
కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్‌కు కరోనా సోకిందంటూ గత కొంత కాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మౌనం వహించడంతో ప్రేక్షకులు సదరు వార్తలు నిజమేనని నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త బుల్లితెర అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. సుధీర్ జోడి, యాంకర్ రష్మీ గౌతమ్ కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై రష్మీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. (చదవండి: విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన భూమిక)
మరోవైపు సుధీర్, రష్మీలకు కరోనా సోకిన కారణంగానే శుక్రవారం జరగాల్సిన జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షూటింగ్ అక్టోబర్ 28కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా వీరిద్దరూ కోలుకోకపోతే నవంబర్ మొదటి వారంలో షూటింగ్ జరిపే అవకాశాలున్నాయి. కాగా సుధీర్, రష్మీ దసరా ప్రత్యేక ఈవెంట్‌లో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరికీ కరోనా సోకిన విషయం నిజమే అయితే అదే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నటి సంగీత, యాంకర్ వర్షిణి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సహా పలువురు నటీనటులు సైతం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోక తప్పదు. ఇదిలా వుంటే నటుడు నందు పోతురాజుగా నటిస్తున్న' బొమ్మ బ్లాక్‌బస్టర్'లో రష్మీ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవలే ఆ సినిమా నుంచి విడుదలైన 'రాయే నువ్వు రాయే' పాట ప్రేమికులను ఆకట్టుకుంటోంది. (చదవండి: సుడిగాలి సుధీర్‌కు కరోనా?)