Actor Naresh Said Mahesh Babu And Family Accepeted His Relation With Pavitra, Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Naresh: 'మహేశ్‌కు పవిత్ర వంట కూడా ఇష్టమే..మా ప్రేమను ఇం‍ట్లో అందరూ ఒప్పుకున్నారు'

Published Mon, May 22 2023 11:10 AM | Last Updated on Mon, May 22 2023 12:02 PM

Actor Naresh Said Mahesh Babu And Family Accepeted His Relation With Pavitra - Sakshi

సీనియర్‌ నటుడు వీకే నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం​ టాలీవుడ్‌లోనే కాదు, సోషల్‌ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే నరేష్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్‌-పవిత్రా లోకేశ్‌ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చారు.

పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్‌-పవిత్ర ప్రమోషన్స్‌ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్‌ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్‌ మీడియాకు కావాల్సినంత కంటెంట్‌,పుటేజీ ఇచ్చేస్తున్నారు.

తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్‌ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్‌ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్‌బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్‌ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్‌ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు.

ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్‌కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు'  అంటూ నరేష్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement