నందమూరి బాలకృష్ణ సారథ్యంలో అన్‌స్టాపబుల్ రెండో సీజన్ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇటీవల ఈ షోలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేశారు. అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా ఆరో ఎపిసోడ్‌కు విచ్చేశారు. వీరిని ఇరుకున పెట్టే ప్రశ్నలడుగుతూ వాటికి సమాధానాలు రాబట్టాడు. ఈ క్రమంలో పద్మ అవార్డుల ప్రస్తావన రాగా.. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు జయసుధ, జయప్రద.
'కంగనా రనౌత్ అద్భుత నటి. పట్టుమని పది సినిమాలు చేసిందో లేదో అప్పుడే ఆమెకు పద్మ శ్రీ ఇచ్చారు. కానీ మా విషయంలో అలా జరగలేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అంతెందుకు, గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళా డైరెక్టర్ విజయ నిర్మలను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఇలాంటి సందర్భాల్లోనే కేంద్రం దక్షిణాది చిత్రపరిశ్రమ పట్ల వివక్ష చూపిస్తుందనిపిస్తుంది' అని జయసుధ చెప్పుకొచ్చింది. జయప్రద మాట్లాడుతూ.. అవార్డులు అడిగి తీసుకోవడం మాకిష్టం లేదు. మా ప్రతిభను, సీనియారిటీని గుర్తించి గౌరవించాలనుకున్నాం అని పేర్కొంది.
చదవండి: థియేటర్లు అమ్మేశారు, ఆస్తులు పోయాయి.. కమెడియన్ కూతురు
బతిమాలినా రాలేదు, నటిపై ఫైర్
Comments
Please login to add a commentAdd a comment