![Anchor Rashmi Gautam Hospitalized for Shoulder Surgery?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/rashmigutam.jpg.webp?itok=xe0daMgE)
యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ఆస్పత్రిపాలైంది. భుజం నొప్పికి సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. భుజం నొప్పి నుంచి విముక్తి పొందేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే డ్యాన్స్ చేయడాన్ని చాలా మిస్ అవుతున్నాను. మళ్లీ ఎప్పటిలా మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/rashmi.jpg)
యాంకర్‌గా, హీరోయిన్‌గా..
రష్మీ గౌతమ్ రెండు దశాబ్దాల నుంచి బుల్లితెర యాంకర్ (TV Anchor)గా రాణిస్తోంది. కామెడీ షోలకు వ్యాఖ్యాతగా, డ్యాన్స్ షోలలో అతిథిగా, టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. మధ్యమధ్యలో సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. మొదట్లో గుర్తింపు లేని చిన్నాచితక పాత్రలు చేసింది. తర్వాత హీరోయిన్‌గా మారింది. తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసింది. తెలుగులో.. గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్‌బస్టర్, నెక్స్ట్ నువ్వే, అంతకుమించి.. ఇలా పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/rashmi2.jpg)
Comments
Please login to add a commentAdd a comment