సినీ నటులు నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు.
నరేష్‌కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్‌కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూఇయర్ సందర్భంగా పవిత్రా లోకేశ్‌కు లిప్‌లాక్ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్-పవిత్రా లోకేశ్‌లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్ చేశారు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు.
మరోవైపు.. సూపర్‌స్టార్ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్-పవిత్రాలది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g
New Year ✨
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
New Beginnings 💖
Need all your blessings 🙏
From us to all of you #HappyNewYear ❤️
- Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
Comments
Please login to add a commentAdd a comment