Fear Movie
-
ఓటీటీలో సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు 'సస్పెన్స్ థ్రిల్లర్' సినిమా
వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఫియర్’ (Fear) ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ చిత్రం సడెన్‌గా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా మెప్పించిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటించారు. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది . అయితే, ఈ చిత్రం టాలీవుడ్లో గతేడాది డిసెంబర్ 14న రిలీజైంది. (ఇదీ చదవండి: చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్)ఫియర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే నేడు (జనవరి 22) ఓటీటీలో విడుదలైంది. 'అమెజాన్ ప్రైమ్'లో(Amazon Prime Video) ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఎక్కువగా థ్రిల్లర్ అంశాలతో పాటు హారర్ ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీనేజ్ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతమేరకు ఉండాలి అనే కాన్సెప్ట్‌తో ఫియర్ చిత్రాన్ని తీశారు. సినిమా కాస్త పర్వాలేదనిపించేలా ఉంటుంది. కానీ, పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేకపోయింది.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే. -
Tollywood: ‘డిసెంబర్’ రివ్యూ.. హిట్ రాలేదు ‘పుష్పా’ !
నవంబర్ మాదిరే డిసెంబర్ కూడా టాలీవుడ్‌ని నష్టాల్లో ముంచేసింది. పుష్పరాజ్ ఒక్కడే బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. మిగతావాళ్లంతా చడీచప్పుడు లేకుండా ఇయర్ ఎండ్‌ని ముగించారు.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టే పుష్ప 2 మూవీ భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టిస్తోంది. సౌత్ కంటే నార్త్‌లో ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం ఉన్న ఊపును బట్టి చూస్తే.. ఈజీగా 2000 కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించగా, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.పుష్పరాజ్ దెబ్బకి రెండు వారాల పాటు కొత్త సినిమాలేవి రిలీజ్ కాలేదు. డిసెంబర్ 15న ఫియర్ అనే మూవీ వచ్చింది. వేదిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్..ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫియర్ రిలీజ్‌కు ఒక రోజు ముందు అంటే మిస్ యూ అంటూ సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చాయి. అయితే సినిమాలో ఏదో మిస్ అయిందని ఆడియన్స్ తిరస్కరించారు. ఇక డిసెంబర్ 20న బచ్చాల మల్లితో అల్లరి నరేశ్(Allari Naresh) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విలేజ్ బ్యాగ్రౌండ్, రా అండ్ రస్టిక్ వాతావరణం.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌తో వచ్చినా..ఆడియన్స్ తిరస్కరించారు.అదే రోజు(డిసెంబర్ 20) తమిళ మూవీ విడుదల పార్ట్ 2, హాలీవుడ్ ఫిల్మ్ ముఫాసా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. విడుదల 2కు టాలీవుడ్లో సక్సెస్ టాక్ రాలేదు కానీ.. ముఫాసా మాత్రం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకు ప్లస్ అయింది. మరో కన్నడ చిత్రం యూఐ కూడా డిసెంబర్ 20వ తేదినే విడుదలైంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఫ్లాప్‌ని మూటగట్టుకుంది.ఇక ఈ ఏడాది క్రిస్మస్ పండగను టాలీవుడ్ మిస్ చేసుకుంది. ఈ పండక్కీ ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కాలేదు. పుష్ప 2 కోసమే పెద్ద సినిమాలు క్రిస్మస్ బరి నుంచి తప్పుకున్నాయి. ఈ గ్యాప్‌ని ఓ చిన్న సినిమా యూజ్ చేసుకుంది. డిసెంబర్ 25న శ్రికాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఓ చిన్న చిత్రం విడుదైంది. వెన్నెల కిశోర్ టైటిల్ రోల్లో, అనన్య నాగళ్ల, రవితేజ మహద్యం ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ డిటెక్టివ్ కథ.. తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. ఈ ఏడాది చివరి వారం (డిసెంబర్ 27) డ్రింకర్ సాయి, లీగల్లీ వీర్, వారధి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో డ్రింకర్ సాయిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ తర్వాత ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని అంటున్నారు. ఇక మిగతా సినిమాలు రిలీజ్ అయిన విషయం కూడా అంతగా తెలియదు. మొత్తంగా డిసెంబర్ కూడా టాలీవుడ్‌కు నష్టాలనే మిగిల్చాయి. ఇక ఇప్పుడు ఆశలన్నీ సంక్రాంతి సినిమాలపైనే ఉన్నాయి. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలు ఉన్నాయి. వీటిల్లో ఏది సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి. -
అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు: దర్శకురాలు హరిత
వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజైంది. ఆదివారం జరిగిన సక్సెస్‌మీట్‌లో హరిత గోగినేని మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి 30 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డులు దక్కాయి. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఒక అవార్డు గెలుచుకుంటే ఎంతో ప్రచారం దక్కుతుంది.కానీ మేం కొత్తవాళ్లం కాబట్టి ఇన్ని అవార్డ్స్ వచ్చినా ఎవరూ ఫోకస్ చేయలేదు. తెలుగు సినిమాలో ఎవరూ వాడని, యునిక్ కలర్ ΄్యాట్రన్ను మేం వాడాం. మంచి సౌండింగ్ ఉన్న థియేటర్లో ఈ సినిమా చూడండి’’ అన్నారు. ‘‘మా సినిమాను 150 థియేటర్స్‌లో రిలీజ్ చేశాం. అన్ని సెంటర్స్ నుంచిపాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది’’ అన్నారు ఏఆర్ అభి. -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: ఫియర్నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులునిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియానిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభిరచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేనిసంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూవిడుదల తేది: డిసెంబర్ 14, 2024వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.కథ ఎలా ఉందంటే..గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.ఎవరెలా చేశారంటే..లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్ : 2.75/5 -
విడుదలకు ముందే భారీగా అవార్డ్స్.. వేదిక 'ఫియర్' ట్రైలర్
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఫియర్' సినిమా నుంచి తాజాగా ట్రైలర విడుదలైంది. ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు భయాన్ని కలిగించేలా సీన్స్ ఉన్నట్లో ట్రైలర్లోనే అర్థం అవుతుంది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఈ ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వేదిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా "ఫియర్" ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ హరిత ఇప్పటికే చెప్పారు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆమె తెలిపారు. విడుదలకు ముందే పలు అవార్డ్స్‌తో తాము విజయం సాధించామని ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు. -
అవార్డులు కాదు.. ఆడియన్స్‌కి నచ్చాలి : డైరెక్టర్ హరిత గోగినేని
‘నాకు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను. బుక్స్ చదివే అలవాటు ఉంది. కొన్ని కథలు రాసుకున్నాను. క్రమంగా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మూడేళ్ల క్రితం ‘ఫియర్’ సినిమా ఆలోచన మొదలైంది. అయితే అప్పుడు లక్కీ లక్ష్మణ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. అది కంప్లీట్ అయ్యాక పూర్తిగా ఈ సినిమా మీదే దృష్టి పెట్టాం.అందరికి నచ్చేలా ఈ సినిమాని తెరకెక్కించాం అన్నారు’ దర్శకురాలు డా. హరిత గోగినేని. ఆమె దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ఫియర్’. వేదిక లీడ్ రోల్లో నటించగా.. అరవింద్ కృష్ణ ఓ ప్రత్యేక పాత్ర పోషించాడు. విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ గెలుచుకున్న ఈ మూవీ.. డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హరిత గోగినేని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా "ఫియర్" ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ మా సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది.→ వేదిక కంటే ముందు మరికొందరు హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యాం. అయితే వాళ్ల డేట్స్ కోసం ఏడాది పాటు ఆగాలని చెప్పారు. అంత టైమ్ వెయిట్ చేయడం ఇష్టం లేక కొన్నిఆప్షన్స్ చూశాం. వేదిక ముని, కాంచన 3 వంటి మూవీస్ లో బాగా నటించింది. మా సబ్జెక్ట్ కు కూడా చాలా యాప్ట్ అనుకుని ఆమెను సంప్రదించాం. కథ విన్న తర్వాత వేదిక కూడా వెంటనే ఓకే చెప్పింది. నేను అనుకున్న కథలో వేదికను ఊహించుకుంటే ఆమె పర్పెక్ట్ అనిపించింది.→ సినిమా భయం గురించి కాబట్టి ఫస్ట్ టైటిల్ భయం అనే పెట్టాలనుకున్నాం. అయితే అది క్యాచీగా ఉండదని ఫియర్ అని పెట్టా. ఫియర్ అంటే అన్ని భాషలకు రీచింగ్ బాగుంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు యూనివర్సల్ కంటెంట్. అందరికీ నచ్చుతాయి. ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా గుర్తింపు పొందడానికి టైటిల్ ఒక కారణమైంది. ఫిలిం ఫెస్టివల్స్ లో ఎన్ని అవార్డ్స్ వచ్చినా మన తెలుగు ఆడియెన్స్ కు నచ్చితే ఎక్కువ సంతోషాన్నిస్తుంది.→ ఈ సినిమా మేకింగ్ పక్కా ప్లానింగ్ తో చేశాను. ఏ సీన్ ఎంత ఉండాలి ఏ షాట్ ఎంత సేపు పిక్చరైజ్ చేయాలని పక్కాగా చేశాం. 2 గంటల ఫుటేజ్ వచ్చింది. ఒక 8 నిమిషాలు ఎడిటింగ్ లో తీసేశాం. డైరెక్టర్ క్లారిటీగా ఉంటే మేకింగ్ లో ఎలాంటి వేస్టేజ్ ఉండదు. నిర్మాత మీద భారం పడదు. ఆర్టిస్టుల డేట్స్ తీసుకునేప్పుడు కూడా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తామో చెప్పి మరీ తీసుకున్నాం.→ వేదిక నటన చూసిన తర్వాత ఎంతో సంతృప్తిగా అనిపించింది. నేను అనుకున్న పాత్రను తను పర్పెక్ట్ గా పర్ ఫార్మ్ చేసింది. అరవింద్ కృష్ణ మేము అడిగిన వెంటనే క్యారెక్టర్ చిన్నదైనా చేశాడు. కథలో నిడివి తక్కువైనా తన క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది.→ అనూప్ రూబెన్స్ గారితో పనిచేయడం చాలా సులువు. ఆయన స్టార్స్ సినిమాలకు పనిచేసినా కొత్త వాళ్లతో వర్క్ చేసేందుకు ఎలాంటి ఈగో చూపించరు. "ఫియర్" మూవీలో బీజీఎం అద్భుతంగా చేశారు.→ మంచి ప్రయత్నం నిజాయితీగా చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. పెద్ద సినిమాలంటే స్టార్స్ తోనే చేయాలి. చిన్న చిత్రాలకు కంటెంట్ బాగుంటే చాలు. నాకు ఈ మూవీ మేకింగ్ టైమ్ లో థియేటర్ కు ఇలా ఉండాలి ఓటీటీకి అలా ఉండాలి అని చాలా చెప్పారు. నేను కథను ఎంత జెన్యూన్ గా రూపొందించాలో అంతే జెన్యూన్ గా చేశా. ఎవరు చెప్పినవి యాడ్ చేయలేదు.→ నవరసాల్లో అన్ని జానర్స్ కథల లైన్స్ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మంచి యాక్షన్ మూవీతో పాటు ఒక కామెడీ ఎంటర్ టైనర్ సినిమా నెక్ట్స్ ప్లాన్ చేస్తున్నాం. -
ఇంగ్లీష్ లిరిక్స్‌తో ‘ఫియర్’ టైటిల్ సాంగ్
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "ఫియర్". ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు "ఫియర్" మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా..మేఘన, నీల్ క్రితన్ ఆకట్టుకునేలా పాడారు. ఫియర్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో ఉండటం విశేషం. నాయిక వేదిక క్యారెక్టర్ ను భయాలు ఎలా చుట్టుముట్టాయి. ఆ ఫియర్ ప్రభావం ఆమె మీద ఎంతగా ఉందో చెప్పేలా ఈ పాటను డైరెక్టర్ డా. హరిత గోగినేని ఆసక్తికరంగా డిజైన్ చేశారు. -
సస్పెన్స్... థ్రిల్
వేదిక ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఫియర్’. డా. హరిత గోగినేని దర్శకత్వంలో డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని డిసెంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు.‘‘ఫియర్’ సినిమా విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది. ఓ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
షూట్ చేస్తూ ట్రామాలోకి వెళ్ళిపోయా..!
-
ఫియర్ చాలా సంతృప్తినిచ్చింది : హీరోయిన్ వేదిక
‘‘ఫియర్’ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. హరితగారికి దర్శకురాలిగా ఇది తొలి చిత్రం అని ఈ సినిమా చూసినవారెవరూ నమ్మరు. ఈ మూవీ టీజర్ చూశాక నా ఒత్తిడి పోయింది. ‘ఫియర్’లో నేను చేసిన పాత్ర చాలా సంతృప్తినిచ్చింది’’ అని వేదిక అన్నారు. హరిత గోగినేని దర్శకత్వంలో వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. (చదవండి: ఓటీటీలో 'పేకమేడలు'.. స్ట్రీమింగ్ ఎక్కడ?)ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్ర చేశారు. ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను రానా, తమిళ టీజర్‌ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్‌ను దిలీప్, హిందీ టీజర్‌ను ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ అభి మాట్లాడుతూ– ‘‘ఫియర్’తో హరిత ప్రేక్షకులను భయపెడుతుంది’’ అని తెలిపారు. ‘‘కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఈ సినిమా కథ’’ అని చె΄్పారు హరిత గోగినేని. -
భయం ఎందుకు?
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫియర్’. ఈట హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.‘‘వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘ఫియర్’. చీకటి గదిలో భయపడుతూ చూస్తున్న వేదిక స్టిల్‌తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 60కి పైగా అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ. -
సస్పెన్స్.. థ్రిల్
‘కాంచన 3, రూలర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించారు. కాగా బుధవారం (ఫిబ్రవరి 21) వేదిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘ఫియర్’. ఇందులో వేదిక క్యారెక్టర్ కొత్తగా ఉంటూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. ప్రస్తుతం ‘ఫియర్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ. ఆండ్రూ, సహ నిర్మాతలు: సుజాత రెడ్డి, సామ సురేందర్ రెడ్డి. -
Fear Movie: భయపెట్టడానికి రెడీ అవుతున్న వేదిక!
కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వేదిక. ఆమె ప్రధాన పాత్రలో ఓ సస్పెన్స్ , థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా...డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్ వేదిక మాట్లాడుతూ.. ‘ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా క్యారెక్టర్ మల్టీ డైమెన్షన్స్ తో ఉంటుంది’ అన్నారు. డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ ..‘ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుంది అనేది ఆలోచిస్తూ ఏడాదిపాటు ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ స్క్రిప్టుకు వేదిక లాంటి మంచి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ఆమెకున్న డెడికేషన్ చూస్తుంటే ఎంతో ఎంకరేజింగ్ గా ఉంది. మంచి టీమ్ నాకు దొరికింది. వీరి సహాయంతో నేను అనుకున్న స్క్రిప్ట్ తో ఇన్ టైమ్ లో సినిమా రూపొందించి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఫియర్ స్క్రిప్ట్ ను హరిత చాలా బాగా రాసుకుంది. ఆ స్క్రిప్ట్ ను యాక్సెప్ట్ చేసి హరితకు సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్’అని నిర్మాత ఏఆర్ అభి అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అరవింద్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ, డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.