JAYASUDHA
-
నా దగ్గర ఇలాంటి తిరకాసు ప్రశ్నలు వద్దు: జయసుధ
అలనాడు హీరోయిన్గా కుర్రకారు మనసులు దోచుకున్న జయసుధ.. ఇప్పుడు అమ్మగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా.. నానమ్మగా మారి సహజనటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు. సుమారుగా 50 ఏళ్లుగా వెండితెరపై తన అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. జయసుధ అద్భుతంగా నటించగల గొప్ప స్టార్. అందుకే, ఆమె మాత్రమే 'సహజనటి' అవగలిగింది. బాలనటిగా గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన జయసుధ హీరోయిన్ గా అన్ని విధాల పాత్రల్ని అవలీలగా చేసింది. నటన ఆమె ప్రధానమైన బలమైనప్పటికీ కమర్షియల్, గ్లామర్ రోల్స్ కి కూడా జయసుధ ఎన్నోసార్లు వన్నెతెచ్చింది. ఈ క్రమంలో ఆమె సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలకు ధీటుగా అభిమానులను సొంతం చేసుకుంది. 350కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్, తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించారు. కమల్‌తో జయసుధ పెళ్లంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. ముందుగా ఆ ప్రశ్న ఎదురు అయిన వెంటనే ఆమె చాలా అసహనానికి లోనయ్యారు. ప్రశ్న అడిగిన వ్యక్తితో చాలా ఎళ్లుగా పరిచయం ఉంది కాబట్టి ఏం అనలేక వదిలేస్తున్నాను అంటూనే ఎంతో హూందాగా సమాధానం చెప్పారు. 'ఇప్పుడు కమల్‌తో పెళ్లి విషయం అవసరమా? చాలామంది పాత సంగతులను ఇప్పుడు అడుగుతున్నారు ఏంటి..? ఆ రోజుల్లో బాలచందర్ గారు తీసిన చాలా సినిమాల్లో కమల్‌తో పాటుగా నేను నటించాను. ఆ సినిమాలకి సంబంధించిన పలు పాటలను స్టేజ్ పై ఇద్దరమూ పాడే వారం. వాస్తవంగా కమల్ మంచి సింగర్. ఆయనతో పాటు నేను కూడా పాటలు పాడేదానిని. ఆ సమయంలో మా పెయిర్ బాగుందని అందరూ అనేవారు. అందువలన మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఈ విషయంపై అప్పట్లో కొన్ని తమిళ పేపర్లు రాసి ఉండొచ్చు. పత్రికల వాళ్లు ఏదో ఒకటి రాయకపోతే ఎలా..? దీంతో అలాంటి తప్పుడు ప్రచారం జరిగి ఉంటుంది. వాస్తవంగా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది హీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నేను గొప్పనటిని అంటున్నందుకు సంతోషమే కానీ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పను.' అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తితో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. -
రికార్డ్ బ్రేక్ మూవీతో వస్తోన్న జయసుధ కుమారుడు..!
నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోకు వచ్చి సపోర్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది తెలుగు వాళ్లకు.. సంబంధించిన రైతులకు.. అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే వచ్చిన దర్శకులు విజయేంద్రప్రసాద్, జయసుధ , ఆర్ నారాయణ మూర్తి , రైటర్ చిన్ని కృష్ణ , దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలోని తల్లి సెంటిమెంట్ గురించి దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా. ఇది ఒక కొత్త అటెంప్ట్. చదలవాడ శ్రీనివాసరావు ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని అవుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. ఆర్. నారాయణ మూర్తి గారు మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలి అనే విలువలున్నాయి. ఈ మూవీ కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అన్నారు. జయసుధ మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో నిహార్ నటించడం చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు చేశాడని కాకుండా.. ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఈ బ్యానర్లో నేను చాలా సినిమాల్లో నటించాను. చదలవాడ శ్రీనివాసరావుతో చాలా మంచి అనుబంధం ఉంది. సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయి. కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుంది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో సత్య కృష్ణ, ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్, సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
'నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ క్రికెటర్'.. మనసులో మాట చెప్పేసిన జయసుధ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన బాల్యంలో చెన్నైలో చెపాక్ స్టేడియం(ఇప్పటి చిదంబరం స్టేడియం) దగ్గర్లోనే తమ నివాసముండేదని జయసుధ తెలిపింది. మా ఇంటికి.. గ్రౌండ్‌కు మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉండేదని వివరించింది. అక్కడే ఉన్న హిందూ స్కూల్లో చాలామంది సినిమా, క్రికెట్ ప్రముఖులు కూడా చదువుకున్నారు. తనకు చిన్న వయసులో అక్కడే చాలా క్రికెట్ మ్యాచులు జరుగుతుండేవని పేర్కొంది. నేను చాలాసార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచులు చూసేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో తనకు ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే క్రష్ ఏర్పడిందని ఆమె తెలిపింది. అప్పట్లో అందరికంటే అతను హ్యాండ్సమ్గా ఉండేవారని జయసుధ తెలిపింది. అంతే కాకుండా ఆయనను చాలామంది ఇష్టపడేవారని వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. జయసుధ మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలని అనుకున్నా. సెకండ్ ఆప్షన్ సినిమా. ఇక మూడోది టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. కానీ ఈ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో చేశాను. లక్కీగా 12 ఏళ్లకే మొదటి సినిమా చేశా. అప్పట్లో మంజుల గారు చాలా ఫేమస్. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె చేయలేని సినిమాలకు నన్ను పరిచయం చేసేవారు. అలా శోభన్ బాబుతో మొదటి సినిమా చేశా. నా అసలు పేరు సుజాత. అప్పటికే మలయాళంలో ఆ పేరుతో మరో హీరోయిన్ ఉండేది. గుహనాథన్ అనే ఒక తమిళ రైటర్ జయసుధ అనే పేరును సూచించారు. నాకు మొదటి నుంచి సినిమా చేసే లక్షణాలు లేవు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. షూటింగ్లో ఉన్నప్పుడు కామెంటరీ వినేందుకు సిగ్నల్ కోసం అలా వెళ్లిపోయేదాన్ని. క్రికెట్లో నా ఫేవరేట్ సునీల్ గవాస్కర్, ఏక్నాథ్ సోల్కర్ అని ఒకాయన ఉండేవారు. సినిమాల వాళ్లకు క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో టీనేజర్‌గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ నా క్రష్. అతను చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు. నేనే కాదు.. చాలామంది ఆయన్ను చూసేందుకే మ్యాచులకు వచ్చేవారు. ' అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. -
జయసుధ భర్త మరణం.. అప్పులపై జయసుధ క్లారిటీ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన భర్త ఆత్మహత్యకు అప్పులు కారణం కాదని వివరించింది. తాము నిర్మించిన చిత్రాలతో కష్టాలు పడ్డామని తెలిపింది. నా భర్త నితిన్ ఆరు సినిమాలు తీశారు. వాటిలో మూడు సక్సెస్ కాగా.. మరో మూడు చిత్రాలు ఫెయిల్ అయ్యానని పేర్కొంది. అందరూ అనుకున్నట్లు మాకు ఎలాంటి అప్పులు లేవని జయసుధ వివరించింది. జయసుధ మాట్లాడుతూ.. 'నా భర్త ఫ్యామిలీలో వాళ్ల బ్రదర్ కూడా అలానే చనిపోయారు. వాళ్ల మా అత్తగారి తరఫున ఇద్దరు అలాగే సూసైడ్ చేసుకున్నారు. ఆయన సూసైడ్‌కు నేను కారణం కాదు. ఆ పరిస్థితి మన ఫ్యామిలీలో ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నా. నేనే కదా సంపాదించేది. అప్పట్లో అప్పులంటే మాకు భయమే లేదు. మాకు సూసైడ్ చేసుకునేంత అప్పులు ఉండేవి కావు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువగా చెడునే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచి కూడా ఉంది. నేను కూడా రోజు సోషల్ మీడియా చూస్తాను.' అని అన్నారు. ఆయనను కాపాడేందుకు మేము.. నా భర్త తరఫు ఫ్యామిలీ కూడా ఆయనను కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించామని జయసుధ తెలిపారు. కానీ విధిరాత అనేది ఒకటి ఉంటుంది కదా? అని ఆమె అన్నారు. ఆయన మరణం తర్వాత నేను షాక్‌లో ఉన్నానని తెలిపింది. కానీ ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమా చేసినట్లు వివరించింది. ఫస్ట్ చేయకూడదని అనుకున్నా.. కానీ సినిమా చేయడం వల్లే ఆ విషాదం నుంచి బయటపడినట్లు జయసుధ వెల్లడించింది. ఆ సమయంలో నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్‌గా ఉన్నారని జయసుధ పేర్కొంది. -
అమ్మకు కాన్సెప్ట్ నచ్చింది.. నన్ను మెచ్చుకుంది: జయసుధ కొడుకు
'రికార్డ్ బ్రేక్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నిహార్ కపూర్ మీడియాతో ముచ్చటించాడు. తన కొత్త మూవీ గురించి పలు విషయాల్ని పంచుకున్నాడు. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) 'రికార్డ్ బ్రేక్' కథ వినగానే చాలా ఎక్సైటింగ్‌గా అనిపించి చేస్తానని అన్నాను. హీరో అని కాకుండా క్యారెక్టరైజేషన్ నచ్చడంతో ఈ మూవీ చేశాను. కథ విషయానికొస్తే.. అడవిలో పెరిగిన ఇద్దరు కవల అనాథలు.. కుస్తీ నేర్చుకుని సిటీకి వచ్చి, ఇంటర్నేషనల్ లెవెల్లో డబ్ల్యూడబ్ల్యూఈ వరకు వెళ్లే ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు. ఇది తెలుగు సినిమా అయినాకానీ ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. సినిమాని అమ్మ(జయసుధ) కొంత చూశారు. ఆమె దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఒకసారి ఫుల్ సినిమా చూసిన తర్వాత ఏం చెప్తారు అనేది నేను వెయిట్ చేస్తున్నాను. కథ నేనే విని ఒకే చేశా. అయితే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నావ్ అని చెప్పి అమ్మ నన్ను మెచ్చుకున్నారు. ప్రస్తుతం యాక్టింగ్ చేస్తున్నా, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. ఇప్పుడైతే కొన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నాను. (ఇదీ చదవండి: 20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!) -
చంద్రమోహన్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న జయసుధ
-
రాజకీయం సినిమా వరకేనా? ఎన్నికల్లో పోటీ చేయరా?
తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ వార్ నడుస్తోంది. ఇప్పేటికే రాజకీయ నాయకుల నుంచి బుల్లెట్ లాంటి వ్యాఖ్యలు దూసుకొస్తున్నాయి. దీంతో ప్రతిరోజూ పత్రికలల్లో నువ్వానేనా.. హోరాహోరీ..! అనేలా వార్తలు ప్రచురం అవుతున్నాయి. అన్ని జరుగుతున్నా ఈ సారి ఎన్నికల్లో సినిమా గ్లామర్ కనిపించడం లేదు. ఎన్నికల వాతావారణం ముందు వివిధ పార్టీల నుంచి ఎలక్షన్స్ బరిలోకి దిగాలని దాదాపు పదిమందికి పైగా సినీ ప్రముఖులు ఉవ్విళ్లూరుతున్నట్లు వార్తలు వచ్చాయి! కానీ వారిలో ఈసారి ఎవ్వరికి ఆయా పార్టీలు టికెట్లు ఇవ్వకుండా మొండిచేయి చూపించాయని చెప్పవచ్చు. బరిలో బాబూ మోహన్ మాత్రమే.. వారందరూ దూరం ఎందుకు? నిజానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత విజయశాంతి, బాబూ మోహన్ మాత్రమే సినీ రంగం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క బాబూ మోహన్ మాత్రమే పోటీ చేశారు! అదే విధంగా జయసుధ కూడా ఎక్కడా పోటీ చేయలేదు. కానీ ఈ సారి ఈ ముగ్గురితో పాటు నిర్మాతలు దిల్ రాజు, రామ్ తాళ్లూరి, దర్శకుడు శంకర్, నితిన్, జీవిత, కత్తి కార్తీక, ప్రకాశ్ రాజ్ వంటి వారందరూ కూడా వివిధ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ పైనల్గా బాబూ మోహన్ మాత్రమే ఆందోల్ నియోజక వర్గం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నాడు. బీజేపీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యుర్థుల మొదటి లిస్ట్‌లో ఆయన పేరు కూడా లేకపోవడంతో పార్టీపై ఆయన పలు విమర్శలకు దిగాడు. దీంతో రెండో లిస్ట్‌లో ఆయన పేరును బీజేపీ ఖరారు చేసింది. ఎన్నికల బరిలో లేని జయసుధ కారణమిదేనా..? ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీలో చేరిన సీనియర్ నటి జయసుధకు సీటు దక్కలేదు. అదే పార్టీలో చాలా ఎళ్లుగా ఉన్న ఫైర్ బ్రాండ్ విజయశాంతి అలియాస్ రాములమ్మకు కూడా సీటు దక్కలేదు. ఎన్నికల బరిలో నిలబడకూడదని వారు నిర్ణయించుకున్నారా..? లేదా పార్టీనే వారిని పక్కన పెట్టేసిందా..? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీలకు తెలుగు చిత్ర సీమ నుంచి సానుభూతి పరులు ఉన్న విషయం తెలిసిందే. కానీ వారెవ్వరూ ఎన్నికల సమయంలో ఆ పార్టీల తరపున ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఎక్కడా కూడ నోరెత్తడం లేదు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురుకావచ్చు.. మనకెందుకు ఈ ఎన్నికల గొడవ అని వారు ఎక్కడా కూడా నొరెత్తడం లేదని తెలుస్తోంది. బీజేపీకి దూరంగా విజయశాంతి..! 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయశాంతి. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి కచ్చితంగా బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇంకోవైపు, ఇటీవల పార్టీలో క్రియాశీలంగా ఉన్న జీవిత కూడా బీజేపీ తరఫున పోటీలోకి దిగుతారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉంటారని వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు జయసుధ కూడా సికింద్రాబాద్ నుంచి ఎన్నికల పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతుండగా దానిని ఆమె కొట్టిపారేసింది. తాను ఎక్కడ నుంచి పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించింది. ఇప్పుడు ఎన్నికల్లో ప్రచారం చేసి రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోతే తన పరిస్థితి ఏంటి..? అధికారంలోకి వచ్చిన పార్టీతో లేనిపోని గొడవలు ఎందుకు..? సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖుల మాదిరే తాను కూడా సైలెంట్‌గా ఉండటమే మంచిదని ఆమె నిర్ణయానికి వచ్చారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో ఆ పార్టీ తెలంగాణ విభాగం మహిళా ర్యాలీ చేపట్టింది. ఇందులో జయసుధ ప్రధాన ఆకర్షణగా నిలవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ సమయంలో రాములమ్మకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని, ఆమె పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అప్పట్లో ఒక్కసారిగా గుప్పుమంది. ఆమె స్థానాన్ని జయసుధతో బీజేపీ భర్తీ చేసిందని పలువురు చెప్పుకొచ్చారు. రాములమ్మపై కిరణ్‌కుమార్ రెడ్డి ఎఫెక్ట్.. సినీ నటీనటుల్లో ఎన్నికల భయం తెలంగాణను వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బీజేపీలో చేరడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించడం కూడా ఆ పార్టీలో కొందరికి మింగుడు పడలేదు. కొన్ని సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డితో వేదిక పంచుకోవడానికి సైతం ఆమె ఆసక్తి చూపక పోవడంతో కొందరు నేతలకు తలనొప్పిగా మారింది. మణిపూర్ హింసాకాండపై కూడా ఆమె చేసిన ట్వీట్ బీజేపీని షాక్‌కు గురిచేసింది. అంతేకాక కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రకటనలు, పోస్టులు పెట్టడం, సోనియా గాంధీ, రాహుల్ వ్యాఖ్యలకు వత్తాసు పలుకడంతో ఆమె మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆమె ప్రస్తుతానికి బీజేపీలోనే కొనసాగుతున్నా.. ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. అదే సమయంలో కొన్ని నెలల క్రితం బీజేపీ కండువా కప్పుకున్న జయసుధ కూడా ప్రచారానికి దూరంగానే ఉంది. పలు రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉన్నా ఇతర సినీ ప్రముఖులు కూడా తెలంగాణ ఎన్నికల్లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. దీనంతటికి కారణం వారి సినిమా కెరియర్ ట్రాక్ బాగుంది కదా..? తమకు అవసరం లేని ఈ పాలిటిక్స్ ఎందుకని వారు గ్రహించినట్లు తెలుస్తోంది. -
జయసుధ కొంగు పట్టుకొని వెళ్ళే వాడిని
-
Jayasudha : బెనకా గోల్డ్ కంపెనీని ప్రారంభించిన సహజనటి జయసుధ (ఫొటోలు)
-
చెప్పుల కోసం ఆ హీరోయిన్ నాతో గొడవపడింది
-
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఇప్పటికీ న్యాయం జరగడం లేదు
-
చిరంజీవి పక్కన హీరోయిన్గా, చెల్లిగా, తల్లిగా కనిపించిన నటి!
హీరోల సంగతి ఎలా ఉన్నా హీరోయిన్స్ మాత్రం రకరకాల పాత్రలు చేస్తుంటారు. తొలినాళ్లలో హీరోయిన్గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత తల్లిగా, వదినగా.. వయసు మీద పడే కొద్దీ పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోతూ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా అందుకు అతీతం కాదు. అయితే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక సినిమాలకు ముగింపు పలికినవాళ్లూ ఉన్నారు. ఇకపోతే చిరంజీవితో స్టెప్పులేసి హీరోయిన్గా వెలుగు వెలిగి తర్వాత క్రమంలో చెల్లి, అమ్మగా నటించిన సీనియర్ నటి ఎవరో తెలుసా? సుజాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన సుజాత దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబినేషన్లో ప్రేమతరంగాలు అనే మల్టీస్టారర్ మూవీ వచ్చింది. ఇందులో చిరుకు జోడీగా నటించింది సుజాత. రెండేళ్ల తర్వాత 1982లో సీతాదేవి చిత్రంలో చిరుకు చెల్లిగా యాక్ట్ చేసింది. ప్రేయసి కాస్తా చెల్లెలు అయిపోయిందేంటి? అనుకుంటున్న సమయంలో ఏకంగా మెగాస్టార్‌కు తల్లిగా మారిపోయింది నటి. 1995లో బిగ్‌బాస్ మూవీలో చిరు తల్లిగా కనిపించింది. చిరుకు చెల్లెలిగా నటించి రొమాంటిక్ స్టెప్పులేసినవారు ఉన్నారు కానీ ఇలా హీరోయిన్, చెల్లి, అమ్మ.. అన్ని రకాల పాత్రలను పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం. నటిగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె అనారోగ్యంతో బాధపడుతూ 2011 ఏప్రిల్ 6న కన్నుమూసింది. ఇకపోతే ప్రేమతరంగాలు సినిమాలో డ్యాన్సర్‌గా నటించిన జయసుధ రిక్షావోడు చిత్రంలో చిరుకు తల్లిగా నటించింది. చదవండి: ఇదేందిది.. ఇది ప్రభాస్ విగ్రహమా? నెట్టింట ట్రోలింగ్.. బాహుబలి నిర్మాత సీరియస్ -
ANR విగ్రహావిష్కరణలో ప్రియుడితో జయసుధ?! ఏంటి, నిజమేనా?
హీరోయిన్గా ఒకప్పుడు వెలుగు వెలిగిన సహజ నటి జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి సినీ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది. వెండితెరపై అన్నిరకాల హావభావాలను ఒలికించే జయసుధ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే గతంలో జయసుధకు రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే! కలిసిరాని రెండు పెళ్లిళ్లు 1982లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తర్వాత బాలీవుడ్ స్టార్ నటుడు జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్‌తో 1985లో ఏడడుగులు వేసింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన 2017లో భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే జయసుధ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైందంటూ అప్పట్లో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూడో పెళ్లి? అమెరికాకు చెందిన వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మీదునియా కోడై కూసింది. కమెడియన్ అలీ కూతురి పెళ్లికి కూడా అతడిని వెంట తీసుకుని వెళ్లింది. వారసుడు ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా జయసుధ పక్కన అతడే ఉన్నాడు. దీంతో మూడో పెళ్లి నిజమేనంటూ ప్రచారం ఊపందుకోగా అదేమీ లేదని అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది సహజ నటి. తన బయోపిక్ తీసేందుకే ఇండియా వచ్చాడని, సినిమా ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే తన వెంట వస్తున్నాడని చెప్పింది. మరోసారి ప్రియుడితో జయసుధ? కానీ తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లోనూ జయసుధ వెంట ఆ ఫారినర్ ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుకలో నటితో పాటు పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అతడు బయోపిక్ కోసం వచ్చినట్లు లేడని, కచ్చితంగా జయసుధ ప్రియుడేనని మరోసారి పుకార్లు ఊపందుకున్నాయి. మరి ఈసారి జయసుధ ఏమని సమాధానం చెప్తుందో చూడాలి! చదవండి: జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. వీడియో వైరల్ -
జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. స్పీచ్ వైరల్
విలక్షణ నటుడు మోహన్‌బాబు క్రమశిక్షణకు మారుపేరు. తను మాత్రమే కాదు, తన చుట్టుపక్కలవారు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు. బుధవారం (సెప్టెంబర్ 20) నాడు తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ క్రమంలో తన పక్కనే కూర్చున్న జయసుధ అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా ఫోన్ చూస్తూ ఉంది. ఫోన్‌తో జయసుధ ఆటలు దీంతో మోహన్‌బాబు ఈ సమయంలో ఫోన్ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఎన్నార్ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ వంక చూడటం కరెక్ట్ కాదు కదా.. మోహన్‌బాబు చేసింది కరెక్టేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చొక్కా చించుకుని వెళ్లా ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి మోహన్ బాబు ప్రసంగిస్తూ.. 'ఏఎన్నార్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయన సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుందంటే చొక్కా చించుకుని మరీ వెళ్లేవాడిని. మళ్లీ ఆ చొక్కా కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. అటువంటిది ఆయన నటించిన మరపురాని మనిషి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఆ తర్వాత ఆయన బ్యానర్లో ఎన్నో సినిమాల్లో నటించాను. ఓసారి నాగేశ్వరరావు- అన్నపూర్ణమ్మ పక్కపక్కనే కూర్చున్నప్పుడు నేను వెళ్లాను. ఆమె నన్ను చూసి ఫలానా సినిమాలో బాగా నటించావని ఆశీర్వదించిస్తే ఆయన కసురుకున్నారు. నా కోరిక తీర్చారు వాడేమైనా గొప్ప నటుడని ఫీలవుతున్నావా? వాడికి ముందే పొగరు. ఎందుకు? వాడి గురించి పొగుడుతున్నావని ఆమెపై కోప్పడ్డారు. తర్వాతి రోజు నేను సెట్‌కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడో విషయం చెప్పాను.. నాకు ఓ కోరికుంది సార్.. ప్రతిసారి మీరొస్తే మేము నిలబడటమేనా? నేను వచ్చినప్పుడు మీరు లేచి నిలబడాలని కోరుకుంటున్నా అన్నాను. నా కోరిక విని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు సెట్‌కు వెళ్తే దాసరి, ఏఎన్నార్.. ఇద్దరూ నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారు. ఇలా ఆయనతో ఎన్నో సరదా సంఘటనల అనుభూతులున్నాయి. ఏఎన్నార్ ఒక గ్రంథం, ఒక పాఠ్య పుస్తకం. అటువంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండటం చాలా సంతోషం' అని చెప్పుకొచ్చారు. ఫోన్ పట్టుకొని కూర్చున్న జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు. #ANRLivesOn #CelebratingANR100 pic.twitter.com/IcsDTT5RJe — Actual India (@ActualIndia) September 20, 2023 చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
సాక్షి, హైదరాబాద్: సుమారు రూ.6 లక్షల కోట్ల అప్పుతో మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అనేక రాష్ట్రాలు తమ ఆదాయం పెంచు కుంటుంటే.. ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ సంస్థలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వద్ద.. ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి, పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రం స్థలం ఉండదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను స్వయంగా అనేక ఉత్తరాలు రాసి రైల్వే టర్మినళ్లకు, చర్లపల్లిలో రైల్వే స్టేషన్విస్తరణకు భూమి కావాలన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిభట్ల లాంటి అనేకచోట్ల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని విమర్శించారు. పార్టీల పేరుతో పంచుకున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్రెండు పార్టీలు కుమ్మక్కై వందల కోట్ల విలువ చేసే భూములను పార్టీలకు కేటాయింపుల పేరుతో అక్రమంగా తీసుకున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. విలువైన భూములను కాంగ్రెస్, బీఆర్ఎస్లు పంచుకున్నాయని, కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రాతిపదికనైతే భూమి ఇచ్చామో, బీఆర్ఎస్కు అదే ప్రాతిపదికన తీసుకున్నామని సిగ్గు లేకుండా జీవోలో చెప్పుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం, వాళ్ల అనుచరులు, బినామీల పేర్లమీద భూములు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. భావితరాల కోసం భూములను రక్షించాల్సి న అవసరం ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. 4 నెలల తర్వాత అధికారంలోకి వచ్చే బీజేపీ ప్రభుత్వం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు భూమి కేటాయింపులకు సంబంధించిన జీవోలను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. భూముల వేలాన్ని కూడా బీజేపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కాగా సోమవారం బీజేపీ కార్యాలయానికి వచ్చిన సినీనటి జయసుధను ఈ సందర్భంగా సత్కరించారు. -
బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్
సాక్షి, ఢిల్లీ: చికోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన పేరు. విదేశాల్లో అక్రమ క్యాసినో నడిపించిన వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్.. అటుపై నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జంతువుల్ని పెంచుకున్నాడనే అభియోగాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత ఊతం ఇచ్చాయి. చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీలో చేరొచ్చనే సంకేతాలు ఇస్తూ.. గురువారం ఢిల్లీలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు ప్రవీణ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను కలిశాడు. వాళ్లకు శాలువా కప్పి సత్కరించాడు. వీళ్లతో పాటు తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం ప్రవీణ్ కలిశాడు. బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే వీళ్లందరినీ కలుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇక్కడి నేతలను ఢిల్లీ వెళ్లి మరీ కలవడం గమనార్హం. ఇక.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న వ్యక్తి, పైగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
సహజనటి జయసుధ ఈ ఫొటోలు ఎప్పుడైనా చూశారా?
