Sudigali Sudheer: Anchor Vishnu Priya Talks In Wanted PanduGod Press Meet Deets Inside - Sakshi
Sakshi News home page

Anchor Vishnu Priya: హీరోయిన్‌ అవ్వకుండానే చచ్చిపోతానేమోనని భయపడ్డా

Published Mon, May 30 2022 6:25 PM | Last Updated on Mon, May 30 2022 7:22 PM

Anchor Vishnu Priya Talks In Wanted Pandugad Press Meet  - Sakshi

యాంకర్‌ విష్ణు ప్రియ.. బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్‌ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గానూ సత్తా చాటుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్‌ అయిన విష్ణు.. మరోవైపు యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది.  ఇక స్కిన్‌ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఆమె సోషల్‌ మీడియాలో చేసే రచ్చ గురించి తెలిసిందే. హాట్‌హాట్‌ ఫొటోషూట్స్‌, పొట్టి బట్టలతో డాన్స్‌ చేస్తూ తరచూ వీడియోలు షేర్‌ చేస్తుంటుంది.

చదవండి: అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే

ఈ క్రమంలో సినిమాల్లో అడపాదడపా పాత్రలకు అవకాశాలు అందుకుంటున్న ఆమె ఏకంగా హీరోయిన్‌ చాన్సే కొట్టేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్‌ హీరోగా ఓ సినిమా రాబోతున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. వాంటెడ్‌ పండుగాడ్‌ అనే టైటిల్‌న ఖారారు చేసిన ఈ సినిమాలో టిక్‌టాక్‌ స్టార్‌ దీపికా పిల్లి, విష్ణు ప్రియలు కథానాయికలు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు  శ్రీధర్‌ సీపాన దర్శకుడు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఈ మూవీ మీడియా సమావేశంలో విష్ణు ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

చదవండి: భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన కేజీయఫ్‌ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్‌

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్‌ కాకుండానే చనిపోతానేమోనని భయపడ్డానంది. ‘నేను హీరోయిన్ అవ్వకుండానే చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ రాఘవేంద్రరావు గారు పండుగాడ్ చిత్రంలో నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆయన వల్ల నేను హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది. కాగా ఇటీవల కొన్ని రోజుల క్రితం రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘మై బెస్ట్ ఫ్రెండ్’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో హాట్‌హాట్‌ ఫొటోతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆమె మరి హీరోయిన్‌ ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement