
మాట్లాడుతున్న ఆర్.నారాయణమూర్తి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు
ఉప్పల్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో రూ.100 కోట్లు ఖర్చు చేసే స్తోమత ఉన్న వారికే ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు దక్కుతున్నాయని, అలాంటివారు గెలిచిన తర్వాత ప్రజాసేవ ఎలా చేస్తారని సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఏషియన్ థియేటర్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, నటుడు గౌతమ్‌రాజు, విక్రమ్‌గౌడ్‌లతో కలిసి ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ సినిమా చూశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. ఈ సినిమా ఓటు బ్యాంక్‌కు, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తీశామని, నేటి యువత దీనిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. రాజకీయం వ్యాపారంగా మారిందని జనాభాలో పదిశాతం ఉన్న అగ్రకులస్తులు, 90 శాతం ఉన్న బడుగు, బలహీనవర్గాలను పాలిస్తున్నారన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. సామాజిక స్పృహ ఉన్నవారు, రాజకీయాలను మార్చాలనుకున్నవారు సినిమాను చూడాలని కోరారు. కార్యక్రమంలో భాస్కర్‌గౌడ్, పంజాల శ్రావణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment