ముప్ఫైఐదు వస్తే చాలు!
‘‘ఈ చిత్రం మంచి విజయం సాధించాలి. అంటే, వందకు వంద మార్కులు రావాలని కాదు. 35 మార్కులొస్తే చాలు. అందరూ హ్యాపీగా ఉంటాం. ఆ బాధ్యత దర్శకుడిదే’’ అని ఆర్.నారాయణ మూర్తి అన్నారు. నారాయణమూర్తి, జయసుధ జంటగా చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’.
ముహూర్తపు సన్నివేశానికి ఆర్‌ఎఫ్‌సీ ఎండీ రామ్మోహన్‌రావు కెమెరా స్విచాన్ చేయగా, ఆర్‌ఎఫ్‌సీ అధినేత రామోజీరావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘బ్లాక్ మనీతో ఎంత నష్టం జరుగుతోంది? ముఖ్యంగా మధ్య తరగతి వాళ్లు ఎలా నష్టపోతున్నారు? డబ్బు లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగాలన్నదే ఈ చిత్రకథాంశం’’ అని దర్శకుడు అన్నారు.