Sudigali Sudheer Marriage: ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుడిగాలి సుధీర్‌? | Is Sudigali Sudheer Getting Married? - Sakshi
Sakshi News home page

Sudigali Sudheer Marriage: పెళ్లికి రెడీ అవుతున్న సుడిగాలి సుధీర్‌!.. అమ్మాయి ఎవరంటే..

Published Mon, Apr 17 2023 2:54 PM | Last Updated on Mon, Apr 17 2023 3:15 PM

Is Sudigali Sudheer Getting Married? - Sakshi

జబర్దస్త్‌ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్‌. కమెడియన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుధీర్‌ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్‌ రష్మీతో లవ్‌ట్రాక్‌ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్‌, రష్మీలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

ఇకమూడు పదుల వయసు దాటినా ఇంతవరకు పెళ్లి ఊసెత్తని సుధీర్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే  సుధీర్‌ పెళ్లి చేసుకుంటాడని సమాచారం. ఇంట్లో తల్లిదండ్రుల కోరిక మేరకు సుధీర్‌ ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఒకే చెప్పాడట.

దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. గతంలోనూ సుధీర్‌ పెళ్లి విషయంలో పలు కథనాలు వచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement