Gautham Krishna
-
బిగ్‌బాస్ షోలో మెకానిక్ రాకీ.. గౌతమ్‌పై రౌడీలా దూసుకొచ్చిన పృథ్వీ
బిగ్‌బాస్ హౌస్‌లోకి మెకానిక్ రాకీ వచ్చేశాడు. ఏకంగా ఆటో వేసుకుని మరీ మెయిన్ గేట్ నుంచి లోనికి దూసుకొచ్చాడు. విశ్వక్ సేన్ ఇలా ఆటోలో హౌస్‌లోకి రావడం చూసి కంటెస్టెంట్లు సర్ప్రైజ్ అయ్యారు. తాను కూడా కంటెస్టెంట్‌గా వచ్చానంటూ హీరో అందర్నీ సరదాగా ఆటపట్టించాడు.మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన ఆయన అందరితో కలిసి ఫన్నీ స్కిట్ చేశాడు. చివరగా హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా వేశాడు. మరో ప్రోమోలో.. నిఖిల్, రోహిణిలలో ఒకర్ని కంటెండర్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌పై భారం వేశాడు. ఈ సందర్భంగా గౌతమ్.. చాలామంది హౌస్మేట్స్ కలిసి వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు అంటూ వైల్డ్ కార్డ్ రోహిణికి సపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ, గౌతమ్ గొడవపడ్డారు. పృథ్వీ వాడు వీడంటూ నోరు జారడంతో గౌతమ్... మంచిగా మాట్లాడమని హెచ్చరించాడు. అయినా కూడా పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సైగ చేస్తూ అతడి పైపైకి వెళ్లాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అందరికంటే విష్ణుప్రియ ఎక్కువ ఇష్టం: పృథ్వీ తల్లి
కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ హౌస్‌లో అడుగుపెట్టేకొద్దీ మిగతావారంతా తమవారి కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ గేటు వైపు ఆశగా చూస్తున్నారు. ఈ రోజు విష్ణుప్రియ తండ్రి హౌస్‌లోకి అడుగుపెట్టగా పృథ్వీ తల్లి, గౌతమ్ సోదరుడు ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు.పృథ్వీ తల్లి సత్యభామ అలా ఇంట్లో అడుగుపెట్టగానే తన తల్లి గుర్తొచ్చి తేజ విలవిలా ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తున్నారు, మా అమ్మను కూడా పంపించండంటూ బిగ్‌బాస్‌ను కన్నీటితో వేడుకున్నాడు. ఇకపోతే పృథ్వీ తల్లి అందరిలోకెల్లా తనకు విష్ణు అంటే ఇష్టమంది. ఆమెకు ప్రేమగా గోరుముద్దలు సైతం తినిపించింది. విష్ణుప్రియ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. అటు గౌతమ్ సోదరుడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలాంటివి వద్దు, అందరికీ ఇంటిసభ్యుల నుంచి ఇన్పుట్స్ వెళ్లాయి కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడమని తెలిపాడు. -
తేజకు దారుణమైన పనిష్మెంట్.. త్యాగానికి రోహిణి రెడీ!
టేస్టీ తేజకు దెబ్బమీద దెబ్బ పడింది. ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో అతడు చేసిన తప్పిదం వల్ల వచ్చేవారం కంటెండర్ అయ్యే అవకాశం కోల్పోయాడు. అటు హౌస్మేట్స్ వల్ల తన ఫ్యామిలీ హౌస్‌లోకి వచ్చే ఆస్కారమే లేదట.. అదెలాగో నేటి ఎపిసోడ్ (నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..సిగ్గు లేకుండా..మెగా చీఫ్ ప్రేరణ మాట ఎవరూ వినడం లేదు. పెండింగ్‌లో ఉన్న పని చేయమంటే విష్ణు కస్సుబుస్సులాడుతుంది. సీతాఫలం తినొద్దు అని చెప్పినా ఉన్న ఒక్కదాన్ని లటుక్కుమని గౌతమ్ ఆరగించేశాడు. వద్దని చెప్పినా ఎలా తిన్నావు? సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావని గౌతమ్‌పై ఫైర్ అయింది. అటు స్వీట్లు తినను అని బిగ్‌బాస్‌కు మాటిచ్చిన నబీల్.. హల్వా తిని ఆ నియమాన్ని ఉల్లంఘించాడు.తేజకు శిక్షఇక నాగార్జున వచ్చీరావడంతోనే ఎవిక్షన్ షీల్డ్ గేమ్ అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణమైన తేజను వాయించాడు. నీకంటే ముందు వచ్చిన జంటలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మాత్రం యష్మితో కలిసి ఒక అభిప్రాయానికి రాకుండా నీకు నచ్చింది చేశావని సీరియస్ అయ్యాడు. అతడు చేసిన తప్పుకుగానూ వచ్చేవారం చీఫ్ కంటెండర్‌వి కాలేవని శిక్ష విధించాడు.ఎవిక్షన్ షీల్డ్ ఎవరికివ్వాలో డిసైడ్ చేసిన ప్రేరణఇక ఎవిక్షన్ షీల్డ్ రేసులో మిగిలిన రోహిణి, నబీల్, నిఖిల్‌లలో ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలో హౌస్మేట్స్ డిసైడ్ చేయాలన్నాడు. ఈ క్రమంలో రోహిణికి ప్రేరణ, గంగవ్వ, తేజ సపోర్ట్ చేయగా నిఖిల్‌కు హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ సపోర్ట్ చేశారు. నబీల్‌కు గౌతమ్, యష్మి, అవినాష్ మద్దతిచ్చారు. ముగ్గురికీ సమాన ఓట్లు పడటంతో చీఫ్ ప్రేరణపై భారం వేశారు. ఆమె నబీల్‌కు సపోర్ట్ ఇవ్వడంతో అతడు ఎవిక్షన్ షీల్డ్ అందుకున్నాడు.అంతరాత్మపై ఒట్టేసి..అనంతరం నాగార్జున.. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలుస్తూ.. నీపై నువ్వు ప్రమాణం చేసుకుని ఈ సీజన్లో వరస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పాలన్నాడు. మొదటగా నబీల్.. తన ఫోటోపై ఒట్టేసి విష్ణుప్రియను వరస్ట్ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. నిఖిల్.. తప్పు చేసినా రుబాబు చూపిస్తాడు, వెటకారం ఎక్కువ అంటూ తేజ వరస్ట్ ప్లేయర్ అన్నాడు. హరితేజ, యష్మి.. రోహిణిని, గౌతమ్, తేజ.. పృథ్వీని, అవినాష్.. హరితేజను, రోహిణి, గంగవ్వ.. యష్మిని, విష్ణుప్రియ, పృథ్వీ.. తేజను చెత్త ప్లేయర్ అని పేర్కొన్నారు. తేజకు కోలుకోలేని దెబ్బప్రేరణ.. గెలవాలన్న ఆసక్తి లేదంటూ విష్ణుప్రియ వరస్ట్ ప్లేయర్ అని తెలిపింది. వరస్ట్ హౌస్మేట్స్ అని ఎక్కువ ఓట్లు పడ్డ వ్యక్తికి ఫ్యామిలీ వీక్‌లో వారి కుటుంబసభ్యులు రాబోరని నాగ్ బాంబు పేల్చాడు. ఈ సీజన్లో తేజను వరస్ట్ ప్లేయర్‌గా డిసైడ్ చేశారు. కేవలం తల్లిని తీసుకురావడానికే ఈ సీజన్‌కు వచ్చాను సర్ అంటూ తేజ కన్నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేశాడు.గంగవ్వ ఎలిమినేట్దీంతో రోహిణి.. నా ఫ్యామిలీకి బదులుగా నీ కుటుంబసభ్యులు రావాలని బిగ్‌బాస్‌ను అభ్యర్థిస్తానంది. అటు గంగవ్వ ఆరోగ్యం గురించి నాగ్ ఆరా తీశాడు. ఆమె తన ఒళ్లంతా మంట లేస్తోందంటూ.. సంతోషంగానే ఉన్నాను కానీ చేతనవడం లేదని తెలిపింది. దీంతో ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. గంగవ్వ వెళ్లిపోతుంటే రోహిణి, తేజ గుక్కపెట్టి ఏడ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు?
బిగ్‌బాస్ 8లో అప్పుడే పదోవారం వచ్చేసింది. నయని పావని ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఎప్పటిలానే సోమవారం నామినేషన్స్ సందడి మొదలైంది. కాకపోతే ఇద్దరికి బదులు ఒక్కరినే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఒకరిపై ఒకరు అరుస్తూ రచ్చ లేపారు.తాజాగా రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో పృథ్వీ.. రోహిణిని నామినేట్ చేశాడు. 'నెక్ ఫ్యాంటసీ' అనడం తనకు అస్సలు నచ్చేలేదని, అదో పెద్ద బూతు అన్నట్లు సీన్ క్రియేట్ చేశాడు. కానీ రోహిణి అస్సలు ఊరుకోలేదు. గట్టిగానే ఇచ్చిపడేసినట్లు కనిపించింది. మరోవైపు హరితేజ.. ప్రేరణని నామినేట్ చేసింది. ఈ నామినేషన్ కూడా మంచి ఫన్ ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఇక గౌతమ్-నిఖిల్ మధ్య హీట్ పుట్టించే డైలాగ్ వార్ నడిచినట్లు తెలుస్తోంది. 'అశ్వద్ధామ ఈజ్ బ్యాక్' అని మళ్లీ గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో నిఖిల్ ఊరుకుంటాడా.. 'సరే నువ్వు బయటకెళ్లడానికి రెడీ హా. బయటకు వెళ్లి చూసుకుని వద్దాం, అమ్మతోడు దమ్ముంటే గేట్ తీయమను' అని అనేసరికి.. 'పదా.. దా' అని గౌతమ్ గట్టిగానే ఛాలెంజ్ చేసినట్లు తెలుస్తోంది.ఓవరాల్‌గా ఈ వారం నామినేషన్స్‌లో హరితేజ, యష్మి, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్, విష్ణుప్రియ ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వాళ్ల సంగతేమో గానీ గౌతమ్-నిఖిల్ మధ్య మినీ మాటల యుద్దమే జరిగిందని తెలుస్తోంది. అయితే ఎవరు ఎవరిని ఏ కారణం చెప్పి నామినేట్ చేశారనేది తెలియాలంటే రాత్రికి ఫుల్ ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: బిగ్‌బాస్: నయని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
వాళ్లతో ఒకలా.. రోహిణితో మరోలా.. హర్టయిన లేడీ కమెడియన్
శనివారం నాడు హౌస్‌మేట్స్‌కు క్లాసులు పీకే నాగార్జున ఆదివారం రాగానే వారితో గేమ్స్ ఆడిస్తాడు. ఫన్నీ టాస్కులు, డ్యాన్సు స్టెప్పులతోనే ఎపిసోడ్ అంతా భలే గమ్మత్తుగా సాగుతూ ఉంటుంది. ఎలిమినేషన్ అంటారా? షూటింగ్ ఒకరోజు ముందే అయిపోవడంతో ఎలిమినేట్ అయ్యిందెవరనేది ఆల్రెడీ లీకైపోయి ఉంటుంది. హౌస్‌లోకి కన్నీళ్ల కడవ ఎత్తుకొచ్చిన నయని పావని ఈ వారం ఎలిమినేట్ అయింది.హుషారైన డ్యాన్స్ఇకపోతే ఫండే ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు రిలీజవగా అందులో గౌతమ్ హుషారుగా అందరితో కలిసి డ్యాన్స్ వేశాడు. యష్మి, హరితేజతో యమ హుషారుగా స్టెప్పేసిన గౌతమ్ తనతో మాత్రం అంత జోష్‌గా డ్యాన్స్ చేయలేదని హర్టయింది రోహిణి. దీంతో నాగ్.. అక్కతో ఫీలింగ్ వేరే ఉంటుందిలే అని సెటైర్ వేశాడు. మొత్తానికి నిన్న కంటెస్టెంట్ల ఫేసులు మాడిపోగా ఈ రోజు టాస్కుల వల్ల ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అక్క అంటే నీకేమైనా సమస్యా? యష్మిని నిలదీసిన నాగ్
వచ్చీరాగానే మెగా చీఫ్ అయి తన సత్తా నిరూపించుకున్నాడు గౌతమ్. కానీ ఏమైంది? వచ్చినవారం తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయిపోయేవారు. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల అతడు హౌస్‌లో ఉండగలిగాడు. ఒకసారి దెబ్బ తగలడంతో తన ఆట, మాట అన్నింటినీ ఓసారి రీచెక్ చేసుకున్నాడు.క్రష్‌ను అక్క అనేసిన గౌతమ్యష్మితో క్రష్ అంటూ లవ్ ట్రాక్ నడపడం జనాలకు నచ్చలేదేమో అని రియలైజ్ అయ్యాడు. ఆమెను కూడా అందరితో సమానంగా చూశాడు. ఈ క్రమంలో నామినేషన్స్‌లో ఆమెతో గొడవపడేటప్పుడు అక్కా అనేశాడు. అయితే అక్కా అని పిలవద్దని యష్మి తోకతొక్కిన తాచుపాములా లేచి బుసలు కొట్టింది.రెండు బూతు పదాలు తెలుసుకున్నాకట్ చేస్తే నయనితో గొడవ జరిగినప్పుడు కూడా గౌతమ్ ఆమెను అక్కా అన్నాడు. దీంతో ఆమె కూడా అక్కా అనొద్దంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. దీని గురించి నాగ్ తాజా ప్రోమోలో చర్చించాడు. కొత్తగా రెండు బూతు పదాలు తెలిశాయి, ఒకటి అక్క, రెండోది బ్రదర్ అని నాగ్ సెటైర్లు వేశాడు. అక్కా అంటే ప్రాబ్లం ఏంటని యష్మిని అడిగాడు. మధ్యలో ఎందుకు మాట్లాడావ్?నామినేషన్స్‌లో గౌతమ్ విష్ణుతో మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలో దూరావని ప్రశ్నించాడు. మరింత క్లారిటీ కోసం వీడియో కూడా చూపించాడు. అందులో గౌతమ్ అక్కా అనగానే యష్మి తమ్ముడు అనేసింది. సడన్‌గా క్రష్ అని, సడన్‌గా అక్కా అనేసరికి తీసుకోలేకపోయానని యష్మి బదులిచ్చింది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్‌పై పగ తీర్చుకున్నారుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?
క్లాన్ (టీమ్) గొడవలకు చెక్ పెడుతూ బిగ్‌బాస్.. ఓజీ, రాయల్ క్లాన్స్‌ను ఏకం చేసేశాడు. ఇకపై హౌస్ అంతా ఒకే ఒక్క మెగా టీమ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. వీరికి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ను నాలుగు టీమ్స్‌గా విభజించాడు.పగ తీర్చుకున్న నిఖిల్ టీమ్ఈ క్రమంలో నిన్న రెడ్ టీమ్.. బ్లూ టీమ్‌కు మొత్తం మూడు ఎల్లో కార్డ్స్ ఇచ్చింది. దీంతో బ్లూ టీమ్‌లో గంగవ్వను గేమ్ నుంచి సైడ్ చేశారు. తాజా ప్రోమోలో బ్లూ టీమ్ రెడ్ టీమ్‌పై పగ తీర్చుకుంది. ఇదివరకే ఓ ఎల్లోకార్డ్ ఇవ్వగా ప్రోమోలో మరో ఎల్లో కార్డ్ ఇచ్చారు. దీంతో ప్రేరణ, యష్మి, గౌతమ్.. తమలో ఎవరు సైడ్ అవ్వాలనేదానిపై చర్చించుకున్నారు. చివరకు గౌతమ్‌ను సైడ్ చేసేశారు.కొత్త చీఫ్ ఎవరంటే?ఇక తాడో పేడో టాస్కులో విజృంభించి ఆడిన నిఖిల్.. టాస్కుల్లో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ వారం నిఖిల్ బ్లూ టీమ్‌లోని సభ్యులే చీఫ్ అయ్యారట. ముక్కు అవినాష్ మెగా చీఫ్ అయినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని అక్కా అనేసిన గౌతమ్, నామినేషన్స్‌లో ఐదుగురు
అటు ఓజీలు(పాత కంటెస్టెంట్లు) విష్ణుప్రియను కంటెండర్‌గా సెలక్ట్ చేస్తే రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఏకంగా ఆమెను మెగా చీఫ్‌గా సెలక్ట్ చేశారు. గేమ్‌లో కనిపించట్లేదన్నవారితో సహా దాదాపు అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు. అందుకేనేమో బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్ విష్ణుకు టఫ్‌గా ఉండేలా పెట్టాడు.దీంతో ఆమె గౌతమ్, తేజ, హరితేజలను నామినేట్ చేసింది. ఈ క్రమంలో గౌతమ్, యష్మికి మధ్య వాదులాట జరిగింది. నువ్వు ఆగు అక్కా.. అని గౌతమ్ అనగా.. నన్ను అక్కా అనకు, యష్మి అని పిలువు అని అరిచేసింది. ఒకసారి క్రష్, ఒకసారి అక్కా అని పిలవకు అని వార్నింగ్ ఇచ్చింది. ఇక గౌతమ్, పృథ్వీ దమ్ము చూపించుకుందాం రా అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ఈ వారం యష్మి, గౌతమ్, నయని పావని, హరితేజ, తేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
జీరో టు హీరో అయ్యే ఓ అబ్బాయి కథే ‘సోలో బాయ్’: నిర్మాత సతీష్
‘‘కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. గతంలో నేను తీసిన ‘బట్టల రామస్వామి బయోపిక్, అందరి బంధువయా’ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ దక్కింది. త్వరలోనే ‘కాఫీ విత్ ఏ కిల్లర్, సోలో బాయ్’ సినిమాల విడుదలను ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాలూ ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్. బుధవారం (అక్టోబరు 23) ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా మంగళవారం సతీష్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రానున్న ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాకు ఆర్పీ పట్నాయక్‌గారు దర్శకత్వం వహించారు. ఇక జీరో నుంచి హీరో అయ్యే ఓ అబ్బాయి కథగా ‘సోలో బాయ్’ సినిమా ఉంటుంది. ఇందులో గౌతమ్ కృష్ణ హీరోగా నటించారు. శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రక టిస్తాం’’ అని తెలిపారు. -
బిగ్‌బాస్: నామినేషన్స్‌లో ఆరుగురు.. ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ మొదలైందే పద్నాలుగో మందితో! అందులో ఆరుగుర్ని పంపించేశాక ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను దింపారు. అప్పటినుంచి ఆట రసవత్తరంగా మారింది. అయితే వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కూడా పాత కంటెస్టెంట్లు సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. నిజానికి ఇందులో మణికంఠకు బదులు గౌతమ్ వెళ్లిపోవాల్సింది.కానీ ఆరోగ్యం సహకరించడం లేదంటూ మణి స్వతాహాగా బయటకు వచ్చేశాడు. ఇక గౌతమ్ మెగా చీఫ్ కావడంతో ఎనిమిదో వారం నామినేషన్స్ నుంచి బతికిపోయాడు. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణు, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నారట.. గౌతమ్ తనకున్న పవర్‌తో హరితేజను నామినేషన్స్‌లో నుంచి సేవ్ చేసినట్లు సమాచారం! మరి ఈ ఆరుగురిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు? ఎవరు సేవ్ అవుతారనేది చూడాలి!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాపం గౌతమ్.. వెళ్లిపోయేముందు వాళ్లను ముంచేసిన మణికంఠ
బిగ్‌బాస్ అనేది గోల్డెన్ ఛాన్స్. ప్రేక్షకులకు దగ్గరచేసే సాధనం, ఫ్రీ పబ్లిసిటీ! అలాంటిది.. ప్రేక్షకులు తనను సేవ్ చేసినా కాదనుకుని వెళ్లిపోయాడు. షో గెలుస్తానన్న అతడు ఏడువారాలకే తన వల్ల కావట్లేదని చేతులెత్తేశాడు. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (అక్టోబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..రెండు జంటల డ్యాన్స్ హైలైట్బిగ్బాస్ హౌస్‌లో అందరూ సమానమే.. లింగబేధం, కమ్యూనిటీ బేధాలుండవని నాగార్జున హౌస్‌మేట్స్‌కు నొక్కి చెప్పాడు. దీంతో కమ్యూనిటీ గురించి మాట్లాడిన నబీల్, మెహబూబ్ ముఖం వాడిపోయింది. తర్వాత నాగ్.. యష్మిని సేవ్ చేసి హౌస్‌మేట్స్‌తో చిత్రం భళారే విచిత్రం గేమ్ ఆడించాడు. ఇందులో అబ్బాయిల టీమ్ విజయం సాధించింది. ఈ గేమ్‌లో విష్ణు-పృథ్వీ, యష్మి- గౌతమ్ జంటల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తర్వాత నాగ్ నిఖిల్‌ను సేవ్ చేశాడు.డైలాగ్ డెడికేషన్హౌస్మేట్స్పై సోషల్ మీడియాలో వైరలవుతున్న కొన్ని మీమ్స్ చూపించడంతో అందరూ పగలబడి నవ్వారు. నబీల్ను సేవ్ చేసిన అనంతరం డైలాగ్ డెడికేషన్ అని మరో గేమ్ ఆడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా కొన్ని డైలాగులను హౌస్‌మేట్స్‌కు అంకితమివ్వాలన్నాడు. అలా మొదటగా నిఖిల్.. నువ్వు ఊరుకోమ్మా.. ఊరికే తుత్తుత్తు అంటావ్.. అన్న డైలాగ్ బోర్డును ప్రేరణ మెడలో వేశాడు. హరితేజ.. వీడిని ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా డైలాగ్ నాగమణికంఠకు అంకితమచ్చింది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారుతేజ.. అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయాను డైలాగ్ అవినాష్‌కు సూట్ అవుతుందన్నాడు. విష్ణుప్రియ.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు డైలాగ్ గంవ్వకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంది. తు సమ్జా.. నై సమ్జా డైలాగ్ పృథ్వీకి సరిపోతుందన్నాడు మెహబూబ్. ఇక నయని.. నవ్వాపుకుంటున్నావ్ కదరా డైలాగ్ బోర్డును విష్ణు మెడలో వేసింది. అన్న రూల్స్ పెడ్తాడు కానీ ఫాలో అవడు డైలాగ్ నిఖిల్‌కు సెట్ అవుతుందన్నాడు గౌతమ్. సరె సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి? అన్న డైలాగ్‌ను విష్ణు మెడలో వేసింది రోహిణి. బేసిక్ సెన్స్ ఉండదునాకు అర్థం కాలేదు సార్ డైలాగ్ పృథ్వీకి సెట్ అవుతుందన్నాడు మణి. నువ్వు అంత హార్ష్‌గా మాట్లాడకు, ఫీల్ అవుతాను డైలాగ్ తేజకు డెడికేట్ చేసింది యష్మి. నబీల్ వంతు రాగా.. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం డైలాగ్‌ను గౌతమ్‌కు అంకితమిచ్చాడు. గంగవ్వ.. బేసిక్ సెన్స్ ఉండదు, అంటే ఏమో హర్ట్ అయిపోతారు అన్న డైలాగ్ నయనికి డెడికేట్ చేసింది. ఓవరాక్షన్ చేస్తున్నావేంట్రా, ఓవరాక్షన్ అన్న బోర్డును అవినాష్.. పృథ్వీకి ఇచ్చాడు. నాకు ఇంట్రస్ట్ పోయింది సర్ అన్న డైలాగ్‌ను మణికి డెడికేట్ చేసింది ప్రేరణ. మండుతున్నట్లుంది డైలాగ్‌ను మెహబూబ్‌కు అంకితమిచ్చాడు పృథ్వీ. మణికంఠ ఎలిమినేట్తర్వాత నాగ్.. పృథ్వీని సేవ్ చేశాడు. చివర్లో గౌతమ్, మణికంఠ మిగిలారు. ఈ క్రమంలో మణి తనవల్ల కావట్లేదు, వెళ్లిపోతానన్న వీడియను హౌస్‌మేట్స్‌కు ప్లే చేసి చూపించాడు నాగ్. అతడు ఉండాలా? వద్దా? అని హౌస్‌మేట్స్‌ను అడగ్గా మెజారిటీసభ్యులు మణి వెళ్లడమే బెటర్ అన్నారు. చివరిసారి మణికంఠను అడిగి చూశాడు నాగ్. అప్పటికీ అతడు వెళ్లిపోయేందుకే మొగ్గుచూపాడు. దీంతో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అయితే మణికంఠ కంటే గౌతమ్‌కు తక్కువ ఓట్లు పడ్డాయన్నాడు. నిజానికి ఎలిమినేట్ కావాల్సింది గౌతమ్ అని చెప్పాడు. ఎక్కడ తప్పు జరుగుతోందని గౌతమ్ ఆలోచనలో పడిపోయాడు. ఆ ఐదుగురినీ బోటు ఎక్కించాడుఅటు మణికంఠ.. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలా నవ్వుతూ వెళ్లిపోయాడు. పోరాడలేకపోయాను, నా ఓపిక అయిపోయిందంటూ హౌస్మేట్స్ దగ్గర సెలవు తీసుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన మణికంఠతో నాగ్ ఓ గేమ్ ఆడించారు. అందులో భాగంగా మణి.. నయని, విష్ణుప్రియ, నబీల్, హరితేజ, మెహబూబ్ ఫోటోలను బోటు ఎక్కించాడు. మెహబూబ్‌కు విన్నర్‌కు కావాల్సిన లక్షణాలున్నాయన్నాడు. అనంతరం ఆటలో ఒకప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదు, ఫినాలే వరకు వస్తావని ఆశిస్తున్నానంటూ నిఖిల్ ఫోటోను నీటిలో ముంచేశాడు. మునిగిపోతావ్, జాగ్రత్త..తేజ ఎనర్జీ చూపించకపోతే ముగిపోతాడన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆడితే బెటర్ అంటూ పృథ్వీని ముంచాడు. అవసరమైనప్పుడే నోరు విప్పు.. వచ్చిన మొదటివారమే చీఫ్ అయ్యావ్.. ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయకపోతే ఆటలో మునిగిపోతావని గౌతమ్‌ను హెచ్చరించాడు. అనవసరమైన చోట నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం వల్ల నీ ఆటకే ఎసరు పడుతుందని ప్రేరణ ఫోటోను ముంచాడు. చివర్లో ప్రేక్షకుల ఓట్లను కాదని వెళ్లిపోయినందుకు తనను క్షమించమని వేడుకున్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్
ఈ వారం నామినేషన్స్ పూర్తయిన దగ్గర నుంచి ఓవర్ స్మార్ట్ అనే టాస్క్ నడుస్తోంది. ఒకరిని ఒకరు కొట్టుకుంటారా అన్నంతలా బుధవారం గురువారం ఎపిసోడ్ నడిచాయి. ఇప్పుడు మెగా చీఫ్ ఎవరవుతారనే దానికోసం పోటీలు జరిగాయి. ఇందులో గౌతమ్ గెలిచాడు. కాకపోతే మణికంఠ చేసిన చిన్న తప్పు ఇతడికి ఈ పదవి వరించేలా చేసింది. నిఖిల్ గురించి గంగవ్వ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో (అక్టోబర్ 18) ఏమేం జరిగిందనేది చూద్దాం?(ఇదీ చదవండి: అతనితో లిప్‌లాక్ సీన్.. చాలా చిన్న విషయం అన్నాడు: సీనియర్ నటి)తుస్సుమనిపించిన ఓజీ క్లాన్ఓవర్ స్మార్ట్ టాస్క్ జరుగుతుండగానే బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కొన్ని గుర్తులు ఉన్న తలగడలు ఉంచారు. టీవీలో సింబల్ చూపించగానే అలాంటి తలగడని తీసుకెళ్లి మరోచోట గీసిన బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. తాను ఎంతమంది చెబితే అందరూ రావాలని, బాక్స్‌లో తలగడ పెట్టేంతవరకు అడ్డుకోవచ్చని ఒక్కసారి తలగడ పెట్టిన తర్వాత మాత్రం వ్యక్తిని తాకకూడదని క్లారిటీ ఇచ్చాడు. ఇందులో తొలి రెండుసార్లు ఓజీ క్లాన్ గెలిచింది. కానీ తర్వాత మాత్రం రాయల్ క్లాన్ పూర్తి ఆధిపత్యం చూపించింది.నిఖిల్ డేంజర్ గాడుఈ టాస్క్‌లో గెలిచిన రాయల్ క్లాన్‌కి బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఓజీ క్లాన్లోని ఇద్దరిని మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయొచ్చని అన్నాడు. దీంతో ఓజీ క్లాన్ అంతా మాట్లాడుకుని నిఖిల్, నబీల్ అనుకున్నారు. గంగవ్వని పిలిచి అభిప్రాయం అడిగితే.. నిఖిల్ గాడిని తీసేయాలే, ఆడు పెద్ద డేంజర్ గాడు అని చెప్పింది. దీంతో అందరూ నవ్వేశారు. అలా నిఖిల్, నబీల్‌ని రేసు నుంచి తప్పించారు.వాళ్లందరూ పోటీలోఅప్పటికే నిఖిల్, నబీల్, పృథ్వీ గేమ్‌లో ఔట్ అయిపోయారు. సరిగ్గా ఈ టైంలో ఓవర్ స్మార్ట్ టాస్క్ పూర్తయిందని ఈ ముగ్గురు తప్పితే మిగిలిన వాళ్లందరూ మెగా చీఫ్ కంటెండర్ పోటీకి అర్హులే అని బిగ్‌బాస్ ప్రకటించాడు. 'పట్టుకో లేదే తప్పుకో' పేరుతో టాస్క్ పెట్టాడు. దీని ప్రకారం ఓ రౌండ్ ప్లేస్‌లో కుక్క ఎముక బొమ్మ ఉంటుంది. బజర్ మోగినప్పుడు తొలుత ఎవరైతే పట్టుకుంటారో గేమ్ నుంచి మరొకరిని సరైన కారణం చెప్పి ఎలిమినేట్ చేయొచ్చని అన్నాడు. నిఖిల్‌ని సంచాలక్‌గా పెట్టాడు.(ఇదీ చదవండి: పోలీసుల అదుపులో తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్!)గౌతమ్ తెలివితేటలుతొలిసారి బజర్ మోగిన వెంటనే అందరూ బోన్ మీద పడ్డారు. కానీ చివరకు గౌతమ్-మెహబూబ్ మాత్రమే దక్కించుకునేందుకు తెగ గింజుకున్నారు. చివరకు గౌతమ్ పట్టేసుకున్నాడు. అవినాష్-మెహబూబ్లనే తప్పిస్తున్నట్లు చెప్పాడు. వాళ్లు బలమైన కంటెస్టెంట్స్ అని, అందుకే ఎలిమినేట్ చేస్తున్నా అని కారణం చెప్పాడు. రెండోసారి మోగినప్పుడు అమ్మాయిలందరూ బోన్ కోసం చాలా ప్రయత్నించారు. కానీ గౌతమ్ బలం ముందు వాళ్లు నిలబడలేకపోయారు. ఈసారి విష్ణుప్రియ-ప్రేరణని తప్పిస్తున్నట్లు చెప్పాడు.మణికంఠ తప్పటడుగుమూడోసారి బోన్ మణికంఠ చేతికి చిక్కింది. దీంతో గౌతమ్ పేరు చెబుతాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ టేస్టీ తేజ-హరితేజ పేర్లు చెప్పాడు. గేమ్ మొదలవకముందే గౌతమ్‌తో డీల్ మాట్లాడుకున్నానని అన్నాడు. అలాంటి డీల్ నేను ఫాలో కావట్లేదని గౌతమ్ ప్లేట్ తిప్పేశాడు. దీంతో మణికంఠ తన నిర్ణయం మార్చుకున్నానని అన్నాడు. కానీ సంచాలక్ నిఖిల్ మాత్రం తొలిసారి చెప్పిన పేర్లనే ఫైనల్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా మణికంఠ తప్పు వల్ల గౌతమ్ బతికిపోయాడు. చివరకు ఒక్కొక్కరిని దాటుకుంటూ గౌతమ్ విజేతగా నిలిచాడు. మెగా చీఫ్ అయిపోయాడు.అమ్మాయిలకు విశ్రాంతిగౌతమ్ మెగా చీఫ్ కాగానే గంగవ్వ కాళ్లు మొక్కాడు. రోహిణి అయితే.. బొక్కలో లక్కు నీ వైపు ఉంది, అందుకే గెలిచావ్ అని ఫన్నీ సెటైర్ వేసింది. గత సీజన్లో చేసినట్లే ఈసారి కూడా హౌసులోని లేడీ కంటెస్టెంట్స్‌కి వారం పాటు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేస్తారని చెప్పాడు. అలానే తన సహాయకులుగా హరితేజ-గంగవ్వని పెట్టుకుంటున్నట్లు చెప్పాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ముగ్గుర్ని బ్యాగులు సర్దమన్న నాగ్.. వాళ్లు పతనం, వీళ్ల ఎదుగుదల
నాలుగువారాలు చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ ఈ వారం గేమ్‌లో కనిపించకుండా పోయాడు. అటు యష్మి హోటల్ టాస్క్‌ను తన భుజాలపై మోసింది. ఈ ఇద్దరిదే కాదు.. అందరి ఆట గురించి నాగ్ విశ్లేషించాడు. మరి ఆయన ఏమేం చెప్పాడో నేటి (అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..రైజింగ్ స్టార్స్బిగ్బాస్ హోటల్ టాస్క్‌లో అవినాష్, తేజ దొంగతనంగా గులాబ్ జామ్ తిన్నారు. అందుకని నాగార్జున ఓ గిన్నె నిండా గులాబ్ జామ్స్ పంపించి అవి ఆ ఇద్దరితో మాత్రమే తినిపించాడు. ఇక హౌస్మేట్స్ ఆటను బట్టి వారిని రైజింగ్ స్టార్స్, ఫాలింగ్ స్టార్స్‌గా నాగ్ విభజించాడు. గంగవ్వ, మెహబూబ్, అవినాష్, రోహిణి, నాగమణికంఠ, నయని, యష్మి.. రైజింగ్ స్టార్స్ అని పేర్కొన్నాడు.నాతో గేమ్స్ద్దునువ్వు బచ్చా అన్నందుకు మణికంఠ ఫీలయ్యాడని నాగ్ రోహిణితో అన్నాడు. అయితే మణి మాత్రం.. నేను మరీ అంత ఫీల్ అవలేదన్నాడు. దీంతో నాగ్.. ఇప్పుడు కవరింగ్ చేయకు, నా దగ్గర ఆటలాడొద్దంటూ అతడి నోరు మూయించాడు. నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే నిన్ను ఆడియన్స్ కూడా సీరియస్‌గా తీసుకోరని విష్ణుప్రియకు మరోసారి గుర్తు చేశాడు. మణికంఠలో ఎనర్జీ, ఫన్ మరో లెవల్లో ఉందంటూ ఓ వీడియో చూపించాడు.తేజకు పనిష్మెంట్నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, నిఖిల్, సీతలను ఫాలింగ్ స్టార్స్‌గా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ.. నబీల్‌కు ఏదైనా సమస్య ఉంటే నేరుగా అందుకు కారణమైన వ్యక్తితోనే మాట్లాడాలన్నాడు. గతం గురించి ఆలోచించుకుంటే వర్తమానం మిస్ అయిపోతావ్ అని గౌతమ్‌కు సలహా ఇచ్చాడు. తేజ.. నయనిపావనిపై నోరు పారేసుకున్న వీడియోను ప్లే చేసి మరీ క్లాస్ పీకాడు. 10 పుషప్స్ తీయమని పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రేరణ వంతు రాగా ఆమె సగం రైజింగ్, సగం ఫాలింగ్ అని తెలిపాడు.అవినాష్ దృష్టిలో అతడు స్ట్రాంగ్ కాదట!ఇంట్లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్ల బ్యాగుని ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టాలన్నాడు నాగ్. అయితే ఎవరి టీమ్‌లో నుంచి వాళ్లు కాకుండా.. అవతలి టీమ్‌లోని వారి పేర్లను మాత్రమే చెప్పాలన్నాడు. మొదటగా తేజ.. ఇంటి పనులు చేయట్లేదంటూ పృథ్వీ బ్యాగును పెట్టాడు. హరితేజ.. నబీల్‌కు క్లారిటీ తక్కువగా ఉందంది. అవినాష్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదంటూ నిఖిల్ బ్యాగు గేటు దగ్గర పెట్టాడు. గంగవ్వ.. మణి పేరును, రోహిణి.. ప్రేరణ, గౌతమ్.. సీత, మెహబూబ్.. పృథ్వీ పేర్లను సూచించారు. నయని.. విష్ణుప్రియలో ఇంప్రూవ్మెంట్ కనిపించలేదని పేర్కొంది.చివర్లో ముగ్గురి బ్యాగులుతర్వాత ఓజీ టీమ్సభ్యుల వంతు వచ్చింది. నాగమణికంఠ.. నా అంచనాలు అందుకోలేకపోయాడంటూ తేజ బ్యాగు ఎగ్జిట్ దగ్గర పెట్టాడు. సీత.. హోటల్ టాస్క్‌లో పెద్దగా పర్ఫామ్ చేయలేదంటూ గౌతమ్ పేరు చెప్పింది. పృథ్వీ, యష్మి.. బాగా ఆడలేదని తేజను, నిఖిల్, నబీల్.. గౌతమ్‌ను, విష్ణుప్రియ, ప్రేరణ.. నయని పేర్లను సూచించారు. చివర్లో ఎక్కువ ఓట్లు పడ్డ పృథ్వీ, తేజ, గౌతమ్ బ్యాగుల్ని సర్దేసి స్టోర్ రూమ్‌లో పెట్టాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తయింది. ఇక రేపటి ఎపిసోడ్లో సీత ఎలిమినేట్ కానుంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎప్పుడో, ఎవరో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు?: నాగార్జున
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (పాత కంటెస్టెంట్లు) ఎవరో చెప్పండని నాగార్జున హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. దీంతో తేజ.. పృథ్వీ పేరు, హరితేజ.. నబీల్, గంగవ్వ.. మణికంఠ, రోహిణి.. ప్రేరణ, నయని.. విష్ణుకు ఇంట్లో ఉండేందుకు అర్హత లేదన్నారు.రైజింగ్ స్టార్స్ ఎవరంటే?అలాగే రాయల్ టీమ్‌లో కూడా హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్ల పేర్లను సూచించమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నబీల్.. గౌతమ్ పేరు చెప్పాడు. ఇకపోతే మరో ప్రోమోలో నాగ్.. రైజింగ్ స్టార్, ఫాలింగ్ స్టార్ అంటూ ఓ బోర్డు ముందు పెట్టాడు. మెహబూబ్, హరితేజ, మణికంఠ, అవినాష్, గంగవ్వను రైజింగ్ స్టార్లుగా పేర్కొంటూ నబీల్, తేజ, విష్ణుప్రియ, గౌతమ్‌ను ఫాలింగ్ స్టార్స్‌గా అభివర్ణించాడు. ఇప్పుడెందుకు?ఈ సందర్భంగా ఎప్పుడో, ఎవడో ట్రోల్ చేసినదాని గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావ్.. అశ్వత్థామ 2.0 అనేది నువ్వు పెట్టుకున్నావా? లేదా మేము పెట్టామా? అని గౌతమ్‌ను సూటిగా ప్రశ్నించాడు. అటు తేజ.. నయనిపావనితో ర్యాష్‌గా మాట్లాడిన వీడియో చూపించి మరీ తేజకు క్లాస్ పీకాడు. రోహిణి తనను బచ్చా అనడంతో మణికంఠ ఫీలైన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించాడు. అమాయకంగా ఫేస్ పెట్టిన మణిరోహిణి.. మణికంఠ నీకు బచ్చాలా కనిపిస్తున్నాడా? అని సెటైరికల్‌గా అడిగాడు. తన శక్తిసామర్థ్యాలను నువ్వు అవమానించావని అనుకున్నాడు అని పేర్కొన్నాడు. అందుకు మణి నోరు తెరుస్తూ.. అమ్మో, అంత పెద్ద మాట అన్లేదు సర్ అని అమాయకంగా అన్నాడు.నాతో గేమ్స్ వద్దుదీంతో నాగ్.. ఫీలయ్యావన్నదే చెప్పాను.. ఇప్పుడు కవరింగ్ వద్దు, నాతో గేమ్స్ ఆడొద్దు అని సీరియస్ అయ్యాడు. ఇక విష్ణును నువ్వు గేమ్ సీరియస్‌గా తీసుకోకపోతే ఆడియన్స్ కూడా నిన్ను సీరియస్‌గా తీసుకోరని తెలిపాడు. నబీల్.. మనుషుల ఎదుట కాకుండా వారి వెనకాల మాట్లాడటం ఏమాత్రం బాగోలేదన్నాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు.. చేసింది ఇరవై సినిమాలు : నటి
గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో..’. గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో మనోజ్ డీజే, డా. మణికంఠ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘ఓ కామన్‌మేన్ రాక్‌స్టార్ ఎలా అయ్యాడు? అన్నదే ఈ సినిమా కథ. ‘ఆకాశవీధుల్లో...’ పక్కా యూత్‌ఫుల్ చిత్రం. ఈ సినిమా ఓ స్లో పాయిజన్. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం’’ అన్నారు. ‘‘గౌతమ్ ఎమ్‌బీబీఎస్ చదువుతున్నప్పుడే ఈ సినిమా చేస్తానని అన్నాడు. మెడిసిన్ పూర్తి చేయమన్నాను. పీజీ కూడా పూర్తయ్యేది. కానీ సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చాడు. గౌతమ్‌కృష్ణ చాలా తెలివైనవాడు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత మనోజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లవుతోంది. దాదాపు ఇరవై సినిమాలు చేశాను. కానీ ఓ మంచి సినిమా చేశాననే తృప్తి ఈ సినిమాతో కలిగింది’’ అన్నారు పూజిత. -
ఆకాశ వీధుల్లో నుంచి 'శిలగా మిగిలా' సాంగ్ వచ్చేసింది
గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా, సింగర్ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. -
Aakasha Veedhullo:‘ ట్రైలర్ చాలా ఇంటెన్సింగ్‌గా అనిపించింది’
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. కొత్త దర్శకుడైనా గౌతమ్ కృష్ణ ఈ మూవీని అద్భుతంగా తీశాడని కొనియాడాడు. దర్శకత్వమే కాదు, హీరోగా కూడా చాలా ఇంటెన్స్‌తో నటించారని మెచ్చుకున్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించిందన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత మనోజ్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి .. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి. తప్పకుండా మా సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. హీరో , దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా హీరో, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ఎదో డబ్బులున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరు అంటారు. కానీ అది కాదు .. ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం .. ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. తప్పకుండా మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు. -
గౌతమ్ పుట్టినప్పుడు ఆందోళన చెందాం: నమ్రత
హైదరాబాద: ‘గౌతమ్ నెలలు నిండక ముందే తక్కువ బరువు (1.46 కేజీలు)తో పుట్టాడు. అందరిలాగే నేను కూడా బాబు శారీరక, మానసిక ఎదుగుదలపై ఆందోళన చెందాను’ అని సూపర్‌స్టార్ మహేష్‌బాబు సతీమణి, నటి నమ్రత శిరోద్కర్ చెప్పారు. వరల్డ్ ప్రిమెచ్యూర్ డేను పురస్కరించుకుని గురువారం హోటల్ తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను కాపాడటంలో వైద్యులు చేస్తున్న కృషి మరిచిపోలేనిదని చెప్పారు. రెయిన్బో ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ డెరైక్టర్ డాక్టర్ దినేష్ చీరాల మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 మిలియన్ల మంది నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మిస్తుండగా, ఇందులో ఒక్క భారతదేశంలోనే 36 లక్షల ప్రిమెచ్యూర్ జననాలు చోటు చేసుకుంటుడంటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుమారు 200 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.