Sudigaali Sudheer
-
సుడిగాలి సుధీర్ ప్రయత్నం.. కట్ చేస్తే ప్రభాస్ సినిమాలో
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్నాడు. ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్గా చేస్తోంది. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమెకు ఇదే తొలి మూవీ. సినిమా లాంచింగ్ రోజే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు కమెడియన్ గెటప్ శీను ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు.'జబర్దస్త్' ఫేమ్ సుడిగాలి సుధీర్.. తన కొత్త సినిమా 'G.O.A.T'లో ఇమాన్విని హీరోయిన్గా పెట్టాలని అనుకున్నారట. కాకపోతే ఎంత ప్రయత్నించినా సరే ఆమె వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వదిలేశారట. ఈ విషయం గెటప్ శీను.. ఓ షోలో బయటపెట్టాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)సుడిగాలి సుధీర్ సినిమాలో ఛాన్స్ వద్దనుకున్న ఇమాన్వి.. ప్రభాస్-హను మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఈమె షూటింగ్లో పాల్గొంది. ఓ పాట, కొన్ని సీన్సు షూట్ చేయగా.. ఇమాన్వి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయిందని తెలుస్తోంది. ప్రభాస్-ఇమాన్వి కెమిస్ట్రీ కూడా సూపర్ అని లీక్ ఒకటి బయటకొచ్చింది.ఏదేమైనా సుడిగాలి సుధీర్ ప్రయత్నించాడు. ఒకవేళ ఓకే అనుకుంటే ఎందరో హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయేది. ఇప్పుడు ప్రభాస్ మూవీ చేస్తోంది. ఈ మూవీ గనక హిట్ అయితే మాత్రం పాన్ ఇండియా స్టార్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ) -
సుడిగాలి సుధీర్ బర్త్‌డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
న్యూ ఇయర్ వచ్చేసింది. భారత దేశం అంతటా అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు కొన్ని లేటెస్ట్ మూవీస్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఓ కొత్త సినిమా.. ఇలా ఓటీటీలోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. ఎప్పుడు చూడాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. 'జబర్దస్త్'లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు. టీమ్ లీడర్ గా స్కిట్స్, యాంకర్‌గా ఈవెంట్స్ హోస్ట్ చేశాడు. ప్రస్తుతం హీరోగా మాత్రమే టచేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు 'గాలోడు' అనే మాస్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. తాజాగా 'కాలింగ్ సహస్ర' మూవీతో వచ్చాడు. అయితే టెక్నికల్ అంశాలతో తీసిన ఈ సినిమా.. రెగ్యులర్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. దీంతో ఫ్లాప్‌గా నిలిచింది. డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. తెలుగు బాషలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఎంచక్కా టైమ్ పాస్ చేసేయొచ్చు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
నాలోని మరో కోణాన్ని చూస్తారు
‘‘కాలింగ్ సహస్ర’లో సవాల్‌తో కూడుకున్న మంచి పాత్ర ఇచ్చిన అరుణ్‌గారికి థ్యాంక్స్. నాలోని మరో కోణాన్ని చూపించే పాత్ర ఇది. ఇకపై కొత్త కథలతో మంచి చిత్రాలు చేస్తాను. ‘కాలింగ్ సహస్ర’ మీకు నచ్చితే పది మందికి చెప్పండి’’ అని ‘సుడిగాలి’ సుధీర్ అన్నారు. అరుణ్ విక్కీరాలా దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి నటుడు జేడీ చక్రవర్తి, దర్శకులు దశరథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుధీర్ మాట్లాడుతూ–‘‘మా సినిమాను మంచి థియేటర్లలో విడుదల చేసేందుకు సాయం చేసిన బెక్కం వేణుగోపాల్గారికి ధన్యవాదాలు. నా ‘గాలోడు’ సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది. ఎన్ని జన్మలు ఎత్తినా వారి రుణం తీర్చుకోలేను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు విజేష్ తయాల్, వెంకటేశ్వర్లు కాటూరి. -
‘కాలింగ్ సహస్ర’ మూవీ గురించి సరదా సరదాగా
-
‘కాలింగ్ సహస్ర’లో కొత్త సుధీర్‌ని చూస్తారు: డైరెక్టర్
‘‘కాలింగ్ సహస్ర’ చిత్రంలో ట్విస్టులుంటాయి. సినిమా రిలీజ్ తర్వాత ఆ ట్విస్టుల్ని ప్రేక్షకులు రివీల్ చేసినా కూడా అందరూ థియేటర్‌కు వచ్చి చూస్తారు. ఇందులో మంచి ప్రేమకథ, అంతర్లీనంగా సందేశం ఉన్నాయి’’ అని దర్శకుడు అరుణ్ విక్కీరాలా అన్నారు. ‘సుడిగాలి’ సుధీర్, డాలీషా జంటగా స్పందనా పల్లి, శివ బాలాజీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ విక్కీరాలా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కాలింగ్ అనేది ఒక కంపెనీ పేరు. సహస్ర అనేది హీరోయిన్ పాత్ర పేరు. ఇందులో సుధీర్ పాత్ర కొత్తగా ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత సుధీర్ అనే వ్యక్తిని మర్చిపోయి..ఆయన పోషించే పాత్రలోకి వెళ్తారు. ఇందులో సుధీర్ కమెడియన్‌గా ఎక్కడా కనిపించడు. ఇది ఓ ప్రయోగమే. షూటింగ్లో డాలీషా చేసిన ఓ ఫైట్ సీక్వెన్స్ చూసి ఫైట్ మాస్టరే క్లాప్స్ కొట్టేశాడు. నా తర్వాతి సినిమా షూటింగ్ ప్రారంభమైంది’’ అన్నారు. -
యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!
యాంకర్ రష్మీ.. ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఏంటనేది పక్కనబెడితే.. స్క్రీన్‌పై కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్. కలిసి ఏ షోలో కనిపించినా సరే టీఆర్పీలు దూసుకెళ్తాయి. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కచోట కనిపించి చాలా కాలమైంది. అలానే ఇద్దరూ(వేర్వేరుగా) ఇప్పటికీ సింగిల్‌గానే ఉంటున్నారు. ఇలాంటి టైంలో తాజాగా రష్మీ పెళ్లి రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయి రష్మీ. చాలా ఏళ్ల క్రితమే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే కామెడీ షోకి యాంకర్ అయ్యిందో ఈమె ఫేట్ మారిపోయింది. ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతానికైతే ఒకటి రెండు షోలకు యాంకరింగ్ తప్పితే వేరే ప్రాజెక్టులు ఏం చేయట్లేదు. అలానే రష్మీ వయసు కూడా 35 ఏళ్లు. అయితే ఈమెకి ఇదివరకే పెళ్లయిందని అని అన్నారు గానీ అందులో ఎంత నిజముందనేది తెలియదు. తాజాగా మరోసారి అలాంటి పుకారు వచ్చింది. ఒడిశాకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌తో ఈమెకు పెళ్లి కానుందిని, ఇది పెద్దల కుదిర్చిన సంబంధమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటిలానే ఇది నిజం కాదని సుధీర్ ఫ్యాన్స్ అంటున్నారు. రష్మీ స్వయంగా స్పందిస్తే తప్పితే దీనిపై ఓ క్లారిటీ రాదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!
సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే దాదాపు అందరికీ గుర్తొచ్చే పేరు యాంకర్ రష్మీ. వీళ్లిద్దరూ ఏ ముహుర్తాన కలిసి 'జబర్దస్త్' చేశారో గానీ వీళ్లకి వచ్చినంత క్రేజ్ మరో జంటకు రాలేదని చెప్పొచ్చు. అసలు వీళ్లిద్దరూ నిజంగా లవర్సా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు? ఇలా బోలెడన్ని క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. అలా తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్‌కి వచ్చిన సుడిగాలి సుధీర్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మేజిషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్.. ఓ సాధారణ కమెడియన్‌గా 'జబర్దస్త్' షోలో అడుగుపెట్టాడు. కొన్నాళ్లకు టీమ్ లీడర్ అయ్యాడు. మరోవైపు యాంకర్ రష్మీతో లవ్వాటతో బాగా పాపులర్ అయిపోయాడు. అనంతరం కొన్నాళ్లకు సినిమా హీరో అయిపోయాడు. 'గాలోడు' మూవీతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు 'కాలింగ్ సహస్ర' మూవీతో డిసెంబరు 1న థియేటర్లలోకి రాబోతున్నాడు. దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. అందులో రష్మితో పెళ్లెప్పుడు? అనే ప్రశ్న సుధీర్‌ని అడిగారు. దీనికి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) 'ఈ ప్రశ్న నాకు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు థ్యాంక్స్. రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో' అని సుధీర్ క్లారిటీ ఇచ్చేశాడు. దీనిబట్టి చూస్తే సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోడనమాట. మరోవైపు రష్మీతో సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఇద్దరికి తగ్గ కథ కోసం చూస్తున్నామని, దొరికినప్పుడు కచ్చితంగా కలిసి నటిస్తామని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) -
ఎంత క్యూట్ గా మాట్లాడిందో చూడండి
-
డిసెంబర్ 1st థియేటర్ కి వస్తున్నాము సపోర్ట్ చేయండి
-
రష్మి తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన సుధీర్
-
థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో సుడిగాలి సుధీర్ కొత్త సినిమా..
బుల్లి తెర ప్రేక్షకులను అలరించి తిరుగులేని ఇమేజ్ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. ‘గాలోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా...చిత్ర నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్, హీరో సుధీర్, హీరోయిణ్ డాలీషా సపోర్ట్‌తో సినిమాను పూర్తి చేశాం. ఔట్ పుట్ సూపర్‌గా వచ్చింది. సరికొత్త సుధీర్‌ను చూస్తారని నమ్మకంగా చెబుతున్నాను. ఇందులో సుధీర్ పాత్రను వెండి తెరపై చూసిన ఆడియెన్స్ వామ్మో సుధీర్ ఇలాంటి పాత్రలో కూడా నటిస్తారా అనేంత వైల్డ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్‌తో, మాసీగా ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనుంది మా కాలింగ్ సహస్త్ర మూవీ. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం ’ అన్నారు. -
నా లైఫ్‌లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మీనే గుర్తొస్తుంది. ఏ క్షణాన 'జబర్దస్త్'లో వీళ్లిద్దరూ కలిశారో గానీ అప్పటినుంచో షోలో కామెడీ కంటే వీళ్ల జంటే బాగా హైలైట్ అయింది. దాదాపు కొన్నేళ్లపాటు కళకళలాడిన ఈ జోడీకి.. హఠాత్తుగా బ్రేక్ పడింది. సుధీర్.. షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో వీళ్లని కలిసి చూసే ఛాన్స్ దక్కలేదు. తాజాగా ఓ ఈవెంట్ లో వీళ్లిద్దరూ కలిసి ముందులా ప్రేమలో మునిగితేలారు. తాజాగా ఓ ఈవెంట్ లో కలిసి యాంకరింగ్ చేసిన సుధీర్-రష్మీ.. 'నిజమేనా చెబుతున్నా జానే జానా' పాటకు డ్యాన్స్ చేసి, తామిద్దరి కెమిస్ట్రీ ఇంకా అలానే ఉందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ ఫెర్ఫార్మెన్స్ తర్వాత రష్మీతో తన బాండింగ్‌పై సుధీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకంటే ముందు స్క్రీన్ పై సుధీర్‌తో తను ఉన్న పాత వీడియోలని ప్లే చేయగా, రష్మీ ఎమోషనల్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే) 'రష్మీతో నాది బ్యూటీఫుల్ జర్నీ' అని సుధీర్ చెప్పగానే.. బ్యూటీఫుల్ జర్నీనా? లవ్ జర్నీనా? అని గెటప్ శీను పంచ్ వేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన సుధీర్.. 'బేసికల్ గా రష్మి సెన్సిటివ్, చాలా కష్టపడేతత్వం ఉన్న వ్యక్తి. నాకు అందరికంటే రష్మీ చాలా ఎక్కువ' అని ఆమెని తెగ పొగిడేశాడు. ఇదంతా షోకి హైలైట్ గా నిలిచింది. 'మేం బయటకు ఎక్కడికెళ్లినా.. మా ఇద్దరి గురించే అడుగుతూ ఉంటారు. చెప్పాలంటే నా జర్నీలో, సక్సెస్ లో రష్మీదే మెయిన్ రోల్. కెరీర్ లో నేను ముందుకెళ్లడానికి, స్కిట్స్ తోపాటు రష్మీ పాత్ర చాలా ఉంది. ఆమెతో చేసిన ప్రోగ్రామ్స్, స్కిట్స్ అన్నీ సక్సెస్ అయ్యాయి' అని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఇక చివర్లో రష్మీకి థ్యాంక్స్ చెప్పిన సుధీర్.. దానితో పాటు 'మిస్ యూ' అని చెప్పడం ఇంట్రెస్టింగ్ గా మారింది. (ఇదీ చదవండి: బేబి.. క్లైమాక్స్ అలా తీసుంటే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ) -
మాస్ గోట్గా సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రం ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). దివ్య భారతి హీరోయిన్. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో ఒక చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ లుక్‌లో కనిపించారు సుధీర్. ‘‘మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
నేను ఎక్కడున్నా ఆమె నా గుండెల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్‌గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. కానీ కొద్దిరోజులుగా ఈ జోడి మాత్రం స్క్రీన్‌పై ఒకటిగా కనిపించలేదు. సుధీర్ సినిమాలతో బిజీ అయితే.. రష్మీ మాత్రం పలు టీవీ షోలతో రానిస్తుంది. (ఇదీ చదవండి; నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా) తాజాగా వీరిద్దరూ ప్రముఖ టీవీ షోలో ఒకే స్క్రీన్‌పై మళ్లీ జంటగా కనిపించారు. దీంతో వారిద్దరీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలో సుధీర్ వేసిన డైలాగ్‌లు మళ్లీ వైరల్ అవుతున్నాయి. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారంటూ రష్మీని ఉద్దేశించి సుధీర్ కామెంట్ చేస్తాడు. అందుకు బదులుగా రష్మీ కూడా 'నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను' అంటూనే ఓర చూపులతో చిన్న స్మైల్ ఇస్తూ 'ఇన్నిరోజులు ఎక్కడున్నావ్..?' అని సుధీర్‌ను ఆమె ప్రశ్నింస్తుంది. ఇంతలో వెంటనే సుధీర్ తన స్టైల్లో 'నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండెల్లోనే ఉంటావ్' అంటూ డైలాగ్ పేలుస్తాడు. ఇంకేముంది ఫ్యాన్స్ కేకలతో రెచ్చిపోయారు. ఇలా సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జోడిగా ఆ షోలో కనిపించారు. పెళ్లిపై రూమర్స్ ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. గతంలో ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని ఆమె తెలిపింది. -
ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్ రష్మితో లవ్‌ట్రాక్ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. వీరిద్దరి జోడికి టాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్, రష్మిలు చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు. కానీ వీరిద్దరిపైన వచ్చినన్ని పెళ్లి పుకార్లు మరే నటులపై వచ్చి ఉండవు. (ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ) వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని గతంలోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఆమెతోనే సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమం కూడా వారి దగ్గరి బంధువుల మధ్య జరిగిందని తెలుస్తోంది. దీంతో రష్మీ- సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతూ సోషల్ మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు. గత రెండురోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న సుధీర్ స్పందించకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంటన్నా..? రష్మీతో రీల్ పెళ్లి ఎన్నోసార్లు చేసుకున్నారు. కాబట్టి అదే రియల్ చేస్తారు అనుకున్నాం అంటూ గతంలో రష్మి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ.. సుధీర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్‌తో ప్రేమా, పెళ్లిపై గతంలో రష్మి ఏం చెప్పిందంటే మీ ఇద్దరి మధ్య ఉండేది ఎలాంటి బంధం అని గతంలో రష్మిని అడగ్గా.. 'మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది' అని రష్మి తెలిపారు. (ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ)) -
కలయా.. నిజమా..
సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కాలింగ్ సహస్ర’. ఈ చిత్రంలో డాలిశ్య హీరోయిన్. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, పమిడి చిరంజీవి, కటూరి వెంకటేశ్వర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కలయా నిజమా..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. మోహిత్ రెహమానిక్ స్వరపరచిన ఈపాటకు లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించగా, కేఎస్ చిత్రపాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జానర్లో రూపొందిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘చిత్రగారుపాడిన తర్వాత ఈపాటకు మరింత అందం వచ్చింది. ఈపాట టైమ్‌లో ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేక΄ోయినా నాలుగు గంటలు ప్రాక్టీస్ చేసి, మరీపాడారు’’ అన్నారు మోహిత్ రెహమానిక్. ‘‘నిర్మాతలుగా మాకు ‘కాలింగ్ సహస్ర’ తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ’’ అన్నారు వెంకటేశ్వర్లు. ‘‘సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు శివ బాలాజీ. డాలిశ్య, లక్ష్మీ ప్రియాంక, సినిమాటోగ్రాఫర్ సన్నీ, యూ ట్యూబర్ రవితేజ తదితరులుపాల్గొన్నారు. -
సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘జీ.ఓ.ఏ.టీ’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 19) సుధీర్ బర్త్‌డేని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘మంచి కథాంశంతో తెరకెక్కుతున్న మా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘జీ.ఓ.ఏ.టీ’ లాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
సుడిగాలి సుధీర్ నాలుగో సినిమా షురూ
సుడిగాలి సుధీర్ హీరోగా నాలుగో సినిమా ‘ఎస్ఎస్4’ (వర్కింగ్ టైటిల్) షురూ అయింది. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్య భారతి హీరోయిన్. లక్కీ మీడియా–మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్‌పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి నిర్మాతలు డి. సురేశ్ బాబు, కేఎస్ రామారావు, సూర్యదేవర రాధాకృష్ణ, కేఎల్ దామోదర ప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు. తొలి సీన్‌కి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. ‘‘మంచి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇది’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్. ‘‘ఒక గంట కథ వినగానే ఒప్పుకున్న సుధీర్‌కి థ్యాంక్స్’’ అన్నారు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
సుధీర్ పక్కన హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుడిగాలి సుధీర్?
జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సుధీర్ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్ రష్మీతో లవ్‌ట్రాక్ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్, రష్మీలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఇకమూడు పదుల వయసు దాటినా ఇంతవరకు పెళ్లి ఊసెత్తని సుధీర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే సుధీర్ పెళ్లి చేసుకుంటాడని సమాచారం. ఇంట్లో తల్లిదండ్రుల కోరిక మేరకు సుధీర్ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పాడట. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలోనూ సుధీర్ పెళ్లి విషయంలో పలు కథనాలు వచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. -
నేను ఈ స్టేజ్‌కు వచ్చానంటే ఆయనే కారణం: సుడిగాలి సుధీర్
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలంగాణ యాసభాషలతో సాగుతుంది. మంగళవారం బలగం ప్రీరిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'నేను అనేవాడిని ఈ స్టేజీలో ఉన్నానంటే అందుకు వేణు అన్ననే కారణం. నేను, నా కుటుంబ సభ్యులు ఈరోజు మూడు పూటలా తింటున్నామంటే అందుకు ఆయనే కారణం. నాకు జబర్దస్త్‌లో ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణన్న! జీవితాంతం తనకు రుణపడి ఉంటాను. ఇప్పటిదాకా వేణు అన్న అందరికీ ఓ కమెడియన్‌గానే తెలుసు. అలాంటి వ్యక్తి దగ్గర మంచి టాలెంట్ ఉందని గుర్తించి ఆయనకు సినిమా తీసే ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుకు థ్యాంక్స్. సినిమా చూశాక మన తోబుట్టువులను ఒక్కసారి చూడాలి, వారితో మాట్లాడాలి అనిపిస్తుంది. తల్లిదండ్రులు బతికున్నప్పుడే వారిని బాగా చూసుకోవాలని మీకు అనిపించక మానదు. ఫ్యామిలీతో వెళ్లి చూడండి, సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పుకొచ్చాడు సుధీర్. చదవండి: ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు? -
ఓటీటీకి వచ్చేస్తోన్న సుడిగాలి సుధీర్ ‘గాలోడు’.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. ఇటీవల సుధీర్ నటించిన సినిమా గాలోడు. దర్శకుడు పులిచర్ల రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం సుధీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గతేడాది నవంబర్ 18న థియేటర్లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. చదవండి: ఆమిర్ ఖాన్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన! ఆయనకు ఏమైంది? ఇందులో మాస్ హీరోగా మెప్పించాడు సుధీర్. దీంతో సుధీర్ ఈ చిత్రంతో మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు చిత్ర ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. గాలోడు స్ట్రీమింగ్ రైట్స్ ఆహా వీడియోస్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది ఆహా. దీని ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి గాలోడు మూవీ ఆహాలో అందుబాటులోకి రానుంది. కాగా ఈ సినిమాలో గెహన సిప్పి హీరోయిన్గా నటించగా.. సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. Dance irukku… Comedy irukku… Action Irukku… Full on entertainment irukku… Sensational hit Galoodu Premieres Feb 17 only on aha😇#GalooduOnAHA #SudigaliSudheer @sudheeranand @gehna_sippy @SamskruthiFilms @PRDuddiSreenu pic.twitter.com/qvoi7INvtp — ahavideoin (@ahavideoIN) February 11, 2023 చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ -
సుడిగాలి సుధీర్‌పై అనసూయ కాంట్రవర్సీ కామెంట్స్.. ఫ్యాన్స్ ట్రోలింగ్
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్, అందం, గ్లామర్‌తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. బుల్లితెరపై అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్ రోల్ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పోలిస్తే సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వరుస మూవీ ఆఫర్లతో బిజీబిజీగా ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌పై అనసూయ చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుధీర్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది? అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. అనసూయ కాస్త సీరియస్‌గానే ఆన్సర్ ఇచ్చింది. ''సుధీర్ నా జూనియర్. నేను సీనియర్ని అని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో సుధీర్‌ని అడగండి. అతడు నా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. నేను కూడా అతన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడీ కామెంట్స్‌పై అనసూయను ట్రోల్ చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్. 'రెండు, మూడు సినిమాలు చేసేసరికి ఇంత ఓవర్ యాక్షన్ అవరసరమా? సుధీర్ గురించి అడిగితే ఒక్క మాట చెప్పలేవా? అయినా స్టార్ హీరోలతో కూడా అనసూయతో పనిచేయడం ఎలా ఉంది అని వాళ్లనే అడగండి అని చెప్తావ్ కదా' అంటూ విమర్శిస్తున్నారు. 🙄🙄 ee lekkana pedda hero movies lo mother characters cheysey vallani aa hero tho cheyadam ela undi ani adagoddu annatlu #anasuyabharadwaj #Anasuya #Aunty pic.twitter.com/VmQ1P8ojGr — Idly_Vishwanatham (@Idly_Baba) December 14, 2022 -
‘గాలోడు’తో నటుడిగా గుర్తింపు వచ్చింది: వెంకట్ దుగ్గిరెడ్డి
కోట్లకు పడగలెత్తినా రాని కిక్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన క్షణం తనకు కలిగిందని అంటున్నారు ఎన్నారై వెంకట్ దుగ్గిరెడ్డి. సుడిగాలి సుధీర్ నటించిన తాజా చిత్రం ‘గాలోడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి లాయర్ పాత్రలో నటించి, మెప్పించాడు. ‘గాలోడు’ చిత్రం చూసిన తన చిన్ననాటి స్నేహితులు, బంధువులు, తన ఊరివాళ్లు, తోటి ఎన్నారై ఫ్రెండ్స్ అభినందనలు తెలపడం సంతోషంగా ఉందన్నారు. నటుడిగా వెండితెరపై అరంగేట్రం చేయించిన దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి పులిచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నప్పటి నుంచి నటన అంటే మక్కువ అని, విభిన్నమైన పాత్రలు పోషించి, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. గాలోడు చిత్రం ద్వారా నటుడిగా తనకు మంచి గుర్తింపు లభించిందన్నారు. నటన ద్వారా డబ్బు సంపాదించాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పాడు. నటుడిగా పేరు తప్ప పారితోషికం అవసరం లేదని అన్నారు. -
కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో ప్రారంభమయ్యేది అప్పుడే!
నవ్వు.. మనసులోని అలజడులను, టెన్షన్లను పక్కకు నెట్టేస్తుంది. మనసుకు స్వాంతన చేకూరిస్తుంది. అలాంటి ఆహ్లాదకరమైన హాస్యాన్ని అందించడానికి ముందుకొస్తోంది ఆహా. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోని డిసెంబర్ 2 నుంచి ప్రసారం చేయనుంది. పాపులర్ కమెడియన్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, 3 సినిమాలతో స్టార్ డైరక్టర్‌గా అందరి మన్ననలు పొందిన అనిల్ రావిపూడి ఈ షో ద్వారా ఓటీటీకి రంగప్రవేశం చేస్తున్నాడు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షోకి ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. సుడిగాలి సుధీర్, దీపిక పిళ్లై ఈ షోను హోస్ట్ చేయగా సెలబ్రిటీ కమెడియన్స్ వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ స్టాక్స్ గా ఉంటారు. ప్రేక్షకులకు చక్కటి నవ్వులతో గిలిగింతలు పెట్టడానికి వారందరూ సిద్ధమవుతున్నారు. ఈ షోలో మూడు రౌండ్స్ ఉంటాయి. స్టాక్ (కమెడియన్)కి లైవ్ ఆడియన్స్ ఓట్లు వేస్తారు. అక్కడ ఎక్కువ ఓట్లు గెలుచుకున్నవారు ఛైర్మన్ మనసు గెలుచుకుని టాప్ స్టాక్‌గా పేరు తెచ్చుకుంటారు. 10 ఎపిసోడ్లుగా సాగుతుంది ఈ షో. నిర్విరామంగా వినోదాన్ని పంచుతూ, ప్రతి వీకెండ్నీ నవ్వులమయం చేయబోతోంది. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “హాస్యంలోని కోణాలను ఆవిష్కరించడానికి ఇంత గొప్ప ప్లాట్ఫార్మ్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా నేను చేసిందంతా ఆఫ్ కెమెరాలోనే. ఇప్పుడు ఆడియన్స్‌కు నేను సరికొత్తగా పరిచయం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది” అన్నాడు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ, “ఇన్నేళ్లుగా ప్రేక్షకులు నా పట్ల చూపిస్తున్న ఆదరణకు, ప్రేమను ధన్యవాదాలు. వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇస్తున్న ప్రోత్సాహంతోనే నేను ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నాను. గడపగడపలోనూ ఈ షో ద్వారా నవ్వులు పూయిస్తాననే నమ్మకం ఉంది. ఈ షోని చూసి నా ఫ్యాన్స్ ఎంతలా ఆస్వాదిస్తారో చూడాలని ఉత్సాహంగా ఉంది" అన్నాడు. చదవండి: పబ్లిక్‌గా టచ్ చేశాడు, చేయి పట్టుకుని లాగాను: సుష్మితా సేన్ టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే -
సుధీర్ టీవీ షోస్ చెయ్యడం మానేస్తున్నాడా ..?
-
హాట్‌టాపిక్‌గా సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ రెమ్యునరేషన్!
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా అలరిస్తున్నాడు. తాజాగా సుధీర్ నటించిన సినిమా గాలోడు. ఈ మూవీ నిన్న(నవంబర్ 18న) థియేటర్లో విడుదలైంది. విడుదలై తొలి షో నుంచి ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో గాలోడు చిత్రం సక్సెస్ వైపు దూసుకుపోతోంది. చదవండి: బేబీ బంప్‌తో నిత్యా మీనన్! ఫొటోలు వైరల్ ఈ క్రమంలో ఈ మూవీకి సుధీర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఆసక్తిగా మారింది. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా పరిచమైన సుధీర్.. ఆ తర్వాత 3 మంకీస్ సినిమాలో నటించాడు. తాజాగా గాలోడు మూవీతో హీరోగా మరోసారి ఫ్యాన్స్‌ని అలరించాడు. అయితే ఈ సినిమాకు సుధీర్ తీసుకున్న పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సుమారు రూ. 40 నుంచి 50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మూడో సినిమాకే ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అప్కమ్మింగ్ హీరోకు ఇది భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ మూడో సినిమాకే ఈ స్థాయిలో రెమ్యునేషన్ తీసుకున్న సుధీర్‌కు ఎంతటి క్రేజ్ ఉందో అర్థమవుతుందంటున్నారు నెటిజన్లు. సుధీర్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ పారితోషికం ఇచ్చేందుకు వెనకాడలేదని తెలుస్తోంది. ఇక గాలోడు సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ. 2 నుంచి రూ. 2.5 కోట్ల చేసినట్లు టాక్. ఇటీవల కామెడీ షో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన సుదీర్ ఇప్పుడు మళ్లీ ఆ షోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు రీసెంట్గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 2
-
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 1
-
అందుకే రష్మితో కెమిస్ట్రీ కుదిరింది: సుడిగాలి సుధీర్
హీరోగా కంటే నేను ఎంటర్టైనర్ అని అనిపించుకునే దానిలో నాకు ఎక్కువ సంతోషం ఉంటుంది. కమెడియన్, హీరో.. ఇలా ఒక ఇమేజ్‌కి పరిమితం కావాలని లేదు. ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. ఇప్పటికీ మ్యాజిక్ షోలు చేయమని అడిగినా చేస్తాను. మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలియదు. నా వల్ల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని కోరుకుంటాను. దాని కోసం నేను ఎంతైనా కష్టపడతాను’అని సుడిగాలీ సుధీర్ అన్నారు. సుధీర్ హీరోగా నటిస్తోన్న మాస్అండ్‌యాక్షన్ ఎంటర్టైనర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోన్న సందర్భంగా హీరో సుధీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►గాలోడు కథ నాకు చాలా నచ్చింది. నా పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. అందుకే సినిమాను ఒప్పుకున్నాను. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వ్యక్తి సమస్యల్లో పడి సిటీకి రావడం, మళ్లీ సిటీలో ఇంకో సమస్యలో చిక్కుకోవడం, ఈ మధ్యలో ప్రేమ కథ ఉంటుంది.. చిన్న చిన్న టిస్టులతో మంచి మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా నడుస్తుంది. ► గాలోడు కొత్త కథ అని చెప్పను గానీ.. మంచి మాస్ కమర్షియల్ అంశాలన్నీ ఉంటాయి. చిన్నతనం నుంచి మాస్ సినిమాలంటే ఇష్టం, చిరంజీవి, రజనీకాంత్ గారి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. మా మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేందుకు ఈ సినిమాను చేశాను. ► కథకు తగ్గట్టుగానే ఈ సినిమా టైటిల్‌ను పెట్టాం. కాలేజ్‌లో గాలోడు చేష్టలు చేస్తుంటాడు. ఈ పాత్రను చూస్తేనే గాలోడులా అనిపిస్తుంది. కొన్ని సీన్లు నేను సుధీర్‌లా ఆలోచించి.. వద్దని అనేవాడ్ని. కానీ గాలోడు అలానే చేస్తాడు అని మా డైరెక్టర్ చెప్పేవారు. ► సుధీర్ అంటే కామెడీ ఇమేజ్ ఉంది. మాస్ ఆడియెన్స్‌కి కూడా సుధీర్ అంటే ఇష్టమే. పూర్తి కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే గాలోడు చేశాను. ప్రయోగాలు చేస్తుండాలని అందరూ చెబుతుంటారు. ఇమేజ్ మార్చే సినిమా వస్తే ప్రయత్నం చేయాలి. జనాలు చూస్తారా? లేదా? అన్నది తరువాత. కానీ మనం మాత్రం ప్రయత్నం చేయాలి. ► మార్కెట్ రేంజ్ గురించి నాకు తెలీదు. కానీ ఏ నిర్మాతకు కూడా డబ్బులు పోకూడదని నేను కోరుకుంటున్నాను. సినిమాను కొన్న ప్రతీ ఒక్కరికీ నష్టం రాకూడదని అనుకుంటాను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బాగుంటే చాలు. ఈ సినిమాను ఎంతలో తీశారు..ఎంత పెట్టారు అనే విషయాలు నాకు తెలీదు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తే చాలు. ► ఢీ షో తరువాతే సినిమా అవకాశాలు వచ్చాయి. అక్కడ డ్యాన్సులు, మ్యాజిక్, కామెడీ చేయడంతో సినిమా ఆఫర్లు వచ్చాయి. ట్రై చేద్దామని కొంత మంది వచ్చారు. ఎదుటివాళ్ళు నన్ను నమ్మినప్పుడు.. నాపై నాకు కూడా నమ్మకం ఉండాలి కదా? అని సినిమాలను అంగీకరించాను. అలా అని సినిమాలే కాదు.. బుల్లితెరపై కూడా షోలు చేస్తుంటాను. ► ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుంటే స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అని తేడా ఉంటుంది. కానీ నాకు అలా లేదు. మ్యాజిక్ షో చేయమని అడిగారు. చేస్తాను అని అన్నాను. అలానే షోలు అడిగితే కూడా చేస్తాను. ►ముందుగా గాలోడు కథను రష్మీ గౌతమ్ గారికే చెప్పారు. ఆమె డేట్స్ కుదరలేదు. మేం ఇద్దరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా చేస్తాం. ► ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఉన్నన్నీ రోజులు నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని అనుకుంటాను. అది వెండితెర అయినా, బుల్లితెర అయినా పర్లేదు. అందర్నీ నేను నవ్విస్తూ ఉండాలని భావిస్తాను. ► ఇండస్ట్రీలో అందరూ నన్ను ఫ్యామిలీలా చూస్తారు. టీవీ ఆర్టిస్ట్ అన్న కోణంలో నన్ను చూడలేదు. వారిలో ఒకరిలానే నన్ను చూస్తుంటారు. ► ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. రష్మీ గారికి నాకు ఎందుకు అలా కుదిరిందంటే.. మేం ఇద్దరం పట్టుకోం.. ముట్టుకోం. కళ్లతోనే మా భావాలు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాం. ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ మాత్రం వద్దని చెబుతాను. కానీ డైరెక్టర్‌కు నేను చెప్పే పొజిషన్లో లేను. ఆ స్థాయికి వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా అలాంటివి వద్దని చెబుతాను. ► జబర్దస్త్ స్టేజ్‌ను మిస్ అవుతుంటాను. కానీ నేను ఆ గ్యాప్ అడిగి తీసుకున్నదే. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటాను అని చెప్పా. ఇప్పుడు వచ్చేందుకు రెడీగా ఉన్నాను అని చెప్పా. ► గాలోడు టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత.. చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇన్నాళ్లకు ఓ సినిమా చేసినట్టు ఉంది.. హీరోగా అనిపించింది అని చాలామంది అన్నారు. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. రాం ప్రసాద్ గారి కెమెరా పనితనం, భీమ్ గారి సంగీతం, మా దర్శక నిర్మాత రాజశేఖర్ రెడ్డి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ రక్తం ధారపోసి పని చేశారు. ► ఇప్పటి వరకు రకరకాల సినిమాలు చూశాం. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చూశాం. కానీ ఇలాంటి మాస్ ఆడియన్స్ పక్కా మాస్ చిత్రాలను మిస్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గాలోడు చిత్రం. ఈ చిత్రం కచ్చితంగా మాస్ ఆడియెన్స్‌ను నిరాశపర్చదు. -
అలాంటి ఐటమ్ సాంగ్ అయితే చేస్తా!
‘‘ఓ కాలేజ్ గర్ల్, మాస్ అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ ‘గాలోడు’. ఇద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ గెహ్నా సిప్పీ. ‘సుడిగాలి’ సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గెహ్నా సిప్పీ మాట్లాడుతూ– ‘‘నేను ముంబైలో పుట్టి పెరిగాను. నా ఫొటోలు, వీడియోలు చూసి, ‘గాలోడు’కి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో క్యూట్ కాలేజ్ గర్ల్‌గా కనిపిస్తాను. సెట్లో అందరూ తెలుగులోనే మాట్లాడేవారు. అందుకే నాకు తెలుగు డైలాగ్స్ చెప్పడం ఈజీగా అనిపించింది.. అయితే నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్, సంగీతం అంటే చాలా ఇష్టం. డీసెంట్‌గా ఉండే ఐటమ్ సాంగ్స్ చేస్తాను. హీరోల్లో రామ్‌చరణ్, నాగచైతన్య, ధనుష్గార్లు చాలా ఇష్టం. శేఖర్ కమ్ముల గారితో సినిమా చేయాలని ఉంది. సుకుమార్‌గారంటే ఇష్టం. నా తర్వాతి చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
సుధీర్‌ను పిలవాల్సిన అవసరం నాకు లేదు : రష్మి గౌతమ్
బుల్లితెరపై సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రీల్ కపుల్‌గానే కాకుండా సుధీర్-రష్మి రియల్ కపుల్ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్ చేస్తారు ఈ జంట. ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని తెలిపింది. ఇక తాను నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుధీర్‌ను మీరే గెస్ట్‌గా పిలిచారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నేను సుధీర్‌ను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పిలవకపోయినా అతడు వస్తాడు. మా మధ్య అలాంటి స్నేహం ఉంది. ఈవెంట్ ఉందని తనకి తెలుసు. నేను పిలవకపోయినా సుధీర్ వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పిలవలేదు, నందు గెస్టుగా పిలిచాడు అంటూ చెప్పుకొచ్చింది. -
గుడ్‌న్యూస్ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్
నటుడు, కమెడియన్ సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ కామెడీ షోతో ఇండస్ట్రీకి వచ్చిన సుధీర్ స్టార్ హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. ఓ వైపు కమెడియన్‌గా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూనే మరోవైపు హీరోగా చేస్తున్నాడు. అయితే తనకి అంత పాపులారిటి తెచ్చిపెట్టిన జబర్థస్త్ అనే కామెడీ షో నుంచి ఇటీవలె సుధీర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. మళ్లీ ఆ షోకు వస్తే బాగుండంటూ అభిమానులంత ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో తన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పాడు. చదవండి: సుకుమార్‌ని కలిసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్, ఎందుకో? ప్రస్తుతం సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నవంబర్ 18న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సుధీర్ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా జబర్థస్త్ నుంచి బయటకు రావడంపై క్లారిటీ ఇచ్చాడు. తన లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంటని అడగ్గా.. జబర్థస్త్ షో అన్నాడు. 2013 ఫిబ్రవరి 7వ తేదీ తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నాడు. తనని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆ షోనే అన్నాడు. మరి వదిలేశారు అని యాంకర్ అడగ్గా.. రాలేదని, మళ్లీ వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఫ్లైట్ నుంచి దూకేశా.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది: శర్వానంద్ త్వరలోనే మళ్లీ ఆ కామెడీ షోకి రీఎంట్రీ ఇస్తానని, కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే ఆ షోను నుంచి బయటకు వచ్చానని చెప్పాడు. ఈ మేరకు మాట్లాడుతూ.. ‘జబర్థస్త్ షోని విడిచి పెట్టలేదు. ఒక 6 నెలలు బ్రేక్ తీసుకున్నా అంతే. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగానే నేను గ్యాప్ తీసుకున్నా. ఇదే విషయాన్ని నిర్మాతలను కూడా వివరించా. వారు కూడా ఒకే అన్నారు. అతి త్వరలోనే మళ్లీ జబర్థస్త్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సుధీర్ మాటలు విని అతడి ఫ్యాన్స్ అంత ఫుల్ ఖుషి అవుతున్నారు. -
సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ ట్రైలర్ వచ్చేసింది
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈచిత్రం నవంబర్ 18న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చారు మేకర్స్. చదవండి: అంత తెలిగ్గా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన ‘‘వయసు తక్కువ ‘షో’లు ఎక్కువ.. నువ్వు శనివారం పుట్టావా? శనిలా తగులుకున్నావ్, రామాయణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్కడ అందరు మాయ లేడీలే’’ డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను మొట్టమొదటి సారి వీడిలో చూశాను సార్’ వంటి పవర్ఫుల్ డైలాగ్ సినిమాలపై అంచాలను పెంచేస్తున్నాయి. అలాగే ఇందులో సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. గెహ్నాసిప్పి గ్లామర్, సప్తగిరి కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. -
కామెడీ షోతో ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్
ప్రముఖ తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' షోను ఓటీటీ వేదికగా లాంచ్ చేయబోతున్నారు. ''అరే.. స్టాక్స్ దమ్ము లేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిల్లిపోతుంది'' అంటున్నారు అనిల్. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది? ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్ చేసేది కామెడీనే. ఈ నవంబర్ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' నవంబర్ నుంచి మొదలు కానుంది. ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ షో ట్రైలర్‌కి విశేషమైన స్పందన వచ్చింది. వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్‌ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సుడిగాలి సుధీర్ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు. ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటీటీలో అడుగుపెడుతునందుకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్'కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. నవంబర్‌లో ఈ కామెడీ స్టాక్ ఎక్సేంజ్ ఆహాలో ప్రసారం కానుంది. చదవండి: ఆటోలో ప్రయాణించిన నటుడు, వీడియో వైరల్ ఇనయ అదిరిపోయే ట్విస్ట్.. షాకైన సూర్య, శ్రీహాన్ -
సుడిగాలి సుధీర్ 'గాలోడు'.. మరో లిరికల్ సాంగ్ రిలీజ్
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన `గాలోడు` టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. వైఫై నడకలదానా అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటలో సుధీర్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్‌లో హీరో లుక్ అదిపోయింది. 'ఓ పిల్లో హోయిలా హోయిలా' అంటూ సాగే పాట యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్‌ను భీమ్స్ సిసిరోలియో అలపించగా.. శ్రీ శ్రీరాగ్ లిరిక్స్ సమకూర్చారు. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కెరీర్లో హైలెట్‌గా నిలవనుంది. ఈ సినిమా విడుదల తేదిని త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. -
బిగ్‌బాస్ 6లోకి సుడిగాలి సుధీర్? వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌజ్‌లో హంగామా!
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం 6వ సీజన్‌ను జరుపుకుంటోంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కాస్తా దగ్గిందననే చెప్పొచ్చు. ఆడియన్స్‌కి పెద్దగా పరిచయం లేని వారే ఈ సీజన్లో ఎక్కువ ఉన్నారు. బాలాదిత్య, సింగర్ రేవంత్ మిగతావారేవరు పెద్దగా పరిచయం లేనివారే. దీంతో ఈ సీజన్‌పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే హౌజ్‌లో కంటెస్టెంట్స్ తీరు కూడా అలాగే ఉంది. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం, వ్యక్తిగతంగా ద్వేషించుకోవడం తప్పా ఎవరి మధ్యా పెద్దగా సఖ్యత కనిపించడం లేదు. టాస్క్‌లో సైతం టీం మెంబర్స్ మద్దతుగా నిలవకపోగా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్‌గానే ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా గత సీజన్ల కంటే ఈ సీజన్‌కు ప్రేక్షకాదరణ కరువైంది. దీంతో ఎంటర్టైన్మెంట్ డోస్‌ను పెంచేందుకు బుల్లితెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్‌ను బిగ్‌బాస్ నిర్వహకులు రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్‌గా వచ్చి యాంకర్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ వైల్డ్‌కార్డ్ ద్వారా బిగ్‌బాస్‌లోకి తీసుకువస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వారం చివరిలో సుధీర్ సడన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.ప్రస్తుతం సుధీర్ క్వారంటైన్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది తెలిసి బిగ్‌బాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్‌కి కచ్చితంగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందంటున్నారు అతడి ఫ్యాన్స్. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఒక్క కంటెస్టెంట్లు అంతగా వినోదాన్ని అందించలేకపోతున్నారు. అందుకే ఈ సమయంలో సుధీర్ హౌస్‌లోకి వస్తే ప్రేక్షకులకు మంచి వినోదంతో పాటు మంచి టాప్ టీఆర్పీ రేటింగ్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్ నిర్వహకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సుధీర్‌కు భారీగా పారితోషికం కూడా ఇస్తున్నారట. అయితే అది ఎంత అనేది స్పష్టత లేదు. ఇక సుధీర్ హౌజ్‌లో వస్తాడా? రాడా? తెలియాలంటే ఈ వారం చివరి వరకు వేచి చూడాల్సిందే. -
సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫైనల్, పోటీలో ఐదుగురు!
గాత్రం మీది... వేదిక మాది... వయసుతో పనేముంది? ప్రతిభే కదా ఉండాల్సింది! వందమందిలో అయినా ఆత్మవిశ్వాసంతో పాడగలననే ధైర్యం.. శాస్త్రీయమైనా, సమకాలీనమైనా శృతి తప్పకుండా వినపించనగలననే నమ్మకం... వెరసి, మీరే సూపర్ సింగర్!! ఔత్సాహిక గాయనీగాయకులకు అపూర్వ అవకాశమందిస్తున్న స్టార్‌మా సూపర్ సింగర్ జూనియర్ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. గత 13 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను తమ అపూర్వ గాన ప్రతిభతో కట్టిపడేసిన బుల్లి గాయనీగాయకులు ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. తెలుగు టెలివిజన్ రంగ చరిత్రలో ఎంతోమంది సూపర్ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చిన స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ పోటీల ఫైనల్స్‌ను ఈ ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబోతున్నారు. పదమూడు వారాలు... 14 మంది అపూర్వ గాయనీ గాయకులతో రసవత్తరంగా జరిగిన పోటీల ఫైనల్స్‌లో ఐదుగురు పోటీపడబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రబృందం కృతీశెట్టి, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోషన కృష్ణ విచ్చేయనున్నారు. హాట్‌స్టార్‌లోనూ ప్రసారం కాబోయే ఫైనల్స్‌కు గాయకులు చిత్ర, మనో, హేమచంద్ర, రనీనా రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అనసూయ, సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: వేరే అమ్మాయితో నా మాజీ బాయ్‌ఫ్రెండ్, గుండె పగిలింది: సింగర్ నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్ -
'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ
టైటిల్: వాంటెడ్ పండుగాడ్ నటీనటులు: సునీల్, సుడిగాలి సుధీర్, అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: జనార్ధన మహర్షి ఎడిటర్: తమ్మిరాజు సినిమాటోగ్రఫీ: మహిరెడ్డి పండుగల సమర్పణ: కె. రాఘవేంద్ర రావు నిర్మాతలు: సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి దర్శకత్వం: శ్రీధర్ సీపాన విడుదల తేది: ఆగస్టు 19, 2022 బుల్లితెర నటీనటులు సుడిగాలి సుధీర్, సునీల్, యాంకర్ అనసూయ భరద్వాజ్, దీపికా పిల్లి, హాస్య నటులు వెన్నెల కిశోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించిన తాజా చిత్రం వాంటెడ్ పండుగాడ్. ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెల మూడి నిర్మించారు. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పోస్టర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేర కామెడీని పంచిందో రివ్యూలో చూద్దాం. కథ: పాండు ఉరఫ్ పండు (సునీల్) పోలీసులను కొట్టి చంచల్ గూడా జైలు నుంచి తప్పించుకుంటాడు. అలా జైలు నుంచి పారిపోయిన పండు నర్సాపురం అడవిలో దాక్కున్నాడని మీడియాలో కథనాలు వస్తాయి. పండును పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ విషయం తెలిసి పండును పట్టుకునేందుకు అఖిల్ చుక్కనేని (వెన్నెల కిశోర్), విక్రమ్ రాథోడ్ (సప్తగిరి), బోయపాటి బాలయ్య (శ్రీనివాస్ రెడ్డి), మణిముత్యం (తనికెళ్ల భరణి), హాసిని (ఆమని) తదితరులు అడవిలోకి వెళ్తారు. అసలు వారికి డబ్బు ఎందుకు అవసరమైంది? ఆ డబ్బుతో ఏం చేద్దామనుకున్నారు? ఆ అడవిలో గంజాయి ఎవరు పెంచారు? కోయజాతి అమ్మాయిగా ఝాన్సీ (అనసూయ) అడవిలో ఎందుకు తిరుగుతుంది? అనే తదితర విషయాలు తెలియాలంటే వాంటెడ్ పండుగాడ్ చూడాల్సిందే. విశ్లేషణ: 'వాంటెడ్ పండుగాడ్' సినిమాకు 'పట్టుకుంటే కోటి' అనే క్యాప్షన్‌తోనే కథేంటో చెప్పేశారు. ఇక సునీల్ జైలు నుంచి తప్పించుకోవడం, అతన్ని పట్టుకున్నవాళ్లకు రూ. కోటి రివార్డు ప్రకటించడం, తర్వాత విభిన్న నేపథ్యాలతో పాత్రలను పరిచయం చేయడంతో సినిమా కథ అర్థమైపోతుంది. బుల్లితెరతో పాపులారిటీ సంపాందించుకున్న సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ, దీపికా పిల్లి కనిపించడంతో అది కూడా ఒక టీవీషోలా తోస్తుంది. కొద్దిసేపు సినిమాల ఫీల్ అవ్వడానికి సమయం పడుతుంది. కొంచెం అతికించిపెట్టినట్లుగా ఉన్న కామెడీ ట్రాక్‌తో పట్టాలు ఎక్కిన సినిమా అకడక్కడ బాగానే నవ్విస్తుంది. వివిధ హిట్ సినిమాల్లోని డైలాగ్‌లను స్ఫూఫ్ చేసి బాగానే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక పాటలు, అందులో హీరోహీరోయిన్స్‌ను చూపించిన విధానం దర్శకేంద్రుడి రాఘవేంద్ర రావు శైలి కనిపిస్తుంది. అయితే సినిమా కామెడీ జోనర్ కావడమో, మాములు ఆర్టిస్ట్‌లు కావడంచేతనో ఆ శైలి బాగా ఎక్కకపోయిన హీరోయిన్ల అభినయం, అందచందాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'అబ్బ అబ్బ' అనే పాట అలరించేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అతిథిపాత్రలో బ్రహ్మానందం మెరిసారు. ఆయన తరహా హాస్యంతో కామెడీ పండించారు. ఎవరెలా చేశారంటే? ఖైది పండుగా సునీల్ నటన బాగానే ఉంది. కానీ సినిమా మొత్తం ఆ పాత్ర చుట్టూనే నడిచినా, నటనకు అంతా ప్రాధాన్యత ఇచ్చేలా లేదు. రెండు చోట్ల ఉండే యాక్షన్ సీన్లలో సునీల్ అదరగొట్టేశాడనే చెప్పవచ్చు. ఇక సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి, అనసూయ, విష్ణు ప్రియ, నిత్యా శెట్టి, వాసంతి క్రిష్ణన్ తనికెళ్ల భరణి, ఆమని పాత్రలు పరిధిమేర నటించి పర్వాలేదనిపించారు. వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వీరాజ్ తమ కామెడీ టైమింగ్‌తో ఆద్యంత ఆకట్టుకున్నారు. నిజానికి సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవాలంటే వారి కామెడి గురించే చెప్పుకోవచ్చు. స్క్రిప్టుకు తగినట్లుగా వచ్చే డైలాగ్‌లు నవ్వు తెప్పించేలా బాగున్నాయి. శ్రీధర్ సీపాన దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే కొంత గ్లామర్, కొంత కామెడీతో ఆకట్టుకుంటాడు ఈ 'వాంటెడ్ పండుగాడ్' -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
పిచ్చిపిచ్చిగా ఉందా? సుధీర్ ఫ్యాన్స్‌పై రాఘవేంద్రరావు సీరియస్
‘‘ఇటీవల విడుదలైన ‘సీతారామం, బింబిసార, కార్తికేయ 2’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ విజయాలతో సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. వినోదాత్మకంగా రూపొందిన మా ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రం కూడా ఈ చిత్రాల్లానే విజయం సాధిస్తుంది’’ అని ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండుగాడ్’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే ఆ సమయంలో అనసూయ మాట్లాడుతుండగా సుడిగాలి సుధీర్ స్టేజ్‌పైకి వచ్చాడు. అతన్ని చూడగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశారు. స్వయంగా రాఘువేంద్ర రావు మైక్ తీసుకొని సైలెంట్‌గా ఉండాలని కోరినా సుధీర్ ఫ్యాన్స్ వినిపించుకోలేదు. దీంతో ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. సుధీర్ సహా అందరూ మాట్లాడుతారని, కాస్త ఓపిగ్గా ఉండాలని కోరారు. పిచ్చిపిచ్చిగా ఉందా? ఎవరు పిలిచారు వాళ్లని? పెద్దా చిన్నా తేడా లేదా? ఇలాగే ప్రవర్తిస్తే బయటకు పంపించేస్తా అంటూ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. -
సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు: దర్శకుడు
Nee Kalle Diwali Song Out From Sudheer Gaalodu Movie: సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. పక్కా మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన `గాలోడు` టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఫస్ట్ సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో 13 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని లిరికల్ సాంగ్‌పై మరింత ఆసక్తిని కలిగించింది. తాజాగా `నీ కళ్లే దివాళి...` లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ స్వరపరిచిన ఈ పాట ట్రెమండస్ రెస్పాన్స్‌తో ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో సుధీర్ డ్యాన్స్, ఫారెన్ లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండడం విశేషం.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ - ```గాలోడు` ఫస్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు `నీ కళ్లే దివాళి` పాట కూడా ఇన్స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్స్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. శ్రీనివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చక్కగా ఆలపించాడు. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ పూర్తయ్యింది. ఫస్ట్ సాంగ్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం`` అని తెలిపారు. -
హీరోయిన్ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా: విష్ణు ప్రియ
యాంకర్ విష్ణు ప్రియ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గానూ సత్తా చాటుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్ అయిన విష్ణు.. మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. హాట్‌హాట్ ఫొటోషూట్స్, పొట్టి బట్టలతో డాన్స్ చేస్తూ తరచూ వీడియోలు షేర్ చేస్తుంటుంది. చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే ఈ క్రమంలో సినిమాల్లో అడపాదడపా పాత్రలకు అవకాశాలు అందుకుంటున్న ఆమె ఏకంగా హీరోయిన్ చాన్సే కొట్టేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. వాంటెడ్ పండుగాడ్ అనే టైటిల్న ఖారారు చేసిన ఈ సినిమాలో టిక్‌టాక్ స్టార్ దీపికా పిల్లి, విష్ణు ప్రియలు కథానాయికలు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకుడు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ మూవీ మీడియా సమావేశంలో విష్ణు ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్ కాకుండానే చనిపోతానేమోనని భయపడ్డానంది. ‘నేను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ రాఘవేంద్రరావు గారు పండుగాడ్ చిత్రంలో నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన వల్ల నేను హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది. కాగా ఇటీవల కొన్ని రోజుల క్రితం రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ ‘మై బెస్ట్ ఫ్రెండ్’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో హాట్‌హాట్ ఫొటోతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆమె మరి హీరోయిన్ ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి. -
సుడిగాలి సుధీర్ క్రైం థ్రిల్లర్ 'కాలింగ్ సహస్ర'.. టీజర్ విడుదల
Sudheer Calling Sahasra Movie Teaser Released By Allu Aravind: సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు. మెజీషియన్‌గా అందరి దృష్టిన ఆకర్షించిన సుధీర్ ఓ కామెడీ షోతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు. తనదైన యాంకరింగ్, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. అలా వచ్చిన క్రేజ్‌తో వెండితెరపై హీరోగా మారాడు. విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలతో అలరించిన సుధీర్ తాజాగా 'కాలింగ్ సహస్ర' అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (ఏప్రిల్ 1) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక నిమిషం 18 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్లో ప్రతి సన్నివేశం ఆసక్తి పెంచేలా ఉంది. 'బతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది', 'చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా.. మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్లు పోవడం' అనే డైలాగ్‌లతో టీజర్ ఆకట్టుకునేలా ఉంది. చూస్తుంటే ఈ మూవీలో క్రైంతోపాటు మంచి లవ్ యాంగిల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడక్షన్ సంయుక్త సమర్పణలో విజేష్ కుమార్ తయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా వ్యవహరించారు. అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించగా మోహిత్ రహ్మణియక్ సంగీతం అందించారు. -
సుధీర్ ఎంగేజ్మెంట్!, ఇంతకీ ఎవరా అమ్మాయి? పేరేంటి..
బుల్లితెర ప్రేక్షకులకు షాకిస్తూ సుధీర్ ఎంగేజ్మెంట్ వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ షో సుధీర్ ఎంగేజ్మెంట్ అంటూ వీడియోను వదిలారు. దీంతో ఇది కాస్తా ప్రస్తుతం నెట్టంట హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఇది నిజమైన నిశ్చితార్థమా? లేక ఎప్పటిలాగే ఫేకా.. అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈసారి సుధీర్ ఎంగేజ్మెంట్ పరిశ్రమకు సంబంధం లేని అమ్మాయితో జరగడం, ఉంగరాలు కూడా మార్చుకోవడంతో మెజారిటీ పీపుల్ ఇది నిజమే అంటున్నారు. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఇదిలా ఉంటే సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ అమ్మాయి ఎవరాని? అందరు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ వీడియోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదని, ఇంతకి పరిశ్రమకు చెందిన అమ్మాయేనా? అని చర్చించుకుంటున్నారు. అంటే ఇంతకాలం సుధీర్ సీక్రెట్ లవ్‌ట్రాక్ నడిపాడా? అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ అమ్మాయి గురించిన వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇంతకి ఆ అమ్మాయి ఎవరంటే.. ఆమె పేరు తేజస్వీ నాయుడు. తను ఒక మోడల్.. పలు యాడ్స్‌లో కూడా నటించిందట. కానీ ఆమె ఇండస్ట్రీలో పెద్దగా ఎవరికి తెలియదు. ఆడపడదడపా యాడ్స్‌లో నటిస్తున్న ఆమె సుధీర్‌తో ఎంగేజ్మెంట్ వీడియోతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అయితే ఈ వీడియో చూసిన సుధీర్-రష్మి గౌతమ్ ఫ్యాన్స్ కాస్తా నిరాశకు లోనైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఈవెంట్లో సుధీర్-రష్మిల ఫేక్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అది అబద్ధమైన వారి ఫ్యాన్స్‌కు మాత్రం కనువిందు ఇచ్చింది. దీంతో బుల్లితెరపై లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. నిజంగానే వీరిద్దరూ రియల్ కపుల్ అయితే బాగుండని ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు వారి ఫ్యాన్స్ కూడా ఆశపడ్డారు. లేట్ అయినా వీరిద్దరూ ఒక్కటవుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మరో అమ్మాయితో సుధీర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ వీడియో అందరిని షాక్‌కు గురిచేస్తోంది. దీంతో ఇది నిజమా? అబద్ధామా? అని తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. -
వైరల్‌గా మారిన సుడిగాలి సుధీర్ ఎంగేజ్మెంట్!
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. కామెడీ షోలు చేస్తూనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడీ కమెడియన్. తనకు వచ్చిన గుర్తింపు, ఆదరణతో సినిమాల్లోనూ లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే కొన్ని సినిమాలు చేసి వెండితెర ప్రేక్షకులను సైతం మెప్పించాడు. ఇదిలా ఉంటే ఈ బుల్లితెర స్టార్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందంటూ తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిజంగానే ఓ కామెడీ షోలో సుధీర్‌కు ఎంగేజ్మెంట్ జరిపించారు. దీంతో అయోమయానికి లోనైన కొందరు అభిమానులు సుధీర్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడా? అని చర్చలు మొదలు పెట్టారు. గతంలో సుధీర్‌కు నిశ్చితార్థమేంటి? ఏకంగా పెళ్లి కూడా చేశారు. కాకపోతే అదంతా స్కిట్లో భాగంగానే! దీంతో ఈ ఎంగేజ్మెంట్ కూడా కచ్చితంగా ప్రాంక్ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు మెజారిటీ నెటిజన్లు. ఇలా చాలాసార్లు మోసపోయాం, కానీ ఈసారి ఆ ఛాన్స్ మీకు ఇవ్వమని తేల్చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం.. 'ఆ అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే సుధీర్ తన ప్రేయసిని పరిచయం చేసి ఉండొచ్చేమో!' అంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది! -
రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే..
Is Anchor Rashmi Gautam Secretly Married, Details Here: యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు. అయితే తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం రష్మీ.. ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట. అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై రష్మీ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో యాంకర్ రవి సైతం పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన సంగతి తెలిసిందే. ఇక రష్మీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ మరిప్పుడు సుధీర్ పరిస్థితేంటి అంటూ పోస్టులు పెడుతున్నారు. -
‘గాలోడు’ సుధీర్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్!
‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం తర్వాత ‘సుడిగాలి’ సుధీర్, దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని ఇటీవల విడుదల చేశారు. ‘‘అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్లు కష్టాలపాలవుతారు.. కష్టాన్ని నమ్ముకున్నవాళ్లు అదృష్టవంతులవుతారు. నేను.. ఈ రెండింటినీ నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను’’ వంటి డైలాగ్‌లు టీజర్లో ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ఆ ఉత్సాహంతోనే స్వీయదర్శకత్వంలో ‘గాలోడు’ సినిమాను నిర్మిస్తున్నాను. ఇటీవల విడుదలైన ఈ టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘గాలోడు’ సుధీర్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. రెండు పాటలు మినహా టాకీ పార్టు పూర్తయింది. ఈ పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
ఇదేందయ్యా ఇది.. సుడిగాలి సుధీర్‌ను ఇలా చూడలా !
Sudigali Sudheer Gaalodu Movie Teaser Released: జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు కమెడియన్ సుడిగాలి సుధీర్. మెజిషియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ బుల్లితెరపై స్టార్‌గా మారిపోయాడు. దీంతో వచ్చిన గుర్తింపుతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు హీరోగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అవి అంతగా ప్రేక్షకులను అలరించలేదు. ఓటమి నేర్పిన అనుభాలతో సుధీర్ మరింత ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు 'గాలోడు'గా వస్తున్నాడు సుడిగాలి సుధీర్. పి. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుధీర్ హీరోగా చేస్తున్న సినిమా గాలోడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. 'నన్ను నేను నమ్ముకుంటాను' అని చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు హీరోగా కూడా కామెడీ తరహా పాత్రలు చేసిన సుధీర్ ఈ సినిమాలో పూర్తి మాస్ హీరోగా కనిపించాడు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. డిఫరెంట్ లుక్‌తో సుధీర్ బాగున్నాడు. ఇతర పాత్రల్లో సప్తగిరి, పృథ్వీ కనిపించారు. త్వరలో సినిమా విడుదలను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' ఒక్క రోజు షూటింగ్ ఖర్చు ఎంతో తెలుసా ? -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వ్రాప్ అప్ పార్టీ
Most Eligible Bachelor Wrap Up Party: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తోంది చిత్ర యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. -
తన ఆస్తుల వివరాలు వెల్లడించిన సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరియయం అక్కర్లేని పేరు ఇది. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తనదైన యాంకరింగ్, కామెడీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు తన మాయతో మెజీషియన్‌గా కూడా మెప్పిస్తున్నాడు. పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే సుధీర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సుధీర్ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. చదవండి: తన ఫస్ట్‌లవ్‌ను పరిచయం చేసిన వర్మ పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న అతడు ఇటీవల ‘సాఫ్ట్వేర్ సుధీర్’తో హీరోగా మారాడు. ఇటూ యాంకర్‌గా, కామెడియన్‌గానే కాకుండా అటూ సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా సుధీర్ పుల్ బిజీగా మారాడు. ఇలా ఖాళీ సమయమే దొరకనంతగా కష్టపడుతున్న సుధీర్ సంపాదన ఎంత ఉంటుందనేది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కామెడీ షోలో సుధీర్ తన ఆస్తులపై నోరు విప్పాడు. ఇక అతడి ఆస్తుల వివరాలు విని అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. కాగా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన సుధీర్ ఆశ్రమం లేక రైల్వే స్టేషన్లోనే పడుకునేవాడినని ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కుటుంబంతో సుధీర్ చదవండి: మహానటి సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా! అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన సుధీర్‌కు ఇప్పుడు హైదరాబాద్‌లో రెండు సొంతిళ్లు ఉన్నాయట. అంతేకాదు పలు స్థిరాస్తులు కూడా బాగానే కూడబెట్టుకుంటున్నానని ఈ షోలో అతడు వెల్లడించాడు. దీంతో సిటీలో ఒక ఇళ్లు కొనడమే కష్టం అలాంటిది సుధీర్ రెండు ఇల్లులు కొన్నాడంటే బాగానే సంపాదిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అతడి ఎదుగుదల చూసి ఫ్యాన్స్ సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా’ అంటూ పోకిరిలోని మహేశ్ డైలాంగ్ను సుధీర్‌కు ఆపాదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్ -
Sudigali Sudheer: పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకున్న సుడిగాలి సుధీర్!
సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఈ పేరు తెలియని వారుండరేమో. పలు టీవీ షోలు, ఈవెంట్లతో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ అతి తక్కువ కాలంలోనే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇక యాంకర్ రష్మీతో కెమెస్ర్టీ కూడా సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో వీరిద్దరు కలిసి చేసిన పలు స్కిట్లు, ఈవెంట్లు సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై గతంలోనే ఇద్దరూ క్లారిటీ ఇచ్చినా ఆ రూమర్లకు మాత్రం తెరపడటం లేదు. ఇటీవలె సుధీర్ 34వ బర్త్‌డేను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి వీరి పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం సుధీర్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, మరో రెండేళ్ల వరకు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరోవైపు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన సుధీర్‌కు వెండితెర అంతగా కలిసి రాలేదు. ఇప్పటికే సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ప్రస్తుతం ఆయన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో గాలోడు అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. సుధీర్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్‌ను ప్రకటించారు. చదవండి : Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం ఆ పనులు చేయడమంటే పిచ్చి ఇష్టం : నటి నవ్య స్వామి -
Galodu Movie: పక్కా మాస్ లుక్‌లో సుడిగాలి సుధీర్
‘సాఫ్ట్వేర్ సుధీర్ ’ చిత్రం తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాలోడు’. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బుధవారం (మే 19) సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘గాలోడు’ అనే టైటిల్‌ను ప్రకటించి, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. సంస్కృతి ఫిలింస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – ‘‘సుధీర్‌కి మాస్లో ఎంత ఇమేజ్ ఉందో చెప్పడానికి మా ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రానికి వచ్చిన భారీ ఓపెనింగ్స్ నిదర్శనం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కా మాస్ ఎంటర్టైనర్గా ‘గాలోడు’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. Motion Poster of Hero #Sudheer In & As #Gaalodu Directed by #RajasekarReddyPulicharla #HappyBirthdaySudheer ✨#SamskruthiFilms pic.twitter.com/3tVvGHMpRl — BARaju (@baraju_SuperHit) May 19, 2021 -
రష్మీకి కరోనా: జబర్దస్త్ షూటింగ్ వాయిదా!
కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్‌కు కరోనా సోకిందంటూ గత కొంత కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మౌనం వహించడంతో ప్రేక్షకులు సదరు వార్తలు నిజమేనని నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త బుల్లితెర అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. సుధీర్ జోడి, యాంకర్ రష్మీ గౌతమ్ కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై రష్మీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. (చదవండి: విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన భూమిక) మరోవైపు సుధీర్, రష్మీలకు కరోనా సోకిన కారణంగానే శుక్రవారం జరగాల్సిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షూటింగ్ అక్టోబర్ 28కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా వీరిద్దరూ కోలుకోకపోతే నవంబర్ మొదటి వారంలో షూటింగ్ జరిపే అవకాశాలున్నాయి. కాగా సుధీర్, రష్మీ దసరా ప్రత్యేక ఈవెంట్లో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరికీ కరోనా సోకిన విషయం నిజమే అయితే అదే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నటి సంగీత, యాంకర్ వర్షిణి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సహా పలువురు నటీనటులు సైతం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోక తప్పదు. ఇదిలా వుంటే నటుడు నందు పోతురాజుగా నటిస్తున్న' బొమ్మ బ్లాక్‌బస్టర్'లో రష్మీ లుక్కు మంచి స్పందన లభించింది. ఇటీవలే ఆ సినిమా నుంచి విడుదలైన 'రాయే నువ్వు రాయే' పాట ప్రేమికులను ఆకట్టుకుంటోంది. (చదవండి: సుడిగాలి సుధీర్‌కు కరోనా?) -
సుడిగాలి సుధీర్‌కు కరోనా?
లాక్డౌన్లో నవ్యస్వామి, రవికృష్ణ , సాక్షి వివ, భరత్వాజ్, హరికృష్ణ వంటి పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కానీ ఆ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. తాజాగా టీవీ సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారనే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. అక్టోబర్ 18న అతడికి కరోనా సోకినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయంపై సుధీర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. [ చదవండి : అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే ఇలా చేయండి ] మరోవైపు దీనిపై అధికారిక ప్రకటన లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ సుధీర్‌కు కరోనా పాజిటివ్ అన్న విషయం నిజమే అయితే ఈ మధ్య కాలంలో ఆయన పాల్గొన్న షూటింగ్స్ యూనిట్ సభ్యులు కూడా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోక తప్పదు. ముఖ్యంగా దసరా స్పెషల్ ఈవెంట్ 'అక్కా ఎవడే అతగాడు'లో రష్మీ, వర్షిణి, సంగీత, శేఖర్ మాస్టర్ కూడా పాల్గొనడంతో వారికి కూడా కరోనా సోకే అవకాశాలున్నాయంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాగా సుడిగాలి సుధీర్ మొదట్లో మ్యాజిక్ షోలు చేసేవారు. ఎప్పుడైతే జబర్దస్త్ షోలో అడుగు పెట్టారో ఇక వెనుతిరిగి చూసుకునే అవసరమే లేకపోయింది. జబర్దస్త్‌తోపాటు ఢీ సహా పలు షోలలో కనిపిస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌లోనూ కరోనాను లెక్క చేయకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు అహర్నిశలు శ్రమించారు. (విజయ్ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపు) -
రెండో సినిమా షురూ
‘జబర ్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్ ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రంతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కనున్న రెండో చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘సాఫ్ట్వేర్ సుధీర్’తో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సాంబశివ ఆర్ట్ క్రియేష¯Œ ్స బ్యానర్లో అంజన్ బాబు నిమ్మల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులకు కనువిందు చేసే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సప్తగిరిగారు ఓ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారం¿ý మవుతుంది’’ అన్నారు. పోసాని కృష్ణమురళి, ఝాన్సీ, రాజ్‌బాల తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: రాజ్ తోట. -
‘జబర్దస్త్’ నటులకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: నవ్వుల్ని నలుగురికి పంచేవారు కూడా డాక్టర్లే అనే నినాదంతో విక్రమ్ ఆర్ట్స్ విక్రమ్ ఆదిత్య రెడ్డి ఆధ్వర్యంలో ‘నేచర్ కేర్ ఇన్నోవేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్సిఐఎస్) ఆధ్వర్యంలో డాక్టర్ లాఫ్టర్ అవార్డ్ 2020 కార్యక్రమం బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్న సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్, అప్పారావు, రాము, రాకింగ్ రాకేష్, ఉదయశ్రీ, స్వప్న, నాగిరెడ్డి, చంద్రముఖి చంద్రశేఖర్, యాదమ్మ రాజు, జీవన్, సూర్య తేజు, సుబ్రాన్త్లకు డాక్టర్ లాఫ్టర్ అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారింలో ‘జబర్దస్త్’ కమెడియన్లు ఎక్కువగా ఉన్నారు. సందర్భంగా రసమయి బాలకిషన్ తమ పాటలతో ఉర్రూతలుగించారు. ఈ సందర్భంగా బి ప్రిపేర్డ్ ఎడ్యుకేషన్ యాప్‌ను విడుదల చేశారు. (చదవండి: బన్నీ మెచ్చిన షార్ట్ ఫిల్మ్) -
త్రీ మంకీస్ సినిమా రివ్యూ
సినిమా : త్రీ మంకీస్ నటీనటులు: సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, కారుణ్య చౌదరి దర్శకత్వం: జి.అనిల్ కుమార్ నిర్మాత: నగేష్. జి సంగీతం: జి. అనిల్ కుమార్ బ్యానర్: ఓరుగల్లు సినీ క్రియేషన్స్ జానర్: హారర్ కామెడీ ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం అంతగా ఆడకపోయినా బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ మరోసారి హీరోగా ముందుకొచ్చాడు. పైగా ఈసారి తన జబర్దస్త్ టీం శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి సినిమా చేయడం విశేషం. ఇక ట్రైలర్ బాగుందంటూ మెగాస్టార్ చిరంజీవి ‘త్రీ మంకీస్’ను అభినందించడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. జబర్దస్త్ షో పాపులారిటీ సినిమాకు ఏమేరకు ప్లస్ అయ్యింది? బుల్లితెరపై కడుపు చెక్కలయ్యేలా నవ్వించే ఈ టీమ్ వెండితెరపై ఏమేరకు నవ్వులు పండించగలిగింది..? సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ హీరోలుగా ప్రేక్షకులను మెప్పించారా లేదా అనేది చూద్దాం.! కథ: సంతోష్ (సుధీర్) మార్కెటింగ్ శాఖలో పనిచేస్తుంటాడు. అతనికి ఫణి (గెటప్ శ్రీను), ఆనంద్ (ఆటో రాంప్రసాద్) ప్రాణ స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి చేసే కోతిచేష్టలకు అంతే లేదు. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి సన్నీలియోన్ ఎందుకు వచ్చింది? అసలు ఆమె ఎవరు.. ఎలా చనిపోయింది? ఆమె చావుకు ఈ ముగ్గురికి సంబంధమేంటి? ఇంతలో సుధీర్ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటాడు. అతన్ని కాపాడేందుకు ఫణి, ఆనంద్ ఏం చేశారు? అసలే చిక్కుల్లో ఉన్న వీరిపై ఓ పాపను కాపాడాల్సిన బాధ్యత ఎలా పడింది. ఆమెను వీరు ఎలా కాపాడారు..? అని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..! (వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు) విశ్లేషణ: సాయం అనే మందు లేక చాలామంది చనిపోతున్నారనే అంశాన్ని దర్శకుడు కథలో అంతర్లీనంగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమా తొలి అర్ధభాగం త్రీ మంకీస్ పంచ్‌లు, సరదా సన్నివేశాలతో పరవాలేదనిస్తుంది. వాళ్ల పంచ్‌లు పేలడంతో పెద్దగా బోర్ కొట్టదు. అయితే, సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ముగ్గురు స్నేహితులను ఓ హత్య కేసులో ఇరికించి, ప్రేక్షకుడిని థ్రిల్ చేద్దామనుకున్న దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కథ క్రైమ్ జానర్లోకి వెళ్లిన తర్వాత దర్శకుడు తేలిపోయాడు. అమ్మాయి హత్య కేసులో ముగ్గురు ఇరుక్కు పోయినప్పుడు.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు అంతగా పండలేదు. ఏది ఆశించి.. కథ రాసుకున్నాడో అది నిజం చేసేందుకు దర్శకుడి పనితనం సరిపోలేదు. తొలి అర్థభాగం జబర్దస్త్ పంచ్‌లతో ఫరావాలేదనిపంచిన దర్శకుడు.. రెండో అర్థభాగం థ్రిల్లర్ నేపథ్యంలో కథ నడపలేకపోయాడు. ఇక పాటలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం లేవు. రెండు పాటలు ఫరవాలేదనిపించాయి. బుల్లితెరపై అల్లరి చేసే త్రీ మంకీస్‌లో.. ఎమోషన్స్ అనే కొత్త కోణం చూపించారు. షకలక శంకర్, కారుణ్య చౌదరి ఓకే అనిపిస్తారు. చిన్న సినిమా అయినా.. సాంకేతికంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఇక ముగ్గురు హాస్యనటుల్ని ఒకేసారి వెండితెరపై చూపడం.. సగటు అభిమానికి నచ్చుతుంది. అయితే, వాళ్లలోని ప్రతిభను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే కథ మాత్రం కాదని చెప్పాలి. దర్శకుడు కేవలం కామెడీనే నమ్ముకుంటే బాగుండేంది. ప్లస్ పాయింట్స్: సుధీర్, శ్రీను, రాంప్రసాద్ నటన కామెడీ టైమింగ్ మైనస్ పాయింట్స్: కొత్తదనం లేకపోవడం భయపడేంత హారర్ సీన్లు లేకపోవడం -
ఇప్పుడే హీరో ట్యాగ్ వద్దు
‘‘ప్రేక్షకులకు వినోదం పంచాలని ఇండస్ట్రీకి వచ్చాను. టీవీ, సిల్వర్ స్క్రీన్, యూట్యాబ్ చానెల్ ఇలా ప్లాట్‌ఫామ్ ఏదైనా పర్లేదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన తారాగణంగా అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. నగేష్. జి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘సుడిగాలి’ సుధీర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర చేశా. మా సినిమాకి ఊహించిన స్థాయిలో థియేటర్స్ రాకపోవడంతో కాస్త ఆందోళనగా ఉన్నాం. చిరంజీవిగారు మా ట్రైలర్ చూసి చాలా బాగుందన్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తానన్నారు. నేను హీరోగా చేసిన ‘సాఫ్ట్వేర్ సుధీర్’కి మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే నా ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో అనే ట్యాగ్ వద్దు’’ అన్నారు. -
ఇండస్ట్రీలోని త్రీ మంకీస్ మేమే
‘‘ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద వాళ్లున్నా నన్ను, మంచు లక్ష్మి, అలీని ఎందుకు పిలిచారు? మేం ముగ్గురం చేసే పిచ్చి చేష్టలు ఉహించుకొని, ఇండస్ట్రీలో ఉన్న త్రీ మంకీస్ మేమే అని మమ్మల్ని పిలిచినట్టున్నారు’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘3 మంకీస్’. కారుణ్య చౌదరి హీరోయి¯Œ గా నటించారు. అనిల్ కుమార్ జి. దర్శకత్వంలో నగేష్ .జి నిర్మించిన ఈ సినిమా రేపువిడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, ఘరానా బుల్లోడు’ లాంటి టైటిల్స్ ఏ హీరోకి పెట్టినా సరిపోతాయి. ‘3 మంకీస్’ టైటిల్ మాత్రం వీరికి తప్పితే మరెవరికీ పనికిరాదు’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడం కంటే ‘జబర్దస్త్’ లో చేయడమే కష్టం’’ అన్నారు మంచు లక్ష్మి. ‘‘చిన్న సినిమాలను బతికిస్తే ఇండస్ట్రీతో పాటు చిన్న దర్శకులు బాగుంటారు’’అన్నారు నటుడు అలీ. ‘‘మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు నగేష్. ‘‘ఇలాంటి పాత్ర చేస్తానని జీవితంలో అనుకోలేదు’’ అన్నారు రాంప్రసాద్. ‘‘మా ముగ్గురికీ ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ రాదు’’ అన్నారు ‘సుడిగాలి’ సుధీర్. ‘‘ఈ ప్రపంచంలో సాయం అనే మందు లేక చాలా మంది చనిపోతున్నారని మా చిత్రంలో చెప్పాం’’ అన్నారు అనిల్. హీరో ఆకాష్ పూరి, కారుణ్య చౌదరి, రచయిత అరుణ్, కెమెరామేన్ సన్నీ మాట్లాడారు. -
వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరు
‘‘త్రీ మంకీస్’ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో నేను, సుధీర్, గెటప్ శ్రీను కోతి చేష్టలు చేస్తుంటాము’’ అన్నారు రాంప్రసాద్. ‘జబర్దస్త్’ ఫేమ్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించిన∙చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో జి. నగేశ్ నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీకి రావాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. గలగల మాట్లాడుతూ, పంచ్‌లు వేస్తుంటే చుట్టుపక్కల వాళ్లు ‘నువ్వు ఇండస్ట్రీలో ఉండాల్సినవాడివి’ అనేవారు. దాంతో లగేజ్ సర్దుకుని హైదరాబాద్ వచ్చేశాను (నవ్వుతూ). కానీ ఇక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎంతో స్ట్రగులయ్యాక ‘జబర్దస్త్’ టీవీ షో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ షో ద్వారా ‘ఆటో రాంప్రసాద్’గా పాపులరయ్యాను. ‘త్రీ మంకీస్’ కథ నచ్చి మేం సినిమా చేయాలనుకున్నాం. సరదాగా సాగిపోయే ముగ్గురు స్నేహితులకు ఒక సమస్య ఎదురవుతుంది. అందులో నుంచి ఎలా బయటపడ్డారు అన్నది కథాంశం. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులను కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. ‘త్రీ మంకీస్’ చూసి వీళ్లకి టీవీయే కరెక్ట్ అని మాత్రం అనుకోరని చెప్పగలను. టీవీని, సినిమాను బ్యాలెన్స్ చేస్తూ పని చేయాలనుకుంటున్నాను. దర్శకత్వం చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి’’ అన్నారు. -
త్రీ మంకీస్ పైసా వసూల్ చిత్రం
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘త్రీ మంకీస్’. జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను జి. నగేష్ నిర్మించారు. కారుణ్య చౌదరి కథానాయిక. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ – ‘‘కామెడీతో పాటు అన్ని అంశాలుంటాయి. పక్కా పైసా వసూల్ చిత్రమిది’’ అన్నారు. ‘‘త్రీ మంకీస్’ చిత్రం మా బ్యానర్‌కి మంచి పేరు తీసుకొస్తుందనుకుంటున్నాను’’ అన్నారు నగేష్. ‘‘మేం ముగ్గురం కలసి సరదాగా నటించాం. ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదిస్తారనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు గెటప్ శ్రీను. ‘‘సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు రాంప్రసాద్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయి బాబు వాసిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ సాయి. -
జీవితాంతం రుణపడి ఉంటా
‘‘వారానికి మూడు రోజులు బుల్లితెరపై కని పిస్తాను. వెండితెర మీద రెండు గంటలపాటు కనిపించే పాత్ర చేస్తానని నా జీవితంలో ఊహించలేదు’’ అని ‘సుడిగాలి’ సుధీర్ అన్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో ‘సుడిగాలి’ సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సుధీర్ మాట్లాడుతూ– ‘‘నా కోసం థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. మా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది’’ అన్నారు. ‘‘మా సినిమా రెండు రోజుల్లోనే 4కోట్ల 50 లక్షలు గ్రాస్ సాధించింది. ఈ విజయానికి గుర్తుగా నా పేరుని ‘సాఫ్ట్వేర్’ శేఖర్ రాజుగా మార్చుకున్నాను’’ అన్నారు శేఖర్ రాజు. ‘‘మా సినిమాకి తెలుగులోనే కాదు.. కర్ణాటక లోనూ వసూళ్లు బాగున్నాయి’’ అన్నారు ధన్య బాలకృష్ణ. సంగీత దర్శకుడు భీమ్స్, లిరిసిస్ట్ సురేష్ ఉపాధ్యాయ, నైజాం డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ సుధీర్
-
సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..
-
సుధీర్‌తో మూవీపై స్పందించిన రష్మీ..
జబర్దస్త్ నటుడు సుధీర్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్వేర్ సుధీర్. ఈ చిత్రంలో సుధీర్ సరసన హీరోయిన్గా ధన్య బాలకృష్ణ నటించారు. ఈ శనివారం విడుదలైన సాఫ్వేర్ సుధీర్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సుధీర్, ధన్య ‘సాక్షి’ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు జబర్దస్త్ సెలబ్రిటీలు వారికి కాల్ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. లైవ్‌లో సర్ప్రైజ్ కాల్ చేసిన రష్మీ.. ధన్య, సుధీర్‌లకు కంగ్రాట్స్ చెప్పారు. ట్యాలెంట్ అనేది వృథా కాదనే దానికి సుధీర్ నిదర్శనమని అన్నారు. టీవీ నుంచి బిగ్ స్కీ ట్యాలెంట్ పరిచమవ్వడం మంచి పరిణామని అన్నారు. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో ఉన్నానని.. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు. సుధీర్ నవరసాలు పండించడంలో దిట్ట అని చెప్పిన రష్మీ.. త్వరలోనే సుధీర్‌లోని అన్ని కోణాలు చూస్తారు. ఈ సందర్భంగా సుధీర్, రష్మి కాంబినేషన్లో సినిమా ఎప్పుడూ వస్తుందని ప్రశ్నించగా.. ‘కొన్ని చర్చలు జరుగుతున్నాయి.. సుధీర్ ప్రస్తుతం ఈ సినిమాతో బీజీగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత త్వరగా ఇది జరుగుతుందో చూద్దాం’ అని రష్మీ తెలిపారు. అలాగే లైవ్ షోకు ఫోన్ చేసిన రామ్‌ప్రసాద్.. సుధీర్‌ను ఆటపట్టించాడు. తనదైన శైలిలో ఆటో పంచ్‌లు విసిరాడు. సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని సుధీర్ చెప్పారు. చాలా మంది ఫోన్లు చేసి సినిమా బాగుందని చెబుతున్నారని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా ఈ సినిమా నచ్చకపోతే క్షమించాలన్న సుధీర్.. మరో మంచి సినిమాతో ముందుకు వస్తానని అన్నారు. ఈ సినిమాకు అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయిందన్న ధన్య.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్లోనే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కోరారు. -
నవ్వులు పంచే సాఫ్ట్వేర్ సుధీర్
‘‘నాది భీమవరం దగ్గర ఒక పల్లెటూరు. హైదరాబాద్‌లో 2500 నెలసరి జీతంతో ఓ గ్లాస్ మార్ట్‌లో పనిచేశా. ఆ పనిలోని మెళకువలు నేర్చుకుని శేఖర గ్లాస్మార్ట్ను స్థాపించి ప్రస్తుతం మూడు చోట్ల 90 మంది సిబ్బందితో సంస్థని నడుపుతున్నాను’’ అని నిర్మాత, నటుడు కె.శేఖర్ రాజు అన్నారు. సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. కె.శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.శేఖర్ రాజు మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ‘సాఫ్ట్వేర్ సుధీర్’ చిత్రం నిర్మించా. సుధీర్‌కు ఇది మంచి సినిమా అవుతుంది. ఈ ఇయర్ ఎండిగ్ని మా సినిమా చూస్తూ ఆడియ¯Œ ్స ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ– ‘‘రైటర్‌గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. 10 సంవత్సరాల క్రితం కథలు పట్టుకొని సినిమా ఆఫీసుల చుట్టూ తిరి గాను. ఫైనల్‌గా మా గురువు సంపత్ నందిగారి దగ్గర అసిస్టెంట్ రైటర్, కో డైరెక్టర్‌గా పని చేశాను. పోసాని కృష్ణమురళి, కోన వెంకట్‌గారి దగ్గర కూడా పనిచేశాను. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి రచయితగా పని చేశాను. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. కరెంట్ బర్నింగ్ ఇష్యూ పాయింట్ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు. -
వెండితెర నటుడిగానూ ఆదరించండి
‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టీవీ షోస్ ద్వారా పాపులర్ అయిన ‘సుడి గాలి’ సుధీర్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’. ఈ చిత్రంలో ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె. శేఖర్‌రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. నిర్మాత రాజ్ కందుకూరి, యాంకర్ సుమ అతిథులుగా ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుక జరిగింది. ‘‘సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ బాగుంటుంది. ఈ ట్రైలర్ నాకు నచ్చింది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ కందుకూరి. ‘‘ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుమ. ‘‘కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఇప్పటి వరకు నన్ను బుల్లితెరపై ఎలా సపోర్ట్ చేశారో, అలాగే వెండితెరపై కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు సుధీర్. ‘‘ఈ సినిమాలో కథ కన్నా కొన్ని జీవితాలు కనిపిస్తాయి. కామెడీ టైమింగ్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సుధీర్‌ని హీరోగా ఎంపిక చేశాం. కథ నచ్చి ప్రజాగాయకుడు గద్దర్ ఇందులో ఓ పాట పాడి నటించారు’’ అన్నారు రాజశేఖర్. ‘‘మా బ్యానర్ ద్వారా సుధీర్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు శేఖర్. లిరిసిస్ట్ సురేష్ గంగుల, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. -
వాట్సాప్‌లో ఉన్నావా.. లేదు అమీర్‌పేట్‌లో..
‘నీ దగ్గర అంతుందేంట్రా అంటే... అంతులేనంత’ అంటున్నాడు సుడిగాలి సుధీర్. ‘ఫోటోలు పంపిస్తాను వాట్సాప్‌లో ఉన్నావా అని అడిగితే.. లేదంకుల్ అమీర్‌పేటలో ఉన్నాను’ అంటూ అమాయకంగా చెబుతున్నాడు. ఇవన్నీ అతడి తొలి చిత్రం ‘సాఫ్ట్వేర్ సుధీర్’.లోని డైలాగులు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. తనకు అలవాటైన పంచ్ డైలాగులు, డాన్స్‌తో సుధీర్ అదరగొట్టాడు. పనిలో పనిగా ఫైటింగ్‌లు చేసేశాడు. సుధీర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ట్రైలర్ ఉంది. సుధీర్‌కు జోడిగా ‘రాజుగారి గది’ ఫేమ్ ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పారిశ్రామికవేత్త కె.శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. నాజర్, సాయాజి షిండే, ఇంద్రజ, పృథ్విరాజ్, ఎన్.శివప్రసపాద్, గద్దర్ తదితరులు ఈ పాత్రల్లో నటించారు. (చదవండి: ఫిల్మ్ చాంబర్లోకి రానిస్తారా అనుకున్నా)