-
పోటీ చేస్తాననడం రూమర్ మాత్రమే: జయసుధ
సాక్షి, ఢిల్లీ: సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో అధికారికంగా చేరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ ఆమెకు కండువా కప్పి కాషాయం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘‘ఎమ్మెల్యేగా నా పదవీకాలం పూర్తయ్యాక.. కొన్ని కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నా. ప్రధానమంత్రి మోదీ పరిపాలన నచ్చి బీజేపీలో చేరాను. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి వచ్చా. దాదాపు ఏడాదిగా బీజేపీలో చేరాలని ఆలోచిస్తున్నాను. జాతీయ పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేస్తా. పార్టీ ద్వారా క్రైస్తవుల కోసం పని చేస్తా. కులమతాలకు అనుగుణంగా సేవలు అందిస్తా. సికింద్రాబాద్, ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తాననడం రూమర్ మాత్రమే’’ :::జయసుధ ‘‘సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు, 350కి పైగా సినిమాలలో నటించారు. జయసుధ చేరికతో బీజేపీ బలోపేతం అవుతుంది. BRS ఓటమి తోనే తెలంగాణ అమరుల ఆకాంక్ష నెరవేరుతుంది. పేదల సంక్షేమం, బస్తీల అభివృద్ధి విషయంలో జయసుధకు చిత్తశుద్ది ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే కుటుంబ పాలన, నియంతృత్వ పాలన పోవాలి అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలి.’’ :::కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ జయసుధకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఈ తొమ్మిదేళ్లలో మోదీ పాలన.. అభివృద్ధిని చూసి ఆమె బీజేపీలో చేరారు. జయసుధ చేరిక బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుంది. :::తరుణ్‌చుగ్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి -
కమలం గూటికి జయసుధ.. ఎవరికి చెక్ పెట్టేందుకు?.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌ను బీజేపీ వేగవంతం చేసింది. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి,మెదక్ డీసీసీబీ మాజీ ఛైర్మన్ జైపాల్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి ,చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు త్వరలో బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. తాజాగా సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకొనున్నారు. కాంగ్రెస్ తరఫున 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి జయసుధ గెలిచారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి బరిలోకి జయసుధను దింపుతారని ప్రచారం. ఇప్పటికే ఈటలతో జయసుధ భేటీ అయిన సంగతి తెలిసిందే. చదవండి: రాజకీయాలు చేయాల్సిన టైం ఇదా కేసీఆర్..? ఎవరికి చెక్ పెట్టేందుకు జయసుధ? ముషీరాబాద్ నుంచి తన అనుచరులకు టికెట్ ఇప్పించుకోవాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రయత్నాలు చేస్తుండగా, ముషీరాబాద్ నుంచి తన కుమార్తె విజయలక్ష్మిని బరిలోకి దింపాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మణ్, దత్తాత్రేయలకు చెక్ పెట్టేందుకు జయసుధను తెస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. -
ఆపరేషన్ ఆకర్ష్.. జయసుధ సహా బీజేపీలోకి భారీ చేరికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పార్టీలో చేరికలపై నేతలు బిజీగా ఉన్నారు. ఇక, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు.. సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో ప్లాన్స్ చేస్తున్నారు. దీంతో, బీజేపీలో చేరికలు భారీ స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కొందరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలు బీజేపీలో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి బీజేపీ లో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఇప్పటికే వివేక్‌ను కలిశారు. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ భేటీ అయ్యారు. ఈ క్రమంలో జయసుధ బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. హైకమాండ్ పిలుపు నేపథ్యంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. ఈటల రాజేందర్ సైతం ఈరోజు ఢిల్లీలోకి వెళ్లనున్నారు. వీరి తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీలో చేరికలపై ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బండి సంజయ్, డీకే అరుణకు కీలక పదవులు.. -
జయసుధ సోదరి కూతురు నటి అని తెలుసా.. ఏ చిత్రంలో చేసిందంటే?
సీనియర్ హీరోయిన్ జయసుధ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. 1990లోనే అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తనదైన నటనతో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై సక్సెస్ఫుల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించిన జయసుధ మాతృభాష తెలుగే. జయసుధ దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ చిత్రాల్లోను నటించారు. ఒకే సంవత్సరంలో జయసుధ నటించిన సినిమాలు 25 విడుదలయ్యాయి. ఆమె ఎక్కువగా రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు చిత్రాల్లో కనిపించారు. ఈ ఏడాది వారసుడు, మళ్లీ పెళ్లి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాల్లో నటించారు. (ఇది చదవండి: పెళ్లై కొన్ని నెలలైనా కాలేదు.. అప్పుడే విడాకులా..!) తెలుగులో స్టార్ నటిగా ఓ వెలుగు వెలిగిన జయసుధకు ఓ చెల్లెలు కూడా ఉంది. ఆమె కూడా నటి అన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమెకు జయసుధలా వెండితెరపై అంతలా రాణించలేకపోయింది. జయసుధ సోదరి సుభాషిణి మొదట బుల్లితెర పై నాగాస్త్రం, సుందరకాండ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సీతయ్య’ ‘అరుంధతి’ వంటి పెద్ద సినిమాల్లో నటించినా ఆమెకు గుర్తింపు దక్కలేదు. ఆమె దాదాపుగా 12 చిత్రాల్లో కనిపించారు. ఇక ఆమెతో పాటు కూతురు కూడా సినిమాల్లో అడుగుపెట్టింది. కానీ అమ్మలాగే కూతురికి కూడా సక్సెస్ కాలేకపోయింది. సుభాషిణి కూతురు పూజ ప్రియాంక పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ తో చేసిన 143 చిత్రంలో సెకండ్ హీరోయిన్గా చేసింది. ఆ మూవీలో సాయిని వన్ సైడ్ లవ్ చేస్తూ కనిపించింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో గుర్తింపు దక్కలేదు. దీంతో 2012లో పెళ్లి చేసుకున్న పూజ ప్రియాంక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. జయసుధ స్టార్ హీరోయిన్గా ఎదిగినప్పటికీ తన సోదరితో ఆమె కూతురు కూడా ఇండస్ట్రీలో అంతగా పేరు సంపాదించలేకపోయారు. (ఇది చదవండి: ఆరు నెలల వ్యవధిలో అమ్మానాన్న మరణం.. నన్ను ఒంటరిగా వదిలేసి) -
నాకు.. నరేశ్‌కి ఆ అదృష్టం దక్కింది
‘‘చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ నాకు, నరేశ్‌కు ఆ అదృష్టం దక్కింది. విజయనిర్మలగారు ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా నన్ను, నరేశ్‌లను పరిచయం చేశారు. మన వ్యక్తిగత విషయాల పరంగా ఎవరికీ భయపడక్కర్లేదు’’ అని నటి జయసుధ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్‌పై వీకే నరేశ్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘ఆకాశమే..’ అనే సాంగ్‌ను జయసుధ విడుదల చేశారు. నటిగా యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధను నరేశ్ సత్కరించగా, నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నరేశ్ ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో జయసుధ సత్కరించారు. వీకే నరేశ్ మాట్లాడుతూ–‘‘నా రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైఫ్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ (విజయ నిర్మల) తర్వాత ఇంకో అమ్మను (పవిత్ర) కలుసుకున్నాను. జీవితంలో ఫస్టాప్ కంటే సెకండాఫ్ బాగుండా లని చెప్పే చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’’ అన్నారు. ‘‘నా కొత్త జీవితం ప్రారంభమైంది. ‘మళ్ళీ పెళ్లి’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు రాజుగారు, నరేశ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు పవిత్రా లోకేశ్. ‘‘నా 12 ఏళ్లప్పుడు విజయ కృష్ణ మూవీస్‌లో ‘మీనా’ సినిమా చూశాను. ఇప్పుడు వారి బేనర్లో సినిమా చేస్తాననుకోలేదు. ‘మళ్ళీ పెళ్లి’ బోల్డ్ కథ’’ అన్నారు ఎమ్మెస్ రాజు. -
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్‌గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. -
స్ఫూర్తి గాథ: తండ్రి తపనను అర్థం చేసుకుని గెలిచిన బిడ్డలు
నిజామాబాద్ : ‘చేసేది చిన్న ఉద్యోగమైనా ఆ తండ్రి తీసుకున్న నిర్ణయాలు నేడు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిల బడాలనే తపనకు తోడు చదువులో పిల్లలు రాణించడంతో ప్రభుత్వఉద్యోగాలకు ఆ ఇల్లు నిలయమైంది. ఇద్దరు కుమారులు సహా నలుగురు కుమార్తెల్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారంటే అందులో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతుందో.. పురు ష, స్త్రీ తేడా లేకుండా అందరినీ సమానంగా చదివించడంలో వారి కృషి, కష్టం అంతకు రెట్టింపు ఉంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చిన కుమార్తెల్లో ఒకరై న జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జయసుధ విజ యగాథ మహిళా దినోత్సవం సందర్భంగా కథనం. కుటుంబ నేపథ్యం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజారాం, సరోజలకు ఇద్దరు కుమారులు డాక్టర్ శ్రీనివాస్ ప్ర సాద్ (బాన్సువాడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్) శ్రీధర్(ఉపాధ్యాయుడు), నలుగురు కుమార్తెలు విజయలక్ష్మి(గృహిణి), డాక్టర్ లత (ప్రొఫెసర్), డాక్టర్ జయసుధ(డీపీఓ), ప్రవీణ (ఉపాధ్యా యురాలు). రాజారాం పోస్ట్‌మాస్టర్ ఉద్యోగం చేసు కుంటూ కుమారులు, కుమార్తెలు అన్న తేడా లేకుండా ఉన్నత చదువులు చదివించా రు. చదువులో వా రి సహకారం, ప్రోత్సాహంతోనే ప్రస్తుతం అందరూ ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. మీ కాళ్ల మీద మీరే ని లబడాలని తరచూ గుర్తుచేస్తూనే పిల్లల లక్ష్యాల లో ఆ తండ్రి పాలుపంచుకున్నారు. 2010లో బిచ్కుంద కు చెందిన నాగనాథ్‌తో జయసుధ వివాహమైంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతూ.. రాజారాం, సరోజ దంపతుల ఐదో సంతానమైన డాక్టర్ జయసుధ చిన్ననాటి నుంచి చదువులో రాణించేవారు. ఐదోతరగతి వరకు స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో, నవోదయ విద్యాలయంలో 6 నుంచి ఇంటరీ్మడియట్ వరకు చదివారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువును కొనసాగించారు. చిన్నప్పటి నుంచే వసతిగృహాల్లో ఉంటూ ఉన్నత చదువులు పూర్తిచేశారు. మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైస్సెస్ పూర్తి చేసిన జయసుధ పదేళ్లపాటు హైదరాబాద్‌లోని వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. మొదటి ప్రయత్నంతోనే గ్రూప్–1లో విజయం వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం చే స్తున్నా.. ఎక్కడో ఏదో ఒక వెలితి. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో గ్రూ ప్స్‌కు సిద్ధమయ్యారు. అదేక్రమంలో వెటర్నరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా ఉద్యోగం సాధించారు. 2015లో సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. మొదటి ప్రయత్నంలోనే 2017 లో గ్రూప్–1 సాధించారు. ఏడాది శిక్షణ తర్వా త జిల్లా పంచాయతీ అధికారిగా మొదటి పోస్టింగ్ నిజామాబాద్‌లోనే నియమితులయ్యారు. ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వచ్ఛభారత్ మిషన్‌లో జాతీయస్థాయిలో మొదటిస్థానంలో జిల్లా కు అవార్డు దక్కింది. అలాగే సంసద్ ఆదర్శ గ్రా మ్ యోజనలో మొదటి 20 గ్రామాల్లో జిల్లా నుంచే 5 ఉత్తమ పంచాయతీలుగా ఎంపికై అవార్డులు పొందడం సంతోషానిచ్చింది. ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగు లు, సిబ్బంది సహకారంతో డీపీవోగా నాలుగేళ్లు ఎంతో సంతృప్తినిచ్చిందని జయసుధ పేర్కొన్నారు. -
విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ
దివంగత దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 19న ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ కళాంజలి పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి, సహజ నటి జయసుధతో పాటు పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయసుధ విశ్వానాథ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఎంతోమంది హీరోయిన్లు విశ్వనాథ్ దర్శకత్వంలో మంచి మంచి సినిమాలు చేశారు. కానీ జయసుధ మాత్రం ఆయన సినిమాల్లో ఎక్కువగా నటించలేదు అని అందరికి అనిపించి ఉంటుంది. ఎన్నో క్లాసికల్ సినిమాలు తీసిన ఆయనకు ఎందుకో ఆయన కమర్షియల్ సినిమా చేయాలనుకున్నారు. దానికి నన్ను అడిగారు. అలా ఆయన దర్శకత్వంలో నేను కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం వంటి కమర్షియల్ చిత్రాలు చేశాను. అయితే ఆయన తీసిన సాగర సంగమం సినిమా నేను చేయాలి. ఏడిద నాగేశ్వరావు గారు ముందు నన్ను అడిగారు. అలాగే అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కమల్ హాసన్ గారు బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అదే సమయంలో నేను ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. దీంతో డేట్స్ కుదరకపోవడంతో నేను ఈ సినిమా నుంచి తప్పుకున్నా’ అని చెప్పారు. అయితే సాగర సంగమం సినిమా కోసం నేను తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను. దాంతో విశ్వనాథ్ గారు నాపై చిన్నగా అలిగారు. చాలా రోజులు నాతో మాట్లాడలేదు. నేను ఎక్కడ కనిపించిన ఆయన హూమ్ అన్నట్టుగా చూసేవారు. అది అలాగే చాలా రోజులు కొనసాగింది. ఆ తర్వాత నేను ఆయనతో ఇక సినిమాలు చేయలేకపోయా. కానీ నిజం చెప్పాలంటే సాగర సంగమంలో ఆ పాత్రకు జయప్రదే కరెక్ట్ అనిపించింది. ఆమె చాలా గొప్పగా చేసింది. అనిపించింది’ అని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత చాల కాలం తర్వాత ఓసారి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ‘నాతో నటిస్తావా?’ అని అడిగారు. అదే ఆయనతో తన చివరి మాటలు అని జయసుధ ఎమోషనల్ అయ్యారు. చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ -
అందుకే అజిత్ సినిమా నుంచి తప్పుకున్నా: జయసుధ
‘సహజనటి’ జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 80లలో హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వెండితెరపై తల్లి పాత్ర అంటే వెంటనే గర్తొచ్చే పేరు జయసుధదే. అందుకే ఆమె దాదాపు స్టార్ హీరోలందరికి తల్లిగా నటించారు. చదవండి: కర్ణాటకలో సింగర్ కైలాష్ ఖేర్‌పై దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం ఒక్క తెలుగులోనే కాదు తమిళంలోనూ ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు(వారసుడు) మూవీలో ఆమె హీరోకి తల్లిగా నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. వారిసు సక్సెస్ నేపథ్యంలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు స్టార్ హీరోలందరిక మదర్‌గా చేశారని, కానీ నటుడు అజిత్‌తో మాత్రం నటించలేదు ఎందుకు? అని ప్రశ్న ఎదురైంది. చదవండి: పూజా హెగ్డే ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు అజిత్ వలిమై సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక్క రోజు షూటింగ్‌కు కూడా హాజరయ్యాను. అయితే కరోనా కారణంగా ఆ మూవీ షూటింగ్ వాయిదా పడింది. తర్వాత షూటింగ్ మొదలైనా.. కొవిడ్ భయం కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. నా స్థానంలో ఆ పాత్రకు సుమిత్ర నటించారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఏడాది సంక్రాతికి అజిత్ తునివు, విజయ్ వారిసు చిత్రాలు విడుదల కాగా వారి అభిమానుల మధ్య కోల్డ్ వార్ నడిచిన విషయం తెలిసిందే. -
మూడో పెళ్లిపై జయసుధ క్లారిటీ..
-
జయసుధ మూడో పెళ్లిపై వార్తలు.. స్పందించిన నటి
సీనియర్ నటి జయసుధ పేరు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులో సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె ‘సహజనటి’గా గుర్తింపు సాధించింది. అప్పట్లో సీనియర్ ఎన్టీర్, ఏఎన్నాఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి స్టార్లతో ఎక్కువగా సినిమాల్లో నటించారు. ఆమె50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో చిత్రం వారసుడులో నటించారు. అయితే తాజాగా జయసుధ సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమెతో ఓ వ్యక్తి ప్రతి కార్యక్రమంలో ఆమె పక్కనే కనిపించడమే దీనికి కారణం. వారసుడు ప్రిరిలీజ్ ఈవెంట్లో కూడా ఓ వ్యక్తి జయసుధ పక్కనే ఉండడంతో అంతా అలాగే అనుకున్నారు. దీంతో ఆమె మూడో పెళ్లి చేసుకుందంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేసింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని.. తన బయోపిక్ తీసేందుకు ఇండియాకు వచ్చారని జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకే ప్రతి ఈవెంట్‌కు హాజరవుతున్నారని వెల్లడించింది. అతని పేరు ఫెలిపే రూయేల్స్ అని.. నా బయోపిక్ తీస్తున్నారని తెలిపింది. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. జయసుధ మాట్లాడూతూ..'నా గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఇక్కడ ఫాలోయింగ్ ఎలా ఉంది? నా సినిమాలు, షూటింగ్స్ వివరాలు తెలుసుకునేందుకు నన్ను ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల అమెరికా వెళ్లి అతడిని కలిశా.' అని చెప్పుకొచ్చారు జయసుధ. కాగా.. జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
షాకింగ్.. ఏంటీ జయసుధ మళ్లీ పెళ్లి చేసుకుందా? ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?
జయసుధ.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 80లలో హీరోయిన్గా వెలుగు వెలిగిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తున్నారు. ఆమె సినీప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయింది. తన ఈ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో రకాల ప్రాతలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్, ఫ్యామీలీ ఆడియన్స్‌లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. చదవండి: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ పార్ట్నర్ ఏదో తెలుసా? స్ట్రీమింగ్ ఎప్పుడంటే! ఇటీవల వారసుడు(తమిళంలో వారీసు) మూవీతో ప్రేక్షకులను పలకరించిన జయసుధ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ నిలిచింది. ఇమె మళ్లీ పెళ్లి చేసుకున్నారా? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో జయసుధ పెళ్లి అంశం చర్చనీయాంశమైంది. వివరాలు.. ఈ మధ్య జయసుధ ఓ వ్యక్తితో బాగా కనిస్తున్నారట. ఏ కార్యక్రమం అయిన మూవీ ఈవెంట్ అయిన అతనితో జంటగా ఆమె హాజరవుతున్నారట. అంతేకాదు ఇటీవల జరిగిన కమెడియన్ అలీ కూతురి పెళ్లికి కూడా జయసుధ అతడితో జంటగా హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తితో ఆమెను చూసి ఆ అతడు ఎవరా? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో జయసుధతో ఉన్న ఆ వ్యక్తి ఓ బడా వ్యాపారవేత్త అని తెలిస్తోంది. అతడిని ఆమె సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ! ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో జయసుధ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి ఆమె అమెరికాలో కొంతకాలం వరకు ఉన్నారు. అదే సమయంలో జయసుధ ఆయనను పెళ్లి చేసుకుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే జయసుధ ఈ వార్తలపై స్పందించేవరకు వేచి చూడాలి. చదవండి: షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’ కాగా జయసుధకు గతంలో రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదటిసారి కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. విబేధాల కారణంగా ఈ జంట విడిపోయారు. ఆ తరువాత ఆమె బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్ ను వివాహమాడింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఆమె రెండో భర్త 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. నితిన్ కపూర్‌తో జయసుధ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. -
కంగనాకు పద్మశ్రీ.. సీనియర్లం మాకు లేదా?
నందమూరి బాలకృష్ణ సారథ్యంలో అన్‌స్టాపబుల్ రెండో సీజన్ కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇటీవల ఈ షోలో ముగ్గురు హీరోయిన్స్ సందడి చేశారు. అలనాటి హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా ఆరో ఎపిసోడ్‌కు విచ్చేశారు. వీరిని ఇరుకున పెట్టే ప్రశ్నలడుగుతూ వాటికి సమాధానాలు రాబట్టాడు. ఈ క్రమంలో పద్మ అవార్డుల ప్రస్తావన రాగా.. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు జయసుధ, జయప్రద. 'కంగనా రనౌత్ అద్భుత నటి. పట్టుమని పది సినిమాలు చేసిందో లేదో అప్పుడే ఆమెకు పద్మ శ్రీ ఇచ్చారు. కానీ మా విషయంలో అలా జరగలేదు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ మాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అంతెందుకు, గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళా డైరెక్టర్ విజయ నిర్మలను కూడా ప్రభుత్వం గుర్తించలేదు. ఇలాంటి సందర్భాల్లోనే కేంద్రం దక్షిణాది చిత్రపరిశ్రమ పట్ల వివక్ష చూపిస్తుందనిపిస్తుంది' అని జయసుధ చెప్పుకొచ్చింది. జయప్రద మాట్లాడుతూ.. అవార్డులు అడిగి తీసుకోవడం మాకిష్టం లేదు. మా ప్రతిభను, సీనియారిటీని గుర్తించి గౌరవించాలనుకున్నాం అని పేర్కొంది. చదవండి: థియేటర్లు అమ్మేశారు, ఆస్తులు పోయాయి.. కమెడియన్ కూతురు బతిమాలినా రాలేదు, నటిపై ఫైర్ -
హీరోయిన్ అవ్వాలంటే అవి తప్పవు.. అన్‌స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ రెండో సీజన్ టాలీవుడ్ సెలబ్రిటీలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సీజన్లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. తాజాగా ఈ సీజన్లో మరో ముగ్గురు హీరోయిన్లను తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు మరో కథానాయిక రాశీ ఖన్నా పాల్గొననుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది. వీరితో కలిసి బాలయ్య సందడి చేయగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 23న ఫుల్ ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఈ ఎపిసోడ్లో బాలయ్య ముగ్గురు భామలతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి వేశారు. రాశి ఖన్నాని పొగుడుతూ అలరించాడు. రాశి ఖన్నా తాను నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాలోని పాటతో అలరించింది. ఈ ప్రోమోలో జయప్రద, జయసుధపై ప్రశ్నల వర్షం కురిపించారు బాలయ్య. ప్రస్తుతం నేను, శృతి ఆంధ్రప్రదేశ్‌లో హాట్ పెయిర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాదికి సంక్రాంతికి వీరసింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. -
250 థియేటర్లో రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’(1982) చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. విష్ణుప్రియ సినీకంబైన్స్ బేనర్‌పై సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రతిబింబాలు’ సినిమాని అనేక కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేకపోయాను. కానీ, ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని జోడించి, సరికొత్త హంగులతో రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గత సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని మా వాణి వెంకటరమణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్. ఈ చిత్రానికి సమర్పణ: రాజేశ్వరన్ రాచర్ల, నిర్వహణ: జాగర్లమూడి సురేశ్ బాబు. -
రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు!
‘ఏదీ... కొంచెం ఫేస్ లెఫ్ట్‌కి టర్నింగ్ ఇచ్చుకో’ అంటూ ‘ఘరానా మొగుడు’లో చిరంజీవి, ‘ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుద్దో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’లో మహేశ్‌బాబు మాస్‌గా రెచ్చిపోతే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ చిత్రాలను మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద చూసే చాన్స్ రావడం ఫ్యాన్స్‌కి పండగే. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను ‘నేడే చూడండి.. మళ్లీ విడుదల’ అంటూ రీ రిలీజ్ చేసే కొత్త ట్రెండ్ వల్ల ఆ చాన్స్ దక్కుతోంది. ఇక ఆ విశేషాల్లోకి వెళదాం... మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘పోకిరి’ (2006) పలు రికార్డులు సాధించింది. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇటీవల మహేశ్‌బాబు బర్త్‌డే (ఆగస్ట్ 9) సందర్భంగా రిలీజ్ చేస్తే మళ్లీ రికార్డ్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో సింగిల్ షో రిలీజ్ చేస్తే.. టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. థియేటర్లు కూడా పెంచాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఈ చిత్రం రికార్డ్ సాధించింది. 4కె (ఆల్రెడీ ఉన్న పిక్సెల్స్ దాదాపు నాలుగు రెట్లు పెరుగుతాయి. వీడియో మరింత స్పష్టంగా కనబడుతుంది.. 4కె వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి) హంగులతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదనే పరిస్థితుల్లో ఈ సినిమాకి వచ్చిన ఆదరణ ఇండస్ట్రీకి బూస్ట్ అయింది. దాంతో పాటు ఇటీవల విడుదలైన స్ట్రయిట్ చిత్రాలు ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం’కి లభించిన ఆదరణ ఇండస్ట్రీకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో పలు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘పోకిరి’లా కొత్త హంగులతో మళ్లీ రిలీజ్ కాబోయే చిత్రాలు కొన్ని రెడీ అవుతున్నాయని తెలిసింది. వాటిలో ముందు వరుసలో ‘ఘరానా మొగుడు’ ఉంది. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఘరానా మొగుడు’ (1992) సూపర్ డూపర్ హిట్. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని కొత్త హంగులతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ‘బంగారు కోడి పెట్ట..’ అంటూ చిరు వేసిన మాస్ స్టెప్పులు మళ్లీ చూసే చాన్స్ వస్తే... అభిమానులకు ఆనందమే కదా. ఈ నెలలోనే నాగార్జున పుట్టినరోజు (ఆగస్ట్ 29) కూడా. నాగార్జున నటించిన చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అయిన ‘శివ’ (1989)ను కూడా 4కె వెర్షన్‌కి మార్చి మళ్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ సైకిల్ చైన్ సందడిని చూడొచ్చన్న మాట. ఇవే కాదు.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ కూడా రీ రిలీజ్ కానుందట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’ (2008). సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డేకి ఈ చిత్రం రిలీజ్ కానుందని టాక్. ఇంకా ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ విడుదలయ్యే అవకాశం ఉంది. రంగుల బజార్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘మాయాబజార్’ (1957) ఎవర్ గ్రీన్. ఒకరితో మరొకరు పోటీపడ్డారా అన్నట్లు ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు తదితర తారల అద్భుత నటనతో కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్‌ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. భావితరాలకు ఈ చిత్రాన్ని చూపించాలనే ఆకాంక్షతో రంగులద్ది ఈ దృశ్యకావ్యాన్ని గోల్డ్‌స్టోన్ సంస్థ 2010లో విడుదల చేసింది. సో.. రీ రిలీజ్ అనేది పన్నెండేళ్ల క్రితమే ఉంది. రిలీజ్‌కి రెడీ అవుతున్న ఏయన్నార్ ‘ప్రతిబింబాలు’ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’ చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 1982లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏయన్నార్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీ వినాయక విజయం, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు’ వంటి సినిమాలను నిర్మించాను. అయితే ఏయన్నార్‌గారితో నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమాని కొన్ని దుష్పరిణామాల వల్ల విడుదల చేయలేకపోయాను. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మిళితం చేసి, సరికొత్త హంగులతో విడుదల చేస్తున్నాను. నా సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
బీజేపీలోకి నటి జయసుధ
సాక్షి, హైదరాబాద్: సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నా రు. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న జయసుధను బీజేపీ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ చేరికల కమి టీ చైర్మన్ ఈటల రాజేందర్ కొంతకాలం నుంచి ప్రయత్నిస్తు న్నారు. మంగళవారం ఆయన జయసుధతో భేటీ అయి బీజేపీలో చేరేలా ఒప్పించినట్టు సమాచారం. 2009లో ఎమ్మెల్యేగా గెలిచినా.. జయసుధ 2009లో సికింద్రాబాద్ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఆమెకు కొంత పట్టు ఉండటం, క్రిస్టియన్ మైనా రిటీ వర్గాన్ని ప్రభావితం చేయగలరన్న అంచనాలతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ఆమెతో భేటీ అయి చర్చించారు. బీజేపీలో చేరే విషయాన్ని జయసుధ ధ్రువీకరించారు కూడా. సినీ, మేధావి వర్గాలపై నజర్ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసిన బీజేపీ సినీ ప్రముఖులు, మేధావి వర్గాన్ని టార్గెట్ చేసింది. గతంలో బీజేపీతో సంబంధాలున్న సినీనటులు సుమన్, భానుచందర్ వంటి వారిని పార్టీ లో క్రియాశీలం చేయాలని భావిస్తోంది. మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లనూ బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ డీజీపీ టి.కృష్ణప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చు కోనున్నట్టు సమాచారం. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో ఆయనతోపాటు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.వి.చంద్ర వదన్ 2019లోనే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయనను కూడా చురుకుగా పని చేసేలా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. ఇక రాష్ట్రంలో ప్రజాసంఘాల మద్దతును కూడా కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చదవండి: కేంద్రం నిధులు బొక్కేస్తున్న కేసీఆర్ -
టాలీవుడ్‌పై ‘సహజనటి’ జయసుధ సంచలన వ్యాఖ్యలు
పద్నాగేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసి ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన 50 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 50 ఏళ్లకు సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇక ఆమె సినిమాలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. చదవండి: ‘బింబిసార’ ఈవెంట్లో విషాదం, ఎన్టీఆర్ ఫ్యాన్ అనుమానాస్పద మృతి ఈ సందర్భంగా టాలీవుడ్లో హీరోహీరోయిన్ల మధ్య వివక్ష ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, అదే బాలీవుడ్ నుంచి ఏ హీరోహీరోయిన్ వచ్చిన వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నారు. స్టార్ హీరోయిన్ అయిన తనకు కూడా ఇక్కడ అవమానాలు తప్పలేదన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నటిగా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని, ఇన్నేళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్లో అయితే సన్మానాలు కనీసం ఫ్లవర్ బొకే అయినా పంపించేవారన్నారు. కానీ, ఇక్కడ అది కూడా ఉండదని విమర్శించారు. ‘బాగా సక్సెస్ అయిన పెద్ద హీరోలను ఒకలా, చిన్న హీరోలను ఒకలా చూస్తారు. చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నో ఆఫర్స్.. మరి ఇకనైనా.. ఇక్కడి హీరోయిన్లను మాత్రం మరి చిన్నచూపు చూస్తారు. అదే ముంబై నుంచి ఏ హీరోహీరోయిన్ వచ్చినా వారి కుక్కపిల్లకు కూడా స్పెషల్ రూం ఇస్తారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే హీరోలు కూడా ఇలానే ఉంటారా? అని ప్రశ్నించగా.. వాళ్లది ఏం ఉండదని, పక్కన ఉండేవాల్లే ఎక్కువ చేస్తుంటారని ఆమె అన్నారు. అనంతరం ఒకవేళ పెద్ద హీరో డాన్స్ సరిగ చేయలేకపోతే.. హీరోయిన్ల దగ్గరికి వచ్చి ఏంటీ మీరు మూమెంట్ సరిగా చేయడలేదంటారని పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్ చివరగా పద్మశ్రీకి బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే అర్హులా.. తెలుగు హీరోయిన్లకు ఆ అర్హత ఉండదా? అని ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం జయసుధ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. -
వెండితెర తల్లులు.. ఆనాటి నుంచి ఈనాటి వరకు
శ్రీనివాసుడు తల్లి వకుళాదేవిగా నటించారు శాంతకుమారి. కృష్ణ, శోభన్‌బాబుల తరం రాగానే తల్లిగా మారారు అంజలీ దేవి. పండరీబాయి లేకుంటే ఎన్నో తల్లి పాత్రలు తెల్లముఖం వేసేవి. అమ్మంటే అన్నపూర్ణే అన్నట్టు ఒక కాలం గడిచింది. అమ్మ లేని కథ లేదు. అమ్మ లేని సినిమా ఉండదు. తెల్లజుట్టు అమ్మల కాలం నుంచి నల్లజుట్టు అమ్మలు వచ్చినా పాత్రల ప్రాభవం పోలేదు. నటీమణుల డిమాండ్ తగ్గలేదు. ఆ కాలం తల్లుల నుంచి ఈ కాలం తల్లుల వరకూ ‘మదర్స్ డే’ సందర్భంగా రీలు తిప్పేద్దామా? పౌరాణికాలలో ప్రేక్షకులు తప్పక మెచ్చే తల్లులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కుంతీ దేవి. మరొకరు సీతమ్మ తల్లి. కుంతీదేవిగా అందరు నటీమణులు సరిపోరు. ఆ పాత్రలో రాజసం, అదే సమయంలో అమాయక తెగింపు ఉండాలి. ఎస్.వరలక్ష్మి ఆ పాత్రను ‘దానవీరశూరకర్ణ’లో గొప్పగా పోషించారు. ఇక సీతమ్మ తల్లి అంటే తెలుగువారికి అంజలీదేవే. ఆమె ‘లవకుశ’లో లవకుశుల తల్లిగా బిడ్డల కోసం పరితపించే మాతృమూర్తిగా చెరగని ముద్ర వేశారు. ‘భక్త ప్రహ్లాద’ను కన్నతల్లిగా కూడా అంజలీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఇక అభిమన్యుడిని కన్న పౌరుషమూర్తిగా ‘మాయాబజార్’లో ఋష్యేంద్రమణి కనిపిస్తారు. అదే సినిమాలో శశిరేఖను కన్న లోకరీతి గల తల్లిగా ఛాయాదేవి కనిపిస్తారు. ఛాయాదేవి అంత చక్కగా ఒక్క తల్లి పాత్రలో కనిపించిన మొదటి, చివరి సినిమా అదే. పరమ గయ్యాళిగా భావించే సూర్యకాంతం ‘మాయాబజార్’లోనే అరమరికలు లేని తల్లిగా ఘటోత్కచునితో ‘ఇది నీకు తగదంటిని కదరా’ అని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు. ∙∙ సాంఘికాలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తల్లి పాత్రలు సంఘర్షణతో, కథకు మూలస్తంభాలగానో నిలవడం పెరిగింది. ఈ కాలంలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక... వీళ్లంతా తల్లి పాత్రల్లో రాణించారు. ఎన్.టి.ఆర్ ‘ఆత్మబంధువు’లో కడుపున పుట్టకపోయినా ఎన్.టి.ఆర్ మీద కన్నాంబ పెంచుకున్న మమత చాలా కదిలించేలా ఉంటుంది. ‘మిస్సమ్మ’లో తప్పిపోయిన కన్నకూతురిని తలుచుకుని బాధపడే ఋష్యేంద్రమణిని చూసి మహిళా ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారు. హిందీలో వచ్చిన ‘మదర్ ఇండియా’ భారతీయ సినిమాలలో తల్లి పాత్ర రూపు రేఖలను మార్చేసింది. అంత ఉదాత్తమైన తల్లి పాత్రను తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ సినిమా రీమేక్‌గా తెలుగులో ‘బంగారు తల్లి’ నిర్మిస్తే హిందీలో నర్గిస్ చేసిన పాత్రను జమున చేశారు. సావిత్రి హీరోయిన్గా ఎంత రాణించారో తల్లి పాత్రల్లో కూడా అంతే రాణించారు. ‘అమ్మ మాట’, ‘కన్నతల్లి’.. రెండు సినిమాల్లోనూ ఆమెది మంచి తల్లి పాత్ర. ఆ తర్వాత ‘గోరింటాకు’ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా కనిపిస్తారామె. కాని ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో భానుమతిది వదిన పాత్రే అయినా చలంను ఆమెను కొడుకులా చూసుకోవడం, వెనకేసుకు రావడం చాలా బాగుంటుంది. ఆ పాత్రను అలా ఆమె మాత్రమే చేయగలదు. ∙∙ అయితే డెబ్బైల తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ చిన్నప్పుడు కుటుంబానికి అన్యాయం చేసిన విలన్‌ను గుర్తు పట్టడానికి మాత్రమే ఆ తల్లి ఉండేది. హీరో పెద్దయ్యాక ‘చెప్పమ్మా... ఎవరు మనకింత అన్యాయం చేసింది’ అనంటే ఆ తల్లి విలన్ నాగభూషణం గురించో, రాజనాల గురించో చెబుతుంది. ఈ కాలంలో పండరి బాయి చాలా సినిమాలలో తల్లిగా కనిపిస్తారు. ఆ తర్వాత పుష్పలత, జయంతి, శారద, కాంచన ఆ పాత్రల్లో కనిపిస్తారు. ∙∙ కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వచ్చే సమయానికి ముందుతరం హీరోయిన్లు తల్లిపాత్రలకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో జయసుధ ఎక్కువగా తల్లి పాత్రలలో ప్రేక్షకులకు నచ్చారు. ఆ తర్వాత జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ... వీరందరూ చాలా సినిమాల్లో తల్లులుగా ఉన్నారు. జయచిత్ర నటించిన ‘అబ్బాయిగారు’ ఆమెను భిన్నమైన తల్లిగా చూపిస్తే మంజుల ‘ప్రేమ’ సినిమాలో కూతురి ప్రేమను అంగీకరించని తల్లిగా గట్టి పాత్రలో కనిపిస్తుంది. వాణిశ్రీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ హిట్ అయ్యింది. శారద ‘అమ్మ రాజీనామా’తో పెద్ద హిట్ కొట్టారు. వీరు కాకుండా ‘ముందడుగు’ సినిమాతో గట్టి తల్లి పాత్రతో ముందుకు వచ్చిన అన్నపూర్ణ తెలుగు సినిమాల తల్లిగా ఒక కాలాన్ని ఏలారనే చెప్పాలి. ఆ తర్వాత సుధ ఎక్కువ మంది హీరోలకు తల్లిగా కనిపించారు ∙∙ ఇప్పుడు గ్లామర్ ఉన్న తల్లులు వెండితెర పై కనిపిస్తున్నారు. నదియ, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, ప్రగతి వీరంతా తల్లులుగా కొత్త హీరోలతో కలిసి నటిస్తున్నారు. నటి శరణ్య గత పదేళ్లలో తెలుగు – తమిళ భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తల్లి పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఇక రమ్యకృష్ణ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా సంచలనమే సృష్టించారు.సృష్టి మొదలైనప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ మొదలైంది. సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పక పండుతుంది. నటీమణుల పేర్లు మారుతుండొచ్చు. అమ్మ పాత్ర మారదు. అది చిరకాలం ఉంటుంది. చిరంజీవ అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. -
తగ్గేదే లే అంటూనే తగ్గారు.. ఎందులో తగ్గారో తెలుసా ?
Celebrities Weight Loss Transformation Story: తగ్గేదే లే అంటున్నారు.. కానీ తగ్గారు. మరి.. ఏ విషయంలో తగ్గేదే లే అంటే.. నటనపరంగా తగ్గేదే లే అంటూ విజృంభిస్తున్నారు. ఏ విషయంలో తగ్గారు అంటే.. బరువు తగ్గారు. సినీ సెలబ్రిటీలకు అందంతోపాటు ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే వయసు పెరిగినా ఫిట్నెస్ మాత్రం కచ్చితంగా పాటిస్తారు కొందరు సినీ తారలు. అందంగా ఆరోగ్యంగా ఉండటానికి ‘ఫిట్ అండ్ ఫైన్’ అంటున్నారు. సీనియర్ తారలు జయసుధ, ఖుష్బూ, ప్రభు బాగా బరువు తగ్గి కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆ లుక్‌ని ఓ లుక్కేద్దాం. ‘‘నవ్వండి.. ఉచితంగా లభించే మంచి థెరపీ అది’’ అంటున్నారు జయసుధ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఆమె బరువు తగ్గాక సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి, ఈ విధంగా పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ఈ సహజ నటి అక్కడే బరువు తగ్గే పనిలో పడ్డట్లున్నారు. మామూలుగా సినిమా తారలు బరువు తగ్గితే ఏదైనా పాత్ర కోసం అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్‌లో భాగంగానే ఆమె తగ్గారు. పైగా బరువు తగ్గే క్రమంలో ఆమె శాకాహారానికి కూడా మారారని తెలుస్తోంది. ఎందుకంటే ‘వీగన్ ఫుడ్ ట్రై చేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇక ఫిట్‌నెస్‌లో భాగంగానే తగ్గిన మరో తార ఖుష్బూ విషయానికొస్తే.. ఆ మధ్య 15 కిలోలు బరువు తగ్గానంటూ ఓ ఫొటో షేర్ చేశారామె. తాజాగా వెయిట్ మిషన్‌పై నిలబడి చూసుకుని, మరో ఐదు కిలోలు తగ్గానోచ్ అన్నారు. అంటే.. మొత్తం 20 కిలోలు తగ్గించేశారు. ఇలా తగ్గడంవల్ల ఆమె ఆరోగ్యం బాగాలేదని కొందరు అనుకున్నారట. ‘‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడ అనారోగ్యానికి గురయ్యానో అని కొందరు ఆందోళన పడ్డారు. నా పట్ల వారికున్న అభిమానానికి ధన్యవాదాలు. అసలు నేనింత ఫిట్‌గా ఎప్పుడూ లేను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే తగ్గాను. ఈ విషయంలో నేను పది మందికి ఆదర్శంగా నిలిస్తే విజయం సాధించినట్లే’’ అన్నారు ఖుష్బూ. ఈ బ్యూటీ కథానాయికగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రభు సరసన కొన్ని సినిమాల్లో నటించారు. 1990లలో ఈ ఇద్దరిదీ ‘హిట్ పెయిర్’. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రభు కూడా తగ్గారు. ఖుష్బూలానే ఆయన కూడా 20 కిలోలు వెయిట్ లాస్ అయ్యారు. అయితే ఫిట్‌నెస్‌లో భాగంగా తగ్గలేదు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం తగ్గారని కోలీవుడ్ టాక్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభు కీలక పాత్ర చేస్తున్నారట. ఈ పాత్రలో స్లిమ్ లుక్‌లో కనిపించాల్సి రావడంతో వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ కోసమో, ఫిట్నెస్ గురించో సీనియర్లు ఇలా తగ్గడం చూసి ‘భేష్.. నటన విషయంలోనే కాదు... తగ్గే విషయంలో కూడా మీరు ఆదర్శమే’ అని కొందరు యువతారలు అంటున్నారు. అభిమానులైతే ఖుషీ అయిపోతున్నారు. -
షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి?
Actress Jayasudha Shocking Look Photo Goes Viral: పద్నాగేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించి, ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 45 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్’ తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారు. చదవండి: నిక్‌తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ కొంతకాలంగా ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని, అనారోగ్యం కారణంగా చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే దీనిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. నిండు మొహంతో కాస్తా లావుగా ఉండే జయసుధ, ఈ ఫొటోలో పీక్కుపోయి కనిపించారు. అంతేకాదు చాలా డిఫరెంట్‌గా కూడా ఉన్నారు. తన ట్విటర్లో ఫొటో షేర్ చేస్తూ.. ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ జయసుధ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను చూసి షాకవుతున్నారు. చదవండి: హ్యాపీ మూడ్‌లో చై, ఆకట్టుకుంటున్న లుక్ ఇదేంటి ఇలా మారిపోయారు, ముఖంలో మునుపటి కళ లేదు. సహజనటికి నిజంగా ఆనారోగ్య సమస్యలు తలెత్తినంటున్నాయంటూ అంటూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అయితే ఆమెకు ఏమైంది, విదేశాలకు ఎందుకు వెళ్లారనేది స్వయంగా ఆమె స్పందించే వరకు వేచి చూడాలి. జయసుధగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకున్న సహజనటి అసలు పేరు సుజాత. ఆమె భర్త నితిన్ కపూర్ 2017లో మరణించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. Smile 😃 🙂 It's free therapy 😌 pic.twitter.com/1okOqATZKX — Dr Jayasudha Kapoor (@JSKapoor1234) November 22, 2021 -
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్‌లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్‌గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్‌గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్‌తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్‌తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్‌లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్‌కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్‌తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్‌బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్‌గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్‌లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
ఆగిపోయిన అక్కినేని సినిమా.. 39 ఏళ్ల తర్వాత విడుదల
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, జయసుధ, తులసి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిబింబాలు’. కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ‘వియ్యాలవారి కయ్యాలు, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, వినాయక విజయం’ వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమా 39 ఏళ్ల అనంతరం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ – ‘‘1982 సెప్టెంబర్ 4న ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పట్లో కొత్తగా ఉందనిపించి, ఈ చిత్రకథని ఎన్నుకున్నాం. అయితే ఇప్పటికీ అలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. ఏయన్నార్ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రతి ఒక్కర్నీ ఈ చిత్రం అలరిస్తుంది. మేలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు, జయమాలిని, అనురాధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాథ్. -
షాకింగ్ లుక్‌లో జయసుధ.. ఆందోళనలో ఫ్యాన్స్!
పద్నాగేళ్ల వయసులో స్క్రీన్‌పై కనిపించి, ‘సహజనటి’గా గుర్తింపు పొందారు జయసుధ. 45 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ ప్రస్థానంలో భిన్న రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే గత కొన్నిరోజులుగా ఆమె వెండితెరకు దూరమయ్యారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు ‘మహర్షి’, బాలకృష్ణ ‘రూలర్’ తర్వాత జయసుధ పెద్ద సినిమాల్లో కనిపించలేదు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోతో నెటిజన్ల ముందుకు వచ్చారామె. ప్రముఖ ఛానెల్లో ప్రసారం కానున్న సీరియల్ ‘జానకి కలగనలేదు’ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ సందేశం విడుదల చేశారు. తాను, శోభన్‌బాబు కలిసి నటించిన ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’ పాట అప్పట్లో ప్రభంజనం సృష్టించిన విషయాన్ని జయసుధ గుర్తుచేసుకున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ పాటను అన్నిచోట్లా మారుమోగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆ హిట్ సాంగ్‌ను ఊటీలో షూట్ చేశామని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆ పాట పేరుతో సీరియల్ రావడం సంతోషంగా ఉందని, ధారావాహిక పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. చాలా రోజుల తర్వాత జయసుధను చూడటం సంతోషంగానే ఉన్నప్పటికీ, ఆమె లుక్ చూసి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజా వీడియోలో ఆరెంజ్ కలర్ నెక్ టీషర్ట్ ధరించిన జయసుధ నెరిసిన జుట్టుతో కనిపించారు. ముఖంలో మునుపటి కళ లేదు. పూర్తిగా పాలిపోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో సహజనటికి అనారోగ్య సమస్యలేవైనా ఉన్నాయా లేదా షూటింగ్ లేనందు వల్లే ఇంట్లో ఇలా నార్మల్ లుక్‌తో ఉన్నారా అన్న విషయం అర్థం కాక ఫ్యాన్స్ గందరగోళంలో పడిపోయారు. కాగా జయసుధగా ప్రేక్షకుల మదిలో గూడుకట్టుకున్న సహజనటి అసలు పేరు సుజాత. ఆమె భర్త నితిన్ కపూర్ 2017లో మరణించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు నిహార్ వివాహం గతేడాది వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చదవండి: ‘బేబమ్మ’.. చిన్నప్పటి యాడ్స్ చూశారా? స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు -
ప్రేమాభిషేకం: అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం
ప్రేమకథలు... అందులోనూ భగ్న ప్రేమకథలు... తెరపై ఎప్పుడూ హిట్ ఫార్ములా! ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం ‘ప్రేమాభిషేకం’. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1981 ఫిబ్రవరి 18న రిలీజైన సినిమా అది. కానీ ఇవాళ్టికీ ఆ పాటలు, మాటలు – ఇలా అన్నీ సినీ ప్రియులకు గుర్తే! ‘ప్రేమకు అర్థం– త్యాగ’మనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన ‘ప్రేమాభిషేకం’... అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం! అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్(1976 జనవరి 14) స్థాపించి, అప్పటికి నాలుగేళ్ళవుతోంది. స్టూడియో పేరుపై ఆయన ‘రామకృష్ణు్ణలు’ (జగపతి రాజేంద్రప్రసాద్‌తో కలసి –1978), ‘కళ్యాణి’ (’79), ‘పిల్ల జమీందార్’ (’80) తీశారు. అదే కాలంలో ఎ.ఎ. కంబైన్స్ బ్యానర్‌పై ‘మంచి మనసు’ (’78), ‘బుచ్చిబాబు’ (’80) నిర్మించారు. ఇవన్నీ స్టూడియో మొదలెట్టాక, అక్కినేని సమర్పించిన చిత్రాలే. కానీ, ఏవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్టనష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి. కాశ్మీర్లో పుట్టిన కథ! సరిగ్గా అప్పుడే... అక్కినేని వీరాభిమాని, అన్నపూర్ణా స్టూడియోస్‌కు ‘కళ్యాణి’, ‘బుచ్చిబాబు’ తీసిన పాపులర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన అభిమాన హీరోతో కాశ్మీర్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ చిత్రీకరిస్తున్నారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ (’78)తో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది 5వ సినిమా. ఓ రోజు కాశ్మీర్ డాల్ లేక్‌లో షూటింగ్ ముగించుకొని, పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ‘ప్రేమాభిషేకం’ కథాంశం మనసులో రూపుదిద్దుకుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో. కష్టపడి ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తాడు. తీరా ఆమె ఓకే అన్నాక, ఊహించని పరిస్థితులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం, సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే? ఈ కథాంశం చెప్పగానే అక్కినేని డబుల్ ఓకే. సొంత స్టూడియో బ్యానర్ మీదే తీద్దామన్నారు. అలా అక్కినేని సొంత చిత్రంగా, కుమారులు వెంకట్, నాగార్జున నిర్మాతలుగా ‘ప్రేమాభిషేకం’ పట్టాలెక్కింది. ఆగిన షూటింగ్! అన్నపూర్ణ మధ్యవర్తిత్వం!! మొదటి నుంచి ఈ కథపై దాసరికి గట్టి నమ్మకం. తీరా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కినేనికి ఓ డౌట్ వచ్చింది. పెళ్ళిచూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని, పెళ్ళికి ఓకే చెప్పి వస్తాడు హీరో. తీరా తరువాత కవిత పూలబొకేతో ఎదురైతే, ‘నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను చూసి ఓకే చెప్పలేదు’ అంటాడు. ముందు ఓకే అన్నా, ఆ సీన్ తీస్తున్నప్పుడు తన లేడీస్ ఫాలోయింగ్ ఇమేజ్‌కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని అనుమానించారు. ఆ సీను మార్చాల్సిందే అన్నారు. దాసరితో వాదించారు. కానీ, కథానుసారం ఇంటర్వెల్ వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీనుకు ఈ సీనే లింకు అంటూ దాసరి పట్టుబట్టారు. వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్ ఆగింది. అక్కినేని, దాసరి – ఇద్దరూ భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ కలగజేసుకొని, మధ్యవర్తిత్వం వహించారు. చివరకు దాసరి ‘‘ఆ సీనులో సారం చెడిపోకుండా, ఒకటి రెండు సవరణలు చేసి, అక్కినేనిని ఒప్పించా’’రు. అద్భుతంగా తీసి, మెప్పించారు. ఆ దేవదాసు పాత్రలే... మళ్ళీ! గమనిస్తే ఒకప్పటి దేవదాసు, పార్వతి, చంద్రముఖులే ఈ ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని, శ్రీదేవి, జయసుధలు వేసిన పాత్రలు. పార్వతి ప్రేమ కన్నా చంద్రముఖి ప్రేమ గొప్పదనే చర్చ ఈ చిత్రంలోని శ్రీదేవి, జయసుధల పాత్ర ద్వారా చెలరేగింది. సూపర్ హిట్స్ ‘దేవదాసు’, ‘ప్రేమ్‌నగర్’ కథలను కలగలిపి, కొత్తగా వండి వడ్డించారు దాసరి. అయితే, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వంలో దాసరి బహుముఖ ప్రజ్ఞ ఓ సంచలనం. ఆ పాటలకు వందనం... అభివందనం! చక్రవర్తి సంగీతంలో ‘దేవీ మౌనమా’, ‘కోటప్పకొండకు’, ‘తారలు దిగివచ్చిన’, ‘నా కళ్ళు చెబుతున్నాయి’, ‘ఒక దేవుడి గుడిలో’, ‘వందనం’, ‘ఆగదూ’– ఇలా దాసరి రాసిన అన్ని పాటలూ ఆల్‌టైమ్ హిట్. ఎస్పీబీకి సింగర్‌గా నంది అవార్డూ వచ్చింది. నిజానికి, ‘వందనం...’ పాట స్థానంలో దాసరి మొదట ‘జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో’ అనే పాట రాశారు. పాట ఇంకా బాగుండాలన్నారు అక్కినేని. అప్పుడు చేసిన కొత్త పాట ‘వందనం’ అయితే, ఆడియోలో మాత్రం ‘జీవితాన్ని చూడు’ పాట కూడా రిలీజ్ చేశారు. సినిమాలో లేకపోయినా, ఆ పాటా ఆ రోజుల్లో తెగ వినపడింది. 57వ ఏట ‘ప్రేమాభిషేకం’తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. ‘‘ఈ క్రెడిట్ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్ కంట్రిబ్యూషన్’’ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు. మరపురాని డైలాగ్ డ్రామా! నిజం చెప్పాలంటే – సీన్ల రూపకల్పనలో, డైలాగ్ డ్రామాలో దాసరి ప్రతిభకు ‘ప్రేమాభిషేకం’ ఓ మచ్చుతునక. ‘‘ఈ లోకంలో అందరికీ తెలుసు’’ అంటూ హీరోయిన్‌కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్, శ్రీదేవి– జయసుధ– అక్కినేనివ మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. ఆ డైలాగుల్ని జనం అందరూ తెగ చెప్పుకున్నారు. హీరో మరణించినా, మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ, రిపీట్ ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. పాత్ర చిన్నదే... ఆమె అభినయం పెద్దది! మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే టాప్ హీరోయినైన జయసుధ అయితేనో అన్నారు దాసరి. కానీ ‘కేవలం 2పాటలు, 6 సీన్లే ఉన్న పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అన్నది అక్కినేని అనుమానం. ఇంతలో ‘ప్రేమాభిషేకం’లో ఓ చిన్నపాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా వెళ్ళింది. ‘ఆ పాత్ర నేనే చేయాలని దాసరి అనుకుంటే, అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా’ అని జయసుధ యథాలాపంగా అనేశారు. తీరా అది వేశ్య పాత్రే! ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్! అప్పట్లో ‘అక్కినేని – బాలు – చక్రవర్తి – దాసరి అండ్ జయసుధ’ల కాంబినేషన్ వరుస హిట్లు అందించింది. విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవంలో వీళ్ళను ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్ అని జర్నలిస్టులు ప్రస్తావించారు. చాలాకాలం ఫ్యాన్స్‌లో, ట్రేడ్‌లో ఆ పదం పాపులరైంది. బాక్సాఫీస్ చరిత్రలో... సువర్ణాధ్యాయం ‘ప్రేమాభిషేకం’ తెలుగు సినీ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజుకు ముందు మంచి రేటొచ్చినా, దాసరి సలహా మేరకు హక్కులు అమ్మలేదు అక్కినేని. నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంత అన్నపూర్ణా ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన చిత్రం (గూడూరులో 32 రోజులకు తీసేయగా, 28 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రంలో షిఫ్టుతో, మరో కేంద్రంలో నూన్‌షోలతో) మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం చేసుకుంది. అలాగే, 24 కేంద్రాల్లో డైరెక్టుగా, 2 కేంద్రాల్లో షిప్టుతో, 4 కేంద్రాలు సికింద్రాబాద్, ఖమ్మం, గుడివాడ, ఆదోనిల్లో నూన్‌షోలతో మొత్తం 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్టుతో, 10 కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ (25 వారాలు) ఆడింది. తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయా టాకీస్‌లో నేరుగా 365 రోజులు ప్రదర్శితమై, ‘ప్రేమాభిషేకం’ కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ హాలులో 380 రోజుల ప్రదర్శన చేసుకుంది. గుంటూరు కాక, మరో 3 కేంద్రాల్లో షిఫ్టులతో, 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తం 8 కేంద్రాల్లో ఈ విషాద ప్రేమకథ గోల్డెన్ జూబ్లీ (50 వారాలు) ఆడింది. అటు పైన 5 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ (60 వీక్స్) నడిచింది. తర్వాత విజయవాడ, హైదరాబాద్‌లలో షిఫ్టులు, నూన్‌షోలతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్లాటినమ్ జూబ్లీ (75 వీక్స్) ఆడిన తొలిచిత్రం’గా రికార్డు సృష్టించింది. అక్కడ ‘మరో చరిత్ర’... ఇక్కడ ‘ప్రేమాభిషేకం’ నిజానికి, ‘ప్రేమాభిషేకం’ కన్నా ముందే 1978లో కమలహాసన్ – కె. బాలచందర్‌ల నేరు తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ తమిళనాట మద్రాసులో ప్లాటినమ్ జూబ్లీ చేసుకొంది. అక్కడి సఫైర్ థియేటర్లో నూన్‌షోలతో ఏకధాటిగా 596 రోజులు ఆడి, ‘ప్లాటినమ్ జూబ్లీ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం’గా నిలిచింది. అలా మద్రాసులో ‘మరో చరిత్ర’, మన తెలుగునాట ‘ప్రేమాభిషేకం’ తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీ చిత్రాలయ్యాయి. కానీ, విచిత్రంగా ఇక్కడి పబ్లిసిటీలో మాత్రం ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని ‘తెలుగులోనే తొలి ప్లాటినమ్ జూబ్లీ చిత్రం’గా ప్రకటించుకున్నారు. ఇంకా గమ్మత్తేమిటంటే, దీని తరువాత ప్లాటినమ్ జూబ్లీ (525 రోజులు) రికార్డు దగ్గర దాకా వచ్చిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ (1982లో– హైదరాబాద్‌లో 517 రోజులకు), ‘సాగర సంగమం’ (1983లో– బెంగుళూరులో 511 రోజులకు) ఎందుకో అర్ధంతరంగా హాళ్ళ నుంచి అదృశ్యమయ్యాయి. దాని వెనుక ‘ప్రేమాభిషేకం’ పెద్దల మంత్రాంగం ఉందని అప్పట్లో ట్రేడ్ వర్గాల టాక్. చివరకు 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ (హైద్రాబాద్‌లో–565 రోజులు) ఆడి ప్లాటినమ్ జూబ్లీ చిత్రాల లిస్టుకెక్కింది. రన్‌లోనూ... కలెక్షన్లలోనూ... కోస్తా ఆంధ్రలో కొత్త రికార్డ్! ఏది ఏమైనా, ‘ప్రేమాభిషేకం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్ర అయింది. లేట్ రన్‌లోనూ మరో 50 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. మరో 11 కేంద్రాలలో (డైరెక్టుగా – మదనపల్లి, తుని, చిలకలూరిపేట, బెంగుళూరు, మద్రాసుల్లో, నూన్‌షోలతో – శ్రీకాళహస్తి (తొలి శతదినోత్సవం), నంద్యాల, హిందూపురం, నరసరావుపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో) వంద రోజులాడింది. లేట్ రిలీజులోనే బెంగుళూరులో నూన్ షోలతో 365 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మొత్తం 41 శతదినోత్సవ కేంద్రాలకు గాను 14 కేంద్రాల్లో అక్కినేని చిత్రాలలో ఏకైక శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ‘భార్యాభర్తలు’ (1961) తరువాత మళ్ళీ రెండు దశాబ్దాలకు బెంగుళూరులో అక్కినేనికి ఓ శతదినోత్సవాన్ని అందించింది. ఆ రోజుల్లో ‘ప్రేమాభిషేకం’ కోస్తా ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలలో అటు ఆడిన రోజుల్లోనూ, ఇటు వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. అలా విజయవాడ, గుడివాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏలూరు, తణుకు, తుని, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర కేంద్రాల్లో రన్‌లోనూ, కలెక్షన్లలోనూ అప్పటికి ‘ప్రేమాభిషేకం’దే సరికొత్త రికార్డ్. అలా తన అభిమాన హీరో అక్కినేనికి దాసరి ఇచ్చిన అపురూప కానుక ఇది. ఊరూవాడా... ఎన్నెన్నో విజయోత్సవాలు ఇన్ని విజయాలు సాధించిన ‘ప్రేమాభిషేకం’కి ఉత్సవాలు చాలా జరిగాయి. విజయవాడలో శతదినోత్సవం, హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో సిల్వర్‌జూబ్లీ, నెల్లూరులో త్రిశతదినోత్సవం, ఆ తరువాత మద్రాసులో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఇక, ఊరూవాడా ఫ్యాన్స్ చేసిన వేడుకలకైతే అంతే లేదు. అలా అక్కినేని కెరీర్‌కు కిరీటమైందీ చిత్రం. ఫస్ట్ రిలీజైన నాలుగున్నరేళ్ళ తరువాత 1985 సెప్టెంబర్ 20న అక్కినేని బర్త్‌డేకి భారీ పబ్లిసిటీతో, రాష్ట్రమంతటా ‘ప్రేమాభిషేకా’న్ని సెకండ్ రిలీజ్ చేశారు. అయితే, రిపీట్ రన్లలో అక్కినేని చిత్రాలలో ఎప్పుడూ ముందుండే ‘ప్రేమ్‌నగర్’ లాగా ‘ప్రేమాభిషేకం’ ఆశించిన ఆదరణ పొందలేదు. కానీ అదే ‘ప్రేమాభిషేకం’ మరో పదేళ్ళకు 1995లో ఏ హడావిడీ, అంచనాలూ లేకుండా తెలుగునాట అంచెలంచెలుగా రీ–రిలీజైనప్పుడు మంచి వసూళ్ళు తేవడం విశేషం. అందుకే, ‘ప్రేమాభిషేకం’ జనంలోనూ, బాక్సాఫీస్ జయంలోనూ అసలైన ప్రేమకు జరిగిన అపురూప పట్టాభిషేకం. వరుసగా మూడేళ్ళూ... ఆమెకే అవార్డ్! నిడివి చిన్నదైనా, ‘ప్రేమాభిషేకం’లో వేశ్యగా జయసుధదే కీలకపాత్ర అయింది. అందులోనూ గ్లామర్ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డూ జయసుధకే దక్కింది. ‘ప్రేమాభిషేకం’తో మొదలుపెట్టి వరుసగా మూడేళ్ళు (‘ప్రేమాభిషేకం–1981, మేఘసందేశం–1982, ధర్మాత్ముడు–1983’) ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకొని, జయసుధ హ్యాట్రిక్ సాధించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ (ఉత్తమ చిత్రాలు ‘చెల్లెలి కాపురం–1971, కాలం మారింది – 1972, శారద–1973’) తర్వాత అలాంటి హ్యాట్రిక్ మళ్ళీ జయసుధకే సాధ్యమైంది. అక్కినేని, జయసుధ చిత్రం... భళారే విచిత్రం! గమ్మత్తేమిటంటే, 1980లో అక్కినేని పుట్టినరోజైన సెప్టెంబర్ 20న ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్, చెన్నైలలో 32 షూటింగ్ డేస్‌లో పూర్తయింది. 1981లో సరిగ్గా అక్కినేని పెళ్ళిరోజైన ఫిబ్రవరి 18న రిలీజైంది. గమ్మత్తుగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజున ఎన్టీఆర్, ఏయన్నార్ల కాంబినేషన్లో ఆఖరి చిత్రం ‘సత్యం – శివం’ రిలీజైంది. ఆ భాషల్లో మాత్రం వట్టి రీ ‘మేకు’! గమ్మత్తేమిటంటే, తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్ అయినప్పుడు ఆశించినంత ఆడలేదు. తమిళంలో ఈ కథను ‘వాళ్వే మాయమ్’ (1982)గా కమలహాసన్‌తో రీమేక్ చేశారు. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలో ‘ప్రేమాభిషేకం’ పేరుతోనే డబ్ కూడా చేసి, రిలీజ్ చేశారు. ఇక హిందీలో సాక్షాత్తూ దాసరి దర్శకత్వంలోనే జితేంద్ర, రీనారాయ్, రేఖ నటించగా ‘ప్రేమ్ తపస్యా’ (1983) పేరుతో అక్కినేనే నిర్మించారు. కానీ, అవేవీ ఆదరణకు నోచుకోలేదు. కమలహాసనైతే అక్కినేనిలా తాను చేయలేకపోయానని బాహాటంగా చెప్పేశారు. కోటి అంటే... కోటిన్నర! ప్రేయసి బాగు కోసం తన ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ హీరో కథకు జనం బ్రహ్మరథం పట్టారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడే ‘నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా. ఇది బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది’ అని నాతో దాసరి అన్నారు. దాసరి అన్నమాట నిలబెట్టడమే కాక, అంతకు మించి ‘ప్రేమాభిషేకం’ కోటీ 30 లక్షలు వసూలు చేసింది’’ అని మద్రాసులో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. అటుపైనా ఆ సినిమా అప్రతిహతంగా ఆడి, ఏకంగా 75 వారాల ప్లాటినమ్ జూబ్లీ చేసుకుంది. చివరకు కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్లో తొలి రూ. కోటి వసూలు చిత్రం ఇదే! ఆయన కెరీర్లో రెండో గోల్డెన్ జూబ్లీ చిత్రం (మొదటిది ‘దసరా బుల్లోడు’) కూడా ఇదే!! ఇంతటి బాక్సాఫీస్ విజయంతో, ‘ప్రేమాభిషేకం’ అప్పట్లో అన్నపూర్ణా స్టూడియోస్‌ను బాలారిష్టాల నుంచి బయటపడేసింది. - రెంటాల జయదేవ -
శ్రీలతా రెడ్డి, మంత్ర, సుజాత.. ఎవరబ్బా?!
(వెబ్ స్పెషల్): పుట్టగానే అమ్మ నాన్న పేరు పెడతారు. ఆ తర్వాత ముద్దు పేర్లు వచ్చి చేరతాయి. మరి కొందరు వారు చేస్తున్న పనిని బట్టి పేర్లు తెచ్చుకుంటారు. ఆ పేరుతోనే ఫేమస్ అవుతారు. ఇక సినీ ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. ఇండస్ట్రీలో విజయాలు సాధించాలని కొందరు కొత్త పేర్లు పెట్టుకుంటారు.. మరి కొందరు ఉన్న పేరుకే మార్పులు చేసుకుంటారు. ఇక కొందరికి దర్శకులే నామకరణం చేస్తారు. అలాంటి వారు సొంత పేరుతో కన్నా ఈ పేరుతోనే బాగా గుర్తింపు పొందుతారు. మరి ఇండస్ట్రీలో ఇలా పేరు మార్చుకుని.. స్టార్‌గా ఎదిగిన హీరోయిన్లు ఎవరో చూడండి.. శ్రీదేవి బాల్యంలోనే ఇండస్ట్రీలో ప్రవేశించి.. అంచెలంచెలుగా ఎదుగి.. ఫిమేల్ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించున్నారు అందాల నటి శ్రీదేవి. అయితే ఆమె కూడా పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్. ఆ తర్వాత శ్రీదేవిగా మారి.. ఇండియాను ఓ ఊపు ఊపేసారు. జయసుధ మూవీస్‌లో సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు జయసుధ. అయితే ఆమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. ఆమె అసలు పేరు సుజాత. (మార్పు అవసరం) జయప్రద అందం, అభినయం, నాట్య మయూరి అయిన జయప్రద అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై, దక్షిణాది, బాలివుడ్లో అగ్రకథానాయికగా ఎదిగి, ఆ తరువాత రాజకీయాల్లో రాణిస్తున్నారు. సౌందర్య పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగించి ఆడపడుచు అయ్యారు సౌందర్య. టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో అకాల మృత్యువు ఆమెను కబలించింది. సావిత్రిలాగా తెలుగు సినిమా ఉన్నంత కాలం సౌందర్య కూడ ప్రేక్షకుల మదిలో జీవించే ఉంటారు. భౌతికంగా మనల్ని విడిచివెళ్ళిన ఈమె అసలు పేరు సౌమ్య అనే విషయం అందరికి తెలిసిందే. (రెండు కోట్ల ప్రేమ) రోజా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈమె కూడా పేరు మార్చుకున్నారు. రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డి. రంభ నిజంగా దివి నుంచి భువికి దిగివచ్చిన అందాల బొమ్మ రంభ. గ్లామర్ అనే పదం వినగానే 1990ల ప్రేక్షకులకి గుర్తొచ్చే పేరు రంభ. విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మీ. భూమిక ఢిల్లీ నుంచి వచ్చిన రచన చావ్లా కాస్త సినిమాల కోసం భూమికగా మారారు. హీరోయిన్గా వచ్చిన కొత్తలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించారు. పవన్ కళ్యాణ్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. (నన్ను నేను తెలుసు కుంటున్నాను) అనుష్క ప్రయోగాత్మక చిత్రాలకు.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు అనుష్క. బెంగుళూరుకి చెందిన అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాల్లో తప్ప, బయట ఆమెని అందరు స్వీటి అనే పిలుస్తారు. స్వతహాగా ఈమె యోగ టీచర్. నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రంతో పరిచయం అయిన కేరళ బ్యూటి నయనతార అసలు పేరు డయాన మరియమ్ కురియన్. కాని ఈ లేడి సూపర్ స్టార్ సినిమాల కోసం నయనతారగా మారింది. రాశి రాశి చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిది భీమవరం, తండ్రిది చెన్నై. ఆమె తాత పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవారు. బాలనటిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి నాయికగా గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలతో మంచి పేరు సంపాదించింది. తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. అయితే రాశి అసలు పేరు విజయలక్ష్మి. ఇక వీరే కాక హీరో రజనీకాంత్, చిరంజీవి, సూర్య, పవన్ కళ్యాణ్, విక్రమ్ వంటి స్టార్ హీరోలు సైతం పేరు మార్చుకున్నారు. -
నటి జయసుధ కుమారుడి వివాహ రిసెప్షన్
-
ప్రముఖ నటి ఇంట గ్రాండ్‌గా రిసెప్షన్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం స్థానికంగా జరిగిన ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ, నటుడు మోహన్‌బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇతర టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వివాహ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 26న ఢిల్లీకి చెందిన అమృత కౌర్‌తో నిహార్ వివాహం గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సీనియర్ నటీమణులు జయప్రద, రాధిక తదితరులు హాజరై సందడి చేశారు. జయసుధకు నిహార్ కపూర్, శ్రీయాన్ కపూర్ ఇద్దరు కుమారులున్నారు. నిహాన్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. నటి జయసుధ ఇటు వరుస సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జయసుధ
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన జయసుధ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్ జగన్‌కు అందించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. (చదవండి : చిన్నారి ప్రసంగంపై సీఎం జగన్ అభినందనలు) -
హ్యాట్సాఫ్ టు దిశ యాక్ట్
రియల్ లైఫ్.. రీల్ లైఫ్‌కి దగ్గరయ్యింది. సినిమాల్లోనే సాధ్యమయ్యే సత్వర న్యాయం ఆంధ్రుల సొంతమయ్యింది. ఓ రేప్ కేసును దృష్టిలో పెట్టుకొని ‘టెంపర్’ సినిమా తీశారట పూరి. ఆడపిల్లకు అన్యాయం జరిగితే వాళ్లకు హీరో లాంటి అన్నయ్య ఒకడుంటాడు అని ‘రాఖీ’ సినిమాలో కృష్ణవంశీ చూపించారు. ఇప్పుడు ఆంధ్రాలో ఆడపిల్లలకు నేనున్నాను అంటున్నారు జగన్మోహన్రెడ్డి. స్టార్స్ అంతా ‘ఏపీ దిశ యాక్ట్’కు హ్యట్సాఫ్ అంటున్నారు. జగన్ గారికి అభినందనలు– పూరి జగన్నాథ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డిగారు ప్రవేశపెట్టిన దిశాచట్టం చాలా చాలా మంచిది. ఇది అవసరం. ఇలాంటి చట్టం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఎంత కిరాతకంగా ఆత్యాచారం చేస్తే అంత కంటే కిరాతకంగా శిక్షలు కూడా ఉంటాయని తెలియాలి. దేశంలో ఇలాంటి చట్టాలు అవసరం. తొంభై శాతం రేప్‌లు మద్యం మత్తులో జరుగుతుంటాయి. మద్యపానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కంట్రోల్ చేసేలా చర్యలు చేపడుతున్న జగన్మోహన్రెడ్డిగారిని మెచ్చుకోవాలి. నిజానికి ఈ విధానం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది. అయినా సరే చిత్తశుద్ధితో చేస్తున్న ఆయన్ను అభినందించాలి. జగన్‌గారికి హ్యాట్సాఫ్. చాలామంచి పని చేస్తున్నారు. అలాగే గ్రామ సచివాలయ విధానాన్ని ప్రవేశపెట్టి దాదాపు రెండు లక్షల మంది యువతీయువకులకు ఉద్యోగ కల్పన చేశారు జగన్ గారు. అది చిన్న విషయం కాదు. కొందరు తల్లిదండ్రులు వారి అమ్మాయిలను చాలా అమాయకంగా పెంచాలనుకుంటుంటారు. అది తప్పు. పుస్తకాల్లో కానీ మరోచోట కానీ ‘ఆడవారికి సిగ్గే సింగారం’ అని చెబుతుంటారు. అదీ తప్పే. సిగ్గుపడే మహిళలు అంటే నాకు నచ్చదు. ఏ దేశాల్లో అయితే ఆడవారు ఎక్కువగా సిగ్గుపడుతుంటారో ఆ దేశాల్లో ఆత్యాచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చైనా, పాకిస్తాన్, ఇండియా.. ఇలా. ఆడవారి సిగ్గుని మగవారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. మగవారితో ధైర్యంగా మాట్లాడటానికి సిగ్గపడకూడదని దయచేసి తల్లిదండ్రులు వారి ఆడపిల్లలకు చెప్పండి. స్ట్రాంగ్ ఉమెన్‌ని రేప్ చేయడానికి మగవారు భయపడతారు. ఆడవారు స్ట్రాంగ్‌గా ఉండేలా వారి తల్లిదండ్రులు పెంపకం ఉండాలి. మహిళలను మనం పుస్తకాల్లో గౌరవిస్తున్నాం కానీ నిజంగా గౌరవించడం లేదు. ఎన్నో ఏళ్లు బాల్యవివాహాలు ప్రాక్టీస్ చేశాం. చైల్డ్ అబ్యూస్ ప్రాక్టీస్ చేశాం. ఇంకా ఎన్నో ఏళ్లు భర్త చనిపోతే భార్యను తగలబెట్టే సతీసహగమనాన్ని ప్రాక్టీస్ చేశాం. 2002లో రాజస్థాన్‌లో చివరి సతీసహగమనం జరిగింది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలంటే దిశ లాంటి చట్టాలు రావాలి. తీహార్ జైల్లో ఉన్న వందమంది రేపిస్ట్‌లను ఒక పాత్రికేయురాలు ఇంటర్వ్యూ చేశారు. అందరితో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైంది ఏంటంటే... రేపిస్ట్లందరూ ఎక్ట్రార్డినరీ వారు కాదు. ఆర్డినరీ వారే. వారు ఎందుకు చేశారు అంటే చదువుకోకపోవడం ఒక కారణం. తల్లిదండ్రుల పెంపకం మరో కారణం. అలాగే రేప్‌కు గురైన ప్రతి అమ్మాయి అమాయకురాలే. అరగంటకో రేప్ జరుగుతుంది. ఆ పాయింట్‌పై ‘టెంపర్’ సినిమా తీశాను. మనకు తెలియకుండా తగలబడిపోయినవారు ఇంకా ఎందరు ఉంటారో! నేరాలు తగ్గుతాయి – కృష్ణంరాజు ఏపీ ‘దిశ’ బిల్లు వల్ల నేరాలు కచ్చితంగా తగ్గుతాయనిపిస్తోంది. శిక్ష ఎప్పుడో పడుతుంది? అనే ఆలోచనతో కూడా నేరాలకు పాల్పడేవాళ్లు ఉంటారు. ఇప్పుడు 21 రోజుల్లోనే అనేది ఆహ్వానించదగ్గ మార్పు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఇది. ఎవర్నీ ఎన్కౌంటర్ చేయాలని మనం కోరుకోం. కానీ ఘోరాలు చేస్తున్నవాళ్లను ఎలా వదులుతాం? దిశ ఘటన తర్వాత చాలా షాక్ అయ్యాం. ఎన్కౌంటర్ వార్త విని, చాలా ఆనందపడ్డాం. నేరం చేయాలనే ఉద్దేశం ఉన్నవారికి ఇదొక పాఠం. శిక్ష వెంటనే పడాలి. అప్పుడు నేరాలు తగ్గుతాయి. ఓ 20, 25 ఏళ్లు కంటికి రెప్పలా పెంచిన కూతుర్ని చీమలా నలిపిస్తే ఏ తల్లిదండ్రికి బాధ ఉండదు చెప్పండి. అలాగే మగపిల్లలనూ ఇష్టంగానే పెంచుతారు తల్లిదండ్రులు. వాళ్లు నేరం చేశారంటే ఆ పేరంట్స్‌కి కూడా బాధగానే ఉంటుంది. తప్పు చేస్తే సమాజంలో గౌరవం ఉండదనే భావన ఉంటే తప్పు చేయరు. రష్యాలో ఒక ప్లేస్ ఉంది. అక్కడ డ్రింక్ చేసి బాగా గొడవ చేసేవాళ్లు. అక్కడో బోర్డ్ పెట్టారు. ఎవరెవరు ఎంతెంత తాగారు? అని ఆ బోర్డ్ మీద రాసేవాళ్లు. తర్వాతి రోజు అది చూసుకుని, ఎక్కువ తాగిన వ్యక్తిగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నవాడు... ఊళ్లో తనే తాగుబోతు అని చెప్పుకుంటారేమోనని మూడు నుంచి రెండు పెగ్గులకు తగ్గించాడు. అలా అలా పూర్తిగా మానేశాడు. గౌరవంగా బతకాలనుకునేవాళ్లల్లో ఇలా మంచి మార్పు వస్తుంది. పేరంట్స్ పెంపకం వంటివన్నీ వదిలేస్తే.. గౌరవం కాపాడుకోవాలనే తపన ఎవరికి వాళ్లకు ఉండాలి. అప్పుడు హుందాగా బతుకుతారు. మంచి నిర్ణయం – వెంకటేశ్ ‘‘ఈ బిల్లు ద్వారా నేరాలు తగ్గుతాయా లేదా అనే వాదనని పక్కన పెడితే ఇలాంటి నేరాల్లో నిర్ణయం త్వరగా తీసుకోవాలి అనుకోవడం చాలా కరెక్ట్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బిల్ పాస్ చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి కేసులు జరిగినప్పుడు తీర్పు ఇవ్వడంలో ఆలస్యం చేయకూడదు. ఈ విషయం గురించి మాట్లాడటానికి నేను సరైన వ్యక్తిని కాకపోయినా చెబుతున్నాను. ఇలాంటి విషయంలో టైమ్ వేస్ట్ చేయకూడదు. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది. ఎవరో ఒకరు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. స్త్రీలను ఎలా గౌరవించాలి, వాళ్లను ఎలా సేఫ్‌గా ఉంచగలం అని అందరూ ఆలోచించాలి. అభినందనీయం – నాగచైతన్య ఇలాంటి ఇష్యూలకు ఇంత చర్చ ఉండటం అనవసరం. తీర్పు అనేది సత్వరంగా ఉండాలి. జీఎస్టీ లాంటి విషయాల్లోనే తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఆలస్యం ఎందుకు చేస్తున్నాం మనం? ఇలాంటి బిల్‌ను తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. న్యూ ఇయర్ గిఫ్ట్ – జయసుధ దిశ గురించి దేశమంతా ఎలా మాట్లాడుకున్నారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దిశాబిల్లు గురించి కూడా అందరూ మాట్లాడాలి. ఆడపిల్లలను హింసించే వారందరూ ఇక జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో ఏం చేసైనా శిక్ష పడకుండా హాయిగా బయట తిరిగేయొచ్చు, అనే వారందరికి సవాలు విసిరారు జగన్. ఇకనుండి ఇలాంటి వాళ్ల పప్పులు ఉడకవు. 21 రోజుల్లో సత్వర న్యాయం అనే విషయం వింటుంటేనే ఒక ఆడదానిగా, నటిగా, రాజకీయాల్లో ఎంతో మందిని చూసిన నేతగా అన్నీ రకాలుగా హ్యాపీగా ఉన్నాను ఈ బిల్లు గురించి తెలియగానే. అలాంటి సీయం అందరికీ కావాలి. చాలామంది సీయంలకు ఇలా చేయాలని ఉన్నా కూడా చేయలేక పోయారు. ఇప్పుడు అలాంటి డెసిషన్ తీసుకుందాం అనుకునే వాళ్లందరికీ జగన్ మార్గదర్శకుడయ్యారు అనటంలో సందేహం లేదు. అలాంటి జగన్ గారు నాకు వ్యక్తిగతంగా తెలియటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటం ఏ నాయకుడికైనా అంత ఈజీ ఏం కాదు. ఈయన ఎప్పుడు ఏం తప్పుచేస్తారా ఆయన గురించి మాట్లాడే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే ప్రతిపక్షాలు ఉంటాయి. వీటన్నిటి గురించి ఆలోచించకుండా ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది హిస్టారికల్ డెసిషన్. నేను ఎన్నో సంఘటనలను చూశాను. ఆడవాళ్ల అందరికి ఈ బిల్లు చాలా ధైర్యాన్నిచ్చింది. ఎందుకంటే ఏ తల్లితండ్రులూ ఇంతటి దారుణాన్ని ఊహించరు. ఓ న లుగురు మనుషులు తమ కూతురుని రేప్ చేసి, హత్య చేసి ఆనక కాల్చి బూడిద చేస్తారని ఊహించటానికి కూడా ఇష్టపడరు. అలాంటిది అది మనకు తెలిసినవాళ్లకో, మన దగ్గరివాళ్లకో జరిగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది! అందుకే ఈ బిల్లు ప్రవేశ పెట్టారు అనగానే నేను ఎంత ఆనంద పడ్డానో మాటల్లో చెప్పలేను. ఇదేదో లబ్ధి పొందటానికి జగన్ గారు చేశారనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన సీయం పీఠమెక్కి ఆరు నెలలే. ఇంకా నాలుగున్నరేళ్లు ఆయన పాలన ఎంత డైనమిక్‌గా ఉండబోతుందో ఈ సంఘటన ద్వారా తెలుస్తూనే ఉంది. ఇలాంటి డెసిషన్ తీసుకోవటానికి ఇది కరెక్ట్ టైమ్. యంగర్ జనరేషన్‌కి ప్రాబ్లం వస్తే ఆ తల్లితండ్రుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉంటుంది. అందుకే ఇది 2019లోనే పెద్ద డెసిషన్, 2020 న్యూయర్‌కి ఆడవాళ్లందరికీ జగన్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్‌లా ఫీలవుతున్నాను. జగన్ సీయం పదవిలో ఉండి ఈ బిల్లును పాస్ చేశాడు కాబట్టి మేమందరం కూడా ఇలా చేయాలి అని మిగతా సీయంలు అనుకొని భారతదేశంలోని ఆడవాళ్లందరికీ న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. -
ఆత్మవిశ్వాసమే ఆయుధం
దసరా అంటే శక్తికి ఉత్సవం. చెడును సంహరించిన మంచి శక్తి. చీకటిని చీల్చిన వెలుగు శక్తి. భావోద్వేగాలను జయించిన నిగ్రహ శక్తి. తనను తాను నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసపు శక్తి! అంటే శక్తికి ఆయుధం ఆత్మవిశ్వాసమే.. దసరా సందేశమూ అదే.. స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలని!! అలాంటి కథానాయికలను పరిచయం చేసిన కొన్ని సినిమాలు, ఆ శక్తి స్వరూపిణుల గురించి... ‘ఆయుధ పూజ’ సందర్భంగా..! అమ్మ కడుపులోంచే ఆడపిల్ల వినమ్రత, అణకువ, త్యాగం అనే పర్యాయ పదాలను జన్మనామాలుగా స్థిరపర్చుకొని ఈ భూమ్మీద పడ్తుంది. వీటన్నిటినీ ‘పరాధీన’ అనే ఒక్క ట్యాగ్‌తో కుదించేయొచ్చు. ఈ ఒక్క ఎలిమెంట్‌తో టన్నుల కొద్దీ సెంటిమెంట్‌ను పండించి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు నాడు.. నేటికి కూడా! ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ అమ్మ, భార్య, అక్క, చెల్లికి కుటుంబం తప్ప ఇంకో ప్రపంచం ఉండకూడదు.. కుటుంబ సేవలో గంధం చెక్కలా అరిగి తరించాలనే సందేశాన్నీ నూరిపోశాయి. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిని అహంకారిగా చూపించాయి. సరిగ్గా అలాంటి సమయాల్లోనే ఆ మూస రీళ్లను పెట్టెలో అట్టిపెట్టే కొన్ని భిన్నమైన చిత్రాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు ఆత్మగౌరవం అని చాటే సినిమాలు. వాటిల్లో ముఖ్యమైనవి అంతులేని కథ, ఇది కథ కాదు, న్యాయం కావాలి, 47 రోజులు, కోకిలమ్మ, తలంబ్రాలు. పనికి గౌరవం గంపెడు సంతానాన్ని కని.. పోషించలేక భయంతో తండ్రి పారిపోతే , వ్యసనాలకు బానిసైన అన్న బాధ్యత మరిచిపోతే.. వారి స్థానాన్ని భర్తీ చేసి ఆ ఇంటికి పెద్దగా మారి కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటుంది ఆత్మాభిమానం గల కూతురు సరిత.. అంతులేని కథ సినిమాలో. ఆ ఇంట్లో తనకంటూ ఓ ప్రత్యేక గది, ప్రత్యేక హోదాను ఏర్పాటు చేసుకున్న సరిత ఇంట్లో వాళ్లందరికీ అహంకారిగా కనిపిస్తూంటుంది. కాని ప్రేక్షకులు ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూస్తారు. కుటుంబానికి ఆర్థిక వనరుగా ఉన్న పురుషుడికి ఎలాంటి హోదానిస్తారో స్త్రీకి అలాంటి హోదానే ఇవ్వాలి అని చాటిన సినిమా. అందుకే సరిత ఓ పురుషుడిలా తనకు ఓ ప్రత్యేక గదిని, హోదాను తీసుకుంటుంది. ఆర్థిక స్వాతంత్య్రం అంటే వేణ్ణీళ్లకు చన్నీళ్లే కాదు ఇంటిని నడిపించే దిక్కు అని చెప్తుంది. ‘పని నీది ఏటీఎమ్ కార్డ్ నాది’ అనే పురుష భావనకు చెక్ పెడ్తుంది. ఆత్మగౌరవంతో ఇల్లు దాటి ఆత్మవిశ్వాసంతో బయటి ప్రపంచాన్ని నెగ్గుకొచ్చిన తీరును చూపిస్తుంది. శక్తికి ప్రతీకగా నిలబెడుతుంది. ‘అంతులేని కథ’ దర్శకుడు కె. బాలచందర్. సరితగా జయప్రద, వ్యసనపరుడైన అన్న మూర్తిగా రజనీకాంత్ నటించారు. సింగిల్ మదర్ పెళ్లికి ముందు ప్రేమ.. ఏవో కారణాల వల్ల పెళ్లిదాకా రాదు. పెద్దలు కుదిర్చిన వరుడు సుగుణాకర్ రావుతో మూడుముళ్లు వేయించుకుంటుంది సుహాసిని (జయసుధ). మూణ్ణాళ్లలోనే అతనొక శాడిస్ట్ అని రుజువవుతుంది. అప్పటికే ఓ బిడ్డ పుడ్తాడు. ఇక భరించలేక విడాకులు తీసుకొని ఒంటరి తల్లిగా కొత్త జీవితం మొదలుపెడ్తుంది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా! తోడుగా ఆమె అత్తగారూ వస్తుంది. కోడలిని మరో పెళ్లి చేసుకొమ్మని ప్రోత్సహిస్తుంది. సుహాసిని ఆ ప్రయత్నంలో ఉండగా మారిపోయి మంచి మనిషి అయినట్టు మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు సుగుణాకర్‌రావు కేవలం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకునేందుకే. తర్వాత ఆ విషయం అర్థమైన సుహాసిని మళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా బిడ్డను తీసుకొని ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి రైలు ఎక్కుతుంది. వెంట అత్తగారూ వెళ్తుంది. కోడలి చంకలోంచి మనవడిని తన భుజమ్మీదికి తీసుకుంటుంది ఆమె బాధ్యతలో సాయపడ్డానికి. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడిని, మగ తోడు లేకుంటే మహిళకు జీవితం లేదు అన్న స్టేట్మెంట్ను వెక్కిరించిన సినిమా. ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం తోడుంటే ఒంటరిగానే కాదు ఒంటరి తల్లిగా కూడా జీవనయానం చేయొచ్చు అని నిరూపించింది.. ‘ఇది కథ కాదు’. ఇవ్వాళ్టి ఎంతో మంది సింగిల్ మదర్స్‌కు స్ఫూర్తి. అత్తాకోడళ్ల అనుబంధాలకు ప్రేరణ. ‘ఇది కథ కాదు’ చిత్రం.. మహిళకు ఆత్మవిశ్వాసం అవసరాన్ని ప్రొజెక్ట్ చేసిన వాస్తవం. గుర్తింపుకోసం పోరాటం ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని శారీరక వాంఛ తీర్చుకొని, ఆమెను తల్లిని చేసి ఆ బిడ్డకు తనే తండ్రి అన్న రుజువేంటి అని ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచిన అతని మీద పోరాటం చేసి విజయం సాధించిన ఆమె ఆత్మవిశ్వాసం కథే ‘న్యాయం కావాలి’. ఇక్కడ విజయం అంటే నయానో భయానో తప్పు ఒప్పుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం కాదు. ఆత్మవిశ్వాసంతో కోర్టులో నిలబడి అన్ని రకాల పురుషాహంకార పరీక్షలను తిప్పికొట్టి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం. చేసిన తప్పుకి అతను కుంగిపోవడం. ఆమె నా బిడ్డకు తల్లే అని అతని మనసు ఘోష పెట్టడం. పశ్చాత్తాపంతో ఆమె గడప తొక్కి ‘నాకు భార్యగా నీ చేయి అందించు’ అని ఏడ్వడం. చిరునవ్వుతో ఆమె తిరస్కరించి ఆడపిల్ల గౌరవాన్ని కాపాడ్డం. పందొమ్మిది వందల ఎనభైల్లోనే వచ్చిన ఈ చైతన్యంలో ‘ఆమె’ భారతిగా రాధిక, ‘అతను’ సురేశ్‌గా చిరంజీవి నటించారు. దర్శకత్వం ఎ. కోదండరామిరెడ్డి. ‘కొత్త మలుపు’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్. తర్వాత చాన్నాళ్లకు కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘తలంబ్రాలు’ సినిమాదీ ఇంచుమించు ఇలాంటి కథే. ప్రేమించి మోసపోతే ఏడుస్తూ కూర్చోక ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతుంది. అతనికి గుణపాఠం చెప్తుంది. జీవిత, రాజశేఖర్, నందమూరి కళ్యాణచక్రవర్తి నటించారు. పెళ్లే పరమావధి కాదు ‘47 రోజులు’ సినిమా లైన్ ఇది. వైశాలి ఓ పల్లెటూరి అమ్మాయి. ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న కుమార్ ఏరికోరి ఆ పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకొని పారిస్ తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో పై పోర్షన్లో ల్యూసీ అనే ఒక అమ్మాయి ఉంటూంటుంది. ‘‘ఆమె ఎవరు?’’ అని అడిగిన వైశాలికి ‘‘ఫ్రెండ్’’ అని చెప్తాడు. తన వేలికి కుమార్ తొడిగిన వెడ్డింగ్ రింగ్‌ను సరిచేసుకుంటూ అతణ్ణి అడుగుతుంది ల్యూసి ‘‘ఆమె ఎవరు?’’ అని వైశాలిని ఉద్దేశించి. ‘‘నా పిచ్చి చెల్లెలు’’ అని చెప్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు కుమార్. ల్యూసీకి చెప్పినట్టుగా వైశాలినీ తన పిచ్చి చెల్లెలుగా నటింపచేయడానికి తనలోని శాడిస్ట్‌ను బయటకు తెస్తాడు కుమార్. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసకు గురిచేస్తాడు. ఈలోపే వైశాలి గర్భవతి అవుతుంది. బండారం ల్యూసీకి తెలియొద్దని నాటు పద్ధతిలో వైశాలికి అబార్షన్ చేయించాలనుకుంటాడు. అక్కడే ఉన్న తెలుగు డాక్టర్ శంకర్ సహాయంతో తప్పించుకుని బయటపడి ఇండియా చేరుకుంటుంది వైశాలి.ఆమె కథను సినిమాగా తీసే క్రమంలో వైశాలిని కలవడానికి వస్తుంది ఆ పాత్ర పోషించనున్న సరిత. ‘‘మళ్లీ పెళ్లెందుకు చేసుకోలేదు మీరు’’ అని ప్రశ్నిస్తుంది సరిత. ‘‘పెళ్లి తప్ప ఆడదాని జీవితానికి ఇంకో అర్థం లేదా?’’ అంటూ అరిచేస్తుంది వైశాలి. అదీ ఆమె ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం. అంతేకాదు ఈ సినిమా బ్రేక్ చేసిన మరో మూస.. సెంటిమెంట్. మోసకారి, శాడిస్ట్ భర్తను కాదనుకున్నాక అతని బిడ్డనూ మోయడానికి ఇష్టపడదు ఆమె. మాతృత్వం అనే సోకాల్డ్ సెంట్మెంట్ను పక్కకునెట్టి అబార్షన్ చేయించుకుంటుంది. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వైశాలిగా జయప్రద, కుమార్‌గా చిరంజీవి నటించారు. వినిపించిన ఉనికి వినికిడి శక్తిలేని కోకిలమ్మ.. ఒక డొమెస్టిక్ వర్కర్. తనకున్నదాంట్లో పదిమందికి సహాయం చేయాలనుకునే అనాథ. ఆమె ఉంటున్న దిగువ మధ్యతరగతి వాడలోకి గాయకుడవ్వాలనుకునే యాంబీషియస్ కుర్రాడు అద్దెకు వస్తాడు. వినిపించకపోయినా అతని కంఠంలోని హెచ్చుతగ్గుల కదలికల స్పర్శతో అతని పాటకు మంచి విమర్శకురాలిగా మారుతుంది. ఆమె చెప్పినట్టే అతను మంచి గాయకుడవుతాడు. పేరు, డబ్బుకు తగ్గట్టు తన ప్రవర్తననూ మార్చుకుంటాడు. ఆ వాడ వదిలి కలవారింటి అల్లుడవుతాడు. కోకిలమ్మ మనసు గాయపడుతుంది. కన్నీళ్లు రానివ్వకుండా ఆ దుఃఖాన్ని జీవితాన్ని ఈదే శక్తిగా మలచుకుంటుంది. తన పక్కింట్లోనే ఉంటున్న ఓ అవిటి స్నేహితురాలు భర్తను పోగొట్టుకుంటే ఆమెకు అండగా నిలుస్తుంది. ఆ గాయకుడు తన భార్యతో వెళ్తున్న కారు మొరాయిస్తే చేతుల్లేని తన స్నేహితురాలి సహాయంతో ఆ కారుని తోసి అతణ్ణి ముందుకు నడిపించి తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని వినిపిస్తుంది. ఇవీ.. ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో స్త్రీని శక్తి స్వరూపిణిగా చూపించిన చిత్రాలు. సినిమారంగంలోని విద్యార్థులకు సిలబస్‌గా స్థిరపడ్డ విజువల్ పుస్తకాలు. – సరస్వతి రమ -
జయసుధకు అభినయ మయూరి బిరుదు ప్రదానం
-
విశాఖలో నా ఫ్యాన్స్ ఎక్కువ
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమాల్లో గుర్తింపు వచ్చిన తరువాత తన మొదటి ఫ్యాన్స్ అసోసియేషన్ వైజాగ్‌లోనే ఏర్పాటయిందని నటి జయసుధ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా సుబ్బరామిరెడ్డి లలిత కళాపీఠం ఆధ్వర్యంలో నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును పోర్టు ఆడిటోరియంలో మంగళవారం అందజేశారు. బిరుదు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అభిమానుల్లో ఎక్కువ మంది విశాఖలోనే ఉన్నారన్నారు. అలాంటి విశాఖలో గొప్ప బిరుదు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టీఎస్సార్ నిరంతరం కళాకారులను ప్రోత్సహించడమే అలవాటుగా మార్చుకున్నారన్నారు. అంతేకాకుండా విశాఖను ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించి ఉండరని చెప్పారు. ఇంత మంది ప్రముఖుల మధ్య తనకు అభినయ మయూరి బిరుదు ప్రదానం చేయడం చాలా మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. ముందుగా టీఎస్సార్ ఓంకారం నాదంతో కార్యక్రమం ప్రారంభించారు. నటి ఉర్వశి శారద మాట్లాడుతూ టీఎస్సార్ చాలా మందికి సహాయం చేస్తారని కాని ఆవిషయం ఎప్పుడు చెప్పుకోని గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ రోజా మాట్లాడుతూ అన్ని రంగాల్లో విజయం సాధించిన వ్యక్తి టీఎస్సార్ అన్నారు. వైజాగ్ అంటే మొదట బీచ్ ఆ తరువాత టీఎస్సార్ గుర్తుకు వస్తారన్నారు. నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో టీఎస్సార్ ఒకరు అన్నారు. గత 14 ఏళ్లుగా ఆయన జన్మదిన వేడుకలకు విశాఖకు రావడం జరుగుతోందన్నారు. మాజీ ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ మరో శ్రీకృష్ణదేవారాయులు టీఎస్సార్ అన్నారు. నిరంతరం కళాకారులను ప్రోత్సహించడంలో టీఎస్సార్ తరువాతే ఎవరైనా అన్నారు. జయసుధ నటన చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. అందుకే ఆమె సహజనటి అయిందని కొనియాడారు. రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ టీఎస్సార్ జన్మదిన వేడుకలు తెలుగు పండుగతో సమానమన్నారు. చాలా మంది ప్రముఖులు ఆయన జన్మదినం కోసం విశాఖకు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, టీజీ వెంకటేష్, రామకృష్ణరాజు, ఎంవీవీ సత్యనారాయణ, నటి జీవిత, ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గొల్లబాబూరావు, నాగిరెడ్డి, గంటా శ్రీనివాస రావు తదితులు పాల్గొన్నారు. జయసుధ ఎందరికో ఆదర్శం మన జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు.అందులో కొంత మంది మాత్రమే బంధువులు అవుతారని నటి రాధిక అన్నారు. అలాంటి స్నేహితురాలే జయసుధ అన్నారు. జయసుధకు ఈ రోజు ఈ బిరుదు ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జయసుధ తనకు ఫోన్ ఈ కార్యక్రమానికి రావాలని పిలిచిందన్నారు. సహజనటి జయసుధను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. మా నిధుల సేకరణ టీఎస్సార్ నిర్వహించాలి : రాజశేఖర్ రాజకీయ, సినీ ప్రముఖులను అందర్నీ ఒకే చోట తీసుకురావడంతో టీఎస్సార్‌ను మించిన వారు ఎవరూ లేరని నటుడు రాజశేఖర్ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం చేపట్టబోయే నిధుల సేకరణ కార్యక్రమాలను కూడా టీఎస్సార్ నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సినీ పరిశ్రమకు వైజాగ్ వరం వైజాగ్ ప్రజలను ప్రతి సంవత్సరం కలిసేందుకే టీఎస్సార్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అని అనిపిస్తుందని నటి జయప్రద అన్నారు. సినీ పరిశ్రమకు వైజాగ్ ఓ వరమన్నారు. జయసుధతో కలిసి అనేక సినిమాల్లో నటించానని, ఆమె అద్భుత నటి అని కొనియాడారు. నవ్వులు పూయించిన శరత్ కుమార్ నటుడు శరత్ కుమార్ తన మాటలతో నవ్వులు పూయించారు. టీఎస్సార్ ఈ వయస్సులో కూడా తన వాయిస్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నారన్నారు. 46 ఏళ్ల పాటు సినీ పరిశ్రమలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జయసుధ రాణించడం అభినందనీయమన్నారు. సెప్టెంబర్ 17న సినీ పరిశ్రమలో ప్రముఖులు అంత ఎక్కడ ఉంటారు అంటే విశాఖలోనే అని గత కొన్నేళ్లుగా రుజువు అవుతుందన్నారు. -
నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు
‘‘ఇన్నేళ్ల నా సినీ జీవితంలో అతి పెద్ద గిఫ్ట్ అంటే అభినయ మయూరి బిరుదే’’ అని సహజ నటి జయసుధ అన్నారు. విశాఖలో మంగళవారం టి.సుబ్బిరామిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నటి జయసుధకు అభినయ మయూరి బిరుదును ప్రదానం చేశారు. ఈ సందర్బంగా జయసుధ మాట్లాడుతూ – ‘‘నన్ను సినీ పరిశ్రమలోకి తీసుకు వచ్చిన విజయనిర్మల (దివంగత నటి, దర్శకురాలు) ఆంటీ ఈ బిరుదు ప్రదానోత్సవంలో లేకపోవటం నాకు చాలా వెలితిగా ఉంది. నా తొలి సినిమా ‘పండంటి కాపురం’లో జమున నా తల్లి పాత్ర పోషించారు. అప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఇన్నేళ్ల తరువాత నా బిరుదు ప్రదానోత్సవంలో ఆమె పాల్గొనటం చాలా అదృష్టంగా భావిస్తున్నా. సినీ జీవితంలో చాలా మంది స్నేహితులు ఉంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే మన నిజ జీవితంలో కూడా ఉంటారు. నాకు జయప్రద, రాధిక, మురళీమోహన్ అలాంటివారే. వారు నా జీవితంలోని అన్ని విషయాల్లో భాగస్వామ్యంగా ఉన్నారు. గత 40 ఏళ్లుగా టీఎస్సార్ (టి. సుబ్బిరామిరెడ్డి) నిర్వహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఏనాడూ ఆయన్ని నేను ఏమీ అడగలేదు. కానీ ఇంత మంది ప్రముఖల సమక్షంలో నాకు ఈ బిరుదు ప్రదానం చేసి నాలోని ఉత్సహాన్ని నింపారు. ఆయన తన పుట్టిన రోజు వేడుకలను ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ వైజాగ్ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. అందుకే అన్ని వేడుకలు విశాఖలోనే జరుపుకుంటారు’’ అన్నారు. వేదికపై ప్రసంగిస్తున్నప్పుడు నటుడు రాజశేఖర్ పేరు చెప్పబోయి రాజశేఖర్ రెడ్డి అని జయసుధ సంభోదించారు. దీనితో వైఎస్సార్ ఆశీస్సులు కూడా తనపై ఉన్నాయని అందుకునే తన నోట వెంట ఆయన పేరు వచ్చిందని జయసుధ అన్నారు. ►నటి జమున మాట్లాడుతూ – ‘‘జయసుధను ఎందుకు అందరూ సహజ నటి అంటారు.. మేము కాదా అనిపించేది. కానీ ఆమె తక్కువ మేకప్‌తో ఎక్కవ నటన ప్రదర్శించి ప్రేక్షకుల మనస్సులను దోచుకోవటం వలనే ఆ బిరుదు వచ్చిందని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కళాకారులకు ఇలాంటి అవార్డులు, బిరుదుల ప్రదానం వలన ప్రోత్సాహం, ఎంతో ఉత్సాహం లభిస్తుంది’’ అన్నారు. ►నటి శారద మాట్లాడుతూ – ‘‘ఒక చిత్రంలో నేను జయసుధ చెంప పై గట్టిగా కొట్టాలి. ఆ సన్నివేశంలో ఆమె నటించిన తీరు ఆద్భుతం’’ అని చెప్పారు. కళ ఒక మహాశక్తి: టీఎస్సార్ టి. సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ –‘‘కళ ఒక మహా శక్తి అని నేను నమ్ముతాను. అందుకే కళాకారులను ప్రోత్సహిస్తాను. సర్వమతాల సారాంశం ఒక్కటే. అందుకే అన్ని మతాల గురువులను సన్మానించాను. అందరూ ప్రతీ సంవత్సరం జన్మదినం జరుపుకుంటారు. అయితే అటువంటి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేలా చేసుకోవాలని ఆలోచించుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు నాకు మంచి స్నేహితుడు. ఆయన స్ఫూర్తితోనే ఈ విధంగా నలుగురి మధ్యలో నా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఏం సాధించాం, ఏం సా«ధించబోతున్నాం అని నెమరువేసుకుంటాను. కొన్నేళ్లుగా ఇలా విశాఖ నగరవాసుల మ«ధ్యనే ఈ వేడుకలు జరుపుకుంటూ గొప్ప గొప్ప కళాకారులను సన్మానిస్తున్నాను. ఈ ఏడాది జయసుధకు అభినయ మయూరి బిరుదు అందించడం ఆనందంగా ఉంది. జయసుధ సౌమ్యురాలు. ఆమె అందరికీ మంచి స్నేహితురాలు. ఆమె అన్ని పాత్రల్లోనూ జీవించారు’’ అని చెప్పారు.ఈ వేడుకల్లో భాగంగా జయసుధకు బంగారు కంకణాన్ని బహుకరించారు. 20 నిముషాలపాటు టీఎస్సార్ చేసిన ఓంకారం వీక్షకులను ఆకట్టుకుంది.ఈ వేడుకలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, హాస్యనటుడు బ్రహ్మానందం, రాజశేఖర్, శరత్ కుమార్, జయప్రద, రాధిక, జీవిత, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన ప్రేమకోసం...
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో, సుమన్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ‘సెర్చింగ్ ఫర్ ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. మురళి రామస్వామిని దర్శకత్వంలో ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గశ్రీ ఫిలింస్‌తో కలిసి పి.ఎస్.రామకృష్ణ (ఆర్.కె) నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబటి రామకృష్ణ విడుదల చేశారు. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, రొమాన్స్, కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి పాత్ర కనెక్టయ్యేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో ఆడియోతో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పి.ఎస్.రామకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్ పండిట్, జియస్ రావ్, వై. వెంకటలక్ష్మి. -
నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం
‘‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ నా కూతురిగా నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నటి జమున అన్నారు. వీబీ ఎంటర్టైన్మెంట్స్పై ఆరేళ్లుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు బొప్పన గత రెండేళ్లుగా వెండి తెర అవార్డులను కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జమునకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్టు, జయసుధకు లెజెండరీ అవార్డుతో పాటు పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘పండంటి కాపురం’లో జమునమ్మకు కూతురిగా నటించాను. నలభై ఏళ్ల తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ధన్యవాదాలు. వారు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు విష్ణు బొప్పన. ‘‘నాకు ఆల్ రౌండర్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాబూమోహన్. ‘‘బెస్ట్ డైలాగ్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఫ్యామిలీ మూవీగా ‘సమ్మోహనం’ చిత్రానికి వీకే నరేశ్, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇషా రెబ్బా, ‘ఎఫ్ 2’కి కమెడియన్‌గా రఘుబాబు ఇలా పలువురు తారలకు అవార్డులను ప్రదానం చేశారు. -
అందరూ మహానటులే
‘‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగార్లు ధ్రువతారలు. ఏ వేడుకలకు పిలిచినా వచ్చేవారు. అవార్డులు ఇస్తే తీసుకునేవారు. కానీ నేటి తరంలో కొందరు కళాకారులు పబ్లిక్‌లోకి వచ్చి అవార్డులు అందుకోవడం వల్ల తమ గౌరవం తగ్గిపోతుందన్నట్లుగా భావిస్తున్నారు. అది సరైనది కాదు. వారు ఎన్టీఆర్, ఏయన్నార్ల క్రమశిక్షణను ఫాలో కావాలని కోరుకుంటున్నాను’’ అని కళాబంధు, టీఎస్సార్ లలిత కళాపరిషత్ వ్యవస్థాపకులు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘అభినయ మయూరి’ అనే బిరుదుతో ప్రముఖ నటి జయసుధను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాల గురించి హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలామంది సినిమాను, కళాకారులను అపార్థం చేసుకుంటుంటారు. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉన్న దైవశక్తి ఇంకెందులోనూ లేదు. నటీనటులు, దర్శకులు, రచయితలు, గాయకులు.. ఇలా అందరూ కలిస్తేనే మనం సినిమాను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నేను సంతోషంగా ఉండటానికి కారణం కళాకారులను ప్రోత్సహించుకోవడమే. కళని ఒక ఈశ్వరశక్తిగా భావించే వ్యక్తిని నేను. గత ఏడాది జమునగారిని సన్మానించాం. ఈ ఏడాది ఈ నెల17న ‘అభినయ మయూరి’ బిరుదుతో జయసుధగారిని సత్కరిస్తున్నాం. దాదాపు 46ఏళ్ల సినిమా ప్రస్థానం ఉన్న ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్నారు. మనమందరం గర్వించదగ్గ నటీమణి ఆమె. 16న ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. ‘‘తిరుపతి’ సినిమాలో నేను, జయసుధగారు కలిసి నటించాం. ‘జ్యోతి’ సినిమాతో ఆమెకు పెద్ద పేరు వచ్చింది. సుబ్బరామిరెడ్డిగారు జయసుధగారికి ఈ అవార్డు ఇవ్వబోతుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో అవార్డు ఫంక్షన్స్‌ను కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు అవార్డులు ఇవ్వడం లేదు. నంది అవార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా గుర్తించి అవార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సుబ్బరామిరెడ్డిగారికి కళలన్నా, కళాకారులన్నా మంచి అభిమానం. మహానటి అంటే మనమందరం ఒకరే అనుకుంటాం. కానీ అందరూ మహానటులే. లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఎక్కువ కాలం నిలబడలేం. జమునగారి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. గొప్పనటి జమునగారు నన్ను మహానటి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా కష్టపడుతున్నందుకు కళాకారులకు అవార్డులనేవి గుర్తింపు. కొన్ని అవార్డ్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అవార్డ్స్ ఇవ్వండి.. మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? వేడుకలకు, ప్రారం భోత్సవాలకు, స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాం. స్వచ్ఛభారత్ అంటూ ఊడ్చుతాం. ఇలా అన్నీ చేస్తాం. మమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇండస్ట్రీలో ఇద్దరు సోదరులు.. ఒకరు మురళీమోహన్‌గారు, మరొకరు మోహన్‌బాబుగారు. వీరితో ఎన్నో సినిమాలు చేశాను’’ అన్నారు. ‘‘ఇంతమంది కళాకారులను ప్రోత్సహిస్తూ తనకు సినిమాల పట్ల, సినిమా పరిశ్రమల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు సుబ్బరామిరెడ్డిగారు. కళాకారులను మర్చిపోకుండా గౌరవిస్తున్నారు. మురళీమోహన్‌గారు అందాల హీరో. ఆయన ఇప్పుడు తెల్ల జుత్తుతో ఉంటే మాకు నచ్చడం లేదు (నవ్వుతూ). ‘పండంటి కాపురం’ సినిమాలో నా కూతురిగా నటించారు జయసుధ. మా అమ్మాయి నటిగా ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి జమున. -
ఏపీ యాక్టర్లకు ఏపీలో ఏం పని?
-
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీనటి జయసుధ
-
ఎవరెన్ని కుట్రలు చేసిన జగనే సీఎం
-
ప్రజల కష్టాలు జగన్‌కు తెలుసు
సాక్షి, అమరావతిబ్యూరో: రాష్ట్ర ప్రజల కష్టాలేంటో 14 నెలలపాటు 3,648 కి.మీ. పాదయాత్ర చేసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలుసని, జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని సినీ నటి, వైఎస్సార్సీపీ నాయకురాలు జయసుధ తెలిపారు. ఆదివారం విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీలో చేరానన్నారు. పార్టీలో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందన్నారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ ఎంత కష్టపడ్డారో చూశానని, అతన్ని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా వెనకడుగు వేయలేదని, నమ్మకం కోల్పోలేదని తెలిపారు. వైఎస్సార్‌లా పాదయాత్ర చేసి వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకున్నారని, ప్రజలు కూడా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్ జగన్ మాటమీద నిలబడే వ్యక్తి అనితెలిపారు. అందుకు ఆయన ప్రకటించిన నవరత్నాలే నిదర్శనమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకాలు ఉపయోగపడతాయని చెప్పారు. అందుకోసం జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అనుభవమున్న సీఎం ఏమీ చేయలేదు ‘నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయారు. పదేళ్లుగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ.. ప్రజల మధ్యే ఉంటూ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే ఎక్కువ అనుభవం గడించారని, జగన్‌ను సీఎం చేయడానికి ఇదే సరైన సమయమని అన్నారు. సినీ పరిశ్రమకు వైఎస్సార్ ఎంతో మేలు చేశారని, అందుకే ఆయన కుమారుడు వైఎస్ జగన్ అంటే సినీ పరిశ్రమలో ఉన్న వారందరికి అభిమానమన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనకు అండగా సినీ పరిశ్రమలో ఉన్న 80 శాతం మంది నిలిచారని చెప్పారు. చంద్రబాబును పవన్ అనుసరిస్తున్నారు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పినట్లుగా హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజలు ఎటువంటి ఇక్కట్లు పడలేదని, అందరూ సంతోషంగా ఉన్నారని జయసుధ తెలిపారు. పవన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబును అనుసరిస్తుంటారని, అందుకే బాబు మాదిరిగానే జగన్‌పై పవన్‌కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని జయసుధ విమర్శించారు. -
‘జగన్‌ను సీఎం చేయడం మన బాధ్యత’
-
‘జగన్‌ను సీఎం చేయడం మన బాధ్యత’
సాక్షి, విజయవాడ : పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారని.. ఆయన్ను సీఎం చేయడం మన బాధ్యత అని ప్రముఖ సినీ నటి, వైఎస్సార్సీపీ నేత జయసుధ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందన్నారు. మహానేత వైఎస్సారే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అందుకు ఇదే సరైన సమయమని, వైఎస్ జగన్‌ను సీఎం చెయ్యడమే ప్రజలు తీసుకునే సరైన నిర్ణయమని అది ధర్మం కూడా అని పేర్కొన్నారు. 9ఏళ్లు ప్రజల మధ్యే గడిపిన జగన్.. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. వెనక్కి తగ్గని దృఢమైన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఐదేళ్లు చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ కూడా అమలు చేయలేకపోయారన్నారు. ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సినిమా రంగానికి ఏమీ చెయ్యలేదనీ, ప్రస్తుతం సినీ రంగానికి చెందిన వారిలో 80శాతం మంది జగన్‌కు మద్దతిస్తున్నారన్నారు. కేసీఆర్ ఫోర్స్ చేస్తే.. సినీరంగానికి చెందిన వాళ్లు జగన్‌కు మద్దతిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సినీ రంగానికి చెందిన వ్యక్తులు మనస్ఫూర్తిగా ఎవరికైనా మద్దతిస్తారన్నారు. చెప్పింది ఖచ్చితంగా చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైఎస్ జగన్ అని, వైఎస్సార్‌లాగానే మెరుగైన పాలన అందిస్తారన్నారు. తెలంగాణపై పవన్ వ్యాఖ్యలు నిజం కాదన్నారు. రాజకీయం కోసం ఒక రాష్ట్రంపై నిందలు వెయ్యడం సరికాదన్నారు. తెలంగాణలోని ఆంధ్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాజకీయాల్లో పవన్, చంద్రబాబును ఫాలో అవుతున్నారని, చంద్రబాబు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ తిరిగి చెబుతున్నారన్నారు. -
ఊటీ... చుక్కలేంటి? దెయ్యాన్నే చూపించింది: జయసుధ
మనం మంచిగా ఉన్నామంటేమనల్ని ఎంతోమంది మంచి మనసుతో దీవించారని.నిజానికి మంచితనం వ్యాపించినంతగా చెడు విస్తరించలేదు.ఈ విషయం వై.ఎస్. కుటుంబాన్ని చూసినప్పుడు జయసుధకు అర్థమైందట. స్వచ్ఛమైన మనసుతో కూడిన గొప్ప ఆకాంక్ష ఎప్పుడూ.. గొప్ప మంచినే చేస్తుంది. అనుభవం కన్నా ఉద్దేశం గొప్పది. ఉద్దేశం ఉంటే సంకల్పం ఉంటుంది. ‘‘సంకల్పం ఉంటే క్షేమం, సంక్షేమం.. రెండూ ఉంటాయి’’ అని అంటున్న సినీ నటి జయసుధతో ‘ఫ్యామిలీ’ ఇంటర్వ్యూ. 14 ఏళ్ల వయసులో నటిగా స్క్రీన్‌పై కనిపించి, 47 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌తో విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇప్పుడేం సినిమాలు చేస్తున్నారు? జయసుధ: ఏం చేస్తున్నానా? రెండు సినిమాలు వదులుకున్నాను. ఒకటి తమిళ సినిమా. కార్తీ హీరో. లొకేషన్ అంటే ఉన్న ఫోబియా వల్ల ఆ సినిమా వదులుకున్నా. అది చల్లని లొకేషన్ ఊటీ (నవ్వుతూ). ఊటీలో షూటింగా? కుదరదండీ అన్నాను. సమ్మర్ కదా అని అలా అన్నానేమో అనుకున్నారు. ‘అక్కడ చాలా చల్లగా ఉంది మేడమ్’ అన్నారు. విషయం చల్లదనం గురించి కాదు.. వేరే కథ ఉందిలే అనుకుని నవ్వుకున్నాను. వేరే కథ ఏంటి? లొకేషన్ ఫోబియాతో సినిమా వదులుకున్నారా? అప్పట్లో ఎక్కువ షూటింగ్‌లు ఊటీలో జరిగేవి. అయితే ఎప్పుడు ఊటీ వెళ్లినా హెల్త్ ఇష్యూ వచ్చేది. ఒకటి షూటింగ్ ఆగిపోవడమో, ఆరోగ్యం పాడవ్వడమో లేకపోతే వేరే ఏదైనా సమస్య... ఏదో ఒకటి జరిగేది. ఆ పరంగా ఊటీకి చాలా కథలున్నాయి. ముఖ్యంగా నాకు ఆరోగ్యపరమైన ఇబ్బంది ఎదురయ్యేది. ఒకసారైతే చాలా సీరియస్ అయింది. దాంతో ఇక ఊటీ వద్దురా బాబూ అనే ఫీలింగ్ వచ్చింది. ‘కాలాంతకుడు’ షూటింగ్ ఊటీలో జరిగినప్పుడైతే నాకు ఫుల్ ఫీవర్. జయలలితగారు ఓ తమిళ సినిమా కోసం వచ్చారు. ఆవిడకు ఆ రోజు షూటింగ్ లేదు. నాకేమో జ్వరం వచ్చి షూటింగ్ చేయలేకపోయాను. నాన్నగారు కర్చీఫ్లో యుడికులాన్ వేసి, తలమీద పెడుతుండేవారు. అప్పుడు జయలలితగారు వచ్చి, ఓ గంట సేపు కూర్చున్నారు. నాన్నగారు చేసినట్లే నాకు సపర్యలు చేశారు. మా అందరి మధ్య అంత మంచి వాతావరణం ఉండేది. మీకు మాత్రమేనా? ఊటీ వేరే స్టార్స్‌కీ చుక్కలు చూపించిందా? చుక్కలేంటి? దెయ్యాన్నే చూపించింది (పెద్దగా నవ్వుతూ). ఆ రోజుల్లో బాత్రూమ్లవీ ఉండేవి కాదు కదా. చెట్టు వెనకాల ఓ డ్యాన్సర్ టాయ్‌లెట్‌కి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా బిహేవ్ చెయ్యడం మొదలుపెట్టింది. దెయ్యం పట్టిందన్నారు. దెయ్యాలంటే నాకు నమ్మకంలేదు. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాను. అలా ఊటీ నన్ను మాత్రమే కాదు... చాలామందిని ఇబ్బందులపాలు చేసింది. మరి చివరిసారిగా ఊటీ ఎప్పుడు వెళ్లారు? ‘యువకుడు’ సినిమాకి వెళ్లాను. అది కూడా మా ఆయన (నితిన్‌కపూర్), కొడుకులతో (నిహార్, శ్రేయాన్) వెళ్లాను. మొత్తం ఫ్యామిలీ వెళ్లాం. ఏం జరుగుతుందో ఏమో అని ఒకటే భయం. షాట్లో డైలాగ్ చెప్పడానికి మాత్రమే నోరు తెరిచేదాన్ని. ఆ తర్వాత అంతా సైలెంట్. మనసులోనే ‘దేవుడా.. దేవుడా...’ అనుకునేదాన్ని, ఏదైనా చెడు జరుగుతుందేమోనని మనసులో ఒకటే ఫీలింగ్. ఏమీ జరగకుండా బయటపడ్డాం. ఇంతకుముందు చెప్పినట్లు నాకు దెయ్యాలంటే నమ్మకం లేదు. కానీ ఊటీలో షూటింగ్ చేసినప్పుడు మాత్రం వెనకాల ఎవరో ఉన్నట్లు అనిపించేది. మీరు వదులుకున్న ఇంకో సినిమా ఏంటి? మోహన్‌లాల్ చేస్తున్న మలయాళ సినిమా. పీరియాడికల్ మూవీ అన్నారు. భారీసెట్లు, స్మోక్ ఎఫెక్టులు ఉంటాయని తెలిసింది. స్మోక్ అంటే నాకు అలర్జీ వచ్చేస్తుంది. పైగా సమ్మర్. మాంచి ఎండ తగిలితే కళ్లు తిరిగి పడిపోతా. అందుకని ఆ సినిమా వదులుకున్నా. ఎన్నోఏళ్ల నుంచి మేలో షూటింగ్ చేయడం మానేశాను. ఇలా వదిలేసుకుని, ఆ తర్వాత ఎందుకు వదులుకున్నానా? అని ఫీలైన సినిమాలేమైనా ఉన్నాయా? ఒక్క ‘సాగర సంగమం’ సినిమా అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను. ఆ సినిమాకి ముందు నన్నే తీసుకున్నారు విశ్వనాథ్‌గారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. డేట్స్ కూడా కన్ఫార్మ్ చేసేశాను. అయితే కమల్‌హాసన్ డేట్స్ విషయంలో కొంచెం అటూ ఇటూ అవ్వడంతో నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. అప్పటికి ఆ డేట్స్‌ని రామారావుగారు, నాగేశ్వరరావుగారి సినిమాలకు ఇచ్చాను. ఆ ఇద్దరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ‘సాగర సంగమం’ వదులుకున్నాను. అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాను. అంటే.. ఇప్పుడు మిమ్మల్ని ఏ సినిమాలో చూడగలుగుతాం? ‘మహర్షి’ సినిమా చేస్తున్నాను. తర్వాత ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే సినిమా ఒకటి. నరేశ్ కొడుకు నవీన్ ఈ సినిమాలో హీరో. ఇంకో సినిమా ఉంది. కథ చాలా బాగుంది. దాని గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చాక చెబుతాను. ఓకే.. ఎండలంటే పడవన్నారు. ఇప్పుడు పొలిటీషియన్‌గా ఎండల్లో ఎలా ప్రచారం చేస్తారు? బై గాడ్స్ గ్రేస్ ఈసారి మే ఎండల నుంచి ఎస్కేప్. ఏప్రిల్‌లోనే ఎలక్షన్స్ కాబట్టి ఫర్వాలేదు. మే ఎండలకంటే ఏప్రిల్ ఎండలు తక్కువే కదా. ఈ నెలాఖరున ప్రచారం మొదలుపెడతానేమో. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరడానికి కారణం ఏంటి? నిజానికి పాలిటిక్స్‌లో ఉండాలా? వద్దా అనే మీమాంసతో జరిగిన మార్పు అది. ‘ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి ఓడిపోవడానికి కారణం మీరు కాదు. రాష్ట్ర విభజన’ అని నా సన్నిహితులు అన్నారు. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ యాక్టివ్‌గా లేకపోవడంతో నాకేం చేయాలో పాలుపోని స్థితి. దాంతో 2015 ఎండ్లోనో, 2016 బిగినింగ్లోనో.. సరిగ్గా గుర్తు లేదు. టీడీపీలో జాయిన్ అయ్యా. కారణం ఏంటంటే... మా తల్లిదండ్రుల తరఫు వాళ్లది ఆంధ్ర, రాయలసీమ. కాబట్టి మీరు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలంటే, తెలుగుదేశంలో చేరితే మంచిదని కొంతమంది సలహా ఇచ్చారు. సరే.. అని టీడీపీలో చేరాను. వేరేవాళ్ల సలహా పాటించడం ఏంటి? మీ సొంత నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? మళ్లీ టీడీపీ నుంచి ఎందుకు వచ్చేశారు? నేను రాజకీయాల్లోకి చేరేనాటికి వాటి మీద నాకు కనీస అవగాహన లేదు. 2014 నాటికి కాస్త అవగాహన వచ్చినప్పటికీ.. సన్నిహితులు ఇచ్చిన సలహా కరెక్టేనేమో అనిపించి పాటించాను. మళ్లీ తెలుగుదేశం వీడడానికి కారణం.. అక్కడ నాకు ఏ బాధ్యతా అప్పగించకపోవడమే. వెళ్లటం వెళ్లటమే నేనేమీ మినిస్ట్రీ కోరలేను కదా.. అలాగని ఏ బాధ్యతా లేకుండా కూడా ఖాళీగా ఉండలేం. అందుకని ఏదో ఒక రోల్ ఇవ్వమని అడిగాను. ‘డెఫినెట్‌గా ఇస్తాను’ అన్నారు. ఆ తర్వాత ‘ఇంటర్నేçషనల్ ఉమన్ ఫెస్టివల్’కి పిలిచారు. లేపాక్షి ఉత్సవాలకు పిలిచారు. నంది అవార్డ్సు కమిటీకి చైర్ పర్సన్‌గా పెట్టారు. అంతే తప్ప స్పెసిఫిక్ రోల్ ఏదీ ఇవ్వలేదు. ఏ పనీ లేకుండా ఊరికే వెళ్లి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్ చెప్పే టైప్ కాదు నేను. అలా రెండేళ్లు గడిచాయి. ఏ పోస్ట్ లేదు. మధ్యలో నా పర్సనల్ లైఫ్ (భర్త చనిపోవడం గురించి)లో పెద్ద కుదుపు. ఓ ఆరేడు నెలలు షూటింగ్‌లు చేయలేదు. కానీ అప్పటికే కమిట్ అయిన సినిమాలుండటంతో మళ్లీ షూటింగ్స్ మొదలుపెట్టాను. ‘అసలు ఇక్కడే ఉన్నారా? మీరు యాక్టివ్‌గా ఉండాలి. మీరు బయటకు రావాలి’ అంటూ ఏదో నేను యాక్టివ్‌గా లేనట్లు ఆ పార్టీవాళ్లు అనడంతో, ‘నేను యాక్టివ్గానే ఉన్నాను, ఇప్పటికి మూడు సినిమాలు కంప్లీట్ చేశాను’ అన్నాను. ఇక ఆ పార్టీలో బాధ్యత దొరకడం అయ్యే పని కాదు, బయటకు వస్తే బెటర్ అనుకున్నాను. మనల్ని గుర్తించనప్పుడు అక్కడ ఉండటం వేస్ట్ అనుకున్నాను. అంతకుముందు వేరేవాళ్ల సలహాలు కూడా తీసుకున్నాను. కానీ ఈసారి నా అంతట నేనే డెసిషన్ తీసుకున్నాను. నన్ను పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డిగారు కాబట్టి వైఎస్సార్సీపీలోకి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి వ్యక్తిత్వం గురించి? ఎమ్మెల్యే అయ్యాక క్యాంప్ ఆఫీసుకి వెళ్లేవాళ్లం కదా. గంటా గంటన్నర ఉండేదాన్ని. అప్పుడు రాజశేఖర్ రెడ్డిగారు ‘ఆమెను అలా తీసుకొచ్చి ఎక్కువసేపు ఆఫీసులో కూర్చోబెట్టకండి.. ముందు రమ్మనండి.. త్వరగా పంపించేయండి. లేకపోతే ఆలస్యంగా రమ్మనండి’ అని అక్కడున్నవాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంత గౌరవించేవారు. డిగ్నిఫైడ్‌గా బతకాలనుకునే నాలాంటివాళ్లకు ఎన్ని కోట్లు ఇస్తారు? అనేది కాదు. నాకు గౌరవం ఇచ్చారంటే అదే వందల కోట్లతో సమానం. క్యాంప్ ఆఫీసులో ఒకసారి గంట కూర్చున్నాక డోర్ తెరుచుకుని లోపలికి వెళ్లగానే ‘ఏమ్మా.. ఎక్కువసేపు కూర్చోబెట్టేశానా?’ అని సౌమ్యంగా మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న ఆయన్ను ఎంతోమంది కలుస్తారు. ఆలస్యం అవుతుందనుకోవచ్చు. కానీ ‘ఇవాళ చాలామంది ఉన్నారమ్మా’ అని నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా వ్యక్తి మనకోసం వెయిట్ చేశారని గుర్తించారు. అది నాకు చంద్రబాబు నాయుడిగారి దగ్గర జరగలేదు. ‘ఈసారి డెఫినెట్‌గా ఏదో ఒకటి చేస్తాను’ అని మాటిచ్చాక.. ఆవిడకి మాటిచ్చాను అనేది గుర్తుండాలి కదా? ఒకవేళ వీలు పడకపోతే ‘ఏమ్మా.. ఇప్పుడు కుదరడంలేదు. డిలే అవుతోంది. కొంచెం వెయిట్ చేద్దాం’ అని పిలిపించి చెబితే అది గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. ఇక వైఎస్సార్గారిలానే ఆయన కొడుకు జగన్‌గారు కూడా. ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెబుతున్నాను. నేను ఈ పార్టీ నుంచి వెళ్లినప్పుడు సరైన గైడెన్స్ లేకపోవడంతో వెళ్లాను. మళ్లీ వచ్చినప్పుడు ‘హోమ్ కమింగ్’లా అనిపించింది. ఇప్పుడు వచ్చి జగన్‌గారి దగ్గర నాకది కావాలి.. ఇది కావాలి అని అడగాలనిపించలేదు. ఇప్పుడు నేను కోరుకుంటున్నదేంటంటే.. ఆయన గెలవాలి. సీఎం అవ్వాలి. గెలిస్తే ‘హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ’. నాకా నమ్మకం ఉంది. ఒక్కసారి మాటిస్తే అది నెరవేరుస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి. ఆయన గెలవాలన్నది నా ముఖ్య ఆశయం. ఏపీ అభివృద్ధి గురించి మీ ఒపీనియన్? అసలు జరగాల్సిన పనులు జరగలేదు. నా వరకు తెలిసింది చెబుతున్నాను. బయటకు చాలా గ్రాండ్‌గా జరిగిందని చెప్పుకుంటున్నారు. (మిగతా పక్క పేజీలో) మీ అబ్బాయిల గురించి? మా పెద్దబ్బాయి నిహాల్‌కి పెళ్లి కుదిరింది. లవ్ మ్యారేజ్. నార్త్ అమ్మాయి. పేరు అమృత్. ఈ మధ్యే నార్త్ ఆచారం ప్రకారం నిశ్చితార్థానికి ముందు జరిగే ‘రోకా’ ఫంక్షన్ జరిగింది. ఐయామ్ హ్యాపీ. చిన్నబ్బాయి శ్రేయాన్స్ ఇంటర్నేషనల్ షూటర్ కోచ్. మొన్న మీతోపాటు పార్టీ ఆఫీసుకి మీ పెద్దబ్బాయి వచ్చారు.. తనకి పాలిటిక్స్ అంటే ఆసక్తి ఉందా? అవును.. నాతోపాటు వచ్చాడు. జగన్‌గారు ‘వాట్? యు వాంట్ టు కమ్.. ఆర్ యు ఇంట్రస్టెడ్’ అంటే ‘యస్.. సార్’ అన్నాడు. వాడు మాస్ కమ్యూనికేషన్ చదువుకున్నాడు. షార్ట్ స్టోరీలవీ రాస్తుంటాడు. సినిమాల్లోను, విడిగా మీరు కట్టుకునే చీరలు, వేసుకునే డ్రెస్సులు బాగుంటాయి. విడిగా మీరే డిజైన్ చేసుకుంటారు. సినిమా కాస్ట్యూమ్స్ కూడా మీరే చేసుకుంటారా? నా సినిమాలన్నింటికీ దాదాపు 30, 35 ఏళ్ల నుంచి నేనే డిజైన్ చేసుకుంటున్నాను. జయసుధ శారీస్, బ్లౌజెస్ అంటే ఫేమస్. పాట కూడా ఉంది.. జయసుధ బ్లౌజెస్ అని. ఈవెన్ మణిరత్నంగారి సినిమాకి కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. క్యారెక్టర్ విన్నాక దానికి తగ్గ కాస్ట్యూమ్స్‌ని నేనే డిజైన్ చేసుకుంటాను. నాకు చీరల డిజైనింగ్ అంటే ఇష్టం. ఎగ్జిబిషన్లు ఇష్టంగా పెడతాను. ఆర్టిఫిషియల్ జ్యుయలరీ ఎగ్జిబిషన్ పెట్టాలని ఉంటుంది. కన్స్ట్రక్షన్స్ అంటే ఇష్టం. ఎక్కడైనా కొత్త బిల్డింగ్ కట్టడం చూస్తే.. ఎలా కడుతున్నారో చూడ్డానికి వెళుతుంటాను. అలా 100, 150 బిల్డింగ్‌ల వరకూ చూశాను. నన్నక్కడ చూసినవాళ్లు ఫ్లాట్ కొనుక్కోవడానికి వెళ్లానని చెప్పుకునేవాళ్లు. అలా చూస్తే ఇప్పుడు 150 ఫ్లాటులు కొన్నట్లు లెక్క (నవ్వుతూ). ‘అమ్మా... నీ పిచ్చి కాకపోతే.. నువ్వు అలా చూడ్డానికి వెళితే అన్ని ఇళ్లూ కొంటున్నావనుకుంటున్నారు’ అని పిల్లలు అంటుంటారు. -
వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని, పార్టీ అధ్యక్షుడి సూచనల మేరకు ఎన్నికల్లో ప్రచారం చేస్తానని మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ తెలిపారు. ఆమె గురువారం తన కుమారుడు నీహార్ కపూర్‌తో కలసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఈ సందర్భంగా జయసుధకు, ఆమె కుమారునికి పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తనకు లేదని, ఏ నిర్ణయమైనా పార్టీ అధ్యక్షుడిదే అంతిమమని పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సినీ నటులు జగన్‌ను కలవడాన్ని, పార్టీలో చేరడాన్ని చంద్రబాబు విమర్శిస్తున్నారన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు నోటి నుంచి అలాంటి మాటలు రాకూడదన్నారు. సినిమా వాళ్లు ఎందుకు జగన్‌ను కలవకూడదు? అయినా చంద్రబాబు ఇంటి వాళ్లంతా సినిమా వారే కదా? అని గుర్తు చేశారు. నాడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా చెబితే అలా నడుచుకున్నానని.. ఇప్పుడు కూడా జగన్ చెప్పినట్లు వ్యవహరిస్తానని ఆమె అన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన సినీ నటి జయసుధ
-
వైఎస్సార్ సీపీలో చేరిన జయసుధ
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగలింది. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్ నివాసంలో ఆమె గురువారం భేటీ అయ్యారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ... నేను రాజకీయాల్లోకి రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం. వైఎస్సార్ సీపీలోకి రావడం మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటా. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా. పార్టీలో ఉండి గెలుపు కోసం కృషి చేస్తా. అప్పట్లో ఎంతోమంది ఎన్నికల్లో పోటీ ఉన్నా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను వైఎస్సార్ నిలబెట్టారు. పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరైనా సరే సినిమా వాళ్ల గురించి తక్కువ చేసి మాట్లాడకూడుదు. వృత్తి వేరు ప్రవృత్తి వేరు.’ అని అన్నారు. కాగా జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. జయసుధ ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. -
‘ఎన్టీఆర్’లో ‘ఆర్ఎక్స్100’ భామ!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ.. నటిస్తోన్న చిత్రం ‘ఎన్టీఆర్’. నందమూరి తారకరామారావు జీవిత గాథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. సినీ జీవితాన్ని కథానాయకుడిగా, రాజకీయ జీవితాన్ని మహానాయకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన భాగాన్ని ప్రస్తుతం షూట్ చేస్తోండగా.. ఇందులో ఇప్పటికే పలుతారలు జాయిన్ అయ్యారు. అలనాటి అందాల తార శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్, మహానటి సావిత్రిగా నిత్యా మీనన్, జయప్రద పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. మరికొన్ని పాత్రలకు ఇంకొంత మంది హీరోయిన్లను పరిశీలిస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సహజనటి జయసుధ పాత్రలో ‘ఆర్ఎక్స్100’ భామ పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జయసుధ కాంబినేషన్లో వచ్చిన డ్రైవర్ రాముడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా వీరి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి. ‘ఎన్టీఆర్’ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతుండగా.. డైరెక్టర్ క్రిష్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. -
కంపెనీ సీఈఓగా...!
అమెరికాలో ‘మహర్షి’ ప్రయాణం మొదలవ్వడానికి టైమ్ దగ్గర పడుతోంది. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వనీదత్, ‘దిల్’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్‌బాబు, రవి పాత్రలో ‘అల్లరి’ నరేశ్ కనిపిస్తారు. మహేశ్‌కు తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారు. అమెరికాలో జరగనున్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల 15న స్టార్ట్ అవుతుందని సమాచారం. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇందులో మహేశ్‌బాబు స్టూడెంట్‌గా నటిస్తున్నారని ‘మహర్షి’ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కానీ మహేశ్ క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయని... ఒక షేడ్‌లో స్టూడెంట్‌గా కనిపించే మహేశ్ మరో షేడ్‌లో ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సన్నివేశాలనే అమెరికాలో తీయబోతున్నారట ‘మహర్షి’ టీమ్. అలాగే రెండు సాంగ్స్‌ను కూడా ఈ షెడ్యూల్లోనే కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ‘మహర్షి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హాలిడే కోసం మలేసియాలో ఉన్న సంగతి తెలిసిందే. -
‘మహర్షి’ తల్లి పాత్రపై క్లారిటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. మూడు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమాలో మహేష్ తల్లి పాత్రపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయప్రధ నటించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం నటి జయసుధ తాజా ఇంటర్య్వూలో క్లారిటీ ఇచ్చారు. మహర్షి సినిమాతో తాను మహేష్‌కు తల్లిగా నటిస్తున్నట్టుగా వెల్లడించారు. దీంతో మహర్షి సినిమాలో తల్లి పాత్రలో కనిపించబోయేది జయప్రధ కాదు జయసుధ అని కన్ఫామ్ అయిపోయింది. -
వి'జయ' గాథ
ఆమె పశువైద్యురాలు.. భర్త ఎంబీబీఎస్ డాక్టర్.. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో ఓ యాక్సిడెంట్ చీకట్లు నింపింది. రోడ్డు ప్రమాదం లో భర్తను కోల్పోయిన ఆమె.. మానసికంగా కుంగిపోయి ఉద్యోగం చేయలేకపోయింది. ఆ తర్వాత గుండె దిటవు చేసుకుని ఉన్నత విద్యాభ్యా సం చేసింది. గ్రూప్స్ రాసి డీపీవోగా ఎంపికయ్యింది. ఇటీవలే కామారెడ్డి డీపీవోగా విధుల్లో చేరిన జయసుధ సక్సెస్ స్టోరీ.. బాన్సువాడ: మాది బాన్సువాడ. నాన్న పెర్క రాజారాం పోస్ట్ మాస్టర్. అమ్మ సరోజ. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం, ఇద్ద రు సోదరులు. నేను ఐదో సంతానం. మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో చదివాం. ఐదో తరగతి వరకు బాన్సువాడలోనే చదివా. ఆరో తరగతిలో జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష రాసి ఎంపికయ్యా. అలా 6 నుంచి 12 వరకు నవోదయలో చదివా. ఆ తర్వాత డిగ్రీలో ఎనిమిల్ హస్బెండరీ అండర్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేశా. 2002లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా నాగిరెడ్డిపేట మండలంలో పోస్టింగ్ సాధించా. 2003లో మెదక్‌కు చెందిన ప్రభుత్వ వైద్యుడు కేశవ్‌తో వివాహం జరిగింది. ఉద్యోగం రావడం.. ఎంతో ప్రేమించే భర్త ఉండడంతో నేను ఎంతో సంబరపడ్డా.. అంతా సంతోషంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. డ్యూటీకి వెళ్లిన ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు. పెళ్లయిన తొమ్మిది నెలలకే ఆయన నన్ను విడిచి వెళ్లిపోయారు. అంతా శూన్యమై పోయినట్లు అనిపించింది. మానసికంగా చాలా కుంగిపోయా. ఆ ఊరిలో ఉండి ఉద్యోగం చేయలేక పోయా. చివరకు ఎలాగోలా కోలుకున్నా. ఆ బాధను మరిచి పోయేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నా. ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్లిపోయా. వెటర్నరీ మైక్రోబయోలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశా. వెటర్నరీ బయాలజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో వెటర్నరీ మెడిసిన్స్ తయారీలో నిమగ్నమయ్యా. అలా ఏడేళ్లు గడిచి పోయాయి. 2010లో బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన నాగనాథ్ నా జీవితంలోకి వచ్చారు. ఆయన డిగ్రీ కళాశాల లెక్చరర్. హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా కాలం సాగిపోతోంది. అయితే, ప్రజా సంబంధాలు గల ఉద్యోగం చేస్తూ, ప్రజలకు సేవలందించాలనే తపన నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరాలనుకున్నా. కష్టపడి చదివి 2011లో గ్రూప్స్ పరీక్ష రాశా. ఇంటర్వ్యూకూ సెలక్ట్ అయ్యా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పరీక్షలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రేయింబవళ్లు కష్టపడి చదివి ఇంటర్వ్యూకు ఎంపికైన తర్వాత ఇలా జరగడంతో మానసికంగా కుంగిపోయా. ఆ సమయంలో నాగ్నాథ్ నాకు ఎంతో ధైర్యం చెప్పారు. పరీక్షలకు మళ్లీ సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఆయనిచ్చిన ధైర్యంతో పరీక్షలకు మళ్లీ సన్నద్ధమయ్యా. రోజులో సగభాగం పుస్తకాలకే సమయం కేటాయించా. 2016లో గ్రూప్స్ పరీక్షలు రాశా. ఎట్టకేలకు అనుకున్నది సాధించా. సొంత జిల్లాలోనే డీపీవోగా ఉద్యోగం సాధించా. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. పెళ్లయిన తొమ్మిది నెలలకే భర్త మృతితో కుంగిపోయా. ఎంతో కష్టపడి చదివి రాసిన పరీక్షలు రద్దవడంతో మరింత ఆందోళనకు గురయ్యాయి. కానీ, భర్త నాగ్నాథ్ ప్రోత్సాహంతో గ్రూప్స్‌పై పూర్తి దృష్టి సారించా. రోజూ 12–13 గంటలు చదివే దాన్ని. ఎట్టకేలకు అనుకున్నది సాధించా. మహిళలు ధైర్యంతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు. అందుకు నా జీవితమే ఉదాహరణ. -జయసుద -
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
-
శ్రీదేవి మరో జన్మలోనూ శ్రీదేవిలానే పుట్టాలి
‘‘అందరూ జన్మిస్తారు. జీవిస్తారు. మరణిస్తారు. కొంత మంది మరణించినా శాశ్వతంగా గుండెలో ఎప్పూడు చెరగని ముద్ర వేసి జీవిస్తారు. అలాంటి కోవకు చెందిన మనిషి శ్రీదేవి’’ అన్నారు కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి. ప్రముఖ సినీతార శ్రీదేవి సంస్మరణ సభ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ–‘‘ భారతదేశ చలనచిత్రరంగంలో శ్రీదేవి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. హిందీలో చాందినీగా ఆకట్టుకున్నారు. ఆవిడ మరణవార్త విని దేశం మొత్తం షాక్ అయ్యింది. ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు. శ్రీదేవితో మా అమ్మాయి పింకీ రెడ్డి ఎంతో సన్నిహితంగా ఉండేది. శ్రీదేవి ఎంత పెద్ద ఆర్టిస్టో అంత మంచి హ్యూమన్ బీయింగ్. ఎంత ఎత్తు ఎదిగినా రూట్స్‌ని మరిచిపోలేదు. అంత గొప్ప నటి, శక్తి స్వరూపిణి దూరమైయేసరికి కోట్లాది అభిమానులు తమ అభిమానాన్ని, దుఃఖాన్ని చూపించారు. బోనీ కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఎప్పుడు వాళ్లు విడిగా వచ్చేవారు కాదు. శ్రీదేవి మరోజన్మలోను శ్రీదేవిలానే పుట్టాలి. తెలుగమ్మాయిగానే పుట్టాలి. మా శ్రీదేవి మళ్లీ వచ్చిందనుకోవాలి’’ అన్నారు. ప్రముఖ గాయని సుశీల మాట్లాడుతూ–‘‘ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య శ్రీదేవి. మనల్ని మైమరపించి మళ్లీ తన లోకానికే వెళ్లిపోయింది. 8 ఏళ్ల వయసులో శ్రీదేవికి పాట పాడాను. అంతేకాదు ఆమె మొట్టమొదటి సినిమాకు కూడా పాట పాడాను. మనకు ఎన్నో తీపిగుర్తులను మిగిల్చి తను వెళ్లిపోయింది’’ అన్నారు.‘‘శ్రీదేవితో కలిసి నాలుగు సినిమాల్లో నటించాను. ఆమె నిగర్విగా ఉండేది’’ అన్నారు నటుడు కోటశ్రీనివాసరావు. ‘‘శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎప్పుడూ సార్ అని పిలిచేది. ఆమెకు పెద్దలంటే ఎంతో గౌరవం. ఇప్పుడు ఆమె లేదు అంటే నమ్మబుద్ది కావడం లేదు. దేశం గర్వించదగ్గ నటి శ్రీదేవి. ఆమె మరణించినా..సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారామె’’ అని అన్నారు కృష్ణంరాజు. ‘‘ శ్రీదేవి మరణవార్త విన్న తర్వాత ఎంతో దుఃఖించాను. తెలుగు అమ్మాయిగా ఎంతో సాధించింది. జీవితంలోని ప్రతి అడుగును ఒక లక్ష్యంగా చేసుకుని నడిచింది. ప్రతి పాత్రను ఒక సవాలుగా తీసుకునేది శ్రీదేవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చే వారు శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటారు. శ్రీదేవి గొప్ప నటి మాత్రమే కాదు. మంచి మాతృమూర్తి కూడా. తనలాగే జాన్వీని కూడా తీర్చిదిద్దాలని అనుకున్నారు. జాన్వీ మంచి నటిగా రాణించాలని కోరుకుంటున్నాను’’అన్నారు నటి జయప్రద. ‘‘శ్రీదేవి మరణవార్తను జీర్ణించుకోలేకపోయాను. శ్రీదేవి కుటుంబంతో మా కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని మరిచిపోలేక పోతున్నాను. జాన్వీ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు నటి జయసుధ. ‘‘శ్రీదేవితో కలిసి నటించలేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఆమెతో ఓ సినిమాలో నటించే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దేశంలోని ప్రతి కుటుంబంలో ఒక సభ్యురాలే. ముంబైలో జరిగిన శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లాలి అనుకున్నాను. కానీ..కుదర్లేదు. ఇప్పుడు సంస్మరణసభలో పాల్గొనే అవకాశం వచ్చింది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘‘1972లో ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవిని చూసిన మొదటి రోజే గొప్ప నటి అవుతుందని అనుకున్నాను. రామానాయుడు ఆమెను ‘దేవత’ను చేస్తే..ఎన్టీఆర్ ఆమెను ‘అనురాగదేవత’ను చేశారు’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘‘శ్రీదేవి సెట్లో ఎవర్ని బాధపెట్టలేదు. కానీ చనిపోయి అందర్నీ నొప్పించింది’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ‘బడిపంతులు’ సినిమాలో శ్రీదేవి నటన చూసి, గొప్ప నటి అవుతుందనుకున్నాను’’ అన్నారు నటుడు బాబుమోహన్. ‘‘శ్రీదేవితో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. శ్రీదేవితో నటించే అవకాశం దక్కనందుకు బాధపడుతున్నాను. శ్రీదేవి లాంటి హీరోయిన్ కావాలని కోరుకునే వారిలో నేనూ ఉన్నాను’’ అన్నారు హీరోయిన్ నివేధా థామస్. రేలంగి నరసింహరావు, అమల, శ్రీకాంత్, అల్లు అరవింద్, జగపతిబాబు, సుమంత్, ఆలీ, శివాజీ రాజా, నరేశ్, ఉపాసన కామినేని తదితరులు పాల్గొన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ నిమిషం.. మంచి సందేశం
‘‘సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపండి, ఆడపిల్లలను కాపాడండి’’ వంటి మంచి మెసేజ్ ఉన్న చిత్రాన్ని తీసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే మరికొన్ని మంచి సినిమాలు తీయటానికి దర్శక–నిర్మాతలు ముందుకు వస్తారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు నటి జయసుధ. వెంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై కాలా రాజేశ్ దర్శకత్వంలో కె. ప్రసాద్ రెడ్డి నటించి, నిర్మించిన చిత్రం ‘ఆ నిమిషం’. ఈ చిత్రం టీజర్‌ను నటి జయసుధ రిలీజ్ చేశారు. ‘‘మా టీజర్‌ను జయసుధగారు విడుదల చేయటం ఆనందంగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం. నిర్మాతకు కృతజ్ఞతలు’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: కున్నీ గుడిపాటి, కెమెరామేన్: యోగి ప్రసాద్. -
నిర్మాతంటే పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి – కోడి రామకృష్ణ
‘‘పెళ్లి పందిరి’ సినిమాతో నా ప్రస్థానం మొదలైందంటూ రాజుగారు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం ఆయన సంస్కారానికి నిదర్శనం. ఆ సినిమా రాజుగారికే కాదు చాలామందికి టర్నింగ్ పాయింట్. చలనచిత్ర రంగానికి ఈరోజు రాజుగారు గర్వంగా మిగిలారు. నిర్మాతంటే సక్సెస్ఫుల్ సినిమా తీయడం మాత్రమే కాదు. పదిమంది నిర్మాతలకి దారి చూపించాలి. సినిమా అంటే ఇలా తీయాలి అని చూపించాలి. రాజుగారు ఓ సంచలన నిర్మాత అయ్యారంటే దానికి కారణం కృషి, పట్టుదల. ఇలాంటివాళ్లు ఇండస్ట్రీలో ఉంటే చలనచిత్ర రంగం ఎప్పుడూ ఎవర్గ్రీన్’’ అని దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ ఏడాది ‘శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, డీజే, రాజా ది గ్రేట్, ఎంసీఏ’ సినిమాలు వచ్చాయి. ఈ సందర్భంగా ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సెలబ్రేటింగ్ 2017’ కార్యక్రమం నిర్వహించారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది మా బేనర్ నుంచి వచ్చిన ఆరు సక్సెస్‌ల గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ ఆరు సినిమాల సక్సెస్‌లు మావి కాదు. టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లవి. వారందరికీ థ్యాంక్స్. 1987 డిసెంబర్లో నా సినిమా లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్‌లో ఫెయిల్యూర్స్ వచ్చాయి. ‘పెళ్లి పందిరి’ మా లైఫ్‌లో లేకుంటే ఈ ఆరు సినిమాలు లేవు. ఐదు వేలరూపాయల గురించి మేం వెతుక్కున్న రోజులున్నాయి. డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్న మేం ప్రొడక్షన్లోకి రావాలనే ఆలోచనతో వినాయక్‌తో ‘దిల్’ సినిమా తీశాం. సుకుమార్, బోయపాటి శీను, భాస్కర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల, వేణు.. ఇలా ఎనిమిది మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఏడుమంది సక్సెస్‌లో ఉండటం హ్యాపీ. హ్యాట్రిక్ సినిమాలు చేయాలనుకునేవాణ్ణి. కానీ ఆరు సినిమాలు ఒకే ఏడాదిలో హిట్ అవుతాయని కలలో కూడా లేదు. అది దేవుడు రాసిపెట్టి ఉన్నారు’’ అన్నారు. ‘‘ఒకే భాషలో ఆరు సినిమాలు చేసి వరుసగా హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఘనత వెంకటేశ్వర బ్యానర్‌కి మాత్రమే దక్కింది. ఇందుకు రాజుగారు, శిరీష్, లక్ష్మణ్గార్లకి అభినందనలు’’ అన్నారు హీరో అల్లు అర్జున్. ‘‘తెలుగు సినిమాకి ది ఐకానిక్ ప్రొడ్యూసర్ రాజుగారు. ప్రొడక్షన్లోకి దిగాక తెలుస్తోంది అది ఎంత కష్టమో’’ అన్నారు హీరో నాని. ‘‘రాజుగారి సక్సెస్‌లో నేనూ పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. ‘‘ఈ ఏడాది ఎస్వీసీ బ్యానర్లో మొదటి హిట్ నా సినిమా అయినందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు సతీశ్ వేగేశ్న అన్నారు. ‘‘మూడేళ్ల కిందట యువరాజ్ ఆరు సిక్సర్లు కొట్టారు. ఈ ఏడాది రాజుగారు ఆరు హిట్స్ కొట్టారు. ఆయన యువరాజ్.. ఈయన ‘దిల్’ రాజు అన్నారు’’ హరీష్ శంకర్. ‘‘రాజుగారు వంద సినిమాలు తీయాలి’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘‘ఎస్వీసీ బ్యానర్లో 27సినిమాలు తీస్తే అందులో 90శాతం సక్సెస్లుండటం గ్రేట్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఆర్యతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా జర్నీ ప్రారంభమైంది. రాజుగార్ని అప్పటి నుంచి చూస్తున్నా. ఆయన ఓ గోల్ పెట్టుకొని రీచ్ అవుతుంటారు’’ అన్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ‘‘మూడేళ్ల తర్వాత నేను ఇక్కడున్నా’’ అన్నారు భూమిక. నటి జయసుధ, నటుడు జగపతిబాబు, ‘పెళ్లిపందిరి’ నిర్మాత రమేశ్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, సాయికార్తీక్, శక్తికాంత్, నటుడు నరేశ్, హీరో నవీన్ చంద్ర, హీరోయిన్స్ మెహరీన్, అనుపమా పరమేశ్వరన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నక్కిన త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ - జయసుధ
-
మణిరత్నం సినిమాలో మళ్లీ!
‘హిట్ పెయిర్’ పేరుతో ఓ జంట మళ్లీ మళ్లీ స్క్రీన్‌పై కన్పిస్తుంటే కొన్నాళ్లకు బోర్ కొట్టేస్తారు. కానీ, ఎన్నేళ్లైనా వెండితెరపై వన్నె తరగని జంటలు కొన్ని ఉంటాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, సహజ నటి జయసుధలది అలాంటి జంటే. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘బొమ్మరిల్లు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చెప్పుకోవడానికి చాలా సినిమాలున్నాయి! గతేడాది జాతీయ అవార్డు సాధించిన ‘శతమానం భవతి’తో సహా! జయసుధ, ప్రకాశ్‌రాజ్‌లు వైఫ్ అండ్ హజ్బెండ్‌గా నటించిన ప్రతి సిన్మాలోనూ ప్రేక్షకులను తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ‘హిట్ పెయిర్’ అనే పదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించనున్న తమిళ సినిమాలోనూ ఈ ‘హిట్ పెయిర్’ వైఫ్ అండ్ హజ్బెండ్‌గా నటించేందుకు అంగీకరించారు. హీరోలు అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ వీళ్ల తనయులుగా కనిపిస్తారట. మరో హీరో విజయ్ సేతుపతి ఇన్స్పెక్టర్గా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్‌లు కీలక పాత్రధారులు. జనవరిలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది!! -
మణిరత్నం సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి
దక్షిణాది నటీనటులకు మణిరత్నం సినిమాలో నటించటం ఓ కల. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా అంటే చాలు ఎవరైన ఓకె చెప్పేస్తారు. సీనియర్ నటుల నుంచి యంగ్ హీరోల వరకు అందరూ మణిరత్నం సినిమాలో చాన్స్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ఓ అరుదైన అవకాశం టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ తలుపు తట్టింది. భర్త మరణం తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈ సీనియర్ నటి చాలా కాలం తరువాత ఓ తమిళ సినిమాకు అంగీకరించింది. మణిరత్నం సినిమా కావటం వల్లనే జయసుధ ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించిందట. చెలియా సినిమాతో నిరాశపరిచిన మణిరత్నం ప్రస్తుతం శింబు, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. జ్యోతిక మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటి జయసుధ నటించనుంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సఖి సినిమాలో జయసుధ నటించింది. తిరిగి ఇన్నేళ్ల తరువాత మరోసారి మణి దర్శకత్వంలో నటించనుంది. ఇటీవల ఊపిరి సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించిన జయసుధ మరోసారి ఆసక్తికరమైన సినిమాలో కోలీవుడ్ ఆడియన్స్‌ను అలరించనుంది. -
నేను ప్రాణాలతో ఉన్నానంటే అదే కారణం..
సాక్షి, హైదరాబాద్ : ‘నేను ఈ రోజు ప్రాణాలతో ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం నా ధైర్యమే.. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. ధైర్యంగా సరైన చికిత్స తీసుకుంటే నయమవుతుంది. గతంలో మాదిరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ సినీనటి గౌతమి అన్నారు. లైఫ్ అగెయిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విన్నర్స్ వాక్ సందడిగా సాగింది. బ్రెస్ట్ కేన్సర్‌ను ఎదిరించి విజయం సాధించిన సినీనటి గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సినీనటులతో పాటు కేన్సర్‌ను జయించిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తగిన చికిత్స చేయించుకుంటే నయమవుతుందని సీనియర్ నటి జయసుధ పేర్కొన్నారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనుకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు సాగాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. మువీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజి రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, ముమైత్‌ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మగాడి శాడిజానికి మగువ ఈసడింపు ఇది కథ కాదు
నాటి సినిమా ఆమెకు తల్లి లేదు. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. బొంబాయిలో పెళ్లి చేసుకున్న ఒక మోసగాడు నడిరోడ్డు మీద వదిలిపెట్టాడు. గతంలో ప్రేమించినవాడు మళ్లీ చేరువ అవుతాడనుకుంటే అదీ జరగలేదు. తనను ఇష్టపడే మరొకడు ధైర్యం చేసి ఆ మాట చెప్పడు. ముగ్గురు మగవాళ్లు – ఒక స్త్రీ. అప్పుడే ఆమెకు అద్భుతమైన సపోర్టు దొరికింది. కొడుకు దుర్మార్గం తెలుసుకున్న అత్తగారు కోడలికి సపోర్టుగా నిలిచి ‘మెడలో ఆ తాళిబొట్టు ఎందుకమ్మా... తీసి పారెయ్’ అంటుంది. ఇన్ని ఘటనలు ఎక్కడా జరగవు. అందుకే ఇది కథ కాదు. కూ... ఛుక్ ఛుక్ ఛుక్ ఛుక్... రైలు బయలుదేరింది. జననమనే మొదలు నుంచి మరణమనే గమ్యం వరకు ప్రయాణం. మధ్యలో ఎన్నెన్ని స్టేషన్లు. ఎన్నెన్ని అనుభవాలు. ఎన్నెన్ని ధైర్యాలు. ఎన్నెన్ని దుఃఖాలు. వీటన్నింటినీ పాస్ చేసుకుంటూ వెళ్లాలి. కాని స్త్రీ విషయంలో అలా కాదు. అక్కడ డ్రైవర్ మగవాడు. గార్డ్ మగవాడు. స్టేషన్ మాస్టర్ మగవాడు. టికెట్ కౌంటర్లో కూర్చునేది మగవాడు. ట్రైన్ ఎక్కించేది దించేది కూడా మగవాడే. ఆమె జీవితానికి అతడే శాసనకర్త. అతడు ఏడిపిస్తే ఆమె ఏడ్వాలి. నవ్వడానికి అనుమతినిస్తే నవ్వాలి. ఎంత దారుణం ఇది. కాని– ఈ కథలోని జయసుధ అలా కాదు. ఆమె నిబ్బరం సామాన్యమైనది కాదు. మగాడిలోని జంతువుకు ఆమె ధిక్కరింపు ఒక చావుదెబ్బ. ఆమె చిర్నవ్వు– అతడి ముఖంపై కాండ్రించి ఊసిన ఉమ్ము. ఫస్ట్ స్టేషన్: ‘చావే అన్నింటికీ పరిష్కారమైతే నేను ఇప్పటికి ఎన్నిసార్లు చనిపోవాలో’ అంటుంది జయసుధ (పాత్ర పేరు సుహాసిని) ఈ సినిమా ప్రారంభమైన వెంటనే రైలు ప్రయాణంలో. ఆమె ముంబై నుంచి మద్రాసుకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ మీద వెళుతూ ఉంటుంది. కొద్ది పాటి లగేజ్. తోడుగా ఏడాది కొడుకు. ఒంటరి స్త్రీ. సాటి ప్రయాణికులకు, ప్రేక్షకులకు కూడా కుతూహలం. ఈమె కథ ఏమిటి అని. కాని ఆ కథ తెలుసుకుంటే ఇలా కూడా కథ ఉంటుందా... ఇది కథ కాదు... మగవాడి దుర్మార్గం అని అనుకుంటారు. జయసుధ క్లాసికల్ డాన్సర్. తనలాగే మంచి కళాకారుడు, ఫ్లూటిస్ట్ అయిన శరత్‌బాబు (పాత్ర పేరు భరణి)ని ఇష్టపడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. కాని ఇంతలో తండ్రికి బొంబాయి ట్రాన్స్ఫర్ కావడంతో జయసుధ అక్కడికి వెళ్లిపోతుంది. శరత్‌బాబుని పెళ్లి చేసుకోవడానికి ఆమె రాసిన ఉత్తరాలు అతడికి అందవు. ఇంతలో బొంబాయిలోనే పెద్ద ఉద్యోగి అయిన చిరంజీవి (పాత్ర పేరు సుగుణాకర్‌రావు) ఆ కుటుంబానికి పరిచయం అవుతాడు. జయసుధను పెళ్లి చేసుకుంటానంటాడు. జయసుధ అమాయకంగా, నిజాయితీగా తాను ఇంకొకరిని ప్రేమించానని, ఆఖరు ఉత్తరం రాసి చూస్తానని అతడు కనుక స్పందించకపోతే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. చిరంజీవి ఆమె నిజాయితీని మెచ్చుకుంటాడు. చివరి ఉత్తరానికి కూడా శరత్‌బాబు నుంచి స్పందన రాదు. జయసుధ, చిరంజీవిల పెళ్లి జరిగిపోతుంది. ఫస్ట్ జోల్ట్: జయసుధ శరత్‌బాబుని మర్చిపోయింది. చిరంజీవిని మనస్ఫూర్తిగా స్వీకరించింది. అతడు మాత్రం ఆమెను ఎంతో క్రియేటివ్‌గా హింసించడం మొదలుపెట్టాడు. ఆమె మంచి మూడ్‌లో ఉండగా ‘ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా. నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఎంత గట్టిగా అంటే నీ మాజీ ప్రియుడు గుర్తుకు వచ్చేంత గట్టిగా’ అని అంటూ ఉంటాడు. ఇంట్లో ధూపం వేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు. అతడు మాత్రం ఏమిటి ఈ దరిద్రం అని ఆ ధూపంలో నీళ్లు పోస్తాడు. ఎంతో ఆదరంగా వంట చేసి వడ్డిస్తే ‘ఇది వంట కాదు పెంట’ అని ఈసడించుకుంటాడు. సుహాసిని ముఖాన్నే డార్ట్ బోర్డ్‌గా చేసి చుట్టూ డార్ట్స్ విసురుతూ ఆమెను భయభ్రాంతం చేస్తుంటాడు. బోర్ కొడితే సిగరెట్టు కాల్చి ఆమె ఒంటి మీద వాతలు పెడుతుంటాడు. అది పెళ్లి ప్రయాణం కాదు పైసాచిక ప్రయాణం. యాక్సిడెంట్: కొడుకు పుట్టాడు. కాని ఆ పిల్లవాణ్ణి చూసినా అతడికి ఈసడింపే. ఎత్తుకోడు. ముద్దాడడు. చివరకు అనకూడని మాట కూడా అనేశాడు. ‘ఒకవైపు నుంచి చూస్తే నాలా ఉన్నాడు. ఇంకో వైపు నుంచి చూస్తే ఇంకోలా ఉన్నాడు’ అంటాడు. జయసుధ ఆ మాటకు కదిలిపోతుంది. అతణ్ణి చంపేద్దామన్నంత కోపం వస్తుంది. ఆ కోపం చూసి అతడు ‘ఏం... గుడ్లురుముతున్నావ్. విడాకులు ఇచ్చి పారేయమంటావా?’ అంటాడు. విడాకులు అతడి దృష్టిలో స్త్రీకి శిక్ష. కాని ఆమె మాత్రం ‘ఇవ్వు. స్త్రీకి దానికి మించిన రక్షణ లేదు’ అని నిబ్బరంగా విడాకులను స్వీకరిస్తుంది. బిడ్డతో సహా బయటపడుతుంది. ఒక మజిలీ పూర్తయ్యింది. రెండో మజిలీలోకి వెళ్లాలి. పక్క కంపార్ట్మెంట్: జయసుధ మద్రాస్ చేరుకుంటుంది. ఒక ఇంట్లో దిగుతుంది. ఏ ఇంట్లో దిగుతుందో ఆ ఇంటి పక్కనే శరత్‌బాబు ఉంటాడు. ఒకప్పటి శరత్‌బాబు. తను ప్రేమించిన శరత్‌బాబు. జయసుధకు అతణ్ణి చూసి ఎంతో ఓదార్పుగా అనిపిస్తుంది. అతడు అవివాహితుడిగా ఉంటాడు. ఆమె ఉత్తరాలు అందకపోవడం వల్లనే ఆమెను గతంలో పెళ్లి చేసుకోలేకపోయానని చెబుతాడు. వాళ్లిద్దరూ మళ్లీ స్నేహితులవుతారు. జయసుధ మనసులో ఎన్నో ఆశలు. మళ్లీ జీవితం బాగుంటుందని... బాగుపడుతుందని. ట్రైన్లో పాటగాడు: ఏ రైలు ప్రయాణంలో అయినా ఎవరో ఒక పాటగాడు తగిలి నాలుగు పాటలు పాడి మనసు రంజింప చేసి చిల్లర పట్టుకుపోతుంటాడు. ఈ ప్రయాణంలో కూడా ఒక పాటగాడు ఉన్నాడు. పేరు కమలహాసన్ (పాత్ర పేరు జనార్థన్). మలయాళీ. జయసుధ ఆఫీస్‌లో కొలీగ్. ఆమెకు అతడే ఇల్లు చూపిస్తాడు. ఆమె పనిలో సాయపడుతుంటాడు. ఆమెను ఎంతో ఆదరువుగా ఉంటూ మూగగా ఆరాధిస్తుంటాడు. అతడికి వెంట్రిలాక్విజమ్ తెలుసు. ‘జూనియర్’ అనే డాల్‌ను అడ్డం పెట్టుకుని తన మనసులోని మాట జయసుధకు చేరవేస్తుంటాడు. కాని ఆమె దానిని ఒక ఆట అనుకుంటుందే తప్ప సీరియస్‌గా తీసుకోదు. దేవుడు పంపిన కో పాసింజర్: ఈ కథలో ఒక ముఖ్యమైన కో పాసింజర్ ఉంది. ఆమె సుగుణాకర్‌రావు తల్లి (నటి లీలావతి). మద్రాసులోనే ఉంటుంటుంది. బొంబాయిలో ఉన్న కొడుకు తనకు ఏ మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని బిడ్డను కనడమే కాకుండా కోడలిని హింసించి, విడాకులిచ్చి తరిమేయడం తెలుసుకుని ఆమె విలవిలలాడిపోతుంది. ఇంత నీఛమైన కొడుకుతో ఉండటం కంటే దేవత లాంటి కోడలితోనే ఉండటం మేలని ఆమెకు సేవ చేయడమే కొడుకు చేసిన పాపానికి విరుగుడు అని భావించి మారు పేరుతో కోడలి దగ్గర పని మనిషిగా చేరుతుంది. ఆమె చేరినప్పటి నుంచి సుహాసినికి ఎంతో బలం. ఆమె వల్లే తను తిరిగి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ధైర్యం తెచ్చుకుంటుంది. చైన్ లాగిన పాత నిందితుడు అంతా సిద్ధమైంది. భరణి, సుహాసినీల పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫలానా తేదీన రిజిస్టర్డ్ మేరేజ్. కాని ఇంతలో మాజీ భర్త చిరంజీవి ఊడిపడతాడు. తనను వదిలిపెట్టిన జయసుధ సుఖంగా రెండో పెళ్లి చేసుకోబోతోందని తెలిసి రగిలిపోతాడు. ఆమె ఆనందాన్ని ఎలాగైనా భగ్నం చేయడానికి మేక వన్నె పులిలా వేషం మారుస్తాడు. తాను మారిపోయాననీ తిరిగి ఏలుకుంటాననీ జయసుధకు కబురు పెడతాడు. అంతేకాదు శరత్‌బాబు మనసు మార్చి, నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె నాతో తిరిగి కాపురానికి రాదు అని చెప్పి, అతడికి ఇది వరకే పరిచయం ఉన్న మరో అమ్మాయి (సరిత)తో నిశ్చితార్థం చేస్తాడు. ఇదంతా ఎందుకు? ‘జయసుధ కళ్లల్లో రెండు కన్నీటి బొట్లు చూడటానికి’. ఇప్పుడు జయసుధ అన్ని విధాలుగా అన్యాయమైంది. శరత్‌బాబుకి దూరమైంది. మాజీ భర్త మోసానికి మరోసారి బలైంది. అయినప్పటికీ ఆమె ఏడ్వదు. ఏడుపు ఎందుకైనా ఏడ్వవచ్చు కాని మగవాడి దాష్టికానికి మాత్రం కాదు అని ఆమె అస్సలు ఏడ్వదు. ప్రయాణంలో కొన్ని మజిలీలు విఫలమవ్వచ్చు. కాని జీవితం చాలా ఉంటుంది. ఓటమి అంగీకరించ కుండా మరణాన్ని శరణు కోరకుండా ముందుకు సాగడమే పని అని ఆమె క్లయిమాక్స్‌లో మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని బయలుదేరుతుంది. కొద్దిపాటి సామాను, కొడుకు, ఒంటరి స్త్రీ. కాని ఈసారి ఆమెకు ఒక తోడు ఉంది. వేరెవరో కాదు– అత్తగారు. ‘నేనూ నీతోనే వస్తానమ్మా. నీతోనే ఉండిపోతానమ్మా’ అని ఆమె అంటుంది. ‘స్త్రీకి స్త్రీ శత్రువు’ అనేది మగాడి మాట. ఇక్కడ మాత్రం ‘స్త్రీకి స్త్రీయే తోడు’ అంటుంది జయసుధ. ఆ ఇద్దరు ఆడవాళ్లు మగవాళ్లు నిర్దేశించిన ప్రయాణాన్ని ధిక్కరించి తమ ప్రయాణాన్ని తాము మొదలుపెడతారు. స్త్రీల అంతులేని కథ కొనసాగుతూనే ఉంది. అప్పటికీ ఇప్పటికీ... బహుశా ఎప్పటికీ. కె.బాలచందర్ స్త్రీవాద కథ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ‘పెళ్లయిన ఆడదానికి ఇల్లు దొరకాలంటే ఆమెకు మొగడన్నా ఉండాలి. లేదా ఆమె వితంతువు అయినా అయి ఉండాలి’ అని. విడాకులు పొందిన ఒంటరి స్త్రీకి ఇల్లు దొరకదు అని ఆ డైలాగ్‌కు అర్థం. ఈ సినిమా 1979లో వచ్చింది. ఆ రోజుల్లో సమాజం అలా ఉండేది అంటే మరి ఈ రోజుల్లో మారిందా? విడాకులు పొందిన ఒంటరి స్త్రీలకు ఇవాళైనా ఇల్లు దొరుకుతూ ఉందా? ఇది మగ సమాజం. మగతోడు ఉంటేనే స్త్రీకి విలువ ఇచ్చే సమాజం. అలా అక్కర్లేదు అని చెప్పడానికి కె.బాలచందర్ ఈ సినిమా తీశాడు. మగవాడి నుంచి విముక్తమై కూడా స్త్రీ బతకగలదు, బిడ్డల్ని సాకగలదు, ధైర్యంగా తన కాళ్ల మీద తాను నిలబడగలదు అని ఆయన ఈ సినిమా ద్వారా చెప్పాడు. అందుకే బాలచందర్ తీసిన సినిమాల్లో స్త్రీవాద స్టేట్మెంట్ ఇచ్చిన సినిమాగా ఇది గుర్తింపు పొందింది. ‘అంతులేని కథ’ తర్వాత ఆయన తీసిన మరో శక్తివంతమైన సినిమా ఇది. హిట్ సాంగ్స్ బాలచందర్, ఎం.ఎస్.విశ్వనాథన్ కాంబినేషన్ అంటే పాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ఆత్రేయ రచన అంటే చెప్పే పనే లేదు. ఇందులో పాటలు హిట్. సరిగమలు గలగలలు ∙జోలపాట పాడి ఊయలూపనా గాలికదుపు లేదు కడలికంతు లేదు జూనియర్... ఇటు అటు కాని హృదయం తోటి... ఇప్పటికీ ఈ పాటలు రేడియోలో మోగుతూనే ఉన్నాయి. ‘గాలికదుపు లేదు’ పాటలో ‘గంగ వెల్లువ కమండలంలో ఇమిడేనా ఈ ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేనా’ అనడం ఆత్రేయకే చెల్లు. అలాగే ఈ సినిమాలో గణేశ్‌పాత్రో రాసిన డైలాగ్స్‌కూడా పెద్ద హిట్. ఇది జీవితం ఈ సినిమాలో జయసుధ జీవితంలోకి ముగ్గురు వ్యక్తులు వస్తారు. ఎవరైతే ఆమె జీవితాన్ని బాగు చేయడో అతనే జీవిత భాగస్వామి అవుతాడు. ఎవరైతే ఆమెకు అండగా ఉండాలనుకుంటారో వాళ్లు దగ్గర కాలేరు. నిజ జీవితంలో అలాంటి భర్తలూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులూ ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులూ ఆమెను వేరే దృష్టి కోణంతో చూడరు. వారి మధ్య అనుబంధం చాలా హుందాగా ఉంటుంది. బాలచందర్‌గారు గ్రేట్ డైరెక్టర్. మామూలుగా పెద్ద డైరెక్టర్ల గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది. వాళ్లు యాక్ట్ చేసి చూపిస్తారని, ఆర్టిస్టులు అలాగే చేయాలని. కానీ, బాలచందర్‌గారు సీన్ చెప్పి మేం ఎలా నటిస్తున్నామో చూసేవారు. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా మా నటన ఉంటే ఓకే అనేవారు. ‘ఇది కథ కాదు’ కథ కాదు.. జీవితం. అందుకే అందరి మనసులనూ తాకింది. – శరత్‌బాబు, ‘భరణి’ పాత్రధారి చిరంజీవి నెగటివ్ రోల్ ‘ఇది కథ కాదు’ తమిళంలో మొదట ‘అవర్గళ్’గా నిర్మితమైంది. బాలచందర్ ఇందులో ముఖ్యపాత్రల్ని సుజాత, రజనీకాంత్, కమలహాసన్‌కు ఇచ్చాడు. తెలుగులో సుజాత పాత్ర జయసుధకు దక్కింది. రజనీకాంత్ పాత్ర చిరంజీవికి వచ్చింది. తమిళంలో రజనీకాంత్ వేసిన నెగటివ్ పాత్రకు చాలా పేరు వచ్చింది. అయితే ఆ ప్రభావంలో పడకుండా చిరంజీవి సొంతగా తన ధోరణిలో చాలా బాగా పాత్రను పండించడం మనం చూస్తాం. డైలాగ్ విరుపులోకాని, ఈజ్‌లో కాని, బాడీ లాంగ్వేజ్‌లో కాని చిరంజీవి చూపిన కన్విక్షన్ సామాన్యం కాదు. చిత్రమేమిటంటే ఈ సినిమాలో వీరిని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసిన ఆడియన్స్ ఆ తర్వాతి కాలంలో ఈ జోడీ పట్ల మక్కువ చూపలేదు. చిరంజీవి, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు అతి తక్కువ. విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘మగధీరుడు’ (1986) సినిమాలో వీరిద్దరు జోడీగా వేస్తే అది ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత చిరంజీవి పక్కన జయసుధను పెట్టే సాహసం ఎవరూ చేయలేదు. – కె -
నా సహచరుడు... నా ఆంతరంగికుడు...
‘‘32 ఏళ్ల క్రితం ఇదే రోజున నా పెళ్లి జరిగింది. ఇవాళ మా వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మేం ఇద్దరం గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటున్నా’’ అని శుక్రవారం ఫేస్బుక్లో జయసుధ పేర్కొన్నారు. ఆమె భర్త నితిన్‌కపూర్ గత మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన డిప్రెషన్లో ఉన్నారు. చికిత్స కూడా చేయించుకుంటున్నారు. అయితే హఠాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకుంటారని జయసుధ ఊహించి ఉండరు. తేరుకోవడానికి ఆమెకు కొంత సమయం పడుతుందని చెప్పొచ్చు. కాగా, మార్చి 17 నితిన్‌కపూర్–జయసుధల పెళ్లిరోజు. ఈ సందర్భంగా ఫేస్బుక్ ద్వారా ఆమె కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త, నా ఆంతరంగికుడు, నా సహచరుడు.. నితిన్‌కపూర్ ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలతో ప్రశాంతంగా ఉన్నారు. కొన్నాళ్లుగా ఏ ప్రశాంతతను అయితే ఆశించారో దాన్ని దక్కించుకున్నారు. ఆయన డిప్రెషన్లో ఉన్నది నిజం. అయితే అది చికిత్సను కూడా అధిగమించేసింది’’ అన్నారామె. ‘‘32 ఏళ్ల క్రితం మా పెళ్లి జరిగింది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. ఇవాళ ఆయన లేరు. ఎక్కడ ఉన్నా, కింద ఉన్న మమ్మల్ని చూస్తూ, తన ప్రేమతో మాకు రక్షణగా ఉంటారని నా నమ్మకం’’ అని జయసుధ పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో జరిగిన ఈ బాధకరమైన సంఘటనను సంచలనం చేయకుండా, నా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వడం ఇప్పుడు నాకు కావాల్సిన ముఖ్యమైన విషయం. అది అర్థం చేసుకుని, నా మనోభావాలకు గౌరవం ఇచ్చిన మీడియాని అభినందించకుండా ఉండలేకపోతున్నాను’’ అని కూడా అన్నారామె.‘‘ఆ దేవుడు నా భర్తకు కావల్సినంత ఆనందాన్ని, ప్రశాంతతనూ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు జయసుధ. -
నేను.. మావారు: జయసుధ