TRP
-
రికార్డు బద్ధలు కొట్టిన బిగ్‌బాస్.. ఈసారే అత్యధిక టీఆర్పీ!
బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు తిట్టుకున్నవాళ్లే ఈ రియాలిటీ షోను ఎక్కువగా చూస్తూ ఉంటారు. జనాలకు పెద్దగా తెలియని ముఖాలను తీసుకొచ్చినా సరే కొద్దిరోజుల్లోనే వారు అందరికీ సుపరిచితులైపోతారు. అటు హౌస్‌లో కంటెస్టెంట్లు గొడవపడుతుంటే వారికోసం అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. ఫస్ట్ సీజన్ లాంచ్ ఎపిసోడ్ రేటింగ్ ఎంతంటే?ఇకపోతే ఈసారి పెద్దగా అంచనాలు, హడావుడి లేకుండానే బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ (#BiggBossTelugu8) ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది.అత్యల్పంగా ఆ సీజన్లోమూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. అలా మూడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 17.92, నాలుగో సీజన్‌కు 18.50, ఐదో సీజన్‌కు 18, ఆరో సీజన్‌కు అన్నింటికంటే తక్కువగా 8.86 రేటింగ్ వచ్చింది. ఏడో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు 18.1 రేటింగ్ వచ్చింది. ఎనిమిదో సీజన్ ఏకంగా 18.9 టీఆర్పీ రాబట్టి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. మొత్తానికి నాగ్ తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ.. దారి తప్పిన బిగ్‌బాస్‌ను మళ్లీ పట్టాలెక్కించాడన్నమాట!5.9 billion minutes of record breaking viewing🔥🔥🔥 The power of ♾️ entertainment. BIGGBOSSTELUGU8 just shattered records of viewing minutes and ratings. Feeling thrilled and honored to witness your love which made Bigg Boss to reach incredible new heights! 🚀 We’re setting… pic.twitter.com/bqMvYtNstn— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 12, 2024మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రాజ్‌కోట్‌లో పెను విషాదం
రాజ్‌కోట్: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవులు, వారాంతం కూడా కావడంతో సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు సహా మొత్తం 27 మంది అగ్ని ప్రమాదానికి బలయ్యారు. నానా–మవా రోడ్డులోని టీఆర్పీ గేమ్ జోన్లో సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అందరూ ఆటల్లో మునిగి ఉన్న వేళ ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. దీంతో, అందులో చిక్కుకుపోయిన వారంతా హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని దాదాపు ఐదుగంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంతోపాటు బలమైన గాలులు వీస్తున్న కారణంగా ఫైబర్ డోమ్ పూర్తిగా కుప్పకూలింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నట్లు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి చెప్పారు. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికితీశామన్నారు. పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయన్నారు. మృతదేహాలను, క్షతగా త్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించామ ని చెప్పారు. ఘటన నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న గేమింగ్ జోన్లు అన్నిటినీ వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రమాదం సంభవించిన గేమ్ జోన్లో తక్షణమే సహాయ కార్యక్రమాలను చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం భపేంద్ర పటేల్ తెలిపారు. ఘటనకు దారి తీసిన కారణాలపై సిట్‌తో ప్రత్యేక విచారణ చేయిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారంగా ప్రకటించారు. కాగా, రాజ్‌కోట్‌లో విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యజమాని అరెస్ట్టీఆర్పీ గేమ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకీ, మేనేజర్‌తోపాటు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
డార్లింగ్ ప్రభాస్‌కి 'సలార్' స్పెషల్ మూవీ. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ఇతడికి.. ఈ మూవీ సక్సెస్ సరికొత్త ఎనర్జీ ఇచ్చింది. గతేడాది థియేటర్లలో రిలీజైనప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. కొన్నిరోజుల క్రితం టీవీలో వచ్చినప్పుడు మాత్రం ఊహించనంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'పుష్ప' విలన్ హిట్ సినిమా.. తెలుగులో డైరెక్ట్ రిలీజ్)ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన సినిమా 'సలార్'. 'కేజీఎఫ్' తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన ఈ మూవీ.. చాలాసార్లు వాయిదాలు పడుతూ గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని, రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బిగ్ స్క్రీన్‌పై సక్సెస్ అందుకున్న ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం ఫెయిలైంది. ఏప్రిల్ 21న ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం చేయగా కేవలం 6.52 టీఆర్పీ వచ్చింది. తాజాగా ఈ విషయం బయటపడింది.థియేటర్లలో 'సలార్'ని బాగానే చూశారు. కానీ టీవీల్లోకి వచ్చేసరికి దీన్ని లైట్ తీసుకున్నారు. ఎందుకంటే థియేటర్లలో ఫ్లాప్ అయిన ఆదికేశ (10.47), స్కంద (8.11)తో పాటు ఓ మాదిరిగి ఆడిన నా సామి రంగ (8.08), మంగళవారం (7.21), బిచ్చగాడు 2 (7.12) చిత్రాలకు కూడా 'సలార్' కంటే ఎక్కువ టీఆర్పీ రావడం అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ హవా నడుస్తోంది. దీని వల్ల టీఆర్పీ తగ్గిందని తెలుస్తోంది. లేదంటే ఎక్కువ వచ్చేదేమో?(ఇదీ చదవండి: ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్) -
టీఆర్పీలో రికార్డు సృష్టించిన స్టార్ మా.. ఆ ఛానల్స్‌ను వెనక్కు నెట్టి..
స్టార్ మా చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. బార్క్ 13వ వారం రేటింగ్స్‌లో అత్యధిక రేటింగ్స్ సాధించింది స్టార్ మా. ప్రైమ్ టైమ్ తోపాటు నాన్ ప్రైమ్ ట్రైమ్‌లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్ రేటింగ్స్ దాటేసింది. 13వ వారం మొత్తమ్మీద స్టార్ మాకు 882 జీఆర్పీల రేటింగ్ వచ్చింది. స్టార్ మా ప్రైమ్‌టైమ్ జీఆర్పీ లలో 342 , నాన్ ప్రైమ్ టైమ్‌లో 510 సాధించింది. నూతన సీరియళ్ల లాంచ్ లోనూ స్టార్ మా తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్ సాధించలేని అరుదైన రికార్డు సాధించింది. ఇటీవలే స్టార్ మాలో ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ నాగపంచమి సీరియల్ 11556 ('000 ఏఎంఏ), బ్రహ్మముడి సీరియల్ 10372.2('000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్‌టీవీలో ప్రారంభమైన వనథై పోలా 9661.2 ('000 ఏఎంఏ); స్టార్ ప్లస్‌లో ప్రారంభమైన ఇమ్లీ 8814.1 ('000 ఏఎంఏ), కలర్స్‌లో నాగిన్ - 5 సీజన్ 8700.5 ('000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి. ఇక స్టార్ మా మూవీస్ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్పీల రేటింగ్ సాధించింది. ఇండియాలో నెంబర్1 మ్యూజిక్ ఛానెల్‌గా స్టార్ మా మ్యూజిక్ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్ ఛానెల్స్‌పై చూపింది. -
కార్తికేయ 2 ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది. 2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. చదవండి: హీరోయిన్ ముఖం నిండా సూదులు, ఏమైంది? ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ -
చిరు 150..అక్కడ అట్టర్ ఫ్లాప్..!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా వెండితెర మీద సరికొత్త సంచలనాలను నమోదు చేసింది. కుర్ర హీరోలకు కూడా షాక్ ఇస్తూ మెగాస్టార్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరోసారి సత్తా చాటాడు. నాన్ బాహుబలి రికార్డు లన్నింటినీ బద్ధలు కొట్టిన ఖైదీ నంబర్ 150, బుల్లి తెర మీద మాత్రం నిరాశపరిచింది. చిరు రీ ఎంట్రీ టెలివిజన్ ప్రీమియర్‌కు కూడా భారీ ప్రచారమే చేశారు. ముఖ్యంగా బుల్లితెరపై చిరు చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో చిరు సినిమాకు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే మరోసారి బుల్లితెరపై మెగాస్టార్ నిరాశపరిచాడు. వెండితెరపై కనక వర్షం కురిపించిన ఖైదీ నంబర్ 150 బుల్లి తెర మీద మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమాను కనీసం రెండకెల టీఆర్పీ కూడా దక్కకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ సినిమాకు కూడా 7.52 టీఆర్పీ రాగా.. మెగా 150కి అంతకన్నా తక్కువగా 6.9 రేటింగ్ మాత్రమే వచ్చింది. గతంలో ఏ సినిమా ప్రీమియర్ విషయంలో లేని విధంగా హిట్ సాంగ్స్‌ను రెండు సార్లు ప్లే చేసినా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ముఖ్యంగా అదే సమయంలో మరో ఛానల్లో సినీ వేడుక ప్రసారం కావటమే చిరు సినిమాకు టీఆర్పీ రేటింగ్ రాకపోవటానికి కారణం అన్న టాక్ వినిపిస్తోంది. -
సంచలనాలు వద్దు..సత్యానికి దగ్గరగా ఉండాలి
ప్రాంతీయ సంపాదకుల సదస్సులో వెంకయ్య నాయుడు సాక్షి, చెన్నై: మీడియా సంచలనాలకు దూరంగా, సత్యానికి దగ్గరగా ఉండే సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో గురువారం నుంచి చెన్నైలో రెండు రోజులపాటు జరుగుతున్న ప్రాంతీయ సంపాదకుల సదస్సును వెంకయ్య ప్రారంభించారు. వార్తను వార్తగానే చూడాలనీ, అందులో సొంత ఆలోచనల్ని రుద్దవద్దని మీడియా సంస్థలను ఆయన కోరారు. పోటీని తట్టుకునేందుకు, టీఆర్పీని పెంచుకునేందుకు మీడియా చిన్న వార్తలను సంచలనాలుగా చూపిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రాంతీయ మీడియా కీలకపాత్ర పోషిస్తోందని కితాబునిచ్చారు. మానవ హక్కులు ఉన్నది మనుషుల కోసమనీ, తీవ్రవాదుల కోసం కాదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో 40 నగరాలను ప్రభుత్వం ఎంపికచేసిందనీ, త్వరలో జాబితా విడుదల చేస్తామన్నారు. సమావేశంలో తమిళనాడు సమాచార శాఖ మంత్రి కడంబూరు రాజు, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి, పీఐబీ డెరైక్టర్ జనరల్ ఫ్రాంక్ నొరోన్హా తదితరులు పాల్గొన్నారు. లెసైన్స్ రాజ్, కోటా రాజ్‌ల కారణంగా 1950 నుంచి మూడు దశాబ్దాలపాటు భారత్ వాణిజ్య, పారిశ్రామిక విప్లవాలను కోల్పోయిందని, డిజిటల్ విప్లవం విషయంలో అలా జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. -
‘టీఆర్పీ’లో బందీగా ‘చానళ్లు’
టీఆర్పీ వ్యవస్థలో బందీగా చానళ్లు ఉన్నాయని సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ డాక్టర్ కే.రామచంద్రమూర్తి అన్నారు. పుస్తకాలు రాయడం చాలాకష్టమన్నారు. చానళ్ల రాకతో జర్నలిజం విస్తరించిందన్నారు. రచయిత నాగసూరి వేణుగోపాల్ రచించిన ‘చర్చనీయాంశాలుగా చానళ్లు’పుస్తకాన్ని రామచంద్రమూర్తి ఆవిష్కరించారు. సాక్షి, చెన్నై:చెన్నై ఆలిండియో రేడియోలో తెలుగు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తెలుగు టీవీ జర్నలిజం తీరు తెన్నుల్ని ఎత్తి చూపుతూ ‘చర్చనీయాంశాలుగా చానళ్లు’ పుస్తకాన్ని రచించారు. తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తేజస్) ఆధ్వర్యంలో ఆస్కా ఆవరణలో ఆదివారం ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డెరైక్టర్ కే.రామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని చెన్నై ఆలిండియో రేడియో డెరైక్టర్ సుబ్రమణియన్ అందుకున్నారు. కే.రామచంద్రమూర్తి ప్రసంగిస్తూ, జర్నలిస్టులు వృత్తి పరంగా రాణిస్తూనే, పుస్తకాల్ని రాయడం అన్నది చాలా కష్టంగా వ్యాఖ్యానించారు. రచయిత ఈ పుస్తకం ద్వారా తన మీద కూడా ఓ బాణాన్ని విసిరినట్టుగా చమత్కరించారు. మీడియాపై గురి పెట్టి వరుసగా పుస్తకాల్ని నాగసూరి రచించడం అభినందనీయమన్నారు. చానళ్ల నిర్వహణ చాలా కష్టంగా పేర్కొంటూ, 24 గంటలు పరుగులు తీయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రేకింగ్‌లో గానీయండి, విజువల్స్‌లో గానీయండి.. అన్నింటా తామే ముందు ఉండాలన్న కాంక్షతో ఉరుకులు పరుగులు తీస్తున్నారని గుర్తుచేశారు. టీఆర్పీలో బందీ: టీఆర్పీ వ్యవస్థలో బందీగా చానళ్లు ఉన్నాయని వివరించారు. సమాజ హితాన్ని కాంక్షించేంత మంచి కార్యక్రమాల్ని ప్రసారం చేసినా, వాటికి మాత్రం టీఆర్పీ రేటింగ్స్ రావడం లేదన్నారు. అదే, ఓ ప్రకటన కార్యక్రమాన్ని ప్రసారంచేస్తే చాలు రేటింగ్స్ పెరుగుతోన్నాయని పేర్కొన్నారు. ప్రకటనలకు ఉన్నంత రేటింగ్స్, మంచి వార్తలు, కథనాలు రాకపోవడం శోచనీయమన్నారు. ఇక, చానళ్లలో ఉంటేచాలు గొప్పగా ప్రజాసేవ కూడా చేయొచ్చని పేర్కొన్నారు. హెచ్ఎం టీవీలో తాను ఉన్నప్పుడు అప్పటి హోం మంత్రి చిదంబరం చేసిన ప్రత్యేక తెలంగాణ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ దశదిశ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాల గురించి ఈసందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తాను ప్రతి జిల్లాలో పర్యటించానని, ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఎవ్వరూ చేయనంతగా ఆరేడు గంటల పాటుగా ప్రత్యక్ష ప్రసారాలు అందించామన్నారు. ప్రస్తుతం టీవీ చానళ్లలో అనవసర విషయాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. అలాగే, అశ్లీలత చోటుచేసుకుంటున్నాయని, పెయిడెడ్ వార్తలూ పెరిగాయని పేర్కొన్నారు. ఇవన్నీ ఉన్నా, అనేక ప్రయోజనకర విషయాలు చానళ్ల ద్వారా వెలుగులోకి వచ్చాయని వివరించారు. గుజరాత్ ఘటన గురించి నేటికీ చర్చ ఏదో ఒక మూల సాగుతున్నదంటే, టీవీ చానళ్ల వల్లేనన్నారు. పత్రికలు సైతం వెలుగులోకి తీసుకురాని అనేక విషయాలను ఆ ఘటనకు సంబంధించి టీవీ చానళ్లు తీసుకొచ్చాయని వివరించారు. టీవీ చానళ్ల తీరుతెన్నుల గురించి పుస్తకాన్ని తీసుకొచ్చిన రచయిత, ఎవర్నీ నొప్పించుకుండా వ్యవహరించి ఉన్నారని ఈసందర్భంగా అభినందించారు. పుస్తక సమీక్ష:చెన్నై ఆలిండియో రేడియో డెరైక్టర్ కే.సుబ్రమణియన్ ప్రసంగిస్తూ, తనకు తెలుగు నేర్చుకోవాలన్న ఆశ ఉందని, ఏదో ఒక రోజు తెలుగులో తప్పకుండా ప్రసంగిస్తానని పేర్కొన్నారు. అలాగే, సంగీతం అంటే, తెలుగేనని వ్యాఖ్యానించారు. ఇక, ది హిందూ పత్రిక ప్రముఖ కార్టూనిస్టు సురేంద్ర ఈ పుస్తకం గురించి సమీక్షించారు. ఒకప్పటి అద్భుత ప్రగతిని ఇప్పుడు అధోగతి పాలు చేస్తున్నారంటూ చానళ్ల తీరు తెన్నుల్ని ఎత్తిచూపారు. రచయిత నాగ సూరివేణుగోపాల్ ప్రసంగిస్తూ, చెన్నైలో ఒకప్పుడు తెలుగు పత్రికలు దొరికేవి కావని, ఇప్పుడు పత్రికలు, చానళ్లు వచ్చాయని, డీటీహెచ్లు రావడంతో అన్ని చానళ్లు ప్రసారమవుతున్నాయని గుర్తుచేశారు. అయితే, తెలుగు చానళ్లను అడ్డుకునే కార్యక్రమాలూ సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ తెలుగు వారు అధికం అని గుర్తు చేస్తూ, ఇక్కడి తెలుగు వారి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వారు తెలుసుకునే రీతిలో పత్రికల్లో చోటు కల్పించాలని విన్నవించారు. ముందుగా జర్నలిస్టు అసోసియేషన్ చేస్తున్నకార్యక్రమాల గురించి తేజస్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు వివరించారు. తేజస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు మన్నవ గంగాధర ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, కోశాధికారి గోటేటి వందన సమర్పణ చేశారు.