ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో! | Suhas Sorry To R Narayana Murthy Ambajipeta Marriage Band Teaser | Sakshi
Sakshi News home page

R. Narayana Murthy: అనుకోని అవాంతరం.. టాలీవుడ్ హీరో క్షమాపణలు!

Published Mon, Oct 9 2023 8:06 PM | Last Updated on Mon, Oct 9 2023 8:21 PM

Suhas Sorry To R Narayana Murthy Ambajipeta Marriage Band Teaser - Sakshi

ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. కొత్త హీరోలు వస్తున్నారు. తమ అద్భుతమైన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అలా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల్లో సుహాస్ ఒకడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తికి క్షమాపణలు చెప్పాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్)

ఏం జరిగింది?
'కలర్ ఫోటో' సినిమాతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఈ ఏడాది 'రైటర్ పద్మభూషణ్' అంటూ వచ్చి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇతడు నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

అయితే సినిమా టైటిల్‌కి తగ్గట్లే ఈవెంట్ జరిగే చోట కూడా బ్యాండ్ సెటప్ చేసి, వాటిని వాయించారు. అయితే అక్కడికి కాస్త దగ్గర్లో ఉన్న ఆర్.నారాయణమూర్తి కాస్త చిరాకు పడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సుహాస్.. ఆయన దగ్గరకు వెళ్లి సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' టీజర్ కూడా బాగుంది.

(ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్‌కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement