ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
మెగా చీఫ్ నా కొంప ముంచింది
మొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు సాఫ్ట్‌గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్‌మేట్స్‌కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు.
ఎందుకంత తుత్తర?
ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్‌పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్‌లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది.
పృథ్వీతో ఫ్లర్ట్ చేశా
విష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్‌ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్‌లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు.
సారీ చెప్పాలి కదా!
ఈ సందర్భంగా నిఖిల్‌తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్‌ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.
వీడియోతో క్లారిటీ
నిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్‌పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్‌లో గౌతమ్ నిఖిల్‌ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్‌ను గెస్ చేయమన్నాడు నాగ్.
అవినాష్ ఊహించిందే నిజమైంది
ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్‌లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది.
ఆ ముగ్గురు హీరోలు: రోహిణి
గౌతమ్‌తో.. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్‌కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్‌తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్‌ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్‌లా బయటకు వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment