హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఫియర్' సినిమా నుంచి తాజాగా ట్రైలర విడుదలైంది. ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు భయాన్ని కలిగించేలా సీన్స్ ఉన్నట్లో ట్రైలర్‌లోనే అర్థం అవుతుంది. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఈ ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.
కాంచన, రూలర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ వేదిక టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయింది. "ఫియర్" సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది.
రెగ్యులర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా "ఫియర్" ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని డైరెక్టర్ హరిత ఇప్పటికే చెప్పారు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేందుకు ఇష్టపడరు. కానీ ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆమె తెలిపారు. విడుదలకు ముందే పలు అవార్డ్స్‌తో తాము విజయం సాధించామని ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment