![Tollywood Hero Vijay Devarakonda latest Movie VD12 Teaser Out Now](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/bijay.jpg.webp?itok=3EZAgoOK)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. వీడీ12 టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమా టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా విడుదలైన టీజర్ రౌడీ హీరో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
అయితే ఈ సినిమాకు కింగ్‌డమ్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. అలాగే వీడీ12 మూవీకి హిందీ టీజర్‌కు యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ తన వాయిస్ అందించారు. తమిళంలో స్టార్ హీరో సూర్య వాయిస్‌తో టీజర్ విడుదల చేశారు మేకర్స్. మూడు భాషల్లో ముగ్గురు స్టార్ హీరోల వాయిస్‌తో టీజర్‌ను విడుదల చేయడం విశేషం.
తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌లో విజయ్ దేవరకొండ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉన్నాయి. ఈ టీజర్‌తో కింగ్‌డమ్‌పై అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేసింది. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఎదురుచూసిన అభిమానులకు ఆ కోరిక నేటితో తీరింది. 'జెర్సీ' వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ కింగ్‌డమ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment