రికార్డు బద్ధలు కొట్టిన బిగ్‌బాస్‌.. ఈసారే అత్యధిక టీఆర్పీ! | Bigg Boss Telugu 8 Launch Episode TRP Details | Sakshi

బిగ్‌బాస్‌ 8 లాంచింగ్‌ ఎపిసోడ్‌ టీఆర్పీ ఎంతంటే? అన్ని సీజన్ల కంటే..

Sep 13 2024 6:13 PM | Updated on Sep 13 2024 7:15 PM

Bigg Boss Telugu 8 Launch Episode TRP Details

బిగ్‌బాస్‌ ప్రారంభానికి ముందు తిట్టుకున్నవాళ్లే ఈ రియాలిటీ షోను ఎక్కువగా చూస్తూ ఉంటారు. జనాలకు పెద్దగా తెలియని ముఖాలను తీసుకొచ్చినా సరే కొద్దిరోజుల్లోనే వారు అందరికీ సుపరిచితులైపోతారు. అటు హౌస్‌లో కంటెస్టెంట్లు గొడవపడుతుంటే వారికోసం అభిమానులు సోషల్‌ మీడియాలో యుద్ధాలు చేస్తుంటారు. 

ఫస్ట్‌ సీజన్‌ లాంచ్‌ ఎపిసోడ్‌ రేటింగ్‌ ఎంతంటే?
ఇకపోతే ఈసారి పెద్దగా అంచనాలు, హడావుడి లేకుండానే బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ (#BiggBossTelugu8) ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్‌ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్‌​ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన మొదటి సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌ ప్రారంభ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్‌ వచ్చింది.

అత్యల్పంగా ఆ సీజన్‌లో
మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. అలా మూడో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు 17.92, నాలుగో సీజన్‌కు 18.50, ఐదో సీజన్‌కు 18, ఆరో సీజన్‌కు అన్నింటికంటే తక్కువగా 8.86 రేటింగ్‌ వచ్చింది. ఏడో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు 18.1 రేటింగ్‌ వచ్చింది. ఎనిమిదో సీజన్‌ ఏకంగా 18.9 టీఆర్పీ రాబట్టి ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. మొత్తానికి నాగ్‌ తన రికార్డును తానే బ్రేక్‌ చేస్తూ.. దారి తప్పిన బిగ్‌బాస్‌ను మళ్లీ పట్టాలెక్కించాడన్నమాట!

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement