రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చిట్టి పొట్టి'. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. చెల్లెలి సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీశారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకున్నాయనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: 'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ)
కథేంటి?
కిట్టు (రామ్ మిట్టకంటి) పోలీస్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్(కస్వి). ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుంటుంది. కిట్టుకి చిట్టి(పవిత్ర) అనే చెల్లి. ఆమె అంటే తనకు పంచ ప్రాణాలు. తన జోలికి ఎవరొచ్చినా వాళ్లని కొట్టేస్తుంటాడు. ఓ ఆకతాయి బ్యాచ్ ఆమె ఫొటోల్ని డీప్ ఫేక్ మార్ఫింగ్ చేస్తారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. తన చెల్లిని కాపాడుకుని కిట్టు ఆమెకు ఎలా పెళ్లి చేశాడు? చిన్న చిన్న మనస్పర్దలతో ఎప్పుడో దూరమైన మొత్త మూడు తరాల వారిని ఎలా ఒక్క చోటుకు చేర్చాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
అన్నా చెల్లెలి అనుబంధం మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సిస్టర్ సెంటి మెంట్ సినిమాకు ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న డీఫ్ ఫేక్ మార్ఫింగ్ కాన్సెప్ట్ జోడించారు. తన చెల్లి అవమానానికి గురైతే ఓ అన్న.. దాన్నుంచి ఎలా ఆమెను బటయపడేశాడు? బాధ్యుల్ని ఎలా శిక్షించాడు అనే ఎలిమెంట్‌తో ఈ సినిమా తీశారు. దర్శకుడు ఫస్టాఫ్ అంతా అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, సెకండాఫ్‌లో బంధువులు, వారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరూ ఎమోషన్‌కు గురై కంటతడి పెడతారు.
ఎవరెలా చేశారు?
రామ్ మిట్టకంటి.. ఓ అన్నగా, ఓ కొడుకుగా అలానే యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ కూడా బాగా చేశాడు. చెల్లిగా పవిత్ర కుదిరిపోయింది. హీరోయిన్ కస్వి పర్వాలేదు. మిగిలిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాసుకున్న సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. డీఫ్ ఫేక్ టెక్నాలజీ గురించి, బంధువుల గురించి బాగా చూపించారు. పాటలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment