సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మీనే గుర్తొస్తుంది. ఏ క్షణాన 'జబర్దస్త్'లో వీళ్లిద్దరూ కలిశారో గానీ అప్పటినుంచో షోలో కామెడీ కంటే వీళ్ల జంటే బాగా హైలైట్ అయింది. దాదాపు కొన్నేళ్లపాటు కళకళలాడిన ఈ జోడీకి.. హఠాత్తుగా బ్రేక్ పడింది. సుధీర్.. షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో వీళ్లని కలిసి చూసే ఛాన్స్ దక్కలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో వీళ్లిద్దరూ కలిసి ముందులా ప్రేమలో మునిగితేలారు.
తాజాగా ఓ ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్-రష్మీ.. 'నిజమేనా చెబుతున్నా జానే జానా' పాటకు డ్యాన్స్ చేసి, తామిద్దరి కెమిస్ట్రీ ఇంకా అలానే ఉందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ ఫెర్ఫార్మెన్స్ తర్వాత రష్మీతో తన బాండింగ్‌పై సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకంటే ముందు స్క్రీన్ పై సుధీర్‌తో తను ఉన్న పాత వీడియోలని ప్లే చేయగా, రష్మీ ఎమోషనల్ అయింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)
'రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ' అని సుధీర్ చెప్పగానే.. బ్యూటీఫుల్ జర్నీనా? లవ్ జర్నీనా? అని గెటప్ శీను పంచ్ వేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన సుధీర్.. 'బేసికల్ గా రష్మి సెన్సిటివ్, చాలా కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి. నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ' అని ఆమెని తెగ పొగిడేశాడు. ఇదంతా షోకి హైలైట్ గా నిలిచింది.
'మేం బయటకు ఎక్కడికెళ్లినా.. మా ఇద్దరి గురించే అడుగుతూ ఉంటారు. చెప్పాలంటే నా జర్నీలో, సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్ లో నేను ముందుకెళ్లడానికి, స్కిట్స్ తోపాటు రష్మీ పాత్ర చాలా ఉంది. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, స్కిట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి' అని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో రష్మీకి థ్యాంక్స్ చెప్పిన సుధీర్.. దానితో పాటు 'మిస్ యూ' అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
(ఇదీ చదవండి: బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ)
Comments
Please login to add a commentAdd a comment