రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ..‘ అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా ... ఒక అడబిడ్డకి పుట్టింటి పైన ఉన్న ప్రేమ, మమకారం ను తెలిపే చిత్రం. ప్రతి ఇంట్లో ఉండే ఆడపిల్ల విలువ తెలియజేసే సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తీర్చిదిద్దాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment