కొన్ని నెలల క్రితం అభిమాని రేణుకాస్వామిని కన్నడ హీరో దర్శన్ హత్య చేయడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. దీని తర్వాత పోలీసు కేసు నమోదు కావడం.. హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా పలువురి జైలుకెళ్లడం అప్పట్లో సెన్సేషన్ అయింది. కొన్నిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో దర్శన్‌కి బెయిల్ దక్కగా.. ఇప్పుడు పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించింది. వచ్చీ రావడంతోనే ప్రియుడిపై ప్రేమ బయటపెట్టింది.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)
దర్శన్‌కు ఇప్పటికే పెళ్లయినప్పటికీ.. పవిత్ర గౌడతో రిలేషన్ ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ పవిత్రని ఇబ్బంది పెట్టాడని దర్శన్.. రేణుకాస్వామిని హత్య చేయడం మాత్రం ప్రేమకు పరాకాష్టగా నిలిచింది. తొలుత ఆరోపణలు అనుకున్నారు గానీ బలమైన సాక్ష‍్యాధారాలు ఉండటంతో కొన్నినెలల పాటు వీళ్లిద్దరూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
తాజాగా పవిత్ర గౌడ బెయిల్‌పై రిలీజైంది. వచ్చీ రావడంతోనే వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శన్ పేరుపై ప్రత్యేక పూజలు చేయించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంతోనే బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇప్పుడు దర్శన్ కోసం పబ్లిక్‌గానే పవిత్ర గౌడ ప్రేమ చూపించడం, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.
(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష‍్మి)
ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೇಸ್ನಲ್ಲಿ ಜೈಲು ಸೇರಿದ್ದ ನಟಿ ಪವಿತ್ರಗೌಡ ಬಿಡುಗಡೆಯಾಗಿದ್ದು, ವಜ್ರಮುನೇಶ್ವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತೆರಳಿದ್ದಾರೆ. ಇದೇ ವೇಳೆ ನಟ ದರ್ಶನ್ ಹೆಸರಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು.@dasadarshan#PavithraGowda #DarshanThoogudeepa #MuneshwaraTemple #Bhagya #Darshan #RenukaswamyCase #Bengaluru pic.twitter.com/NUlC9XSRyP
— NewsFirst Kannada (@NewsFirstKan) December 17, 2024
Comments
Please login to add a commentAdd a comment