R Narayana Murthy
-
'మజాకా' ట్రైలర్లో పీపుల్స్ స్టార్.. తప్పు సరిచేసుకున్న సందీప్
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. నేను లోకల్,హలో గురు ప్రేమకోసమే,సినిమా చూపిస్త మావ ,ధమాకా వంటి సినిమాలతో దర్శకుడిగా త్రినాథరావుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి మజాకా మూవీ వస్తుండటంతో ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.తాజాగా విడుదలైన మజాకా ట్రైలర్ టైటిల్ కార్డ్‌లో హీరో సందీప్ కిషన్‌కు 'పీపుల్స్ స్టార్' అనే ట్యాగ్‌లైన్ చేర్చారు. పీపుల్స్ స్టార్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ఆర్. నారాయణమూర్తి అని తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలు అభ్యంతరాలు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆర్ . నారాయణమూర్తికి పీపుల్స్ స్టార్ ట్యాగ్ లైన్ ఉన్న విషయం తనకు తెలియదని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు. తనకు ట్యాగ్ లైన్స్‌తో ఎలాంటి పనిలేదన్నారు. వాటిని పెద్దగా పట్టించుకోనని తెలిపారు. అయితే, నారాయమూర్తి సినిమాలు చాలా బాగుంటాయని, ఆయనకు తాను కూడా అభిమానినని పేర్కొన్నారు. మజాకా సినిమా కోసం పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ లైన్‌ను తాను పెట్టుకోలేదు. నిర్మాత అనిల్ సుంకర పెట్టారని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు.మజాకా చిత్రంలో సందీప్ కిషన్ - రావు రమేశ్ తండ్రీ తనయుల పాత్రల్లో సందడి చేయనున్నారు. తనయుడు ఒక అమ్మాయితో.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం.. సరదాగా సాగే జీవితాల్లో వారికి వచ్చిన సమస్య ఏమిటి? దానిని వారెలా అధిగమించారు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందుకున్నట్లు తెలుస్తోంది. -
ఆసుపత్రి నుంచి ఆర్. నారాయణ మూర్తి డిశ్చార్జ్
ప్రముఖ సినీ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు కూడా ఆయన్ను పరామర్శించారు. నారాయణ మూర్తి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. దేవుడి దయ వల్ల తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. తనకు చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బిరప్పతో పాటు అక్కడి వైద్యులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తన క్షేమాన్ని కోరుకున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నాని ఆయన చెప్పారు. -
ఆర్.నారాయణ మూర్తికి కేటీఆర్ ఫోన్
దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందారు. ఈ క్రమంలో నారాయణ మూర్తి స్పందించారు. తన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందవద్దంటూ ఇప్పటికే వెల్లడించారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో నారాయణ మూర్తి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.ఆర్ నారాయణ మూర్తికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు. అన్ని విధాలుగా ఆయనకు అండగా ఉంటామని కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలో నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వైద్యులను అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. త్వరలో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని వైద్యులు తెలిపినట్లు సమాచారం.ఆర్.నారాయణ మూర్తి విప్లవ చిత్రాలను తెరకెక్కించి ప్రజలకు దగ్గరయ్యారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతోపాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలను ఆయన తెరకెక్కించారు. అభిమానులతో పీపుల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. -
ఆస్పత్రిలో ఆర్. నారాయణ మూర్తి.. ఏమైంది?
ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందో? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే.. ఆయనది స్వల్ప అస్వస్థతేనని వైద్యులు ప్రకటించారు. ప్రసాద్ ల్యాబ్‌లో ఉండగానే నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. అయితే నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారు. (చదవండి: గాయం వల్ల షూటింగ్స్‌కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్)ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ..‘పీపుల్ స్టార్’గా ఎదిగారు నారాయణ మూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు..కథ- కథనం, దర్శకత్వం, సంగీతం, గానం.. ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. (చదవండి: సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి)అయితే గత కొంతకాలంగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సీటీ’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. -
'రజాకార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘వెయ్ దరువెయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
హీరోయిన్లకు లక్కీ హీరో చంద్ర మోహన్
-
ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!
ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. కొత్త హీరోలు వస్తున్నారు. తమ అద్భుతమైన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అలా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల్లో సుహాస్ ఒకడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి క్షమాపణలు చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) ఏం జరిగింది? 'కలర్ ఫోటో' సినిమాతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఈ ఏడాది 'రైటర్ పద్మభూషణ్' అంటూ వచ్చి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇతడు నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే సినిమా టైటిల్‌కి తగ్గట్లే ఈవెంట్ జరిగే చోట కూడా బ్యాండ్ సెటప్ చేసి, వాటిని వాయించారు. అయితే అక్కడికి కాస్త దగ్గర్లో ఉన్న ఆర్.నారాయణమూర్తి కాస్త చిరాకు పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుహాస్.. ఆయన దగ్గరకు వెళ్లి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ కూడా బాగుంది. (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్‌కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) -
ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం భేష్
తిరుపతి సిటీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యావిధానం ప్రవేశపెట్టడం ద్వారా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి వంటి మహానుభావుల ఆశయాలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. తాను దర్శకత్వం వహించి నిర్మించిన ‘యూనివర్సిటీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం తిరుపతి వచ్చిన ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష అమ్మ అయితే.. ఇంగ్లిష్ భాష నడిపించే నాన్న అని, జీతం, జీవితం ఇంగ్లిష్‌పై ఆధారపడి ఉందని అన్నారు. భక్తుల రక్షణకు కర్ర ఓ ఆయుధం తిరుమల కాలినడక మార్గంలో క్రూర మృగాలు భక్తుల ప్రాణాలు తీయడం మనసును కలచివేసిందని నారాయణమూర్తి పేర్కొన్నారు. నడకదారి భక్తులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించడం ఆహా్వనించదగ్గ విషయమన్నారు. అడవులకు, పొలాలకు వెళ్లే సమయంలో అడవి జంతువుల నుంచి తమకు తాము కాపాడుకోవాలంటే కర్రనే ఉపయోగించారని చెప్పారు. కర్ర పైకి ఎత్తి మనిషి గాండ్రిస్తే ఎంతటి క్రూర మృగమైనా పారిపోవాల్సిందేనన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా వీలైతే సలహాలు ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, విద్యావ్యవస్థ, నిరుద్యోగ సమస్య, పేద విద్యార్థుల, తల్లిదండ్రుల వేదన, నిరుద్యోగ భారతం కాదు ఉద్యోగ భారతం కావాలని, విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలనే విషయాలు ప్రధానాంశాలుగా యూనివర్సిటీ సినిమా తీశానని, అక్టోబర్ 4న విడుదల కానుందని చెప్పారు. -
వాస్తవ సంఘటనలే యూనివర్సిటీలో చూపించాం: ఆర్.నారాయణమూర్తి
దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలనే అంశంపై తీసిన ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం యూనివర్సిటీ. ఈ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడారు. మనిషికి విద్య, వైద్యం ఎంతో అవసరమని, ఇవి ప్రైవేట్ రంగంలో ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. యూనివర్సిటీ చిత్రాన్ని విద్యార్థులందరూ ఆదరించాలని ఆయన కోరారు. అక్టోబర్ 4వ తేదీన సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్ నారాయణ మూర్తి విద్యార్థులతో మాట్లాడతూ.. 'సినిమాలో పదో తరగతి పేపర్ లీకేజీ దగ్గర నుంచి గ్రూప్స్ పరీక్షల పేపర్ లీకేజీలపై చూపించాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు సాక్షిగా రూ. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాం. భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల కోటా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. తల్లిదండ్రుల కలలన్నీ ప్రభుత్వాలు కల్లలు చేస్తున్నాయి. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలను సినిమాను తెరకెక్కించాం. ' అని అన్నారు. -
ఇంగ్లిష్ లేక నష్టపోయాం.. సీఎం జగన్ నిర్ణయం చాలా గొప్పది: ఆర్.నారాయణమూర్తి
వెండితెరపై అందంగా విరబూసిన ఎర్ర మల్లె ఆయన సినిమా. సామాన్యుడి కన్నీటి చుక్కే ఆయన కథకు చుక్కాని. కమర్షియల్ బాటలో వెళ్తున్న మెయిన్ స్ట్రీమ్ సినిమా నుంచి ఓ శాఖను విజయవంతంగా విప్లవ బాట పట్టించిన అరుదైన కళా కార్మికుడాయన. నాలుగు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్నా ఆడంబరాలు ఎరుగని పెద్ద మనిషి ఆర్.నారాయణమూర్తి. పీపుల్స్ స్టార్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ దర్శకుడు పేపర్ లీకేజీ ఇతివృత్తంతో యూనివర్సిటీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.– శ్రీకాకుళం డెస్క్ దశాబ్దాలుగా ఎన్నో సామాజిక అంశాలపై సినిమాలు తీసిన మీరు యూనివర్సిటీ చిత్రాన్ని తెరకెక్కించడానికి దోహదపడిన అంశాలేమిటి..? నారాయణమూర్తి: కొన్నాళ్ల కిందట జరిగిన ఓ ఘటన ఈ చిత్రాన్ని తీసేందుకు నన్ను ప్రేరేపించింది. నా మిత్రుడి కొడుకు ప్రైవేటు కాలేజీలో చదవాలని ఆశ పడ్డాడు. అయితే పిల్లాడి తండ్రికి అంత స్థోమత లేకపోవడంతో తన కిడ్నీ అమ్మి కొడుకును ప్రైవేటు కాలేజీలో చదివించాడు. అది నన్ను కలిచివేసింది. ఇలాంటి తండ్రులెందరో పిల్లల భవిష్యత్ కోసం కష్టపడుతున్నారు. విద్యార్థులు కూడా రేయింబవళ్లు శ్రమించి చదువుతున్నారు. కానీ ఇలాంటి వారి కష్టాన్ని అపహాస్యం చేస్తూ కొందరు పేపరు లీకేజీలకు పాల్పడుతున్నారు. ఫలితంగా సామాన్యుల పిల్లలు అన్యాయమైపోతున్నారు. అలాంటి బాధితుల కన్నీరే మా యూనివర్సిటీ చిత్రానికి ప్రేరకం. ఇప్పుడు సినిమా తీయడం ఒక ఎత్తైతే, దానికి ప్రచారం చేసి విడుదల చేయడం మరో ఎత్తు? ఈ సినిమా ప్రచారానికి ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా చేశారా? నారాయణమూర్తి: సినిమా విజయానికి ప్రచారమే ఇప్పుడు చాలా ప్రధానమైంది. అందుకే యూనివర్సిటీ చిత్రానికి బాగా ప్రచారం చేయాలనే ఉంది. ఈ సినిమా ప్రతి కుటుంబానికీ దగ్గరవుతుంది. అందుకే యువత కూడా నా సినిమాను ప్రమోట్ చేయాలని నా కోరిక. మీరు ఎప్పుడూ నూతన నటీనటులతో సినిమాలు తీస్తుంటారు. యూనివర్సిటీ సినిమాకు నటుల ఎంపిక ఎలా జరిగింది? నారాయణమూర్తి : ఈ చిత్రాన్ని విజయనగరం, విశాఖ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. విజయనగరం జేఎన్టీయూ నుంచి అలాగే అక్కడ ఉన్న సెంచూరియన్ యూనివర్సిటీల నుంచి విద్యార్థులను తీసుకున్నాం. వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్న నటులను కూడా ఎంపిక చేసి నటింపజేశాం. ఒకప్పుడు మీ చిత్రాలను తండోపతండాలుగా చూశారు. స్టార్ హీరోలతో సమానంగా మిమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు ఆ ఆదరణ కాస్త తగ్గడానికి కారణాలు విశ్లేషిస్తారా? నారాయణమూర్తి: ఒకప్పుడు నా సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడిన మాట వాస్తవం. కానీ కొన్నాళ్లకు అందరూ నా తరహా సినిమాలనే తీయడంతో ఒక మొనాటనీ వచ్చేసింది. అది నా చిత్రాలపై ప్రభావం చూపింది. అయితే యూనివర్సిటీ సమకాలీన సామాజిక ఇతివృత్తంతో తీసిన సినిమా. ఇది అన్ని వర్గాలకు నచ్చుతుందని నా అభిప్రాయం. తమిళంలో జై భీమ్, కర్ణన్, మామన్నన్ వంటి చిత్రాలను చాలా ఏళ్ల కిందటే మీరు తెలుగులో తీసి చూపించారు. ఆయా సినిమాలకు రూ.కోట్లలో కలెక్షన్లు వచ్చాయి. మీ చిత్రం అలాంటి ఆదరణ పొందడానికి మీరు తీసుకున్న చర్యలు? నారాయణమూర్తి: సామాజిక ఇతివృత్తాలపై సినిమాలు తీయడం గూడవల్లి రామబ్రహ్మం కాలం నుంచి ఉంది. ఇప్పటి తరం కూడా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. అయితే జనం గొప్పవాళ్లు. వారు ముందుకు వచ్చి సినిమా చూస్తే నా సినిమాకూ గొప్ప ఆదరణ దక్కుతుందన్న ఆశ ఉంది. దాసరి నారాయణరావు వంటి దర్శకుడికి ఆర్.నారాయణమూర్తి వంటి నటుడు తోడైతే ఒరేయ్ రిక్షా వంటి సినిమా వచ్చింది. అదే నారాయణమూర్తి వేరే ప్రతిభావంతులైన దర్శకులతో కలిస్తే మరెన్నో మంచి సినిమాలు వస్తాయని జనం అభిప్రాయం. దీనిపై మీరేమంటారు? నారాయణమూర్తి: నా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు అన్నది నా ప్రధాన ఉద్దేశం. నేను వారికి ప్లస్ అవ్వాలి గానీ మైనస్ అవ్వకూడదు. నేను మళ్లీ సక్సెస్ బాట పట్టాక దీని గురించి ఆలోచించవచ్చు. ఒక సినిమా విజయానికి ఆ చిత్రం ఆడిన రోజులు, కలెక్ట్ చేసిన డబ్బులు చాలా మందికి కొలమానం. కానీ మీ చిత్ర విజయానికి మీరిచ్చే కొలమానం ఏమిటి? నారాయణమూర్తి: నేను ఎంచుకున్న అంశం జనాల్లోకి ఎంత బలంగా వెళ్లిందన్నదే నా కొలమానం. ఇలా నా సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. యూనివర్సిటీ ఆ జాబితాలోకి చేరుతుందన్న నమ్మకం ఉంది. మీ ఆహార్యం, మీరు వాడే పాతకాలం మొబైల్ వంటివి మీ మనస్తత్వాన్ని సూచిస్తాయి. ఇప్పుడు ఓటీటీలు చాలా మంది చూస్తున్నారు. మీరూ చూస్తుంటారా? నారాయణమూర్తి: నేను అవేమీ చూడనండీ. పాత సినిమాలే ఎక్కువగా చూస్తుంటాను. ఘంటసాల, జానకమ్మ, సుశీలమ్మ పాటలు వింటాను. ఇలా ఉండడమే నాకు ఇష్టం. మీరు ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఎంతో డబ్బు సంపాదించారు. ఎంతో సేవ కూడా చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదా? నారాయణమూర్తి: నాకు ఆ ఆలోచన లేదు. మనం ఎవరికీ హాని చేయకపోతే చాలు. ఇంకేమీ వద్దు. పంచభూతాలు ఏం కోరి మనకు అన్నీ ఇస్తున్నాయి. నేను చేసే పనులు కూడా అలాంటివే. ఇది విద్యా సంబంధిత సినిమా కదా. రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యా విధానాలపై మీ అభిప్రాయం ఏంటి? నారాయణమూర్తి: ఆంధ్రాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లిష్ మీడియంపై ప్రవేశ పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. ఇంగ్లిష్‌లో చదువుకోకపోవడం వల్ల నాలాంటి వారు ఎంతో మంది ఉద్యోగాలు రాక నష్టపోయారు. ఇంగ్లిష్ చదువుకుంటే సామాన్యుల పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. -
TFCC Election: చిన్న నిర్మాతలను ఆదుకోవాలి..ఆర్. నారాయణమూర్తి
ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలిచినా 80శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలి. సినిమాలు నిర్మించి చాలా మంది లాస్ అవుతున్నారు. క్యూబ్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించాలి. పండగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలకు అవకాశాలు రావడం లేదు. సగటు సినిమాలకు కూడా అవకాశం కల్పించాలి. థియేటర్స్‌కి మార్నింగ్ షో సమస్యలు తీర్చాలి. ప్రస్తుతం కొద్ది మంది చేతుల్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. చిన్న నిర్మాతలను ఆదుకోండి’ అని నారాయణ మూర్తి అన్నారు. టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మరికాసేపట్లో ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
అందుకే మళ్లీ ‘యూనివర్సిటీ’ని రిలీజ్ చేస్తున్నా: ఆర్. నారాయణమూర్తి
‘‘విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, కష్టాలు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను ‘యూనివర్సిటీ’లో చూపించాను. వేసవి, వడగాల్పుల వల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరిగ్గా చూడలేకపోయారు.. అందుకే మళ్లీ విడుదల చేస్తే జనాలకు బాగా చేరువ అవుతుందని రిలీజ్ చేస్తున్నాను’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ జూన్ 9న విడుదలైంది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘పదో తరగతి పేపరు లీకేజీలు, గ్రూప్ 1, 2లాంటి ఉద్యోగ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీలు జరుగుతుంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏం కావాలి? అనే సందేశంతో ఈ సినిమా తీశాను. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. -
విద్య.. వైద్యాన్ని జాతీయం చేయాలి: ఆర్. నారాయణ మూర్తి
‘‘పేపర్ లీకేజ్ వ్యవహారాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కూడా జరిగాయి. ఇలాగైతే నిరుద్యోగులు ఏమైపోవాలి? అందుకే విద్య, వైద్యాన్ని జాతీయం చేయాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్‌పై ఆర్. నారాయణ మూర్తి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. (చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్) ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘భారత దేశంలో చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి.. దీన్ని జాతీయ సమస్యగా పరిగణించాలని రాష్ట్రపతి, ప్రధానిగార్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిత్రంలోని ఐదు పాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి’’ అన్నారు. ‘యూనివర్సిటీ’ ప్రదర్శనకు హాజరైన పలువురు జర్నలిస్టులు ఇది అందరూ చూడాల్సిన సినిమా అన్నారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖుల్లో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్స్ లక్ష్మీ నారాయణ, కోయి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
పేపరు లీకేజీ.. విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి?: ఆర్. నారాయణ మూర్తి
‘‘పదో తరగతి పరీక్ష ప్రశ్నా ప్రతాల లీకేజీ, గ్రూపు 1, 2 వంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? అనే కథాంశంతో ‘యూనివర్సిటీ’ చిత్రం తీశాను’’ అన్నారు ఆర్. నారాయణ మూర్తి. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. (చదవండి: ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!) ఈ సందర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘పాలకుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, నిరుద్యోగులు రెక్కలు తెగిన పావురాల్లా నిస్సహాయ స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. కొందరి వల్ల విద్యా వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చాటి చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి, త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–్రస్కీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాత: ఆర్. నారాయణ మూర్తి, కెమెరా: బాబూరావు. -
అలా చేస్తే ఆర్ నారాయణమూర్తి ఇప్పటికీ నెంబర్ వన్ స్టార్‌గానే ఉండేవాడు
ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలిసిందే. విప్లవ సినిమాలు తీస్తూ పీపుల్స్ స్టార్‌గా ఎదిగాడు. కేవలం సినిమాల్లో నటించడమే కాదు.. కథ, కథనం, దర్శకత్వం, సంగీతం, గానం, నిర్మాణం..ఇలా 24శాఖలను తన భూజన వేసుకొని సూపర్ హిట్ చిత్రాలను అందించగల సమర్థుడు. ఈ మధ్యకాలంలో ఆయనకు సరైన హిట్ పడలేదు కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్లో సంచలనం సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలాంటి గొప్ప నటుడిపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం స్టార్‌డమ్‌ని, కోట్ల రూపాయలను వదులుకున్న ఏకైన నటుడు ఆర్ నారాయణమూర్తి అని ప్రశంసించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలుగు సినిమాకు ఒక డిఫరెంట్ స్టేటస్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. విప్లవాన్ని నమ్ముకొని.. విప్లవం కోసమే జీవితాన్ని అంకితం చేశాడు. తన కథలతో ప్రేక్షకుల ఆలోచనలు ప్రభావితం చేస్తూ, కొంతకాలం పాటు అతనే నెంబర్ వన్ స్టార్ అయ్యాడు కూడా. స్టార్ డమ్ వచ్చిన తరువాత కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలకుండా అదే తరహా సినిమా చేస్తూ వచ్చాడు. సిద్దాంతం కోసం తన స్టార్ స్టేటస్‌ని వదులుకున్నాడు కానీ తన పంథా మార్చుకోలేదు. తన పంథా మార్చుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఆర్ నారాయణమూర్తి నెంబర్ వన్ స్టార్‌గానే ఉండేవాడు. ‘మీ సిద్ధాంతం వదలకుండా మీరు సినిమా చేసే విధానం మార్చుకోండి’ అని నేను చాలాసార్లు చెప్పానుగానీ ఆయన వినిపించుకోలేదు. ఆయన ఏ సినిమా తీసినా అది విప్లవ పంథాలోనే ఉంటుంది. సూపర్ హిట్లు ఇచ్చాడు .. ఎంతో సంపాదించాడు. అయినా రోడ్లపై నడుచుకుంటూనే తిరుగుతూ ఉంటాడు. అంత సింపుల్ గా బ్రతికే మనిషిని గురించి ఎంత చెప్పినా సరిపోదు’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. -
యూనివర్సిటీ: పేపర్ లీకేజీ.. నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది?
‘‘డిగ్రీ పట్టాలు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా కాలేజీలు ఉండకూడదు. విద్యార్థులకు జ్ఞానసందను పంచాలి.. విలువలను కాపాడాలి. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, పని హక్కు నిర్వీర్యం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు దర్శకనిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ’. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘యువత జాతి సంపద. వారిని మనం కాపాడుకోవాలి. వారి మేధస్సు దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. కానీ పేపర్ లీకేజీ వల్ల యువత తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. పేపర్ లీకేజీ అనే అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా గమనిస్తూనే ఉన్నాం. పేపర్ లీకేజీల వల్ల విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. విద్యార్థులు, ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల భవిష్యత్తు ఏమైపోతుంది? అనే అంశాల ఇతివృత్తంగా ‘యూనివర్సిటీ’ సినిమా తీశాం. విద్య, వైద్య, విమానయానం, బ్యాంకింగ్, రైల్వేస్ వంటి రంగాల్లో ప్రైవేటీకరణ జరుగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటి వల్ల మైనార్టీలు, బడుగు, బలహీన వర్గాల వారు రిజర్వేషన్లు కోల్పోయి, ఉపాధి దక్కని పరిస్థితులు ఉండొచ్చు. ఆ అంశాలను కూడా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అని పేర్కొన్నారు. -
యాంకర్ స్రవంతి చొక్కారపుపై ఆర్. నారాయణమూర్తి సీరియస్
తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్లో డెబ్యూ ఇచ్చారు. .రిలీజ్‌కు ముందే ఈ సినిమా పాటలు మాంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక సార్ విడుదలైన తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.విద్యావ్యవస్థపై ఓ లెక్చరర్ పోరాటం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ విషయంలోనూ సార్ దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్‌లో మూవీ టీం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. యాంకర్ స్రవంతి చొక్కారపుపై సీరియస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సార్ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టుల గురించి మాట్లాడిన ఆయన చివర్లో హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో మళ్లీ మైక్ తీసుకొని అతని గురించి మాట్లాడుతుండగా అది గమనించని యాంకర్.. స్టేజ్‌పై మరో గెస్ట్‌ను పిలిచింది. దీంతో కోప్పడిన ఆయన ‘ఏ పిల్లా ఆపు.. ఏ అమ్మాయ్ టైరో టైరో. స్టేజ్ మీద ఎవరు మాట్లాడుతున్నా కాసేపు ఆగండి. మాట్లాడిన తర్వాత పిలవండి. సభ్యతతో ఉండండి. ప్లీజ్’.. అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
జమునను పద్మ అవార్డుతో సత్కరించాలి: నారాయణమూర్తి
సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంపై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో జమున ఒక మహానటి. అగ్రహీరోలతో ఆమె నటించి మెప్పించారు. యావత్ భారతీయ సినీపరిశ్రమకు ఆమె మరణం తీరని లోటు. మూగమనసు సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమా మొత్తం ఆమెతోనే నడుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సహా ఎంతోమంది నటులతో ఆమె నటించారు. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని తను ఎంతగానో పోరాడింది. ప్రభుత్వ లాంఛనాలతో జమున అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కేంద్రం ఆమెకు పద్మ అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అన్నారు నారాయణమూర్తి. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి.. జమున మరణంపై సెలబ్రిటీల సంతాపం -
సీఎం వైఎస్ జగన్ కు సెల్యూట్ : ఆర్ నారాయణ మూర్తి
-
మాట తప్పని ఆ మహానుభావుడికి సెల్యూట్: ఆర్ నారాయణ మూర్తి
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో రూ.470 కోట్ల వ్యయంతో నిర్మించే తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అదే విధంగా గిరిజన, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జోగునాథునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'స్వాతంత్యం సిద్ధించి 75 ఏళ్లు దాటినా.. మన కాళ్ల కిందే ఏలేరు నీళ్లు పారుతున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి మనది. ఇలాంటి పరిస్థితుల్లో నేను(ఆర్ నారాయణమూర్తి), దాడిశెట్టి రాజా, ఉమా శంకర్ గణేష్, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గతంలో సీఎం జగన్ గారిని తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం గురించి విజ్ఞప్తి చేశాం. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆ మహానుభావుడు ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తాండవ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌కు సెల్యూట్' అంటూ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. చదవండి: (చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం: సీఎం జగన్) -
"ఉక్కు సత్యాగ్రహం" ఆడియో విడుదల
తాను ఏ తరహా సినిమా తీసినా అందులో సామాజిక అంశాలను మిళితం చేసే సత్యారెడ్డి ఇప్పటివరకు ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి ,రంగుల కళ ,కుర్రకారు ,అయ్యప్ప దీక్ష , గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా వంటి చిత్రాలను నిర్మించారు. దర్శక, నిర్మాతగానే కాకుండా నటుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. జనం సమస్యల పరిష్కారం కోసం రగులుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రధాన అంశంగా చేసుకుని “ఉక్కు సత్యాగ్రహం” పేరుతో సత్యారెడ్డి ఓ సినిమా తీస్తున్నారు. తాను ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సత్యారెడ్డి రూపొందిస్తున్నారు. మొన్నామధ్య గద్దర్ రాసిన పాటను రిలీజ్ చేయగా తాజాగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాటను విడుదల చేశారు. గద్దర్ మాట్లాడుతూ.. 'ఈ సమస్య కేవలం విశాఖపట్నం ప్రజలది మాత్రమే కాదు. మన తెలుగు ప్రజలందరిది. మొత్తం తెలుగు ప్రజలందరూ ఏకమవ్వాలని పిలుపునిస్తున్నాను. అందరూ కలిసి ఈ ప్రయివేటీకరణ ఆపగలరు' అని కోరాడు. చదవండి: శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని చూస్తున్న హమీదా నా కోడలు బంగారం.. నయన్ అత్త -
ఆ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి: మాజీ ఎంపీ ఉండవల్లి
సాక్షి, విశాఖపట్నం: 'స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దేశం అవసరం' అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఆదివారం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సినీ నటుడు నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం భారీ సభ నిర్వహించి డిక్లరేషన్ ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి కోరారు. ఆ కమిటీ నివేదికను అమలు చేయాలి స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు కేంద్రం చెబుతున్న కారణాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. కేంద్రం ప్రజల ఆకాంక్షలను గుర్తించాలన్నారు. ఉక్కు అమ్మకం ప్రజల మనోభావలతో కూడిన అంశం అని తెలిపారు. దస్తూరి కమిటీ నివేదికను కచ్చితంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం అంటే కుట్రలో చిక్కుకున్నట్లే అని అన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రల హక్కు నినాదం తన ఐడెంటిటీని కోల్పోతుందన్నారు. ప్రజాఉదయమం ద్వారానే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమన్నారు. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) -
ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
పెనమలూరు: ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని ప్రముఖ సినీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరుగుతోన్న ప్రజానాట్య మండలి రాష్ట్ర 10వ మహాసభల ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆయన ప్రసంగించారు. దేశంలో జరుగుతోన్న ప్రైవేటీకరణ చాలా ప్రమాదకరమైన పరిణామమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ నియామకం ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీని నియమించారు. అధ్యక్ష కార్యదర్శులుగా పి.మంగరాజు, ఎస్.అనిల్‌కుమార్, ఉపాధ్యక్షులుగా గుర్రం రమణ, సుభాషిణి, సహాయ కార్యదర్శులుగా షేక్.కాశిం, ఐ.వెంకటేశ్వరరావులను నియమించారు. వీరితో పాటు మరో 38 మంది కార్యవర్గ సభ్యులూ ఉన్నారు. -
కోనసీమ ఘటన.. ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అని నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. అమలాపురం ఘటనపై ఆయన స్పందిస్తూ.. దాడులు దారుణమని, నాయకుల ఇళ్లు తగులబెట్టడం సమంజసం కాదన్నారు. అంబేడ్కర్ పేరు జిల్లాకే కాదు.. దేశానికే పెట్టాలన్నారు. దేశానికి అంబేడ్కర్ ఇండియాగా పేరు మార్చాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మాట తప్పారన్నారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! -
ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, కాకినాడ సిటీ: ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరమని సినీ నటుడు, దర్శక నిర్మా త ఆర్.నారాయణమూర్తి అన్నారు. స్వస్థలమైన రౌతులపూడి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన శివాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఊరిలో గుడి ఉంటే మనిషి పాపభీతితో తప్పులు చేయకుండా ఉంటాడని, బడి ఉంటే చదువు ద్వారా జ్ఞానం, వికా సం వస్తాయని చెప్పారు. ఆసుపత్రి ఉంటే అనారోగ్య సమస్య వచ్చినవారు కుదుట పడతారన్నారు. శివాలయం పునఃప్రతిష్ఠకు వేలాదిగా ఊరి జనంతో పాటు చుట్టుపక్కల ప్రజలు, భక్తులు తరలిరావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. శివాలయం పునర్నిర్మాణం అంశాన్ని ఆలయ కమిటీ తన దృష్టికి తీసుకు రాగా.. గత ప్రభుత్వంలో దేవదాయ శాఖ ఆధ్వర్యాన రూ.55 లక్షలు మంజూరు చేశారని చెప్పారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మాజీ అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజస్తంభం ఏర్పాటుకు తన శాఖ నుంచి ఎటువంటి అడ్డంకులూ లేకుండా అనుమతులు ఇచ్చారని చెప్పారు. గ్రామ పెద్దలు పైలా సాంబశివ, అరిగర్ల రామకృష్ణ, ఈరంకి ప్రభాకరరావు, యిటంశెట్టి భాస్కరరావు, వాసిరెడ్డి కృష్ణమూర్తి, నాగబాబు, ఊరిలోని ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు చందాలు ఇచ్చి ఆలయాన్ని బ్రహ్మాండంగా నిర్మించారని నారాయణమూర్తి కొనియాడారు. చదవండి: (24 గంటలలోపే.. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు) -
సీల్ చేసిన థియేటర్లను ఓపెన్ చేసేందుకు అనుమతి
-
జేసీలే థియేటర్లకు అనుమతులు ఇస్తారు
సాక్షి, అమరావతి/ చిలకలపూడి (మచిలీపట్నం): నిబంధనలు పాటించని సినిమా థియేటర్ల యజమానులు వారి తప్పు తెలుసుకుని లైసెన్స్ రెన్యువల్, ఇతర అనుమతుల కోసం జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. సినిమాలు చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు వచ్చే థియేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్షగట్టి థియేటర్లు మూసేయిస్తోందని విమర్శిస్తున్న వారు ఏదైనా ప్రమాదం జరిగితే మళ్లీ ప్రభుత్వం పైనే బురద జల్లుతారని అన్నారు. అనుమతుల్లేకుండా థియేటర్లు నడపడం ధర్మమని వారు ఎలా చెబుతారని నిలదీశారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తితో కలసి కృష్ణా జిల్లాకు చెందిన థియేటర్ల యజమానులు పలువురు మంత్రి పేర్ని నానితో మచిలీపట్నంలో గురువారం సమావేశమయ్యారు. అనంతరం మంత్రి పేర్ని నాని, నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం థియేటర్లపై చర్యలు తీసుకునే అధికారం, సీజ్ చేసిన థియేటర్లకు మళ్లీ షరతులతో అనుమతులు ఇచ్చే అధికారం జాయింట్ కలెక్టర్లకే ఉందని మంత్రి స్పష్టంచేశారు. బీ ఫారం లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని, అగ్నిమాపక శాఖ నిర్దేశిత ప్రమాణాలు పాటించి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసీలు), ఇతరత్రా అనుమతులు తీసుకోవాలని థియేటర్ల యజమానులకు సెప్టెంబరులోనే చెప్పామన్నారు. డిసెంబర్ ముగుస్తున్నప్పటికీ కొన్ని థియేటర్లు ఆ అనుమతులు పొందేలేదన్నారు. ప్రభుత్వం సానుభూతితో, సానుకూల ధోరణితో వ్యవహరించినప్పటికీ నిబంధనలను పాటించకపోవడం సరికాదని చెప్పారు. అనుమతులు పొందని థియేటర్లలో జాయింట్ కలెక్టర్లు తనిఖీలు చేయకుండా ఎలా ఉంటారని మంత్రి ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి వ్యతిరేకం: ఆర్. నారాయణమూర్తి సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి తాను వ్యతిరేకమని ఆర్. నారాయణమూర్తి స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు పెంచుకోవడం అధికారిక బ్లాక్ మార్కెట్ వంటిదేనన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలు, సగటు మనుషులను దృష్టిలో పెట్టుకుని టికెట్ల రేట్లు నిర్ణయించాలని చెప్పారు. సినీ పెద్దలు వ్యక్తిగత అభిప్రాయాలకు పోకుండా పరిశ్రమ మనుగడ కోసం ఆలోచించి ప్రేక్షకులను ఆనందపరచాల్సిన అవసరం ఉందన్నారు. సినిమా తీసేవారు, చూపేవారు, చూసే వారు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుందని అన్నారు. సినీ పెద్దలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్లి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి తాను మంత్రిని కలిసినట్లు తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు సమన్వయంతో ముందుకు వెళతారని ఆశిస్తున్నానన్నారు. చదవండి: (ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు) -
వాటికి వ్యతిరేకంగానే నా సినిమా: ఆర్.నారాయణమూర్తి
హాలియా : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అంతమొందించే వరకు కార్మికులు, కర్షకులు ఐక్యతతో పోరాడాలని, రైతుల పోరాటానికి మద్దతుగా వారిని చైతన్య పరిచేందుకు రైతన్న సినిమాను తీసినట్లు సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. బుధవారం హాలియాలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కున్రెడ్డి నాగిరెడ్డి, కొండేటి శ్రీను, అవుతా సైదయ్య, కుర్ర శంకర్‌నాయక్, దుబ్బా రామచంద్రయ్య, జువాజీ వెంకటేశ్వర్లు, పొదిల వెంకన్న, రవినాయక్, యూసూబ్, శ్రీను, యాదయ్య, యడవెల్లి శ్రీను, ఎస్కె జానీపాషా, రవి, రవీందర్ తదితరులు ఉన్నారు. (చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం) ‘రైతన్న’ను ఆదరించాలి: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే భగత్ సమాజహితం కోసం ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి నిర్మించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ కోరారు. బుధవారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆర్ నారాయణమూర్తి ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన వ్యవసాయ విద్యుత్ సంస్కరణలను పునర్ సమీక్షించాలన్నారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడడంతో పాటు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతన్న సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వి«ధానాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నాగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గౌరవసలహాదారు వెంపటి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కౌన్సిలర్ వెంకటయ్య, నాయకులు చాపల సైదులు, సురభి రాంబాబు, దోరేపల్లి వెంకటేశ్వర్లు, బందిలి సైదులు, రావుల లింగయ్య ఉన్నారు. చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
జనారణ్య మూర్తి
-
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది
‘‘దేశానికి అన్నం పెట్టే అన్నదాత రుణం మనందరం తీర్చుకోవాలి. ఎక్కడ రైతు బాగుంటాడో అక్కడ నాగరికత, సమాజం, సంస్కృతి బాగుంటాయి. దేశానికి వెన్నెముక అయిన రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేదే నా ‘రైతన్న’ చిత్రం’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రైతన్న’ సినిమా ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ‘రైతన్న’ నేపథ్యం, ఇతర విశేషాలను నారాయణమూర్తి ఈ విధంగా చెప్పారు. ► ఈ భూమిపైన ఎవరు ఏ వస్తువు తయారు చేసినా వాళ్లే ధర నిర్ణయిస్తారు. అదేం ఖర్మో కానీ ఆది నుంచీ కూడా రైతులకు పెట్టడమే తెలుసు.. దోచుకోవడం తెలియదు.. దాని వల్ల ఇప్పటికీ కూడా మా పంటకు ఇంత ధర ఇవ్వండి అని అడగలేకపోతు న్నారు. అది రైతుల మంచి మనస్సుకు, గొప్పతనానికి నిదర్శనం. దాన్ని ఆసరాగా చేసుకుని దళారులు మార్కెట్లలో రైతుల్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఒక ధర నిర్ణయించి, ఆ ధరకు పంటలు కొనుగోలు చేయమని ఆదేశించినా అక్కడున్న సొసైటీల్లోని సిబ్బంది, అధికారులు, మిల్లర్లు తరుగు పేరు చెప్పి దారుణంగా దోచుకుంటున్నారు. పెట్టడమే తప్ప దోచుకోవడం తెలియని రైతులు తమలో తాము కుమిలిపోతున్నారే కానీ ప్రశ్నించలేకపోతున్నారు. మా సినిమాలో వాటిని ప్రశ్నించాం. ► విత్తనాలు, కూలీలు, ఎరువులు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తీరా పంట చేతికొచ్చాక అమ్మితే గిట్టుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారు. రైతులు పండించిన పంటలతో వ్యాపారం చేసేవాళ్లు కోటీశ్వరులు అవుతున్నారు. కానీ రైతులు మాత్రం బికారీ అవుతున్నారు. దేశానికి రైతే వెన్నెముక అంటారు. కానీ వారు ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అయినా ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాలనూ ‘రైతన్న’లో ప్రస్తావించాం. ► కరోనా వంటి మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. కానీ అన్నదాతలు మాత్రం పొలం బాట పట్టి ఏడాదికి మూడు పంటలు పండించి దేశం ఆకలితో బాధపడకుండా చూశారు. అలాంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక, సాగు ఖర్చులు రాక అప్పుల బాధతో అర్ధాకలితో ఉంటే పాలకులు పట్టించుకోరా? పంటలకు సరైన మద్దతు ధర వస్తే అన్నదాతలు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వారి కుటుంబాలు ఎందుకు రోడ్డున పడతాయి? అని ప్రభుత్వాలు ప్రశ్నించుకోవాలి. అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు వచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. ► కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల తమకు తీరని నష్టం అని, వాటిని రద్దు చేయాలని ఢిల్లీ వేదికగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలో మార్పు రావడం లేదు. నూతన వ్యవసాయ సాగు చట్టాలను రెండేళ్ల పాటు అమలు చేయొద్దని, నూతన కమిటీ వేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. రైతులతో పలుమార్లు చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు మాత్రం చర్యలు తీసుకోకుండా మళ్లీ మళ్లీ చర్చలకు ఆహ్వానించడంలో ఆంతర్యం ఏంటి? ► కార్పొరేట్ వ్యవసాయం తొలుత లాభదాయకంగా ఉన్నా ఆ తర్వాత వారు చెప్పిన ధరలకే పంటలను అమ్ముకోవాల్సి వస్తుంది.. దీంతో రైతులే వారి పొలాల్లో కూలీలుగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో 75శాతం ఉన్న వ్యవసాయం ప్రస్తుతం 52 శాతానికి పడిపోయింది. ఆ 52 శాతంలో 41 శాతం కౌలు రైతులే ఉన్నారు. ‘పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం వల్లే సాగు అప్పులు పెరిగి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వారి ఆత్మహత్యలు ఆగాలంటే వారి కష్టానికి అదనంగా 50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలి’ అంటూ 2006లో డా.స్వామినాథన్ కమిటీ యూపీఏ ప్రభుత్వానికి నివేదికలు అందించింది.. కానీ ఇప్పటివరకూ అమలు పరచడం లేదు. అవి అమలైతేనే రైతులు సంతోషంగా ఉంటారు. ► బీహార్ రాష్ట్రంలో ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటాలు (100 కిలోలు) ధాన్యం గతంలో 1800 ధరకు విక్రయిస్తుండగా ప్రస్తుతం 800 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రా లు కచ్చితంగా ఉండాలి. ప్రైవేటు వారు కూడా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చట్టాలు తీసుకురావాలనే విషయాన్ని కూడా చూపించాం. ► రైతుల సమస్యలేంటి? ప్రభుత్వ వాదనలు ఏంటి? వాటి పరిష్కారం ఎలా? అనే విషయాలను ‘రైతన్న’లో చూపించాం. రైతు కుటుంబంలోని అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కూడా ముందుకు రానివారు ఉంటే ఆ రైతుల మనోవేదన ఎలా ఉంటుంది? అనే విషయాలను కూడా మా చిత్రంలో ప్రస్తావించాం. రైతులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు... ఇలా అందరూ చూడాల్సిన సినిమా మా ‘రైతన్న’. -
ఆదర్శనీయం వంగపండు జీవితం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు జీవితం ఎందరికో ఆదర్శనీయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో బుధవారం వంగపండు ప్రసాదరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..సాంస్కృతిక, కళా రంగానికి వంగపండు జీవితం అంకితం చేశారని చెప్పారు. ప్రజాకవి గుమ్మడి విట్టల్‌రావు (గద్దర్) మాట్లాడుతూ..కళాకారులంతా వంగపండు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. వంగపండుకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని గౌరవం కల్పించిందన్నారు. ఆయన చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందని గుర్తుచేశారు. బీచ్‌రోడ్డులో వంగపండు విగ్రహం ఏర్పాటుకు చర్యలు, ఏటా ఆయన పేరిట ఓ కళాకారుడికి రూ.2 లక్షల నగదు అవార్డు ప్రదానం చేయడం మంచి నిర్ణయమన్నారు. కళాకారులకు సీఎం వైఎస్ జగన్ ఎంతో గౌరవం ఇస్తున్నారంటూ సభాముఖంగా సెల్యూట్ చేశారు. గద్దర్, ఆర్.నారాయణమూర్తి, విమలక్క తదితరులు తమ ఆటపాటలతో అలరించారు. బాడ సూరన్నకు అవార్డు ప్రదానం శ్రీకాకుళం జిల్లాకు చెందిన జానపద కళాకారుడు బాడ సూరన్నకు జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సత్కరించారు. అవార్డులో భాగంగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం తరఫున అందించారు. బాడ సూరన్న మాట్లాడుతూ..తన 36 ఏళ్ల జీవితంలో కళను, కళాకారుడిని ఇంతలా గౌరవించిన ప్రభుత్వం మరొకటి చూడలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకరరావు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఏపీ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైరపర్సన్ వంగపండు ఉష, వీఎంఆర్డీఏ చైరపర్సన్ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్‌కుమార్, రాష్ట్ర విద్యాభివృద్ధి మౌలిక సదుపాయాల సంస్థల చైర్మన్ మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాడ సూరన్నకు వంగపండు అవార్డు అందజేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖటప్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో జానపద వాగ్గేయకారుడు వంగపండు వర్ధంతి సభ బుధవారం ఘనంగా జరిగింది. జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో..బాడ సూరన్నను సత్కరించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున మంత్రి బాడ సురన్నకు రూ.2 లక్షలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ‘‘నా గురువు వంగపండు పాట ద్వారా అవార్డు దక్కడం గర్వంగా ఉంది’’ అన్నారు సూరన్న. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగపండు వర్ధంతి సభను ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయం. వంగపండు విగ్రహ ఏర్పాటు ద్వారా కళాకారులకు గుర్తింపు లభించింది. సీఎం వైఎస్ జగన్‌కు కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. -
సీఎం జగన్‌కు సెల్యూట్ చేస్తున్నా: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, అనంతపురం: పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా కొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సెల్యూట్ చేస్తున్నానని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఎంతోమంది చిన్న నటీనటుల సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఆ జీవో ఆశాకిరణంగా మారిందన్నారు. గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆర్.నారాయణమూర్తి తాను నిర్మిస్తున్న 'రైతన్న' సినిమా విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ.. చిత్రపరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాను నిర్మించిన రైతన్న చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్నట్లు తెలిపారు. -
ఉద్యమానికి ఊతం ‘రైతన్న’: ఆర్ నారాయణమూర్తి
‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న పోరాటం ఇతివృత్తంగా ‘రైతన్న’ చిత్రాన్ని రూపొందించాను. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాను’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన ఈ సినిమా కార్యక్రమంలో రైతు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ – ‘‘రైతులకు కావాల్సింది ఒకే ధర, ఒకే మార్కెట్ కాదు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగని పోరాటాలు సాగిస్తున్న అన్నదాతలపై ‘రైతన్న’ తీశాను. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో 75 శాతం మందికి సినిమానే వినోదం. సినిమా థియేటర్లు పునఃప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘రైతు ఉద్యమానికి ‘రైతన్న’ సినిమా గొప్ప ఊతం ఇస్తుంది’’ అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు . ‘‘రైతులే ప్రధానాంశంగా నారాయ ణమూర్తి సినిమా తీయడం గొప్ప విషయం’’ అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్రావు అన్నారు. రైతు సంఘాల నాయకులు ఆర్. వెంకయ్య, వై. కేశవరావు, జమలయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాకు ఏ కష్టాలు లేవు.. చాలా సంతోషంగా ఉన్నాను: ఆర్ నారాయణమూర్తి
సాక్షి, హైదరాబాద్: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించే స్థితిలో లేరని ప్రజా గాయకుడు గద్దర్ వ్యాఖ్యానించారంటూ నిన్నంత సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలు అవాస్తవం అని.. గద్దర్ వ్యాఖ్యలని వక్రీకరించారంటున్నారు ఆర్ నారాయణ మూర్తి. చానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం.. వ్యూస్ కోసం తనపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడిన వీడియోను రిలీజ్ చేశారు. దీనిలో ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి తనకు సాధారణంగా జీవించడం ఇష్టమని.. చాప, దిండే తనకు హాయిగా ఉంటుందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అప్పులు చేయడం.. తీర్చడం సర్వ సాధారణం అన్నారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని.. తనకు ఎలాంటి కష్టాలు లేవని.. ఎంతో రిచ్‌గా బతుకుతున్నాని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండటం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నిజంగా తనకు సమస్యలుంటే సాయం చేసే మిత్రులు ఎందరో ఉన్నారని తెలిపారు ఆర్ నారాయణమూర్తి. సోషల్ మీడియాలో తన గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం వల్ల తన అభిమానులు, స్నేహితులు ఎంతో బాధపడుతున్నారన్నారు. వారంతా తనకు కాల్ చేసి.. ఏమైంది.. డబ్బులు కావాలంటే మేం ఇస్తాం. నీ అకౌంట్ నంబర్ పంపమని కోరుతున్నారని.. ఇవన్ని తనను ఎంతో బాధపెడుతున్నాయన్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని.. దండం పెడతానంటూ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. -
వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు
కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, తక్షణమే వాటిని రద్దు చేయాల్సిందేనని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏఐకేఎస్‌సీసీ, ఎస్‌ఎఎంల పిలుపుమేరకు శనివారం నిర్వహించిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఇందిరాపార్కు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరిన రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాలనేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ నా యకులు ఆజీజ్‌పాషా, సీపీఎం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు పశ్యపద్మ, పీవోడబ్ల్యూ సంధ్య, ఝాన్సీ, సీఐటీయూ రమ, వివిధ సంఘాల నేతలు ఎస్ ఎల్ పద్మ, అనురాధ ఉన్నారు. చదవండి: Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక -
ఆ చట్టాలు రద్దు చేయాల్సిందే : ఆర్.నారాయణమూర్తి
సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు శాపాలుగా మారాయని, తక్షణమే వాటిని రద్దు చేయాల్సిందేనని నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఏఐకేఎస్‌సీసీ, ఎస్‌ఎఎంల పిలుపుమేరకు శనివారం నిర్వహించిన ఛలో రాజ్‌భవన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఇందిరాపార్కు నుంచి రాజ్‌భవన్‌కు ర్యాలీగా బయల్దేరిన రైతు సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతు సంఘాలనేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ నాయకులు ఆజీజ్‌పాషా, సీపీఎం నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం నాయకులు పశ్యపద్మ, పీవోడబ్ల్యూ సంధ్య, ఝాన్సీ, సీఐటీయూ రమ, వివిధ సంఘాల నేతలు ఎస్ ఎల్ పద్మ, అనురాధ ఉన్నారు. -
పద్మ అవార్డుల్లో ‘బుర్రా’కు తీరని అన్యాయం
తెనాలి: భరతముని నాట్య శాస్త్రాన్ని రంగస్థలంపై అనుసరించిన మహానటుడు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రికి రాష్ట్ర ప్రభుత్వం 14 పర్యాయాలు సిఫార్సు చేసినా, కేంద్రం పద్మశ్రీ అవార్డు ఇవ్వలేకపోయిందని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రంగస్థ్థలంపై స్త్రీ పాత్రలో సహజంగా నటించిన సుబ్రహ్మణ్యశాస్త్రిని అతని భార్యే గుర్తుపట్టలేకపోయారని దీనికి మించిన అవార్డు మరొకటి లేదని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బుధవారం కళల కాణాచి సంస్థ ఆధ్వర్యంలో బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రఖ్యాత నటుడు జీఎస్ఎన్ శాస్త్రికి ప్రదానం చేశారు. ఆర్.నారాయణమూర్తి, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌లు రూ.25 వేల నగదు, జ్ఞాపికతో శాస్త్రి దంపతులను సత్కరించారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ..హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో తెనాలికి చెందిన మహనీయుల విగ్రహాలతో తెనాలి బండ్‌ను త్వరలోనే సాకారం చేయనున్నట్లు చెప్పారు. అవార్డు గ్రహీత శాస్త్రి తనకు పురస్కారంతో పాటు వచ్చిన రూ.25 వేలను సంస్థ కార్యకలాపాలకే వినియోగించాలని కోరుతూ దాన్ని నిర్వాహకులకు అందజేశారు. సభకు వేదగంగోత్రి ఫౌండేషన్, విజయవాడ వ్యవస్థాపకుడు వరప్రసాద్ అధ్యక్షత వహించారు. -
నాడు ఎన్టీఆర్.. నేడు వైఎస్ జగన్
వజ్రపుకొత్తూరు: బీసీలను చట్ట సభలు, స్థానిక సంస్థల్లో నాడు ఎన్టీఆర్ అగ్ర భాగాన నిలిపితే నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 62 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పార్లమెంట్లో 54 శాతం సీట్లను ఇచ్చారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం పూండి సాయివినీత్ విద్యా సంస్థల ప్రాంగణంలో మత్స్యకార సామాజిక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో మత్స్యకార సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభ, విశాఖ–ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు.ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటీకరణ దుర్మార్గమని, 2000 సంవత్సరంలో గంగవరం పోర్టును సైతం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. సీఎం జగన్ అలాంటి పనులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. -
సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, అమరావతి: ఏలేరు–తాండవ కాలువల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. ‘సాక్షి’తో నారాయణమూర్తి మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు. ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్‌కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. ఈ పనులకు రూ.470 కోట్లు మంజూరు చేసేందుకు సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఈఎంసీకి కేంద్రం పచ్చజెండా ప్రగతి పథంలో 'పల్లెలు'.. అభివృద్ధి పరుగులు -
‘ఉక్కు’ను కాపాడుకుంటాం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతామని సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, 64 కళలు.కామ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్‌ను, ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి, విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా కళాకారులు ప్రదర్శించిన పెయింటింగ్స్, కార్టూన్స్ ఎగ్జిబిషన్‌ను నారాయణమూర్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేవరకు పోరాటం కొనసాగుతుందన్నారు. -
‘సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనపై సినిమా తీస్తా’
సాక్షి, విశాఖపట్నం : సర్కారు బడుల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై సినిమా నిర్మించనున్నట్లు ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి తెలిపారు. ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని తెలిపారు. ఆదివారం నర్సీపట్నం వచ్చిన ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ సామాజిక అంశాల ఆధారంగా సందేశాత్మకంగా ఈ సినిమా ఉంటుందన్నారు. కరోనా చిత్ర పరిశ్రమంపై తీవ్ర ప్రభావం చూపించిందని, ఈ కారణంగా సినిమా నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. తాను తీయబోయే సినిమాను విశాఖ, విజయనగరం జిల్లాల్లో చిత్రీకరిస్తానని తెలిపారు. చదవండి: అపర భగీరథుడు.. సీఎం జగన్ -
అపర భగీరథుడు.. సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయొచ్చని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రెండు జిల్లాల్లోని మెట్ట ప్రాంత రైతు సమస్యల శాశ్వత పరిష్కారానికి చొరవ చూపిన అపర భగీరథుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. తూర్పుగోదావరి జిల్లా అంటే.. కోనసీమ, గోదావరి డెల్టా అని చాలామంది అనుకుంటారని.. కానీ ఆ జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఈ ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాండవ రిజర్వాయర్ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి.. వెంటనే తగిన కార్యాచరణ చేపట్టడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అనుసంధాన ప్రాజెక్టుతో తాండవ, ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆర్. నారాయణమూర్తి సినిమాకు 25 ఏళ్లు
పాతికేళ్ళ తరువాత కూడా ఒక సినిమా గుర్తుందంటే... అందులోని పాత్రలు, పాటలు, అభినయం గుర్తున్నాయంటే.. ఆ సినిమా కచ్చితంగా ప్రత్యేకమే. దాసరి నారాయణరావు నిర్మాతగా, దర్శకుడిగా తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి హీరోగా రూపొందించిన ‘ఒరేయ్ రిక్షా’ ఆ ప్రత్యేకతను సంపాదించుకుంది. ఇవాళ్టికి ఈ సినిమాకు పాతికేళ్ళు. సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1995. అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు ఎందుకో కాలం కలసిరాలేదు. వరుసగా కొన్ని ఫ్లాపులు. ఆర్థికంగా అనుకోని ఆటుపోట్లు! గతంలో ఆయనతో హిట్లు సాధించిన అగ్ర హీరోలు కూడా ఆ సమయంలో డేట్లు ఖాళీ లేవంటూ బిజీ మంత్రం పఠించసాగారు. సరిగ్గా అప్పుడే ఆయనకు తన శిష్యుడు ఆర్. నారాయణమూర్తి, అతని కోసం గతంలో తాను అనుకున్న ఓ మదర్ సెంటిమెంట్ కథ గుర్తొచ్చాయి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..: అంతకుముందు కొన్నేళ్ళ క్రితం దాసరి ఓ తల్లి సెంటిమెంట్ కథ అనుకున్నారు. అప్పట్లో సామాజిక విప్లవ కథాంశాలతో ముందుకొస్తున్న టి. కృష్ణ దర్శకుడిగా, ఆర్. నారాయణమూర్తి హీరోగా దాసరి ఆ కథను నిర్మించాలనుకున్నారు. టి. కృష్ణతో మాట్లాడారు కూడా. అంతా ఓకే. కానీ, బిజీగా ఉన్న టి. కృష్ణ క్యాన్సర్ బారిన పడి కన్నుమూశారు. ఇప్పుడు టి. కృష్ణ లేరు. కానీ, ఆర్. నారాయణమూర్తి నమ్మినబంటులా గురువు గారి కోసం సిద్ధంగా ఉన్నారు. నిజానికి, ఈ మధ్య గ్యాప్‌లో నారాయణమూర్తి నిర్మాతగా, దర్శకుడిగా మారి, ‘అర్ధరాత్రి స్వతంత్రం, ఎర్రసైన్యం’ లాంటి వరుస విప్లవ సినిమాలు తీశారు. ఆ భారీ ఘన విజయాలతో ‘పీపుల్స్ స్టార్’ హీరోగా ఎదిగి, బిజీగా ఉన్న నారాయణమూర్తిని గురువు దాసరి పిలిచారు. గురువు గారి కోసం పైసా పారితోషికం లేకుండా, ఏం చేయడానికైనా శిష్యుడు సిద్ధమయ్యారు. మునుపటి తల్లీ కొడుకుల కథలో మరిన్ని అంశాలు జొప్పించి, లీడర్ వర్సెస్ క్యాడర్ అనేది ప్రధానాంశంగా, సినిమా తీద్దామన్నారు దాసరి. అలా దాసరి తన పేరు మీద దాసరి ఫిలిమ్ యూనివర్సిటీ పతాకం స్థాపించి, ఆ బ్యానర్‌పై తొలి సినిమాగా తీసిన చిత్రం ‘ఒరేయ్ రిక్షా’. సమకాలీన సామాజిక ఘటనలతో..: అంతకు ముందు వేషాల కోసం మద్రాసు వచ్చిన ఆర్. నారాయణమూర్తికి చిన్న వేషాలతో సినీజీవితమిచ్చిన దాసరి, కాలం మారి తన శిష్యుడు స్టార్ అయ్యాక, అడిగి హీరోగా పెట్టి మరీ తీసిన ఏకైక సినిమా ఇది. ఒక రాజకీయ నేత చెప్పిన మాటలు నమ్మి, అతని కోసం తన వాళ్ళతో ఓట్లన్నీ వేయించి, క్యాడర్‌గా ఒక రిక్షా కార్మికుడు శ్రమిస్తే, చివరకు ఆ లీడరే ఆ క్యాడర్ అందరినీ మోసం చేస్తే ఏమైందనేది కథాంశం. రాజకీయ నేతలు, పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ గనక ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడకపోతే, యువతరం మరో మార్గం లేక తుపాకీ పట్టుకొని అడవుల్లోకి పోవాల్సి వస్తుందని సినిమాలో చెప్పారు దాసరి. రిక్షా కార్మికుడు సూర్యంగా ఆర్. నారాయణమూర్తి, అతని భార్యగా రవళి, అతని చెల్లెలిగా మధురిమ (నటి ప్రభ మేనకోడలు), తల్లిగా శివపార్వతి, రాజకీయ నేతగా రఘునాథరెడ్డి నటించారు. నారాయణమూర్తి ప్రభృతుల అభినయం, నాటక రచయిత సంజీవి రాసిన పదునైన మాటలు, ముక్కురాజు కొరియోగ్రఫీ – ఇవన్నీ ‘ఒరేయ్ రిక్షా’ను పైయెత్తున నిలిపాయి. నీ పాదం మీద పుట్టుమచ్చనై..: దాసరితో సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్ పనిచేసిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత ఆ కాంబినేషన్లో ‘ఒసేయ్ రాములమ్మా’ సహా పలు చిత్రాలు వచ్చాయి. విప్లవ గాయకుడు గద్దర్ తాను రాసిన ‘రక్తంతో నడుపుతాను రిక్షాను..’ సహా పలు ప్రైవేట్ జనగీతాలను ఈ సినిమాలో వాడుకొనేందుకు అనుమతినిచ్చారు. ఆత్మీయుడు ఆర్. నారాయణమూర్తి కోసం పారితోషికమైనా తీసుకోలేదు. ఈ సినిమాలో ‘రక్తంతో నడుపుతాను.., జాగోరే జాగో జాగో.., జాతరో జాతర..’ – ఇలా అన్ని పాటలూ హిట్. అన్నాచెల్లెళ్ళ అనుబంధమూ కీలకమైన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా..’ అనే పాట రాసి ఇచ్చారు గద్దర్. ఈ పాట చిరస్థాయిగా నిలిచింది. ఆ పాట రాసిన గద్దర్‌కూ, పాడిన ‘వందేమాతరం’ శ్రీనివాస్‌కూ ఇద్దరికీ ప్రభుత్వం ఆ ఏడాది నంది అవార్డులు ప్రకటించింది. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో గద్దర్ ఆ అవార్డును తిరస్కరించడం వేరే కథ. మరపురాని గురుదక్షిణ: పూర్తిగా తిరుపతి పరిసరాల్లో, కొంత మద్రాసులో చిత్రీకరణ జరుపుకొన్న ‘ఒరేయ్ రిక్షా’ అప్పట్లో పెద్ద సంచలనం. పాతికేళ్ళ క్రితం 1995 నవంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్‌గా నిలిచింది. పేరుతో పాటు పైసలూ తెచ్చింది. మచ్చుకు చెప్పాలంటే – షూటింగ్ వేళ గురువు గారికి ఇబ్బంది లేకుండా, ఈస్ట్ గోదావరి రైట్స్ కోసమంటూ 20 లక్షలు ముట్టజెప్పారు నారాయణమూర్తి. సినిమా విడుదలయ్యాక ఏకంగా అక్కడ 60 లక్షలు వసూలు చేసింది. మళ్ళీ దాసరికి కొత్త ఊపు తెచ్చింది. సాక్షాత్తూ దాసరి సతీమణి పద్మ సైతం ‘‘మీ గురువు ఋణం తీర్చుకున్నావయ్యా. మళ్ళీ మీ గురువును నిలబెట్టావయ్యా’’ అని తనతో అన్న విషయాన్ని ‘పీపుల్స్ స్టార్’ ఇప్పటికీ చెమర్చిన కళ్ళతో గుర్తు చేసుకుంటారు. తరువాత దాసరి ‘ఒసేయ్ రాములమ్మా’ లాంటి మరో ఆల్ టైమ్ హిట్ తీయడం వెనుక ‘ఒరేయ్ రిక్షా’ ప్రభావం కనిపిస్తుంది. బడుగు, బలహీన వర్గాల ఆత్మాభిమానాన్నీ, ఆత్మగౌరవాన్నీ చాటిచెప్పిన ఈ రెండు చిత్రాలూ దాసరి కెరీర్లో మైలురాళ్ళుగా మిగిలిపోయాయి. సాక్షాత్తూ దాసరి సైతం హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో హీరో కృష్ణ, నిర్మాత ఎమ్మెస్ రెడ్డి సమక్షంలో ‘‘విప్లవ సినిమాలు తీయడం ఓ ముళ్ళబాట. ఆ ముళ్ళబాటను సరిచేసి, రాస్తాగా మార్చాడు నా బిడ్డ ఆర్. నారాయణమూర్తి. ఆ రాస్తాలో ఇవాళ నేను, అనేకమంది పయనిస్తున్నాం’’ అని సభాముఖంగా మెచ్చుకోవడం గురువు ముఖతః శిష్యుడికి దక్కిన ఓ అపూర్వ గౌరవం. ఓ శిష్యుడు చెల్లించిన గురుదక్షిణగా చరిత్రలో మిగిలిపోయిన చిత్రం – ‘ఒరేయ్ రిక్షా’. – రెంటాల జయదేవ -
ఆ పాట మీరు పాడొద్దని బాలూగారితో అన్నాను
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఘంటసాలగారి తర్వాత ఏయన్నార్, ఎన్టీఆర్ సినిమాలకు మళ్లీ ఎవరు పాడతారు? మాధవపెద్ది సత్యం తర్వాత ఎస్వీ రంగారావు, రేలంగి నరసింహారావులకు ఎవరు పాడతారు? పిఠాపురం నాగేశ్వరరావుగారి తర్వాత పద్మనాభం, రాజబాబుగార్లకు ఎవరు పాడతారు? పీబీ శ్రీనివాస్‌గారి తర్వాత కాంతారావుగారు, హరనాథ్‌గారికి ఎవరు పాడతారు? అని అనుకునే దÔ¶ లో ‘నేను పాడతాను’ అంటూ ఆ మహానుభావుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు వచ్చారు. టాలీవుడ్‌లోని అందరికీ పాటలు పాడి శభాష్ అనేలా చేశారు. వాళ్లకే కాదు.. నా సినిమాలు ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం, ఎర్రసైన్యం, కూలన్న, అన్నదాతా సుఖీభవ’ వంటి ఎన్నో చిత్రాలకు పాడారాయన. రామారావు, కృష్ణగార్లను ఎలా అనుకరిస్తూ పాడారో నన్ను కూడా అలానే అనుకరించి పాడి మెప్పించారాయన. నిజంగా నాలో ఆవహించాడా? అనేలా పాడారు. చాలామంది నేనే పాడాననుకునేవారు. కానీ ఆయనే పాడారు. నా చిత్రవిజయాలకు ఎంతో దోహదం చేశారాయన. ఒక్క తెలుగు చిత్రసీమలోనే కాదు.. తమిళ చిత్రసీమలో టీఎం సౌందరరాజన్‌గారి తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లకు ఎవరు పాడతారు? అంటే ‘నేను పాడతా’నన్నారు ఎస్పీబీ. కన్నడలో శ్రీనివాసరావుగారి తర్వాత రాజ్‌కుమార్‌గారికి ఎవరు పాడతారు? అంటే ‘నేను పాడతా’నన్నారు. దక్షిణాది శ్రోతలనే కాదు.. ఉత్తరాది శ్రోతలను కూడా మెప్పించారాయన. కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీగార్లు పాడే పాటలని బాలూగారు పాడారు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లేగార్లతో పోటాపోటీగా పాడి ఒప్పించి, మెప్పించి తెలుగుజాతి గౌరవాన్ని ఎగురవేసిన మహానుభావుడాయన. మహమ్మద్ రఫీగారి గొంతులో ఉన్న మార్దవం, మత్తు రెండూ బాలూగారి గొంతులో ఉన్నాయి. ఆయన గ్రేట్ సింగరే కాదు.. యాక్టర్ కూడా.. మంచి వ్యక్తి కూడా. ‘నారాయణమూర్తిగారు ప్రజల కోసం మంచి సినిమాలు తీస్తున్నారు.. ఆయన వద్ద డబ్బులు తీసుకోవద్దు’ అని బాలూగారు తన పీఏకి చెప్పడం ఆయన మానవీయ కోణం. కానీ నేను మాత్రం డబ్బులు తీసుకోవాలి సార్ అని దండం పెడితే ‘ఎంతో కొంత మీకు నచ్చినంత ఇవ్వండి’ అని తీసుకున్న మహానుభావుడాయన. ‘35ఏళ్లుగా సినిమాలు తీస్తూ నిలబడ్డావు కీపిట్ అప్’ అంటూ నన్ను ప్రోత్సహించారు. నా ‘ఎర్రసైన్యం’ సినిమాకి ‘వందేమాతరం’ శ్రీనివాస్ సంగీతం అందించారు. అందులోని ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..’ పాటని నువ్వే పాడు, ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా..’ పాటని బాలూగారితో పాడిద్దాం అని శ్రీనివాస్‌తో అన్నాను. రెండు పాటలూ ఆయనతోనే పాడిస్తే బాగుంటుందని అన్నాడు. ఎందుకంటే కొత్త సంగీత దర్శకుల చిత్రాల్లో బాలూగారు పాడితే అది ఓ క్రెడిట్ కదా. ‘పల్లెలెట్లా కదులుతున్నయంటే..’ పాటని బాలూగారు పాడుతున్నప్పుడు శ్రీనివాస్‌కి నచ్చినట్టు లేదు. అప్పుడు బాలూగారి వద్దకు నేను వెళ్లి ‘సార్.. అలా కాదు.. ఇలా పాడితే బాగుంటుందేమో?’ అన్నాను. మూడు నాలుగు సార్లు మార్చడంతో ఆయన నాపై కోప్పడ్డారు. ‘ఏంటి మూర్తి.. ఎన్నిసార్లు పాడాలి ఈ పాట’ అన్నారు. అప్పుడు నేను ఆయనతో ‘ఈ పాట మీరు పాడొద్దండి’ అన్నాను. అయినా కూడా ఆయన ఫీల్ కాలేదు. ‘మీరు సినిమా రచయిత.. డైరెక్టర్. మీరు ఎలా అంటే అలా?’ అని వెళ్లిపోతుంటే.. ‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా.. పాట మాత్రం మీరే పాడాలి సార్’ అంటే ‘తప్పకుండా’ అని పాడి ఊర్రూతలూగించారాయన. అదీ ఆయన గొప్పతనం.. గ్రేట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. అలాంటి మహానుభావుడి మరణం తీరనిలోటు.. ముఖ్యంగా నాలాంటివాళ్లకి. ప్రపంచంలో పాట ఉన్నంతకాలం బాలూగారు ఉంటారు.. ఆయన పాటకి నా పాదాభివందనం. -
జనం కోసం ఆడిపాడారు
నా మొదటి సినిమా ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’కి వంగపండు పాటలు రాశారు, పాడారు, నటించారు కూడా. ఆ సినిమా విజయానికి ఎంతో దోహదపడ్డారు. ఆయన ప్రజలకోసం రాసి, ఆడి, పాడి ప్రజల మనిషయ్యారు. మా వ్యక్తిగత విషయాల్ని పంచుకునేంత గొప్ప స్నేహం మాది. నా సినిమాలు ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ మొదలుకొని ‘ఆలోచించండి’, ‘భూపోరాటం’, ‘అడవి దివిటీలు’, ‘చీమలదండు’, ‘అన్నదాత సుఖీభవ’ తదితర చిత్రాలకు పాటలు రాయడంతో పాటు నాలుగైదు సినిమాల్లో నటించారాయన. నా ‘దండకారణ్యం’ చిత్రంలో ఆయనతో ప్రజాకవి వేషం వేయిద్దామనుకున్నాను. ఆ కవిని పోలీసులు నిర్భందించి, టార్చర్ పెట్టే సన్నివేశం ఉంది. ఆ సమయంలో ఆయన యాంజియోగ్రామ్ చేయించుకున్నారు. ఈ సన్నివేశాలు వచ్చినప్పుడు వంగపండుని తోసేస్తే అప్పుడు ఆయనకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనని, ‘ఈ వేషం మీరు వేయొద్దు సార్’ అని చెప్పాను. ఆయన చాలా ఫీలై, ఆ వేషం నేను వేయగలను అన్నారు. వృత్తిపట్ల ఆయనకున్న సెంటిమెంట్, అంకితభావం అలాంటిది. కానీ నేను ఆ పాత్ర చేయించలేదు. ‘ఏం పిల్లడో ఎల్ద మొస్తవా..’, ‘యంత్రమెట్లా నడుస్తున్నదంటే...’, ‘ఎక్కడపుట్టి ఎక్కడ పెరిగామో...’, ‘మా పోరు ప్రజా పేరు...’, ‘రైతు తిరుగుబాటు..’, ఇలా నా చిత్రాల్లో ఎన్నో పాటలు రాశారు, పాడారు. జానపద కవిగా, పీడిత ప్రజల పక్షపాతిగా ఆయన జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. -
ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది: నారాయణమూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయనని ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) వంగపండు నా అర్ధరాత్రి స్వతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు, పాడారు, నటించారు. తర్వాత కూడా నా అనేక చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణంతో ఉత్తరాంధ్ర పాట ఊపిరి ఆగింది. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు, సాహిత్య లోకానికే కాదు.. పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అంటూ పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. (వంగపండు మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం) ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం ఉత్తరాంధ్రకు తీరని లోటని మిధునం సినిమా నిర్మాత ఆనంద్‌రావు అభిప్రాయపడ్డారు. అతని పాట వింటే ఊపు వస్తుందని..పేద ప్రజల గుండెచప్పుడు ఆ పాటలో కనిపిస్తుంది. ప్రజల కష్టాలను పాట రూపంలో ఓదార్చిన వ్యక్తి వంగపండు. అలాంటి ప్రజా గాయకుడు మళ్ళీ ఈ తరంలో కనిపిస్తారా. తన చిన్నతనంలో వంగపండు పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహాన్ని పొందేవాడినని నిర్మాత ఆనంద రావు అన్నారు. -
జగన్ గారికి హ్యాట్సాఫ్
‘‘విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఘటన బాధాకరం. ఈ ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థను ప్రధాని మోదీగారు నిషేధించాలి’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నారాయణమూర్తి స్పందిస్తూ– ‘‘1985, 1990 దశకంలో భారతదేశంలో పీవీ నరసింహారావుగారు ప్రధానిగా, మన్మోహన్ సింగ్గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల జరిగిన దుష్పరిణామాల్లో ఇదొకటి. బహుళ జాతి కంపెనీలను, కార్పొరేట్ శక్తులను, ప్రైవేట్ శక్తులను అభివృద్ధి పేరుతో మన దేశంలోకి ఆహ్వానిస్తున్నాం. దాని దుష్పరిణామమే ఈరోజు దక్షిణ కొరియాకి సంబంధించిన కంపెనీలో జరిగిన దుర్ఘటన. బాగా వెనకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినా ఇవ్వలేదు. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిగారు నవరత్నాలను అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారిని తట్టుకొని ప్రజలకు ది బెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులున్నాయా? లేవా? అని కూడా చూడకుండా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించి మానవతను చాటుకున్న జగన్‌గారికి హ్యాట్సాఫ్. నరేంద్ర మోదీగారు ఇప్పటికైనా స్పందించి, జాతీయ విపత్తు నిధి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నిధులు మంజూరు చేయాలి’’ అని అన్నారు. -
చెవిన ఇల్లు కడుతున్న మేస్త్రి
విప్లవ వీరుడు.. అల్లూరి. విప్లవ చిత్రాల కార్మికుడు.. ఆర్.నారాయణమూర్తి. మేస్త్రి బాబ్జీకి వీళ్లిద్దరూ ఆదర్శం. ఆ వీరుడి సమర శీలత.. ఈ కార్మికుడి సేవాభావం.. బాబ్జిని నడిపిస్తున్నాయి. చాలాదూరం నడిచాడు. ఇప్పుడు ‘చైతన్యరథం’ ఎక్కాడు. లాక్డౌన్ కష్టాలను తీరుస్తూ.. కరోనాతో కేర్‌ఫుల్‌గా.. సాటివారితో కనికరంగా ఉండమని చెబుతున్నాడు. లాక్‌డౌన్‌తో చాలామందికి ఉద్యోగాలకు, ఉపాధికి దూరమై ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏరోజుకారోజు జీవనాధారం వెదుక్కునే చిరుజీవులకైతే పనులే లేకుండా పోయాయి. ఎన్నో కుటుంబాలు పస్తులుంటున్నాయి. అలాంటి వారిని తనకు చేతనైనంతలో ఆదుకునేందుకు ముందుకొచ్చాడు తూర్పుగోదావరి జిల్లాలోని కోటనందూరు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ లక్కాకుల బాబ్జీ. బాబ్జికి విప్లవ చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అంటే అభిమానం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కరోనా కష్టకాలంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు కదిలాడు. ‘అల్లూరి సీతారామరాజు సేవా కమిటి’ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, లాక్డౌన్ ప్రారంభమైన నాటినుంచి తన మేస్త్రీ మిత్రులను కూడగట్టి వారిచ్చే ఆర్థిక తోడ్పాటుతో తూర్పు, విశాఖ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు పంచిపెడుతున్నాడు. కోటనందూరు.. తూర్పు–విశాఖ జిల్లాలకు సరిహద్దు గ్రామం. లాక్డౌన్ బాధితులకు ఆహార సరుకులు పంపిణీని ప్రారంభిస్తున్న కోటనందూరు పోలీస్ అధికారులు ఏజెన్సీలో ఉన్నవారు తమ అవసరాల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. లాక్డౌన్ సమయంలో కాలినడకన అలా వస్తున్న ఎంతోమంది బాటసారులు ఆకలితో బాధపడడం చూసిన బాబ్జి వారి కోసం కూడా ఆహార పంపిణీ చేపట్టాడు. అంతేకాదు, వైరస్ విస్తరించకుండా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇప్పుడు నగరాలు, గ్రామాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కార్యోన్ముఖుడయ్యాడు. తన పాత ద్విచక్ర వాహనాన్ని చైతన్యరథంగా మార్చి మైక్ పట్టుకుని సామాజిక దూరం పాటించాలని చెబుతున్నాడు. పరిశుభ్రత పాటించడం ద్వారానే వైరస్‌ను నిరోధించగలం అని అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటికి దాదాపు 200 గ్రామాలతో పాటు విశాఖపట్నం, కాకినాడ నగరాల్లో ప్రచారం చేశాడు. బాబ్జీ ఇలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లాల్లోని కోటనందూరు, అల్లిపూడి గ్రామాల్లో ఆనాడు తిరిగారు. ఆ విషయాన్ని చెప్పేందుకు బాబ్జి గతంలో ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో సీతారామరాజు విగ్రహాలను ఏర్పాటు చేయించి ఆనాటి చరిత్రను నేటి విద్యార్థులకు తెలిసేలా చేశాడు. తనెంతో అభిమానించే ఆర్. నారాయణమూర్తి గత ఏడాది జరిగిన ఓ కార్యక్రమంలో తనను అభినందించడం బాబ్జిలోని సామాజిక సేవా భావనను మరింత పురికొల్పింది. – నానాజీ అంకంరెడ్డి, సాక్షి, హైదరాబాద్ ఇది నా బాధ్యత ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోంది. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ తోటివారికి సాయం చేస్తున్నారు. నా స్థాయిలో నేను చేయగలిగినంత సాయం అందిస్తున్నాను. ‘కుదిరితే సాయం చేయి గాని ఎవరికీ కీడు తలపెట్టకు’ అని నా గురువు ఆర్. నారాయణమూర్తి గారు చెప్పారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. – మేస్త్రీ బాబ్జీ -
పేదోళ్ల ‘ఇంగ్లిష్’ చదువుకు అడ్డు చెప్పొద్దు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ధనిక వర్గాలవారే కాకుండా బడుగు, బలహీనవర్గాల వారి పిల్లలు కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని, అందుకు కోర్టులు, నాయకులు అడ్డు చెప్పవద్దని సినీ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ‘పేద ప్రజలకు ఆంగ్ల విద్య’ అంశంపై శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు 90 శాతం ఉన్నారని, వారంతా ఆంగ్ల మాధ్యమ విద్య లేక ఉద్యోగావకాశాలు పొందలేక కూలీలుగా, వలసజీవులుగా మిగిలిపోతున్నారని చెప్పారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి నిరుపేదలకు విద్యనందిస్తే, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేసి 1వ తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించి అక్షరాస్యత పెంచేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగు మీడియంలో మంచి మార్కులు సాధించినా.. ఇంగ్లిష్ మీడియంలో చదివిన వారికే ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయని చెప్పారు. ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు తమ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు మూసివేయగలరా? వాళ్ల పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించగలరా అని సవాలు విసిరారు. రాష్ట్రానికి చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రంలో దీనికి అడ్డులేకుండా సహకరించాలని కోరారు. పేదోడి చదువుకి అడ్డు తగలవద్దని విజ్ఞప్తి చేశారు. బహుళ రాజధానులకు అడ్డు తగలకుండా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని ఆయన కోరారు. -
‘తెలుగు అమ్మలాంటిది.. ఇంగ్లీష్ నాన్న’
సాక్షి, శ్రీకాకుళం : బడుగు, బలహీన వర్గాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని సినీయర్ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన సీఎం జగన్‌తోనే సాధ్యమని తెలిపారు. శుక్రవారం జిల్లాలో పేద ప్రజల అభివృద్ధి, ఆంగ్ర విద్యపై సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుపూడి ప్రభాకర్, సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఆంగ్ల విద్య ద్వారా పేద, ధనిక అంతరాలు తగ్గుతాయని అన్నారు. (‘అప్పుడు మేం చాలా ఇబ్బందులు పడ్డాం’) ప్రస్తుత పరిస్థితుల్లో బడుగు, బలహీన వర్గాలకు ఇంగ్లీష్ విద్య అవసరమని ఆర్ నారాయణమూర్తి తెలిపారు. తెలుగు భాష అమ్మలాంటిదని, ఇంగ్లీష్ భాష నాన్నలాంటిదన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్ ఇంగ్లీష్ విద్య ప్రవేశపెడితే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి గొప్ప లైకికవాది అని ప్రశంసించారు. ఇంగ్లీష్ విద్య తీసుకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు అందరూ రుణపడి ఉంటారని, ఈ విధానానికి రాజకీయ నేతలంతా సహకరించాలని కోరారు. (సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్: ఆర్. నారాయణమూర్తి) -
అంబేద్కర్ ఆశయ సాధన సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యం
-
విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నా: నటుడు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని బుధవారం సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి స్పష్టం చేశారు. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు తర్వాత కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్‌కు తరలిపోవడంతో రాయలసీమ నష్టపోయిందనే భావం నుంచి ఇప్పుడు బయట పడుతున్నారని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో సూచించిన అంశాలను ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలుపరుస్తున్నారని తెలిపారు. చదవండి: విశాఖలో రాజధానిని స్వాగతిస్తున్నాం: టీడీపీ నేత -
సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్: ఆర్. నారాయణమూర్తి
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి స్వాగతించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఆర్. నారాయణమూర్తి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ...‘ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్. తెలుగు భాష కాపాడమంటున్న వారి ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడుకుంటున్నారు. మాతృభాషలో విద్యాబోధన జరగాలంటూ మరోవైపు వాళ్ల పిల్లల్ని మాత్రం కార్పొరేట్ సూళ్లలో చదవిస్తున్నారు. మా తరంలో ఇంగ్లీష్ మీడియంలో చదివినవాళ్లు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. తెలుగు మీడియంలో చదివితే బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్యూన్లు, బంట్రోతులు మాత్రమే అవుతారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
సీఎం జగన్‌పై ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు
సాక్షి, పశ్చిమగోదావరి : సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని ప్రాత్సహించలేదు. ఎవరైనా నాయకుడు పార్టీ మారాలని చూస్తే ఆ పార్టీకి, పదవికీ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషషన్లు కల్పించిన ఏకైక నాయకుడు సీఎం జగన్. మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే సినిమాను మీరందరూ చూడండి, ఆదరించండి. చూపించండి. భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఓటుకు నోటు, రూ.100 కోట్లు పెడితే ఎమ్మెల్యే, 200 కోట్లు పెడితే ఎంపీ టికెట్. ప్రజాస్వామ్యం ధన స్వామ్యం అయిపోయింది. ప్రజాస్వామ్యం సంతలో సరుకైపోయింది. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడం ద్వారా మన అందరి బతుకులు బాగుంటాయి అనేది ఈ చిత్రం. ఇసుక జల సంపద. భారత దేశంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతి సంపద, మూల సంపద అయిన ఇసుకను ఏ వ్యక్తుల చేతుల్లో లేకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి’అన్నారు. కాగా, నవంబరు 29న మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమా విడుదల కానుంది. -
సీఎం జగన్‌పై ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడం అభినందనీయమని సినీ హీరో, ప్రజా ఉద్యమకారుడు ఆర్. నారాయాణ మూర్తి అన్నారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం.. డబ్బుకు బలి అవుతున్న రాజకీయం’ అనే అంశంపై కర్నూలులో బీసీ, ఎస్సీ, మైనార్టీలు సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ చెప్పడం గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై విమర్శలు చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. స్నేహ చిత్ర బ్యానర్‌పై నిర్మించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అనే సినిమాను మరోసారి నవంబర్ 15న విడుదల చేస్తున్నామని, అందరు ఆదరించాలని కోరారు. -
ప్రజా సమస్యలపై సీఎం స్పందన అమోఘం
తిరుపతి కల్చరల్: ప్రజల సమస్యలపై తక్షణం స్పందించే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అని, సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు అమోఘమని ప్రజా కళాకారుడు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా రెండోసారి విడుదల నేపథ్యంలో తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించి ఆదుకోవాలని ఇటీవల ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలిపారు. ఏలేరు, టన్వా రిజర్వాయర్లను అనుసంధానం చేస్తూ ఏలేరు కాల్వను మరింత విస్తరించి మెట్ట ప్రాంతానికి పొడిగించడం ద్వారా నీటి కష్టాలు తీర్చాలని కోరినట్లు తెలిపారు. తాను సమస్య చెప్పగానే ముఖ్యమంత్రిగా ఆయన స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అప్పటికప్పడే సంబంధిత ఇంజనీర్లను పిలిచి ఇది ప్రజా సమస్య కనుక తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలు, రైతులను ఆదుకోవాలని చెప్పడం మహద్భాగ్యమన్నారు. తనతో పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, ప్రజాసంఘాల నేతల కోరిక మేరకు నవంబర్ మూడో వారంలో తాను నటించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నట్లు నారాయణమూర్తి తెలిపారు. -
మా సినిమా సారాంశం అదే: నారాయణమూర్తి
సాక్షి, కృష్ణా : మార్కెట్లో ప్రజాస్వామ్యం సినిమాను ప్రజలందరూ ఆదరించాలని సినీ నిర్మాత, హీరో, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి విఙ్ఞప్తి చేశారు. చిన్న సినిమాలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందన్నారు. శుక్రవారం పామర్రులో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో రాజకీయం అనేది బిజినెస్‌లా మారిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నదే తమ సినిమా ఉద్దేశమని పేర్కొన్నారు. నవంబర్ 14న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ విజయ యాత్రను మంగళవారం సప్తగిరి థియేటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ..భారత్‌లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని అన్నారు. నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరును విమర్శించారు. నేతలు ఓట్లను ఏవిధంగా కొంటున్నారు.. ఎన్నికలు అయ్యాక ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును ఈ సినిమాలో చూపించానన్నారు. అయితే ఫిరాయింపుదారులను కచ్చితంగా రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆయనను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. -
రూ.కోట్లు ఖర్చుపెట్టే వారికే టికెట్లు
ఉప్పల్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో రూ.100 కోట్లు ఖర్చు చేసే స్తోమత ఉన్న వారికే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు దక్కుతున్నాయని, అలాంటివారు గెలిచిన తర్వాత ప్రజాసేవ ఎలా చేస్తారని సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఏషియన్ థియేటర్లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నటుడు గౌతమ్‌రాజు, విక్రమ్‌గౌడ్‌లతో కలిసి ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. ఈ సినిమా ఓటు బ్యాంక్‌కు, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీశామని, నేటి యువత దీనిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. రాజకీయం వ్యాపారంగా మారిందని జనాభాలో పదిశాతం ఉన్న అగ్రకులస్తులు, 90 శాతం ఉన్న బడుగు, బలహీనవర్గాలను పాలిస్తున్నారన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. సామాజిక స్పృహ ఉన్నవారు, రాజకీయాలను మార్చాలనుకున్నవారు సినిమాను చూడాలని కోరారు. కార్యక్రమంలో భాస్కర్‌గౌడ్, పంజాల శ్రావణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైంది
‘‘ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. పవిత్రమైన ఓటు విలువ ఏంటి? భ్రష్టు పట్టిపోతున్న నేటి సమకాలీన రాజకీయాలు, అస్తవ్యస్తమైపోతున్న ప్రజాస్వామ్యాన్ని ఎలా మనం పరిరక్షించుకోవాలి?’’ అనే నేపథ్యంలో మా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా రూపొందింది అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన లీడ్రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా జూలై 12న రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రదర్శించారు. అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఎన్నికల కోసం రాజకీయ నాయకులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో ప్రజాస్వామ్యం ధనస్వామ్యమైంది. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే మా సినిమా అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది’’ అన్నారు. రాజకీయ నాయకులు వి.హనుమంతరావు, మధుసూదనాచారి, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, గాజుల శ్రీనివాస గౌడ్, జస్టిస్ ఈశ్వరయ్య, విమలక్క, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ తదితరులు సినిమాని చూసి, అభినందించారు. -
తండ్రులు చాలా గొప్పవారు
‘‘ధర్మేంద్ర, బెల్లంకొండ సురేష్ తమ కొడుకుల కోసం చాలా కష్టపడ్డారు. వాళ్లలాగా ఈరోజు గౌతంరాజు కూడా తన కొడుకుని హీరో చెయ్యాలని చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. అందుకే తండ్రులు చాలా గొప్పవారు. తండ్రి రుణం తీర్చుకోవాలని కృష్ణని కోరుతున్నాను. ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ సినిమా బాగా నచ్చింది. మంచి హిట్ అవుతుంది’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్ సూపర్‌మార్కెట్’. శ్రీనాధ్ పులకరం దర్శకత్వంలో బిజెఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘నారాయణమూర్తిగారు మంచి నీళ్లలాంటి వారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. గౌతంరాజు కోసం ఇంత మంది వచ్చారు. చిన్న సినిమాల్లోనే మాకు చాలా ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా వస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా అని గౌతంరాజు చెప్పగానే.. ‘ఎందుకు ఇంత రిస్క్ చేశావ్?’ అన్నాను. నా కొడుకుని హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నాను.. అది నా లక్ష్యం అన్నారు’’ అని నటుడు సుమన్ అన్నారు. ‘‘సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం కోసం నాకు చాలా మంది సహాయం చేశారు’’ అన్నారు గౌతంరాజు. ‘‘నా కెరియర్‌కి ఇది మంచి మూవీ అవుతుంది’’ అన్నారు కృష్ణ. ‘‘గౌతంరాజుగారికి కథ బాగా నచ్చి, సినిమా తీశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్’’ అని శ్రీనాధ్ పులకురవ్ అన్నారు. -
ప్రజాస్వామ్యం అంగట్లో అమ్మే సరుకు కాదు
ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుండి ఆర్. నారాయణమూర్తిగారి సినిమాలు చూస్తున్నాను. ఇప్పటికీ అదే పంథాలో తనదైన స్టైల్లో చక్కటి సందేశంతో ప్రతి సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘డబ్బుకోసం ఆలోచించి మూర్తిగారు ఏ రోజూ సినిమాలు తీయలేదు’ అన్నారు వీవీ వినాయక్. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థను నోటు ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో సందేశాత్మకంగా చక్కగా వివరించారు నారాయణమూర్తి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘ఎర్రసైన్యం’తో పాటు అనేక సిల్వర్ జూబ్లీ సినిమాలను నారాయణమూర్తి చేశారని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేస్తుంటారు’’’ అన్నారు దర్శకులు బి.గోపాల్. ‘‘చిన్న సందేశాలతో సినిమాలు చేయటానికే నేను భయపడి పోతాను. అలాంటిది ఇన్నేళ్లుగా ఓ కమిట్మెంట్తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తున్నారు ఆయన. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు శేఖర్ కమ్ముల. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. పది శాతం పాలిస్తూ, తొంభై శాతం పరిపాలించబడితే ప్రజాస్వామ్యం కాదు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జ్యోతిబాపూలే, అంబేద్కర్ చూపించిన బాటలో పయనించాలని ఈ సినిమాలో చూపించాను. ప్రజాస్వామ్యం అంటే అంగట్లో అమ్మే సరుకు కాకుండా, దానిని కాపాడుకోవాలి అని చాటి చెప్పే చిత్రమిది’’ అన్నారు. గద్దర్, ధవళ సత్యం, ఎల్బీ శ్రీరాం, గటిక విజయ్ కుమార్, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
మార్పు రావాలి
‘‘మన దేశంలో ఓట్లు అమ్ముడుపోతున్నాయి. పేరుకే ప్రజాస్వామ్యం. పదవుల్లో ఉన్నవారు ప్రజాసేవ గురించి కాకుండా సంపాదనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. ఈ విషయాలనే ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమాలో చూపించాం’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆర్. నారాయణమూర్తి నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఓటు హక్కు ఎంతో విలువైనది అంటుంటారు. అలాంటి ఓట్లనే కొంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారు. ఈ అంశాలనే మా చిత్రంలో ప్రస్తావించాం. ప్రజల్ని ఆలోచింపజేసే చిత్రం అవుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఆడియోకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజాకవులు రాసిన ప్రతి పాటకూ మంచి ఆదరణ లభిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా చెబుతాం’’ అని అన్నారు. -
ఈ నెలలో మార్కెట్లో ప్రజాస్వామ్యం
‘‘గ్రేట్ మ్యాన్ అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యం గురించి గొప్ప నిర్వచనం ఇచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని చెప్పారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో అది మరో రకంగా రూపాంతరం చెందింది. అదెలాగంటే ఫర్ ద పీపుల్ ఫార్ ఎవే ద పీపుల్, బై ద పీపుల్ అంటే బైయింగ్ ద పీపుల్, టూ ద పీపుల్ కాస్త టార్చరింగ్ ద పీపుల్‌గా రూపాంతరం చెందింది’’ అంటున్నారు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే ఫస్ట్ కాపీని సిద్ధం చేసుకుని సెన్సార్‌కి వెళతాను అంటున్నారాయన. ఈ నెలలోనే సినిమా విడుదల జరుపుకుంటుందని ఆయన తెలిపారు. ఇంకా నారాయణమూర్తి మాట్లాడుతూ–‘‘యం ఎల్ ఏ, యంపీ లుగా ఎలక్షన్లలో పోటీ చేయాలంటే 25 నుండి 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. వారు ఆ డబ్బును ఖర్చు చేసి, మళ్లీ ఆ డబ్బును సంపాదించే ఆదాయ మార్గాలను వెతుకుతున్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటానికా? ప్రజలతో వ్యాపారం చేయటానికా? ఒక పార్టీ గుర్తుపై పోటీచేసి, గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి ఫిరాయించే వాళ్లందరికీ బుద్ధి వచ్చేలాగా నా సినిమా ఉంటుంది. ఇదే మా సినిమాలో చూపించబోతున్నాం’’ అన్నారు. -
దాసరిగారు మనందరిలో జీవించే ఉన్నారు
‘‘చుట్టూ ఉన్నవారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం ఉన్నవారు మా గురువుగారు దాసరి నారాయణరావు. తండ్రి ప్రారంభించిన ఈ సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. రఘునాథ్ బాబు కొనసాగించడం నిజంగా హ్యాట్సాఫ్’’ అని దర్శకుడు–నటుడు–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. డాక్టర్ దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ‘నీడ’ తరపున దాసరి కుమార్తె హేమాలయా కుమారి, అల్లుడు డా. రఘునాథ్‌బాబు పలువురికి స్కాలర్షిప్లు అందించారు. కొంకపురి నాటక కళాపరిషత్‌కు 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువునే ఆస్తిగా ఇస్తున్నారు. తన దగ్గర పని చేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ, వారి పిల్లల చదువులకు గురువుగారి ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో జీవించే ఉన్నారు.. ఉంటారు’’ అన్నారు. ‘‘గురువుగారితో నాది ఎన్నో ఏళ్ల అనుబంధం. ఆయన వద్దకు సహాయం కోరి వచ్చే వారిలో ఫ్రాడ్స్ ఉన్నప్పటికీ, వారిని పెద్ద మనసుతో క్షమించి సాయం చేసిన అద్భుతమైన సేవామూర్తి దాసరి నారాయణరావు. ఆయన అందించే స్కాలర్షిప్లను తమ్మారెడ్డి భరద్వాజ, నేను ఫైనలైజ్ చేసేవాళ్లం’’ అన్నారు రేలంగి నరసింహారావు. ‘‘సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు. నిజమే కావొచ్చు కానీ మా గురువు దాసరిగారు నిజంగానే సేవ చేశారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కీర్తి అజరామరం. మా గురువుగారి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికీ ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతోమందికి దాన ధర్మాలు చేశారు. మా దృష్టిలో ఆయన ఎప్పటికీ దేవుడే. దాసరిగారి సేవలను ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లతోపాటు సినీరంగ ప్రముఖులు ధవళ సత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఓటు ఊపిరి లాంటిది
‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మన దేశంలో ఓటు అనేది ఒక బ్రహ్మాస్త్రం. కానీ, ప్రస్తుతం నోటుకు ఓటుని అమ్ముకుంటున్నారు. పవిత్రమైన ఓటు విలువను తెలియజేసే చిత్రం నా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. భవిష్యత్తు తరాల మనుగడకి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసే కథనంతో ఈ సినిమా నిర్మించాం’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాని మేలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్.నారాయణమూర్తి ఈ విధంగా మాట్లాడారు. ► ప్రజాస్వామ దేశంలో ఓటు ఊపిరి లాంటిది. ఓటు అనేది అందరి సమాన హక్కుగా అంబేద్కర్‌గారు రాజ్యాంగంలో రాశారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఓటు హక్కును అమ్ముకుంటున్నారు. ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఏమైపోతోంది ఈ ప్రజాస్వామ్యం? అని ఏడుపొస్తోంది. ఇండియాలో ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కళాకారులపై, జర్నలిస్టులపై ఉంది. మనం ప్రజల పక్షాన నిలిచినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడలో ఉండగలుగుతుంది. ► పార్టీ తల్లిలాంటిది. కానీ, ఓ పార్టీ గుర్తుపై గెలిచిన వారు స్వలాభం కోసం మరో పార్టీలో చేరుతున్నారంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. ప్రస్తుతం భారతదేశం అక్రమ పొత్తులపై కొనసాగుతోంది. పదవుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అధికార పక్షం ఒక్కటే కాదు.. బలమైన ప్రతిపక్షమూ ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నారు. ► నాయకులు అనేవారు ప్రజలకు మార్గదర్శకుల్లా ఉండాలి.. ఓటుకు డబ్బులిచ్చేవారు నాయకులు కారు.. వ్యాపారవేత్తలు.. వారు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినవారు గెలిచాక ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టరు.. ఖర్చు పెట్టిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలి? అని ఆలోచిస్తుంటారు. విజయనగరం, బొబ్బిలి, ఆలూరు, కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రదేశాల్లో మా సినిమా షూటింగ్ జరిపాం. చిత్రీకరణకి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే పాటలు రిలీజ్ చేసి, మేలో సినిమా విడుదల చేస్తాం. ఎల్.బి. శ్రీరామ్, కాశీ విశ్వనాథ్, గౌతంరాజు, కృష్ణనాయక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్, నిర్మాణ నిర్వహణ: రామకృష్ణారావు, కథ, కథనం, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఆర్ నారాయణ మూర్తి
-
వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అనంతపురం న్యూటౌన్: ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగి.. ప్యాకేజీకి ఓకే చెప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకోవడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా పోరు చేస్తున్న వైఎస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే తొలి ఓటు తానే వేస్తానని, అలాకాకపోతే భూస్థాపితం చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. -
బాహుబలి తర్వాత శరభ
‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్ వీడియోను ఆర్.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం. నా బ్యానర్లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు. -
రైతు బతుకుపోరే ఈ చిత్రం
‘‘సమస్యల కోసం పోరాడే ప్రజల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నా. నా ప్రతి విజయంలోనూ ప్రజా కవుల సహకారం ఉంది. 1995 నుంచి 2018 వరకు 3 లక్షల 25వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలని నా వంతుగా చేసిన ప్రయత్నమే ‘అన్నదాత సుఖీభవ’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని జూలై 7న పునః విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘అన్నదాత సుఖీభవ’ ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు బతుకుపోరే ఈ సినిమా. పాలకులు రైతుల ఆత్మహత్యల నివారణకు కృషి చేయాలి. జయతి ఘోష్, రాధాకృష్ణన్ కమిషన్, స్వామినాథన్ కమిషన్లను ప్రభుత్వం ఆ ప్రయత్నంలో భాగంగానే నియమించింది. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. రైతులకు, పంటలకు బీమా కల్పించాలి’’ అన్నారు. ‘‘నా దృష్టిలో జగపతిబాబు, రాఘవ, రామోజీరావు, రాఘవేంద్రరావువంటి కొందరు గొప్పవాళ్లున్నారు. వాళ్లందరిలోని లక్షణాలు నాకు ఆర్. నారాయణమూర్తిగారిలో కనిపిస్తాయి. ప్రపంచం గురించి విపరీతమైన జ్ఞానం ఉంది ఆయనకు. అలాంటి వ్యక్తి సినిమాల్లో చేసింది చాలు అని భావించి, క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్లాలి. ఆయన ద్వారా ప్రజలకు మరింత లాభం చేకూరుతుంది’’ అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ‘‘సాంస్కృతిక దండయాత్ర జరుగుతున్న తరుణమిది. ఇండియాలో 20–35 ఏళ్లున్న యువతను మరో వైపు ఈ దండయాత్ర తీసుకెళ్తోంది. రైతంటే ఎవరని ప్రశ్నించే పాలకులకు సమాధానమే ‘అన్నదాత సుఖీభవ’’ అన్నారు ప్రజా గాయకుడు గద్దర్. ఈ కార్యక్రమంలో అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజ్, రాజేంద్రకుమార్, సుద్దాల అశోక్ తేజ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు
-
పోరాటం
-
ప్రజలంటే భయం ఉండాలి
‘‘నా ‘అన్నదాత సుఖీభవ’ సినిమా సెన్సార్‌కు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా సెన్సార్ రివైజింగ్ కమిటీ అన్నదాత సుఖీభవ అని ప్రకటించింది’’ అన్నారు దర్శక– నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన రూపొందిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. సెన్సార్ రివైజింగ్ కమిటీ ‘యు’ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి నేడు దారుణంగా ఉంది. అన్నదాత సుఖీభవలా లేదు.. దుఃఖీభవ అనేలా ఉంది. పాలకులకు ప్రజలంటే భయం ఉండాలి. అప్పుడే వ్యవస్థ బాగుంటుంది. ఈ చిత్రానికి రైతు సంక్షేమ సంఘాలు, వామపక్షాలు సహకరించాయి. ఈ నెల 14న పాటలను విడుదల చేసి జూన్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. -
కొందరి ప్రయోజనాల కోసం బంద్ ఆపేస్తారా? – ఆర్. నారాయణమూర్తి
‘‘చిత్ర పరిశ్రమలో బ్రహ్మాస్త్రం లాంటి బంద్‌ను ఉపయోగించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు ఏం సాధించారో అర్థం కావడం లేదు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు’’ అని మండిపడ్డారు ఆర్. నారాయణమూర్తి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చార్జీల విషయంలో చర్చలు విఫలమై ఈ నెల 2 నుంచి థియేటర్స్ బంద్ అయ్యాయి. చర్చలు తాత్కాలికంగా సఫలమై శుక్రవారం నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. బంద్ ముగిసింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి్ మాట్లాడుతూ– ‘‘తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ఇంకా బంద్ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల తర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన హమీలు అమలు కాకముందే హఠాత్తుగా బంద్ ఎందుకు విరమించుకున్నారు? ఈ బంద్ వల్ల సినీ కార్మికులు ఇబ్బందిపడ్డారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. డిజిటల్ సర్వీస్ చార్జీలు తగ్గితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో సంఘీభావం తెలిపాం. కానీ కొందరి ప్రయోజనాలు, స్వార్థం కోసం బంద్‌ను ఆపేస్తారా? దీనికోసమైతే సురేశ్‌బాబు, జెమిని కిరణ్, అల్లు అరవింద్ లాంటి పెద్దలు బంద్ వరకు వెళ్లకుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే సరిపోయేది కదా? గతంలో రామానాయుడుగారు, దాసరి నారాయణరావుగారు లాంటి పెద్దలు పదిమంది నిర్మాతల మంచి కోరేవారు. ఐక్యత లేకపోవడం వల్ల గతంలో మేం చేసిన పోరాటాలు, నిరహార దీక్షల వల్ల సక్సెస్ సాధించలేకపోయాం. ఇప్పుడూ సక్సెస్ కాలేకపోయాం. ఇందుకు కారణం మేజర్ సెక్టార్ సపోర్ట్ లేకపోవడమే. తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కలగజేసుకుని చిన్న చిత్రాల నిర్మాతలకు న్యాయం చేయాలి. తక్కువ చార్జీలకే కొత్త కంపెనీలు వస్తు న్నా కొందరు రానివ్వడం లేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకుని మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఉచితంగా ఇచ్చేంతవరకు బంద్ ఆపబోమని చెప్పి, రెండు వేల రూపాయలు తగ్గించగానే థియేటర్స్ బంద్ ఆపేశారు. ఇది కాదు మేం కోరుకున్నది’’ అన్నారు తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. -
కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
సాక్షి, హైదరాబాద్: సమాఖ్య స్ఫూర్తి పరిరక్షణ, రాజ్యాంగం అమలు, రాష్ట్రాల హక్కుల సాధన కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలసి తన మద్దతు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన హక్కులను నిరాకరించి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పెత్తనం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశం అంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదని.. అన్ని రాష్ట్రాలు, 130 కోట్ల మంది దేశ ప్రజలు అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ ఇవ్వలేదని, ఇది ఏమైనా వారి అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. -
ఆర్ నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్ అవార్డు
విజయవాడ: ఈ నెల 12న నగరంలో డా. రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, గోవా సీఎం మనోహర్ పారికర్‌లు ముఖ్య అతిథులుగా హజరుకానున్నారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. సినీ రంగంలో అతను చేసిన కృషికి ఫలితంగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వీరితో పాటు సురభి కళాకారుడు ఆర్. నాగేశ్వరరావుకు కూడా రామినేని పురస్కారం వరించింది. -
దాసరి శిష్యుడి ఉద్వేగభరిత ప్రసంగం
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమ దిక్సూచి, ఆత్మబంధువు దాసరి నారాయణరావు అని నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. తన గురువు గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన దాసరి సంతాప సభలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. దాసరికి దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వచ్చేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు చిత్రపరిశ్రమ పయత్నించాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ పురస్కారాల్లో దక్షిణాది నటులకు ముందునుంచి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విద్యాబాలన్‌కు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సావిత్రి, ఎస్వీ రంగారావులకు పద్మశ్రీ లేద’ని వాపోయారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు దాసరి అని, తన గురించి ఏమీ అడగకుండా వేషం ఇచ్చారని వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ రాణించారని పేర్కొన్నారు. దాసరి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డబ్బున్నవారి వారసులు నటులు కావాలనుకోవడంలో తప్పులేదని, సామాన్యులకు కూడా వేషాలు ఇస్తూ ప్రోత్సహించాలని దర్శక నిర్మాతలను నారాయణమూర్తి కోరారు. దాసరికి దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డు ఇవ్వాలని ఈ సభలో తీర్మానం చేయబోతున్నామని రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. -
పవర్ఫుల్ కానిస్టేబుల్
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి బయటి చిత్రాల్లో నటించి చాలా ఏళ్లయింది. ఆయనే హీరోగా, దర్శక–నిర్మాతగా సినిమాలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు బయటి బేనర్లో సినిమా చేయడం విశేషం. ఆయన సరసన జయసుధ నటించడం మరో విశేషం. చదలవాడ శ్రీనివాసరావుకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. మరి.. ఆయన దర్శకత్వంలో నారాయణమూర్తి సినిమా ఒప్పుకోవడం, ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి స్టార్స్ సరసన నటించిన జయసుధ ఈ పీపుల్స్ స్టార్‌తో జతకట్టడం.. ఈ రెండు అంశాలు కథలో విషయం ఉందనే ఫీల్‌ని కలగజేస్తాయి. కథేంటి?: ఎట్టి పరిస్థితుల్లోనూ లంచాలు తీసుకోకుండా, ఎవరి దగ్గరా రాజీపడకుండా నిజాయతీగా బతకాలనేది హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఆర్. నారాయణమూర్తి) అభిమతం. ‘డబ్బున్న వాడు కాదు.. నీతీ నిజాయతీ ఉన్నవాడే గొప్పోడు’ అనేది ఆయన సిద్ధాంతం. సిద్ధాంతాలను నమ్ముకుంటే ఉపయోగం లేదు, జేబును నమ్ముకోండని అతని భార్య పద్మ (జయసుధ) ఎప్పుడూ చెబుతుంటుంది. సహచర పోలీసులకు కూడా వెంకట్రామయ్య పద్ధతి నచ్చదు. దేనికీ లొంగని అతణ్ణి హోం మంత్రి అవినీతి కేసులో ఇరికించి అవమానిస్తాడు. అప్పుడతని భార్య కూడా అతణ్ణి వదిలి వెళ్తుంది. ఈ పరిణామాలన్నిటికీ నల్లధనమే కారణమని వెంకట్రామయ్య గ్రహిస్తాడు. దాంతో నల్లధనాన్ని అంతం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని ఎలా అమలుపరుస్తాడు? అసలు వెంకట్రామయ్యకీ, హోం మంత్రికీ మధ్య గొడవ ఏంటి? చివరకు అతనేం చేశాడు? అనేది చిత్రకథ విశ్లేషణ: ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిస్థితులకు తగ్గ చిత్రమిది. గతంలో పలు సందేశాత్మక చిత్రాల్లో నటించిన ఆర్. నారాయణమూర్తి తన భుజాలపై చిత్రాన్ని మోశారు. సహజ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. ముఖ్యంగా అపార్థం చేసుకున్న భార్యకు తానేమిటో చెప్పాలని, ఆమెను మార్చాలని వెంకట్రామయ్య ప్రయత్నించే సన్నివేశాల్లో ఇద్దరి నటన బాగుంది. సరదా సన్నివేశాల్లో నవ్వించారు. చిత్ర కథ కొత్తగా ఉన్నప్పటికీ... సెకండాఫ్‌లో కీలక సన్నివేశాలు కాస్త వాస్తవానికి దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌లో ప్రస్తావించిన నల్లధన నిర్మూలన వంటి అంశాలను సెకండాఫ్‌లో చూపించలేదు. కానీ, దర్శకుడు చూపించిన పరిష్కార మార్గాలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తాయి. మొదట్నుంచీ ప్రజా సమస్యలపై సినిమాల ద్వారా ఆర్. నారాయణమూర్తి పోరాటం చేస్తున్నారు. అదే బాటలో కొత్తగా, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా ఆయన చేసిన మరో మంచి ప్రయత్నమిది. పవర్ఫుల్ కానిస్టేబుల్‌గా అద్భుతంగా నటించారు. చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ తారాగణం ఆర్. నారాయణమూర్తి, జయసుధ, సునీల్‌శర్మ తదితరులు.. ఛాయాగ్రహణం ఎన్. సుధాకర్‌రెడ్డి సంగీతం ‘వందేమాతరం’ శ్రీనివాస్ నిర్మాత చదలవాడ పద్మావతి కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం చదలవాడ శ్రీనివాసరావు