టైటిల్: ఫియర్
నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
నిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియా
నిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేని
సంగీతం: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
విడుదల తేది: డిసెంబర్ 14, 2024
వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.
కథ ఎలా ఉందంటే..
గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్‌కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.
సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.
ఎవరెలా చేశారంటే..
లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
రేటింగ్ : 2.75/5
Comments
Please login to add a commentAdd a comment