సాక్షి, హైదరాబాద్: మారుతున్న సాంకేతికత, కంటెంట్ లభ్యతతో టెలివిజన్ వినోదం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవ వేళ సాధారణతకు భిన్నంగా అసాధారణ ప్రయాణాన్ని ఆరంభించి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన స్టార్ మా ప్రయాణాన్ని చుట్టేసొద్దాం.. తెలివైన, శక్తివంతమైన వినోదంతో విజయ ప్రయాణాన్ని ఆరంభించిన స్టార్ మా గత నాలుగు సంవత్సరాలలో వినోదానికి కేరాఫ్‌గా మారింది. ఒక వారాన్ని మించి మరో వారం అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తెలుగు వినోద ఛానెల్‌గా విశిష్ట గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు వినోదాన్ని పునర్నిర్వచించిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోల సమ్మేళనమిది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కావాల్సిన సంపూర్ణ వినోదాన్నిఅందిస్తున్నందుకు స్టార్ మా గర్విస్తోంది. (చదవండి: ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప)
2017 అక్టోబర్‌లో నెంబర్ 1 షో కార్తీక దీపంను స్టార్ మా లో ప్రారంభించారు. ఈ కథ కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపజేస్తూనే, భారతదేశపు అభిమాన సీరియల్‌గా నిలిచింది. తమ నాల్గవ సీజన్‌లో ఉన్న బిగ్‌బాస్, ప్రతి సంవత్సరం టెలివిజన్ వీక్షకుల నడుమ ఆసక్తిని రేకిత్తిస్తోంది. కార్తీక దీపంలో దీప అయినా, గృహలక్ష్మిలో తులసి; మౌనరాగంలో అమ్ములు లేదా కేరాఫ్ అనసూయలో అనసూయ అయినా స్టార్ మా లోని ప్రతి క్యారెక్టర్, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తూనేఉంటుంది. స్టార్ మా యొక్క ట్యాగ్‌లైన్ ‘మీ తో మేము, మా తో మీరు’ను స్ఫురిస్తూనే ఉంటుంది.ఇక స్టార్ మా.. స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ ఛానళ్లను కూడా నడుపుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment