Unstoppable with NBK 2: Prabhas Episode Releases Today - Sakshi
Sakshi News home page

UnstoppablewithNBK: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్‌.. మీకోసం ఒకరోజు ముందుగానే..!

Published Thu, Dec 29 2022 4:50 PM | Last Updated on Thu, Dec 29 2022 5:23 PM

Nandamuri Balakrishna UnstoppablewithNBKS2 With Prabhas Episode today - Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2కు ఉన్న క్రేజే వేరు. టాలీవుడ్‌ ఫేమస్ సెలబ్రీటీలతో ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు నటులు హాజరైన ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హాజరవుతుండటం మరో విశేషం. ఇప్పటికే ప్రభాస్, గోపీచంద్‌తో పాల్గొన్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. పూర్తి ఎపిసోడ్‌ ఈనెల 30న ప్రసారం కానున్నట్లు ప్రకటించిన ఆహా.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఈ ఎపిసోడ్‌ను ఒకరోజు ముందుగానే ఈనెల 29న ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. 

ఇప్పటికే రిలీజైన ప్రోమో ప్రభాస్‌ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నారు.ఈ విషయాన్ని ఆహా ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం చేయనున్నట్లు ఆహా ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎపిసోడ్‌ను బాహుబలి పార్ట్‌-1 తో పోలుస్తూ ఆహా చేసిన ట్వీట్‌ వైరలవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement