స్టార్ మా సపరివారంలో సరికొత్తగా మరో సీరియల్ వచ్చి చేరనుంది. 'నువ్వుంటే నా జతగా' అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయనుంది.
'నువ్వుంటే నా జతగా' అనే సీరియల్ ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథగా తీసుకొస్తున్నారు. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి.. గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ సీరియల్ సోమవారం(డిసెంబర్ 16) నుంచే రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని ఈ సీరియల్ ద్వారా చూపించనున్నారు.
ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ మూడుముళ్లతోనే కరిగిపోతే? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే ఈ కథ స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment