ఫియర్‌ చాలా సంతృప్తినిచ్చింది : హీరోయిన్‌ వేదిక | Heroine Vedhika Talks About Fear Movie | Sakshi
Sakshi News home page

ఫియర్‌ చాలా సంతృప్తినిచ్చింది : హీరోయిన్‌ వేదిక

Published Sat, Sep 21 2024 10:50 AM | Last Updated on Sat, Sep 21 2024 11:50 AM

Heroine Vedhika Talks About Fear Movie

‘‘ఫియర్‌’ సినిమా కోసం టీమ్‌ అంతా చాలా కష్టపడ్డాం. హరితగారికి దర్శకురాలిగా ఇది తొలి చిత్రం అని ఈ సినిమా చూసినవారెవరూ నమ్మరు. ఈ మూవీ టీజర్‌ చూశాక నా ఒత్తిడి పోయింది. ‘ఫియర్‌’లో నేను చేసిన పాత్ర చాలా సంతృప్తినిచ్చింది’’ అని వేదిక అన్నారు. హరిత గోగినేని దర్శకత్వంలో వేదిక లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఫియర్‌’. 

(చదవండి: ఓటీటీలో 'పేకమేడలు'.. స్ట్రీమింగ్ ఎక్కడ?)

ఈ సినిమాలో అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్ర చేశారు. ఏఆర్‌ అభి నిర్మించారు. సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను రానా, తమిళ టీజర్‌ను విజయ్‌ సేతుపతి, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్‌ను దిలీప్, హిందీ టీజర్‌ను ఇమ్రాన్‌ హష్మీ సోషల్‌ మీడియా ద్వారా రిలీజ్‌ చేశారు. 

ఈ సందర్భంగా ఏఆర్‌ అభి మాట్లాడుతూ– ‘‘ఫియర్‌’తో హరిత ప్రేక్షకులను భయపెడుతుంది’’ అని తెలిపారు. ‘‘కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఈ సినిమా కథ’’ అని చె΄్పారు హరిత గోగినేని.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement