Pavitra
-
మదరాసు మెరుపుతీగ
నటీనటుల రూపురేఖలు కూడా కొన్నిసార్లు కొంతమందికి ఫ్లస్ అవుతుంటాయి. చూడటానికి సమంత చెల్లిగా కనిపించి, జూనియర్ సమంతగా ఫేమస్ అయింది. ఆ ఫేమ్‌ను కాపాడుకుంటూనే, తన ప్రత్యేకతనూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది నటి పవిత్ర లక్ష్మి.. ఆ విషయాలే.. ⇒ తమిళనాడులోని కోయంబత్తూరు పవిత్ర సొంతూరు. చిన్నప్పటి నుంచి అమ్మ చీరలతో డిజైనింగ్, స్టయిలింగ్ చేయటం చాలా ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది.⇒చదువు అయ్యాక, మోడల్‌గా మారి, కెరీర్ ప్రారంభించింది. 2015లో ‘మిస్ మద్రాస్’గా అందాల కిరీటాన్ని సాధించింది. తర్వాత ‘క్వీన్ ఆఫ్ ఇండియా 2016’ పోటీలోనూ పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.⇒దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఓ కాదల్ కన్మణి’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి, నటిగా మారింది. తర్వాత ‘కుక్ విత్ కోమలి’ రియాలిటీ షోలో కనిపించి పాపులారిటీతో పాటు, సినీ అవకాశాలను అందుకుంది.⇒ తొలిసారి ‘నాయిం శేఖర్’ చిత్రంతో హీరోయిన్గా మారింది. తర్వాత ‘టైమ్ ఎన్న బాస్!’ ‘ఉల్లాసం’, అదృశ్యం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.⇒ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పవిత్ర, ఈ మధ్యనే సొంత యూట్యూబ్ చానెల్ ప్రారంభించి, ‘ఇన్నమ్ ఒరు మురాయ్’, ‘కనవు’ అనే తన పోయెటిక్ వ్యూ వీడియోస్‌లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది.⇒ ప్రస్తుతం తను నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్’ ఆహోలో స్ట్రీమ్ అవుతోంది.ఆరోగ్యంగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. అందుకే, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నా స్కిన్ కేర్ ప్రాడక్ట్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. – పవిత్ర లక్ష్మి. -
జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమతో
కొన్ని నెలల క్రితం అభిమాని రేణుకాస్వామిని కన్నడ హీరో దర్శన్ హత్య చేయడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. దీని తర్వాత పోలీసు కేసు నమోదు కావడం.. హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా పలువురి జైలుకెళ్లడం అప్పట్లో సెన్సేషన్ అయింది. కొన్నిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో దర్శన్‌కి బెయిల్ దక్కగా.. ఇప్పుడు పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించింది. వచ్చీ రావడంతోనే ప్రియుడిపై ప్రేమ బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)దర్శన్‌కు ఇప్పటికే పెళ్లయినప్పటికీ.. పవిత్ర గౌడతో రిలేషన్ ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ పవిత్రని ఇబ్బంది పెట్టాడని దర్శన్.. రేణుకాస్వామిని హత్య చేయడం మాత్రం ప్రేమకు పరాకాష్టగా నిలిచింది. తొలుత ఆరోపణలు అనుకున్నారు గానీ బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో కొన్నినెలల పాటు వీళ్లిద్దరూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.తాజాగా పవిత్ర గౌడ బెయిల్‌పై రిలీజైంది. వచ్చీ రావడంతోనే వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శన్ పేరుపై ప్రత్యేక పూజలు చేయించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంతోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇప్పుడు దర్శన్ కోసం పబ్లిక్‌గానే పవిత్ర గౌడ ప్రేమ చూపించడం, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೇಸ್ನಲ್ಲಿ ಜೈಲು ಸೇರಿದ್ದ ನಟಿ ಪವಿತ್ರಗೌಡ ಬಿಡುಗಡೆಯಾಗಿದ್ದು, ವಜ್ರಮುನೇಶ್ವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತೆರಳಿದ್ದಾರೆ. ಇದೇ ವೇಳೆ ನಟ ದರ್ಶನ್ ಹೆಸರಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು.@dasadarshan#PavithraGowda #DarshanThoogudeepa #MuneshwaraTemple #Bhagya #Darshan #RenukaswamyCase #Bengaluru pic.twitter.com/NUlC9XSRyP— NewsFirst Kannada (@NewsFirstKan) December 17, 2024 -
Actor Darshan: కారాగారంలో 100 రోజులు
సాక్షి, బెంగళూరు: మెజిస్టిక్ సినిమా 100 రోజుల ప్రదర్శన తర్వాత ఆ చిత్ర హీరో దర్శన్ స్టార్ నటునిగా మారారు. అనేక హిట్ సినిమాలతో టాప్ హీరోలలో ఒకరిగా ఆయన వెలుగొందుతున్న సమయంలో సినిమాలో మాదిరిగానే కథ మలుపు తిరిగింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ జైలు పాలై 100 రోజులు పూర్తయింది. సినీ పరిశ్రమలో 100 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక నటునికి 100 రోజులు అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.. 100 రోజులు సినిమా ఆడితే చాలు వెంటనే అదృష్టం తిరగబడి రాత్రికి రాత్రి స్టార్ అయిపోతారు. 2001లో దర్శన్ తాను నటించిన మొదటి సినిమా మెజిస్టిక్ గాంధీనగరలో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో వంద రోజుల సినిమాల్లో నటించిన దర్శన్ జైలులోనూ వంద రోజుల జీవితాన్ని పూర్తి చేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది. జైలు నుంచి తమ అభిమాన నటుడు ఎప్పుడు బయటకు విడుదల అవుతారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.జూన్ 8న చెడు మలుపు...👉 జూన్ 8– దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు చెడుగా మెసేజ్ చేశాడనే కారణంతో చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి దారుణంగా భౌతిక దాడి చేసి దర్శన్ గ్యాంగ్ హత్య చేసింది.అదే రోజు రేణుకస్వామి చనిపోయిన విషయాన్ని దర్శన్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ రేణుకస్వామి మృతదేహాన్ని సుమనహళ్లి రాజకాలువలో విసిరేశారు.👉 జూన్ 9 – ఉదయం 8 గంటలకు రాజకాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఉదయం 8.30 గంటలకు కామాక్షిపాళ్య పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.👉 జూన్ 10 – దర్శన్ సూచనల మేరకు ఆయన గ్యాంగ్‌లోని ముగ్గురు సహచరులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దర్శన్, పవిత్ర గౌడ పేర్లు విచారణలో బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి మైసూరుకు బెంగళూరు పోలీసులు వెళ్లారు. దర్శన్ ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. కేసులో ఇతర నిందితులను అరెస్టు చేశారు.👉 జూన్ 11 – ఉదయం 6.30 గంటలకు మైసూరు ర్యాడిసన్ హోటల్లో జిమ్ చేస్తున్న దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరుకు తరలించారు. దర్శన్ అరెస్టు శాండల్‌వుడ్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. -
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు దర్శన్ కేసు?
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు దర్శన్‌కు రాచ మర్యాదలు అందించిన సంఘటనపై త్వరలో నివేదిక ఇస్తామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును శీఘ్రగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల కేసు విచారణ త్వరగా పూర్తవుతుంది. ఇక దర్శన్‌కు రాచ మర్యాదలు చేయడంలో జైలు అధికారుల పాత్ర, వారి వైఫల్యం తదితర అంశాలపై డీసీపీ సారా ఫాతిమా, సీసీబీ అదనపు కమిషనర్ చంద్రగుప్త ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో హైదరాబాద్ నుంచి కొన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.హత్య తరువాత పవిత్రగౌడ ఆరారేణుకాస్వామిని హత్య చేశాక పవిత్రగౌడ తనదైన రీతిలో ఫాలో అప్ చేసిందని తెలిసింది. శవాన్ని సుమనహళ్లి రాజకాలువలో పారవేశాక స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పవిత్రగౌడ స్నేహితురాలి భర్త సీనియర్ వైద్యునిగా పని చేస్తున్నాడు. వెంటనే స్నేహితురాలిని, ఆమె భర్తను ఒక కాఫీ రెస్టారెంట్‌కి పవిత్ర పిలిపించింది. తనకు తెలిసిన వారి బంధువు చనిపోయాడని, కారణాలు ఏమిటని ఆరా తీసింది. ఈ వివరాలను పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.టీవీ చానెళ్లలో ప్రసారం చేయొద్దుచార్జ్షీట్లోని సమాచారాన్ని కన్నడ టీవీ చానల్స్‌లో ప్రసారం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు చార్జిషీట్ వేయగానే అందులోని అంశాలపై టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో దర్శన్ ఇబ్బందిగా భావించి హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల గోప్యతను కాపాడాలంటూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.దర్శన్‌కు పవిత్ర బ్లాక్మెయిల్దర్శన్ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు.హీరోయిన్లకు అశ్లీల మెసేజ్‌లు చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. నటి పవిత్రగౌడకే కాకుండా ఇంకా ఇద్దరు హీరోయిన్లకు కూడా అతడు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్టు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితునిగా ఉన్న ప్రదోశ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయాలు చెప్పినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రేణుకాస్వామిని బెంగళూరులో షెడ్‌కు తీసుకువచ్చి కొట్టేటప్పడు అతని మొబైల్ఫోన్ని లాక్కుని పరిశీలించగా ఇన్‌స్టా గ్రామ్‌లో గౌతమ్ కేఎస్ పేరుతో చాలామంది మహిళలకు అశ్లీల మెసేజ్‌లు పంపించినట్లు ఉంది. ముఖ్యంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, శుభ పుంజాలకు కూడా అసభ్య మెసేజ్‌లు పంపాడు. -
Pavithra Gowda: పవిత్రకు అందని పెట్టె
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ ప్రస్తుతం పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగా ఉంది. శనివారంనాడు పవిత్రగౌడను చూడడానికి ఆమె తల్లి వచ్చారు. కూతురికి ఒక బాక్స్‌ను ఇవ్వగా జైలు సిబ్బంది నిరాకరించారు. ఇంటి నుండి తెచ్చిన తినుబండారాలను పెట్టుకోవడానికి పవిత్రగౌడ ఒక పెట్టెను తీసుకురమ్మని తల్లిని కోరిందట. అందువల్ల పవిత్ర తల్లి బాక్స్‌ను తీసుకువచ్చింది. అయితే బయటి నుండి తీసుకువచ్చే పాత్రలను లోపలకు అనుమతించబోమని, అది జైలు నిబంధన అని సిబ్బంది అడ్డుకున్నారు. దాడి దృశ్యాలు వీడియో? రేణుకాస్వామిపై దాడిని హీరో దర్శన్, అనుచరులు ఐఫోన్లో రికార్డు చేసినట్టు తెలిసింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రేణుకాస్వామి స్పృహతప్పి పడిపోగానే ఒక నిందితుడు తన ఐఫోన్లో వీడియో తీశాడు. నిందితులకు 5 సిమ్‌కార్డులు అందజేసిన వారిని పోలీసులు విచారణ జరిపి వాంగ్మూలాన్ని రికార్డు చేసారు. దర్శన్, పవిత్ర గౌడలు తలా ఒక సిమ్‌కార్డు తీసుకున్నారు. సీఎంతో రేణుకాచార్య తల్లిదండ్రుల భేటీశివాజీనగర: రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసి రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, పవిత్ర, మరో 15 మంది అరెస్టు కావడం తెలిసిందే. సీఎంను కృష్ణా నివాసంలో కలిసి తల్లిదండ్రులు తమ బాధను వెలిబుచ్చారు. అనాథగా మారిన తమ కోడలికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిద్దరామయ్య సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
ఎమ్మెల్యే కారు డ్రైవర్ నిర్బంధం
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్ పురోహిత్ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు. గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌గా పని చేస్తున్న కార్తీక్ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. పవిత్ర స్నేహితురాలు సమత విచారణ పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్‌కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు. ఈ డబ్బులతో ధనరాజ్ ఎలక్ట్రిక్ షాక్ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది.రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది. ఇక డీఎన్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. -
మేకప్‌లో పవిత్ర గౌడ.. పోలీస్ అధికారికి నోటీసులు
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ (A1) ఉన్నారు. అతని హత్యలో ఆమె కీలకమని పోలీసులు కూడా నిర్ధారించారు. రేణుకాస్వామిని హతమార్చే కుట్రలో ఆమె ప్రధాన కారణమని తెలినట్లు పోలీసుల వాదన ఉంది. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నటి పవిత్ర ఉన్నారు. అంతకు ముందు 10 రోజుల పాటు ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలుకు వెళ్లకు ముందు విచారణ కోసం ఆమె రోజూ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చేది. విచారణ అనంతరం మడివాలలోని మహిళా కేంద్రంలో ఆమెను పోలీసులు ఉంచేవారు. అలా 10 రోజుల పాటు పవిత్రను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం పవిత్ర గౌడ మేకప్‌తో కనిపించేది. పోలీస్‌స్టేషన్‌లో ఆమె కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్‌తో పాటు ఆమె మేకప్ వేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కన్నడ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎతున్న చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగానే ఎలా మేకప్ వేసుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు కాస్మోటిక్స్ మహిళా పోలీసులే అందించారని చర్చ జరుగుతుంది. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్‌లోని మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఆమె ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా అనే వాదనలు కూడా వస్తున్నాయి.ఈ క్రమంలో డీసీపీ గిరీష్ ఈ అంశంలో ఫైర్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్‌స్టిక్‌తో పాటు కాస్మోటిక్స్ ఎలా వచ్చాయనేది చెప్పాలని మహిళా పీఎస్‌ఐకి మెమో ఇచ్చారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో పవిత్ర గౌడ ప్రతిరోజూ మడివాలలోని మహిళా కేంద్రం నుంచి విచారణకు వచ్చేదని, అక్కడే దుస్తులు మార్చుకుని అవకాశాన్ని ఆమెకు అధికారులు కల్పించారని తెలుస్తోంది. అక్కడికి ప్రతిరోజు ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవారని సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఆమె మేకప్ వేసుకునే సౌలభ్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. పరప్పన అగ్రహార జైలులో తాజాగా పవిత్ర గౌడ తల్లి, సోదరుడు, కూతురు ఆమెతో మాట్లాడారు.పవిత్ర గౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రేణుకాస్వామి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంహత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్‌తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్‌షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్‌ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్‌ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్‌చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్‌ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్‌మార్టమ్‌లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్‌స్టా్రగామ్‌లో పోస్ట్ చేసి డిలీట్‌చేసిన మెసేజ్‌లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్‌తో రిలేషన్లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ఆమె కూతురు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవిత్ర 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్‌తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్‌తో రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) -
పవిత్రగౌడ ఇంట్లో సోదాలు.. దుస్తులు, చెప్పులు సీజ్
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆర్ఆర్ నగరలో ఉన్న పవిత్రగౌడ ఇంటికి ఆమెను, ఆమె అనుచరుడు పవన్‌ను తీసుకెళ్లారు. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పవిత్రగౌడ మేనేజర్ దేవరాజును పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన షెడ్ వద్దకు పవిత్రగౌడతో కలిసి దేవరాజు కూడా వెళ్లాడని దర్యాప్తులో తేలడంతో శనివారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది. రేణుకాస్వామి ఉంగరం, చైన్ తదితరాలను నిందితులు లాక్కున్నట్టు పోలీసులు తెలిపారు.దర్శన్‌ను కలిసిన నిందితులురేణుకాస్వామి మృతదేహం లభించగానే లొంగిపోవాలని డీల్ కుదుర్చుకున్న నిందితులు లొంగిపోవాలా, లేక కొన్ని రోజులు వేచి చూడాలా అనే మీమాంసలో పడిపోయారు. దీనిపై మైసూరులో ఒక హోటల్లో ఉన్న దర్శన్ వద్దకు వెళ్లి చర్చించారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు సదరు హోటల్లో కూడా మహజర్ చేయవచ్చని తెలుస్తోంది.కరెంటు షాకిచ్చి..రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తరువాత ఆ పరికరాన్ని బెంగళూరు–మైసూరు హైవేలో విసిరేశారు. దీంతో పోలీసులు విజయనగర ప్రాంతంలో హైవేలో పరికరం కోసం గాలింపు చేపట్టారు.సీఐ గిరీష్ నియామకంరేణుకాస్వామి కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలోకి సీఐ గిరీష్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో కామాక్షిపాళ్య పోలీస్‌స్టేషన్‌కు తాత్కాలిక సీఐ గిరీష్ బదిలీపై వచ్చారు. తరువాత అక్కడే రేణుకాస్వామి హత్య వెలుగు చూసింది. దర్శన్ అరెస్టు సమయంలో గిరీష్‌ను మళ్లీ సీకే అచ్చుకట్టు పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. అయితే కేసు విచారణకు అవసరమని గిరీష్‌ను తనిఖీ అధికారిగా నియమించారు. -
Darshan: రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..
బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతో పాటు 14 మందికి 5 రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు పరిచారు. దర్శన్, పవిత్రగౌడ, పవన్, రాఘవేంద్ర, నందీశ్, జగదీశ్, అనుకుమార్, వినయ్, నాగరాజ్, లక్ష్మణ, దిలీప్, ప్రదోశ్ , కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని, కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది.ప్రత్యేక న్యాయవాది నియామకంరేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రసన్న కుమార్‌ను సర్కారు నియమించింది.క్షమించమన్నాడు, డబ్బులు ఇచ్చి పంపించమన్నాదొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్ పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాచార్యను ఉంచిన షెడ్‌కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దర్శన్ ఏం చెప్పారంటే... సార్.. నాకేం తేలీదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దీంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి వచ్చేశాను. నేడు షెడ్ నుండి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు. ఇంతకు మించి తనకేం తెలీదని చెబుతున్నాడు. షెడ్ వద్దకు దర్శన్, పవిత్ర కార్లు రావడం, శవం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది.రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..దొడ్డబళ్లాపురం: డి.బాస్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ఎలా హత్య చేసిందీ పోలీసులు వివరాలు లాగేకొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్లో బంధించి హింసించిన నిందితులు బిరియాని తెప్పించి మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి. ఆ సంగతి తెలిసి కావాలనే అతనితో చనిపోయే ముందు బిరియాని తినిపించారు. బాస్ వస్తారు, ముక్కలు తిని రెడీగా ఉండు, తన్నులు తినడానికి బలం కావాలి కదా.. అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు. నిందితుల్లో ఒకడైన దీపక్ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు. -
హత్య జరుగుతుందని ఊహించలేదు
దొడ్డబళ్లాపురం: తనకు అసభ్యంగా మెసేజ్‌లు పెడుతున్నాడని రేణుకాస్వామి గురించి దర్శన్‌కు చెప్పానే కానీ, హత్య చేస్తారని అసలు ఊహించలేదని రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ చెప్పుకొచ్చారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె.. రేణుకాస్వామిని హత్య చేస్తారని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేదాన్నని అన్నారు. అశ్లీల మెసేజ్ విషయం దర్శన్‌కు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనకు తెలుసని, అందుకే మొదట దర్శన్‌కు చెప్పకుండా ఆ మెసేజ్‌ను పవన్‌కు చూపించినట్లు చెప్పినట్లు సమాచారం. నోరు విప్పని దర్శన్ రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరెస్టైన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు గురువారం అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు. నగదు సీజ్ రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్‌కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు. అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్‌లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్‌గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు.మరో ఇద్దరి అరెస్ట్ దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. చిత్రదుర్గకు చెందిన అనుకుమార్ ఆలియాస్ అను, జగదీష్ ఆలియాస్ జగ్గును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 16కి చేరింది. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకురావడంలో వీరు ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. -
సినిమాను మించిన ట్విస్ట్‌లు.. దర్శన్ కేసులో విస్తుపోయే నిజాలు!
ఇటీవలే కాటేరా మూవీతో హిట్ కొట్టిన శాండల్‌వుడ్ హీరో దర్శన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని(28) హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసులో మరో నటి, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు ఇదంతా చూస్తుంటే ఓ క్రైమ్ సినిమాను తలపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు అసలు పవిత్ర గౌడ ఎవరు? అని తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఆమెకు, దర్శన్‌కు మధ్య రిలేషన్ ఏంటని శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా సహజీవనం చేస్తున్నారా? అన్న విషయాలపై నెట్టింట తెగ వెతికేస్తున్నారు.నటిగా ఎంట్రీ ఇచ్చి...మొదట టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవిత్ర సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవలే ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. మా బంధానికి పదేళ్లు అంటూ దర్శన్‌తో ఉన్న ఫోటోలను పవిత్ర పంచుకుంది.దర్శన్‌కు పెళ్లి.. పవిత్ర గౌడతో సహజీవనంమరోవైపు ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్‌కు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్ వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు పోస్ట్ చేేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్ తమకు ఆఫర్ ఇచ్చాడని ముగ్గురు నిందితులు వెల్లడించారు. -
మనీ పవిత్ర
‘కెరీర్లో ఎంత ఉన్నతంగా ఎదిగినా, ఎంత సంపాదించినా, ఎంతటి ధనవంతులైనా డబ్బును సరైన విధంగా నిర్వహించకపోతే వారికి ఇబ్బందులు తప్పవు’ అంటున్నారు డాక్టర్ మణి పవిత్ర.హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటున్న మణి పవిత్ర ఆర్థోడాంటిస్ట్. ఆర్థిక నిపుణురాలు, ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, వ్యాపారవేత్త, యోగా కోచ్, సామాజిక కార్యకర్త, రచయిత్రిగా మల్టీటాలెంటెడ్ ఉమన్‌గా గుర్తింపు పొందారు. మహిళలు ఆరోగ్యంగా, ఫిట్‌గా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్న ఈ డాక్టర్‌ను ‘మనీ పవిత్ర’ అని కూడా పిలుస్తుంటారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడానికి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంగా ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తుల సైన్యాన్ని సృష్టించడమే మా లక్ష్యం. ఆర్థిక అక్షరాస్యతప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు, ఫార్చ్యూన్ అకాడమీ ద్వారా ఆర్థిక అక్షరాస్యతపై షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నాం. దీనిలో.. డబ్బు ప్రాముఖ్యత, ఏం కొనగలం, దేనిని కొనలేం, పెట్టుబడి, గుణించడం, పొదుపు సంస్కృతి, మధ్యతరగతి డబ్బు సమస్యలు, డబ్బు, ఎమోషనల్ కనెక్షన్, ర్యాగ్స్ టు రిచ్, పిగ్గీ బ్యాంక్ప్రాముఖ్యత, ప్లాస్టిక్ డబ్బు, డిజిటల్ లావాదేవీలు, డబ్బు గురించి ఎక్కువ శ్రద్ధ వహించే ఇతర విషయాలపై రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించాల్సి ఉంటుంది. ఎంట్రీలను జూలై 31, 2024లోగా fortuneacademyhub@gmail.com కు పంపవచ్చు. ‘‘ఆర్థిక అక్షరాస్యత అనేది వ్యక్తిగత డబ్బు నిర్వహణ. ఎవరికి వారు తమదైన అవగాహనతో సంపాదించడం, పొదుపు, పెట్టుబడులు చేయడం చూస్తుంటాం. వారు తీసుకున్న ప్రణాళికల కారణంగా కొందరు తక్కువ సంపాదించినా ధనవంతులు అవుతుంటారు. ఎక్కువ సంపాదన ఉన్నప్పటికీ ఎప్పుడూ డబ్బు సమస్యలతో ఇబ్బందులు పడేవారూ ఉంటారు. అందుకే, ఆర్థిక నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతంగా నిర్వహించడంలో అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరం. చాలా వెనకబడి ఉన్నాం.. మన జనాభాలో 77 శాతం అక్షరాస్యులు ఉన్నప్పటికీ, 24 శాతం కంటే తక్కువ మంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నారు. వారిలో 17 శాతం మంది యుక్తవయస్కులు మాత్రమే ఆర్థికంగా అక్షరాస్యులు. ప్రపంచంలో చూస్తే భారతదేశం ఆర్థిక అక్షరాస్యత రేటుతో 144 దేశాలలో 73వ స్థానంలో ఉంది. ఆర్థిక పరిజ్ఞానం, అవగాహన లేకపోవడం వల్ల మెజారిటీ భారతీయులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇది గమనించి ప్రజలకు డబ్బుతో ఉండే రిలేషన్ గురించి దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్‌లో మూడు–నాలుగు వందల మంది పాల్గొనేవారు. అనుకున్న ఫలితం రాలేదనిపించి, ఇప్పుడు సోషల్‌మీడియా ద్వారా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ్రపోత్సాహకరమైన కథనాలుధనవంతులు, ప్రముఖుల జీవితాలు మనకు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ పెద్దపెద్ద సెలబ్రిటీలకు కూడా డబ్బు సమస్యలు ఉంటాయి. ఇప్పటికీ బడ్జెట్‌తో జీవించే ధనవంతులు, ప్రముఖులు ఉన్నారు. వారి నియమబద్ధమైన జీవనాన్ని మనం అలవరచుకోవాలి. మా అకాడమీ ద్వారా వారి కథనాలను చెబుతూ అవసరమైన వారికి అవగాహన కల్పిస్తుంటాం. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ క్లాస్‌లు నెలలో 21 రోజుల పాటు ఉదయం 6 నుంచి 6.30 వరకు ఓ అరగంటపాటు నిర్వహిస్తుంటాను. షార్ట్ ఫిల్మ్ ఆలోచనఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై బాగా ఉంది. ఏ సమస్య తలెత్తినా సోషల్‌మీడియా వైపుగా వెళుతున్నారు. కొంతమంది ధనవంతులను చూసి తాము కూడా కలల జీవనాన్ని ఊహించుకుంటున్నారు. దానిని సాధించలేక త్వరగా నిరాశకు, డిప్రెషన్‌కు లోనవుతున్నారు. అనవసర బేషజాలకు పోయి అధికంగా డబ్బును ఖర్చుపెట్టుకుని భవిష్యత్తును భారంగా మార్చుకుంటున్నారు. అందుకే, ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహనకు సోషల్‌మీడియాను ఎంచుకున్నాను. మధ్య, దిగువ మధ్య తరగతి వాళ్లలో పెరుగుతున్న ఆర్థిక సమస్యలను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. తల్లుల సంపాదనకు బ్రేక్ఏడేళ్ల క్రితం తెలంగాణ జిల్లాల్లో మహిళలు గర్భం దాల్చడానికి ముందు, గర్భం దాల్చాక, ప్రసవం తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపైన ‘మిలియన్ మామ్స్’ క్యాంపెయిన్ చేశాం. ఆ సమయంలో తల్లులైన మహిళల సంపాదన పూర్తిగా తగ్గిపోవడం గమనించాం. ప్రసవం తర్వాత చదువుకున్నవారు, చదువు లేనివారు అనే తేడా ఏమీ లేకుండా చాలామంది ఒక బ్రేక్ తీసుకోవడం చూశాం. అక్కడి పరిస్థితులు చూశాక ఆర్థిక అవసరాలు ఎంత ముఖ్యమో, డబ్బుకోసం వారు పడే పాట్లు కనిపించాయి. ప్రసవం తర్వాత పూర్తి సంపాదనకు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బు సంపాదనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మా నానమ్మల రోజుల్లో ఇంటి నిర్వహణ మహిళల చేతుల్లో ఉండేది. ఈ తరంలో ఆ నిర్వహణ కనిపించలేదు. ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, ఏ రోజుకు ఆ రోజే అన్నట్టుగా ఉంటోంది. సంపాదించడంలోనూ, పొదుపు చేయడంలోనూ అవగాహన లేదు. దీంతో కుటుంబం మొత్తం ఇబ్బందులు పాలవుతుంది. పిల్లలకోసం టైమ్మా అమ్మానాన్నలు బిజీ డాక్టర్లు అవడంతో నా చిన్నతనంలో వారిని బాగా మిస్ అయ్యేదాన్ని. దీంతో నా పిల్లలకు అలాంటి సమస్య రాకూడదనుకున్నాను. నాకు అనుకూలమైన ఆర్థోడాంటిస్ట్ కోర్సు తీసుకున్నాను. నాకంటూ ఒక టైమ్ ఉండాలి, కెరియర్‌తో పాటు కుటుంబాన్నీ బాగా చూసుకోవాలి అనే ఆలోచనతో 15 ఏళ్లుగా ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నాను. దీంతో ఇప్పుడు నా ఇద్దరు పిల్లలను, ఇంటిని, నా పనులను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి మహిళా ఆర్థికవేత్తలు అయిన కిమ్ కియోసాకి, మేరీ బఫెట్‌తో కలిసి చర్చాకార్యమ్రాల్లో పాల్గొన్నాను. ఉమెన్ ఇన్స్పైరర్గా లయన్ సెంటెనియల్ అవార్డ్, 2020 యూత్ ఐకాన్ అవార్డ్, 2021లో విశిష్ట ఆర్థోడాంటిస్ట్ అవార్డులు పొందాను. తెలుగు రాష్ట్రాల్లో క్యాంపెయిన్సమాజంలో ఆర్థిక అక్షరాస్యత పట్ల అవగాహన కల్పించి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎనిమిది ప్రధానప్రాంతాలను ఎంపిక చేసుకొని, కార్యక్రమాలను చేపట్టనున్నాం. ఆర్థిక అక్షరాస్యత మెరుగైన ఆర్థిక శ్రేయస్సుకు, స్థిరత్వానికి దోహదం చేస్తుంది’’ అంటూ వివరించారు ఈ మనీ పవిత్ర. – నిర్మలారెడ్డి -
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం -
ఆడపిల్ల విలువ తెలియజేసేలా ‘చిట్టి పొట్టి’
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ..‘ అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దాం’ అని అన్నారు. -
బిగ్‌బాస్ నటితో సహజీవనం.. ఇప్పుడేమో సింగిల్‌గా ఉంటూ!
బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ పవిత్రా పూనియా. ఈ ముద్దుగుమ్మ 2020లో బిగ్‌బాస్ -14వ సీజన్లో మెరిసింది. అదే సీజన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఇజాజ్ ఖాన్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డేటింగ్లో ఉన్న భామ.. ఏడాదిలోపే పెళ్లి చేసుకుంటానని నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ.. అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. ఈ ఏడాదిలోనైనా పెళ్లిబంధంలోకి అడుగుపెడతారన్న జంట ఫిబ్రవరి 14న షాకింగ్ న్యూస్ చెప్పారు. తామిద్దరం విడిపోతున్నట్లు బుల్లితెర జంట ప్రకటించారు. బుల్లితెర నటులైన ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అంతకుముందు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా.. గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర పూనియా మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు తమ బంధానికి ముగింపు పలికారు. అయితే ప్రస్తుతం ఇజాజ్ ఖాన్ తన దృష్టినంతా కెరీర్‌పైనే పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఎవరితోనూ రిలేషన్లో లేడని సమాచారం. దీంతో ఇజాజ్ సింగిల్‌గానే ఉంటున్నారు. గతంలో పునియాను ఇజాజ్ ఖాన్ మోసం చేశాడని.. విడిపోవడానికి అదే కారణమని రూమర్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ పూనియా తోసిపుచ్చింది. కాగా.. ఇజాజ్ ఖాన్ ప్రస్తుతం కొత్త ఇంటికి మారాడు. అంతే కాకుండా దివ్యాంక త్రిపాఠితో ఒక ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. బ్రేకప్ అయ్యాక పూర్తిగా తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టారు. కాగా.. పవిత్ర ప్రస్తుతం 'ఇష్క్ కీ దస్తాన్-నాగమణి' అనే సీరియల్లో నటిస్తోంది. -
బిగ్‌బాస్ షోలో కలిశారు.. రెండేళ్లుగా సహజీవనం.. ఇంతలో!
వాలంటైన్స్ డేకు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికులు తమ స్పెషల్ డేను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోతారు. వన్‌సైడ్ లవర్స్.. తమ ప్రేమను ఈసారైనా బయటపెట్టాల్సిందే, అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సిందే అన్న విధంగా ప్లాన్లు చేసుకుంటున్నారు. అంతా ప్రేమ మైకంలో ముగిని తేలుతున్న ఈ సమయంలో బుల్లితెర జంట మాత్రం విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఒకే ఇంట్లో ఉంటూ.. నటీనటులు ఇజాజ్ ఖాన్- పవిత్ర పూనియా.. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో ఒకరినొకరు ఇష్టపడ్డారు. అన్నీ కలిసొస్తే.. అదే ఏడాది పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ అంతలోనే పెళ్లి విషయం పక్కనపెట్టేసి రెండేళ్లు సహజీవనం చేశారు. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు వస్తున్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఇదే నిజమని తేలిపోయింది. బ్రేకప్ నిజమని అంగీకరించారు. మొన్నటివరకు ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఉండగా గత నెలలో ఇజాజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. పవిత్ర మాత్రం ప్రస్తుతం అదే ఇంట్లో ఉంటోంది. ఎక్స్పైరీ అయిపోయింది బ్రేకప్ గురించి పవిత్ర మాట్లాడుతూ.. 'ప్రతిదానికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏదీ శాశ్వతంగా ఉండిపోదు. ప్రేమ బంధాలకు కూడా ఇది వర్తిస్తుంది. రిలేషన్స్ కూడా కలకాలం ఉండిపోవు. కొన్ని నెలల క్రితమే ఇజాజ్, నేను విడిపోయాం. అప్పటికి, ఇప్పటికి అతడిని గౌరవిస్తూనే ఉన్నాను. తన క్షేమమే కోరుకుంటున్నాను. కానీ మా మధ్య ప్రేమబంధం మాత్రం ముగిసిపోయింది' అని చెప్పుకొచ్చింది. బ్రేకప్ నిజమే.. అటు ఇజాజ్ కూడా బ్రేకప్ నిజమేనని ఒప్పుకున్నాడు. పవిత్ర తన కెరీర్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. కాగా పవిత్ర చివరగా నాగమణి అనే సీరియల్లో కనిపించింది. ఇజాజ్.. జవాన్ సినిమాలో కనిపించాడు. బిగ్‌బాస్ షో ద్వారా ఒక్కటైన ఈ జంట పలు ఈవెంట్లకు, షోలకు కలిసే వెళ్లేవారు. ఎంతో ముచ్చటగా కనిపించే ఈ లవ్ బర్డ్స్ విడిపోతున్నారని తెలిసి అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ధనుష్ పాటపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ భార్య -
హీరో భార్యకు ఇచ్చిపడేసిన హీరోయిన్.. మాది పవిత్ర బంధమంటూ..
కన్నడ స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అది నిజమే అన్నట్లుగా దర్శన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ ఒక చేట చేర్చి దాన్ని వీడియోగా ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. పదేళ్ల రిలేషన్.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని రాసుకొచ్చింది. ఇంకేముంది.. దర్శన్ భార్య విజయలక్ష్మికి ఒళ్లు మండిపోయింది. తన భర్తతో కనిపించొద్దని సెట్‌కు వెళ్లి మరీ హీరోయిన్ పవిత్రకు వార్నింగ్ ఇచ్చిందని, అవసరమైతే కేసు కూడా పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఖుషి దర్శన్ కూతురు కాదు దీనిపై పవిత్ర సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ షేర్ చేసింది. 'నా పేరు పవిత్ర గౌడ. గతంలో నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లాడాను. మా ఇద్దరికీ కలిగిన సంతానమే ఖుషి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సంజయ్‌కు విడాకులిచ్చాను. నేను ఎప్పుడూ ఎక్కడా ఖుషి.. దర్శన్ కూతురని చెప్పలేదు. అయితే దర్శన్, నేను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ మా మధ్య ప్రేమ, కేరింగ్ మాత్రం అలాగే ఉన్నాయి. మా రిలేషన్‌ను తను అంగీకరించింది ఇంకా చెప్పాలంటే దర్శన్ భార్య విజయలక్ష్మికి మా గురించి అంతా తెలుసు. చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. అలాగే నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను. అవమానిస్తున్నారు విజయలక్ష్మి నా గురించి చెడుగా పోస్టులు పెడుతుంటే బాధేస్తోంది. చాలామంది నన్ను, నా కూతురు ఖుషిని తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురి చేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను' అని వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వివాదంపై దర్శన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.. -
భార్య గొంతు నులిమి.. మీ చెల్లెలు కనిపించడం లేదంటూ.. కాల్ చేసి..
మహబూబ్‌నగర్: భార్యాభర్తలు గొడవ పడగా.. భార్య గొంతు నులిమి భర్త హత్య చేసినట్లు గ్రామస్తులు కేటీదొడ్డి ఎస్ఐ వెంకటేష్ తెలియజేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇర్కిచేడుకి చెందిన నాగేష్ ధరూరు మండలం మన్నాపురానికి చెందిన పవిత్ర(23)తో 3 సంవత్సరాల కిందట వివాహమైంది. గతేడాది నుంచి భార్యతో తరచూ గొడవ పడేవాడు. అయితే పెద్దలు, తల్లిదండ్రులు సర్ధిచెప్పి సంసారానికి పంపించేవారు. ఈ క్రమంలో గురువారం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్య గొంతు నులిమి గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం సమీపంలోని వాగు వద్ద పడేసి, ఆమెపై చెట్లకొమ్మలు పడేశాడు. ఆ తర్వాత మీ చెల్లెలు కనిపించడం లేదని పవిత్ర అన్నకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పవిత్ర కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతంలో వెతికి శుక్రవారం మృతదేహాన్ని గుర్తించారు. వారు ఈ విషయమై కేటీదొడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. వారికి బాబు, పాప పిల్లలున్నారని తెలియజేశారు. -
హారర్ థ్రిల్లర్
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో సీవీ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న తమిళంలో విడుదలై, హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీపై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘హారర్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పిజ్జా 3 ’’ అన్నారు నిర్మాతలు. -
భర్తతో విడాకులు.. సంస్థ యజమానితో పవిత్ర ప్రేమపెళ్లి..
కర్ణాటక: మొదటి భర్తతో కాపురం కలసిరాక విడిపోయిన మహిళ రెండో పెళ్లిని చేసుకుంది, అక్కడ కూడా నిరాదరణే ఎదురు కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్త అక్రమ సంబంధాల మోజులో పడి నిర్లక్ష్యం చేయడంతో భార్య డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. హెగ్గనహళ్లికి చెందిన పవిత్ర (30) మొదటి భర్తకు గతంలో విడాకులిచ్చింది. ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న పవిత్ర అదే సంస్థ యజమాని చేతన్‌గౌడను ప్రేమించి పెళ్లి చేసుకొంది. అయితే ఇటీవల అతనికి మరో యువతితో సంబంధం ఏర్పడింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. పిల్లలు కావాలని పవిత్ర భావిస్తే, భర్త ఇందుకు నిరాకరించాడు. భర్త వివాహేతర సంబంధంపై పవిత్ర ప్రశ్నించగా, నేను మగాడిని, ఏమైనా చేసుకుంటానని ఆమె తల్లి ముందే దాడి చేశాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురైన పవిత్ర సోమవారం భర్తతో గొడవ పడిన వీడియోను, తాను ఆత్మహత్య చేసుకుంటానని రాసిన డెత్‌నోట్‌ను మొబైల్ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టింది. అది చూసిన ఆమె తల్లి పద్మమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి పవిత్ర ఉరి వేసుకుని విగతజీవిగా మారింది. భర్త, అతని ప్రియురాలిపై డెత్‌నోట్‌లో ఆరోపణలు ఉన్నాయి. తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చేతన్‌గౌడ, అతని ప్రియురాలిపై కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' సక్సెస్ మీట్ ఫోటోలు
-
నరేష్-పవిత్రా లోకేశ్‌ల పెళ్లిలో ఊహించని ట్విస్ట్! కనిపెట్టేసిన నెటిజన్లు
సినీ నటులు నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. నరేష్‌కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్‌కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూఇయర్ సందర్భంగా పవిత్రా లోకేశ్‌కు లిప్‌లాక్ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్-పవిత్రా లోకేశ్‌లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్ చేశారు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు. మరోవైపు.. సూపర్‌స్టార్ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్-పవిత్రాలది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
పెళ్లి పీటలెక్కిన నరేష్, పవిత్ర
-
పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. నటి పవిత్రతో ఏడడుగులు వేశానంటూ తాజాగా నరేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ట్విటర్లో పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు’ అంటూ ట్వీట్‌కు రాసుకొచ్చాడు. అలాగే మీ ఆశీస్సులు కావాలని కోరాడు. కాగా కొంతకాలంగా నరేశ్-పవిత్రలు సీక్రెట్ రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన నరేశ్-పవిత్రలు శుక్రవారం(మార్చి 10న) మూడు మూళ్ల బంధంతో ఒక్కటైనట్లు తెలుస్తోంది. కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. కాగా నరేశ్‌కు ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్రకు ఇది మూడవ పెళ్లి. ఇదిలా ఉంటే ఈ పెళ్లి ప్రకటన ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తమ మూవీ ప్రమోషన్స్ కోసం పవిత్రతో రిలేషన్‌పై ప్రకటన చేసి షాకిచ్చిన నరేశ్.. ఇప్పుడు కూడా అదే స్టంట్ చేసుంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ప్రకటనలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నాన్న తాగుబోతు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి: పవిత్ర
ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే కాదు, ఎదుటివారిని కూడా నవ్విస్తుంది. తన పంచులతో, అల్లరితో, స్కిట్లతో కామెడీ పంచే లేడీ కమెడియన్స్ లిస్టులో పాగల్ పవిత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు పులుముకునే ఆమె జీవితంలో ఎంతో విషాదం ఉంది. తాజాగా ఆ విషాదాలను గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది పవిత్ర. 'నాన్న లారీ డ్రైవర్. అమ్మ మహిళా రైతు. పని చేస్తే కానీ పూట గడవని ఫ్యామిలీ మాది. మూడు పూటలు తినడానికి కూడా ఆలోచించేవాళ్లం. నాన్న తాగుడుకు బానిసై మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. ఇంటర్ వరకు చదవడానికి కూడా మా పిన్ని సాయం చేసింది. ఇంకా వాళ్లను కష్టపెట్టడం ఎందుకని చదువు మానేసి హైదరాబాద్‌కు వచ్చి సెలూన్ పెట్టుకున్నాను. అనుకోకుండా జబర్దస్త్‌లో ఛాన్స్ వచ్చింది. సెలూన్ రన్ అవకపోవడంతో దాన్ని తీసేసి ఆ డబ్బుతో సొంతూరిలో మాకంటూ ఓ ఇల్లు కొనుక్కున్నాం. అప్పటిదాకా మాకు సొంతిల్లనేదే లేదు. తాగుడుకు బానిసయ్యాడని నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేదు. ఆయన ముఖం చూడటానికి ఇష్టపడేదాన్ని కాను. ఏడాది క్రితమే ఆయన చనిపోయారు. ఆ క్షణం నేను సంతోషంగా ఫీలయ్యాను' అని చెప్తూనే కంటతడి పెట్టుకుంది పవిత్ర. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న దివ్యవాణి? నటి ఏమందంటే? -
త్వరలో నటుడు నరేష్, పవిత్రల పెళ్లి
-
వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం
మైసూరు: తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. చదవండి: వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కొన్నిరోజులుగా చర్చనీయాంశమైన సీనియర్ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. నరేష్, పవిత్రలు శనివారం రాత్రి ఆ హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం రమ్య వారి గది వద్దకు వచ్చి డోర్ బెల్ నొక్కింది. కానీ, నరేష్ తలుపు తీయలేదు. రమ్య అక్కడే ఉండిపోయింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ససేమిరా అంది. పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లగా నరేష్, పవిత్రలు తలుపు తీసుకుని బందోబస్తు మధ్య బయటకు వచ్చారు. రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. ఇద్దరు పోలీసులపైనా ఆమె దాడికి దిగింది. నరేష్ పవిత్రను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. -
హోటల్లో నరేశ్, పవిత్ర జంట.. చెప్పుతో కొట్టబోయిన రమ్య
Actor Naresh And Pavitra Lokesh: సినియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ జంట మైసూర్లో ప్రత్యేక్షమైంది. మైసూర్‌లోని ఓ హోటల్ ఉన్న ఈ జంటను నరేశ్ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేశ్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..) గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. -
నటి పవిత్ర లోకేష్ డైరెక్షన్లో నరేష్ కొత్త సినిమా
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం మహా కాళేశ్వర ఆలయం విశిష్టత నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వీకే నరేష్, పవిత్రా లోకేశ్, దేవాలయ ధర్మకర్త పట్టపాగులవెంకట్రావు, ఎం.సి. వాసు నటిస్తున్నారు. నటి పవిత్ర లోకేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వీకే నరేష్ సమర్పణలో విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్‌పై ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ఉత్తర భారతంలో ఉజ్జయిని దేవాలయాన్ని అనుసరిస్తూ దక్షిణ భారతంలో రాజమండ్రి గోదావరి తీరాన పట్టపాగుల వెంకట్రావుగారి ఆధ్వర్యంలో మహా కాళేశ్వర ఆలయం నిర్మించారు’’ అన్నారు. -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్‌లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
బిగ్‌బాస్ నటి తండ్రికి తీవ్ర అస్వస్థత
బిగ్‌బాస్ కంటెస్టెంటు, టీవీ నటి పవిత్ర పూనియా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. తండ్రి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకుని హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. పవిత్ర పూనియా తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారట. దీంతో గాయాలపాలైన అతడిని కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర షూటింగ్ ఆపేసి సెట్స్ నుంచి వెళ్లిపోయారు. ఉన్నపళంగా ముంబై నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. (చదవండి: తాగి ప్రపోజ్ చేశాడు: సింగర్) "మనం పంచుకున్న నవ్వుల చిరుజల్లులు మిస్ అవుతున్నా నాన్నా.. నువ్వు త్వరగా కోలుకోవాలి, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 'కోరుకుంటున్నదాని కంటే ముందుగానే కోలుకుని మళ్లీ కళ్ల ముందు హుందాగా తిరుగాడాలి' అని రాసి ఉన్న ఫొటోను సైతం షేర్ చేశారు. ఆమె అభిమానులు కూడా పవిత్ర తండ్రి ఆరోగ్యవంతుడై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా పవిత్ర 2009లో 'స్ప్లిట్స్ విల్లా' అనే రియాలిటీ షోతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'యే హై మొహబ్బతే'లో నిధిగా ఆకట్టుకున్నారు. అలాగే హోంగే జుడా నా హమ్, కావచ్.. కాలి శక్తియాన్ సే, దయాన్ వంటి మరికొన్ని షోలలో సైతం పాల్గొన్నారు. ఇక ఇటీవలే బిగ్‌బాస్ హిందీ 14 సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయ్యారు. (చదవండి:ఇలా చేస్తుంటే కష్టం అన్నారు: బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్) (చదవండి: పవిత్ర నా భార్య, నన్ను మోసం చేసింది) View this post on Instagram A post shared by Pavitra Punia (@pavitrapunia_) -
ఆ నటి నా భార్య, కానీ మరొకరితో ఎఫైర్..
అతిపెద్ద రియాలిటీ షో హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లో పాల్గొన్నారు టీవీ నటి పవిత్ర పూనియా. హౌస్‌లో ఆమె ఈజా ఖాన్‌తో సన్నిహితంగా ఉండటమే కాక ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత ఒక అమ్మాయిని ఇంతలా ఇష్టపడుతున్నాను అని ఈజా ఖాన్ మనసులోని మాటను బయట పెట్టాడు. బయటకు వెళ్లాక తన తండ్రిని కలవాలని పవిత్రకు సూచించాడు. ఇలా వీరి ప్రేమాయణం సాగుతున్న సమయంలోనే ఆమె ఎలిమినేట్ అయింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం మీద సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీవీ నటి పవిత్ర పూనియా తన భార్య అని ఓ హోటల్ యాజమాని సుమిత్ మహేశ్వరి వెల్లడించాడు. ఆమె తనను నాలుగు సార్లు మోసం చేసిందని వాపోయాడు. కానీ పవిత్ర మాత్రం తనకు నిశ్చితార్థం జరిగిందే తప్ప, పెళ్లి కాలేదని పేర్కొనడం గమనార్హం. (బిగ్‌బాస్: ఆఖరి ఎపిసోడ్ అప్పుడే!) ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమిత్ మాట్లాడుతూ.. మేము ఇప్పటికీ భార్యాభర్తలమే. మాకు నిశ్చితార్థంతోపాటు పెళ్లి కూడా జరిగింది. ఆమె ఈ విషయాన్ని బయటకు చెప్పడంలేదు. పెళ్లి తర్వాత తను నా భార్య అన్న విషయం మర్చిపోయి పరాస్ ఛాబ్రాను ప్రేమించింది. వారి ప్రేమ విషయం తెలిశాక నేను అతడికి మెసేజ్ చేశాను. మా విడాకులు అయ్యాక మీ రిలేషన్‌ను కొనసాగించండని, అప్పటివరకు వేచి ఉండమని అతడికి చెప్పాను. ఇప్పటికీ నా చేతి మీద ఆమె టాటూ ఉంది. నాలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పుకొచ్చాడు. పరాస్ సైతం పవిత్ర చేతిలో తను మోసపోయిన తీరును ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. పవిత్ర భర్త మెసేజ్ చేసేవరకు ఆమెకు పెళ్లయిందన్న విషయమే తెలీదని చెప్పాడు. దీనిగురించి ఆమెను నిలదీస్తే తన తప్పును అంగీకరించిందని పేర్కొన్నాడు. (అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..) -
అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి..
తూర్పుగోదావరి,మండపేట: సరిగా చదవలేకపోతున్నానన్న ఆవేదన, తల్లిదండ్రులకు భారంగా ఉన్నానన్న బాధతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండపేటలోని గొల్లపుంతకాలనీలో చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన పట్టాభి వెంకట్రావు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంజినీరింగ్ చదువుతోంది. చిన్న కుమార్తె పవిత్ర పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. తండ్రి లారీ డ్రైవర్ కావడంతో దూరప్రాంతం వెళ్లాడు. తల్లి పట్టణంలోని షాపులో పనిచేస్తుండగా ఆమె కూడా పనికి వెళ్లిపోయింది. పవిత్ర చదువుకుంటానని చెప్పి మంగళవారం కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలో నాయనమ్మ ఇంటికి వచ్చి చూడగా ఇంటికి గెడ వేసి ఉండడంతో పడుకుని ఉంటుందని ఆమె వెనక్కి వెళ్లిపోయింది. మూడు గంటల సమయంలో మరోసారి వచ్చి చూసే సరికి తలుపు వేసి ఉండడంతో తలుపుకొట్టిన పవిత్ర తలుపు తీయలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బలంగా తెరిచి చూడగా సిల్క్ చీరతో ఉరివేసుకుని కింద పడి ఉంది. వెంటనే స్థానిక వైద్యులను పిలిచి చూపించగా అప్పటికే ఆమె మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. సిల్క్ చీరతో ఉరివేసుకోవడంతో అది కొద్దిసేపటికి జారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పేరుపేరునా క్షమించమని కోరుతూ.. అక్క మెరిట్ విద్యార్థి కావడంతో ర్యాంకు సాధించి ఇంజినీరింగ్ చదువుకుంటున్నట్టు స్థానికులు తెలిపారు. పవిత్ర సరిగా చదవలేకపోయేది. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడలేనని, అమ్మా! నాన్నా! నన్ను మర్చిపోండి’ అంటూ నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్లో పేర్కొంది. బంధువులు, స్నేహితులు అందరినీ పేరుపేరునా ప్రస్తావించి క్షమించమని కోరుతూ ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలంలో ఈ లేఖ లభ్యమైనట్టు పట్టణ పోలీసులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. రోజూ కళ్లముందు తిరిగే అమ్మాయి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందనుకోలేదంటూ చుట్టుపక్కల వారు విషాదంలో మునిగిపోయారు. తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై టి.సునీత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది!!
రెహమాన్.. రెహమాన్ సిస్టర్ కేటీఆర్.. కేటీఆర్ సిస్టర్ వరుణ్ తేజ్.. వరుణ్ తేజ్ సిస్టర్ ఆకాశ్.. ఆకాశ్ సిస్టర్ నలుగురు సిస్టర్స్ కట్టిన నాలుగు రాఖీలివి! నలుగురు బ్రదర్స్ ‘అనురాగ బంధన్’ లివి! అల్లరికి అనుపల్లవి.. చెల్లెలు. చెల్లెలి హరివిల్లు.. అన్నయ్య. ఎక్కడైనా ఇంతే కదా. కొత్త ఉందా ఇక్కడేమైనా?! ఎస్.. ఉంది. రెహమాన్ అంటే మ్యూజిక్కే కదా? ప్రేమను పంచే మ్యాజిక్ కూడా ఉందట! కేటీఆర్ అంటే... ఐటీ స్టార్ కదా? పిల్లల మధ్య ట్వింకిల్ ట్వింకిల్ స్టార్ అట! వరుణ్ తేజ్ అంటే.. ఆరడుగులు కదా? ఆటపట్టిస్తే ఇప్పటికీ చిన్నపిల్లాడేనట! ఆకాశ్ అంటే.. పోరడు కదా? చెల్లి విషయంలో పెద్దోడు అట! చెల్లెళ్లనడిగి.. ‘సాక్షి’ ఈ సీక్రెట్లన్నీ బ్రేక్ చేసింది. ‘రాఖి’ంగ్ ఇంటర్వ్యూలు చేసుకొచ్చింది. తమ్ముడు కాదు నాన్న రాఖీ దక్షిణాది సంప్రదాయం కాకపోయినా మెల్లిగా మనం అడాప్ట్ చేసుకున్నాం. కుల, మతాలకు అతీతంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అక్కాతమ్ముళ్ల (రైహానా, ఏఆర్ రెహమాన్) అనుబంధం గురించి తెలుసుకోవాలని ఉంది... రైహానా: మేం ఎప్పుడూ రాఖీ పండగ చేసుకోలేదు. తమ్ముడికి రాఖీ కట్టింది లేదు. అయితే ‘నీకు ఎప్పుడూ తోడుగా నేను ఉన్నా’ అని చెప్పే పండగ కాబట్టి మాకు తోడుగా ఉన్న మా తమ్ముడి గురించి ఇష్టంగా మాట్లాడాలని ఉంది. తమ్ముడు అనేకంటే రెహమాన్‌ని ‘మా నాన్న’ అంటే బాగుంటుందేమో. తమ్ముడు ఎంతో బాధ్యతగా ఉంటేనే ‘నాన్న’ అనాలనిపిస్తుంది. మీ తోడబుట్టినవాళ్లు ఎంతమంది? నేను పెద్దదాన్ని. నాకు, రెహమాన్‌కి ఒక ఏడాది తేడా. ఆ తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లెలు నాకన్నా తొమ్మిదేళ్లు, మరో చెల్లెలు ఐదేళ్లు చిన్న. మా చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఆయన పోయాక మాకు ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇచ్చింది మా తమ్ముడే. అందుకే ‘నాన్న’ అన్నాను. తోడబుట్టినవాడు ఇలా ఉంటే ఆ అక్కాచెల్లెళ్లు ఎంత ‘ప్రొటెక్టివ్’గా ఫీలవుతారో మాటల్లో చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు రెహమాన్‌గారికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొనివ్వడానికి మీ అమ్మగారు నగలు అమ్మేవారట. అది నిజమే. రెహమాన్‌కి మార్కెట్లో ఏ కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కొనుక్కోవాలని ఉండేది. అది కావాల్సిందే అని మొండి పట్టు పట్టేవాడు. రెండు మూడు రోజులు అన్నం కూడా మానేసేవాడు. చివరికి అమ్మ నగలు అమ్మి కొనిచ్చేది. రెహమాన్ కూడా చాలా బాధ్యతగా ఉండేవాడు. దాని మీద బాగా ప్రాక్టీస్ చేసేవాడు. టీనేజ్లోనే మీ తమ్ముడు సంపాదించడం మొదలుపెట్టారు. అప్పుడు తనకోసం ఏమైనా దాచుకునేవారా? 14, 15 ఏళ్ల వయసుప్పుడే సంపాదన మొదలైపోయింది. దాదాపు ఖాళీగా ఉండేవాడు కాదు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసేవాడు. రోజుకి వెయ్యి రూపాయలు దాకా వచ్చేవి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అమ్మకిచ్చేసేవాడు. ఆ తర్వాత లెక్కలు కూడా అడిగేవాడు కాదు. ఓ రెండు మూడేళ్ల క్రితం వరకూ అంతే. ఇప్పుడు మా మరదలు (రెహమాన్ భార్య) చూసుకుంటోంది. ఇప్పుడు రెహమాన్‌గారు గంభీరంగా కనిపిస్తారు. చిన్నప్పుడు తన సిస్టర్స్‌తో ఎలా ఉండేవారు? నాకు, తనకీ వయసు వ్యత్యాసం ఏడాదే కాబట్టి మేం ఇద్దరం ఎక్కువగా ఆడుకునేవాళ్లం. క్యారమ్స్ బాగా ఆడేవాళ్లం. పిల్లలందరిలానే గొడవలు పడేవాళ్లం. అయితే జీవితం తెలిసే కొద్దీ ఆ అల్లరంతా పోయింది. అయితే చిన్నప్పటి నుంచి కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండేవాడు. మెల్లిగా రెహమాన్ బ్యూటిఫుల్ పర్సన్‌గా మారడం చూశాను. రాను రాను డివైన్ పర్సన్‌ని చూస్తున్నాను. ప్రతిరోజు తన లైఫ్‌ని చూసి ఏదోటి నేర్చుకోవచ్చు. తన ఫోకస్ అమేజింగ్. మీ తమ్ముడు సంగీతదర్శకుడిగా ఈ స్థాయిలో పేరు తెచ్చుకుంటారని ఊహించారా? ఒకవేళ ఊహిస్తే దానికి కారణం ఏంటి? తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్నాను. ఒక్కోసారి ఇండియాలో బాగా పాపులర్ అవుతాడనుకునేదాన్ని. కానీ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటాడని మాత్రం ఊహించలేదు. రెహమాన్ బాగా పైకొస్తాడని నేను ఎందుకు నమ్మానంటే.. అప్పట్లో తను క్రియేట్ చేసిన మ్యూజిక్ నేనెక్కడా వినలేదు. ఆ ట్యూన్స్ నాకు కొత్తగా అనిపించేవి. వినసొంపుగా ఉండేవి. నేరుగా హృదయాన్ని తాకినట్లుగా అనిపించేది. హిందూ మతం నుంచి ముస్లిమ్ మతానికి మారాలని రెహమాన్‌గారు అనుకున్నాక మీ అందరూ కూడా మారడం మీ యూనిటీని తెలియజేస్తోంది... యాక్చువల్‌గా మా కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మగారిని ‘సూఫిజమ్’ చాలా ప్రభావితం చేసింది. రెహమాన్ కూడా ప్రభావితుడయ్యాడు. ఆ భగవంతుడి నుంచి వాళ్లకు ఓ పిలుపు అందింది. దాంతో మారారు. అయితే నేను మాత్రం ఆ తర్వాత ఎప్పటికో దేవుడి నుంచి కబురు వచ్చిందనే భావన కలిగినప్పుడు మాత్రమే మారాను. ‘నేను మారాను. నువ్వు మారాలి’ అని రెహమాన్ ఎప్పుడూ అనలేదు. నా జర్నీలో నాకెదురైన అనుభవాలే మార్పుకి కారణం అయ్యాయి. మీరు గాయనిగా, సంగీతదర్శకురాలిగా ఉన్నారు. ఈ జర్నీకి రెహమాన్‌గారి సాయం ఎంతవరకూ ఉంది? తన హెల్ప్ ఉంది. ముందు కోరస్ పాడించేవాడు. ఆ తర్వాత గాయనిగా అవకాశం ఇచ్చాడు. అలాగే తను చేసే మ్యూజికల్ షోస్‌కి తీసుకెళుతుంటాడు. అయితే యూస్, ఇతర విదేశాల్లో జరిగినప్పుడు వెళ్లను. నా అంతట నేను విదేశాల్లో సంగీత కచేరీలు నిర్వహిస్తుంటాను. తమ్ముడు ఉన్నాడు కదా.. చూసుకుంటాడులే అనుకోకుండా నేను కీబోర్డ్ , గిటార్, డ్రమ్స్.. ఇలా అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ‘ఏండా తలైల ఎన్న వెక్కలే’ అనే సినిమా కూడా నిర్మించాను. మీ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్స్‌లో మీరు మరచిపోలేనిది? డబుల్ క్యాసెట్ టేప్ రికార్డర్. అది కొనిచ్చినప్పుడు రెహమాన్ వయసు 21. చెన్నైలో బర్మా బజార్ ఫేమస్. అక్కడికివెళ్లి కొనుక్కొచ్చాడు. ఆ టేప్ రికార్డర్లో బోలెడన్ని పాటలు విన్నాను. నేను పాడుతూ రికార్డ్ చేసేదాన్ని. మిగతా ఇద్దరి చెల్లెళ్లకు ఓ దారి చూపించారా? వాస్తవానికి క్యాసెట్స్ అమ్మకం జోరుగా ఉన్నప్పుడు నాకు క్యాసెట్ బిజినెస్ అప్పజెప్పాడు. క్యాసెట్స్ పోయి సీడీలు వచ్చాక మానేశాం. ఆ తర్వాత నేను నా వర్క్‌తో బిజీ అయ్యాను. నా రెండో చెల్లెలు రెహమాన్ మ్యూజిక్ కాలేజీ చూసుకుంటోంది. ఇంకో చెల్లెలు ప్లేబ్యాక్ సింగర్. రెహమాన్ ట్యూన్స్‌కి, బయటవాళ్లకు పాడుతుంటుంది. మీ అబ్బాయి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతదర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో పాటు హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. మేనమామ హెల్ప్ ఉందా? చిన్నప్పుడు పక్కనే కూర్చోబెట్టుకొని కీ బోర్డ్ ప్రాక్టీస్ చేయించేవాడు. అలా రెహమాన్ తనని గైడ్ చేసేవాడు. ఐదారేళ్ల వయసప్పుడే రెహమాన్ ట్యూన్‌కి జీవీ పాడాడు. ‘జెంటిల్‌మేన్’ సినిమాలో ‘చికు బుకు చికు రైలే’ చిన్నపిల్లాడి గొంతు జీవీదే. అలాగే ‘బొంబాయి’లో ‘కుచ్చి కుచ్చి కూనమ్మా’ పాడాడు. పెద్దయ్యాక కూడా పాడాడు. ఆ తర్వాత వేరే మ్యూజిక్ డైరెక్టర్స్‌కి కూడా పాడటం మొదలుపెట్టాడు. ఫైనల్లీ తన మేనమామలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అంతవరకూ సక్సెస్ అవుతాడనుకున్నాను. హీరోగా మాత్రం నేనూహించలేదు. అయితే జీవీకి అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంది. హీరోగానూ సక్సెస్‌ఫుల్‌గా వెళుతున్నాడు. అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లను రెహమాన్‌గారు గ్రాండ్‌గా చేశారా? బావగార్లతో ఎలా ఉంటారు? మా పెళ్లిళ్లకు హాజరైన ప్రతి ఒక్కరూ ‘చాలా ఘనంగా చేశారు’ అన్నారు. నేను వేరే చెప్పక్కర్లేదనుకుంటా. బావగార్లతో రెహమాన్ రాసుకుని పూసుకుని ఉండడు. మాట్లాడే నాలుగు మాటలు బాగా మాట్లాడతాడు. ఎక్కువగా దైవత్వం గురించి మాట్లాడతాడు. అసలు మీ అందరికీ టైమ్ కేటాయించేంత తీరిక మీ తమ్ముడికి ఉంటుందా? అమ్మని బాగా చూసుకునే మంచి కొడుకు అనిపిస్తోంది.. ఎప్పుడూ బిజీ. రోజూ ఫోన్ చేసుకోవడం లాంటివి ఉండవు. ‘తిన్నారా? ఏం చేస్తున్నారు’ అనేవి అడక్కపోయినా ఓవరాల్‌గా మా అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుసుంటూ ఉంటాడు. అంతకు మించి ఏం కావాలి? ఇక అమ్మ విషయానికొస్తే.. బిజీగా ఉంటాడు కాబట్టి రోజూ కలవలేడు. అమ్మ నాతోనే ఉంటుంది. తమ్ముడు ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకుంటాడు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేదంటే మంచి మంచి డాక్టర్స్‌తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే మా అందరి విషయంలో ‘హీ ఈజ్ వెరీ కేరింగ్’. అంతా బాగానే ఉంది.. గూగుల్‌లో ఎంత వెతికినా పెద్దయ్యాక మీరంతా దిగిన ఒక్క ఫ్యామిలీ ఫొటో కూడా లేదేంటి? దానికి కారణం ఉంది. ఒకసారి మేమంతా కలసి ఓ గ్రూప్ ఫొటో దిగాం. ఆ తర్వాత ఓ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి దిగడం మానేశాం. ఇది మా తమ్ముడి సెంటిమెంట్. అందుకే చిన్నప్పుడు మేం దిగిన ఫొటోలు ఉంటాయోమో కానీ పెద్దయ్యాక మా ఫొటోలు ఉండవు. ఫైనల్లీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు ఏదైనా సలహా ఇస్తారా? ‘నాకిది చేయలేదు. నాతో ఇలా ఉండలేదు’ అని కంప్లైంట్ చేయకూడని బంధం ఇది. ఒకరి మంచిని మరొకరు కోరుకోవాలి. ఒకరి నుంచి ఒకరు ఏమీ ఆశించకూడదు. నేను మాత్రమే కాదు.. నా తోడబుట్టినవాళ్లు బాగుండాలని కోరుకోవాల్సిన బంధం ఇది. అక్కాచెల్లెళ్లకు అన్నతమ్ముళ్లు భరోసాగా నిలవాల్సిన బంధం ఇది. మా జీవితంలో ఈ బంధం చాలా పటిష్టంగా ఉంది. అక్కాచెల్లెళ్లందరికీ అది దక్కాలని కోరుకుంటున్నాను. రెహమాన్‌గారి విజయానికి కారణాలేంటి? ఫ్యూర్లీ తన టాలెంట్. వర్క్ మీద తనకున్న ఫోకస్. మ్యూజిక్ మినహా వేరే దేని మీదా దృష్టి ఉండదు. ఎప్పుడూ వినయంగా ఉంటాడు. నా తమ్ముడి సక్సెస్‌కి ప్రతిభ, పని మీద ఏకాగ్రత, వినయం.. వీటికి ఆ దేవుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయి. ఫాదర్ ఫిగర్ అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని తెలిపే రాఖిలాంటి పండగ బహుశా మనకే సొంతమేమో! నాకు తెలిసీ ప్రపంచంలో ఇలాంటి కల్చర్ ఇంకా ఎక్కడా లేదనుకుంటా. మన దేశంలో ఈ రాఖి అంటే తెలియని వాళ్లుండరేమో. మేమూ ఈ కాన్సెప్ట్‌లోనే పెరిగాం. బ్రదర్ అంటే మన దగ్గర అమ్మాయిలకు ఫాదర్ ఫిగరే. ఎస్పెషల్లీ ఎల్డర్ బ్రదర్. నాక్కూడా అంతే. రామన్న (కేటీఆర్) ఫాదర్ ఫిగరే. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిమ్ లైక్ మై ఫాదర్. పైగా మా నాన్న ఎప్పుడూ బిజీయే కాబట్టి, రామన్ననే ఆయన ప్లేస్ తీసుకున్నాడు. ప్రతీదీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. ఇష్టాఇష్టాల నుంచి చదువు, కెరీర్ వరకు.. అన్నీ! ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి.. ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లడం వరకు అన్నీ రామన్నతో డిస్కస్ చేశాను. అయితే డెసిషన్ విషయంలో నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. ఉంటుంది కూడా. ఏది మంచి ఏది చెడు జడ్జ్ చేస్తాడు కాని నిర్ణయం నన్నే తీసుకోమంటాడు. బోరింగ్ బ్రదర్ అండ్ బోరింగ్ సిస్టర్ రామన్న నాకన్నా మూడేళ్లు పెద్ద. మోర్ లైక్ ఫ్రెండ్స్‌లాగే ఉంటాం. నిజం చెప్పాలంటే మేమిద్దరం బోరింగ్ బ్రదర్ అండ్ సిస్టర్. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ గొడవపడలేదు. ఒక వస్తువునే ఇద్దరం కావాలని పట్టుపడలేదు. దేని కోసం డిమాండ్ కూడా లేదు. అలాగే క్వశ్చనింగ్ కూడా లేదు. రామన్న ఏది చెబితే అది చేయడమే. అయితే పెళ్లయి వెళ్లిపోతుంటే ‘‘హమ్మయ్య ఈ గయ్యాళి వెళ్లిపోతుంది’’ అని మాత్రం అనుకుని ఉంటాడు (నవ్వుతూ). ‘‘మీ ఆయన్ని సతాయించకు’’అని చెప్పాడు. తన కూతురు అలేఖ్య అచ్చం నా పోలికే అని చెప్తుంటాడు. ‘‘నీలాగే గయ్యాళి’’ అంటుంటాడు (నవ్వుతూ). రామన్న ఉన్నాడు అనే ధీమానే రాఖీ కడితే గిఫ్ట్స్ లాంటి సీనేం ఉండదు పెద్దగా. చిన్నప్పుడు అమ్మో, నాన్నో.. రామన్న జేబులో డబ్బులు పెడితే.. నేను రాఖీ కట్టగానే అవి నాకు ఇచ్చేవాడు. ఇప్పుడు అయితే రాఖీ కన్నా నా ప్రతి బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాడు. పిల్లల బర్త్‌డేలకు కూడా. రామన్న నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అంటే.. నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా.. రామన్న ఉన్నాడు అన్న ధీమానే. నా లైఫ్‌లో నేను మరిచిపోలేనిది అంటే.. నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు.. రామన్న నా దగ్గర ఉండడం. అప్పుడు మేం యూఎస్‌లో ఉన్నాం. వాడు పుట్టగానే వాడిని చేతుల్లోకి తీసుకున్నాడు. రామన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో చాలా సరదాగా ఉంటాడు. వాళ్లతో బాగా ఆడ్తాడు. మా బర్త్‌డేలకు, పిల్లల బర్త్‌డేలకు తప్పకుండా కలుసుకుంటాం. నేను రామన్నకు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ లాస్ట్ ఇయర్ ఆయన బర్త్‌డే రోజు మొదలుపెట్టిన గిఫ్ట్ ఎ హెల్మెట్ చాలెంజ్. ఎవ్రీ ఇయర్ రామన్న బర్త్‌డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటా. బట్ లాస్ట్ ఇయర్ ఆయనకే తెలియకుండా సర్ప్రైజింగ్ ఆయన బర్త్ డే రోజు వెళ్లి హెల్మెట్ ప్రెజెంట్ చేశాను. ఆ చాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ రోజు కూడా హెల్మెట్ ఇస్తాను. నేను స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్ రెస్పాన్స్ చాలా బాగుంది. హెల్మెట్ పెట్టుకోవడం మీద అవేర్నెస్ వచ్చేంత వరకు ప్రతియేడు రామన్న బర్త్‌డే నుంచి రాఖీ వరకు ఈ క్యాంపెయిన్ చేస్తూనే ఉంటాను. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు.. ఇద్దరం అన్ని విషయాలు చాలా ఓపెన్‌గానే మాట్లాడుకుంటాం. విల్ డిస్కస్ ఎవ్రీ థింగ్. కాని ఏ విషయం మాట్లాడినా ఎండ్ అయ్యేది మాత్రం పాలిటిక్స్ దగ్గరే. ఏది చెప్పినా వింటాడు. నిరుత్సాహ పర్చడు. చేసేద్దాం అంటాడు. చాలా ప్యాషనేట్‌గా ఉంటాడు. ఏదైనా పని మొదలుపెడితే పట్టుదలగా పూర్తి చేస్తాడు. నాకూ పట్టుదల ఎక్కువే. ఇద్దరం ఒకరి నుంచి ఒకరం అడ్వయిజెస్ తీసుకుంటాం. నేను చేసే వంటలంటే రామన్నకు చాలా ఇష్టం. ఇది చేయకు.. అది చేయకు ఒక్క రామన్ననే కాదు.. మా ఇంట్లో ఏ విషయంలోనూ ఎవరూ వెనక్కి లాగలేదు. లాగరు కూడా. ఇంజనీరింగ్ చేస్తానన్నా.. అమెరికా వెళ్తానన్నా.. చివరకు పాలిటిక్స్‌లోకి రావడాన్ని కూడా ఎవరూ అడ్డుకోలేదు. అడ్డు చెప్పలేదు. ఎంకరేజింగ్‌గానే ఉంటారు. అందరూ ఇండువిడ్యువాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు.. రెస్పెక్ట్ చేస్తారు. రిస్ట్రిక్షన్స్ ఎప్పుడూ లేవు. రాఖీ.. బ్రదర్స్ అందరికీ నా రిక్వెస్ట్... అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లది రక్తసంబంధం. ఎవరి లైఫ్‌లో వాళ్లు ఎంత బిజీగా ఉన్నా అక్క, చెల్లెళ్ల కోసం టైమ్ కేటాయించండి. ఎందుకంటే ఆడపిల్ల తను లైఫ్‌లో ఎంతబాగా సెటిల్ అయినా ప్రతి అన్నా, తమ్ముడు తన పట్ల కేర్ తీసుకోవాలని, కన్సర్న్ చూపించాలని కోరుకుంటారు. సో.. దయచేసి వాళ్లతో టైమ్ స్పెండ్ చేయండి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్ చేసే స్పిరిట్‌నే పెంపొందించారు తప్ప పిరిగా అన్న వెనకాలో.. నాన్న వెనకాలో దాక్కునే తత్వాన్ని నూరిపొయ్యలేదు. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే చెప్పారు. ఆ ధైర్యాన్నే ఇచ్చారు. నిజానికి మా ఇంట్లో నాకు గాని, రామన్నకు గాని మా అమ్మే ఇన్సిపిరేషన్. అమ్మ ఓపిగ్గా లేకపోతే నాన్న జర్నీ ఇంత సాఫీగా సాగేది కాదు. సో.. షి ఈజ్ అవర్ స్ట్రెన్త్. అన్నాచెల్లెళ్లం ఎలా ఉండాలో కూడా అమ్మను చూసే నేర్చుకున్నాం. నా పిల్లలకూ అదే చెప్తా.. మా అమ్మ నన్నెప్పుడూ అణగిమణిగి ఉండాలని ఆర్డర్ చేయలేదు. అలాగే రామన్నకు మగపిల్లాడు అని ప్రివిలేజెస్ ఇవ్వలేదు. అంటే నన్ను తక్కువా చేయలేదు.. రామన్నను ఎక్కువా చేయలేదు. ఇద్దరినీ ఈక్వల్‌గానే చూసింది. సర్దుకుపోవడం, ఒకరంటే ఒకరు గౌరవంగా ఉండడం ఇద్దరికీ నేర్పింది. నేనూ నా పిల్లలకు అదే చెప్తా. నాకు ఇద్దరు అబ్బాయిలే. అందరూ సమానమనే చెప్తా. ‘‘నువ్వు చెప్పింది అందరూ వినాలి అని అనుకోవద్దు. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాఇష్టాలు వాళ్లకు ఉంటాయి. గౌరవించాలి. పర్సనల్స్పేస్ ఇవ్వాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా సున్నితంగా ఆలోచించాలి. బాలెన్సింగ్‌గా ఉండాలి’’ అనే చెప్తుంటా. కళ్యాణలక్ష్మిని సరిగ్గా అర్థం చేసుకోవాలి... మా నాన్న చేసిన దాంట్లో నాకు బాగా నచ్చిన విషయం.. ప్రతి గర్భిణీ స్త్రీకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం. నెలలు నిండే వరకు కూడా పనిచెయ్యక తప్పని పరిస్థితులన్న మహిళలకు ఇదెంతో మేలు చేస్తుంది. గర్భవతి అని నిర్థారణ అయి, బిడ్డ పుట్టిన మూడు నెలల వరకు ప్రతి నెలా వాళ్లకు వెయ్యి రూపాయలు వచ్చేలా చేసే స్కీమ్ ఇది. అలాగే అంగన్ వాడీలో ప్రతి రోజూ ఒక పూట పోషక విలువలతో కూడి భోజనం ఇవ్వడం. ఈ పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తగ్గించినా కూడా నాన్న ఈ స్కీమ్ రన్ అయ్యేలా చేస్తున్నారు. ఇవి చాలా మంచి స్కీమ్స్. కళ్యాణ లక్ష్మిని చాలా మంచి తప్పుగా అర్థం చేసుకున్నారు కాని.. సీఎమ్గారు చాలా విజన్‌తో దాన్ని స్టార్ట్ చేశారు. పేదరికం వల్ల తెలంగాణలో అమ్మాయిలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. అందుకే పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత ఆ అమ్మాయి పెళ్లికి సహాయపడే ఈ కళ్యాణ లక్ష్మి పథకం వల్ల అమ్మాయిలు కనీసం పద్దెనిమిదేళ్లు వచ్చే వరకన్నా చదువుకునే వీలు కలుగుతోంది. బాల్య వివాహాలూ కాస్త అయినా ఆగుతాయని ఆశ. అమ్మాయి భవిష్యత్‌ను బాగు చేసే పథకమే ఇది. ఆయన ఏ పని చేసినా నెక్స్›్ట ఎలక్షన్స్ వరకే కాదు.. నెక్స్›్ట జనరేషన్ వరకు ఉంటుంది. లిక్కర్విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు. దాన్ని తగ్గించేందుకు ఆయన స్టెప్ బై స్టెప్ చర్యలు తీసుకుంటున్నారనుకుంటున్నాను. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ రాఖీ పండగని ఎలా చేసుకుంటారు? నిహారిక: దసరా, దీపావళిలా ఫుల్‌గా చేయకపోయినా బాగానే చేసుకుంటాం. బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ తినిపించి, కాళ్లు మొక్కి డబ్బులు గుంజడం (నవ్వుతూ ). చిన్నప్పటి నుంచి రాఖీ ఎప్పుడూ మిస్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే వరుణ్ అన్న ‘ఫిదా’ షూటింగ్ కోసం నిజామాబాద్‌లో ఉన్నాడు. నేను వరుణ్ అన్నకు రాఖీ కట్టాకే మిగతా అన్నలకు కడతాను. నైట్ అంతా జర్నీ చేసి నిజామాబాద్ వెళ్లి అన్నకు రాఖీ కట్టి మళ్లీ రిటర్న్ వచ్చి చరణ్ (రామ్‌చరణ్) అన్నకు కట్టాను. ఒకవేళ వేరే కంట్రీలో ఉంటే ఏం చేయలేం. నెక్ట్స్ స్క్రిప్ట్స్ వినేప్పుడు కూడా రాఖీ అప్పుడు షెడ్యూల్స్ లేకుండా చూడాలి. ఎందుకంటే నాకు లాస్ కదా. పైసల్ ఇవ్వకుండా తప్పించుకుంటాడు (నవ్వుతూ). వరుణ్: మా జనరేషన్స్‌లో కజిన్స్ ఎక్కువ. చరణ్ అన్న వాళ్ల ఇంటికి నిహా వెళ్లడం, సుష్మితా వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మెమరబుల్గానే సెలబ్రేట్ చేసుకుంటాం. అందరం కలిసి బయటకు వెళ్తాం. సినిమాల్లోకి వచ్చాక బయటకి వెళ్లడం తగ్గిపోయింది. ఆ రోజు షూటింగ్స్ లేకపోతే కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. ఎక్కువ సేపు జరుపుకునే ఫెస్టివల్ కాదు కూడా. రాఖీ కట్టించుకున్న తర్వాత టైమ్ స్పెండ్ చేస్తుంటాం. మిస్ అవ్వకుండా పాటిస్తాం. రాఖీ కట్టేప్పుడు అన్నయ్య ఇలా ఉండాలి అని ఏదైనా కోరుకుంటారా? నిహారిక: రాఖీ రోజే ప్రొటెక్ట్ చేయాలని కోరుకోం. అన్న నన్నెప్పుడూ ప్రొటెక్ట్ చేస్తుంటాడు. చెల్లి పుట్టగానే బ్రదర్స్‌కి ఒక బాధ్యత వచ్చేస్తుంది. సెకండ్ ఫాదర్ లాగా మారిపోతారు. నాన్నకు అన్నీ చెప్పలేం కదా. అన్నయ్యకు చెబుతాం. అలా అని అన్నయ్యకు కూడా మొత్తం చెప్పం అనుకోండి (నవ్వుతూ). వరుణ్: నేను ఒక్కరోజు పండగల్ని పెద్దగా నమ్మను. తను నీకు ఆ ఒక్క రోజు చెల్లెలు కాదు కదా. జీవితాంతం చెల్లెలే. లైఫ్‌లాంగ్ తనను ప్రొటెక్ట్ చేస్తుండాలి. రాఖీ అనేది ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ సెలబ్రెట్ చేసుకోవడానికి ఓ రోజు అన్నట్టు నేను ఫీల్ అవుతాను. చిన్నప్పటి నుంచి అల్లరిగా ఉంటారు. కానీ కొంత వయసు వచ్చేప్పటికి కొంచెం ప్రొటెక్టెడ్‌గా అయిపోతారు. మీ అన్న అలా మారారని ఎప్పుడు అర్థం అవ్వసాగింది? నిహారిక: అది మెల్లిగా అర్థం అవుతుంది. చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా కొట్టుకున్నాం. అమ్మా నాన్న దగ్గర ఊరికే కంప్లైంట్ చేసుకోవడం నుంచి మెల్లిగా మెచ్యూర్డ్ అవ్వడం గమనించాను. నేను కాలేజ్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ఉండేదాన్ని. అన్నయ్య అప్పుడు వైజాగ్‌లో యాక్టింగ్ కోర్స్‌లో ఉన్నాడు. 5–6 నెలలు చూడలేదు. అప్పుడు మిస్ అయ్యాను. ఆ తర్వాత నుంచి అన్నయ్యలో కొంచెం ప్రొటెక్టీవ్నెస్ కనిపించేది. అది కూదా గుడ్ వేలోనే. మరీ ఓవర్‌గా, రెస్ట్రిక్షన్లా కూడా కాదు. ఇంకో ప్లస్ ఏంటంటే.. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్తున్నాను అంటే త్వరగా ఇంటికి వచ్చేయ్ అంటారు. అదే అన్నతో అయితే ఈజీగా బయటకు వెళ్లోచ్చు. అన్నయ్యతో ఉన్నావా? అని ఇంకే అడగరు. వరుణ్: ఆ ట్రాన్స్ఫర్మేషన్ అందరికీ జరుగుతుంది అనుకుంటున్నాను. నేను, మా చెల్లెలు ఊరికే కొట్టుకోవడం, గొడవపడటం తప్ప కూర్చొని స్వీట్‌గా మాట్లాడటం ఎప్పుడూ లేదు. నా విషయంలో తను ఎంత ప్రొటెక్టివ్‌గా ఉందో నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాతే తెలుసుకున్నా. చరణ్ అన్న, నేను కూడా ఎక్కువ గొడవలు పడేవాళ్లం. ఎక్కువ తిట్టేవాడు.. కొట్టేవాడు. సడెన్‌గా చరణ్ అన్న యాక్టర్ అయ్యాక నన్ను ఫాదర్‌లా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. నేను యాక్టర్‌ని అయ్యాక అది అర్థం అయింది. నిహారిక: నాకు తెలిసిన ఫ్రెండ్స్‌లో కొందరు ‘మా అన్నయ్య అన్నింటికీ అడ్డంకులు పెడతాడు. వాడికి వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కువ’ అనేవాళ్లు. నా అన్న మాత్రం అలా కాదు. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ‘ఎక్కడికి వెళ్తున్నావు’ అని అన్నయ్య అడిగేవాడు. అప్పుడు చిరాకుగా అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది.. ఒకవేళ అది కూడా అడగకపోతే ఇంకా అల్లరి పిల్లలా తయారయ్యేదాన్ని అని. మీ ఇంట్లో ఎవరికి వాళ్లు మీ కెరీర్‌తో బిజీ. ఈ బిజీ వల్ల వచ్చే గ్యాప్‌ని ఎలా ఫిల్ చేస్తారు? నిహారిక: ఇప్పుడు అన్న కొంచెం ఖాళీ దొరికినా నా ఆఫీస్‌కి రా. సెట్స్‌కి రా అంటాడు. వాళ్ల ఫ్రెండ్స్‌తో నన్ను కలుపుకుంటాడు. అందుకే అంత గ్యాప్ రాదు. ఒక వారం వరకూ ఓకే. వారం దాటి కలవకపోతే మాత్రం ఇద్దరికీ ‘మిస్సింగ్’ అనే అలారం మోగిపోతుంది. వెంటనే కలుస్తాం. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఎక్కువ శాతం టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. మరి మీ ఇంట్లో టామ్ ఎవరు జెర్రీ ఎవరు? నిహారిక: నేను జెర్రీ.. అన్నయ్య టామ్. ఆ ప్రోగ్రామ్‌కి ఇన్స్పైర్ అయ్యి, అన్న చేతులు గీరేసేదాన్ని. అప్పుడు వాడు హీరో అవు తాడు అని తెలియదు కదా. ఇప్ప టికీ ఆ గీతలు వాడి చేతుల మీద ఉంటాయి. అన్న కోసం నాకు చాక్లెట్స్ లంచం ఇచ్చేవాళ్లు - నిహారిక రాఖీ అనగానే బ్రదర్ సిస్టర్ని ప్రొటెక్ట్ చేయాలి. భరోసా ఇవ్వాలి అంటాం. మరి సిస్టర్స్ బ్రదర్స్‌కి ఏం చేయాలి. నిహారిక : మేం కూడా ఏమైనా చేయాలా? (పెద్దగా నవ్వుతూ). చిన్నప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంటాం కదా. సోఫాలో కూర్చొని చిటికేస్తే మేమే కదా వాటర్ బాటిల్ అయినా ఏదైనా అందించేది. పరిగెత్తిస్తారు కదా. ఇలా సంవత్సరం అంతా చేస్తూ రాఖీ రోజు గుర్తు చేస్తుంటాం హాలో.. నువ్వు కూడా బాధ్యతగా ఉండూ అని. రాఖీ రోజు వరుణ్ మీకు గిఫ్ట్స్ ఇస్తుంటారా? నిహారిక: ఏది పడితే అది తీసుకుంటాను. అప్పటి మైండ్‌సెట్‌కి తగ్గట్టుగా అడుగుతా. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఇలాంటి పండగలప్పుడు అడగాలనిపించదు. కానీ మాములు టైమ్‌లో చంపుతుటాను. మీ అన్నయ్యకు మీరిచ్చిన వాటిలో బెస్ట్ గిఫ్ట్స్ ఏదైనా? వస్తువు కొని ఇస్తే ప్రేముంటుందని నేను అనుకోను. నేను నా టైమ్ తీసుకొని నా సొంతంగా చేసినవి ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాంటి గిఫ్ట్స్ ఇవ్వడంవల్ల మనం ఎంత స్పెషలో తెలియజేస్తాం. అలా ఇవ్వడం వల్ల నాకు ఎక్కువ సంతృప్తి ఉంటుంది. గిఫ్ట్స్ కంటే అన్నయ్యతో స్పెండ్ చేసే స్పెషల్ మూమెంట్స్‌ని చాలా ఇష్టపడతాను. బయట మీ అందరికీ కనిపించే వరుణ్ వేరు.. మా ఇంట్లో ఉండే వరుణ్ వేరు. చాలా ఏడిపిస్తాడు. చాలా ఫన్నీ. ఈ విషయం మీ అందరికీ తెలుసో.. లేదో. అన్న బెస్ట్ కంపెనీ. అలాంటి ఇంకెన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నతో స్పెండ్ చేయాలనుకుంటున్నాను. గిఫ్ట్స్ అన్నీ ఏదో పాయింట్లో ఇరిగిపోతాయి.. అరిగిపోతాయి. స్పెండ్ చేసిన టైమే బెస్ట్ అని నా ఫీలింగ్. నిహారిక మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? వరుణ్: తను గిఫ్ట్స్ ఎక్కువ ఇవ్వదు కానీ బాగా చూసుకుంటుంది నన్ను. ఒకసారి తను సొంతంగా నా బర్త్‌డేకి నా ఫోట్స్ అన్నీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్ తయారు చేసి ఇచ్చింది. అది ఇప్పటికీ నా రూమ్‌లోనే ఉంది. మీరు షేర్ చేసుకున్న బెస్ట్ మూమెంట్స్ వరుణ్: మా ఫ్యామిలీలో ఒక స్పెషల్ మూమెంట్ అని ఉండదు. అన్నీ కలిపి ఉంటాయి. నాకు నిహారిక ఒక్కతే కాదు.. చరణ్ అన్న వాళ్ల సిస్టర్స్ కూడా క్లోజ్. మా కజిన్స్ అందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి అందరం రెగ్యులర్‌గా కలుస్తాం. మీట్ అవుతుంటాం. సంక్రాంతికి బయటకు వెళ్తుంటాం. బెంగళూర్‌లో ఫామ్ హౌస్ ఉంది. నిహారిక తన షూటింగ్స్‌కి రమ్మంటుంది కానీ నా బిజీ వల్ల కుదరడం లేదు. సాధారణంగా ఏ అమ్మాయి అన్నయ్యని అయినా అబ్బాయిలు విలన్‌గా ఫీలవుతారు. మీ అన్నయ్య ఎంతమందికి విలన్ అయ్యారు? నిహారిక: మా అన్న ఒక లైన్ చెప్పాడు. అది తనెక్కడో చదివాడట. అదేంటంటే.. ఏ చెల్లైనా అన్నయ్యకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అర్థం చేసుకుంటుందట. అదే అన్నయ్యకు ఆ చెల్లి వచ్చి నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటే అస్సలు అర్థం చేసుకోడట. దానికి కారణం చెప్పాడు. చెల్లెలికి ప్రేమంటే ఏంటో తెలుసు. కానీ అన్నయ్యలకు అబ్బాయిలంటే ఏంటో తెలుసు అన్నాడు. నిజమే కదా అనిపించింది. హిస్టరీ చూస్తే ఇదే నిజం అని అర్థమవుతుంది. సినిమాల్లో కూడా చెల్లెలు వదినా అని వెంటనే ఒప్పుకుంటుంది. అన్నయ్య మాత్రం సింపుల్ రిజెక్షన్. అది కూడా ప్రొటెక్షనేలే. నాకు తెలిసి మా అన్న ఎవరికీ విలన్ అవ్వలేదనే అనుకుంటున్నాను. ఎప్పుడూ హీరోనే. ఇద్దరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. ఒకరి వర్క్‌ని ఇంకొకరు ఎలా కాంప్లిమెంట్ లేదా క్రిటిసైజ్ చేసుకుంటారు? నిహారిక: 5 ఏళ్ల క్రితం అయితే చెత్తగా చేశావు.. బాగా చేశావులే అని అనుకునేవాళ్లం అనుకుంటున్నాను. బావున్నా బాలేకున్నా డీటైల్డ్‌గా చెప్తాను నేను. ప్రతి సినిమాకు యాక్టర్‌గా గ్రో అవుతుంటారనే అనుకుంటాను. డ్రెస్సింగ్, మేకప్ విషయంలో కామెంట్ చేస్తుంటాను. వరుణ్: చెల్లి సినిమాలను బాగానే క్రిటిసైజ్ చేస్తుంటాను. నిహా మాత్రం అంతగా చెప్పదు. చరణ్ అన్న దగ్గరకు వచ్చినప్పుడు అన్న చెప్పేది వింటాను. ఎందుకంటే మా అందరిలో సీనియర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. చరణ్ అన్న, నేను సినిమాల గురించి కూడా బాగా మాట్లాడుకుంటాం. ఐడియాస్ పంచుకుంటాం. నిహా, నేను సేమ్ ఫీల్డ్‌లో ఉన్నాం కాబట్టి హ్యాపీ. తను డాక్టరో లేక ఇంజనీరో అయ్యింటే తన వర్క్ నాకు అర్థం అవ్వదు. ఆ టాపిక్ కూడా నేను మాట్లాడలేను. సినిమాల్లోకి వెళ్తున్నాను అనగానే అన్నయ్య రియాక్షన్ ఏంటి? నిహారిక: వాట్!! నిజంగానా అన్నాడు. మీరు ముందు హింట్స్ ఇవ్వలేదా? నిహారిక: నేను సినిమాల్లోకి వెళ్లాలనుకున్నాక ఇంట్లో గంతులేస్తున్న టైమ్‌లో అన్నయ్య ఇంట్లో లేడు. యాక్టింగ్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. సో 6–7 నెలలు లేకపోయే సరికి వాడికి కొత్తగా అనిపించింది. మా ఫ్యామిలీలో ఎవరూ వద్దని చెప్పలేదు. నేను సీరియస్‌గా ఉన్నానా? లేదా ఇండస్ట్రీ నుంచి వచ్చే నెగటివ్, పాజిటివ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? లేదా అని చూశారు. అందరికంటే చిన్నదాన్ని, చిన్నపిల్ల అని భయపడ్డారు. హ్యాండిల్ చేయగలుగుతుందా? అని కొంచెం ఆలోచించారు. నా కాన్ఫిడెన్స్ చూసి అన్నయ్యకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది మైండ్‌లో ఫిక్స్ అయిందన్న మాట అనుకున్నాడు. ఇలానే ఉండాలని నిబంధనలేమైనా? నిహారిక: లేదు. కానీ నీకేదైనా పని చేయాలనిపించినప్పుడు నీ వెనక 8–9 మంది ఉన్నారు. సో ఏది చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పారు. నిన్ను ఎవరూ ఏమీ అనరు. చిరంజీవిగారు. నాగబాబు, పవన్‌కళ్యాణ్, చరణ్.. ఇలా అన్ని పేర్లు వస్తాయి అన్నారు. నాకూ ఆ విషయంలో క్లారిటీ ఉంది. వరుణ్: కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్షన్ పొసెసివ్‌నెస్ అయిపోతుంది. అది చాలా సన్నటి గీత. బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మా నాన్న కూడా చాలా ఫ్రీడమ్ ఇస్తూనే కొన్ని నిబంధనలు పెట్టారు. నేను కూడా ఆ లైన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను. మా చెల్లి సైడ్ నుంచైతే ఏం కంప్లైంట్స్ లేవు. తను హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం వచ్చిన తర్వాత ఫ్రీ హ్యాండెడ్‌గా ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు వద్దన్నా నేనే మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తాను. (నవ్వుతూ) మీ అన్నయ్య రిలేషన్షిప్స్ నాన్నగారికి తెలియ కుండా దాచిపెట్టడం. నిహారిక: నేను, అన్నయ్య ఒకే కాలేజ్‌లో చదువుకోలేదు. కానీ 5 వరకూ ఒకే స్కూల్. అన్నయ్యను లైక్ చేసే అమ్మాయిలు తెలుసు కానీ అన్నయ్య లైక్ చేసిన అమ్మాయిలు తెలియదు. చాలా మంది చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేవారు. బ్రేక్ టైమ్‌లో అన్న క్లాస్‌కి వెళ్తే ‘హే వరుణ్ చెల్లి’ అని చాక్లెట్స్ ఇచ్చేవాళ్లు. చాక్లెట్స్ వస్తున్నాయి కదా అనుకున్నే దాన్ని. అది లంచం అని తర్వాత తెలిసింది. వరుణ్: నేను అసలు అమ్మాయిలతో మాట్లాడేవాడ్ని కాదు. అమ్మాయిలంటే శత్రువులు అని అనుకునేవాడ్ని. అలా ఎందుకు అనుకున్నానో కూడా సరిగ్గా తెలియదు. మా క్లాస్‌లో అమ్మాయిలందరూ కూడా చెల్లితో క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్లు ఇచ్చిన చాక్లెట్స్ తీసుకునేది కానీ నాతో చెప్పమన్నది మాత్రం చెప్పలేదు. మీ చరణ్ అన్న ఇచ్చిన గిఫ్ట్స్ ఏమైనా? నిహారిక: ఒకసారి అనుకోకుండా నాక్కావల్సింది ఇచ్చాడు. నేను ట్రిప్‌కి వెళ్తున్నాను. కొత్త కళ్లజోడు కొనుక్కుందాం అనుకున్నాను. దార్లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వెళ్తుంటే చరణ్ అన్న కార్ కనిపించింది. హాయ్ చెప్పేదాం అని వెళ్లాను. అన్న క్యారవ్యాన్ బాగా ఫేమస్. నువ్వేంటి సడెన్‌గా ఇలా? అన్నాడు. ఏం లేదు.. కళ్లజోడు కొనుక్కుందాం అని అన్నాను. నేనుండగా నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవడమా అని చెప్పి పర్స్‌లో నుంచి డబ్బులు తీసి ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ ‘నీ హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి డబ్బులు బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడవనుకుంటా’ అని ఆటపట్టించారు. ఊహించకుండా వచ్చిన గిఫ్ట్ కాబట్టి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎప్పుడైనా స్కూల్ అవుటింగ్స్లో హెల్ప్ చేశారా? వరుణ్: మా నాన్నగారి మితిమీరిన ప్రేమ వల్ల చిన్నప్పుడు స్కూల్ అవుటింగ్స్ ఒకటి కూడా వెళ్లలేదు నేను. మహా అంటే ఒక్కసారి అనుకుంటాను. అందరికీ ఉంటుంది కదా బయటకు వెళ్లాలని. నిహారిక టైమ్ వచ్చేసరికి ఆయన కొంచెం ఫ్రీగా ఉండేవారు. తనే చాలా సార్లు వెళ్లింది. నేను గొడవపడేవాణ్ని నన్ను ఆపేశారు... తనను పంపుతున్నారని (నవ్వుతూ). ఇద్దరికీ సీరియస్ గొడవలేమైనా అయ్యాయా? వరుణ్: నాకు గొడవలను ఎక్కువగా లాగడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారి కోప్పడుంటాను కానీ పెద్దగా మాట్లాడుకోలేనంత గొడవలు ఎప్పుడూ జరగలేదనుకుంటాను. మీరిచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ ఏంటి? వరుణ్: అవతలి వాళ్లకు ఏది నచ్చుతుంది అని ఆలోచించి గిఫ్ట్ తీసుకోవడంలో చాలా వీక్. కానీ నాకు గుర్తున్నదైతే యాక్టర్ అయ్యాక నా సంపాదనతో తనకో వాచ్ కొనిచ్చాను. డబ్బులిస్తాను కావాల్సింది కొనుక్కో అంటాను. నాన్నకి తెలియకుండా మీ ఇద్దరూ చేసిన పనులు... వరుణ్: కొన్ని సార్లు లేట్ నైట్స్ బయట ఉండాల్సి వస్తుంటుంది. ఆ విషయం నాన్నకు చెప్పాలంటే భయం. అప్పుడు చెల్లి కవర్ చేస్తుంటుంది. అలా నాన్నకు అబద్ధాలు చెప్పి బయట తిరిగేవాళ్లం. మీ పాకెట్ మనీని మీ అన్న కొట్టేసేవారా? నిహారిక: అబ్బే. కిడ్డీ బ్యాంక్ ఉండేది కానీ పొరపాటున రూపాయి వేసేదాన్ని కాదు. వరుణ్ అన్నకు కాయిన్స్ కలెక్షన్ ఉండేది. అన్నీ మంచిగా సెట్ చేసుకునేవాడు నేను చిందరవందర చేసేదాన్ని. తర్వాత నాకు తెలిసిన విషయమేంటంటే నాకు కాయిన్స్ అంటే ఎలర్జీ అని. దాంతో వాటి జోలికి వెళ్లడం మానేశాను. రాఖీ విలువ తెలిసింది రాఖీ అనగానే మీకు గుర్తొచ్చే సంఘటన ఏంటి? పవిత్ర: చిన్నప్పటి నుండి అన్నయ్యకు రాఖీ కడుతూనే ఉన్నా. అయితే దాని గురించి పెద్దగా అవగాహన లేదు. రాఖీ కట్టి వాడిచ్చే డబ్బులో, గిఫ్టో తీసుకునేదాన్ని. నా ఐదవ తరగతి తర్వాత అమ్మ నాకు రాఖీ పండగ గురించి, దాని విశిష్టత గురించి చెప్పింది. గుర్తున్న సంఘటన అంటూ ఏమీ లేదు. అయితే చిన్నప్పుడు అన్నయ్య రాఖీ కట్టించుకోను అని అల్లరి చేసేవాడు. ఆకాశ్: (నవ్వుతూ). నేను ఎందుకు కట్టించుకోను అనేవాణ్ణి అంటే రాఖీ స్టైల్‌గా ఉండేది కాదు. అందుకే పారిపోయేవాణ్ణి. అంతే కానీ చెల్లి మీద ప్రేమ లేక కాదు. కానీ కొంచెం పెద్దయ్యాక రాఖీ విలువ గురించి అమ్మ చెప్పింది. అందుకే అడిగి మరీ కట్టించుకుంటున్నాను. పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇష్టం? ఆకాశ్: నేను ఏం ఇచ్చినా తీసుకుంటుంది. గిఫ్ట్స్ తీసుకోవటం అంటే తనకి చాలా ఇష్టం (నవ్వుతూ). పవిత్ర: లాస్ట్ ఇయర్ కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు. అమ్మకు కృష్ణుడంటే చాలా ఇష్టం. అందుకే అన్నయ్య ఇవ్వగానే దేవుని మందిరంలో పెట్టి అమ్మకు చూపించాను. అమ్మ చాలా సంతోషించింది. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు బెంగళూర్ నుండి ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆ బ్యాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆకాశ్: పవిత్రకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలనే విషయం గురించి నాకు చిన్నప్పటి నుండి ప్లాన్ ఉంది. మెల్లిగా ఒక్కోటి ఇస్తూ వస్తున్నాను. ఇక బ్యాగ్ విషయానికి వస్తే.. నేను బెంగళూర్‌లో కోచింగ్‌లో ఉన్నాను. ఆ టైమ్‌లో రాఖీ పండగ వచ్చింది. నెక్ట్స్ ఇయర్ కాలేజీకి వెళ్తుంది కదా. మంచి స్టైలిష్ బ్యాగ్ కొందామనిపించి, కొన్నాను. ఏమిచ్చినా తీసుకుంటుంది కాబట్టి మంచి చెల్లెలు అనుకోవాలి. ఈ రోజు కూడా మంచి గిఫ్ట్ ఉంది. కానీ సర్ప్రైజ్. పవిత్ర: నేను ఎవర్నీ ఏమీ అడగను. ఎవరన్నా ఇస్తే వద్దనను. నచ్చితే వాడుకుంటాను. నచ్చకపోతే పక్కన పెడతాను కానీ ఎవరినీ నొప్పించను. కానీ ఈ రోజు ఏమిస్తాడో చూడాలి. (అన్న వైపు చూస్తూ). ఆకాష్‌కి మాత్రమే రాఖీ కడతారా? బయట ‘రాఖీ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారా? పవిత్ర: రాఖీ పండగ రోజు అన్నయ్యకు రాఖీ కట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవటం కంపల్సరీ. సాయంత్రం టేబుల్ మీద బోలెడన్ని స్వీట్స్, రాఖీలు ఉంటాయి. అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ దాదాపు ఐదారుగురు వచ్చి రాఖీలు కట్టించుకుంటారు. కట్టిన తర్వాత అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. మీ ఇద్దరూ పర్సల్ విషయాలు షేర్ చేసుకుంటారా? పవిత్ర: మాకసలు వ్యక్తిగత విషయాలంటూ ఉండవు. ఎందుకంటే నేను ఏం ఉన్నా మా అమ్మా నాన్నలిద్దరికీ చెప్పేస్తాను. ఆకాశ్ విషయానికి వస్తే మా అమ్మను చాటుగా గదిలోకి తీసుకెళ్లి, నేను చాలా పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను నువ్వు రావద్దు అంటాడు. కానీ పది నిమిషాల తర్వాత అమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇక పర్సనల్స్ ఏముంటాయి? మొదటి సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలుంటాయి. ఆ టైమ్‌లో ఆకాశ్‌కి ఎలాంటి ధైర్యం ఇచ్చారు. ఆ సినిమా రిజల్ట్ మీకు తెలిసిందే. ఆ టైమ్‌లో మీరిచ్చిన సపోర్ట్? పవిత్ర: సినిమా షూటింVŠ టైమ్‌లో తనే చాలా ధైర్యం చెప్పేవాడు. షూటింగ్ ఇక్కడ జరగలేదు. చాలా దూరంలో ఉన్నాడు.. ఎలా ఉన్నాడో ఏమో అని మేం కంగారు పడేవాళ్లం. రోజూ ఏదో ఒక టైమ్‌లో ఫోన్ చేసి షూటింగ్ చాలా బాగా జరుగుతుంది, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పేవాడు. తనకు చిన్నప్పటి నుండి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా చేశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తను 100 పర్సెంట్ న్యాయం చేశాడు. రివ్యూస్ ఎలా వచ్చినా తను డల్ అవ్వటం ఉండదు. ఆకాశ్: నేను డల్‌గా ఉన్నాను అనిపిస్తే అమ్మా, చెల్లి ఆ టాపిక్ గురించి మాట్లాడరు. ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అని స్టార్ట్ చేస్తారు ఇద్దరూ. ఎందుకు డల్‌గా ఉన్నావ్ అని అడగరు. తర్వాత నిదానంగా నేనే ఎందుకు అలా ఉన్నాను అనే విషయం చెప్తాను. అన్నయ్యా అంటారు రాఖీ కట్టరు – పవిత్ర మీ చెల్లెలు ఇప్పుడు స్కూల్ నుండి కాలేజ్‌కి వెళుతుంది. చిన్న భయం లాంటిది ఏమైనా? ఆకాశ్: అస్సలు లేదండి. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ నా స్కూల్‌కి వచ్చేది. అమ్మను చూడగానే టీచర్ అది చేయలేదు.. ఇది చేయలేదు అని నన్ను తిట్టేది. తర్వాత అమ్మ పవిత్ర క్లాస్‌కి వెళ్లేది. టీచర్ వెంటనే పాప బాగా చదువుతుంది.. ఎంత మంచి అమ్మాయో అని చెప్పేవారు. తను చిన్నప్పటి నుండి అంతే. అందుకని తను కాలేజీకి వెళ్లినా నాకు దిగులు అనిపించింది. పైగా పవిత్రకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందుకని చాలా రిలాక్స్‌గా ఉంటాను. మా ఇద్దరికీ మంచి లక్షణాలు ఉన్నాయంటే అవి మొత్తం అమ్మ నేర్పినవే. పవిత్ర ఎలాంటి కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటోంది? ఆకాశ్: తనిప్పుడు బీబీఏ చదువుతోంది. చదువు అయిపోగానే ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకోవాలి అని చెప్పాను. టెన్త్ అయిపోగానే ప్రొడక్షన్లోకి వచ్చేస్తానని నాన్నకు చెప్పేసింది. అప్పటినుండి ఆయన బిజినెస్‌కి సంబందించిన బుక్స్ తెచ్చిస్తుంటారు. ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నారు. మీ నాన్నగారు ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో మీ ఇద్దరికీ తెలుసు. ఎలాంటి ఇన్పుట్స్ తీసుకుంటారు? పవిత్ర: మేం చిన్నప్పటినుండి డాడీని చూస్తూ పెరిగాం. నాకు అన్నీ తెలుసు. ఏదైనా మూవీలో లాస్ వచ్చినా ఆ నష్టం దేనివల్ల వచ్చిందో తెలుసు. కానీ నేను ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడటం టూ ఎర్లీ అవుతుంది. నా వయసు సరిపోదు. కాలేజీలో మీరు డైరెక్టర్ పూరీ డాటర్ అని అందరికీ తెలుసా? పవిత్ర: యాక్చువల్లీ నేను చాలా రిజర్వ్డ్గా ఉంటాను. అయితే అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాను. కానీ నా గురించి చాలా తక్కువమందికి తెలుసని చెప్పాలి. నా గ్యాంగ్‌లో కూడా ఓ పది, పన్నెండుమందికి తెలుసు నేను ఏంటి అని. నా ఎమోషన్స్‌ని నేను సాధ్యమైనంతవరకూ బయట పెట్టను. నా మనసుకు ఎంతో దగ్గరయిన అతి కొద్ది మందితో మాత్రమే నేను ఓపెన్ అవుతాను. డ్రగ్స్ ఇష్యూ అప్పుడు చాలా ఎమోషనల్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది.. పవిత్ర: ఎందుకంటే మా నాన్న ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సిగరెట్ కాలుస్తారు. దాని గురించి రాయమనండి. లేని దానికి ఇలా రిచ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు, వేరే ఏదో హౌస్ ఉంది అని మా అమ్మను ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతుంటే ఎంత బాధగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా అనేయడమేనా? పాపులార్టీ కోసం ఏదైనా రాసేయడమేనా? ఎవరేం అన్నా.. అందులో నిజం ఉందా లేదా అనేది జనం చూడాలి. (కళ్లలో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ) నేను సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టిన తర్వాత ‘మీ నాన్న ఎలాంటి వాడో నీకు తెలియదు. నువ్వు మీ నాన్నని చాలా వెనకేసుకు వస్తున్నావు. ఆయనకు చాలా అలవాట్లు ఉన్నాయి, డ్రగ్స్ తీసుకుంటాడు’ అని చాలా మెసేజ్‌లు వచ్చాయి. నేను ప్రతి దానికి సమాధానం చెప్తూనే ఉన్నాను నా ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు వచ్చిన ప్రతి మెసేజ్‌కి రిప్లై చేస్తూ ఫైట్ చేశాను. ఆకాశ్: పవిత్ర నాకు అప్పటిదాకా ఒకలా తెలుసు. ఆ తర్వాతే నేను పవిత్ర ఏంటో రియలైజ్ అయ్యాను. తన కెపాసిటీ ఏంటో నాకు ఆ రోజు తెలిసింది. పవిత్రను అప్రిషియేట్ చేస్తూ, నాకు చాలా కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను డాడీతోనే ఉన్నాను. ఆ టైమ్‌లో పవిత్ర డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. పవిత్రకు చాలా మంది అన్నలున్నట్లే ఆకాశ్‌కి చాలామంది చెల్లెళ్లున్నారా? ఆకాశ్: నాకు ముగ్గురు చెల్లెళ్లున్నారు. మా సాయిరామ్ బాబాయి కూతుళ్లు అనన్య, రెహన్యా ఉన్నారు. వాళ్లతో పాటు చాలా మంది నన్ను అన్నయ్య అంటారు. పవిత్ర: అన్నయ్య అంటారు కానీ రాఖీ కట్టరు.. కట్టించుకోడు (నవ్వుతూ). అన్నా, చెల్లెళ్ల మీద ఓ భారీ ఎమోషనల్ సినిమా వచ్చిందనుకుందాం. ఏం చేస్తారు? ఆకాశ్: ఏమో స్క్రిప్ట్ నచ్చితే అప్పుడు ఆలోచిద్దాం. పవిత్ర: అన్నయ్య ఏ పాత్ర ఇచ్చినా బాగా చేస్తాడు. అందులో డౌటే లేదు. పవిత్ర ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? ఆకాశ్: కాంప్లిమెంట్ అంటూ ఏం లేదు. అమ్మకి , చెల్లెలికి స్పెషల్‌గా ‘మెహబూబా’ షో వేశాం. సినిమా అయిపోగానే అమ్మ నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. చెల్లి తన ఫ్రెండ్స్ అందరితో ఫుల్ పార్టీ చేసుకుంది. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే నీ డ్రీమ్ రోల్? ఆకాశ్: ఒక్కటనేం లేదు. చాలా ఉన్నాయి. జేమ్స్‌బాండ్, కౌబాయ్ ఇలా చాలెంజింగ్ పాత్రలు ఏవైనా సరే చేయాలని ఉంది. అన్ని జోనర్స్ టచ్ చేయాలనేది నా డ్రీమ్. నాన్న పెద్ద డైరెక్టర్, అన్నయ్య యాక్టర్. చూడటానికి అందంగా ఉంటానుగా ఎందుకు యాక్టింగ్ చేయకూడదు అని ఎప్పుడైనా అనిపించిందా? పవిత్ర: ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు. ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. ప్రొడక్షన్లో సక్సెస్ అయ్యాక అప్పటికి ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తా. ఎందుకు చేస్తాను అంటున్నానంటే ‘మెహబూబా’ రిలీజ్ తర్వాత నాకు రెండు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. అమ్మను దాదాపు రెండు వారాలు బతిమాలారు.. ఆ సినిమా టీమ్ వాళ్లు. అన్నయ్య గురించి బాగా ఎమోషనల్‌గా ఫీలయిన సందర్భం ఏదైనా? పవిత్ర: అన్నయ్య మొదటి సినిమా ఓపెనింగ్ కులు మనాలీలో జరిగింది. ఆ ఓపెనింగ్‌కి వెళ్లాలనుకున్నాను. కానీ నాకు కాలేజ్ ఉంది. అయినా సరే వెళ్లాలనుకుని అమ్మను అడిగాను. అక్కడ వెదర్ బాగా లేదని నాన్న వద్దన్నారు. అలా సినిమా మొదటి రోజున అన్నయ్యను మిస్సయినందకు బాధ అనిపించింది. ‘మెహబూబా’ మూవీ చేద్దామని నాన్న చెప్పగానే ఆకాశ్ ఎంత కష్టపడ్డాడో నాకే తెలుసు. ఆ సినిమా స్టార్టవ్వటానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందే తను బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని, ఇంట్లోనే డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ దగ్గర వీటి గురించి డిస్కస్ చే సేవాడు. అందుకే ఫస్ట్ డే షూటింగ్లో తన ఎగై్జట్‌మెంట్ చూడాలనుకున్నాను. అది జరగనందుకు కొంచెం ఎమోషన్ అయ్యాను. ఫైనల్లీ.. మా సమక్షంలో మీ అన్నయ్యకు రాఖీ కట్టండి.. ఆకాశ్: మరి కాళ్ల మీద కూడా పడాలి. అలా ఎందుకు అడిగానంటే రాఖీ కడుతుంది కానీ కాళ్ల మీద పడదు. పవిత్ర: ఈసారి నీ ఆశ నెరవేరుతుంది అంటూ అన్నకు రాఖీ కట్టి, కాళ్ల మీద పడిన పవిత్రను తనదైన స్టైల్లో ఆకాశ్ సరదాగా ఆశీర్వదించాడు. -
డెంగీతో చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన
నల్లకుంట: డెంగీ జ్వరంతో బాధపడుతున్న చిన్నారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తమ పాప మృతికి వైద్యులే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. ఆస్పత్రి వర్గాలు, బాధితుల కథనం ప్రకారం... బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంటకు చెందిన ఎం.అశోక్, కోటమ్మ దంపతులు తమ కుమార్తె పవిత్ర (ఏడాదిన్నర)కు తీవ్రమైన జ్వరం రావటంతో ఈ నెల 24న విద్యానగర్ ఓయూ రోడ్డులో గల ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు డెంగీ జ్వరంగా నిర్ధారించి ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స చేశారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడక పోవడంతో వైద్యులు ఎల్లో బ్లడ్ ఎక్కించాలని తల్లిదండ్రులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించటంతో సోమవారం సాయంత్రం చిన్నారికి రక్తం ఎక్కించారు. రాత్రి నుంచి చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చివరికి ఆస్పత్రి యాజమాన్యంతో రాజీ కుదరటంతో చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. -
కిలాడి ‘లేడీ’ కోసం పట్టు
కేకే.నగర్: ఏడుగురిని మోసం చేసిన కిలాడి పెళ్లి కూతురు పవిత్రతో పెళ్లి జరిపించాలని ఎనిమిదో పెళ్లి కొడుకు కనకరాజ్ పట్టుపట్టడంతో పోలీసులు అవాక్కయ్యారు. 43 ఏళ్ల కనకరాజ్‌కు పవిత్ర అలియాస్ మాలతితో ఉడుమలై పేటలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ సమయంలో పవిత్రకు ఖరీదైన పట్టుచీర, 20 సవర్ల నగలను పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవిత్రను పోలీసులు పట్టుకుని వివరాలు బట్టబయలు చేసినా కనకరాజ్ మాత్రం ఫర్వాలేదు సార్! నాకు ఆమెతో పెళ్లి అయితే చాలు అని కూల్‌గా చెప్పాడు. ఆమెను తనతో పంపమని పోలీసులను బతిమాలాడు. దీంతో పోలీసులు అతన్ని హెచ్చరించారు. ఏడుగురిని పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పారిపోయిన కిలాడి పెళ్లి కూతురు పవిత్ర ఎనిమిదవ పెళ్లికి సిద్ధం అవుతూ మొదటి భర్త కర్నన్ (38)తో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వివాహాలకు సహకరించిన బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర (32) గత నెల 27 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పవిత్రను ఉడుమలైలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బ్రోకర్ల సాయంతో ఆమె ఏడుగురిని వివాహం చేసుకుని వారితో కొన్ని రోజులు గడిపి నగలు, నగదు దోచుకుని పారిపోయేదని తెలిసింది. బ్రోకర్లు పెళ్లి కొడుకుల వద్ద పవిత్రకు తల్లిదండ్రులు లేదని ఆమెను పెంచుకున్న వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పేవారు. ఎలాగైనా పెళ్లి జరిగితే చాలని భావించే యువకులు పవిత్రకు నగలు, నగదు ముట్టచెప్పేవారు. ఈమె మోసానికి మొదటి భర్త సహకరించేవాడని తెలిసింది. సేకరించిన మొత్తంలో బ్రోకర్లకు కొంత ఇచ్చేదని..దీనికి ఆశపడిన బ్రోకర్లు పెళ్లికొడుకుల కోసం గాలించేవారని తెలుస్తోంది. కొంతమంది బ్రోకర్లు పెళ్లి కొడుకుల జాతకాలకు తగినట్లు పవిత్ర జాతకాన్ని తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే మోసపోయిన వారు ఎవరూ ఆమెపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఏడో భర్త సెల్వకుమార్ వద్ద చోరీ చేసిన నగలు, నగదును అతనికి ఇప్పించి పవిత్రను హెచ్చరించి వదిలేశారు. -
కిలాడి పెళ్లి కూతురు
కేకే.నగర్: పెళ్లి కూతురు కోసం వెతుకుతున్న ఏడుగురు యువకులను బ్రోకర్ల ద్వారా వివాహం చేసుకున్న కిలాడి యువతి నగలతో సహా పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె మొదటి భర్తను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసి నగలతో ఉడాయించిన కిలాడి కృష్ణుల గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే వారికే ఏ మాత్రం తీసిపోనంటూ నిరూపించింది పవిత్ర. పేరు మార్చుకుని బ్రోకర్ల ద్వారా ఏడుగురు యువకులను పెళ్లిచేసుకుని వారితో కొన్ని రోజులు మాత్రమే గడిపి నగలు, నగదుతో ఉడాయించింది. 8వ సారి మరో యువకుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా మొదటి భర్తతో పట్టుబడిన సంఘటన తిరుపూర్ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే...తిరుపూర్ జిల్లా తారాపురంకు సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన నటరాజ్ పశువుల వ్యాపారి. ఇతని కుమారుడు సెల్వకుమార్‌కు పెళ్లి చేయాలని పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డారు. చివరకు బ్రోకర్ ద్వారా దిండుకల్ జిల్లా పళని సమీపంలోని పొదుపట్టి గ్రామానికి చెందిన పవిత్ర (25)తో నిశ్చయం చేసి గత 2015 అక్టోబర్‌లో పెళ్లి చేశారు.ఈ క్రమంలో గత మే 27వ తేదీ తారాపురం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర 15 సవర్ల నగలతో కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పవిత్రను వెతుకుతున్న సమయంలో ఆమె మొదటి భర్త కర్ణన్ (35)తో ఉడుమలై ప్రాంతంలో అజ్ఞాతంలో తల దాచుకున్నట్లు తెలిసింది. ఆమె అసలు పేరు మారియమ్మాళ్ అని, మాలతి, పవిత్ర, ఏంజలిన్ అనే పలుపేర్లతో ఏడుగురిని మోసం చేసి వివాహం చేసుకున్నానని, మొదటి భర్త కర్ణన్, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కూతురు దొరకని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని వారితో కొన్ని నెలలు కాపురం చేసి దొరికిన నగలు, డబ్బులతో ఉడాయించడం ఆమె వృత్తిగా పెట్టుకుందని విచారణలో తెలిపింది. దీంతో ఉడుమలై బస్టాండులో నిలబడి ఉన్న పవిత్ర అలియాస్ మారియమ్మాళ్‌ను ఆమె మొదటి భర్త కర్ణన్‌ను తారాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈమె తిరువూర్ జిల్లా పల్లడం అరిమాలినగర్‌కు చెందిన సెల్వరాజ్. పళని అమ్మాల్ దంపతులకు ఒకే కూతురు. మొదటి భర్త కర్ణన్‌తో తన పేరు మాలతి అని చెప్పి ఏడో భర్త సెల్వకుమార్‌తో పవిత్ర అని చెప్పి వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి కొడుకుల వేటకు తారాపురం, ఉడుమలై, పళని, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన పెళ్లి బ్రోకర్లు తొమ్మిదిమంది బ్రోకర్లు సహాయం చేశారు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
‘పవిత్ర కేసును సీబీఐ విచారించాలి’
ముంబై: ఢిల్లీ వర్సిటీ అనుబంధ భీమ్ రావ్ అంబేద్కర్ కాలేజీ మాజీ ఉద్యోగి పవిత్ర భరద్వాజ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేపట్టాలని ముంబైలోని జేఎన్‌యూ ఢిల్లీ పూర్వ విద్యార్థులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సంస్థలు గురువారం డిమాండ్ చేశాయి. ‘ఆమె మృతి చుట్టూ అలుముకున్న పరిస్థితులను చూస్తే సీబీఐ విచారణ చేపట్టాలి. ఢిల్లీ పోలీసులు చేపట్టే దర్యాప్తుపై మాకు నమ్మకం లేద’ని ఏక్తా అనే ఎన్జీవో వ్యవస్థాపకుడు రాకేశ్ శెట్టి అన్నారు. మృతురాలికి న్యాయం చేకూర్చేందుకు, ఆమె మృతి కేసును సీబీఐ విచారణ చేపట్టేలా ఒత్తిడి తీసుకొస్తున్న ముంబై, ఢిల్లీలోని ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, అక్టోబర్ ఒకటిన 40 ఏళ్ల భరద్వాజ ఢిల్లీ సెక్రటేరియట్ ప్రాంగణంలో కిరోసిన్ పొసుకొని నిప్పంటించుకుంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరిగ్గా వారం రోజుల తర్వాత మృతి చెందింది. భీమ్రావ్ అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపల్ పలుమార్లు లైంగికంగా వేధించాడని పవిత్ర ఆరోపించడంతో ఆమెను ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగం నుంచి తప్పించారు. 2009 నుంచి ప్రిన్సిపల్‌తో పాటు ఆయన సహచరులు లైంగికంగా వేధిస్తున్నారని పలుమార్లు కేసులు కూడా నమోదుచేసింది. ఈ మేరకుఆమె రాసిన ఫిర్యాదు లేఖలను వర్సిటీ పరిపాలన యంత్రాంగం, ఢిల్లీ లెఫ్ట్నెట్ గవర్నర్లతో పాటు వివిధ సంస్థలకు పంపిచామని అకాడమీక్స్ ఫర్ అక్షన్స్ అండ్ డెవలప్మెంట్ చైర్పర్సన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఏఎన్ మిశ్రా తెలిపారు.