వినోదానికి ఏమాత్రం ఢోకా లేకుండా ‘స్టార్‌ మా’ | Star Maa Channel No Compromised On Entertainment In Lockdown | Sakshi
Sakshi News home page

ఇంటిల్లిపాదికీ వినోద వేదికగా నిలిచిన ‘స్టార్ మా’

Published Fri, May 22 2020 11:40 AM | Last Updated on Fri, May 22 2020 11:44 AM

Star Maa Channel No Compromised On Entertainment In Lockdown - Sakshi

కరోన రక్కసి కారణంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. వినోదరంగం అందుకు మినహాయింపేమీ కాదు. లాక్‌డౌన్‌ కారణంగా సీరియల్స్‌, టీవీ షోల షూటింగులు రద్దవ్వడం టీవీ పరిశ్రమపై భారీ ప్రభావం పడింది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ వేళ ఇంటిల్లిపాదికి చక్కటి వినోదాన్ని అందించేందుకు ‘స్టార్‌ మా’ తమదైన శైలిలో వినూత్న కార్యక్రమాలను ప్రసారం చేసి లాక్‌డౌన్‌ వేళ కుటుంబమంతటికీ ఇష్టమైన ఛానల్‌గా నిలిచింది. పిల్లల కోసం అవెంజర్స్, లయన్ కింగ్ లాంటి చిత్రాలతో పాటుగా కిండర్‌ల్యాండ్.. ఇస్మార్ట్ జోడీ జర్నీ, బిగ్ లాక్‌డౌన్ ఛాలెంజ్‌తో యువతకు కిక్కును తీసుకొస్తుంది. మహిళామణుల కోసం కార్తీకదీపం, కోయిలమ్మ లాంటి సీరియల్స్ పునః ప్రసారం చేయడంతో పాటు పెద్దవారి కోసం పురాణగాథలను అందిస్తోంది. 

తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రాల ప్రీమియర్లు మొదలు అంతర్జాతీయంగా బ్లాక్ బస్టర్ చిత్రాలైనటువంటి అవెంజర్స్ ఎండ్‌గేమ్‌ను ‘మా’ ప్రేక్షకులకు అందించింది. అంతేకాకుండా ఎక్కువ మంది వీక్షించడానికి ఇష్టపడే తెలుగు ఫిక్షన్ షోస్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నాన్ ఫిక్షన్‌ను ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం చేసింది. ఉదయం పూట పురాణాలు మొదలు పిల్లల కోసం కిండర్‌ల్యాండ్ అంటూ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కార్యక్రమాలతో పాటు విభిన్న కార్యక్రమాలతో స్టార్‌ మా కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  ఈ వేసవిలో తనకిష్టమైన అవెంజర్స్, లయన్‌కింగ్ లాంటి సినిమాలెన్నో చూశానని ఆరవ తరగతి విద్యార్థి అన్షూల్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 'లయన్ కింగ్' సినిమాను మా నాన్న‌తో కలిసి థియేటర్లలో అప్పట్లో రెండుసార్లు చూశాను. కానీ టీవీలో చూడటం మాత్రం ఇంకా సూపర్‌గా ఉందన్నాడు.

ఇక ఈ లాక్‌డౌన్ కాలంలో ప్రజలకు ఏమాత్రం బోర్ కొట్టకుండా, సృజనాత్మక మార్గాలను ఛానెల్ అనుసరించింది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లకు అనుమతి లేకపోవడంతో మొబైల్ ఫోన్‌తో ఇంటిలోనే ఆసక్తికరమైన షోలనును చిత్రీకరించింది. అలాంటి వాటిలో 'ఇస్మార్ట్‌జోడీ జర్నీ' ఒకటి. టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జూమ్‌కాల్‌ను వినియోగించుకుని ఇస్మార్ట్ జోడిని రూపొందించారు యాంకర్ ఓంకార్. అయితే కష్టసాధ్యమే అయినప్పటికీ ఆకట్టుకునేలా తారల జీవిత ప్రయాణాన్ని అందంగా తెరకెక్కించగలిగామని ఓంకార్‌ అన్నారు. 

ఇదే తరహా సెలబ్రిటీ కార్యక్రమం 'బిగ్ లాక్‌డౌన్ ఛాలెంజ్'. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందనడానికి సోషల్‌మీడియాలో వీక్షకుల నుంచి వచ్చిన కామెంట్లే నిదర్శనం. బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్ కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని 32 సంవత్సరాల గృహిణి వాసంతి చెబుతూ తానెప్పుడూ సినీ, టీవీ తారల జీవితాలను దగ్గరగా చూడాలని కోరుకునేదానినని, ఈ లాక్‌డౌన్ వేళ స్టార్ మా ఆ కొరత తీర్చిందన్నారు. ఇంటిలో మా అభిమాన తారలేమి చేస్తున్నారు, వారి జీవనశైలి ఎలాగుంటుందో తెలుసుకునే వీలు మాకు చిక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల ఈ సంతోషమే 'మా ప్రయత్నం మన కోసం' అనే ఛానెల్ ప్రయత్నాలు విజయవంతమయ్యాయనడానికి నిదర్శనం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement