
Is Anchor Rashmi Gautam Secretly Married, Details Here: యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు.
అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది.
తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరిప్పుడు సుధీర్ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment