Sudigali Sudheer Engaged With His Relative Girl, Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Sudigali Sudheer Marriage Rumours: ఆమెతో సుధీర్‌ పెళ్లి ఫిక్స్‌.. గతంలో రష్మి చేసిన కామెంట్స్‌ వైరల్‌?

Published Sat, Jul 1 2023 7:19 AM | Last Updated on Sat, Jul 1 2023 8:08 AM

Sudigali Sudheer Getting Married His Relative - Sakshi

జబర్దస్త్‌ షోతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సుడిగాలి సుధీర్‌. కమెడియన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుధీర్‌ ఆ తర్వాత యాంకర్‌గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా యాంకర్‌ రష్మితో లవ్‌ట్రాక్‌ సుధీర్‌కు బాగా కలిసొచ్చింది. వీరిద్దరి జోడికి  టాలీవుడ్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది.   స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేసే ఈ జంట ప్రేమలో ఉన్నారని పలు వార్తలు షికార్లు చేసినా అందులో ఏమాత్రం నిజం లేదని ఇప్పటికే సుధీర్‌, రష్మిలు చాలాసార్లు క్లారిటీ ఇచ్చేశారు. కానీ వీరిద్దరిపైన వచ్చినన్ని పెళ్లి పుకార్లు మరే నటులపై వచ్చి ఉండవు.

(ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్‌ కామెంట్‌ చేసిన సీతారామం బ్యూటీ)

వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే  సుధీర్‌ పెళ్లి చేసుకుంటాడని గతంలోనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా   ఆమెతోనే సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అనే వార్త వైరల్‌ అవుతుంది. ఈ కార్యక్రమం కూడా వారి దగ్గరి బంధువుల మధ్య జరిగిందని తెలుస్తోంది.  దీంతో రష్మీ- సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతూ సోషల్‌ మీడియాలో పలు కామెంట్లు పెడుతున్నారు.

గత రెండురోజులుగా ఈ ప్రచారం జరుగుతున్న సుధీర్‌ స్పందించకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంటన్నా..? రష్మీతో రీల్‌ పెళ్లి ఎన్నోసార్లు చేసుకున్నారు. కాబట్టి అదే రియల్‌ చేస్తారు అనుకున్నాం అంటూ గతంలో రష్మి చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ..  సుధీర్‌ ఫ్యాన్స్‌  కామెంట్స్‌ చేస్తున్నారు.

సుధీర్‌తో ప్రేమా, పెళ్లిపై గతంలో రష్మి ఏం చెప్పిందంటే
మీ ఇద్దరి మధ్య ఉండేది ఎలాంటి బంధం అని గతంలో రష్మిని అడగ్గా.. 'మా మధ్య ఉన్న బంధం ఏదైనా కావొచ్చు. దాని గురించి ప్రతి ఒక్కరికీ వివరించలేను. కొన్ని విషయాలు నాలోనే దాచుకుంటా. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలియదు. ఏం జరిగినా.. అది తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మేం ఆఫ్‌స్క్రీన్‌లో ఎలా ఉంటామో, అదే ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. మేం అనుకొని అదంతా చేయలేదు.. ఓ మ్యాజిక్‌లా మా కెమిస్ట్రీ అందరినీ ఆకర్షించింది' అని రష్మి తెలిపారు. 

(ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ (ఆంథాలజీ))

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement