star maa
-
బుల్లితెర ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త సీరియల్ వచ్చేస్తోంది!
స్టార్ మా సపరివారంలో సరికొత్తగా మరో సీరియల్ వచ్చి చేరనుంది. 'నువ్వుంటే నా జతగా' అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయనుంది.'నువ్వుంటే నా జతగా' అనే సీరియల్ ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథగా తీసుకొస్తున్నారు. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి.. గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ సీరియల్ సోమవారం(డిసెంబర్ 16) నుంచే రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని ఈ సీరియల్ ద్వారా చూపించనున్నారు.ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ మూడుముళ్లతోనే కరిగిపోతే? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే ఈ కథ స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. -
స్టార్ మాలో మరో కొత్త సీరియల్
మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న "గీత ఎల్ ఎల్ బి" పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం.ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ "గీత ఎల్ ఎల్ బి" సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతోంది’ అని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ ప్రసారం కానుంది. -
బుల్లితెర ప్రియులకు సరికొత్త సీరియల్.. ఎప్పుటినుంచంటే?
తెలుగులో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్న ఛానల్ "స్టార్ మా". సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. తాజాగా "ఇల్లు ఇల్లాలు పిల్లలు" అనే సరికొత్త సీరియల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథే ఇల్లు ఇల్లాలు పిల్లలు.ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే... ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథేంటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటోసరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చూడాల్సిందే.ఈ సీరియల్ ఈ నెల 12 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు నిర్మాత, ప్రభాకర్ ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చూపించనున్నారు. -
బుల్లితెర అవార్డుల పండుగ.. ఛీఫ్ గెస్ట్ ఎవరంటే?
స్టార్ మా పరివార్ అవార్డ్స్ వేడుక బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. టాలీవుడ్ టీవీ ఇండస్ట్రీలో స్టార్ మా సీరియల్స్‌కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఇవాళ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించనుంది.ఈ గ్రాండ్ అవార్డ్స్ వేడుకలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేనిని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్‌గా నిలువనుంది. ఈ వేడుకలో బుల్లితెర నటీనటుల సందడి స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో చూసేయండి. -
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. బన్నీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా!
రైతు బిడ్డ ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్‌గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్‌బాస్ విన్నర్‌గా స్టార్‌గా ఎదిగాడు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.. తాజాగా స్టార్ మా అవార్డ్స్ వేడుకలో మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తన తన ట్విటర్లో పోస్ట్ చేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది. మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది. Pallavi Prashanth’s grand entry at the Star Maa Parivaar Awards! 🌟✨ His energy and grace will leave everyone in awe, setting the stage on fire with his powerful presence. Coming soon only on #StarMaa! 🌟 #StarMaaParivaarAwards2024 #SMPA2024 pic.twitter.com/5Lkrminsn9— Starmaa (@StarMaa) October 15, 2024 -
బిగ్ బాస్ ఐదవ వారం విశ్లేషణ...'పాత బొమ్మలతో కొత్త పోస్టర్'
ఓ పిల్లాడు సాయంత్రం ఇంటికి రాగానే అమ్మా నాకేదైనా కొత్త వంట చేసి పెట్టు అని తల్లిని అడిగాడు. ఇంట్లో పొద్దున వండిన ఇడ్లీలు తప్ప ఏమీ లేవు. దాంతో తల్లి ఆ ఇడ్లీలను తుంచి వేపుడు చేసి బిడ్డకు పెట్టింది. తల్లి తన కోసం కొత్త వంట చేసిందని సంబరపడిపోయి ఆనందంగా తిన్నాడు ఆ బిడ్డ. ఇక్కడ తల్లి పాత్ర బిగ్ బాస్ అయితే బిడ్డ పాత్ర ప్రేక్షకులు. ఇక ఇడ్లీలు కంటెస్టెంట్లు అని వేరేగా చెప్పకరలేదు. బిగ్ బాస్ 8 లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ అని టాగ్ లైన్‌తో ఊదరగొట్టిన బిగ్ బాస్ ఎపిసోడ్లు లిమిట్ లెస్ ఎంటర్ టైన్మెంట్ ఏమో గాని లిమిట్ లెస్ కన్ఫ్యూజన్ మాత్రం చూస్తున్న ప్రేక్షకులను గురి చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇస్తున్న(లేక చేస్తున్న) ఎంటర్ టైన్మెంట్ సరిపోలేదో (సరిరాదో) ఏమో కాని ఉన్నపళాన వారం వ్యవధిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసి మరో 8 పాత కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపాడు బిగ్ బాస్. ఆదిత్య ఓం, నైనిక ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో వున్నారు. ఒక ఎలిమినేషన్ (ఆదిత్యఓం) హౌస్ మొత్తం కలిసి తీసుకున్నదైతే మరో ఎలిమినేషన్ మాత్రం (నైనిక) బిగ్ బాస్ చేసింది. ఇక వైల్డ్ కార్డ్ పేరిట ఓ 8 పాత కంటెస్టెంట్లను రంగంలోకి దింపిన బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంపిక లో మాత్రం పెద్దగా ఆసక్తి కనబరిచినట్టుగా లేదు. కంటెస్టెంట్లు దొరక్కో లేక పాత కంటెస్టెంట్ల అందుబాటులో వున్నందుకో కాని పెద్దగా ఉత్సాహాన్నిచ్చే కంటెస్టెంట్లు లేరనే అనిపిస్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లలో ఈ పాత కంటెస్టెంట్లైన కొత్త వైల్డ్ కార్డ్స్ ఉన్న కంటెస్టెంట్లతో ఎలా ఆడతారో ఈ పాత కొత్త ఆటను ఆస్వాదించే ప్రేక్షకులకు తెలియాలి. ఆఖరుగా ఒక్క మాట 'కొత్తొక వింత పాతొక రోత' అన్న నానుడి సదరు బిగ్ బాస్ కు తెలిసో లేదో...!!-ఇంటూరి హరికృష్ణ -
బిగ్ బాస్ రెండవ వారం విశ్లేషణ...'హౌస్‌లో శేఖర్ భాషా అంకం సమాప్తం '
బిగ్ బాస్ హౌస్ లోని రెండవ వారం వాడి వేడి వాదనలతో నామినేషన్స్ అవగా మిగతా వారమంతా ఫుడ్ టాస్క్ మీద నడిచింది. ముందుగా నామినేషన్స్ గురించి చెప్పుకుందాం. హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ గురించి చెప్పేటప్పుడు సదరు కంటెస్టెంట్ ఆటను ముందుగా పొగిడి తరువాత తన నామినేషన్ కారణాన్ని వివరిస్తూ వివాదపర్చడం విడ్డూరమనిపించింది. ఈ నామినేషన్స్ టైంలో విచిత్రంగా ప్రతి కంటెస్టెంట్ ఫైర్ అవుతున్నారు. ఇటువంటి ఫైరింగ్ నామినేషన్స్ నుండి జోవియల్ కంటేస్టెంట్ అయిన శేఖర్ భాషా ఎలిమినేట్ అవడం విశేషం. శేఖర్ భాషా ఎలిమినేషన్ వ్యక్తిగతంగా అతను తండ్రి అవడం ఓ కారణమైతే అదే కారణాన్ని చూచాయగా చూపిస్తూ హౌస్ లోని కంటెస్టెంట్లందరూ (ఒక్క కంటెస్టంట్ తప్ప) శేఖర్ భాషా హౌస్ నుండి బయటకు వెళ్ళాలి అని బాహటంగానే నామినేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో చిన్న కారణమైనా పెద్దదిగా చేస్తారు. అందుకేనేమో బిగ్ బాస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మా బాగా నచ్చుతోంది. ఈ సందర్భంగా ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. ఈ వారాంతం జరిగిన షోలో బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను నాగార్జున అందలం ఎక్కించారు. అదేంటంటే భారతదేశంలోని ఏ బిగ్ బాస్ షోకి రానంత ప్రేక్షకాదరణ ఒక్క తెలుగు బిగ్ బాస్ కే దక్కిందట. మొత్తంగా 6 బిలియన్ల నిమిషాల నిడివితో ఈ తెలుగు బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులు చూశారట. ఇది ఒక రికార్డ్ బ్రేక్ అని నాగార్జున చెప్పుకొచ్చారు. ఈ లెక్కన మన తెలుగు ప్రేక్షకులు భారతదేశంలోనే ఉత్తమోత్తమ ప్రేక్షకులను చెప్పుకోవాలి, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకు విషయం కన్నా వివాదం నచ్చుతుందన్న విషయం మరోసారి నిరూపించారు. ఇకపోతే ఫుడ్ టాస్క్ గురించి చెప్పాలంటే చాలానే చెప్పాలి. రాతి యుగంలో ఆది మానవులు ఆహారం కోసం అరాచకం చేసేవారట. ఈ విషయం మన తరం వారు ఎవ్వరూ చూసివుండరు కాని చదువుంటారు. అయితే అదే పరిస్థితి చూడాలనుకుంటే ఈ వారం బిగ్ బాస్ ఫుడ్ టాస్క్ చూసి ఆనందించవచ్చు. ఫుడ్ టాస్క్ కు సంబంధించి దీనికి మించిన వివరణ మరేదీ వుండదు. వారం వారం అంచనాలు అందుకోలేని సంచనాలతో దూసుకువెళ్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం ముందు ముందు మరెన్ని సంచనాలకు తావిస్తుందో చూడాలి.- ఇంటూరు హరికృష్ణ -
బిగ్‌బాస్ 8 ఫస్ట్ ప్రోమో విడుదల.. ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కోసం ఎదురుచూసిన అభిమానులకు నేటి (సెప్టెంబర్ 1) నుంచి పండుగే అని చెప్పవచ్చు. నాగార్జున హౌస్ట్‌గా మరోసారి ఈ సీజన్లో కూడా మెప్పించనున్నాడు. తాజాగా విడుదలైన మొదటి ప్రోమో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఈ సీజన్ లిమిట్లెస్ అంటూ నాగార్జున చెప్పారుజ అందుకు తగ్గట్టే కంటెస్టెంట్స్‌ను సోలోగా పంపకుండా జోడీలుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. అయితే, ప్రోమోలో నాని-ప్రియాంక మోహన్ సందడి చేశారు. 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను నాగ్‌తో పంచుకున్నారు. ఆపై '35 చిన్న కథ కాదు' ప్రమోషన్స్ కోసం రానా, నివేదా థామస్ సరదాగా మెప్పించారు. చివరిలో దర్శకుడు అనిల్ రావిపూడి ట్విస్ట్ ఇచ్చారు. ఈరోజు సాయింత్రం 7గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ ప్రసారం కానుంది. -
వరంగల్‌లో 'సత్యభామ' యూనిట్ సందడి
తెలుగు సంస్కృతి , సంప్రదాయాలను ఆచరిస్తూ నిర్వహించిన ఉత్సాహభరితమైన వేడుకలో భాగంగా ప్రముఖ సీరియల్ ' సత్యభామ' లో నటించిన ముఖ్య తారాగణంతో వరంగల్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజా కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది. ' సత్యభామ' తారలు తమ మొదటి వరలక్ష్మీ వ్రతాన్ని వరంగల్ నగర ప్రజలతో కలిసి జరుపుకోవడం వల్ల ఇది ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఈ తారల వివాహ రెసెప్షన్ వేడుకలు సైతం వరంగల్‌లో జరుగగా, అప్పుడు ఇక్కడి వారు అపూర్వమైన స్వాగతం పలికారు. వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ' సత్యభామ' సిరీయల్ నటీనటులు అందరూ వరలక్ష్మి పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో పూజను కొనసాగించారు. హాజరైన మహిళలకు వాయనాలు అందించటంతో పాటుగా ప్రసాదాలు పంపిణీ చేశారు. అభిమానులు తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటూ కళాకారులను బహుమతులతో ముంచెత్తారు. ఈ షో తో తమకున్న లోతైన బంధాన్ని మరింతగా వెల్లడించారు. ఈ సీరియల్ హీరో క్రిష్ ప్రేక్షకులతో కలిసి నృత్యం చేయడంతో కార్యక్రమంలో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. అసలైన తెలుగు శైలిలో పండుగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఆన్-స్క్రీన్ జంట వేదికపై నృత్యం చేయడంతో ఉత్సాహం మరింతగా పెరిగింది. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సంపదను జోడిస్తూ, ప్రత్యేక తోలుబొమ్మలాట ప్రదర్శన జరిగింది. పురాతన కళను నేటి తరానికి గుర్తుచేస్తూ జరిపిన ఈ తోలుబొమ్మలాట, తెలుగు ప్రజల సంప్రదాయాలకు ఒక అందమైన తీపిగుర్తుగా నిలిచింది. -
స్టార్ మాలో కొత్త సీరియల్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు స్టార్‌మా లో మరో కొత్త సీరియల్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రాబోతుంది. సునిశిత హాస్యం, ప్రేమ,ప్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సీరియల్ సాగుంతుందని మేకర్స్ తెలియజేశారు. జనవరి 22 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. సీతాకాంత్, 40 ఏళ్ల వయసు కలిగిన విజయవంతమైన వ్యాపారవేత్త . బాధ్యతలు కలిగినప్పటికీ వినోదాన్ని అభిమానించే 20 ఏళ్ల రామలక్ష్మి పాత్రలో రక్ష కనిపిస్తుంది. వీరి ఇరువురి జీవితాల ద్వారా ప్రేక్షకులను ఆహ్లాదకరమైన ప్రయాణంలో నడిపిస్తుంది "ఎటో వెళ్లిపోయింది మనసు". సీతాకాంత్ పాత్రను సీతాకాంత్ పోషించారు. ఆయన జీవితం ఒక క్రమ పద్దతిలో వెళ్లాలనుకుంటారు. దాని చేతనే ఆయన ప్రసిద్ది చెందారు, అయితే రామలక్ష్మి ప్రతి సందర్భం లోనూ ఉత్సాహం తీసుకువస్తూ , జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య వయస్సు అంతరం వినోదభరితమైన ఘర్షణలకు దారి తీస్తుంది, హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సరైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది. రామలక్ష్మి గతం నుంచి కుటుంబ రహస్యాలను వెలికితీసినప్పుడు, ఈ ద్వయం సంఘటనల సుడిగుండంలో తమను తాము కనుగొంటారు, ఇది సౌకర్యం కోసం చేసుకున్న వివాహంతో ముగుస్తుంది. సీతాకాంత్ యొక్క ఖచ్చితమైన స్వభావం, రామలక్ష్మి యొక్క నిర్లక్ష్య స్ఫూర్తితో ఢీకొంటూ ప్రేమ, నవ్వు మరియు కుటుంబ బంధాలను మిళితం చేసే ప్రయాణానికి వేదికగా నిలుస్తుంది. ప్రేమంటే వయసు, అభిరుచుల తూకం కాదు , రెండు గుండెల చప్పుడు అని చెబుతుంది. స్టార్ మా లో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు "ఎటో వెళ్లిపోయింది మనసు" ప్రసారమవుతుంది. -
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్‌కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్‌లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్‌లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్‌కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
ఆకట్టుకుంటున్న ‘స్టార్ మా’పవర్ అవర్
‘స్టార్ మా’ పవర్ అవర్ విజయవంతంగా ప్రారంభించి టెలివిజన్ హిస్టరీలో ఎంతో ఆకట్టుకునే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "సత్యభామ" మరియు "ఊర్వసి వో రాక్షసి వో" షోలు ఉన్నాయి. డిసెంబర్ 18న ప్రీమియర్, పవర్ అవర్ రాత్రి 9:30 గంటలకు "సత్యభామ"తో ప్రారంభమైంది. ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకు "ఊర్వసి వో రాక్షసి వో" ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. ప్రముఖ టెలివిజన్ జంట యష్, వేద నటించిన ‘సత్యభామ’ డిసెంబర్ 18న రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10:00 గంటలకు ‘ఊర్వసి వో రాక్షసి వో’ శైలిని పునర్నిర్వచించటానికి హామీ ఇచ్చే గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నుండి 10:30 గంటల వరకు పవర్ అవర్ సమయంలో “సత్యభామ” మరియు “ఊర్వసి వో రాక్షసి వో” యొక్క బ్యాక్-టు-బ్యాక్ ఉత్సాహాన్ని అనుభవించడానికి ఆడియన్స్ ను స్టార్ మా ఆహ్వానిస్తోంది. -
అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్ మా' నటీనటులు
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మాకు సంబంధించిన సీరియల్ నటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఉనన దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు 'పలుకే బంగారమాయెనా, నాగ పంచమి'లలో నటించిన ప్రముఖ నటీనటులు తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులను కలుసుకున్నారు. దీంతో వారందరూ ఎంతగానో సంతోషించారు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడటమే కాకుండా పలు సినిమాల సూపర్ హిట్ పాటలు పాడుతూ డ్యాన్స్‌లు చేశారు. అనంతరం వారితో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పలు బహుమతులను కూడా అందుకున్నారు. ఇలా సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో మెప్పించారు. ఇలా తమను అభిమానిస్తున్న ప్రేక్షకులతో ఇలా బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు.. ప్రతి పండుగను ఇలా సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఎప్పటికీ కట్టుబడి ఉందిని వారు తెలిపారు. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా స్టార్ మా నటీనటులను ఇలా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం చెప్పుకోతగినదని పేర్కొన్నారు. -
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్‌తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్
భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ "పలుకే బంగారమాయెనా". పుట్టుకతోపరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్. ‘గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు ఉంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనేతపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది "పలుకేబంగారమాయెనా" కథ’ అని సీరియల్ బృందం పేర్కొంది. -
బిగ్‌బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్‌బాస్-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా బిగ్‌బాస్ -7 ప్రోమోను 'స్టార్ మా' విడుదల చేసింది. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా అభిమానులకు బిగ్‌బాస్ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓటీటీ వేదికైన డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. (ఇదీ చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) సీజన్ 1లో ఎన్టీఆర్, సీజన్ 2లో నాని హోస్ట్‌గా సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన అన్ని సీజన్ల వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా మెప్పంచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా 7వ సీజన్లో నాగ్‌నే హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ప్రోమోలో నాగ్ లుక్ అదిరిపోయింది. ఆగష్టు చివరి వారంలో బిగ్ బాస్-7 జర్నీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) ఈసారి షో చాలా కొత్తగా ఉంటుందని ఈ ప్రోమోలో నాగార్జున చెప్పారు... ప్రతిసారి ఇదే డైలాగ్ కదా చెప్పేది అని. మరో డైలాగ్ అందుకుంటాడు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూ ప్రోమోతో నాగ్ ముందుకు వచ్చాడు. ఈ డైలాగ్‌తో కంటెస్టెంట్లను కొంతమేరకు డైలామాలో పడేశాడు. అంటే ఈసారి షో రొటిన్‌గా కాకుండా రూట్ మార్చాలనే ప్లాన్‌లో ఉన్నట్లు అర్థం అవుతుంది. గత ఆరు సీజన్ల మాదిరి అవే టాస్క్‌లు కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు ఆడియన్స్ ఊహకు కూడా అందకుండా షో రన్ చేయాలిని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. -
Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్‌బాస్-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈసారి సీజన్ ఉంటుందా..? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ అభిమానులకు బిగ్‌బాస్ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అప్డేట్ లేకుండా ప్రోమోను రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) BB7 తెలుగుతో మళ్లీ వచ్చేస్తున్నామని ఈసారి వినోదం పూర్తి ప్యాకేజీ ఉంటుందని టీమ్ తెలిపింది. ఈ సీజన్లో అభిమానులకు ఎమోషన్స్‌తో పాటు సర్ప్రైజ్లు ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఈ సీజన్లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండనున్నట్లు వారు చెప్పారు. ఓరకంగా అభిమానుల్ని రోలర్‌కోస్టర్ రైడ్లోకి తీసుకెళ్తుందని మేకర్స్ తెలుపుతూ ప్రోమోను విడుదల చేశారు. కాబట్టి ఈసారి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా చేయనున్నారని తెలుస్తొంది. -
టీఆర్పీలో రికార్డు సృష్టించిన స్టార్ మా.. ఆ ఛానల్స్‌ను వెనక్కు నెట్టి..
స్టార్ మా చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. బార్క్ 13వ వారం రేటింగ్స్‌లో అత్యధిక రేటింగ్స్ సాధించింది స్టార్ మా. ప్రైమ్ టైమ్ తోపాటు నాన్ ప్రైమ్ ట్రైమ్‌లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్ రేటింగ్స్ దాటేసింది. 13వ వారం మొత్తమ్మీద స్టార్ మాకు 882 జీఆర్పీల రేటింగ్ వచ్చింది. స్టార్ మా ప్రైమ్‌టైమ్ జీఆర్పీ లలో 342 , నాన్ ప్రైమ్ టైమ్‌లో 510 సాధించింది. నూతన సీరియళ్ల లాంచ్ లోనూ స్టార్ మా తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్ సాధించలేని అరుదైన రికార్డు సాధించింది. ఇటీవలే స్టార్ మాలో ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ నాగపంచమి సీరియల్ 11556 ('000 ఏఎంఏ), బ్రహ్మముడి సీరియల్ 10372.2('000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్‌టీవీలో ప్రారంభమైన వనథై పోలా 9661.2 ('000 ఏఎంఏ); స్టార్ ప్లస్‌లో ప్రారంభమైన ఇమ్లీ 8814.1 ('000 ఏఎంఏ), కలర్స్‌లో నాగిన్ - 5 సీజన్ 8700.5 ('000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి. ఇక స్టార్ మా మూవీస్ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్పీల రేటింగ్ సాధించింది. ఇండియాలో నెంబర్1 మ్యూజిక్ ఛానెల్‌గా స్టార్ మా మ్యూజిక్ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్ ఛానెల్స్‌పై చూపింది. -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటున్ చందన్ కుమార్. ప్రస్తుతం అతడు తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు జరిగిన షూటింగ్లో చందన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. సీరియల్‌కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్‌ను నానాబూతులు తిడుతూ నోరుపారేసుకున్నాడు. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్‌ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై అంతేకాదు అతనిపై మాటల దాడికి దిగారు. ఇక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్‌తో చేత టెక్నిషియన్‌కు క్షమాపణలు చెప్పించారు. అనకూడని మాటలు అన్నాడు, నా తల్లిని దూషించాడు ఇప్పుడు సారీ చెబితే ఊరుకుంటామా అని సదరు సిబ్బంది వాదించాడు. ఇలా నటుడు చందన్ ఓవరాక్షన్ చేసి చెంప దెబ్బతిన్న వీడియో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా చందన్ కన్నడ పరిశ్రమలో ఎంతోకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. చందన్ హీరోగా, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా ప్రేమ బరహా చిత్రం కూడా వచ్చింది. ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత -
"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా!
ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ". జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది. స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది. (అడ్వర్టోరియల్) "నువ్వు నేను ప్రేమ" ప్రోమో👇 -
నేను కడుపులో ఉండగానే అమ్మను వదిలేశాడు : 'కస్తూరి' నటి
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్‌మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్‌గా సత్తా చాటుతున్నాడు. 'సమ్‌థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్‌పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ప్రీమియర్..సెప్టెంబర్ 5న ప్రారంభం
వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్‌బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ 'స్టార్ మా' ఛానెల్లో సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్ గ్రాండ్ ఫైనల్.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్‌ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్‌బాస్ షో ఉండనుంది. బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్‌కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రచారాన్ని రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాల్లో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. ''స్టార్ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు మా పట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్ శక్తిని ప్రదర్శించాం. బిగ్‌బాస్ తెలుగు మరో సీజన్‌ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్ బాస్ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు. అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్‌లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు. బిగ్‌బాస్ ఐదవ సీజన్‌కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్‌గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో బిగ్ బాస్ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్షైన్ గ్రూప్ సొంతం.బిగ్‌బాస్ తెలుగు–సీజన్ 5, స్టార్‌మాలో సెప్టెంబర్05, సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది. -
"అమ్మకు తెలియని కోయిలమ్మ" స్టార్ మాలో
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న స్టార్ మా.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్ గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది ? ఎవరి కథ ఎందుకలా అయింది ? అసలు ఎందుకు ఇలా జరిగింది ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో .. అనుబంధాల ఆధారంగా విశ్లేషించే కథ ఇది. తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ ముఖ్యమైన కేరక్టర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు. జులై 19 న రాత్రి 9.30 గంటల నుంచి స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ప్రేక్షకుల్ని అలరించబోతోంది.