Star Maa Serials Record TRP Ratings This Week 2023, Details Inside - Sakshi
Sakshi News home page

Star Maa TRP Ratings: జాతీయ టీవీ రేటింగ్స్‌లో తెలుగు ఛానల్‌ స్టార్‌ మా టాప్‌

Published Thu, Apr 13 2023 6:45 PM | Last Updated on Thu, Apr 13 2023 7:15 PM

Star Maa Record TRP Ratings This Week - Sakshi

స్టార్‌ మా చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. బార్క్‌ 13వ వారం రేటింగ్స్‌లో అత్యధిక  రేటింగ్స్‌ సాధించింది స్టార్‌ మా. ప్రైమ్‌ టైమ్‌ తోపాటు నాన్‌ ప్రైమ్‌ ట్రైమ్‌లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్‌ రేటింగ్స్ దాటేసింది.  13వ వారం మొత్తమ్మీద స్టార్‌ మాకు 882 జీఆర్‌పీల రేటింగ్‌ వచ్చింది. స్టార్‌ మా ప్రైమ్‌టైమ్‌ జీఆర్‌పీ లలో 342 , నాన్‌ ప్రైమ్‌ టైమ్‌లో 510 సాధించింది. నూతన సీరియళ్ల లాంచ్ లోనూ స్టార్‌ మా తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్‌ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్‌ సాధించలేని అరుదైన రికార్డు సాధించింది. 

ఇటీవలే స్టార్‌ మాలో ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్‌ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తూ నాగపంచమి సీరియల్‌ 11556 ('000 ఏఎంఏ), బ్రహ్మముడి సీరియల్‌ 10372.2('000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్‌టీవీలో ప్రారంభమైన వనథై పోలా 9661.2 ('000 ఏఎంఏ);  స్టార్‌ ప్లస్‌లో ప్రారంభమైన ఇమ్లీ 8814.1 ('000 ఏఎంఏ), కలర్స్‌లో  నాగిన్‌ - 5 సీజన్  8700.5 ('000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి. ఇక స్టార్‌ మా మూవీస్‌ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్‌పీల రేటింగ్‌ సాధించింది. ఇండియాలో నెంబర్‌1 మ్యూజిక్‌ ఛానెల్‌గా  స్టార్‌ మా మ్యూజిక్‌ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్‌ ఛానెల్స్‌పై చూపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement