Music Director Devi Sri Prasad Marriage Rumors Goes Viral - Sakshi
Sakshi News home page

Devi Sri Prasad : ఓ ఇంటివాడు కాబోతున్న దేవీశ్రీ!.. తనకంటే అంత చిన్న అమ్మాయితో పెళ్లా?

Published Mon, Apr 3 2023 10:56 AM | Last Updated on Mon, Apr 3 2023 12:21 PM

Devi Sri Prasad Marriage Rumors Goes Viral - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌లలో దేవీశ్రీ ప్రసాద్‌ ఒకరు. దేవి సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఆయన మొన్నటి వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నాలుగు పదుల వయసు దాటినా దేవీశ్రీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడట.

ఇక అమ్మాయి ఎవరో కాదు దేవిశ్రీప్రసాద్ దూరపు బంధువుల అమ్మాయట. ఆమె వరసకి మరదలు అవుతుందట. వీరిద్దరికి సుమారు 17ఏళ్ల గ్యాప్‌ ఉందని తెలుస్తుంది. కుటుంబసభ్యుల సమక్షంలో త్వరలోనే వీరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.

మరి నెట్టింట వైరల్‌ అవుతున్నట్లుగా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే. గతంలోనూ దేవీ ఓ హీరోయిన్‌తో పీకలదాకా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వెళ్లిన వాళ్ల రిలేషన్‌ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement