Actor Naresh Open Up About His Assests And Relation With Pavitra Lokesh, Deets Inside - Sakshi

Naresh-Pavitra Lokesh: 'అవును.. నేను బిలినియర్‌ని'.. ఆస్తుల చిట్టా బయటపెట్టిన నరేష్‌

Published Mon, May 22 2023 1:12 PM | Last Updated on Mon, May 22 2023 2:07 PM

Actor Naresh Open Up About His Assests And Relation With Pavitra Lokesh - Sakshi

టాలీవుడ్‌లో నరేష్‌, పవిత్రా లోకేష్‌ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్‌, మీమ్స్‌ వచ్చినా సరే డోంట్‌ కేర్‌ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్‌తో పవిత్రా లోకేశ్‌ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

తాజాగా నరేష్‌ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్‌ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్‌ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.

చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్‌ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు.

ఇక నరేష్‌తో రిలేషన్‌పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్‌ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement