![Tollywood Hero Vijay Deverakonda Meet with Jr NTR Pic Goes Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/ntr_0.jpg.webp?itok=55LX84_x)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం 'వీడీ 12'. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీడీ12 టైటిల్, టీజర్ రిలీజ్‌పై అప్‌డేట్ ఇచ్చారు. ఈనెల 12న టీజర్‌తో పాటు టైటిల్ కూడా రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా విజయ్ దేవరకొండ.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు. ఒక రోజంతా జీవితం, సమయాలు, సినిమా గురించి మీతో నవ్వుతూ మాట్లాడడం సంతోషంగా అనిపించింది.. టీజర్ డబ్బింగ్ చెబుతున్నప్పుడు మీరు కూడా నాలాగే ఎగ్జైట్ అయ్యారని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఒక రోజంతా సమయమిచ్చినందుకు థ్యాంక్ యూ తారక్ అన్న అంటూ ఎన్టీఆర్‌కు ధన్వవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
టీజర్‌కు ఎన్టీఆర్ డబ్బింగ్..
అయితే విజయ్ దేవరకొండ తాజా చిత్రం వీడీ12కు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పారు. బుధవారం రిలీజ్ చేయనున్న టీజర్‌కు ఎన్టీఆర్ తన వాయిస్‌ను అందించారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. మాకు అవసరమైన సమయంలో మాకు మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు అన్న.. మీ వాయిస్‌తో వీడీ12 టీజర్ భావోద్వేగాలను మరోస్థాయికి తీసుకెళ్తుందని నాగవంశీ ట్వీట్ చేశారు.
అయితే ఈ పోస్ట్‌లో విజయ్ దేవరకొండ లుక్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ మొహం కనిపించకుండా ఫోటోను పోస్ట్ చేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన సందర్భంగా తన వీడీ12 లుక్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. ఫుల్ గడ్డంతో మాస్ హీరోగా దర్శనమిచ్చారు రౌడీ హీరో. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Spent most of yesterday with him.
Chatting about life, times, cinema. Laughing about the same..
Sat through the dub of the teaser, him as excited as me seeing it come to life.
Thank you @tarak9999 anna for a most wholesome day and for bringing your madness to our world… pic.twitter.com/f8YpVQcJSt— Vijay Deverakonda (@TheDeverakonda) February 11, 2025
Comments
Please login to add a commentAdd a comment