సాక్షి, హైదరాబాద్: అమ్మతనంలోని గొప్పతనాన్ని ఏ కళ కూడా పూర్తిగా ప్రతిబింభించలేదని ప్రముఖ సీరియల్ నటి హారిత తెలిపారు. నటిగా తనకు తల్లి, అత్త క్యారెక్టర్‌లే మంచి గుర్తింపునిచ్చాయని పేర్కొన్నది. జీ తెలుగు వేదికగా ఈ నెల 31వ తేదీ నుంచి ‘కళ్యాణం కమనీయం’ ధారావాహిక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నటి హారిత మాట్లాడుతూ.. కలవారి కోడలు, ముద్దమందారంతో జీ తెలుగులో మంచి అభిమానం పొందిన రెండేళ్ల తర్వాత కళ్యాణం కమనీయంలో అమ్మగా మళ్లీ వస్తుండటం సంతోషంగా ఉందని, జీ తెలుగుకు తోబుట్టువులా మారానని తెలిపింది. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. మొదటిసారి ఒక సీరియల్‌లో సింగర్ మనో నటిస్తున్నారని అన్నారు. ఈ ధారావాహికలో ముఖ్యతారాగణంగా మేఘన లోకేశ్, రాక్‌స్టార్‌గా మధు విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటారని అన్నారు. ఒక సినిమాకుండే విలువలతో ఈ సీరియల్ రూపొందించారని నటీ మేఘన తెలిపింది. గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న డ్రీమ్ రోల్ కళ్యాణం కమనీయంలో దొరికిందని మధు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment