
సరికొత్త సినిమాలతో టాలీవుడ్ ప్రియులను అలరిస్తోన్న యంగ్ హీరో సుహాస్(Suhas). తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుహాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఓ భామ అయ్యో రామా'(O Bhama Ayyo Rama). ఆ మూవీలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి రామ్ గోదాల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సుహాస్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు యాడ్‌లకు ఎంత తీసుకుంటారో.. అలాగే సినిమాకు అంతే రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్ ఉంది.. దీనిపై మీరేమంటారు అని సుహాస్‌ను ప్రశ్నించారు. దీనిపై సుహాస్ కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
సుహాస్ మాట్లాడుతూ..' ఇదేంటీ నాకు టార్చర్. నేను అనుకున్నంత నంబర్ అయితే లేదు. అయినా కూడా నా యాక్టింగ్ బాగుందో లేదో చూడాలి కానీ.. ఈ రెమ్యునరేషన్ గోల ఏంది? అన్నారు. అలాగే ప్రభాస్ స్పిరిట్‌లో నటిస్తున్నారా? అని ప్రశ్నించగా..అదేం లేదు అని సుహాస్ సమాధానమిచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment