Haritha
-
ఫియర్ చాలా సంతృప్తినిచ్చింది : హీరోయిన్ వేదిక
‘‘ఫియర్’ సినిమా కోసం టీమ్ అంతా చాలా కష్టపడ్డాం. హరితగారికి దర్శకురాలిగా ఇది తొలి చిత్రం అని ఈ సినిమా చూసినవారెవరూ నమ్మరు. ఈ మూవీ టీజర్ చూశాక నా ఒత్తిడి పోయింది. ‘ఫియర్’లో నేను చేసిన పాత్ర చాలా సంతృప్తినిచ్చింది’’ అని వేదిక అన్నారు. హరిత గోగినేని దర్శకత్వంలో వేదిక లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఫియర్’. (చదవండి: ఓటీటీలో 'పేకమేడలు'.. స్ట్రీమింగ్ ఎక్కడ?)ఈ సినిమాలో అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్ర చేశారు. ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగు టీజర్‌ను రానా, తమిళ టీజర్‌ను విజయ్ సేతుపతి, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్, మలయాళ టీజర్‌ను దిలీప్, హిందీ టీజర్‌ను ఇమ్రాన్ హష్మీ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఆర్ అభి మాట్లాడుతూ– ‘‘ఫియర్’తో హరిత ప్రేక్షకులను భయపెడుతుంది’’ అని తెలిపారు. ‘‘కొన్ని అనుకోని సందర్భాల్లో ఒక అమ్మాయి భయపడితే ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది ఈ సినిమా కథ’’ అని చె΄్పారు హరిత గోగినేని. -
మహిళా ఐఏఎస్ హరితను టార్గెట్ చేసిన టీడీపీ నేత ఆనం
సాక్షి, విజయవాడ: మహిళా ఐఏఎస్ అధికారిణిపై టీడీపీ నేత కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఐఏఎస్ అధికారిని డీ హరితను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బదిలీ చేయించారు. ఆనం ట్వీట్ చెయ్యగానే మహిళా ఐఏఎస్ హరిత బదిలీ అయ్యారు. అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో వెంటనే హరిత అవినీతి అధికారి అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ నేత ఫిర్యాదుతో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీకి బదిలీ చేశారు. నాలుగు రోజుల్లోనే మహిళా ఐఏఎస్ హరితను మూడుసార్లు బదిలీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా చేశారు హరిత. -
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్‌గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్‌తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్‌పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
Haritha-Jackie: బుల్లితెర నటి హరిత కూతురి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
స్టార్ హీరోయిన్ రవళి కెరీర్ ముగిసిపోవడానికి కారణమిదే!
సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. మా అసలు పేర్లు ఇవీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్ హీరోగా ఎస్పీ ముత్తరామన్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు. నటి హరిత దంపతులు పెళ్లి సందడితో ఫుల్ క్రేజ్ తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది. ఆ ప్రచారం వల్లే కెరీర్ నాశనం తన కెరీర్ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
నందిగామ హరిత వర్షిణి కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
-
నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురు అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను డీసీపీ మేరీ ప్రశాంతి మీడియాకు వివరించారు. విజయవాడ కేంద్రంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి కస్టమర్లపై వేధింపులకు దిగుతున్నారన్నారు. చదవండి: ‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్ హరిత కుటుంబ సభ్యులను అవమానించామని నిందితులు ఒప్పుకున్నారు. బేగంపేట్ కేంద్రంగా ఎస్ఎల్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఎవరైనా కస్టమర్లను వేధిస్తే చర్యలు తప్పవని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. విద్యార్థి హరితను దూషించి మాట్లాడటం వలనే ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. -
బుల్లితెరపై నటుడిగా అలరించబోతున్న సింగర్ మనో, ఏ సీరియల్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: అమ్మతనంలోని గొప్పతనాన్ని ఏ కళ కూడా పూర్తిగా ప్రతిబింభించలేదని ప్రముఖ సీరియల్ నటి హారిత తెలిపారు. నటిగా తనకు తల్లి, అత్త క్యారెక్టర్లే మంచి గుర్తింపునిచ్చాయని పేర్కొన్నది. జీ తెలుగు వేదికగా ఈ నెల 31వ తేదీ నుంచి ‘కళ్యాణం కమనీయం’ ధారావాహిక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నటి హారిత మాట్లాడుతూ.. కలవారి కోడలు, ముద్దమందారంతో జీ తెలుగులో మంచి అభిమానం పొందిన రెండేళ్ల తర్వాత కళ్యాణం కమనీయంలో అమ్మగా మళ్లీ వస్తుండటం సంతోషంగా ఉందని, జీ తెలుగుకు తోబుట్టువులా మారానని తెలిపింది. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. మొదటిసారి ఒక సీరియల్లో సింగర్ మనో నటిస్తున్నారని అన్నారు. ఈ ధారావాహికలో ముఖ్యతారాగణంగా మేఘన లోకేశ్, రాక్‌స్టార్‌గా మధు విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటారని అన్నారు. ఒక సినిమాకుండే విలువలతో ఈ సీరియల్ రూపొందించారని నటీ మేఘన తెలిపింది. గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న డ్రీమ్ రోల్ కళ్యాణం కమనీయంలో దొరికిందని మధు అన్నారు. -
ప్రేమ వేధింపులతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
పెనగలూరు: మండలంలోని కొండూరు పంచాయతీ గట్టువారిపల్లెకు చెందిన ఉప్పు హరిత (18) ప్రేమ వేధింపులతో ఆదివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలావున్నాయి. హరిత రాజంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే పంచాయతీ సిరివరం గ్రామానికి చెందిన ఓ యువకుడు రాజంపేటలోనే డిగ్రీ చదువుతున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ ఒకే బస్సులో కళాశాలలకు వెళ్లి వచ్చేవారు. ఆ యువకుడు ప్రతి రోజూ హరితను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్ళి చేసుకుంటానని వెంటపడేవాడు. విషయం విద్యార్థిని బంధువులకు తెలిసి తమ అమ్మాయిని వేధించవద్దని హెచ్చరించారు. అయినా అతడు వెంటపడుతుండటంతో వేధింపులు తాళలేక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు ఈశ్వరయ్య, లక్ష్మీదేవిలు జీవనోపాధికోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లి ఉన్నారు. కుమార్తె మృతి విషయాన్ని తెలుసుకొని తల్లిదండ్రులు సోమవారం స్వగ్రామాని చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. మృతిరాలి తండ్రి ఈశ్వరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హేమీభాయి తెలిపారు. -
బాలు పాట హైలైట్
అమిత్, ఇందు, సుమన్, హరిత ముఖ్య తారలుగా శ్రీకాంత్ శ్రీ అప్పలరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీమ–ప్రేమ.. మధ్యలో భామ’. చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్‌పై లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘ఈగ’ సినిమా మాకు స్ఫూర్తి. చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా ఎస్పీ బాలసుబ్రమణ్యంగారు టైటిల్ సాంగ్‌ని అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట పదికాలాలు అందర్నీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి వర్మ, కెమెరా: ఆరిఫ్ లలాని. -
సరిత అంటే చాలా ఇష్టం...
ఎ... క్క.... డ... ఎ...ప్పు...డు...‘కొత్త బంగారులోకం’ చిత్రం విడుదలైన కొత్తలో అందరి నోటా ఈ మాటే వినపడింది. చిత్రంలో వెండి తెర మీద పెదవులను కదిపినది శ్వేతాబసు ప్రసాద్ అయితే, తెరవెనుక పలికిన గొంతు హరిత. 2008లో దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల ప్రోత్సాహంతో కొత్తబంగారులోకం చిత్ర కథానాయికకు డబ్బింగ్ చెప్పి, నేటి వరకు తిరుగులేని ఆర్టిస్టుగా నిలబడిన హరితతో ‘సాక్షి’ సంభాషణ... రకుల్‌ప్రీత్‌సింగ్, శృతిహాసన్, నివేదా థామస్, తమన్నా వంటి అగ్రశ్రేణి కథానాయికలకు తన గళం అందించారు హరిత. ‘‘మా తాతగారు ఎస్. డి. బాబూరావు సినిమా రంగంలో చాలాకాలంగా ఉన్నారు. మా పిన్ని అనూరాధ డబ్బింగ్ ఆర్టిస్టు, మా మామయ్య నాగేశ్వరరావు కీబోర్డు ప్లేయర్. ఇంట్లో అందరూ సినిమా పరిశ్రమ వారే’’ అని చెబుతున్న హరిత... పిన్ని అనూరాధతో కలిసి చిన్నతనం నుంచే డబ్బింగ్ స్టూడియోలకి వెళ్లి, అక్కడ ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే, చిన్న చిన్న పిల్లలకు డబ్బింగ్ చెప్పించారు. కాలేజీలో బికామ్ చదువుతూ, సరదాగా పార్ట్‌టైమ్ జాబ్లాగ, ఖాళీగా ఉన్నప్పుడు డబ్బింగ్ చెప్పేవారు హరిత.‘‘కొత్తబంగారులోకం చిత్రంలో చెప్పిన తరవాత అందరిలోనూ గుర్తింపు వచ్చింది. చాలా బాగా చెప్పానని అందరూ మెచ్చుకోవడంతో డబ్బింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నాను’’ అంటూ తన కెరీర్ గురించి వివరించారు హరిత.ఈ చిత్రానికి ముందు డబ్బింగ్ సరదాగా చెప్పినప్పటికీ, ఈ చిత్రం తరవాతే పూర్తిస్థాయి డబ్బింగ్ కళాకారిణిగా మారారు. తండ్రిది తంజావూరు, తల్లి ఆంధ్రకు చెందినవారు. చెన్నైలో సెటిల్ అయ్యారు. అనుకోకుండా హైదరాబాద్‌కి రావడంతో తన జీవితం కూడా టర్న్ అయ్యింది అంటారు హరిత. ‘‘ముందుగా నేనేమీ డబ్బింగ్ ఆర్టిస్టుని కావాలని నిశ్చయించుకోలేదు. పెద్దల ప్రోత్సాహంతో ఈ రంగంలో స్థిరపడిపోయాను. ఇంట్లో అందరూ నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. ఇండస్ట్రీ కూడా అవసరం వచ్చినప్పుడు నాకు అండగా నిలిచింది. మా వారు రఘుపతి యాడ్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ఆయన ప్రాజెక్టులలో ఆయన బిజీగా ఉంటారు’’ అంటూ కుటుంబం గురించి వివరించారు హరిత. ఇప్పటి వరకు సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు హరిత. రెగ్యులర్‌గా శ్వేతా బసుకి చెప్పారు. కిక్ సినిమా నుంచి ఇలియానాకి చెప్పడం ప్రారంభించారు. జులాయి, దేవుడుచేసిన మనుషులు, సలీం,.. చివరి సినిమా దాకా చెప్పారు. ఝుమ్మంది నాదంలో తాప్సీకి కూడా చెప్పారు. ఇంకా... శృతిహాసన్‌కి, రకుల్, తమన్నా, రాశీఖన్నా, నివేదా థామస్..లకు కూడా చెప్పిన హరిత డబ్బింగ్ విధానం గురించి చిన్న చిన్న విషయాలు వివరించారు.‘‘మాకు ముందుగా వాయిస్ టెస్ట్ జరుగుతుంది. కొత్తగా వచ్చిన కథానాయికల కోసం... డబ్బింగ్‌కి సంబంధించిన ఇన్‌చార్జ్‌లు మమ్మల్ని అంటే డబ్బింగ్ ఆర్టిస్టులని వాయిస్ టెస్ట్‌కి పిలుస్తారు. మాలో ఎవరి వాయిస్ సూట్ అవుతుందనేది డైరెక్టర్ నిర్ణయిస్తారు. సర్వసాధారణంగా ఒక హీరోయిన్‌కి మొదట ఎవరు చెబుతారో, ఇంక వాళ్లనే కొనసాగిస్తారు. ‘రంగస్థలం’ చిత్రంలో సమంత చేసిన కొత్త పాత్రకు రెగ్యులర్‌గా అంటే మాలాగ మోడ్రన్‌గా చెప్పే గొంతు సరిపోదు కనుక, కొత్తవారితో చెప్పించారు. మేమైనా అంతే’’ అంటున్నా వాయిస్ టెస్ట్‌కి వెళ్లి ఇంతవరకు వెనక్కి రాలేదు. తనకు సూట్ అవ్వలేదు అని తప్పితే, అక్కడిదాకా వెళ్లి వెనక్కి వచ్చినది లేదు. ‘‘మన వాయిస్ స్ట్రక్చర్‌ని బట్టే అవతల క్యారెక్టర్ని ఎన్నుకుంటారు. నేను తమన్నాకి రెగ్యులర్‌గా చెబుతుంటాను, గంగతో రాంబాబుకి చిత్రంలో తమన్నా మేల్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అంటే టామ్‌బాయ్ టైప్‌కి టామ్ బాయ్ టోన్ ఉండాలి. నేను అక్కడ ముద్దుముద్దుగా మాట్లాడితే కుదరదు. అది సూట్ అవ్వదు కనుక నేను చెప్పలేదు, ఆ తరవాత వచ్చిన అభినేత్రి, ఊసరవెల్లి చిత్రాలలో తమన్నాకు డబ్బింగ్ తానే కు నేనే చెప్పాను. బాహుబలి సమయంలో నేను మెటర్నరీ లీవ్‌లో ఉన్న కారణంగా ఆ చిత్రానికి తమన్నాకు నేను చెప్పలేదు’’ అంటూ డబ్బింగ్‌కి సంబంధించిన అనేక అంశాలు వివరించారు హరిత.కొన్నిసార్లు పైలెట్‌లో వేరే రకంగా ఉంటుంది. డబ్బింగ్‌కి వచ్చేసరికి మార్చేస్తారు. లిప్కి తగ్గట్టుగా చెప్పడం ఇబ్బందిగానే ఉంటుంది. మామూలు డైలాగులు పరవాలేదు. ఎమోషనల్ అయితే కష్టంగా ఉంటుంది. డబ్బింగ్ దగ్గర కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు. దర్శకుడికి కావలసినట్టు వచ్చేవరకు మళ్లీమళ్లీ డైలాగులు చెప్పిస్తారు. ‘‘ఎక్కడా పాడవ్వకుండా రావడానికి ఒక్కోసారి ఇబ్బంది అనిపిస్తుంది. ఒక్కోసారి కథానాయికలు తెలుగురానివారు డైలాగులు చెప్పకుండా, ఏబిసిడిలు కూడా అంటుంటారు. అటువంటి సందర్భాలలో డబ్బింగు ఆర్టిస్టులు, పెదాలకు సింక్ అయ్యేలా ఎంతో జాగ్రత్తగా చెప్పాలి’’ అంటున్న హరిత డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ టైమ్ తీసుకోరు. పని మీదే తన ధ్యాసంతా ఉండటం వల్ల, దర్శకులకు ఏం కావాలనేది త్వరగా తెలుసుకుని, త్వరగా డబ్బింగ్ చెప్పేస్తారు.‘‘నేను ఎవ్వరి దగ్గర డబ్బింగ్ ట్రయినింగు తీసుకోలేదు. డబ్బింగ్ ఇన్చార్జ్ ప్రసాద్ గారు మైక్‌ను ఎలా మేనేజ్ చేయాలో చెప్పారు. ఇప్పుడు ఇంత బాగా చెబుతున్నానంటే, అందుకు ఆయనే కారణం’’ అంటారు తన 12వ ఏటనే డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన హరిత.కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఒక్క రోజులోనే పూర్తవుతుంది. కొన్ని సినిమాలు నెల రోజులు కూడా పట్టవచ్చు. అందులో క్యారెక్టర్‌కి ఉన్న ప్రాధాన్యతని బట్టి ఉంటుంది. ‘‘ఎక్కువ రోజులు డబ్బింగ్ చెప్పిన సినిమా ‘కొత్త బంగారులోకం’. ఆ సినిమాలో నాలాగే అందరూ చాలారోజులు అంటే సుమారు నెల రోజులు చెప్పాం. దాని డబ్బింగ్ రెండు సార్లు జరిగింది. ముందర ట్రాక్లాగ, రెండోసారి ఒరిజినల్‌గా చేశారు. నా గొంతు బావుందని దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల నిశ్చయించుకుని, రెండో సారి ఒరిజినల్‌గా మళ్లీ చెప్పించారు. ‘ఎక్కడ’, ‘ఎప్పుడు’ వంటివి దగ్గరుండి జాగ్రత్తగా చెప్పించుకున్నారు. అంత కష్టపడ్డారు కనకనే అంత పేరు వచ్చిందేమో. ఆ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాం’’ అంటారు డబ్బింగ్ విషయంలో ఎవ్వరినీ అనుకరించని హరిత.‘ఎమోషనల్ సీన్, రొమాంటిక్ సీన్స్ వంటి సందర్భాలలో మాడ్యులేషన్స్ వంటివి ఆ నటికి సరిపోవాలి’ అన్నది సరిత గారిని చూసి నేర్చుకున్నానని చెబుతారు హరిత. ‘ఈ అమ్మాయి డబ్బింగ్ బాగా చెబుతుంది’ అని పేరు సంపాదించుకోవడంతో పాటు, ‘నచ్చావులే’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. ఏ క్యారెక్టర్‌కి ఎలా చెప్పాలి అనే విషయం సరిత నుంచి నేర్చుకున్నానని, పాత్రలో పాత్ర మాత్రమే కనిపించేలా డబ్బింగ్ చెప్పడం కూడా సరిత నుంచి నేర్చుకున్నట్లు చెబుతారు హరిత. శ్రీనువైట్ల, త్రివిక్రమ్, సురేందర్‌రెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణ... వంటి దర్శకులందరి అభినందనలు అందుకున్నారు. ఇంటర్వ్యూ: వైజయంతి ఫొటోలు: శివ మల్లాల హరిత డబ్బింగ్ చెప్పిన కొన్ని చిత్రాలు... ధృవ, బ్రూస్లీ, పండగ చేస్కో,జయ జానకి నాయకా, స్పైడర్ (రకుల్‌ప్రీత్), బలుపు, రేసు గుర్రం, శ్రీమంతుడు, కాటమరాయుడు (శృతిహాసన్), జంటిల్మన్, నిన్ను కోరి (నివేదా థామస్), మరికొన్ని చిత్రాలు. డైలాగులు కొత్త బంగారు లోకం ఎ...క్క....డ... ఎ...ప్పు...డు... శ్రీమంతుడు మా ఊరు నాకు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి కదా, లావైపోతాను జులాయి నా లైఫ్‌లో బాయ్ లేడు, లైఫు లేదు రేసు గుర్రం డ్యాన్స్ చేస్తున్నాను, ఇన్సైడ్... లోపల ఫీలవుతున్నాను. -
కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా..
‘‘అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడడం మంచి పద్ధతి కాదు. కొడుకైనా, కూతురైనా ఒక్కటే. కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. వారి అభిరుచిని గుర్తించి సహకరిస్తే విజయాలు సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది’’ – నెల్లూరు ఆర్డీఓ హరిత మనోగతం నెల్లూరు(వేదాయపాళెం): మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, చిన్నతనం నుంచే ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతూ కష్టపడి చదివి గ్రూప్ – 1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌గా విజయం సాధించారు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువుకు చెందిన డీ హరిత. కడపలో ఆర్డీఓగా తొలిసారి ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం జిల్లాకు బదిలీ పై వచ్చారు. డ్వామా పీడీగా, నెల్లూరు ఆర్డీఓగా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ పలువురి మ న్ననలు పొందుతున్నారు. ఆర్డీఓ హరిత మహిళా సాధికారత సాధన కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎప్పటికైనా ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో విధి నిర్వహణలోనూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు సాక్షితో శనివారం తన మనోగతాన్ని పంచుకున్నారు. ప్ర: జీవితాశయంలో మీకు ఆదర్శప్రాయులు ఎవరు..? జ:మా నాన్నే నాకు ఆదర్శం. చిన్నతనం నుంచి ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన ఆశయం. అయన ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నా. మా నాన్న విశ్రాంత తహసీల్దార్ దామలచెరువు చిన్నయ్య, తల్లి నిర్మల న్యాయవాది. ప్ర: మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది..? జ: తిరుపతిలోని లిటిల్ ఏంజెల్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు, తిరుపతిలోని క్యాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఎంటెక్ చదివా. ప్ర: మీ కుటుంబ నేపథ్యం..? జ:అన్నయ్య హరికిశోర్ టాటా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండగా, తమ్ముడు హరికృష్ణ వ్యాపారంలో స్థిరపడ్డారు. 2012లో పెద్దల సమక్షంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా. భర్త అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాపారంలో రాణిస్తున్నారు. కుమారుడి పేరు ప్రణయ్ కార్తికేయ. ప్ర: అందుకున్న అవార్డులు, సత్కారాలు..? జ: తొలుత కడప ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన 2013– 14లో ఉత్తమ అధికారి గా అవార్డును అందుకున్నా. నెల్లూరులో డ్వామా పీడీగా చేస్తున్న సమయంలో పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విజయవాడలో ప్రశంసపత్రాన్ని పొందా. నెల్లూరు ఆర్డీఓ గా ఇటీవల జన్మభూమి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు మంత్రి నారాయణ చేతుల మీదుగా అవార్డును అందుకున్నా. ప్ర: మహిళా సాధికారతపై మీ అభిప్రాయం..? జ: కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలకు ఆయా రంగాల అభిరుచికి తగ్గట్లుగా కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మంచి విజయాలను సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడటం మంచి పద్ధతి కాదు. కొడుకైనా.. కూతురైనా ఒక్కటే. మహిళలు ఉద్యోగాలు చేయకూడదనే భావన కొన్ని కుటుంబాల్లో నేటికీ ఉంది. ఇది పోవాలి. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్ర: నెల్లూరు ఆర్డీఓగా మహిళల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు..? జ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను అన్ని వర్గాల మహిళలకు సక్రమంగా అందేలా చూస్తున్నా. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతు కృషిని ఎల్లవేళలా అందిస్తా. ప్ర: కుటుంబంలో ప్రోత్సాహం ఎలా ఉంది..? జ: భర్త అనిల్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహం ఎంతో బాగుంది. దీనికి తోడు మా అత్తగారింట్లో ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేందుకు ఎంతగానో ప్రో త్సాహం అందిస్తున్నారు. -
విధి పరీక్షకు ఫలితం బలవన్మరణం
చోడవరం: భర్తచనిపోయినా తన రెక్కల కష్టం పై..పిల్లలు కష్టమెరగకుండా పెంచిన తల్లి ఆశలు అడియాసలయ్యాయి...అన్నదమ్ములు పెంచుకున్న అభిమానం ఆవిరైంది... విధి పెట్టిన పరీక్షలో ఆ కుటుం బం తమ గారాల పట్టిని కోల్పోయింది. ఎంతో చలా కీగా ఉంటూ, సరదాగా తిరిగే ఆ యువతి అనుకున్న లక్ష్యం మేరకు పరీక్షలు సరిగా రాయలేకపోయానన్న కారణంతో ఆత్మహత్య చేసుకుని, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. చెల్లెలు బలవన్మరణం చెందడంతో అన్నయ్యలిద్దరి గుండెలుపగిలేలా రోదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న రుప్ప లక్ష్మీనర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలు చిన్నప్పుడే భర్త చనిపోవడంతో అన్నీ తానై నలుగురు పిల్లల్నీ పెంచింది. ఓ కుమార్తెకు వివాహం చేసింది. వివాహం జరిగిన కుమార్తె కూడా చోడవరంలోనే ఇదే వీధిలో నివాసం ఉంటోంది. చిన్నకూతురు హరిత (18) చోడవరంలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు మోటారు ఫీల్డులో పనిచేస్తున్నారు. హరిత ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఒకటి తప్పా మిగతా పరీక్షలన్నీ ఇప్పటికే పూర్తయిపోయాయి. అయితే అనుకున్న లక్ష్యం మేర పరీక్షలు రాయలేకపోయానని మనస్తాపానికి గురైన హరిత, పక్కనే ఉన్న తన అక్క ఇంటికి సోమవా రం వెళ్లింది. పరీక్షల గురించి అక్క లీలావాణితో చెప్పి బాధపడింది. పర్వాలేదులే మంచి మార్కుల కోసం మళ్లీ రాద్దువుగాని అని సర్ది చెప్పి, తన పరీక్షల నిమిత్తం ఆమె శ్రీకాకుళం వెళ్లింది. అయినా బాధ నుంచి బయటపడని హరిత, అక్క ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడాన్ని చూసి సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్క ఇంటికి వెళ్లిన కూతురు రాత్రయినా రాకపోయే సరికి చూసిరమ్మని తన పెద్ద మనుమరాలిని హరిత తల్లి పంపింది. ఇంటికి వెళ్లిచూడగా అప్పటికే గదిలో ఫ్యాన్‌కు వేలాడుతున్న హరితను చూసి భయపడి మావయ్యలకు తెలిపింది. వారు వచ్చి వేలాడుతున్న చెల్లెలను కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో చోడవరం ఎస్ఐ మల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అందరితో ఎంతో సరదాగా ఉండే హరిత మృతిచెందిందని తెలియడంతో తోటి విద్యార్థులు, స్థానికులు ఇక్కడుకు వచ్చారు. వారంతా శోకసంద్రంలో మునిగారు. -
ధాన్యం కొనుగోలుకు 75 కేంద్రాలు
ఏర్పాట్లపై సమీక్షించిన జేసీ హరిత వరంగల్ రూరల్ : వరంగల్ రూరల్ జిల్లాలో ఈ ఖరీఫ్‌లో రైతు లు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 75 కేంద్రా లు ఏర్పాటు చేయనున్నట్లు జేసీ ఎం.హరిత తెలిపారు. ఖరీఫ్ కొనుగోళ్లపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. వ్యవసాయశాఖ, పౌర సరఫరాలశాఖ, డీఆర్డీఏ అధికారులు హాజరైన ఈ సమావేశంలో జేసీ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 75 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందు లో 18 కేంద్రాలు డీఆర్డీఏ-ఐకేపీ ద్వారా ఏర్పాటు చేయనుండ గా, మిగతావి పీఏసీఎస్‌లు, సివిల్ సప్లై శాఖ ద్వారా ఏర్పాటుచేయించాలన్నారు. ఏ-రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ రకానికి రూ.1,470 మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గన్నీ బ్యాగులు, లారీలు, మినీవాహనాలు, ట్రాక్టర్లు, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు, తూకానికి కాంటాలు సమకూర్చుకోవాలని సూచించారు. కాగా, జిల్లాలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తామని జేసీ తెలిపారు. డీఆర్డీఏ పీడీ వై.శేఖర్‌రెడ్డి, జేడీఏ ఉష, డీఎస్ఓ ఎస్డబ్ల్యూ.పీటర్ పాల్గొన్నారు. -
భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది
నంద్యాల: తాను లేని సమయంలో తన భర్త మరో మహిళతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండగా... అతగాడ్ని భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... డాక్టర్ రాఘవరెడ్డి గతంలో తన దగ్గరకు వచ్చిన ఓ మహిళా రోగితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అప్పటి నుంచి వారి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం డాక్టర్ తన ఇంట్లోనే ఆమెతో సన్నిహితంగా ఉండగా గమనించిన భార్య హరిత బయటి నుంచి తలుపుకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పాము కాటుతో చిన్నారి మృతి
గార: స్నేహితులతో కలసి ఆడుకుంటున్న వేళ ఓ నాగుపాము కాటువేసి ఐదేళ్ల చిన్నారిని బలితీసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీపురం పంచాయతీ పరిధిలోని దువ్వుపేటలో జరిగింది. బాకి హరిత ఆదివారం అంగన్వాడీ స్కూల్‌కు సెలవు కావడంతో స్నేహితురాళ్లతో కలసి మధ్యాహ్నం గ్రామం సమీపంలోని కల్వర్టుపై కూర్చుంది. కింద కాలువలో నీటి ధార వెళుతుంటే కాళ్లూపుతూ హరిత ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ నాగుపాము హరిత కాలుపై కాటు వేసింది. ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు శ్రీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మృతి చెందింది. -
పూర్వ విద్యార్థి సమ్మేళనం
గోపాలం హడావుడిగా ఎక్కి ఊపిరి పీల్చుకునేసరికి రైలు కదలనే కదిలింది. ‘‘డాడీ.... తిరిగొచ్చేప్పుడు మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ గ్రూప్ ఫొటో తేవాలి. నా ప్రాజెక్ట్‌కి కావాలి. మా టీచర్‌కి చెప్పేశాను’’ బయలుదేరేముందు గేటు దగ్గర మళ్ళీ చెప్పింది అతని పదేళ్ళ కూతురు హరిత. ‘‘బోల్డుమంది వస్తున్నారు, మురళి దగ్గరైనా కచ్చితంగా దొరుకుతుంది. తప్పక తెస్తా’’ కూతురికి మాటిచ్చి స్టేషన్‌కి కారెక్కాడు గోపాలం. ఆ రాత్రి రైల్లో ఏసీ బోగీలో పడుకున్న గోపాలాన్ని చల్లదనం కంటే ఉద్వేగం ఎక్కువగా ఆవరించింది. అతను చిన్నతనంలో చదువుకున్న ఆ హైస్కూలు, ఆ ఊరు, ఆనాటి స్నేహితులు, అప్పటి సంఘటనలూ దృశ్యమాలికలుగా అతని మనోఫలకంపైన దర్శనమిస్తున్నాయి. చాలాయేళ్ళుగా అతనావూరు వెళ్ళలేదు. ఇప్పుడు చాలామంది బాల్యస్నేహితుల్ని కలవబోతున్నాడు. ముఖ్యంగా మురళిని, హరిణిని. ‘మురళి తనకు మ్యాథ్స్ నేర్పించిన జీనియస్. అన్నింటిలో ఫస్టే. వాళ్ళ నాన్న సున్నపుబట్టీలో పనిచేసేవాడు. వాడికి అభిమానం ఎక్కువ. ఎవరి సహాయం ఆశించేవాడు కాదు. ఇప్పుడు బహుశా ఫారిన్లో పెద్ద పొజిషన్లోనే ఉంటాడు. వాడే పదిమందికి పెట్టేవాడయ్యుంటాడు. తనని గుర్తుపడతాడో లేదో’. గోపాలం చిన్నగా నవ్వుకుని బెర్తు మీద అటువైపునకు తిరిగాడు. ‘పాతికేళ్ళ తరువాత మళ్ళీ ‘హరిణి’ని చూడబోతున్నాను’... అన్న గాఢమైన భావన అతని మనస్సుని ఆషాఢ మేఘంలా కమ్ముకుంది. అప్పుడు స్కూల్లో ఆమెను మౌనంగా ఇష్టపడేవాడు. హరిణి కొంచెం బొద్దుగా ఉన్నా నాజూకనిపించేది. ఒత్తై జుట్టుతో నుదుటన ముంగుర్లతో... మెరుస్తున్న కళ్ళతో, ఆరోగ్యంగా, అందంగా ఉండేది. ఆ ఊరు వదిలి వచ్చేసినా ఆమె అతని ఊహలలో రహస్యంగా పెరిగి కాలేజీ రోజుల్లో చదివిన భావకవిత్వం ప్రభావంతో యవ్వన ఊర్వశి రూపం దాల్చి అతని మనసులో నిలిచిపోయింది. గ్రూప్ ఫొటో పోయినప్పుడు అతని ఊహలకు మూలాధారం పోయి చాలా దిగులుపడ్డాడు. ‘ఇంతకూ రేపు హరిణి వస్తుందా’ అనే ప్రశ్న అతని నిద్రను రానివ్వడంలేదు. ఠి ఠి ఠి స్కూల్లో పూర్వ విద్యార్థి సమ్మేళనం గొప్పగా జరుగుతోంది. సమ్మేళనం ఏర్పాటు చేసిన స్థానిక పూర్వ విద్యార్థులు అప్పటి తమ లీడర్ శంకరయ్య ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చూసుకుంటున్నారు. సమావేశానికి స్కూలు మధ్యలో స్టేజి ముందు పెద్ద షామియానా వేశారు. స్టేజి వెనుక భోజనశాల పెట్టారు. అంతా తోరణాలు, అరటి పిలకలు, కొబ్బరాకుల్తో కళకళ్లాడుతోంది. వచ్చిన పూర్వ విద్యార్థులంతా పెళ్ళిళ్ళై, స్కూలుకెళ్లే పిల్లాజెల్లాను కలిగి మధ్య వయసులో ఉన్నారు. కళ్ళజోళ్ళు, నెరస్తున్న వెంట్రుకలు, బట్టతలలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. అందరూ చిన్నా పెద్దా రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు. అప్పట్లో కష్టపడి చదువుతారన్న పేరున్న వాళ్ళల్లో చాలామంది అర్ధాంతరంగా చదువుముగించి చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉండడం గోపాలానికి ఆశ్చర్యం కలిగించింది. ఆడా మగా కోలాహలంగా అప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. వాళ్ళ రూపాల్లో కాలం తెచ్చిన మార్పుల్ని చూసి అబ్బురపడి తబ్బిబ్బవుతున్నారు. గత స్మృతులు ఆనందంగా గుర్తుకు తెచ్చుకుని కేరింతలు కొడుతున్నారు. ఆ రోజుల్లో గోపాలంతో సన్నిహితంగా ఉండిన శ్రీకాంత్, రవీంద్ర, అనిల్, గాయత్రి, సౌమ్యలాంటి వాళ్ళు కొందరొచ్చారు. వాళ్ళంతా పెద్ద నగరాల్లో పెద్ద హోదాల్లో పని చేస్తున్నారు. అనిల్ లండన్ నుంచి వచ్చాడు. సౌమ్య ఏకంగా న్యూయార్క్ నుంచే వచ్చింది. ఒకరిద్దరు విదేశాల్లో ఉన్న వాళ్ళు సందేశాలు పంపారు. వీళ్ళందర్నీ చూసి గోపాలం ఉత్సాహం ఉరకలు వేసింది. అప్పటి టీచర్లంతా రిటైరయ్యారు. ఊర్లో ఉన్నవాళ్లలో చాలామందిని నిర్వాహకులు తీసుకొచ్చారు. పూర్వవిద్యార్థులంతా గుంపులుగా వాళ్ల చుట్టూ చేరి వినయంగా, సరదాగా మాట్లాడుతున్నారు. కొంటెగా అప్పటి వాళ్ల పోకడల్ని అనుకరిస్తూ వాళ్లని నవ్విస్తున్నారు. అందరూ గుంపులుగా ఆవరణంతా, క్లాసురూముల్లోనూ తిరిగారు. ఆనాటి స్కూలు తోట స్థానంలో కొత్త బిల్డింగు కట్టారు. బావి పూడిపోయింది. ఎర్రసుంకేసుల, బాగి, రావి, రామబాణం చెట్లు లేవు. మర్రి మాత్రం పెద్దదై ఊడలుదిగివుంది. ఆనాటి పూలచెట్లేవీ లేవు. గోపాలం వాచ్మాన్ చూడకుండా కనకాంబరం, బంతి, ముద్దమందారం పూలు కోసి హరిణికి ఇచ్చేవాడు. స్కూలు ముందువైపంతా షాపులొచ్చేశాయి. గేటు దగ్గర చిరుతిళ్ళమ్ముతూండే ఖాసీం, యెల్లమ్మ చచ్చిపోయారట. గంటకొట్టే వీరయ్య కూడా పోయాట్ట. సర్క్యులర్లు తెచ్చే ప్యూన్ ఎలమంద ముసలైపోయాడు. డ్రిల్లు మాస్టారులో పెద్ద మార్పేమీ లేదు. గోపాలం తమ గ్రూప్ ఫొటో గురించి అందర్నీ అడిగాడు. ఎవరిదగ్గరా దొరకలేదు. మురళి రాలేదు. అతను ఎక్కడున్నాడో ఎవరూ చెప్పలేకపోయారు. తన ‘పాతవూరి’ ఖోఖో టీము మిత్రులు రాజు, ఒమర్, దాసు, జాన్, శీనుగాడు, వాడి చెల్లెలు గంగ, ఇంకా గౌరి ఊర్లో ఉండికూడా రాలేదుట. ఎవరితో మాట్లాడుతూన్నా గోపాలం కళ్ళు ఒకవైపు హరిణి కోసం వెదుకుతూనే ఉన్నాయి. గోపాలం ఒక బృందంలో చేరి సరదాగా మాట్లాడుతూండగా కొంతమంది ఆడవాళ్ళు అక్కడికొచ్చారు. ‘‘అప్పట్లో ఎప్పుడూ నీతో ఒక అమ్మాయి ఉండేది చూడు...’’ అని శశిని విడిగా అడగబోయాడు గోపాలం ఇక ఉండలేక. శశి, హరిణి అప్పట్లో ఎప్పుడూ జతగా ఉండేవాళ్ళు. ‘‘నువ్వెప్పుడూ ఆ పిల్ల చుట్టూ తిరిగేవాడివి. ఆ హరిణేనా’’ చిలిపిగా అని ‘‘అరే... వాళ్ళ పిన్ని కొడుకు పెళ్ళని యిందాకే వెళ్ళిపోయింది. అయ్యో... నీ గురించి అడిగింది కూడాను’’ అంది కొంటెగా.గోపాలం మొహం వెలవెలాబోవడం చూసి నవ్వుతూ ‘‘కంగారు పడకు... రేపు తనిక్కడే వాళ్ళ మామయ్య యింట్లో ఉంటుంది... ఇదిగో అడ్రస్సు’’ అని తన పర్సులోంచి ఓ చీటీ తీసి ఇచ్చింది. ఊపిరి పీల్చుకున్న గోపాలం ఆ చీటీ తీసుకుని విషయం మార్చి మరేదో మాట్లాడ్డం ప్రారంభించాడు. భోజనానంతరం మధ్యాహ్నం నుంచీ స్టేజిమీద కార్యక్రమాలు మొదలయ్యాయి. పూర్వం వీళ్ళకాలంలో పని చేసిన టీచర్లందరినీ స్టేజిపైన సన్మానించారు. ఆ తరువాత ఆ స్కూల్లో చదివి గొప్పవాళ్ళైన పూర్వ విద్యార్థులను విడివిడిగా పిలిచి వైభవంగా సన్మానించి వాళ్ళను పొగడ్తలతో ముంచెత్తారు. తను చదివిన స్కూల్లోనే తనకు సన్మానం జరగడంతో గోపాలం పొంగిపోయాడు. అప్పటికే ఊళ్ళోని ప్రముఖులంతా ఆహ్వానితులుగా వచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సమ్మేళనం సాయంకాలానికి బ్రహ్మాండంగా ముగిసింది. చివర్లో అందరూ సెల్‌ఫోను నంబర్లు, ఇ-మెయిల్ అడ్రసులు తీసుకుని తరచుగా కలవాలన్న ఒప్పందాలతో విడిపోయారు. ఆఖర్న ముఖ్యనిర్వాహకుడైన శంకరయ్యను మురళి గురించి, ఫొటో గురించి అడిగాడు గోపాలం. ఎలాగైనా మురళి ఫోన్ నంబరు సంపాయించి ఇస్తానని మాట ఇచ్చాడు శంకరయ్య. ఠి ఠి ఠి ఆ మరుసటి రోజు పొద్దున్నే గోపాలం అడ్రసు చీటీ పట్టుకుని ఉత్సాహంగా బయలుదేరి హరిణి మామయ్య ఇల్లు సులభంగానే కనుక్కుని తలుపు తట్టాడు. తలుపు తీసిన ఓ సన్నటి నడివయసావిడకి తనెవరో చెప్పి ‘‘అప్పటి గ్రూప్ ఫొటో కోసం అందరి తరపున వచ్చా’’నని చెప్పాడు. జబ్బు మనిషిలా పాలిపోయినట్టుగా ఉన్న ఆవిడ అతన్ని అభిమానంగా చూసి, చిన్నగా నవ్వి ‘‘వొక్క నిమిషం కూర్చోండి’’ అని హాల్లోని సోఫా చూపి లోపలికెళ్ళింది. అతనికామెనెక్కడో చూసినట్టనిపించింది. ఆవిడ హరిణి అత్తయ్యేమో అనుకున్నాడు. ఇన్నేళ్ళ తరువాత హరిణిని చూడబోతున్నందుకు గోపాలం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కాస్సేపటికి ఇందాక తలుపుతీసినావిడ ఒక ప్లేట్లో బిస్కెట్లు, గ్లాసులో నీళ్ళు తెచ్చి టీపాయ్ మీద పెట్టి ‘‘తీసుకోండి... అయితే ఇప్పుడు ఎక్కడుంటున్నారు’’ అంది పాతబడిన లేత గోధుమరంగు కాటన్ చీరకొంగుని బుజాల చుట్టూ తిప్పుకుని మరో సోఫాలో కూర్చుంటూ. అవిడ గోపాలాన్ని అతని పై చదువులు, ఉద్యోగం, కుటుంబం వీటి గురించి అడిగింది. అతను బిస్కట్లు కొరుకుతూ ఓపికగా అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. ‘‘హరిణి ఇంకా నిద్రలేవలేదా’’ అడిగాడు గోపాలం తన రిస్టు వాచీ చూసుకుంటూ. ‘‘నన్ను గుర్తుపట్టలేదా... నేనే హరిణిని’’ అందామె ఆశ్చర్యంగా. గోపాలం నివ్వెరపోయాడు. కొంచెం బొద్దుగా, కొంచెం నాజూగ్గా, తెలుపుకలిపిన ఎరుపుతో, మెరుస్తూ అందంగా సంపెంగపూవులా ఉండాల్సిన మనిషి... పూర్తి వ్యతిరేకంగా... చిక్కిపోయి, ఎండిపోయి, మొహంతో సహా వడిలిపోయి అతని ఊహకు వికృతిగా ఉంది. అతని మనసులో కొలువున్న ఊర్వశి హఠాత్తుగా రాయిగా మారిపోయి అతనికి కొంతసేపు అంతా శూన్యంగా అనిపించింది. అతను హరిణిని గుర్తుపట్టలేకపోవడం అతనికే అంతు పట్టలేదు. ఆమెను గుర్తుపట్టనందుకు సంజాయిషీగా పేలవంగా నవ్వాడు. ఆమె నిర్లిప్తంగా నవ్వి నెమ్మదిగా మొదలుపెట్టి తన తండ్రి మరణంతో హఠాత్తుగా మారిన తమ కుటుంబ స్థితిగతులు, చదువు మధ్యలోనే ఆగిపోవడం, నిలకడలేని తన భర్త, వరస కాన్పులు, తన అనారోగ్యం గురించి చెప్పింది. అతను కాస్త సమాధానపడి ఆమెను ఉల్లాసపరిచే మాటలు మాట్లాడి సెలవు తీసుకుని బయటికి వచ్చి నడక సాగించాడు. కాళ్ళు ఎటు దారితీస్తే అటు వెళ్ళి ఊరంతా తిరిగాడు. తరువాత పాతవూరికెళ్ళి నిన్న రాని కొంతమంది మిత్రుల్ని కలిశాడు. వాళ్ళ ఇళ్ళు, ఆ వీధులు అప్పటికంటే ఇంకా ఇరుకయ్యాయి. గోపాలం మరోసారి స్కూలుకి వెళ్ళి లోపలికి నడిచాడు. ఆ రోజు కూడా సెలవు, అంతా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. కూలిపోతున్న గతకాలపు జ్ఞాపకాలకు కొత్త జీవం పొయ్యడం కోసం తను ఆవరణ అంతా తిరిగాడు. తరగతి గదుల్లోకెళ్ళి నాటి దృశ్యాలను పునఃసృష్టి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆనాటి అనుభవాలు మెరుపులకు మల్లే దొరికినట్టే దొరికి జారిపోతున్నాయి. తమ బాల్యపు బంగారు రోజులు ఆ గోడలు దాటి నిజంగా తమతో రాలేదని అనిపించింది. పాతబడ్డ ఆ గదులు అతనివైపు జాలిగా, నిష్టూరంగా చూసినట్టనిపించింది. అతనికి ‘నిన్నటికి ఇవాళ్టికి’ ఎంతో తేడా కనిపించింది. హోటల్ రూముకెళ్ళి ఆ మధ్యాహ్నమంతా పడుకున్నాడు. సాయంకాలం తిరుగు ప్రయాణానికి ఊరికి దూరంగా ఉన్న స్టేషన్‌కి వచ్చాడు. రైలుకి ఇంకా టైముండడంతో స్టేషన్ అవతలి వైపుకి యధాలాపంగా నడిచాడు. అక్కడి తోటల స్ధానంలో ఒక బస్తీ ఏర్పడింది. తలనొప్పిగా ఉందనిపించి ఎదురుగా కనిపించిన కాఫీ హోటల్లోకి దూరాడు. మూలన ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చుని వెయిటర్ కోసం చూస్తూ చేతిలోవున్న పత్రిక తిరగేశాడు. ‘‘యేం కావాలి సార్’’ అన్న గొంతు వినబడి పత్రికలోంచి తలపెకైత్తి వెయిటర్ వైపు చూశాడు. నీరసించిన మొహం, బూతద్దాల కళ్ళజోడు, చెదిరిన జుట్టూ, మాసిన గడ్డం, కమిలిన చామనచాయ రంగూ, చిరిగిన చొక్కా, వొంగిన సన్నటి మనిషి. అతన్ని ఎక్కడో చూసినట్టనిపించి పరీక్షగా చూశాడు. గోపాలం హఠాత్తుగా అతన్ని గుర్తుపట్టాడు. తన ఎదురుగా నుంచున్న తను తన క్లాస్మేట్, తనకి లెక్కలు నేర్పిన సన్నిహిత మిత్రుడు, ‘జీనియస్ మురళి’. గోపాలం శరీరమంతా నిస్సారమైపోయినట్టు సన్నగా వణికింది. మెదడు మొద్దుబారినట్టుగా చేష్టలుడిగి చూస్తూండిపోయాడు. మురళి గోపాలాన్ని గుర్తుపట్టలేదు. నిర్లిప్తంగా తినుబండారాల లిస్టు చదివాడు. ఇంతలో పక్కటేబుల్ వాళ్ళు మురళిని పిలిచారు. అతను అటు వెళ్ళి వాళ్ళేదో చెబితే కిచెన్‌లోకి వెళ్లాడు. గోపాలం కొంత తేరుకుని మురళి కోసం చూశాడు. ఎంతసేపటికీ రాలేదు. గోపాలం లేచి వెళ్ళి కౌంటరులో మురళి కోసం అడిగాడు. అతనికేదో ఫోను వచ్చి అర్జెంటుగా సైకిలుమీద ఇంటికెళ్ళిపోయాడని, అతనావూరికి ఆ మధ్యే వచ్చాడని, ఇల్లు తెలియదని చెప్పారు. టైము చూసుకున్నాడు, రైలు వచ్చే సమయమైంది. కాళ్ళీడుస్తూ బయటికి నడిచి స్టేషన్లోకి వెళ్ళాడు. స్టేషన్లో చివరగా ఉన్న ఒక బెంచి మీద కూర్చున్నాడు గోపాలం. కాసేపటికి రైలు పెద్ద శబ్దంతో వచ్చి ఆగింది. ఇంజన్ కవతల చీకట్లో కల్సిపోతున్న దూరపుకొండ ఊదా నీలి అంచుల్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. అతనికి ఒక్కసారిగా ప్రపంచమంతా అసందర్భంగా కనబడింది. చదువు సరిగ్గా అందక జీవితాలు కుచించుకుపోయిన పూర్వ విద్యార్థులు అన్ని వైపులా కనిపిస్తున్నారు. తనలాంటి ఏ కొద్దిమందికో మాత్రమే అన్నీ సవ్యంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. మిగతా వారి విషయంలో హేతువు కాకుండా మరేవో ఇతర కారకాలు పని చేస్తున్నట్టు మొదటిసారిగా అతనికి తోచింది. బెంచీ మీద స్తబ్దుగా కూర్చుండిపోయాడు. బయలుదేరడానికి సిద్ధపడి రైలు భీకరంగా కూత వేసింది. గోపాలం ఉలిక్కిపడి లేచి రెలైక్కి బ్రీఫ్‌కేసుని తన బెర్తు మీదుంచి తలుపు దగ్గరకొచ్చి నిలబడ్డాడు. రైలు కదిలింది. ఫ్లాట్‌ఫాం వైపు చూస్తున్న గోపాలానికి దూరం నుండి ఎవరో పరుగెత్తుకొస్తున్నట్టు కనబడింది. పరీక్షగా చూశాడు. బోగీ నెంబర్లు చూసుకుంటూ మురళి పరుగెత్తుకొస్తున్నాడు. కష్టంగా రైలు వెంబడి పరిగెడుతూ గోపాలాన్ని సమీపించి ఒక కవరుని అతని చేతిలో ఉంచి ‘‘సార్... ఈ ఫొటోని పన్నెండో నంబరు బెర్తులో నందగోపాల్కి ఇవ్వండి.... మురళి ఇచ్చాడని చెప్పండి... శంకరయ్య ఇందాకే చెప్పాడని చెప్పండి’’ అని కలగాపులగంగా చెప్పి నడుమ్మీద చేతులుంచి వగరుస్తూ నిలబడిపోయాడు. అతన్తో గోపాలం పెద్దగా అరిచి యేదో చెప్పాడు. కానీ అప్పుడే వేగం పుంజుకున్న రైలు వేసిన కూత శబ్దంలో అది ఎవరికీ వినబడలేదు. స్టేషన్‌ని వదిలేసి రైలు ముందుకెళ్తోంది. అతని చేతిలోని ‘గ్రూప్ ఫొటో’ ఉన్న కవరు గాలికి రెపరెపలాడింది. దూరంగా ఆయాసపడుతూ ఆగిపోయిన మురళి క్రమంగా చీకట్లో కల్సిపోయాడు. - తెలుగు: డాక్టర్ కె.వి.రమణ రావు -
వారి రుణం తీర్చుకుంటున్నాను!
మొదట్నుంచీ నేను కాస్త బలమైన భావాలను కలిగివుండేదాన్ని. దాంతో జీవితంలోనూ పోరాడాల్సి వచ్చేది. నాన్న నన్ను డిగ్రీతో చదువు ఆపేయమన్నారు. కానీ నేను పీజీ చేసే వరకూ పట్టు వదల్లేదు. తిండి మానేసి మరీ అనుకున్నది సాధించుకున్నాను. ఎందుకంటే, ఆడపిల్లకు కూడా ఉన్నత చదువు అవసరం అని నాకు తెలుసు కాబట్టి. చదువు పూర్తవ్వగానే పెళ్లి చేసేస్తామన్నారు. కానీ ఓ రెండేళ్లు ఉద్యోగం చేసి, కాస్త సంపాదించి వెనకేసుకున్నాక చేసుకుంటానని అన్నాను. పెళ్లి ఖర్చులకు అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టకూడదని నా ఉద్దేశం. అప్పుడూ నాన్న తప్పనిసరై ఒప్పుకున్నారు. తర్వాత పెళ్లి విషయంలోనూ నా అభిప్రాయం కచ్చితంగా చెప్పాను... కట్నం తీసుకునేవాడయితే చేసుకోను అని! అది నాన్నకు చాలా కోపం తెప్పించింది. చదవొద్దంటే చదివావు, ఇప్పుడు నీకంటే మంచి స్థాయిలో ఉన్నవాణ్ని తీసుకురావాలి, వాడేమైనా చీప్‌గా వచ్చేస్తాడా అంటూ తిట్టారు. నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడు, బాగా సంపాదిస్తున్నప్పుడు తనకే ఉపయోగం కదా, చివరికి నా పంతమే నెగ్గించుకున్నాను. కట్నం తీసుకోను అని చెప్పిన వ్యక్తినే పెళ్లాడాను. జీవితం ఆనందంగా సాగిపోసాగింది. ఒకే నగరంలో ఉండటంతో అమ్మానాన్నలు అప్పుడప్పుడూ వచ్చి చూసి పోతుండేవారు. వచ్చినప్పుడల్లా మా వారికి ఏదో ఒక కానుక తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఆయన వద్దు అనకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకలా ఖర్చు పెడుతున్నారు అని కోప్పడితే... పోనీలేమ్మా, మీకంటే మాకెవరున్నారు అనేవారు నాన్న. కానీ ఇల్లు నా పేరున రాస్తున్నాన ని నాన్న చెప్పినప్పుడు మాత్రం అనుమానం వచ్చింది నాకు. వద్దని అన్నాను. అమ్మ నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. నేను ససేమిరా అన్నాను. కానీ మా వారు మాత్రం... ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చుగా అనగానే నా అనుమానం మరింత బలపడింది. నాన్న లేనప్పుడు అమ్మని నిలదీస్తే అసలు నిజం తెలిసి వచ్చింది. మావారు కట్నం తీసుకునే నన్ను పెళ్లి చేసుకున్నారట. నాకు తెలిస్తే ఒప్పుకోనని అందరూ కలిసి నా దగ్గర నిజం దాచారట. పెళ్లయ్యాక కూడా ఆయన ఫోన్ చేసి అవీ ఇవీ అడిగేవారట. అందుకే వచ్చినప్పుడల్లా వాటిని తీసుకొచ్చి, తమ ఇష్టప్రకారం ఇస్తున్నట్టుగా నాకు చెప్పసాగారు. చివరికి ఇల్లు నా పేరు మీద రాసివ్వమని అడిగింది కూడా ఆయనేనట. కడుపు మండిపోయింది. నెలకు డెబ్భై వేలు సంపాదిస్తున్నాను. ఒక్క రూపాయి సొంతగా ఖర్చు పెట్టుకోను. జీతం తీసుకెళ్లి ఆయన చేతిలోనే పెట్టేస్తాను. అమ్మానాన్నలకు పదివేలు పంపమని మాత్రం చెబుతాను. అంతే. ఆయన బాగానే సంపాదిస్తున్నారు. ఒకరి సంపాదన ఖర్చులకు సరిపోతుంది. మరొకరిది దాచుకోవచ్చు. అలాంటప్పుడు ఆ ముసలోళ్లని పీక్కు తినడం ఎందుకు? అదే అడిగాను. అప్పుడే మావారి అసలు స్వరూపం బయటపడింది. ఏవేవో అని అవమానించారు. తట్టుకోలేకపోయాను. ఇంకా బాధపెట్టిన విషయమేమిటంటే... నేను చెప్పినట్టు ఆయన ఒక్క నెల కూడా అమ్మానాన్నలకు డబ్బు పంపలేదు. అది తెలిశాక ఇక ఆయనతో కలిసి ఉండలేనని చెప్పాను. పోతే పో, నీ అవసరం నాకు లేదన్నట్టు మాట్లాడారు. దాంతో అమ్మానాన్నల దగ్గరకు వచ్చేశాను. నా నిర్ణయం నాన్నకి నచ్చలేదు. ఇలా చేస్తాననే అన్నీ దాచిపెట్టానన్నారు. తిరిగి నా భర్త దగ్గరకు వెళ్లమన్నారు. కానీ నేను అలా చేయలేకపోయాను. ఎందుకంటే... నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి కోసం, అదీ అంత స్వార్థపరుడి కోసం నా తల్లిదండ్రుల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం చెబితే.. వాళ్లమీద నాకున్న ప్రేమను చూసి నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు నచ్చినట్టే చేయమన్నారు. ఇప్పుడు నేను వాళ్లతోనే ఉంటున్నాను. ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నాను. తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నాను. - హరిత, పుణె -
మెతుకు సీమకు హరిత హారం!
మెదక్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా మెతుకుసీమను హరిత హారంగా తీర్చిదిద్దడానికి అటవీ శాఖ అధికారులు ఉద్యుక్తులవుతున్నారు. బీడు భూములను సిరుల ముల్లెలుగా మార్చేందుకు అటవీ శాఖ సమాయత్తమవుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించి.. పాడి పంటల తెలంగాణను.. కోటి రతనాల వీణగా మార్చేందుకు మన గ్రామం.. మన ప్రణాళిక పేరుతో బృహత్ ప్రణాళికకు ఊపిరి పోస్తున్నారు. ఈ క్రమంలో ఈ యేడు మెతుకుసీమలో 47.24 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా హరిత హననంపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జాతీయ అటవీ చట్టం ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి. కాని జిల్లాలో సుమారు 21 శాతం అటవీ భూములు ఉ న్నట్లు తెలుస్తోంది. కాగా అటవీయేతర ప్రాంతాల్లో ఉన్న హరిత సంపదను పరిగణనలోకి తీసుకుంటే ఒక శాతం పెరిగే ఆస్కారముందని అధికారులు భావిస్తున్నారు. అటవీ శాఖలో సోషల్ ఫారెస్ట్రీ డీఎఫ్ఓ కార్యాలయం సంగారెడ్డిలో ఉండగా, టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్ఓ కార్యాలయాలు మెదక్ పట్టణంలో ఉన్నాయి. మెదక్ మండలం బూరుగుపల్లి, రాజ్‌పేట, శాలిపేట, మక్తభూపతిపూర్, తిమ్మానగర్, పాపన్నపేట మం డలం ఏడుపాయల, అన్నారం, నామాపూర్, తమ్మాయపల్లి, అర్కెల, చిత్రియాల్, చేగుంట మండలం వల్లూర్, నర్సాపూ ర్, నారాయణఖేడ్, రేగోడ్ తదితర ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి.ఈ యేడు వర్షాకాలంలో జిల్లావ్యాప్తంగా 47.24 లక్షల మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. సోషల్ ఫారెస్ట్రీ ద్వారా 1.59 లక్షల మొక్కలు, టెరిటోరియల్ ఫారెస్ట్రీ ద్వారా 6.9 లక్షలు, డ్వామా ద్వారా 33 లక్షలు, హర్టికల్చర్ ద్వారా 25 వేలు, ఇతర శాఖల ద్వారా 5.5 లక్షల పైచిలుకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కో క్లస్టర్ పంచాయతీలో నర్సరీల ను ఏర్పాటు చేసి ఒక్కో గ్రామంలో యేడాదికి 33 వేల చొప్పున మూడేళ్లలో లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మన గ్రామం..మన ప్రణాళికలో మొక్కల పెంపకానికి ప్రథమ ప్రాధాన్యత ఇ స్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద మరిన్ని మొ క్కలు నాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అడవులను ఆక్రమిస్తే కఠిన చర్యలు అడవులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టెరిటోరియల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ సోనిబాలదేవి హెచ్చరించారు. అడవులు నాశనం చేయకుండా బౌండరీలు ఏర్పా టు చేస్తున్నామని, ఉపగ్రహ వ్యవస్థను ఉపయోగించుకుని అటవీ సరిహద్దులు గుర్తిస్తున్నామని చెప్పారు. అడవులు ఆక్రమణకు గురైన ప్రదేశాలను గుర్తించామని తెలిపారు. వివాదంగా ఉన్న భూముల్లో అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. మొక్కలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో, చెరువు గట్లపై, రోడ్లకు ఇరువైపుల, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పచ్చని చెట్లే మానవాళి మనుగడకు ఆధారమన్న విషయాన్ని గుర్తించాలని ఆమె సూచించారు. లక్ష టేకు మొక్కలు నాటేందుకు చర్యలు తూప్రాన్: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలో ‘తెలంగాణకు హరిత హరం’ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు సోషల్ ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ విజయరాణి పేర్కొన్నారు. తూప్రాన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో లక్ష టేకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల పాటు కొనసాగేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు ఉన్నాతాధికారుల నుంచి ఆదేశాలు రానున్నాయని వివరించారు. ఇదిలా ఉంటే తూప్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామ సమీపంలోని సెంటర్ నర్సరీ నుంచి ప్రస్తుత వర్షాకాలంలో 50 వేల మొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. -
మిస్టరీ వీడని హరిత హత్య కేసు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామ శివారులోని గుట్టల్లో 2012 మార్చి 21 తెల్లవారుజామున దారుణ హత్యకు గురైన హరిత (25) కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో నిందితులను ఓ అమాత్యుడు రక్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా కేసు పురోగతి లేకపోవడంతో పోలీసుల చిత్తశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బెళుగుప్ప మండలం ఆవులదిన్నె గ్రామానికి చెందిన హరిత (25) శింగనమల మండలం మట్లగొందిలోని తన అక్క ఇంట్లో ఉండేది. ఉన్నత విద్య నిమిత్తం అక్క ఇంట చేరిన ఆమె.. ఎస్కే యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేసింది. అనంతరం నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌గా చేరింది. అక్కడ వచ్చే వేతనం తక్కువ కావడంతో ఆర్డీటీలో ఎస్టీఎల్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమెను 2012 మార్చి 18న ఇంటర్వ్యూకు పిలిచారు. దీంతో మట్లగొంది నుంచి నగరానికి వచ్చింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత నగర శివారులోని ఆర్డీటీ కార్యాలయం నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది. అప్పటికే సమయం సాయంత్రం 6.30 గంటలు కావడంతో బావ కొర్రి రాముడుకు ఫోన్ చేసి ఆలస్యానికి గల కారణాన్ని తెలియజేసింది. అలాగే ఓ అపరిచిత వ్యక్తి మీకు సన్నిహితుడినంటూ తనను పరిచయం చేసుకున్నాడని చెప్పింది. ఫోన్లో మాట్లాడిన ఆ వ్యక్తి ‘అన్నా నేను శివ. పాపను బస్సు ఎక్కించి పంపుతా’నని చెప్పాడు. అయితే.. గ్రామానికి ఎనిమిది గంటలకు చేరాల్సిన హరిత ఆర్టీసీ బస్సు వచ్చినా అందులో కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లేకపోవడంతో మార్చి 19న స్థానిక త్రీటౌన్ పోలీసులకు కొర్రి రాముడు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వచ్చేందుకు బస్సెక్కినట్లు చెప్పిన హరిత కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. మార్చి 21న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన గొర్రెల కాపరులు కాలి వున్న గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మృతదేహం హరితదేనని నిర్ధారించారు. ఆమె వద్ద హ్యాండ్ బ్యాగుతో పాటు పసుపు కొమ్మలు, సెల్‌ఫోన్ లభించాయి. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి.. ఈ ప్రాంతానికి తీసుకువచ్చి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. సెల్‌ఫోన్‌లోని కాల్ డేటా కూడా తీశారు. అయితే అందులో హంతకులకు సంబంధించిన వివరాలేవీ లభించలేదని అప్పట్లో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అత్యాచారం... ఆపై హత్య! హరితను గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై చున్నీతో ఉరివేసి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మార్చి 18 రాత్రే కడతేర్చి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో అనుమానితులను బుక్కరాయసముద్రం పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అంతలో ఓ అమాత్యుడు నిందితులకు మద్దతుగా జోక్యం చేసుకోవడంతో పోలీసులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు విషయంపై బుక్కరాయసముద్రం ఎస్.ఐ మోహన్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ సంప్రదించగా.. తాను కొత్తగా బాధ్యతలు స్వీకరించానని, ఫైల్‌ను పూర్తిగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు.