చారు. మీరు సాధారణంగా హీరోయిన్లను ఎలా ఎంపికచేసుకుంటారు అని అడగ్గా.. ఆ విషయంలో నేను చేసేదేం లేదు. అంతా డైరెక్టర్లు చెప్పింది చేయడం తప్ప. నాకు ప్రత్యేకంగా ఎంపిక అంటూ లేదు' అంటూ సమాధానమిచ్చారు. మరీ అదితి రావు సంగతేంటీ? అని బాలయ్య ప్రశ్నించగా.. 'ఆమె మహాసముద్రంలో సిద్ధార్థ్‌కి జోడీగా నటించింది.. కానీ నాకు జోడీగా నటించలేదు అని అన్నారు. దానికి బాలయ్య ‘నిజ జీవితంలో కూడా సిద్ధార్థ్‌కి జంటగా మారిందా?’ అని శర్వానంద్‌ను మళ్లీ అడిగాడు. (చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్) దీనికి శర్వానంద్ బదులిస్తూ.. ' ఏమో నాకేం తెలియదు, సిద్ధార్థ్ బయట ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. అతను సోషల్ మీడియాలో ‘స్వీట్ హార్ట్’ అంటూ ఓ పిక్ పోస్ట్ చేశాడు. కానీ అది నాకు అర్థం కాలేదు.' అని అన్నారు. కాగా.. సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, శర్వానంద్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ ముందు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ జంటగా మీడియాకు చిక్కారు. దీంతో అప్పటి నుంచి సిద్ధార్థ్, అదితిలు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, సినిమా ఈవెంటస్ కలిసి హజరవుతుండటంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇంతవరకు తమ డేటింగ్ రూమర్స్‌పై ఈ జంట స్పందించలేదు. ఇటీవల అదితి బర్త్‌డే సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ వైరలైంది. (చదవండి: ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్రూమ్కు వెళ్లి ఏడ్చేదాన్ని: అదితి రావు) -
‘ఆహా’లో అదిరిపోయే సర్ప్రైజ్లు..ఈ వారం రెట్టింపు వినోదం పక్కా!
ఒకవైపు సూపర్ హిట్ సినిమాలు మరోవైపు ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, అలరించే టాక్ షో,గేమ్ షోలతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తోంది. రెండు ఎపిసోడ్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. తాజాగా మూడో ఎపిసోడ్‌కి సిద్దమైంది. ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.నవంబర్ 4 నుంచి మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహాలో ఆకట్టుకుంటున్న వాటిలో డాన్స్ ఐకాన్ ఒకటి. సూపర్ డాన్స్ పర్ఫామెన్స్ లతో కంటెస్టెంట్స్ దుమ్మురేపుతున్నారు. ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి ఈ వారం గెస్ట్‌గా రాశీ ఖన్నా రానున్నారు. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోయే పోటీని చూడటంలో మంచి మజా ఉంది. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న హోస్ట్ గా చేస్తోన్న షో చెఫ్ మంత్ర. ఈ షోలో గెస్ట్ లుగా వచ్చిన వారు తమకు నచ్చిన వంటకాన్ని వండి.. దానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను హాజరుకానున్నారు. ఇలా ఈ మూడు షోలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. -
సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో ఎవరు?..బాలయ్య ప్రశ్నకు శేష్, శర్వా షాక్!
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్‌ని విజయవంతంగా ముగించుకున్న ‘అన్ స్టాపబుల్-2’ మూడో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజయ్యారు. బాలయ్య పంచులు.. శర్వా, శేష్‌లు జోకులతో ప్రోమో నవ్వులు పూయిస్తోంది. శర్వా వచ్చి రావడంతోనే బాలయ్యను పొగడ్తలతో ముంచేశాడు. ‘ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికే బాలుడే’అంటూ బాలకృష్ణను ఇంప్రెస్ చేశాడు. అలాగే తనకు క్రష్ అని చెప్పిన రష్మికతో వీడియో కాల్ మాట్లాడించాడు. ఇక షోకి వచ్చిన అడవి శేష్‌ని పెళ్లి ఎప్పుడు? అని బాలకృష్ణ ప్రశ్నించగా..ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని చాలా ప్రెజర్.. నాకేమో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోలేని పెద్దలు చాలా మంది ఉన్నారు. ప్రభాస్, శర్వానంద్ లాంటి వాళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెబుతూ తప్పించుకుంటున్నాను అన్నారు. అప్పుడు శర్వా.. ‘నేను ఆయన(ప్రభాస్) పేరు చెప్పుకొని తిరుగుతున్నా.. నువ్వేమో నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావా? అని అనడంతో బాలకృష్ణతో సహా అందరూ గట్టిగా నవ్వారు. షోలో భాగంగా చివర్లో చిన్న గేమ్ ఆడదాం బ్రదర్స్ అంటూ.. ట్రూత్ అయితే దుస్తులు విప్పేయాలని కండీషన్ పెట్టాడు. మొదటి ప్రశ్నగా ‘సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో? ’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పేందుకు ఇద్దరు హీరోలు భయపడ్డారు. ఆ హీరో బాలయ్యనే అని చెప్పే సాహసం చేయలేకపోయారు. చివరకు శర్వా.. మీ ఆన్సర్ అయినా కూడా మేమే విప్పాలా సర్? అని ప్రశ్నించగా.. ‘స్టూడియో దాటి బయటికి వెళ్లగలరా?’అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఈ యంగ్ హీరోలతో బాలయ్య ఎలా ఆడుకున్నారో శుక్రవారం(నవంబర్ 4) ప్రసారం అయ్యే ఫుల్ ఎపిసోడ్లో చూడాలి. -
చంద్రబాబు ఇప్పటికీ తన తప్పును కప్పిపుచ్చే దశలోనే ఉన్నారు: ఎమ్మెల్యే వల్లభనేని
-
త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న బాలయ్య చిన్నకూతురు!
నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో టీఆర్పీ రేటింగులోనూ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని త్వరలోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తేజస్విని.. బాలయ్య స్ట్రిప్ట్ వర్క్‌కి సంబంధించి కీలక వ్యవహారాలనూ కూడా చూసుకుంటుందట. అన్‌స్టాపబుల్ షో అంత పెద్ద హిట్ కావడం వెనుక ఆమె పాత్ర కూడా ఎంతో ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆమె నిర్మాతగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం. బాలయ్య హీరోగా నటించే ఓ సినిమాకు ఆమె నిర్మాత బాధ్యతలు స్వీకరించబోతున్నారట. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. మరి తేజస్విని నిర్మాతగా సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి. -
Unstoppable With NBK: హీరోయిన్‌కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవలె గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షో సెకండ్ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లు గెస్టులుగా వచ్చారు. కలిసి అన్‌స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు. రావడం రావడంతోనే సిద్ధూ హెయిర్‌స్టైల్‌పై పంచ్ వేసిన బాలయ్య.. తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. దీనికి సిద్ధూ ఆన్సర్ ఇస్తూ.. 'ఇది మెస్సీ లుక్' అని చెప్పగా..'అలా నేను మెస్సీ లుక్‌తో కనిపించిన సినిమాలన్నీ మెస్సీ అయ్యాయమ్మా' అంటూ బాలయ్య సెటైర్ వేశారు. ఇక మీ ప్రజెంట్ క్రష్ ఎవరు అని బాలయ్యను అడగ్గా రష్మిక మందన్నా అని ఓపెన్‌గానే చెప్పేశారు. ఆ తర్వాత ఫ్లర్టింగ్ ఎలా చేయాలంటూ టిప్స్ అడిగి మరీ తెలుసుకున్న బాలయ్య ఓ హీరోయిన్‌కి కాల్ చేసి.. మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే అంటూ సరదాగా ఫ్టర్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. -
చంద్రబాబు పతనం ‘అన్ స్టాపబుల్’
సాక్షి, అమరావతి: పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు 27 ఏళ్ల క్రితం వెన్నుపోటు పొడిచినప్పుడు తనపై పడిన రక్తపు మరకను తుడుచుకునేందుకే బావమరిది బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా చంద్రబాబు ప్రయత్నించారని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. రాజకీయంగా పతనమైపోతున్న చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీని ఈ టాక్ షోలు కాపాడలేవని, వారి పతనం అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆహా అనే ఓటీటీ సంస్థ నిర్వహించే టాక్ షోలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని బతిమలాడినా వినలేదని, అందుకే జుట్టు పట్టుకుని ఎన్టీఆర్‌ను కిందకు లాగేశాను అని చంద్రబాబు మాట్లాడితే.. అది ధర్మమే, న్యాయమేనంటూ బాలకృష్ణ తానా తందానా పలకడం పోగాలం కాకపోతే మరేమిటని నిలదీశారు. దీన్ని బట్టి.. చంద్రబాబు విలనే అని ప్రజలు మరో మారు నిర్ధారణకు వచ్చారని స్పష్టం చేశారు. బాలకృష్ణ నిర్వహించే టాక్ షోకు ఇప్పటిదాకా సినీ ప్రముఖులు, హీరోలే వచ్చారని.. తొలిసారిగా రియల్ విలన్ చంద్రబాబు వచ్చారంటూ దెప్పి పొడిచారు. ఎన్టీఆర్, చంద్రబాబుల గురించి తెలిసిన నాదెండ్ల భాస్కర్‌రావు, లక్ష్మీపార్వతిలను ఆ టాక్ షోకు పిలిచి ఉంటే.. వాస్తవాలు తెలిసేవని, చంద్రబాబు బండారం బట్టబయలయ్యేదన్నారు. విదేశాల్లో విచ్చలవిడిగా అమ్మాయిలతో కులుకుతున్న కొన్ని ఫొటోలను బఫూన్, కామెడీ యాక్టర్ వంటి లోకేష్‌కు చూపుతూ.. వీటిపై ఏమంటావు అల్లుడూ అని బాలకృష్ణ ప్రశ్నిస్తే.. అది మామూలే, బ్రాహ్మణి కూడా వాటిని చూసిందని లోకేష్ అన్నారని చెప్పారు. టాక్ షో ఆద్యంతం పరిశీలిస్తే.. బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్‌లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బాలకృష్ణతో కూడబలుక్కుని ఈ డ్రామా ఆడారన్నది ప్రజలకు అర్థమైందన్నారు. పతనమైపోతున్న తన రాజకీయ జీవితానికి కాస్తయినా ఉపయోగపడుతుందనే పుత్రుడు లోకేష్‌తో కలిసి చంద్రబాబు ఈ షోలో పాల్గొన్నారన్నారు. ఎన్టీఆర్ బతికుంటే చంద్రబాబుకు అధోగతే టాక్ షో హిట్ అయినా.. నారా–నందమూరి కుటుంబాల పరువును వారే తీసుకున్నారని మంత్రి అంబటి దెప్పి పొడిచారు. రెక్కల కష్టంతో గద్దెనెక్కిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, టీడీపీని.. చంద్రబాబు చేజిక్కించుకోవడం, ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం తప్పే కాదని చంద్రబాబు, బాలకృష్ణ తానా తందానా అంటూ మాట్లాడటం హేయమన్నారు. నాన్నకు వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఘన విజయం సాధించామని.. అందుకే అది కరెక్ట్ అని తేలిపోయిందంటూ బాలకృష్ణ చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. 1995లో ఎన్టీఆర్‌ను అధికారంలో నుంచి దించేసి చంద్రబాబు పాలన చేపట్టిన నాలుగు నెలలకే ఎన్టీఆర్ చనిపోయారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చనిపోకపోయి ఉంటే చంద్రబాబు గతి ఏమయ్యేదని బాలకృష్ణను ప్రశ్నించారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబు అప్పట్లోనే అధోగతిపాలయ్యే వారని స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు మాటలను అద్భుతం.. మహాద్భుతం అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అచ్చేయడం విచిత్రంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ 175 స్థానాల్లో ఘన విజయం సాధించడం అన్ స్టాపబుల్ అని రాసుకోండి అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, బాలకృష్ణలకు సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బావురుమని ఏడుస్తూ అసెంబ్లీ నుంచి వెళ్లి బామ్మర్ది దగ్గర షోలు చేసుకునే స్థితికి దిగజారిపోయాడని, రాష్ట్రంలో ఇంకా టీడీపీ ఎక్కడుందని ప్రశ్నించారు. పాకెట్ మనీ తీసుకున్నది మరిచావా బాబూ? ‘టాక్ షోలో మీకు మంచి మిత్రుడు ఎవరని ప్రశ్నిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి అని బాబు చెప్పారు. ఆ రోజుల్లో వైఎస్ బాగా ధనవంతుడు. చంద్రబాబుది చిన్న కుటుంబం. వారి స్నేహంలో వైఎస్ వద్ద ఖర్చుల కోసం ఐదు, పది వేలు చంద్రబాబు తీసుకునే వాడు. ఇందులో తప్పేమీ లేదు. అయితే ఆ విషయాన్ని కూడా చంద్రబాబు చెప్పాలి కదా?’ అని అంబటి ప్రశ్నించారు. మహా పాదయాత్ర పేరుతో వెళుతున్న ఫాల్స్ పాదయాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యం అవుతున్నారని.. పిడికిలి బిగించి ఉద్యమం చేస్తున్నారని గుర్తు చేశారు. తొడలు కొట్టే వారిని, మీసాలు తిప్పే వారిని తిప్పికొడతారని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రపై దాడి చేస్తున్నందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. -
గన్ షాట్ : నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించింది ఎవరు ..?
-
అన్ స్టాపబుల్ షోపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అంతా సీఎం జగన్ అజెండాపై చర్చ జరుగుతుంది. ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. అందుకే మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి రోజా అన్నారు. చదవండి: గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’ 58 సంవత్సరాల ముందే మనకి రాజధాని రావల్సింది, కానీ రాలేదని రోజా అన్నారు. నేడు సీఎం జగన్ ఈ ప్రాంతంలో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. రాయలసీమ బిడ్డగా ఇక్కడ న్యాయ రాజధాని రావాలని కోరుకుంటున్నానని మంత్రి స్పష్టం చేసారు. చంద్రబాబు తన బినామిల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు, రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులు కావాలని కోరుకుంటూ స్థానిక ఎన్నికల్లో తీర్పును ఇచ్చారు. పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు. నిజమైన రైతులైతే రైతు కష్టం తెలుస్తుంది.. కేవలం స్వార్థంతో కూడిన పాదయాత్ర అంటూ రోజా కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ కుప్పిగంతులు, పిచ్చిగంతులు ఎవరు పట్టించుకోరని, ఎన్నో వేల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్.. ఉత్తరాంధ్ర కష్టాలు ఎప్పుడు చదవలేదా అని ప్రశ్నించారు. అన్‌స్టాపబుల్‌గా చంద్రబాబు అబద్దాలు చాలా బాగా చెప్పారని రోజా విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, ఆయన్ని ఆరాధ్య దైవం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు సీఎం కావడానికి కారణం కుప్పం ప్రజలు, కాని కుప్పానికి ఏమి చెయ్యలేదని మంత్రి రోజా దుయ్యబట్టారు. -
బాలయ్య నెక్ట్స్ మూవీ.. 'ఆర్ఆర్ఆర్' నిర్మాతతో భారీ ప్రాజెక్ట్?
నందమూరి బాలకృష్ణ కొత్త మూవీపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్యతో ఓ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (చదవండి: అన్‌స్టాపబుల్ సీజన్–2 ఆ రేంజ్లో ఉంటుంది : బాలయ్య) ఇప్పటికే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య అన్‌స్టాపబుల్- 2 టీజర్‌కు దర్శకత్వం వహించారు. అయితే బాలయ్య కూడా ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో చూడాలి. మరోపక్క బాలయ్య, దర్శకుడు పూరి జగన్నాధ్‌తో ఒక సినిమా చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో అన్‌స్టాపబుల్ సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు. -
Unstoppable With NBK 2: ప్రశ్నల్లో మరింత ఫెయిర్, ఆటల్లో మరింత డేర్
నందమూరి నట సింహం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి ‘అన్ స్టాపబుల్’షోతో అందరిని అలరించారు. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమైన ఆ షో.. సూపర్ హిట్ అయింది. దీంతో సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు ఆహా నిర్వాహకులు. ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 2ని విజయవాడలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సారి సీనీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులను కూడా తీసుకొస్తున్నారు. (చదవండి: ఆ వార్తలు మాకు చిరాకు కలిగించాయి: చిరంజీవి) దీంతో అన్‌స్టాపబుల్ 2పై మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా సీజన్ 2కి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేశారు షో నిర్వాహకులు. ఇందులో బాలయ్య ఒక నిధి కోసం వెతికినట్టు, ఎన్నో అవరోధాలని దాటుకొని ఆ నిధిలో ఉన్న కత్తిని చేజిక్కించుకున్నట్టు చూపించారు. ఆ కత్తితో షోలోకి ఎంట్రీ ఇచ్చారు బాలయ్య. ‘ప్రశ్నల్లో మరింత ఫెయిర్, ఆటల్లో మరింత డేర్, సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. అన్‌స్టాపబుల్’, దెబ్బకి థింకింగ్ మారిపోవాలే’అనే డైలాగ్స్‌తో బాలయ్య అలరించాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 14న స్ట్రీమింగ్ కానుంది. -
అన్‌స్టాపబుల్ సీజన్–2 ఆ రేంజ్లో ఉంటుంది : బాలయ్య
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులో మంగళవారం రాత్రి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ సీజన్–2 ఈవెంట్ లాంచింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కానూరు 100 అడుగుల రోడ్డులో ప్రత్యేంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఆయన అభిమానులతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటి రామయ్య సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆహా ఓటీటీ ప్లాట్ఫారంలో అన్‌స్టాపబుల్ ఈవెంట్ సీజన్ వన్ను విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు సీజన్–2 అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
బాలయ్య 'అన్ స్టాపబుల్' సీజన్-2 నుంచి క్రేజీ అప్డేట్
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’. సెలబ్రిటీలతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ఆహా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ షోకు సంబంధించి మరో సాలిడ్ అప్డేట్ వదిలారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ టీజర్‌ను రేపు(మంగళవారం)విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బాలయ్య లుక్‌ను ఆహా విడుదల చేసింది.దులో బాలకృష్ణ క్యాప్ పెట్టుకుని, డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన టీజర్ రేపు సా. 6గంటలకు విజయవాడలో లాంచ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే సీజన్-2: బాలయ్య ఫస్ట్‌లుక్ అవుట్
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. టీఆర్పీ రేటింగ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసిన ఈ షో రెండో సీజన్ దసరా నుంచి ప్రారంభం అవుతున్నట్లు ఇటీవల ఆహా అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాలయ్య ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది ఆహా. ఎన్బీకే బ్యాక్ అంటూ ట్రైలర్ అక్టోబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సూట్, బూటు, హ్యాట్‌తో ఉన్న బాలయ్య లుక్ షోపై ఆసక్తిని పెంచుకుంది. మరి ఈ సూపర్‌హిట్ టాక్ షో సీజన్-2కి వచ్చే ఫస్ట్ గెస్ట్ ఎవరన్నది చూడాల్సి ఉంది. -
బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్-2.. 'దెబ్బకు థింకింగ్ మారిపోవాలా'
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌తో షోను బాలయ్య విజయవంతం చేశాడు. టీఆర్పీ రేటింగ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేసిన ఈ షో రెండో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ అవైటెడ్ మూమెంట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ క్రమంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’కు సంబంధించి ఆహా ఓ సాలిడ్ అప్డేట్ను వెల్లడించింది. అతి త్వరలోనే ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2ను ప్రారంభం అవుతుందని, దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ షోపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. పండగ మొదలయ్యేది అప్పుడే అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఈ టాక్ షో దసరా నుంచి ప్రారంభం కానుందని తెలుస్తుంది. మరి ఈ సూపర్‌హిట్ షో సీజన్-2కి వచ్చే ఫస్ట్ గెస్ట్ ఎవరన్నది చూడాల్సి ఉంది. It's that time of the year and festival begins soon!🥳🎉 Debbaku thinking maarpiovala.#UnstoppableWithNBK2 athi thvaralo...🔥#nandamuribalakrishna@realmeIndia @tnldoublehorse #chandanabrothers @Fun88India #mansion_house pic.twitter.com/LQHw2MzAMP — ahavideoin (@ahavideoIN) September 16, 2022 -
నవ్వుతూ త్వరగా కోలుకునేందుకు ఈ సినిమా చూడండి: ఆహా
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్‌ను మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఖాళీగా ఉండటంకన్నా సినిమాలు చూస్తూ టైంపాస్ చేద్దామనుకుని భావించారు. అందుకోసమని ఓటీటీలో ఏదైనా మంచి కంటెంట్ ఉంటే చెప్పండని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓటీటీ సంస్థలు రెస్పాండ్ అవుతున్నాయి. మా ఓటీటీలో ఈ సినిమాలు చూడండంటూ రిప్లైలు ఇస్తున్నాయి. తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా.. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించింది. ''పుట్టినరోజు శుభాకాంక్షలు. నవ్వుతో త్వరగా కోలుకునేందుకు డీజే టిల్లు సినిమాను చూడాలని వైద్యులు సిఫార్సు చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్', లూప్ థ్రిల్‌ను ఎంజాయ్ చేయడానికి అమలా పాల్ 'కుడి ఎడమైతే', ప్రియమణి ఇన్వెస్టిగేటివ్ డ్రామా 'భామ కలాపం' వీక్షించండి'' అని ట్వీట్ చేసింది. కాగా కేటీఆర్ ట్వీట్‌కు ఇంతకుముందు ఓటీటీ జీ5 తమ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, సిరీస్‌లను చూడమని రిప్లై ఇచ్చింది. ఇప్పుడు మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు ఇంకెన్ని ఓటీటీలు రెస్పాండ్ అవుతాయో చూడాలి. చదవండి: నగ్నంగా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ Wishing you a very happy birthday and doctors recommend #DJTillu for a speedy recovery full of laughter! Some un-missables: - #NBK's Unstoppable - @Amala_ams's Kudi Yedamaithe-for some time loop thrills and - #Priyamani's investigative drama #Bhaamakalapam. https://t.co/byBnlKZ8df — ahavideoin (@ahavideoIN) July 24, 2022 చదవండి: కేటీఆర్ గారూ, కాలక్షేపం కావాలంటే ఇవి చూసేయండి: జీ5 -
అన్‌స్టాపబుల్: రెండో సీజన్ తొలి గెస్ట్ ఆ స్టార్ హీరోనట!
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్‌షో ‘అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే’. ఆహాలో ప్రసారమైన ఈ టాక్ షో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, పంచ్ డైలాగ్స్, కామెడీతో బాలయ్యా ఈ షోను శాంతం ఆసక్తిగా మలిచాడు. అంతేకాదు గెస్ట్‌గా వచ్చిన స్టార్స్ నుంచి తనదైన స్టైల్లో ఆసక్తికర విషయాలను రాబడుతూ ఆశ్చర్యపరిచాడు బాలయ్య. చదవండి: ఈ యూట్యూబర్‌కు డైరెక్టర్స్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తున్నారుగా! తొలిసారి ఓటీటీ వేదికగా వచ్చిన ఈ టాక్ షో టీఆర్పీ రేటింగ్‌లో ముందంజలో దూసుకుపోతూ రికార్ట్ క్రియేట్ చేసింది. అలా హిట్ టాక్‌తో అన్‌స్టాపబుల్ షో తొలి సీజన్ విజయవంతంగా ముగిసింది. ఇక త్వరలోనే రెండో సీజన్‌తో మరోసారి పలకరించబోతున్నాడు బాలయ్య. దీంతో ఈ సీజన్ కోసం ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్రమంలో వారికి మరింత ఆనందాన్ని ఇచ్చే ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ షో తొలి ఎపిసోడ్‌కు గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్ గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో సెకండ్ సీజన్ తొలి ఎపీసోడ్‌కు చిరంజీవి వస్తే ఈ షోకు మరింత క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. కాగా అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ అగష్టులో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం షోకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారట నిర్వహకులు. -
అన్‌స్టాపబుల్ సీజన్ 2పై బాలయ్య క్లారిటీ
నందమూరి నట సింహాం బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వచ్చిన టాక్‌షో అన్‌స్టాబుల్ విత్ ఎన్బీకే. ఈ షో ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షోకు కోసం బాలయ్య హోస్ట్‌గా మారి అన్‌స్టాబబుల్ తొలి సీజన్‌ను విజయంతంగా చేశాడు. తన షోకు విచ్చేసిన అతిథులందరినీ కలుపుకుపోతూ ఎన్నో విషయాలు రాబడుతూ ఆడియన్స్‌నే ఆశ్చర్యపరిచాడు. ఆహాలో సూపర్ డూపర్ హిట్టయిన అన్‌స్టాపబుల్ విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 2పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్‌స్టాబుల్ సీజన్ 2పై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 6 ఎపిసోడ్‌కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా హోస్ట్ శ్రీరామ చంద్ర బాలయ్యను అన్‌స్టాబుల్ సీజన్ 2 ఎప్పుడు సార్? అని ప్రశ్నించాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. మధుర క్షణాలకు ముగింపు ఉండదు.. కొనసాగింపే.. అంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే ఇదే వీడియోను ఆహా వీడియోస్ షేర్ చేస్తూ ‘త్వరలోనే అన్‌స్టాబుల్ టాక్ షో మళ్లీ మీ ముందుకు రాబోతుంది. ఈసారి ఎవరెవరు గెస్ట్‌గా రావాలనుకుంటున్నారో కామెంట్స్ చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో డిజిటల్ ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ రాబోతుందని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్‌గా ఎవరో రావాలో చెబుతూ తమ తమ అభిమాన హీరోల పేర్లను కామెంట్లో పేర్కొంటున్నారు. Bigger, Better and Crazier. Your favourite and India's No.1 talk show returns with Season 2 #UnstoppableWithNBK coming soon! Who should we have on the show as guests? Comment below.🥳 P.S: Crazy comments only (Think Unstoppable) 😉😉 pic.twitter.com/RS4o15vT8I — ahavideoin (@ahavideoIN) June 20, 2022 -
బాలకృష్ణకు తాతా అని పిలిస్తే కోపం, ఇలా పిలవాలంటున్నాడు!
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. హోస్టింగ్‌లోనే కాదు నటసింహం నందమూరి బాలకృష్ణలోనూ కొత్త కోణాన్ని చూపించిందీ కార్యక్రమం. హీరోగా తెరమీద రఫ్ఫాడించే బాలయ్య హోస్టింగ్‌ను సైతం అదరగొట్టాడు. తన షోకు విచ్చేసిన అతిథులందరినీ కలుపుకుపోతూ ఎన్నో విషయాలు రాబడుతూ ఆడియన్స్‌నే ఆశ్చర్యపరిచాడు. ఆహాలో సూపర్ డూపర్ హిట్టయిన అన్‌స్టాపబుల్ విజయవంతంగా తొలి సీజన్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆహాలో అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలో బాలయ్యతో ఓ స్పెషల్ వీడియో ప్లాన్ చేసింది ఆహా టీమ్. అందులో భాగంగా నెవర్ హావ్ ఐ ఎవర్ కాన్సెప్ట్ కింద కొన్ని ప్రశ్నలు అడగ్గా బాలయ్య దానికి సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో తన మనవళ్లు, మనవరాళ్లు తాతా అని పిలిస్తే ఒప్పుకోనన్నాడు. వాళ్లు తనని బాలా అని పిలవాలంతే, నో గ్రాండ్‌పా, నో తాతా అని చెప్పుకొచ్చాడు. పబ్లిక్‌లోకి వెళ్లి ఏమైనా చేయాలనుకుంటే ఆలోచించకుండా వెళ్లిపోతారా? అన్న ప్రశ్నకు నాలాగా పబ్లిక్‌తో కలిసే ఆర్టిస్ట్ ఎవరూ లేరని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అన్ స్టాపబుల్ కు మెగాస్టార్ ఎందుకు రాలేదు ?
-
అన్‌స్టాపబుల్: చిరంజీవితో ఎపిసోడ్‌పై షో రైటర్ ఆసక్తికర కామెంట్స్
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన టాక్‌షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమైన ఈ షో ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిచింది ఈ టాక్ షో. ఇటీవల ముగిసిన ఈ షోలో బాలయ్య తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలరించాడు. అలా ఈ షో సక్సెస్ఫుల్ దూసుకుపోయేలా చేశాడు. దీంతో అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కు కూడా సన్నాహాలు చేస్తున్నారు నిర్వహకులు. ఈ సీజన్‌ను కూడా మరో లెవెల్లోనే చేస్తోందట ఆహా టీం. చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ ఇదిలా ఉంటే ఈ టాక్ షోలో బాలయ్యతో కలిసి టాలీవుడ్ స్టార్స్ మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, నాని, రానాలు సందడి చేశారు. టాలీవుడ్ అగ్రహీరోలు వచ్చిన ఈ షోలో మెగా హీరోల సందడి కరువైంది. ఈ క్రమంలో ఈ షోకు రైటర్గాగా వ్యవహరించిన బీవీఎస్ రవి ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజానికి అన్‌స్టాపబుల్ షోకు చిరంజీవితో కూడా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలిపాడు. చదవండి: Meenakshi Chaudhary: ఇంటిమేట్ సీన్స్‌లో నటించేందుకు నాకేం అభ్యంతరం లేదు కానీ ఆ సమయంలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఉన్నారని, అటు చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించారని బీవీఎస్ రవి వివరించారు. అందువల్ల చిరంజీవి డేట్లు దొరకడం కష్టమైందని, దాంతో మెగా ఎపిసోడ్ ఆలోచన విరమించుకున్నామని చెప్పారు. కానీ చిరంజీవితో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ చేసుంటే టాక్ షో మరో లెవెల్లో ఉండేదని అభిప్రాయపడ్డాడు. రెండో సీజన్లో అయినా చిరంజీవితో ఎపిసోడ్ ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే, అన్ స్టాపబుల్ సీజన్-2 ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై ఆయన స్పష్టత లేదన్నాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే.. -
డైరెక్టర్ శంకర్‌కు క్షమాపణలు చెప్పిన మహేశ్, అసలేం జరిగిందంటే..
Mahesh Babu Sorry To Director Shankar: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో శుక్రవారంతో ముగిసింది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టించి ఈ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు సందడి చేశాడు. ఆయనతో పాటు ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాలయ్య, మహేశ్ బాబుకు సంబంధించిన సీక్రెట్స్‌ను బయటపెట్టించాడు. ఇలా ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ ఎపిసోడ్లో మహేశ్ బాబు తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: దర్శకుడు మోసం చేశాడు, ఆ ఫొటోలు నా జీవితానికి మచ్చ తెచ్చాయి: నటి కాగా ఈ షో మధ్యలో బాలయ్య డైరెక్టర్ మెహర్ రమేష్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా మెహర్ రమేశ్ ముంబైలో చోటు చేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేస్తూ.. ఓ సారి ముంబై మారిటన్ హోటల్లో మేము టిఫిన్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్ చెప్తాడు అని ఫోన్ పెట్టాశాడు. ఇక దీనికి మహేశ్ బాబు సమాధానం ఇస్తూ.. ‘ముంబైలో మారిటన్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. ఫ్యామిలీ అంతా ఉంది. ఓ ఇద్దర అమ్మాయిలు వచ్చారు. సెల్ఫీ అని అడిగారు. ఇప్పుడు కాదు.. ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పాను. చదవండి: సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే.. దీంతో ఆ అమ్మాయిలు వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిపోయాక రమేశ్ నాతో.. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? డైరెక్టర్ శంకర్ గారి కూతుళ్లు అని చెప్పాడు. దీంతో వెంటనే పరిగెత్తుకుని కిందకు వెళ్లాను. సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా అని డైరెక్టర్ శంకర్ అన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ ఫ్యామిలీ, మెహర్ రమేశ్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం తెలిసిందే. -
ఎన్టీఆర్-కృష్ణల మధ్య విభేదాలపై మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mahesh Babu Comments Over Sr NTR And Krishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగానే కాకుండా, అన్‌స్టాపబుల్ షోతో వ్యాఖ్యాతగానూ అదరగొకొడుతున్నారు. ఇప్పటికే ఈ షో ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు గెస్ట్‌గా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు. కాగా నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్ కృష్ణ మధ్య దశాబ్దాలుగా వైరం ఉందని, ముఖ్యంగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామమాజు సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అప్ అయిన మహేశ్ ఎన్టీఆర్- కృష్ణల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న(కృష్ణ)గారికి ఎన్టీఆర్ గారితో గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని ఆ సినిమా చూసిన తర్వాత.. ఆయన చాలా అభినందించారని నాన్న తరుచూ గుర్తుచేసుకునేవారని మహేశ్ వివరించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
అన్‌స్టాపబుల్ స్పెషల్ ప్రోమో: మహేశ్‌పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఫినాలేలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ రేపు(ఫిబ్రవరి 4న) 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ‘పుష్ప’ మూవీపై విరుచుకుపడ్డ గరికపాటి.. కడిగిపారేస్తా.. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా సోషల్ మీడియా ఇది వీపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ రేపు(శుక్రవారం) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. దీంతో ఈ ప్రోమో నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన తక్కువ వ్యవధిలో మంచి వ్యూస్‌ను రాబట్టింది ఈ ప్రోమో. ఇందులో బాలయ్య మహేశ్ బాబును ఆటపట్టించిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. చదవండి: వరుణ్ తేజ్‌తో పెళ్లిపై తొలిసారి స్పందించిన లావణ్య, ఏం చెప్పిందంటే.. మహేశ్ సంబంధించిన ఆసక్తికర సీక్రెట్స్‌ను రాబట్టడానికి బాలయ్య చేసిన సందడి బాగా ఆకట్టుకుంటోంది. ఇక నువ్వు చిన్నప్పుడు చాలా నాటీ బాయ్ అంట కదా అనగానే మహేశ్ సిగ్గు పడటం.. దీనికి చేసేవి చేస్తూనే చెప్పాడానికి సిగ్గు పడతావంటూ బాలయ్య వేసిన పంచ్ డైలాగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఫుల్ ఎపిసోడ్ కోసం నెటజన్లంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి నటసింహం, సూపర్ స్టార్ల అల్లరి చూడాలంటే ఈ ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
షాకింగ్: తండ్రితో పాటు అన్‌స్టాపబుల్ షోకు పని చేసిన బాలయ్య చిన్న కూతురు
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఈ షోలో బాలయ్య తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో సక్సెస్‌ఫుల్‌గా ఈ షోను నడిపించాడు బాలయ్య. చదవండి: హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సింగర్ సునీత కుమారుడు! దీంతో తొలి సీజన్ ముగుస్తుండటంతో ఈ షో రెండో సీజన్‌కు సన్నాహాలు చేస్తున్నారు నిర్వహకులు. ఈ సీజన్ కూడా మరో లెవెల్ లోనే సెట్ చేస్తుంది ఆహా టీం. అయితే ఈ షో ఇంత సక్సెస్ కావడానికి బాలయ్య ఒక కారణమైతే.. తెర వెనక దీని కోసం ఎంతో మంది కష్టపడ్డారట. అయితే వీరిలో బాలయ్య రెండవ కూమార్తె తెజస్వీని కూడా ఉండటం విశేషం. ఈ షోకు తేజస్వీని కూడా పనిచేసిందని తెలిసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. చదవండి: ఆ మూవీ నుంచి రాజశేఖర్‌ను తప్పించారా? జీవిత వల్లే ఆయనకు ఆఫర్ పోయిందట! కాగా అన్‌స్టాపబుల్ షోకు ఆయన రైటర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సక్సెస్ కావడంతో పలు టీవీ, యూట్యూబ్ చానల్ ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి ఈ షోకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ క్రమంలో బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా పనిచేశారని చెప్పాడు. బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని.. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపాడు. ఇక విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వైరల్‌గా ప్రభాస్ ‘ఆది పురుష్’ న్యూ లుక్! శ్రీరాముడిగా ‘డార్లింగ్’ను చూశారా? -
నాకో టైమింగ్ ఉంటుంది.. సితార తాట తీసేస్తది : మహేశ్ బాబు
Unstoppable With Mahesh Babu Grand Finale Promo: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆహా ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్‌కు ఎండ్ కాండ్ పడనుంది. గ్రాండ్ ఫినాలేలో బాలయ్య, మహేశ్‌ల మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. 'ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్'.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్లో మహేశ్‌ను ఆహ్వానించారు.ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.ఓ సారి కేబీఆర్ పార్కుకి వాకింగ్‌కి వెళ్తే పాము కనిపించిందని, అప్పటి నుంచి మళ్లీ అటువైపు వెళ్లలేదంటూ సీక్రెట్ రివీల్ చేశాడు.మొత్తంగా ఆహా అనిపించేలా ఈ గ్రాండ్ ఎపిసోడ్ ఉండనుంది స్పష్టమవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
బాలకృష్ణతో మహేశ్ బాబు సందడి.. అదే చివరి ఎపిసోడ్
Mahesh Babu In NBK's Unstoppable Show: నటనతో ఆద్యంతం మెప్పించిన నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా అదరగుడుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'. విభిన్నమైన సినిమాలు, టాక్ షోలతో అలరిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఈ షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. షో ప్రారంభం అయినప్పటినుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఈ షోలో ఇప్పటికీ అనేక సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు చెప్పి ప్రేక్షకులను అలరించారు. అయితే తాజాగా ఈ షో చివరి ఎపిసోడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన గ్లామర్‌తో ఆకట్టుకోనున్నాడు. అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ ఫినాలో ప్రీమియర్ షోగా ఈ ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదివరకు 9 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షోలో లైగర్ మూవీ టీం, రానా, రవితేజ, పుష్ప చిత్రబృందం తదితర ప్రముఖ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. అయితే మహేశ్ బాబు ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ కూడా చేశాయి. బాలకృష్ణతో ఎపిసోడ్ మొత్తం సరదాగా గడించిందని మహేశ్ బాబు ఇన్‌స్టా వేదికగా కూడా తెలిపాడు. కానీ ఆ ఎపిసోడ్‌ను మాత్రం టెలీకాస్ట్ చేయలేదు. తాజాగా ఈ ఎపిసోడ్‌ను షో చివరి ఎపిసోడ్‌గా టెలికాస్ట్ చేయనున్నట్లు 'అన్‌స్టాపబుల్' మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. త్వరలో ప్రొమో కూడా రానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అత్యధిక వ్యూస్ సాధించిన ఈ షో మహేశ్ బాబు ఎపిసోడ్‌తో మరింత వ్యూస్ దక్కించికోనున్నట్లు తెలుస్తోంది. The most awaited update is here 🤩#UnstoppableWithNBK season finale ft. Superstar @urstrulyMahesh Premieres February 4. Promo soon 💥💥#SSMBOnUnstoppable#NandamuriBalakrishna #MansionHouse @tnldoublehorse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustriesltd #CellPoint pic.twitter.com/DcRBuscgm7 — ahavideoIN (@ahavideoIN) January 20, 2022 -
విజయ్ దేవరకొండ వీడియో వెనుక ఉన్న అసలు కథ ఇదే.. వీడియో
డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ 'లైగర్'. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'లైగర్' గ్లింప్స్‌కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ లైగర్ మూవీ టీమ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు హాజరైంది. ఇటీవలి ఎపిసోడ్లో పూరీ జగన్నాథ్‌తో పాటు విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మీ కౌర్‌లు సందడి చేశారు. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో వస్తున్న ఈ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో 'ఆహా' అనిపిస్తున్నాడు బాలకృష్ణ. ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియోని ఎపిసోడ్ మధ్యలో టెలీకాస్ట్ చేయించాడు బాలకృష్ణ. ఒక టీవీ సీరియల్లో విజయ్ బాల నటుడిగా నటించాడు. ఈ వీడియో పూరీ జగన్నాథ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో గురించి తనకు తెలీదని షాక్ అయ్యాడు పూరీ. అనంతరం ఆ వీడియో పుట్టపర్తి సాయిబాబాపై తీసిన సీరియల్లోనిది అని విజయ్ తెలిపాడు. 'అందులో ఉన్నది నేనే కానీ ఆ వాయిస్ నాది కాదు. అప్పుడు సీరియల్ కోసం కొంచెం బొద్దుగా ఉన్నవాళ్లను సెలెక్ట్ చేసి పట్టుకెళ్లారు. వీడు అయితే డైలాగ్ చెప్పగలడు అని అనిపించినవారికి ఒక్కో డైలాగ్ అలా ఇచ్చారు.' అని విజయ్ దేవరకొండ ఆ వీడియో వెనుక ఉన్న కథను చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) ఇదీ చదవండి: ఇంటికి బొకే పంపి.. టచ్‌లో ఉండమని చెప్పింది.. ధనుష్-ఐశ్వర్యల లవ్‌స్టోరీ -
వాడు నా చేతిలో అయిపోయాడు: బాలయ్య స్వీట్ వార్నింగ్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఆయన ఎనర్జీ, చమత్కారం, కలుపుగోలుతనం, పంచ్‌లకు అభిమానులే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ తారలు ఈ షోకు విచ్చేసి సందడి చేయగా తాజాగా విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ అన్‌స్టాపబుల్‌లో రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆహా వీడియో ఈ ఎపిసోడ్ నుంచి సరదా క్లిప్పింగ్‌ను షేర్ చేసింది. 'టాక్ షో అనగానే మడి కట్టుకుని కూర్చుని నాలుగు క్వశ్చన్లు అడిగి, అవతలి వాళ్లు ఆన్సర్ చెప్పగానే మహాప్రభో అనుకోవడం నా వల్ల కాదని చెప్పాను. ఓ కండీషన్ పెట్టాను.. వచ్చినవాళ్లతో ఆడుకుంటానని కండీషన్ పెట్టాను' అంటూ మొదటగా విజయ్‌తో ఓ ఆటాడించాడు. వేలాడదీసిన శాండ్ బ్యాగ్‌కు ఒక్క పంచ్ ఇవ్వమన్నాడు. విజయ్ గట్టిగా పంచ్ ఇవ్వడంతో అది ఎంతో స్పీడుగా ముందుకెళ్లి తర్వాత వెనక్కు తిరిగి వచ్చింది. బాలయ్య.. 'తాను నటించిన మొదటి చిత్రం ఏది?' అని అడిగాడు. దీంతో విజయ్ నీళ్లు నములుతుండగా అక్కడ షోకు విచ్చేసిన అభిమానుల్లో నుంచి ఒకరు తాతమ్మ కల అని టపీమని బదులివ్వగా.. 'వాడు నా చేతిలో అయిపోయాడు, ఖతం' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. -
ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా: బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ఈ టాక్ షోలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య.. తాజాగా లైగర్ టీమ్‌తో ముచ్చటించారు. పూరీ జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండలతో బాలయ్య చేసిన సందడికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘మాటల గన్.. మన జగన్’అంటూ పూరీని ఆహ్వానించాడు బాలయ్య. ఈ సందర్భంగా వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’మూవీ గురించి చర్చించుకున్నారు. ఇప్పటి వరకు తను మరచిపోలేని పాత్ర తేడా సింగ్(పైసా వసూల్ మూవీ) అని బాలయ్య చెప్పుకొచ్చాడు. అలాగే.. నేనెంత యెదవనో నాకే తెలియదు అని ఆ సినిమాలో చెప్పిన డైలాగ్‌ను గుర్తుకు చేసుకున్నారు బాలకృష్ణ. ‘ఆ మాట నేనే అంట.. ఇంకెవరైనా అంటే కొడతా’అని బాలయ్య అనగా.. పూరీ గట్టిగా నవ్వాడు. అలాగే ఆ సినిమాలో మామా ఏక్ పెగ్ లా.. సాంగ్‌ను కూడా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఇక చార్మి గురించి మాట్లాడుతూ.. అల్లరి పిడుగు మూవీ టైమ్‌లో మనం ఫస్ట్‌టైం కలిశామని గుర్తుచేశాడు. ఇప్పుడు పిడుగులా అయ్యావంటూ చార్మిపై సెటైర్లు వేశాడు. అలాగే ‘సమరసింహారెడ్డి వెల్కమ్స్ అర్జున్ రెడ్డి’ అంటూ హీరో విజయ్‌దేవరకొండను ఆహ్వానించాడు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్పెక్టర్.. అసలు నువ్వు ఎలా రౌడీ అని ఫిక్స్ అయిపోయావ్’అని విజయ్‌ని ప్రశ్నించగా.. . ‘ఫస్ట్ నుంచి అది చేయద్దు, ఇది చేయద్దు లాంటి మాటలు విని విసిగిపోయా... లేదు ఇది కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత టైగర్ టీమ్‌కి సరదాగా కొబ్బరికాయలు కొట్టి ఇస్తూ.. ‘ఈ బిజినెస్ బాగుందే.. సైడ్ బిజినెస్’ అంటూ నవ్వులు పూయించారు. ‘బ్యాంకాక్‌లో కొబ్బరిబోండాల్లో వోడ్కా కలిపి ఇస్తారు’ అని చార్మి అనగా... ‘అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నాం’ అని బాలయ్య సమాధానం ఇచ్చాడు. లైగర్ టీమ్‌తో బాలయ్య చేసిన ఈ స్పెషల్ ఎపిసోడ్ .. సంక్రాంతికి ఆహాలో ప్రసారం కానుంది.